బిగ్‌బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?)
అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్‌బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్‌లో నామినేషన్స్‌లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్‌లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?)
Comments
Please login to add a commentAdd a comment