మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ 7 హంగామా షురూ కానుంది. లాంచింగ్ ఎపిసోడ్ అంటే ఎట్లుండాలె.. డ్యాన్సులు, అరుపులు, కేకలు, సెలబ్రిటీల రాకతో స్టేజీ దద్దరిల్లిపోవాలె.. అందుకే ఈసారి ఖుషి టీమ్‌ను రంగంలోకి దింపారు. కాదు, కాదు.. ఖుషి హీరోను మాత్రమే స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆరాధ్య సాంగ్‌కు స్టెప్పులేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇది చూసిన నాగ్ మామ.. ఏది? మీ హీరోయిన్ సమంత ఎక్కడ? అని ప్రశ్నించాడు. ఊహించని ప్రశ్నతో అవాక్కయిన విజయ్.. ఏం సమాధానం చెప్పాలో తెలియక చిరునవ్వుతో ప్రశ్నను దాటవేశాడు. ఇది చూసిన జనాలు.. చాలా రోజుల తర్వాత నాగ్ నోటి వెంట సమంత పేరు వచ్చింది అని కామెంట్లు చేస్తున్నారు. సామ్ కూడా వచ్చి ఉంటే ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే మొదటి నుంచీ చెప్తున్నట్లు ఈ సీజన్ ఉల్టాపల్టాగానే ఉండబోతోంది. సాధారణంగా షో చివర్లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లకు ప్రైజ్‌మనీ ఆఫర్ చేస్తాడు. ఓ సూట్ కేస్ ఇచ్చి.. ఇందులోని డబ్బులు తీసుకుని వెళ్లిపోవచ్చని అడుగుతారు. కానీ ఈసారి మాత్రం ఇంట్లో అడుగుపెట్టిన మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకు సూట్‌కేస్ ఆఫర్ చేశారు. ఏకంగా రూ.35 లక్షలు ఉన్న సూట్‌కేసును ఇచ్చి ఎవరైనా దాన్ని తీసుకుని తక్షణమే హౌస్‌లో నుంచి వెళ్లిపోవచ్చన్నారు. కానీ ఎవరూ ఆ ఆఫర్‌కు మొగ్గుచూపనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సీజన్‌లో సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు బోలెడన్ని ఉండబోతున్నాయన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment