వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment