annapurna
-
Madipadiga Annapurna: టెంఫుల్ హార్ట్
‘లివింగ్ టెంపుల్(Living Temple)’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. గుడి అనగానే గుర్తొచ్చేది దేవుడు, మొక్కులు, టెంకాయలు! కానీ గుడి అంటే సకల కళా నిలయం! జీవనశైలిని ఈస్తటిక్ లెన్స్‌లో చూపించే కాన్వాస్! నాడు వాస్తు, శిల్పం, చిత్రం, సంగీతం, నృత్యం అన్నిటికీ గుడే వేదిక.. వాటిని నేర్పే బడి కూడా! దాని ఆవరణలోని కొలను ఆధారంగా సాగూ సాగేది! అంటే సంస్కృతిని సంరక్షించే ఆలయంగానే కాదు సంపద పెంచే వనరుగానూ భాసిల్లింది!మారిన కాలంలో గుడికి ప్రాముఖ్యం తగ్గకపోయినా దాన్ని చూసే మన ఈస్తటిక్ లెన్సే మసకబారాయి! అయినా టెంపుల్ ఆర్ట్ (Temple Art) స్ఫూర్తితో ఆ ఘనమైన సాంస్కృతిక చరిత్రను పరిరక్షిస్తున్న కళాకారులు ఉన్నారు! దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అలాంటి 31 మంది కళాకారులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వాళ్ల కళారూపాలతో ‘లివింగ్ టెంపుల్’ పేరుతో మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు క్యురేటర్ మడిపడిగ అన్నపూర్ణ! ఎప్పుడు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి రెండు వరకు! ఎక్కడ... టీ వర్క్స్, హైదరాబాద్!అసలీ అన్నపూర్ణ ఎవరు?హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన అన్నపూర్ణ విజువల్ ఆర్ట్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమెకు స్ఫూర్తి.. తొలి గురువు తండ్రి రోహిణీ కుమార్. ఆయన వృత్తిరీత్యా పెయింటరే అయినప్పటికీ సొంతంగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించి దాన్నే వృత్తిగా చేసుకున్నారు. దాంతో ఉగ్గుపాల నాడే అన్నపూర్ణకు టెంపుల్ ఆర్ట్‌ను పరిచయం చేశారు. కూతురు పెరుగుతున్న కొద్దీ ఆ కళ విశిష్టతను వివరిస్తూ వచ్చారు. కళలను, మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వేదికగా గుడిని చూపించారు. ప్రతి ఆరునెలలకు ఒక పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి టెంపుల్ ఆర్ట్, జీవనశైలి మీదప్రాక్టికల్ జ్ఞానాన్నందించేవారు.ఒక్కమాటలో కూతురికి ఈస్తటిక్ లెన్స్‌లో ప్రపంచాన్ని పరిచయం చేశారని చెప్పాచ్చు. ఆ ఆసక్తితోనే అన్నపూర్ణ ఆర్ట్స్‌లో చేరారు. అయితే అకడమిక్స్‌లో నాన్న చెప్పినంత ఘనమైన స్థానం కనిపించలేదు మన ఆర్ట్, కల్చర్‌కి. పాశ్చాత్య కళానైపుణ్యంతోనే నిండిపోయి ఉంది సిలబస్ అంతా! మన కళల పట్ల నిర్లక్ష్యమో.. పెద్దగా పరిగణించకపోవడమో.. లేదంటే బ్రిటిష్ వాళ్లు నిర్ధారించిన అకడమిక్స్ అయ్యుండటమో.. కారణమేదైనా మన కళాసంస్కృతి గొప్పదనమైతే తెలియకుండా పోయింది. కాలగమనంలో చాలా గుళ్ల స్వరూప స్వభావాలూ మారిపోయాయి. వాస్తు శిల్ప చిత్రలేఖన సంపద మిగిలి ఉన్న గుళ్లల్లో సంగీతం, నాట్య కళల ఊసు లేదు. భవిష్యత్ తరాలకు అందాల్సిన ఆ సాంస్కృతిక వారసత్వ సంపద చెల్లాచెదురైంది. దాన్ని కాపాడాలి.. పరిరక్షించాలనే తపన పట్టుకుంది అన్నపూర్ణకు. చదువైపోయాక క్యురేటర్‌గా చేరినా.. ఆర్ట్ షోలు నిర్వహిస్తున్నా.. చిత్తమంతా టెంపుల్ ఆర్ట్ మీదే! ఆర్ట్ షోలు చేస్తున్న క్రమంలోనే దేశంలోని పలుప్రాంతాల్లో.. వాళ్ల వాళ్ల శైలిలో టెంపుల్ ఆర్ట్‌ను సాధన చేస్తున్న కళాకారులున్నారని తెలిసింది అన్నపూర్ణకు. అప్పుడు వచ్చింది ఆమెకు ‘లివింగ్ టెంపుల్’ ఆలోచన!రెండేళ్ల శ్రమఆ ఆలోచన వచ్చిన నాటి నుంచి టెంపుల్ ఆర్ట్ మీద పరిశోధన మొదలుపెట్టారు అన్నపూర్ణ. భారతదేశమంతా పర్యటించారు. శిథిలావస్థలోని గుళ్ల వాస్తుశిల్పాన్ని పునర్నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్, విరిగిపోయిన విగ్రహాలను టెక్నాలజీ సహాయంతో తిరిగి చెక్కుతున్న.. రూపాలు చెదిరిన శిల్పాలను సాంకేతిక సహాయంతో తీర్చిదిద్దుతున్న శిల్పకారులు, చెదిరిపోయిన పెయింటింగ్స్ కు రంగులద్దుతూ పునరుద్ధరిస్తున్న చిత్రకారులు, గుళ్లల్లో పుట్టిన గాన.. నాట్య కళలను ఇంకా పోషిస్తున్న కళాకారుల కళారూపాలను చూశారు. వాళ్లలో విదేశీ కళాకారులూ ఉన్నారు. అందరూ సుప్రసిద్ధులే! అలాంటి 31 మంది కళాకారులను సంప్రదించారామె.వాళ్లకు తన ‘లివింగ్ టెంపుల్’ కాన్సెప్ట్‌ను వివరించారు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ ఉత్సవానికి హైదరాబాద్‌నే వేదికగా చేయాలనుకున్నారు. టీ వర్క్స్ప్రాంగణాన్నివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు అన్నపూర్ణ ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ఏదో అనుకున్నామా.. చేశామా అన్నట్టు కాకుండా ఈ వేడుక ఒక స్ఫూర్తిని, ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు అన్నపూర్ణ. కళాకారులు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కలిసి టెంపుల్ ఆర్ట్ పరిరక్షణకు అడుగులు వేయాలి, ఆ సాంస్కృతిక వారసత్వ సంపదను మన భావితరాలకు అందించాలి.. ఫైన్ ఆర్ట్స్ సిలబస్‌లో మన కళలకూ సముచిత స్థానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. ఆశయం! అందుకే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నారు.చదవండి: రెక్కల గుర్రంపై.. విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలుఈ యజ్ఞం గురించి తెలుసుకున్న తమిళనాడు (Tamil Nadu).. వచ్చే ఏడాది తను ఆతిథ్యమివ్వడానికి ఉత్సాహపడింది. ‘లివింగ్ టెంపుల్’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. ఇంకో విషయం.. టెంపుల్ అనగానే ఇదొక మతానికి సంబంధించిన సెలబ్రేషన్‌గా అనుకోవద్దు. ఇది మన దేశ సంస్కృతికి సంబంధించినది. మన ఆలయాలు పరిరక్షించిన పర్యావరణానికి సంబంధించినది. దాన్ని మళ్లీ పునరుద్ధరించడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశం’ అంటారు అన్నపూర్ణ. ఆమె పనిని ఫుల్ హార్ట్‌తో స్వాగతిద్దామా!– సరస్వతి రమ -
సింగర్ అవ్వాలి అనుకున్నా? యాక్టర్ అయ్యాను!
అన్నపూర్ణా సోనీ.. సింగర్ కావాలనుకుని యాక్టర్ అయింది. చక్కటి స్వరం ఒక్కటే ఆమె ప్రత్యేకత అనుకుంది. కానీ, కాలం ఆమెకు నటనపై ఆసక్తిని కలిగించి, వరుస అవకాశాలతో మంచి నటిని చేసింది. ఆ విషయాలే క్లుప్తంగా...మొదటిసారి నా గురించి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు.. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలై, ఆ పేపర్ని ఇరుగు పొరుగు వారందరికీ గొప్పగా చూపించారు. నేనిప్పటికీ అదే ఉత్సాహంతో ఉంటాను. సింగర్ కంటే కూడా మంచి నటి అనే గుర్తింపునే ఇష్టపడతాను. అందుకే క్లిష్టమైన పాత్రల్లో నటించి, గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా! – అన్నపూర్ణా సోనీ.⇒ అన్నపూర్ణా సోనీ మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ తీసుకుంది. సంగీతంతోపాటు నాట్యం, నటన, మైమ్.. ఇలా ఎన్నో కళల్లో ప్రతిభ చూపేది.⇒‘వివేచన రంగమండల్’ అనే నాటక సంస్థలో చేరిన తర్వాత అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్డీ) గురించి గొప్పగా విని, ఎలాగైనా అందులో చేరాలని నిశ్చయించుకుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. కానీ, రెండో ప్రయత్నంలో సీటు సాధించింది. లఘు చిత్రాలు, స్టేజ్ షోలు చేస్తూ నటనకు మెరుగులుదిద్దుకుంది.⇒ఆమె తొలి లఘు చిత్రం ‘చీపటాకడుంప’ దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ లఘు చిత్రాన్ని ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్‌నూ గెలుచుకుంది.⇒షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె నటనను చూసిన బాలీవుడ్.. ‘గుడ్‌బై’, ‘ఢిల్లీ క్రైమ్ 2 ’, ‘ ఛపాక్’ వంటి సినిమాల్లో అవకాశాలను ఇచ్చింది. అవన్నీ విజయం సాధించాయి.⇒ఆ విజయాలతో అన్నపూర్ణా వెబ్ దునియా దృష్టిలోనూ పడింది. ‘సన్‌ప్లవర్ ’, ‘రంగ్‌బాజ్ ’, ‘ద రైల్వే మెన్’ అనే సిరీస్‌లతో ఆమె టాలెంట్‌కి వెబ్ స్క్రీన్ కూడా స్పేస్నిచ్చింది. ఆ సిరీస్‌లు జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!
సీనియర్ నటి అన్నపూర్ణ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులకు బామ్మ పాత్రలతో బాగానే పరిచయం. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. ఇప్పటి యంగ్ హీరోలతో సినిమాలు, తెలుగు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా అలా ఓ షోలో పాల్గొన్న ఈమె.. తన కూతురు చనిపోవడాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడీయో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!) అసలేం జరిగింది? నటి అన్నపూర్ణకి పిల్లలు లేరు. దీంతో ఆమె చిన్నప్పుడే కీర్తి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. పెంచి పెద్ద చేసింది. తెలిసిన వాళ్లకే ఇచ్చి పెళ్లి చేసింది. కీర్తికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఐదేళ్లయినా సరే ఆ పాపకు మాటలు రాకపోవడంతో థెరపీ చేయించారు. కానీ లాభం లేకుండా పోయింది. అలా పాప విషయమై బెంగ పెట్టుకున్న అన్నపూర్ణ కూతురు మానసికంగా కుంగిపోయి, ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అన్నపూర్ణ ఏం చెప్పింది? తాజాగా సుమ అడ్డా షోలో పాల్గొన్న అన్నపూర్ణ.. కూతురిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. 'నేను బజ్జీలు పట్టుకొచ్చి పిలిచాను. రెండు తిని ఇక చాలా మమ్మీ అని చెప్పింది. మా అత్తగారు ఊరెళ్తున్నారని అంటే ఇక్కడ పడుకో అమ్మా అని అన్నాను. లేదు లేదు మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. తాను ఉరివేసుకుంటుందనే ఆలోచనే నాకు రాలేదు' అని అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ
నల్గొండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో వారం రోజులుగా రోడ్డు వెంట ఉండి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికులు ఆరా తీయగా ఆమెది మధ్యప్రదేశ్ అని, తన కుటుంబ సభ్యులు కొట్టడంతో పారిపోయి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై వీధి లైట్ల కింద నాలుగు రోజులుగా వర్షానికి తడుస్తూ ఉంటుండంతో స్థానికులు ఆమె ధీనస్థితిని వీడియో తీసి ‘ఈ అనాథకు దిక్కెవరు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పందించిన ఆర్ఎస్ఎస్ సేవా భారతి సభ్యుడు రాము ఆమెకు శనివారం అల్పాహారం అందించి నల్లగొండలోని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు. ఆయన అంబులెన్స్‌లో నేరేడుచర్లకు వచ్చి సేవా భారతి సభ్యులు, స్థానిక పోలీసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళళను సూర్యాపేట సమీపంలో గల దురాజ్‌పల్లిలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, చామకూరి వీరయ్య, సంపత్, రాములు, రాము, నాగిరెడ్డి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానికులు వెంకన్న, శంకర్‌రెడ్డి, కోటేశ్వర్రావు, వెంకటకృష్ణ తదితరులున్నారు. -
అన్నపూర్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో...
చిత్తూరు: చీటీల పేరిట రూ.50 లక్షల దాకా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన శుక్రవారం పలమనేరు పట్టణంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంటావూరు కాలనీలో నారాయణ భార్య అన్నపూర్ణ స్థానిక కాలనీ వాసులతో స్నేహంగా ఉండేది. చీటీలు నడపుతూ కాలనీ వాసుల్లో నమ్మకాన్ని పెంచుకొంది. దీంతో చాలామంది ఆమె వద్ద చీటీలను వేయడంతో పాటు వడ్డీలకు సైతం ఇచ్చేది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వారి ఇంటికి తాళం వేసి ఉండడంతో బాధితులు ఫోన్ చేయడం, తాము ఊరెళ్లామని వారంలో వస్తామంటూ అన్నపూర్ణ నమ్మించడం రివాజుగా మారింది. గత మూడు రోజులుగా అన్నపూర్ణ ఫోన్ స్విచ్ ఆఫ్‌చేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎస్ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా కొంగోళ్లపల్లి బాలాజీకి రూ.27లక్షలు, లక్ష్మికి రూ.5 లక్షలు, కుముదాకు రూ.రెండు లక్షలు, ఇలా పలువురుకి రూ.50 లక్షల దాకా ఇవ్వాలని బాధితులు పోలీసులకు తెలిపారు. దీనిపై ఎస్ఐ సుబ్బారెడ్డి విచారిస్తున్నారు. -
Mount Annapurna: అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడి ఆచూకీ లభ్యం
నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు ఆచూకీ లభ్యమైంది. కనిపించకుండా పోయిన మూడు రోజుల అనంతరం ప్రాణాలతో కనుగొన్నారు. అనురాగ్ మాలును సజీవంగా గుర్తించామని అతని సోదరుడు సుధీర్ తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాజస్థాన్‌లోని కిషన్గఢ్కు చెందిన చెందిన 34 ఏళ్ల అనురాగ్ మాల్ గత వారం కొంత మంది పర్వతారోహకులతో కలిసి నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం అధిరోహించడానికి వెళ్లాడు. అయితే ఎప్రిల్ 17న క్యాంప్ నుంచి దిగుతుండగా 6,00 మీటర్ల ఎత్తులో నుంచి కిందపడిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా అతన్ని సజీవంగా గుర్తించారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ వ్యాప్తంగా 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 14 శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా అనురాగ్ రెక్స్ కరమ్ వీర్ చక్ర అవార్డును పొందటమే కాకుండా భారత్ నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇక అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది.ఈ పర్వతం ప్రమాదాలకి ప్రసిద్ధి చెందింది. -
ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్ ఫుడ్స్ అనుబంధ సంస్థ. -
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
కూతురి ఆత్మహత్యకు ఇప్పటికీ కారణం తెలియదు: నటి అన్నపూర్ణ
తెలుగు తెరపై నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి ప్రత్యేకత సాధించుకున్నారు నటి అన్నపూర్ణ. 'స్వర్గం నరకం' అనే సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయిన ఆమె అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు వారందరికి సుపరిచితం అయ్యారు. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవలె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అపురూపంగా పెంచుకున్నానని, అయితే ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలిసి షాక్‌కి గురయ్యానని తెలిపారు. 'అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నా కూతురు కీర్తిని సినిమాల్లోకి పంపించొద్దని అనుకున్నా.డాక్టర్ లేదా ఇంజనీర్ వంటి పెద్ద చదువులు చదివిద్దామని కలలు కన్నా. కానీ ఆమెకు చదువు అంతగా అబ్బలేదు. పదవ తరగతి అనంతరం మాకు తెలిసిన వాళ్లలో ఓ సంబంధం ఉంటే మాట్లాడాను. ఇద్దరికి నచ్చింది అన్న తర్వాతే పెళ్లి చేశాను. ఒక ఏడాదికి ఆమెకు పాప పుట్టింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అసలు కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ తెలియదు. నా కూతురికి కోపం ఎక్కువ. అందులోనూ మా ఇంట్లో గారాభంగా పెరిగింది. ఇంట్లో పనులు చేయడం రాదు తనకు. మెట్టినింటి వాళ్లు ఏమైనా అన్నారా లేదా భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అన్నది నాకు తెలియదు. ఆ విషయాల గురించి మా అమ్మాయి ఏనాడు నాకు చెప్పలేదు. క్షణికావేశంలో మరి అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ లోకంలో లేదు' అంటూ గతాన్ని తలుచుకొని బాధపడింది. -
క్యాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వింతేమి కాదు. అప్పట్లో శ్రీరెడ్డి దీనిపై రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీటూ ఉద్యమం కూడా తీవ్ర దుమారం రేపింది. ఇక నటి మాధవిలత సైతం పలు ఇంటర్వ్యూలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్‌కు గురికావాల్సిందే అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ కూడా స్పందించారు. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్-3’ మూవీలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కేరీయర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనేది అనవసరపు వ్యవహరమన్నారు. ‘అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారు. అవకాశం ఇస్తే మాకేంటని మా వెంట పడేవారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలు పెట్టాను. హీరోయిన్గా ఛాన్సులు వచ్చినప్పటికి రెండు సినిమాలకే ఆపేశాను. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవు.. అప్పుడు కూడా ఉండేవి కానీ ముందుగానే అలాంటి పనులు చేయమని ఒప్పందం ఇస్తేనే డేట్స్ ఇచ్చేవాళ్లం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇద్దరికి ఇష్టమైతేనే ఆ తప్పులు జరుగుతాయని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి రంగంలో మహిళలు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు వేటికి లొంగకుండా తప్పించుకు వస్తున్నారు. అదే మాదిరిగా సినీ పరిశ్రమ వాళ్లు కూడా తప్పించుకోవాలి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి’ అని చెప్పారు. అయితే తప్పులు జరగవని తాను చెప్పడం లేదని, ఇక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతాయన్నారు. అది కూడా ఇద్దరికి సమ్మతమైతేనే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇక్కడ కష్టాలు తప్పవని అన్నపూర్ణ అన్నారు. చదవండి: ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ ‘ఆర్ఆర్ఆర్’ రచయిత కేవీ ప్రసాద్‌కు కరోనా -
పల్లెటూరి కథ
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, వేద, సీనియర్ నటి జమున మఖ్యపాత్రల్లో నటించారు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఉమ్మడి కుటుంబాలలోని అనుబంధాలు, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘ఓటీటీలో లేదా థియేటర్స్‌లో మా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. -
మనసున్న పరిపూర్ణ
ఆమె ఈవో అన్నపూర్ణ ఆకలి చూసి అన్నంపెట్టే చెయ్యి ఆధ్యాత్మికత దారులు వేసే చేత కష్టం ఎరిగి కాపాడే తత్వం స్పందించే మనసున్న పరిపూర్ణ ఉదయం నిద్రలేచే సరికే ఆ రోజు చేయాల్సిన పనులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుని ఉద్యోగానికి వెళ్తే అక్కడ మరికొన్ని బాధ్యతలు, సమస్యలు నవ్వుతూ ఎదురొస్తాయి. మనసును కంట్రోల్లో పెట్టుకుని అన్నింటినీ చిరునవ్వుతో పూర్తి చేయాలి. కొన్నాళ్లకు ఆ నవ్వు జీవం కోల్పోయి ప్లాస్టిక్ నవ్వులా మిగులుతుంది. నవ్వుకి తిరిగి జీవం రావాలంటే... మనలో ఒత్తిడిని తాను ఆఘ్రాణించి మనకు ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశం ఒకటి కావాలి. మనలో చాలామందికి అది ఆలయమో, ప్రార్థనా మందిరమో అయి ఉంటుంది. ‘ఆలయానికి వచ్చే వారికి సాంత్వన కలిగించేటట్లు ఉండాలి ఆలయ వాతావరణం. మా ఉద్యోగ బాధ్యతలు పైకి భగవంతుని సేవగా కనిపిస్తాయి. కానీ మా విధి నిర్వహణ భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సేవకే ఎక్కువగా అంకితమై ఉంటుంది’ అన్నారు హైదరాబాద్, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ. ప్రాచీన ఆలయమే పెద్ద బాలశిక్ష బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అధికారిగా నియమకానికంటే ముందు అన్నపూర్ణ 32 ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘అఆలు, గుణింతాలు, వాక్యాలు చదవడం నేర్చుకున్న తర్వాత పెద్ద బాలశిక్ష చదవాలి. అక్షరాభ్యాసం రోజే పెద్ద బాలశిక్ష చేతిలో పెడితే ఉద్యోగ బాధ్యత భూతంలా భయపెడుతుంది. అందుకే 2001లో ఈవోగా నాకు తొలి బాధ్యతగా హైదరాబాద్‌లోని వివేక్‌నగర్ హనుమాన్ ఆలయం కేటాయించినప్పుడు... మొదట ఏదైనా చిన్న ఆలయాన్నివ్వమని అడిగాను. సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బాధ్యతలిచ్చారు. అది నాలుగు వందల ఏళ్ల నాటి ప్రాచీన ఆలయం. స్థానికులకు అక్కడ ఒక ఆలయం ఉన్న పట్టింపు కూడా ఉండేది కాదు. పూజారులు పూజ చేసి ఉదయం పది లోపు వెళ్లిపోయేవాళ్లు. ఆడవాళ్లు గుడికి రావడానికి వెసులుబాటు దొరికే సమయానికి గుడి మూసేస్తే ఎలా వస్తారని టైమింగ్స్ పొడిగించాను. సహస్రనామాలు చదివే మహిళలతో గ్రూప్ తయారు చేశాను. ఐదుగురు మహిళలు స్వచ్ఛందంగా పని చేశారు. వారితో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కుంకుమార్చనకు రావలసిందిగా ఆహ్వానించాను. ఈవోగా రాకముందు నేను సెక్రటేరియట్లో ఉద్యోగం చేసిన అనుభవంతో చాలామంది ప్రముఖులతో పరిచయం ఉంది. నాయకులను, ఇతర ప్రముఖులను గుడికి ఆహ్వానించాను. దాంతో స్థానికులు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు’’ అని తొలి ఆలయ బాధ్యత నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు అన్నపూర్ణ. ధార్మిక వైద్యసేవ ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఉన్న ధర్మశాల నిర్వహణ బాధ్యత కూడా ధర్మాదాయ శాఖ నిర్వహణలోనే ఉండేది. పేషెంట్ హాస్పిటల్లో ఉంటే, వారికి సహాయంగా వచ్చిన వాళ్లకు ధర్మశాలలో బస సౌకర్యం ఉండేది. పది రూపాయల నామమాత్రపు ఫీజుతో గది ఇచ్చేవారు. పేదవాళ్లకు ఆసరాగా ఉండాల్సిన ఆ ధర్మశాల అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టే నాటికి పేదరికానికి చిరునామా గా ఉండేది. కరెంట్ బిల్లు బకాయిల కారణంగా పవర్ కట్ అయింది. ఆమె ప్రభుత్వానికి తెలియచేసి గదులకు రిపేర్లు, వాటర్ ఫిల్టర్, బోరు, రోడ్డు వేయించారు. పూలకుండీలు పెట్టించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచారు. ఇదే ఫార్ములాను ఆలయాల నిర్వహణలో కూడా పాటించడమే ఆమె విజయ రహస్యం. 650 ఆలయాలున్న తెలంగాణ రాష్ట్రంలో 150 మంది సభ్యులున్న ఆలయాల ఈవోల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దారి తీసిన నమ్మకం కూడా. ఈ ఏడాది జూన్‌లో గెజిటెడ్ అధికారిగా ప్రమోషన్ రావడంతో ఈవోల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారామె. ‘‘ప్రశాంతత కోసం ఆలయానికి వస్తారు. ఆలయంలో దర్శనం అయ్యే లోపు అసహనానికి లోనవుతుంటారు. ఆలయంలో పూల చెట్లు, మంచి శిల్పాలు, చిత్రాలతో ఆహ్లాదంగా ఉంటే భక్తులు ఆ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆలయంలో పార్కింగ్ సౌకర్యం లేకపోతే భక్తుల మనసు వాళ్ల వాహనం మీదనే ఉంటుంది. అందుకే బల్కంపేట ఆలయం బాధ్యతలు తీసుకున్న వెంటనే పార్కింగ్ లాట్ మీద దృష్టి పెట్టాను’’ అన్నారామె. నిత్యావసర సరుకుల పంపిణీ లష్కర్ బంగారు బోనం సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండగ తెలంగాణ జిల్లాలతోపాటు... తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మూడు నెలల ముందు నుంచి ఏర్పాట్లు మొదలవుతాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చేయించడం తన చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు అన్నపూర్ణ. ఆ ఏడాది లష్కర్ బోనాలకు 35 లక్షల మంది భక్తులు రావడం కూడా రికార్డు. కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు నాయకులు, మహిళలు వెయ్యి బోనాలతో మొదలుపెట్టి పదిహేను వందల బోనాలతో ఆలయానికి చేరిన విషయాన్ని చెబుతూ ‘‘బతకడానికి ఎన్నో ఉద్యోగాలున్నాయి. నాకు ఇలాంటి ఉద్యోగం రావడం మా అమ్మానాన్నలు చేసిన పుణ్యమే. బల్కంపేట అమ్మవారికి బంగారు చీర కట్టించి, బంగారు బోనం పెట్టాలనేది ఇప్పుడు నా ముందున్న కల’’అన్నారు అన్నపూర్ణ. కరోనా ఇక్కట్లు అన్నపూర్ణ తండ్రి జనార్ధనరావు నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటి గ్రామంలో పటేల్. రోజుకు కనీసంగా వందమందికి తక్కువ లేకుండా పంచాయితీకి వచ్చేవారు. పొరుగూళ్ల నుంచి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపించడం అన్నపూర్ణ తల్లి కౌసల్యాదేవి బాధ్యత. అన్నం పెట్టడంతోపాటు కూతురికి అన్నపూర్ణ అని పేరు పెట్టడం యాధృచ్చికం కావచ్చు. కానీ అన్నపూర్ణకు అన్నం పెట్టే అలవాటు మాత్రం వారసత్వంగా వచ్చింది. కరోనా వైరస్ ఇళ్లలో పని చేసుకునే వాళ్ల ఉపాధిని కాలరాసింది. పూజారులకు భగవంతుడికి పూజ చేసి హారతి కానుకలు లేకుండా ఒట్టిచేతులతో ఇళ్లకెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చింది. హాస్పిటల్లో పేషెంట్లకు తోడుండే సహాయకులు అన్నం తినడానికి చిన్న కాకా హోటల్ కూడా తెరుచుకోని దుస్థితి. ఇలాంటి వాళ్ల కోసం ఈ ఐదు నెలలుగా పని చేస్తున్నారు అన్నపూర్ణ. తన అన్నదమ్ములను, స్నేహితులను ప్రోత్సహించి సహాయం చేయిస్తున్నారు. ‘‘మనకు ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెడితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు’’ అని అమ్మ చెప్పిన మాటలు నాలో బాగా నాటుకున్నాయని చెప్పారు అన్నపూర్ణ. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తారామె. గత ఏడాది మలేసియాలో మహిళాదినోత్సవం పురస్కారం అందుకోవడం వెనుక ఆమె చేసిన ఇన్ని పనులున్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్. రాజేశ్ రెడ్డి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర ఆహారం పంచుతున్న అన్నపూర్ణ -
పనే అన్నపూర్ణ ఐడీ
‘ఐ యామ్ ఫ్రమ్ సీబీఐ’ అనగానే.. టెన్షన్, అటెన్షన్ వచ్చేస్తాయి. ఇన్‌కం టాక్స్కీ ఒక ఐడీ ఉంటుంది. మీడియాకూ ఐడీ ఉంటుంది. ఏ ఐడీ వాల్యూ ఆ ఐడీకి ఉంటుంది. అన్నపూర్ణ దగ్గరా ఒక ఐడీ ఉంది. చేతిలోని ఐడీ కాదు. చేతల్లోని ఐడీ! ఆ ఐడీకి ప్రభుత్వం సెల్యూట్ చేసింది. ‘బెస్ట్ ఆశా వర్కర్’ గా గుర్తించింది. మంచి చెబితే ఎవరికీ నచ్చదు అంటారు. మాస్క్ పెట్టుకోమంటే అసలే నచ్చడం లేదు జనాలకు. ఈమధ్య ఒక ప్రభుత్వోద్యోగి.. ‘నన్నే మాస్క్ పెట్టుకోమంటావా!’ అని ఉగ్రుడైపోయి, ఆఫీస్‌లో తన కింద పని చేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని జుట్టుపట్టుకుని లాగి, ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. ఇలాంటి ఘటనలే దేశంలో రెండుమూడు చోట్ల జరిగాయి. అన్నపూర్ణ ఆశా వర్కర్. మంచి చెప్పడం ఆమె పని. ఇప్పుడైతే ఇక మాస్క్ పెట్టుకోమని చెప్పడం కూడా. అక్కడితో అయిపోదు ఆమె డ్యూటీ. భౌతిక దూరం పాటించేలా చూడాలి. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యా కేంద్రానికి తెలియజేయాలి. కరోనా అని ఎవరైనా భయపడుతుంటే ధైర్యం చెప్పాలి. మాకెందుకొస్తుందిలే అని ఎవరైనా కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతుంటే భయం చెప్పాలి. ఇవన్నీ ఊరికే చెప్పేస్తే జరిగిపోయేవి కావు. కొందరు చెప్పనీయరు. కొందరు చెప్పినా వినరు. కొన్నిసార్లు మాటలు కూడా పడుతుంటుంది అన్నపూర్ణ. మురికివాడల్లోని మాటలు ఎలా ఉంటాయో అన్నపూర్ణొచ్చి చెప్పనవసరం లేదు. అన్నపూర్ణ గురించి మాత్రం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ చెప్పేసింది.. ‘షీ ఈజ్ ద బెస్ట్’ అని! అవును. ‘బెస్ట్ ఆశా వర్కర్’గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్నపూర్ణను గుర్తించింది. అందుకు తగిన కారణమే ఉంది. కోవిడ్ మల్టీ టాస్కింగ్ చేసింది అన్నపూర్ణ.. ప్రభుత్వం ఇచ్చిన ఆశా వర్కర్ అనే చిన్న ఐడీ కార్డును మెడలో వేసుకుని. వర్కర్ అనే కానీ, అంతకంటే ఎక్కువ పనే చేసింది. కర్ణాటకలోని తుంగానగర్‌లో ఆమె ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్. చిన్న గ్రామం అది. మూడు వేల మంది జనాభా ఉంటే, 2,500 మంది మురికివాడల్లోనే ఉంటారు. పైగా కోవిడ్ ‘కంటైన్మెంట్’ ఏరియా! తమ ప్రాంతాన్ని ప్రభుత్వం మూసివేసినప్పుడు వాళ్లంతా మొండిగా వ్యతిరేకించారు. అప్పుడు అన్నపూర్ణే వారికి.. ‘మూసివేయకపోతే మన ప్రాణాలు పోతాయి’అని అర్థమయ్యేలా చెప్పగలిగింది. ఆశావర్కర్‌గా అన్నపూర్ణ ఐడీ అన్నపూర్ణతో పాటు మరో ఏడుగురు ఆశా వర్కర్లు ఉన్నప్పటికీ వారికి అప్పగించిన బాధ్యతల్లో వాళ్లు ఉండేవారు. అన్నపూర్ణ మాత్రం తుంగానగర్ మొత్తాన్నీ తన కుటుంబ బాధ్యతగా తీసుకుంది. అక్కడ ఉండేవాళ్లంతా రోజుకూలీలే. కంటైన్మెంట్గా ప్రకటించాక వారి ఉపాధి కూడా పోయింది. అప్పుడు కూడా అన్నపూర్ణ దగ్గరుండి మరీ ఇంటింటికీ ప్రభుత్వం పంపించిన నిత్యావసర సరకులను పంపిణీ చేయించింది. ఆమె ఆ ప్రాంతంలో 2015 నుంచీ ఆశావర్కర్‌గా పని చేస్తోంది. మొత్తం పది కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి తుంగానగర్‌లో ఇప్పుడు. బయటి వాళ్లు ఎవరైనా వస్తే వెంటనే తన దృష్టికి వచ్చే ఏర్పాటు చేసుకుంది అన్నపూర్ణ. గ్రామస్థులే ఫోన్ చేస్తారు. వెంటనే ఆ బయటి వాళ్లను క్వారెంటైన్‌కు పంపిస్తుంది. ఇవికాక ఆమె చేసే రోజువారి పనులు ఉంటాయి. గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతుంది. వారి ఆరోగ్యస్థితి గురించి అధికారులకు సమాచారం ఇస్తుంది. ఇంటెన్సివ్ కేర్ నుంచి డిశ్చార్జి అయిన శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది. పౌష్టికాహారం అందని పిల్లల గురించి ఆరోగ్య కేంద్రానికి తెలియజేస్తుంది. ఇళ్ల బయటి వరకే తన పరిమితి అనుకోలేదు అన్నపూర్ణ. తలుపుల చాటున జరిగే గృహహింసను వెళ్లి ఆపేసేది. ఏడుస్తున్న గృహిణి కన్నీళ్లు తుడిచి కారణం తెలుసుకునేది. సాధారణంగా భర్తే కారణం అయి ఉంటాడు. అతడి గురించి అధికారులకు చెబితే వాళ్లు పిలిపించి హెచ్చరించేవారు. గృహహింస ఒకటేనా.. కరోనా వల్ల మహిళలు, ఆడపిల్లలు తక్కువ బాధలేం పడటం లేదు. రోజంతా చాకిరి, అనారోగ్యంలోనూ విశ్రాంతి తీసుకోలేని స్థితి. వాకిట్లో నిలబడి ఇంట్లోని మగవాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లేది. ఆమె మాట్లాడుతుంటే ప్రభుత్వమే మాట్లాడుతున్నట్లు ఉండేది. చేతికి గ్లవుజులు, చేతుల్లో ఫైల్స్, ముఖానికి మాస్క్, మెడలో ఐడీ.. సీరియస్‌గా ఉండేది. ఓరోజు.. చిన్న పిల్లకు పెళ్లి చేస్తున్నారని అన్నపూర్ణకు కబురొచ్చింది. వేరొకరైతే పోలీసులకు చెప్పేవారు. అన్నపూర్ణ రెండు కుటుంబాలను కూర్చోబెట్టింది. ఆ పెళ్లిని ఆపించింది. ఇవన్నీ కూడా అన్నపూర్ణ చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినవి కాదు. తుంగానగర్ గ్రామస్థులు, డిస్ట్రిక్ట్ ఆశా మెంటర్ ఆరతి చెబితే తెలిసినవి. ‘‘బెస్ట్ వర్కర్ అని ప్రభుత్వ గుర్తింపు వచ్చింది కదా.. ఎలా అనిపిస్తోంది’’ అనే ప్రశ్నకు అన్నపూర్ణ చెప్పే సమాధానంలోనూ ఆమె బాధ్యత కనిపిస్తుంది! ‘‘ప్రతి ఆశా వర్కరూ బెస్ట్ వర్కరే’’ అంటుంది అన్నపూర్ణ. -
ఆకలి తీర్చిన అన్నపూర్ణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కిందట జీహెచ్ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా అయిదున్నర కోట్ల మంది ఆకలి తీర్చినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఈ కేంద్రాల ద్వారా 65 లక్షల మందికి పైగా నాణ్యమైన ఉచిత భోజన సదుపాయం అందినట్లు వెల్లడించారు. పేదల ఆకలి తీర్చే ఇంత పెద్ద భారీ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ లేదంటూ, ఈ కార్యక్రమానికి భాగస్వామిగా ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. (మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత ) ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అన్నపూర్ణ భోజన సదుపాయం కల్పిస్తుండటాన్ని, హైటెక్ కిచెన్‌లో అత్యంత పరిశుభ్రంగా భోజనం తయారీ, మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఆహారం సరఫరా, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరమైన వాటితో రూపొదించిన వీడియోక్లిప్ను, నగరంలో గతంలో తాను అన్నపూర్ణ కేంద్రాలను సందర్శించినప్పటి కొన్ని ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. (సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను : కేటీఆర్) -
‘అన్నపూర్ణ’.. అక్షయ పాత్ర!
సాక్షి, సిటీబ్యూరో: ఆకలిగొన్న అభాగ్యుల పాలిట నగరంలోని అన్నపూర్ణ క్యాంటీన్లు అక్షయ పాత్రగా నిలుస్తున్నాయి. అసహాయుల క్షుద్బాధను తీరుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌తో వర్తక వ్యాపార, పారిశ్రామిక, విద్యాసంస్థలు మూతపడటంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న సీఎం కేసీఆర్‌సూచన మేరకు, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగుల ఆకలి తీర్చేందుకుజీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా రెగ్యులర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు తాత్కాలిక, మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచింది. వీటి ద్వారా సోమవారం ఒక్కరోజే 1,56,350 మందికి ఆహారాన్ని అందించినట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 41లక్షల 48వేల మందికి అన్నపూర్ణ భోజనం అందించినట్లు పేర్కొంది. అన్నపూర్ణ క్యాంటీన్లు, దాతలు అందించే భోజనం, నిత్యావసరాల పంపిణీ తదితరాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ వింగ్‌కు 692 మంది దాతలు అందజేసిన 6,44,300 ఆహారం ప్యాకెట్లను మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేశారు. దాతల నుంచి ఆహారం, ఇతర నిత్యావసరాలు సేకరించి పంపిణీ చేసేందుకు పది మొబైల్ వాహనాలను వినియోగిస్తున్నారు. దాతల నుంచి భారీ స్పందన రావడంతో అధికారుల సూచన మేరకు 30 మంది వ్యాపారులు తమ టాటా ఏస్ వాహనాలను ఈ సేవల కోసం జీహెచ్ఎంసీకి ఉచితంగా కేటాయించారు. దీంతో దాతలు ఇస్తున్న భో జనం, నిత్యావసరాలను సేకరించి, సులభంగా పంపిణీ చేసే వెసులుబాటు కలిగినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఎందరో దాతలు.. జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ విభాగానికి దాతల ద్వారా ఇప్పటి వరకు 520 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,864 రేషన్ కిట్స్, 60వేల బిస్కెట్స్ అండ్ కేక్స్, 4,500 లీటర్ల నూనె ప్యాకెట్లు, 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్, 3,100 గ్లౌజ్‌లు, 32,000 మాస్కులు, 4,500 కేజీల గోధుమ పిండి, 5,600 ఓట్స్ ప్యాకెట్లు, 1,364 పీపీఈ కిట్లు, 5,550 శానిటైజర్ బాటిళ్లు, 7,500 లీటర్ల శానిటైజర్ క్యాన్లు, 30 మెట్రిక్ టన్నుల పుచ్చకాయలు అందగా, వాటిని పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్‌ను వలస కూలీలు, యాచకుల సంరక్షణకు ఏర్పాటు చేసిన షెల్టర్‌హోంలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు. -
అన్నం కావాలా..‘అన్నపూర్ణ’ను అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రోజూ 2 లక్షల మందికి ఉదయం, సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 21111111 కు సంప్రదించాలని కోరారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో కలసి శుక్రవారం ఆయన టోలిచౌకిలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. వండిన ఆహారాన్ని అవసరమైన చోటకు తరలించేందుకు ప్రతీ సర్కిల్లో ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధంగా ఉంచామని సీఎస్ తెలిపారు. భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు
‘‘టీవీ కెమెరా, సినిమా కెమెరా, వెబ్‌సిరీస్ కెమెరా... నటించేవారికి ఏదైనా ఒకటే. యాక్టింగ్ యాక్టింగే’’ అన్నారు బాలాదిత్య. అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రధారులుగా నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన కీలక పాత్రధారులు. ఎంఎన్ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘పదిహేడేళ్ల వయసులో హీరోగా ‘చంటిగాడు’ సినిమాలో నటించాను. కానీ సరైన విద్యార్హత ఉండాలనే మా అమ్మ మాట కోసం నా యాక్టింగ్ కెరీర్‌కు దాదాపు ఐదేళ్లు బ్రేక్ ఇచ్చాను. కంపెనీ సెక్రటరీ కోర్సులో అర్హత సాధించి, ముంబైలో ట్రైనింగ్ తీసుకున్నాను. 2013–2014 సమయంలో సినిమా చాన్సుల కోసం ట్రై చేశాను. నా దగ్గరకు వచ్చిన కొన్ని కథలు నాకు నచ్చలేదు. ఓ ప్రముఖ టీవీ చానెల్‌కి చెందిన ఓ ప్రోగ్రామ్ ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. ఇటీవల ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో ఓ రోల్ చేశాను. ఇప్పుడు ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’లో మంచి పాత్ర చేశాను. అన్నపూర్ణమ్మగారి మనవడు అనే పాత్రను తీసుకుని ఆ కథలో, ప్రణయ్–అమృతల కథను సినిమాటిక్‌గా కలిపారు. నేను ప్రణయ్ పాత్ర చేశాను. సినిమా, టీవీ అనే తేడా ఇప్పుడు లేదు. చిరంజీవి, నాగార్జున, సాయికుమార్గార్లు వంటివారు టీవీ ప్రొగ్రామ్స్ చేస్తున్నారు. ‘రాసాత్తి’ అనే ఓ తమిళ సీరియల్లో నటిస్తున్నా. ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే ఓ వెబ్‌సిరీస్ చేశా’’ అన్నారు. -
సీల్డ్ కవర్లో ఆమె పేరు!
సాక్షి, సూర్యాపేట: నాలుగు మున్సిపాలటీలు గులాబీ ఖాతాలో చేరాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే సూర్యాపేటలో జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠంలో ఎస్సీ మహిళను కూర్చోబెట్టి టీఆర్ఎస్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎక్కడా ప్రకటించకుండా గోప్యత పాటించి సీల్డ్ కవర్లలో ఆపార్టీ నాలుగు మున్సిపాలిటీల ప్రిసైడింగ్ అధికారులకు అందజేసింది. మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరండంతో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నాయి. ఊహలకు అందకుండా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఏలిక ఎవరోనని ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. జనరల్ మహిళకు రిజర్వు కావడం.. పలువురి పేర్లు చర్చకు రావడంతో పాటు వారు చైర్మన్ పీఠం దక్కించుకుంటారని జోరుగా చర్చలు సాగాయి. అయితే అందరి ఊహలకు అందకుండా చైర్మన్ ఎన్నిక కావడం గమనార్హం. 9వ వార్డు నుంచి విజయం సాధించిన పెరుమాళ్ల అన్నపూర్ణ పేరు సీల్డ్ కవర్లో పీఓకు అందింది. అమెను ప్రతిపాదించడం, బలపరచడం, సభ్యుల ఓట్ల మద్దతుతో.. చైర్మన్‌గా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ వార్డు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జనరల్ మహిళా స్థానంలో చైర్మన్‌గా అవకాశం కల్పించడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయానికి ఇది దిక్సూచి అవుతుందని మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళ్లు చమర్చారు. అన్నపూర్ణ 9 వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుందమల్ల శేఖర్‌పై 374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వైస్ చైర్మన్‌గా 22వ వార్డు నుంచి గెలిచిన పుట్టా కిశోర్ విజయం సాధించారు. 24 మంది వార్డు సభ్యులు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఇండిపెండెంట్ వార్డు సభ్యుల మద్దతుతో అన్నపూర్ణ చైర్మన్‌గా, కిశోర్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో చేతులెత్తిన మంత్రి జగదీశ్‌రెడ్డి, కౌన్సిల్ సభ్యులు గులాబీ రెపరెపలు.. ఆపార్టీ గుర్తుపై గెలిచిన వార్డు సభ్యుల మద్దతుతో తొలిసారి కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎక్స్ అఫీషియో ఓటు, 25 మంది వార్డు సభ్యుల బలంతో టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై కూర్చుంది. మున్సిపాలిటీలో 2 వ వార్డు నుంచి గెలుపొందిన వనపర్తి శిరీష చైర్మన్‌గా, 23వ వార్డు నుంచి విజయం సాధించిన వెంపటి పద్మ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి శిరీష 833 ఓట్లు, పద్మ 237 ఓట్ల మెజార్టీ సాధించారు. హుజూర్నగర్ మన్సిపాలిటీలో 20 వార్డులు టీఆర్ఎస్ గెలవడంతో ఆపార్టీకి చెందిన గెల్లి అర్చనకు చైర్మన్, జక్కుల నాగేశ్వరరావుకు వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. ఇక్కడ పార్టీ శ్రేణులు ఊహించిన వారే పుర పీఠంపై కొలువుదీరారు. అర్చన 27వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 761 ఓట్ల మెజార్టీ, నాగేశ్వరరావు 17 వ వార్డు నుంచి 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 11 ఓట్ల బలంతో టీఆర్ఎస్ నుంచి చైర్‌పర్సన్‌గా పోతరాజు రజిని, వైస్ చైర్మన్‌గా సంకేపల్లి రఘునందరెడ్డి ఎన్నికయ్యారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంలో ఎమ్మెల్యేలు.. తిరుగు లేని విజయంతో నాలుగు మున్సిపాలిటీల ఏలికలు టీఆర్ఎస్ పరం కావడంతో ఆపార్టీ ఎమ్మెల్యేల్లో ఆనందం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక అంతా ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. మెజార్టీ వార్డుల్లో గులాబీ జెండా ఎగరడంతో.. ఇక మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెట్టనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉండనుండడంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోలోని పనులకు నిధుల వేట జరగనుంది. ఈ ఫలితాలతో మళ్లీ సాధారణ ఎన్నికల నాటికి మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. -
పల్లెటూరి అనుబంధాలు
సీనియర్ నటి అన్నపూర్ణ, జమున, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎమ్ఎన్ఆర్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం పాటలను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత కేఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్టు కావాలనుకున్న శివనాగు దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే పల్లెటూరి వాతావరణ ం కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘‘మంచి టైటిల్‌తో ఇలాంటి కుటుంబ చిత్రాన్ని తీయడం అభినందనీయం’’ అన్నారు దర్శకులు సాగర్. ‘‘కథకు ప్రాధాన్యం ఇచ్చి తీసిన చిత్రం ఇది’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఈ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘పల్లెటూరి ప్రేమలను, వాతావరణాన్ని ప్రతిబింబించాల్సిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది’’ అన్నారు శివనాగు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం’’ అన్నారు ఎమ్ఎన్ఆర్ చౌదరి. నటుడు బెనర్జీ, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, సింగర్స్ పసల, బేబి, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఎమ్ఎన్నార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివనాగు మాట్లాడుతూ– ‘‘అనుబంధాలు, ఆత్మీయతలు, పల్లెటూరి ప్రేమలు ఆవిష్కరించే చిత్రమిది. ముద్దపప్పు, ఆవకాయ భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో మా సినిమా కూడా అంతలా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. అమరావతి సమీపంలోని వైకుంఠపురం అనే పల్లెటూరిలో మా సినిమా చిత్రీకరణ జరిపాం. అక్కి నేని అన్నపూర్ణమ్మగా అన్నపూర్ణ, అక్కినేని అనసూయమ్మ పాత్రలో జమునగార్లు నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం డీటీయస్ పనులు జరుగుతు న్నాయి. నవంబర్‌లో సినిమాను రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు ఎమ్ఎన్నార్ చౌదరి. -
తడబడిన తుది అడుగులు
‘చరణ కింకినులు ఘల్లు ఘల్లుమన.. కరకంకణములు గలగల లాడగ.. హూహూహూ.. అడుగులందు కలహంసలాడగా.. నడుములో తరంగంబులూగగ.. వినీల ఘటపర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా.. నీ కులుకులుగని నా పలుకు విరియ.. నీ నటననుగని నవ కవిత వెలయగ.. నీ తనువులోని అణువణువులోన.. అనంత విధముల అభినయించి.. అలసి.. సొలసి.. ఆపన్న హస్తంకై ఎదురు చూస్తున్నావా నాట్య మయూరీ..’ అని ఓ సినిమాలోని పాటను కాస్త ఇలా మార్చి కళాకారిణి లంక అన్నపూర్ణ ప్రస్తుత దయనీయ స్థితిపై ఆర్ద్రతతో పాడుకోవచ్చు. సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే పెద్ద తపనతో నాట్యం నేర్చుకుంది. దేశ వ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రముఖుల అభినందనలు అందుకుంటున్న తరుణంలో ఓ ప్రమాదంలో కాలును కోల్పోయింది. అదే దశలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి వదిలేసి వెళ్లిపోయినా కుంగిపోలేదు. జైపూర్ కొయ్య కాలు పెట్టుకుని దేశ వ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలను ఇచ్చి ఔరా అన్పించింది. 70 ఏళ్ల వయస్సు దాటిన ఆమెకు పక్షవాతం రావడంతో ఇప్పుడు ఆసుపత్రిపాలైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతోంది. ఇదేదో ‘మయూరి’ సినిమా సుధ కథ కాదు. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణ నిజ జీవిత గాధ. నాట్య మయూరిగా నర్తించిన నాటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యే వరకు సమస్యలను సవాలుగా తీసుకుని ఆమె జీవన ప్రస్థానం కొనసాగించింది. నిలదొక్కుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం, పట్టుదల ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అయితే ఆర్థికంగా ఆర్జించకపోవడంతో నేడు కష్టకాలంలో ఆదుకునే వారి కోసం ఎదురు చూడాల్సి రావడం విచారకరం. దేశ నలుమూలలా ప్రదర్శనలు కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) వరకు చదివింది. ఐదవ తరగతి నుంచే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత కూచిపూడి కులపతిగా పని చేసిన చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. చిన్నతనం నుంచే దేశ వ్యాప్తంగా భరత నాట్యం, కూచిపూడి నృత్యం చేస్తూ పలువురితో ప్రశంసలు అందుకుంది. 1962లో భారత్ – చైనా యుద్ధం సమయంలో ఏలూరుకు చెందిన నాట్యాచార్యుడు కోరాడ నర్శింహారావు తదితర కళాకారులతో కలిసి వెళ్లి దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న సైనికుల్లో ఉత్తేజం నింపుతూ కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆ ప్రదర్శనల అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఆమెతో పాటు కళాకారుల బృందాన్ని ఆనాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణలు అభినందించడం విశేషం. మలుపు తిప్పిన రైలు ప్రమాదం.. అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో 1973లో జరిగిన రైలు ప్రమాదం అన్నపూర్ణ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేసింది. ఢిల్లీ నుంచి వస్తున్న తన స్నేహితురాలికి ఆహ్వానం పలికేందుకు గుడివాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో ప్లాట్ఫారం పై నుంచి జారి రైలు పట్టాలపై పడింది. అదే సమయంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ఒక కాలు మోకాలి వరకు, మరో కాలు మడమ వరకు తెగిపోయింది. ఊహించని ఆ ప్రమాదం ఆమె ఆశలు, ఆశయాలపై నెత్తురు చిమ్మింది. ఆసుపత్రిపాలైన ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆపరేషన్ చేసినా ఫలితం లేక కాలును కోల్పోయింది. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని వెంట ఉన్న వ్యక్తి కాలు లేని ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. నాట్యంపై ఉన్న మక్కువతో పట్టుదలగా జైపూర్ కొయ్యకాలు పెట్టుకుని మళ్లీ దేశమంతా తిరిగి 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి చేత శభాష్ అన్పించుకుంది. ఆమె గొప్పతనానికి, ధైర్యానికి మెచ్చిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1982లో విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ప్రత్యేకంగా డ్యాన్స్ టీచర్ పోస్టు ఏర్పాటు చేసి అన్నపూర్ణకు ఉపాధి కోసం ఉద్యోగం ఇచ్చింది. దయనీయం శేష జీవితం డ్యాన్స్ టీచర్‌గా 2006లో పదవీ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిరపడింది. ఒంటరిగా శేష జీవితం గడుపుతున్న ఆమె ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటి తలుపులు తీయడం లేదని గుర్తించిన స్థానికులు ఏలూరులో ఉంటున్న ఆమె సోదరికి సమాచారం అందించారు. దీంతో ఏలూరులో లాయర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్ (సోదరి అల్లుడు) విజయవాడ వచ్చి సత్యనారాయణపురంలో ఇంటి తలుపులు తెరిచేసరికి అన్నపూర్ణ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను విజయవాడ సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్చడంతో పక్షవాతం వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సోదరి తరఫు బంధువుల తోడ్పాటుతో ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అయిన వారి ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రమే ఉండటంతో పేరుగాంచిన నాట్య మయూరికి ఖరీదైన వైద్యం అందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కళాపోషకులు, సహృదయులు ఎవరైనా స్పందించి ఆదుకోకపోతారా.. అని వారు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ దాడి
హైదరాబాద్: నగంరలో కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సిద్ధిపేట్ జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఎస్కే ఖాదర్ ఈ కల్తీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 45 కేజీల బరువు గల మూడు బ్యాగ్‌ల కల్తీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్లవి-12, గోఖుల్, కృష్ణ-10 పేరు గల 25 ప్యాకెట్ల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. వీటి మొత్తం విలువ భారీగా ఉండవచ్చునని చెప్పారు. ఈ కల్తీ విత్తనాలు కర్నూలు నుంచి గుంటూరు మీదుగా నగరానికి వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్ డీలర్ల వద్దనే కొనాలని సూచించారు. -
కార్లు నీడలో.. ‘అన్నపూర్ణ’ఎండలో!
సోమాజిగూడ :పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం నిమ్స్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో విమర్శలకు గురవుతోంది. వివరాలు.. రెండేళ్ల క్రితం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ పథకం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 720 మంది పేదలు భోజనం చేస్తుంటారు. మూడు నెలల క్రితం క్యాంటిన్‌ను పార్కింగ్ ఉన్న మరో ప్రాంతానికి తరలించారు. గతంలో చెట్ల నీడలో పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటిన్ ప్రస్తుతం మండుటెండల్లోకి మారడంతో అక్కడే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిమ్స్‌లోని అధికారులు తమ వాహనాలను చెట్ల నీడలో పెట్టేందుకు.. ఇక్కడి ప్రైవేట్ క్యాంటిన్‌నిర్వాహకులతో మిలాఖత్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. -
ఆచార్యా మజాకా!
దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, అన్నపూర్ణ, జయలక్ష్మి...ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసికట్టుగా వచ్చినట్లున్నది అక్కడి పరిస్థితి.‘‘తక్షణం ఇల్లు ఖాళీ చేయాల్సిందే’’ అని ఒంటికాలి మీద లేచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నాడు ఇంటోనరు (ఇల్లు+ ఓనరు).‘‘ఒక్క పదిరోజులు ఆగండి’’ అన్నది ఆ ఇల్లాలు భయం భయంగా.‘‘వీల్లేదు. ఈ క్షణం ఖాళీ చేయాల్సిందే. నన్ను వెధవ అనుకుంటున్నాడా....దద్దమ్మ అనుకుంటున్నాడా...చవట అనుకుంటున్నాడా....వాజమ్మ అనుకుంటున్నాడా...అసలు ఏమనుకోవడం లేదా’’ అంటూ కేకలేస్తున్నాడు ఓనరు.అనుకున్నాడో లేదో తెలియదుగానీ ‘‘నమస్కారం గురూ’’ అని ఒక న‘మస్కా’ర బాణం విసిరాడు అద్దెదారు ఆచార్య. ఆచార్యను చూడగానే మరింత ఎత్తు ఎగిరాడు ఇంటోనరు.‘‘ఏం పెద్దమనిషివయ్యా బుద్ధిలేదా’’ అని తిట్టాడు. ఉందా లేదా అని చెప్పలేదుగానీ ‘‘చదువుకున్నావు బుద్ధి లేదు. పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావా! వెళ్లి కాఫీ పట్రా’’ అని అరిచి ‘‘లోనికి రండి సార్’’ అని ఇంటి యజమానిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఆచార్య.ఇక్కడ మనం ఆచార్య గురించి చెప్పుకోవాలి. కాస్త అటు ఇటుగా ‘కన్యాశుల్కం’లో గిరీశంలాంటి వాడు. మండు వేసవిలో కూడా చలికోట్లను బ్లాక్‌లో అమ్మగల నేర్పరి.‘‘ఏంటి సార్, ఆపరేషన్ చేయించుకున్నాక ఇలా అయ్యారు. ఏనుగులా ఉండేవారు పీనుగులా అయ్యారు’’ సానుభూతిగా అన్నాడు ఆచార్య.‘‘నీ మాటల్లో పడడానికి నేనేమైనా పిచ్చొడ్ని అనుకుంటున్నావా! అద్దెయ్యా....మూడు నెలల అద్దెయ్యా...మార్యాదగా ఇస్తావా లేకపోతే ఖాళీ చేస్తావా!’’ కరాఖండిగా, కఠినంగా అరిచాడు ఇంటి యజమాని.‘‘ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు. పాపం మీకు అసలే బ్లడ్‌ప్రెషర్. పొరపాటును మీకు గుండె నొప్పి వచ్చిందనుకో...ఫినిష్’’ అంటూ ఇటీవల ఎవరెవరు హార్ట్ ఎటాక్‌లతో చనిపోయింది పేర్లు, వృత్తితో సహా లిస్ట్ చదివాడు.ఈ దెబ్బకు ఇంటి ఓనరు భయంతో బిక్కచచ్చాడు.‘‘అన్నట్లు మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారు కదా... మీకు అభ్యంతరం లేకపోతే మీ చెయ్యిని ఒకసారి ఇవ్వండి’’ అడిగాడు ఆచార్య.‘‘దానికేం...తప్పకుండా చూడు’’ అని చెయ్యి ఇచ్చాడు ఇంటి యాజమాని. ‘‘మీరు కొత్త ఇంట్లోకి వెళ్లి ఎన్నాళ్లయింది?’’‘‘మహా అయితే ఆర్నెల్లు అవుతుంది’’‘‘మరో ఆరు నెలల్లో నువ్వు పోతావు గురూ...’’ఇంటి యజమాని గుండెల్లోకి పిడుగు నేరుగా దూరింది. 60 లీటర్ల కన్నీరయ్యాడు.‘‘బావి ఎక్కడ తవ్వారు?’’‘‘మూలలో...’’‘‘ఏ మూలా? దక్షిణంలోనా....దానికి శాంతి చేయాలోయ్. ఓ పనిచెయ్. ఇప్పుడు నువ్వు వెళ్లిపో. నీ వెనకాలే నేను వస్తాను. నీ ఇంట్లో అన్నీ చూస్తాను. శాస్త్రోక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేస్తాను’’‘‘త్వరగా వచ్చేస్తావుగా’’ భయంభయంగా అన్నాడు ఇంటి యజమాని.‘‘నీ పని తప్ప నాకు వేరే ఏ పని ఉందోయ్... ఇదిగో ఒక పదిరూపాయలు ఉంటే ఇవ్వు’’ అడిగాడు ఆచార్య.వేరే సందర్భంలో అయితే ఎలా స్పదించేవాడో తెలియదుగానీ... ఇప్పుడు మాత్రం ఇరౖవై రూపాయలు తీసి...‘‘ఇరవై రూపాయల నోటే ఉంది’’ అన్నాడు ఇంటి యజమాని.‘‘ఉంటే ఏమవుతుంది! పూజకు మొత్తం 180 అవుతుంది. 20 రూపాయలు పోగా....160 మిగులుతుంది. ఆ డబ్బులు నువ్వు నాకు బాకీ అన్నమాట. ఫరవాలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంటికి వచ్చి తీసుకుంటాలే’’ అన్నాడు ఆచార్య.కళ్ల ముందు భయం తప్ప యజమానికి ఏదీ కనిపించడం లేదు. ‘‘ఏమిటో’’ అనుకుంటూ వచ్చిన దారిన వేగంగా వెనక్కి వెళ్లాడు యజమాని.పాలవాడిని చూడగానే ఆచార్య బుర్ర బంపర్ ఐడియాతో మురిసిపోయింది.‘‘ఏమోయ్ నారాయణ ఇట్రా’’ అని పిలిచాడు.‘‘ఏమిటి బాబూ’’ అడిగాడు నారాయణ.‘‘ఏమిటయ్యా ఇది. నీ దగ్గర నేను బాకీ ఉన్నాను. నువ్వు అడగవు. నా దగ్గర తీసుకోవు’’ అన్నాడు ఆచార్య.‘‘మీలాంటి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది బాబూ’’ మర్యాదగా అన్నాడు నారాయణ.‘‘పోయేది పెద్దల దగ్గరేనోయ్. ఇదిగో ఈ ఇరవై రూపాయలు తీసుకో’’ అని డబ్బు చేతిలో పెట్టాడు ఆచార్య.ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడనే అమాయకత్వంతో ‘‘16 రూపాయలే బాబూ’’ అన్నాడు నారాయణ. ‘‘అయితే ఏమిటి! మిగిలిన నాలుగు రూపాయలతో...గేదెలున్నాయి కదా....వాటికి బ్రహ్మాండమై గడ్డి వేయించు’’ అన్నాడు ఉదారంగా నారాయణ.నారాయణ కళ్లు ఆనందంగా మెరిసాయి.‘‘ఒకమాట...నీ గేదెలను ఎవరో బందెలదొడ్లో పెట్టారని విన్నాను’’ అడిగాడు ఆచార్య.‘‘అవును బాబూ...రెండు వందలు కడితేగానీ వాటిని విడిపించుకోవడానికి లేదు’’ దీనంగా అన్నాడు నారాయణ.‘‘రెండొందలా!’’‘‘అవును బాబూ’’‘‘రెండొందలా!!!’’‘‘అవును బాబు’’‘‘ఒక యాభై రూపాయలు ఇవ్వు. వాటిని విడిపించేస్తాను’’ నమ్మకంగా అన్నాడు ఆచార్య.‘‘అంతకంటేనా బాబూ!’’ అని అడిగిన యాభై ఆచార్య చేతిలో పెట్టాడు నారాయణ. ‘‘సాయంత్రం అయిదు గంటలలోపు నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయి. ఇదిగో జున్నుపాలు దొరుకుతాయా...ఆ...ఎందుకు దొరకవు...మా ఆవిడకు చాలా ఇష్టం. సాయంకాలం పట్రా’’ అని ఆర్డర్ వేసి...భార్యను కేకేసి...‘‘ఏమోయి మేరీ...నీ పుట్టిన రోజు ప్రెజెంటేషన్. ఈ యాభై రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన చీర తీసుకో. ఇదిగో చూడు...సాయంత్రం నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను రాలేను. మన హౌస్ఓనరు ఇంట్లో శాంతి చేయాలి....ఆ నారాయణ గేదెలు విడిపించాలి. ఈరోజు ఫుల్‌బిజీ’’ అంటూ హడావిడి పడతున్నాడు ఆచార్య. (జవాబు 38వ పేజీలో) -
వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. ఆమెను బదిలీ చేయాల ని ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. దీంతో వెంటనే ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల ని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులి చ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో అర్ధరాత్రి సమయంలో బలవం తంగా అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ జాతీయ నాయకులు కపిల్ సిబాల్ తదితరులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చట్టవిరుద్ధం అంటూ రేవంత్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా ఈ విషయంపై వివరణివ్వాలని డీజీపీ ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్టు వ్యవహారంలో అ న్నపూర్ణ అత్యుత్సాహం ప్రదర్శించారని, అవసరం లేకున్నా ఆయనను అరెస్టు చేసినందుకు ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను ఆమెకు అప్పగించరాదని కమిషన్ ఆదేశించింది. కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతి... వికారాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ వేటుపడిన ఎస్పీ అన్నపూర్ణ స్థానంలో ఆయనను నియమించా రు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. -
వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ ఎస్పీగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అన్నపూర్ణను తీసుకోకూడదని ఈసీ ఆదేశించింది. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో మంగళవారం వేకువజామన పోలీసులు చొరబడి అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రేవంత్ అరెస్ట్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, కొడంగల్/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్‌పై పోలీసు అధికారులు స్పందించారు. దీనిపై వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. కోస్గిలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రేవంత్ అదుపులోకి తీసుకుని మహబూబ్‌నగర్‌కు తరలించామని వెల్లడించారు. కేసీఆర్ సభ ముగిసిన వెంటనే రేవంత్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే రేవంత్‌పై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. డీటీసీ పరిసరాల్లో భారీ బందోబస్తు.. ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన రేవంత్‌ను పోలీసులు జడ్చర్ల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి(డీటీసీ) తరలించారు. అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా బలగాలు మోహరించారు. డీటీసీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు బాధ్యతలను శంషాబాద్ డీసీసీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు జడ్చర్లలో ఆందోళన చేపట్టారు. చదవండి: రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ ‘ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు’ -
ఫొటో తర్వాతే భోజనం!!
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులను ఖైదీల్లా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం ప్లేట్లో పెట్టుకున్న వెంటనే తినడానికి వీల్లేదు. సిబ్బంది అందరినీ నిలబెట్టి ఫొటో తీస్తారు. ఫొటోలో విద్యార్థులందరూ వచ్చారని, ఆహార పదార్థాలాన్నీ స్పష్టంగా కనపడుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తినాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజన సమయంలో విధిగా ఫొటోలు తీస్తారు. ఎప్పుడు ఏమి పెట్టారు, ఎంతమందికి పెట్టారనేది ఫొటోలో స్పష్టంగా కనిపించాలి. భోజన సమయంలో ఫొటో తీస్తే కూరలు, అన్నం స్పష్టంగా కన్పించాలన్నమాట. ఈ విధంగా విద్యార్థుల్ని లెక్కించి బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకవేళ లెక్క సరిగా లేకపోతే కుకింగ్ ఏజెన్సీ బిల్లుల్లో ఆ మేరకు కోత విధిస్తున్నారు. ఆ భారం కాస్తా ప్రిన్సిపాళ్లపై పడుతుండటంతో వారు లబోదిబోమంటున్నారు. విద్యార్థుల విషయంలో ఈ పద్ధతి సరికాదనే విమర్శలు తీవ్రంగా విన్పిస్తున్నాయి. ప్రిన్సిపాల్స్పైనే భారం ఫొటోల్లో విద్యార్థులను లెక్కించి ఆ మేరకే కుకింగ్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ప్రిన్స్‌పాల్ చెప్పిన లెక్క ప్రకారమే కుకింగ్ ఏజెన్సీ వారు భోజనాలు తయారు చేస్తారు. బిల్లులు చెల్లించే సమయంలో ప్రిన్స్‌పాల్ చెప్పిన హాజరు ప్రకారం ఫొటోల్లో విద్యార్థులు కన్పించకుంటే ఆ మేరకు కోత విధిస్తున్నారు. అయితే మీరు చెప్పిన సంఖ్య ప్రకారమే మేము భోజనం తయారు చేస్తున్నామంటూ కుకింగ్ ఏజెన్సీ వారు ప్రిన్స్పాళ్లను నిలదీస్తున్నారు. మీరు చెప్పిన పిల్లల హాజరు ప్రకారమే భోజనాలు, ప్రత్యేక వంటకాలు తయారు చేయించామని, అలాంటప్పుడు మాకు ఇచ్చే బిల్లుల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నిస్తుండటంతో ప్రిన్స్‌పాళ్లకు దిక్కు తోచడం లేదు. ఈ నేపథ్యంలో తాము వేల రూపాయల్లో కుకింగ్ ఏజెన్సీకి తమ సొంత డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. కోతేసి మిగుల్చుకుంటున్నారు.. రాష్ట్రంలో మొత్తం 188 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి నెలకు ప్రభుత్వం మెస్ చార్జీల కింద సుమారు రూ.12.50 కోట్లకు పైగా వెచ్చిస్తుండగా ప్రతినెలా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఈ విధంగా కోత విధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2018 ఆగస్టులో రూ.12,61,19,074 ఖర్చుపెట్టాల్సి ఉండగా.. విద్యార్థులు లేరని, ప్రత్యేక వంటకాలు సరిగా పెట్ట లేదని, ఫొటోల్లోని విద్యార్థులతో వాస్తవ సంఖ్య సరిపోలడం లేదనే నెపంతో ఏజెన్సీ బిల్లుల్లో రూ.42,29,166 కోత విధించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆగస్టు నెలలో మిగులుగా అధికారులు చూపించారు. ఫొటోలో కన్పించకపోతే కోతే..! సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అన్నపూర్ణ అనే యాప్‌ను తయారు చేయించింది. ఈ యాప్‌లో విద్యార్థుల ఏరోజు భోజనం ఖర్చుల వివరాలు ఆరోజు కాలేజీ ప్రిన్స్‌పాళ్ల ద్వారా అప్లోడ్ చేయాలి. ప్రతి విద్యార్థి, ఉద్యోగి బయోమెట్రిక్ ఉపయోగించాలి. దీనివల్ల ఎవరు హాజరయ్యారు, కాలేదనే వివరాలు నమోదవుతాయి. ఆ సంఖ్యను బట్టే భోజనం తయారు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. భోజనం వడ్డించేటప్పుడు ఫొటోలు తీస్తున్నారు. స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులు ఉంటే అందరూ పూర్తిగా ఫొటోలో కనిపించాలని ప్రిన్స్‌పాళ్లకు గురుకుల కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అలాగే కోడిగుడ్డు, అరటి పళ్ళు, ప్రత్యేక వంటకాలు పెట్టినప్పుడు ఫొటోల్లో స్పష్టంగా కనిపించాలని కూడా గురుకుల సొసైటీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఆయా స్కూళ్ళ ప్రిన్స్పాళ్లు చెబుతున్నారు. అయితే ఒక్కోసారి ఫొటోలో అందరూ కనిపించకపోవచ్చునని, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతోందని వారు వాపోతున్నారు. -
ప్లేటు..సీటు!
సాక్షి, సిటీబ్యూరో : ప్రతినిత్యం దాదాపు 35 వేల మంది క్షుద్బాధ తీరుస్తున్న రూ.5 భోజన(అన్నపూర్ణ) కేంద్రాలకు అదనపు హంగులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం ఏకరూప నమూనాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లోకి వచ్చేవారు పైకప్పు కూడా లేకుండానే నిల్చుని భోజనం చేయాల్సిన పరిస్థితి. ఈ కేంద్రాలకు వచ్చేవారి గౌరవానికి భంగం కలగకుండా.. తగిన సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దాలని భావించిన మేయర్ బొంతు రామ్మోహన్ ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రస్తుతంఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు ఒక్కో దానికి రూ.3.6 లక్షలు ఖర్చు కాగా, అదనపుసదుపాయాలకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతమున్న 150 అన్నపూర్ణ కేంద్రాల్లో తగిన స్థల సదుపాయం ఉన్న కేంద్రాల్లో కొత్త సదుపాయాలు అందుబాటులోకి తేనున్నారు. దాదాపు వంద చ.మీ.ల స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వర్షానికి తడవకుండా ఉండేందుకు పైన కప్పులాంటి ఏర్పాటుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫ్‌సర్వీస్ విధానంలో ఉన్న సందర్శిని టిఫిన్ కేంద్రాల తరహాలో స్టాండ్‌తో కూడిన స్టీల్ రౌండ్ టేబుళ్లు, మరికొందరు కూర్చునేందుకు కుర్చీ, బల్లలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. మొత్తం ఎన్ని కేంద్రాల్లో ఈ ఏర్పాట్లకు అవకాశముందో పరిశీలించి, తగిన ప్రతిపాదనలు రూపొందించి త్వరలోనే ఈ సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ ఏర్పాట్లతో ఏకకాలంలో దాదాపు ఇరవైమందికి ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. గడచిన నాలుగేళ్లుగా ఎంతో ఆదరణ పొందిన ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. హైదరాబాద్ స్ఫూర్తితో కొన్ని నగరాల్లో వివిధ పేర్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇతర నగరాలకు ఆదర్శప్రాయంగా మారిన దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సదుపాయాలపై దృష్టి సారించారు. కోటిమందికి పైగా.. నగరంలో నాలుగేళ్లక్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు కోటిమందికి పైగా ఆకలిబాధను తీర్చింది. 2014 మార్చి 2వ తేదీన నాంపల్లి సరాయి వద్ద లాంఛనంగా ప్రారంభమైన ఇది తొలుత ఎనిమిది కేంద్రాలతో ప్రారంభమై దశలవారీగా 150 కేంద్రాలకు చేరింది. హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఈ భోజన పథకంలో భాగంగా నాణ్యత, వేడితో కూడిన భోజనాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందిస్తున్నారు. ఈ పథకంలో అందిస్తున్న భోజనానికి రూ.24.25 ఖర్చవుతుండగా, రూ.5లను మాత్రమే లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నారు. మిగతా రూ.19.25 లను జీహెచ్ఎంసీ సబ్సిడీగా అందజేస్తోంది. రుచి, శుచి, నాణ్యతలో లోపాల్లేకపోవడంతో ప్రజలెందరో ఈ భోజనం కోసం క్యూలో నిల్చుంటున్నారు. ముఖ్యంగా ఆటో కార్మి కులు, వివిధ పనులు చేసే దినవారీ కూలీలు, ఆయా అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు, ఆస్పత్రుల్లోని వారికి సహాయకులుగా వచ్చేవారు, పోటీ పరీక్షల కోసం నగరానికి శిక్షణకు వచ్చిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. నగరంలో సాధారణ హోటల్లో భోజనానికి దాదాపు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోండగా, రూ.5లకే అందుతున్న ఈ భోజనానికి విశేషంగా స్పందన లభిస్తోంది. ఇదీ మెనూ.. 400 గ్రాముల రైస్, 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, సాంబార్, స్పూన్‌పచ్చడి. ఎందరికో ప్రయోజనం.. సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలతో పాటు భారీ సంఖ్యలో కోచింగ్ కేంద్రాలున్న అమీర్‌పేట లాంటి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్లను నిరుద్యోగ యువతీ యువకులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. వీరితో పాటు వివిధ హాస్టళ్లలో ఉంటున్న నిరుద్యోగులకు సైతం ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
విద్యతోనే ఖైదీల్లో సత్ప్రవర్తన
పరిగి: ఖైదీలు ప్రతిఒక్కరూ చదువుకోవాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె పరిగి సబ్‌జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఆమె మాట్లాడారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఖైదీలకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఖైదీలు ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుకుంటేనే సమాజంలో ఏది మంచో.. ఏది చెడో తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. చదువు మనకు విజ్ఞానాన్ని అందజేస్తుందన్నారు. చదువుతోనే మనం నాగరికులుగా మారగలమని వివరించారు. ఈ భూ ప్రపంచంలో మిగతా ప్రాణుల మనిషిని ఉన్నతస్థాయిలో నిలిపింది చదువేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనిషి విద్యావంతుడైనప్పుడు ఆత్మగౌరవం పెరుగుతుందని ఆమె వివరించారు. జైలులో ఉన్న ప్రతిఖైదీ చదువుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. ఇక్కడ నేర్చుకున్న చదువును తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశ్ఫక్, ఎస్ఐ కృష్ణ, జైలు సూపరింటెండెంట్ తిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఇంగ్లిష్ టీచర్ సమ్‌థింగ్ స్పెషల్!
చెన్నై: మావి ఇంటర్నేషనల్ స్కూళ్లు అని ఊదరగొట్టే కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతిగది రూపుదిద్దుకుంది. క్లాస్‌రూం అంటే ఇలా ఉండాలి అనిపించేలా.. ఇంటరాక్టీవ్ స్మార్ట్‌బోర్డు, సౌకర్యవంతమైన ఫర్నీచర్, పిల్లలకు నచ్చేలా ఉన్న రంగురంగుల పెయింటింగ్‌లు, రిఫరెన్స్ పుస్తకాలు ఇవన్నీ తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఓ ఇంగ్లిష్ టీచర్‌కు తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు నిలువుటద్దం ఆ వసతులు. పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించిన ఆమె.. తన నగలు అమ్మి మరీ ఆ క్లాస్‌రూంను తీర్చిదిద్దారు. విల్లుపురంలోని కందాడు ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ అన్నపూర్ణా మోహన్ అనే ఇంగ్లిష్ టీచర్ పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో పిల్లలు తడుముకోకుండా ఇంగ్లిష్ మాట్లాడటంలో ఆమె కృషి ఎనలేనిది. అయితే.. ఆమె అంతటితోనే తన బాధ్యత తీరిపోయిందని భావించలేదు. పిల్లలకు మంచి వసతులు ఉండాలని భావించారు. అందుకోసం సొంత ఖర్చులతో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పరిచారు. విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వలే తనకు కూడా సవాళ్లు ఎదురయ్యాయని తన అనుభవాల గురించి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ వెల్లడించారు. మొదట పిల్లలతో ఇంగ్లిష్‌లో ఇంటరాక్ట్ అవుతుంటే వారు సరిగా స్పందించేవారు కాదని తెలిపారు. అయితే.. బోధనలో విద్యార్థులను మమేకం చేస్తూ.. స్కిట్లు తదితర పద్దతుల్లో పాఠాలను బోధించేదాన్నని గుర్తుచేశారు. తరువాత ఓసారి విద్యార్థుల ఇంగ్లిష్ సామర్థ్యాలను ఫేస్బుక్లో ఉంచగా.. మంచి స్పందన వచ్చిందని తెలిపారు. అనేక మంది ముందుకొచ్చి విద్యార్థులకు బహుమతులు పంపుతూ ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఇలా అందరూ స్పందిస్తున్న తీరే.. విద్యార్థులకు మంచి క్లాస్‌రూం అందించే దిశగా తనను ప్రోత్సహించిందని అన్నపూర్ణ తెలిపారు. ‘కొంతమంది విదేశీయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించారు. దాంతో విద్యార్థులకు సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. తరగతి గదిని అన్ని వసతులతో తీర్చిదిద్దాలని భావించాను’ అన్నారు అన్నపూర్ణ. అందుకోసం అవసరమైన డబ్బును నగలు అమ్మి సమకూర్చుకున్నారు ఆమె. ‘ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా ఉండటం లేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందువల్ల వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే విద్యకోసం లక్షలాది రూపాయలను ప్రైవేట్‌లో వెచ్చిస్తున్నారు. అయితే.. కొంచెం కృషితో పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించవచ్చు’ అని అంటున్నారు అన్నపూర్ణ. -
సంగీత కుటుంబం
బాల మురళీకృష్ణ 1948 మార్చి 14న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ చదువుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. పాడగలరు కూడా. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు వారిని రావద్దని బాలమురళి సూచించారట. పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెద్దబ్బాయి అభిరామ్ హైదరాబాద్‌లోనే ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి. హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నారు. వంశీ మోహన్ పేరున్న డయబెటాలజిస్ట్. తండ్రితో కలిసి చెన్నైలోనే ఉంటున్నారు. ఇక, ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ బాల మురళి కుటుంబం. -
అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం
‘శ్రీమతి అన్నపూర్ణ మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదాలతో... మా అబ్బాయి అఖిల్ నిశ్చితార్థ వేడుకకు మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నాం’ - ఇట్లు అమల అండ్ అక్కినేని నాగార్జున. సినీ ప్రముఖులకూ, సన్నిహితులకూ అక్కినేని కుటుంబం నుంచి అందిన ఆహ్వానం ఇది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్, అఖిల్‌ల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో పెళ్లి చేయాలనుకుం టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్ -
‘అన్నపూర్ణ కృషి ప్రసార సేవ’పై అవగాహన
కొత్తపల్లి : రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నపూర్ణ కృషి ప్రసార సేవ పేరిట టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లాలో తొలిసారి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ టోల్ ఫ్రీ నంబర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఉద్యాన వన పంటలు, చేపల పెంపకం తదితర అంశాలపై సూచనలు, సలహాలు పొందవచ్చునన్నారు. 24 గంటలూ ఈ టోల్ ఫ్రీ నంబర్ 18004253141 రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు సెల్‌ఫోన్ నంబర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. ఇప్పటివరకూ సుమారుగా 22 వేల నంబర్లు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పీఎల్ఆర్జే ప్రవీణ, శాస్త్రవేత్త ఎం.నందకిషోర్, గుంటూరు జిల్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీడియో ల్యాబ్ రీసెర్చి పర్సన్స్ డాక్టర్ ఎం.సహదేవయ్య, డాక్టర్ పి.సాయి, కాకినాడ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పి.పద్మజ, పిఠాపురం ఏడీఏ పద్మశ్రీ, ఏఓ జోగిరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీడీఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
దమ్మాయిగూడలో చైన్ స్నాచింగ్
జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళ మెడలోని 5 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా సోదరికి పోలీసుల నుంచి ప్రాణహాని
కేసులుంటే కోర్టులో హాజరుపరచండి .. లేదంటే విడుదల చేయూలి అన్నపూర్ణ సోదరుడు భూతం వుస్తాన్‌రావు డిమాండ్ పిడుగురాళ్ళ మావోయిస్టు అనే ఆరోపణలతో పిడుగురాళ్ళ వుండలం జూలకల్లుకి చెందిన తన సోదరి అన్నపూర్ణ అలియూస్ అరుణ అలియూస్ పద్మక్కను తుళ్లూరు వుండలం తాళ్లారుుపాలెంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆమెకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె సోదరుడు భూతం మస్తాన్‌రావు ఆరోపించారు. వుస్తాన్‌రావు మంగళవారం పిడుగురాళ్ళ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన చిన్న చెల్లెలు అరుున అన్నపూర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు పోలీసులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి విజయువాడ వైపు తీసుకెళ్లారని చెప్పారు. అన్నపూర్ణపై కేసులు ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని, కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయూలని వుస్తాన్‌రావు డివూండ్ చేశారు. గతంలో వుస్తాన్‌రావు మేనకోడలు కువూర్తె అరుున రాయుపాటి స్వర్ణలత అలియూస్ నాగవుణిని పట్టుకుని పోలీసులు కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు అదే విధంగా తన చిన్న చెల్లెలు అన్నపూర్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయున ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో జననాట్య వుండలి పట్ల ఆకర్షితురాలైన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోరుుందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదని, ఇటీవలే రెండు రోజుల క్రితం పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంటికి వచ్చిన అన్నపూర్ణను పోలీసులు తీసుకెళ్లారని వుస్తాన్‌రావు వివరించారు. ఆమెను వెంటనే కోర్టుకు హాజరు పరచడవూ? లేదా విడుదల చేయుడమో చేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని ఆయున పోలీసులున హెచ్చరించారు. అన్నపూర్ణతోపాటు తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం, బావ బాలస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. అన్నపూర్ణను బేషరతుగా విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం నరసరావుపేట టౌన్: పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నాయకురాలు భూతం అన్నపూర్ణను వెంటనే బేషరతుగా విడుదలచేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసుల చర్యను నిరసించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళయ్యపాలెంలో తన సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న తలదాచుకున్న భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను యాంటీ నక్సల్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకి చెందిన అన్నపూర్ణ 1991నుంచి ఉద్యమంలో భాగస్వామ్యురాలైందన్నారు. గత నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బంధువుల ఇంట్లో చికిత్స పొందుతోందని చెప్పారు. ఏఎన్ఎస్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళారని, ఆమెకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అన్నపూర్ణపై ఏమైనా కేసులు ఉంటే వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరచాలని లేకుంటే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు నల్లపాటి రామారావు , కెఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్నా, పికెఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంభాల ఏడుకొండలు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దండు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ప్రభుత్వ, అటవీ భూముల కబ్జా స్థానిక అధికారుల అండదండలు కన్నెర్ర జేసిన జాయింట్ కలెక్టర్ అన్నపూర్ణ, వాసవి కంపెనీల సీజ్ అక్రమాల పుట్టగా మల్లంపల్లి మైనింగ్ జిల్లాలో మైనింగ్ దందా జోరుగా సాగుతోంది. మల్లంపల్లిలో వందల ఎకరాల్లో లాటరైట్ లీజు పేరిట ప్రభుత్వ, అటవీశాఖకు చెందిన స్థలాలు మైనింగ్ తవ్వకాల్లో కలిసిపోతున్నారుు. స్థానిక అధికారుల అండదండలతో తవ్వకాలు సాగుతున్నారుు. ఈ దందా శృతి మించిపోవడంతో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ కన్నెర్ర చేశారు. వారం రోజుల వ్యవధిలో అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ, వాసవి మినరల్స్ సంస్థలను సీజ్ చేశారు. - సాక్షి, హన్మకొండ హన్మకొండ : ఒక కంపెనీ లేదా వ్యక్తులు సహ జ వనరులైన ఖనిజాలు వెలికి తీసే మైనింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవా లి. అనుమతి పొందిన సర్వే నంబరులో నిర్దిష్ట స్థల, కాల పరిమితిలో మైనింగ్ చేపట్టాలి. అనుమతి పొం దిన ప్రాంతం దాటి మైనింగ్ చేపట్టకుండా ఉండేం దుకు హద్దు రాళ్లను పాతించే బాధ్యత రెవెన్యూ విభాగానిది. ఇదంతా ఎక్కడా అమలుకావడంలేదు. జిల్లాలో ములుగు మండలం మల్లంపల్గి, రామచంద్రాపురం రెవెన్యూ పరిధిలో 33 మైనింగ్ కంపెనీలకు లాటరైట్ ఖనిజం తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఏ సర్వే నంబరులో, ఎన్ని ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతి పొందాయనే సమాచారాన్ని బహిరంగపరచడం లేదు. ఇక్కడఏ ఒక్క మైనింగ్ కంపెనీ లీజుకు కాలపరిమితి, అనుమతి పొందిన స్థలాలకు సంబంధించిన హద్దులు లేవు. లాటరైట్ మైనింగ్‌కు అనుమతి ఉందని పేర్కొంటూ ఇష్టారీతిగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనితో ఎకరం స్థలంలో లీజుకు తీసుకుని వందల ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు లీజు గడువు ముగిసినా మైనింగ్‌ను నిలిపేయడం లేదు. దీనితో ప్రభుత్వ స్థలాలు, కొండలు, అటవీ భూములు మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకున్నాయి. పది రోజుల్లో రెండు సీజ్‌లు అక్రమ మైనింగ్‌పై జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల దృష్టి సారించారు. ఇక్కడ ఎర్రమట్టిని తోడుతున్న కంపెనీలు, వాటి లీజు పరిమితులను పరిశీలించారు. మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు సమీపంలో ఉన్న అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ప్రభుత్వ స్థలంలోకి చొరబడి మైనింగ్ జరుపుతున్నట్లుగా వెల్లడైంది. దీనితో ఆగస్టు తొలివారంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారులు ఈ కంపెనీని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల చర్యలతో అటవీశాఖ అధికారులు మల్లంపల్లి ప్రాంతంలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లగా వాసవి మినరల్స్ సంస్థ హద్దులను దాటి అటవీశాఖకు చెందిన స్థలంలో మైనింగ్ చేపడుతున్నట్లుగా తేలింది. దానితో ఆగస్టు 12న అటవీశాఖ అధికారులు వాసవి మినరల్స్ పనులను అడ్డుకుని కేసు నమోదు చేశారు. పది రోజుల రోజుల వ్యవధిలోనే రెండు కంపెనీల కార్యకలాపాలు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో మల్లంపల్లి మైనింగ్ మాఫియాలో కలకలం రేగుతోంది. గడిచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పర్యటన, స్వాతంత్ర దినోత్సవేడుల కారణంగా మైనింగ్ మాఫియాపై దాడుల వేడి తగ్గింది. ఈలోగా వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు మైనింగ్ అక్రమార్కులు తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అన్నపూర్ణే సదాపూర్ణే..
తెల్లవారుజాము నుంచి కిక్కిరిసిన క్యూలైన్లు లక్షమందికిపైగా దర్శించుకున్నారని అంచనా ఉదయం నుంచి అంతరాలయ దర్శనం రద్దు అన్నపూర్ణమ్మను దర్శించుకుని తరించిన భక్తకోటి సాక్షి, విజయవాడ : అమ్మలగన్నమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఆదివారం శ్రీఅన్నపూరాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు అమ్మను దర్శించుకున్నారని అధికారుల అంచనా.అనధికార వీఐపీలు పెద్ద ఎత్తున రావడంతో ఉభయదాతలు, టికెట్లు కొనుగోలుచేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల దాటే సమయూనికి రద్దీ పెరగడంతో అంతరాలయ దర్శనం రద్దుచేసి లఘుదర్శనానికి అనుమతించారు. రంగంలో దిగిన డీసీపీ అశోక్‌కుమార్ అనధికార వీఐపీల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రధాన ద్వారం వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. అక్కడ ఉన్న సీఐతో భక్తులు ఘర్షణ పడ్డారు. దీంతో డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్‌కుమార్ రంగంలోకి దిగి భక్తుల్ని క్రమబద్ధీకరించారు. అనధికార వీఐపీలను దర్శనానికి పంపడం తగ్గించి మిగిలిన వారిని అనుమతించారు. గంటలకొద్దీ క్యూలైన్లోనే.. ఆదివారం ఉదయం నుంచి క్యూలైన్లు భక్తులతో నిండిపోయూరుు. ఒకదశలో దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది. తాము తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్నామని, అక్కడ రెండు గంటల్లో సర్వదర్శనం క్యూలో దర్శనమైందని, ఇక్కడ నాలుగు గంటలైనా లైన్లోనే ఉన్నామని ఏలూరుకు చెందిన భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎక్కువసేపు నిలబడలేక క్యూలైన్ మధ్య నుంచే తిరుగుముఖం పట్టారు. అన్నదానం వద్ద క్యూ కట్టిన భక్తులు ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకారం కావడంతో దర్శనానంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆదివారం సుమారు పదివేలమందికి అన్నదానం చేశారు. మండుటెండతో ఇబ్బందులు మండుటెండకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. రథం సెంటర్లోని స్టాండ్ వద్దే చెప్పులు భద్రపరుచుకోవడంతో కొండపైకి ఎండలో నడిచి నానా అవస్థలకు గురయ్యూరు. రానున్న రోజులను దృష్టిలో పెట్టుకుని అధికారులు కార్పెట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. హంస వాహనానికి తుది మెరుగులు దశమి రోజున శ్రీదుర్గామల్లేశ్వరస్వామి నదీ విహారానికి హంస వాహనం ముస్తాబవుతోంది. దురాఘాట్లో హంస వాహనాన్ని సిద్ధం చేయడమే కాకుండా మంగళవారం ట్రయిల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. -
డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి
బాలాజీ చెరువు(కాకినాడ) : త్వరలో వెలువడనున్న డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలంటూ సోమవారం డీఎడ్(డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ద్వితీయ సంవత్సర అభ్యర్థులు నినాదాలు చేశారు. ముందుగా వారు మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏడీ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులందరూ అక్కడి నుంచి ర్యాలీగా మసీదు సెంటర్ నుంచి బాలాజీ చెరువు మీదుగా జీజీహెచ్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి 2008 డీఎస్సీ పోస్టుల్లో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థులకు అవకాశం కల్పించారని, అదే పద్ధతి 2012లోనూ కొనసాగించారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. అనంతరం యూటీఏఫ్ భవనంలో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థుల సంఘ అధ్యక్షుడిగా నక్కా పాండురంగారావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివసాయిప్రసాద్, కోశాధికారిగా ముమ్మిడి సతీష్, కార్యదర్శిగా బి.హరీష్, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పలసూరి, డి.మురళీకృష్ణ, రవితేజ, సతీష్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.వి సత్యనారాయణ,చింతాడ ప్రదీప్‌కుమార్‌తో పాటు దాదాపు రెండువేల మంది డీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘అన్నపూర్ణ’ బాటలో..ఏరువాక సాగారో..!
చిన్న కమతం.. పెద్ద భరోసాఅరెకరంలో ప్రకృతి వ్యవసాయంతో * చిన్న రైతులకు అనుదినం ఆహార భద్రత * 3 రోజులపాటు స్వచ్ఛంద సంస్థల ఉచిత శిక్షణ * కాల్‌సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు * ‘జట్టు’ తోడ్పాటు.. ‘సాగుబడి’ చోదోడు.. నేల తల్లిని నిత్యం చెమట చుక్కలతో ముద్దాడే రైతన్నే జాతికి వెన్నెముక. కానీ, రెండెకరాల సొంత భూమి ఉన్న రైతు కుటుంబాలకు కూడా మూడు పూటలా కడుపు నిండే పరిస్థితి లేదు. రసాయనిక వ్యవసాయ పద్ధతిని అనుసరించడంతో సాగు వ్యయం తడిసి మోపెడవుతుంటే.. ఇక రైతుకు మిగిలేదేముంది రెక్కల కష్టం తప్ప! అరెకరంలో ప్రకృతి వ్యవసా యం తో ఈ సంక్షోభాన్ని పారదోలవచ్చని బడుగు రైతులు రుజువు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ పంటల నమూనా ద్వారా జట్టు ట్రస్టు వీరికి వెలుగుబాట చూపుతోంది. పలువురు ప్రకృతి వ్యవసాయ దిగ్గజాల బోధనలను రంగరించి, సులభసాధ్యమయ్యేలా, వాతావరణ మార్పులను తట్టుకునేలా ఈ పంటల నమూనాను రూపొందించడం విశేషం. అన్నపూర్ణ పంటల నమూనా అనుసరించే రైతులు.. అరెకరం స్థలంలోనే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ధాన్యాలు, పండ్ల చెట్లను కలిపి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయవచ్చు. ఆ కుటుంబానికి ఏడాది పొడవునా సంపూర్ణ ఆహార భద్రతతోపాటు రసాయనిక అవశేషాల్లేని సహజాహారం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయానికి ‘సాగుబడి’ తోడ్పాటు ఈ భూమిపుత్రుల విజయగాథను ‘అరెకరం అక్షయపాత్ర’ శీర్షికన ‘సాక్షి’(ఫిబ్రవరి 3, 2014, ‘సాగుబడి’) ఎలుగెత్తి చాటింది. అప్పటి నుంచీ ఈ చిన్న రైతుల పొలాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. రైతులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం ఈ పంటలను సందర్శిస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే శిక్షణ పొంది, ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి సేద్యానికి ఉపక్రమి స్తుండడం శుభపరిణామం. కొన్ని ఎకరాల భూమి ఉండి, అందులో వాణిజ్య దృష్టితో ఏకపంటలు పండించే రైతులు కూడా.. తొలుత తమ కుటుంబ అవసరాల కోసం ఈ నమూనాను అనుసరించి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించ వచ్చు. సేద్యమనే మహా యజ్ఞంలో ఈ వెలుగుబాటను ఎంచుకునే రైతులకు ‘సాగుబడి’ చేదోడుగా ఉంటుంది. నిపుణులు, రైతులకు మధ్య వారధిగా ఉంటూ.. ఎప్పటికప్పుడు మెలకువలను అందిస్తుంది. ఆలస్యమెందుకు..? మీరూ కొత్తదారి తొక్కండి. ప్రకృతి వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ ‘అన్నపూర్ణ’ పంటల నమూనాలో ప్రకృతి వ్యవసాయంపై జట్టు స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం జిల్లా తోటపల్లిలో రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. * స్వయంగా తోటపల్లి వస్తే పెద్ద రైతులైనా, పేద రైతులైనా 3 రోజుల ఉచిత శిక్షణ పొందవచ్చు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. * అయితే, రైతులు తమ గ్రామంలోనే సామూహిక శిక్షణ పొందవచ్చు. ఏ జిల్లాకు చెందిన రైతులెవరైనా కనీసం 20-30 మంది ఒక బృందంగా ఏర్పడితే వారి ఊళ్లోనే ‘అన్నపూర్ణ’ పంటల నమూనాపై ఉచితంగా శిక్షణ పొందవచ్చు. జట్టు సంస్థ సిబ్బంది వారి ఊరికెళ్లి 3 రోజులపాటు శిక్షణ ఇస్తారు. తర్వాత కాలంలో రైతుల సందేహాలను ఫోన్ ద్వారా నివృత్తి చేస్తారు. * విశాఖపట్నం జిల్లాకు చెందిన (ఎకరం లోపు సొంత భూమి ఉన్న) పేద రైతులకు ఉచితంగానే భోజన వసతులు కూడా కల్పించి తోటపల్లిలో జట్టు సంస్థ శిక్షణ ఇస్తున్నది. ఆసక్తి కలిగిన ఇతర జిల్లాలకు చెందిన పేద, గిరిజన రైతులకు కూడా ఆయా జిల్లాల్లో శిక్షణతోపాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు సమకూర్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, రంపచోడవరం, చిత్తూరు, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులకు కోవెల్ ఫౌండేషన్ (వి. కృష్ణారావు- 9440976848), సీసీఎన్ సంస్థ (లాఖీ -9848049528) కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి. * రైతులు సంప్రదించాల్సిన చిరునామా: జట్టు ఆశ్రమం, తోటపల్లి పోస్టు, రావివలస (ఎస్.ఓ.), పార్వతీపురం వయా, విజయనగరం జిల్లా-535525. కాల్‌సెంటర్: ఫోన్: 08963 227228 (ఉ. 9 గం. నుంచి రాత్రి 8 గం.). నూకంనాయుడు(ప్రాజెక్టు మేనేజర్)- 94400 94384. Email: jattutrust1@gmail.com - ‘సాగుబడి’ డెస్క్ ఇదీ ‘అన్నపూర్ణ’ ఆవశ్యకత! రెండెకరాల భూమి కలిగిన రైతులు కేవలం ఆ భూమిపై ఆధారపడి బతకడం అసాధ్యమనే పరిస్థితి నెలకొంది. తన కాయకష్టంతో పది మందికి అన్నం పంచిన రైతు కనీసం తన కుటుంబం ఆకలి తీర్చలేని దీనావస్థలో ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడడంతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరగడమే. వాతావరణంలో మార్పుతో అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, తుపాన్లు వస్తున్నాయి. వీటి తాకిడికి పంటలు తుడిచిపెట్టుకుపోయిన అనుభవాలు మనకున్నాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ డంతోపాటు తక్కువ ఖర్చుతో, సుస్థిర దిగుబడినివ్వగల పంటల నమూనా అవసరమైంది. ఈ లక్షణాలన్నిటి తోపాటు రసాయనాల అవశేషాలు లేని సహజాహారాన్ని అందించే పంటల నమూనా ‘అన్నపూర్ణ’. శిక్షణ పొంది సాగు చేయండి అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ నమూనాలో ఏదో ఒక పంట కాకుండా అనేక పంటలు కలిపి పండిస్తాం. ఈ ఖరీఫ్‌లో ఈ నమూనాలో సాగు చేపట్టే రైతులు పేర్లు నమోదు చేయించుకొని వర్షాలకు ముందే శిక్షణ పొందాలి. వర్షాధార సాగుకు జూన్ 15లోగా విత్తనాలు వేసుకోవాలి. పండ్ల మొక్కలు నాటుకోవాలి. నీటి వసతి ఉన్న రైతులు ఇంకొన్నాళ్లు ఆలస్యంగానైనా ప్రారంభించవచ్చు. - డి. పారినాయుడు(9440164289), ‘అన్నపూర్ణ’ పంటల నమూనా రూపకర్త,జట్టు ట్రస్టు వ్యవస్థాపకులు, తోటపల్లి. -
‘కృష్ణా బోర్డు’తో డెల్టాకు లబ్ధి చేకూరేనా?
విజయవాడలో బోర్డు ఏర్పాటుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన ఉపయోగం ఉండదంటున్న నిపుణులు సాక్షి, విజయవాడ : కృష్ణానదీ జలాల బోర్డును విజయవాడలో ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ శాఖ పంపిన ప్రతిపాదనలపై నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. కృష్ణాడెల్టాకు దీనివల్ల ఏమేరకు లబ్ధి చేకూరుతుందనేది చర్చనీయాంశమైంది. కృష్ణానదిపై అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు, వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు విధివిధానాలు, పరిధి, నీటి లెక్కింపు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, వరద నిర్వహణ, నీటి యాజమాన్యానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కృష్ణాడెల్టా అవసరాలు, సాగర్ నుంచి ఎంత నీటిని విడుదల చేయాలి, దిగువన ఎంత నీరు వస్తుందన్న అంశాలపై లెక్కలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంక్షోభంలో కృష్ణా డెల్టా... 13 లక్షల ఎకరాల్లో వరి సాగవుతూ దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాడెల్టా.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒక్క చుక్క కూడా ఉపయోగపడని మునేరు, పాలేరు జలాలను నికర జలాలుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ లెక్కల్లో చూపించిన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ దిగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు నదుల నుంచి వచ్చే 50 టీఎంసీల నీటిని నికర జలాలుగా లెక్కగట్టారు. కృష్ణా నదిలో వరదలు వచ్చే సమయంలోనే మునేరు, పాలేరు ఉపనదుల నుంచి వరద ప్రవాహం కృష్ణానదిలో చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదలడం మినహా డెల్టాకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంచాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. మిగులు జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో పంట పండని పరిస్థితి ఏర్పడింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. 2003-04లో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆల్మట్టిలో 137 టీఎంసీల నీరు ఉన్నా 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. పైనుంచి నీరు రాకపోతే ఇక్కడ బోర్డు ఉన్నా నీటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
మా ఆవిడకు ఓటేయరూ!!
పొడవాటి బుర్ర మీసాలు.. బట్టతల.. భారీ విగ్రహం.. ఇవన్నీ ఒక్కసారి చెబితే చాలు, ఆయన పేరేంటో ఆ మనిషేంటో వెంటనే తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. టీటీడీ చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి, ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరినీ అక్కా, చెల్లీ, అల్లుడూ అంటూ సొంత మనుషుల్లా పలకరించి ఎలాగోలా గెలిచేయడం ఆయనకు ఇన్నాళ్లూ అలవాటు. కానీ ఇప్పుడు అలాంటిది ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా.. నరసాపురం నుంచే బరిలోకి దిగుతారా.. లేదా అక్కడ తన భార్య అన్నపూర్ణను పోటీ చేయిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ ప్రాంతంలో వినిపిస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి చేపట్టడానికి కొద్ది సమయం ముందు ఆయనను స్వయంగా కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం అందించిన వ్యక్తి.. బాపిరాజు. ఆయన గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికై రాష్ట్ర్ర దేవాదాయ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు. విభజన నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడుతున్న కనుమూరి.. తన బదులు తన భార్యను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాని చూస్తున్నారట. అన్నపూర్ణమ్మకు నరసాపురం, భీమవరం, పాలకొల్లు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాలలో ముఖ పరిచయాలు ఉండటంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. టీటీడీలో ఏ కార్యక్రమం జరిగినా ఈ దంపతులు ఇద్దరూ కలిసే పాల్గొంటారు. కనుమూరి రాజకీయ విజయం వెనుక అన్నపూర్ణమ్మ ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. దీంతో ఆమెను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా కొనసాగడంతో పాటు కొత్తముఖాన్ని ప్రజలకు పరిచయం చేసినట్టు ఉంటుందని కనుమూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాపిరాజు తమ్ముడి కుమారుడు రఘురామకృష్ణంరాజు ప్రత్యర్ధిగా నర్సాపురం బరిలో ఉండటం వల్ల కనుమూరి పోటీకి దిగుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటంతో ముందు చూపుగా తన భార్యను రంగంలోకి దింపాలనే ఆలోచన ద్వారా కొత్త ఎత్తుగడకు తెరలేపారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధిష్టానానికి విధేయంగా ఉండి.. తర్వాత రాజ్యసభ సీటు తెచ్చుకోవచ్చన్నది బాపిరాజు ఐడియానట. ఇదే సమయంలో సీఎం కిరణ్ తోనూ కనుమూరి సత్సంబంధాలు కొనసాగిస్తుండటం విశేషం!! -
నదీజలాల హక్కులపై తెరాస వ్యాఖ్యలు : నాగిరెడ్డి
నందిగామ, న్యూస్‌లైన్ : నదుల దిగువ ప్రాంతాలవారికి నదీజలాలపై ఎటువంటి హక్కులూ ఉండవని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతూ మార్గ మధ్యంలో నందిగామ రహదారి బంగ్లాలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాలకు వినాశనమేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిని, ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అన్న పేరు పోతుందన్నారు. 1న సమైక్య రైతు శంఖారావం అక్టోబరు ఒకటిన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ట్రాక్టర్లతో సహా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులతో ‘సమైక్య రైతు శంఖారావం’ నిర్వహిస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మల్లో ఒకరు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. రెండు జిల్లాల్లోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్ ముమ్మాటికీ సమైక్యవాదే దివంగత నేత వైఎస్సార్ ఎప్పుడూ విభజనవాదాన్ని సమర్ధించలేదన్నారు. 2004 ఎన్నికల సమయంలోనూ రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి సూచించారని, అదే విషయాన్ని అప్పటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారన్నారు. వేర్పాటువాదాన్ని తనదైన శైలిలో అడ్డుకున్న వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని ప్రతి ఒక్కరి మనస్సులో ఉందన్నారు. తన హయాంలో విభజనకై తొమ్మిది అంశాలతో ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్, మండల కన్వీనర్లు కుక్కల సత్యనారాయణ ప్రసాద్ (నందిగామ), తాటి రామకృష్ణ (పట్టణ), బండి కోటేశ్వరరావు (కంచికచర్ల), దాసరి రాము (కంచికచర్ల పట్టణ), కోట బుచ్చయ్య చౌదరి (చందర్లపాడు), జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, పీజెవీఎస్ కుమార్, ముక్కపాటి శివాజీ, పలు విభాగాల కన్వీనర్లు బుచ్చిరెడ్డి, పాములపాటి రామకృష్ణ, కామసాని ఉదయకుమార్, అనుముల చుక్కయ్య, మువ్వల శ్రీనివాసరావు, రబ్బానీ, సుభానీ, సుఖదేవ్ తదితరులు పాల్గొన్నారు.