తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు బిగ్ బాస్ రియాలిటీ షో రెడీ అయిపోయింది. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబరు 3 నుంచి 'బిగ్‌బాస్ 7' మొదలు కానుంది. అయితే ఈసారి కొత్తగా ఉండబోతుందని కొన్ని రోజుల ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. 'ఉల్టా పల్టా' అనే పదం ఉపయోగించాడు. ఇప్పుడు దాని మీనింగ్, షో కాన్సెప్ట్ ఏంటనేది లీక్ అయింది.
తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ 2107లో ప్రసారమైంది. ఆ సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్స్, మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎంటర్‌టైన్ చేశారు. సీజన్లు మారేకొద్ది.. కంటెస్టెంట్స్ సంఖ్యతో పాటు షోలోనూ పలు మార్పులు వచ్చాయి. అయితే అవన్నీ ఎందుకో షోపై జనాల్లో ఆసక్తిని తగ్గించేశాయి. దీంతో ఈసారి సరికొత్తగా సీజన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా)
తాజాగా తమిళ 'బిగ్‌బాస్ 7' ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా.. కమల్‌హాసన్ రెండు గెటప్స్‌లో కనిపించారు. ఈ సీజన్ గురించి హోస్ట్ కమల్ చెబుతుంటే.. మరో కమల్ మాత్రం 'ఎప్పుడూ అదే ఇల్లు, అంతేమంది కంటెస్టెంట్స్, అదే కన్ఫెషన్ రూమ్, అదే ట్విస్ట్. అందులో కొత్తేముంది?' అని వెటకారంగా కౌంటర్ వేశాడు. దీనికి హోస్ట్ కమల్.. 'ఈసారి ఒక్క హౌస్ కాదు.. ఒకే షో, రెండు హౌసులు' అని ఆన్సర్ ఇచ్చాడు.
దీనిబట్టి చూస్తుంటే.. షో ఒక్కటే అయినా, వేర్వేరుగా రెండు హౌసులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీటిలో కంటెస్టెంట్స్ విడివిడిగా ఉంచుతూ, అవసరమైనప్పుడు ఆ హౌస్ నుంచి ఈ హౌస్‌లోకి, ఈ హౌస్ నుంచి ఆ హౌస్‌లోకి తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ప్రతివారం ఎలిమినేషన్ ఉండనే ఉంటుంది. రెండు హౌసులు ఉన్నాయి కదా అని కంటెస్టెంట్స్ సంఖ‍్య పెంచట్లేదు. 20 మంది మాత్రమే ఉంటారు. బహుశా నాగ్ చెప్పిన 'ఉల్టా పల్టా' కాన్సెప్ట్‌కి అసలు అర్థం ఇదేనేమో?
(ఇదీ చదవండి: ఎవరైనా ప్రపోజ్ చేశారా? శ్రీలీల క్రేజీ ఆన్సర్)
Comments
Please login to add a commentAdd a comment