సోమాజిగూడ :పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం నిమ్స్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో విమర్శలకు గురవుతోంది. వివరాలు.. రెండేళ్ల క్రితం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ పథకం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 720 మంది పేదలు భోజనం చేస్తుంటారు. మూడు నెలల క్రితం క్యాంటిన్‌ను పార్కింగ్ ఉన్న మరో ప్రాంతానికి తరలించారు. గతంలో చెట్ల నీడలో పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటిన్ ప్రస్తుతం మండుటెండల్లోకి మారడంతో అక్కడే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిమ్స్‌లోని అధికారులు తమ వాహనాలను చెట్ల నీడలో పెట్టేందుకు.. ఇక్కడి ప్రైవేట్ క్యాంటిన్‌నిర్వాహకులతో మిలాఖత్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment