కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్‌ దాడి | Vigilance Searches In Fake Seed centers In hyderabad | Sakshi
Sakshi News home page

కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్‌ దాడి

Jun 12 2019 5:03 PM | Updated on Jun 12 2019 5:08 PM

Vigilance Searches In Fake Seed centers In hyderabad - Sakshi

హైదరాబాద్‌: నగంరలో కల్తీ విత్తన కేంద్రాలపై  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సిద్ధిపేట్‌ జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఎస్‌కే ఖాదర్‌ ఈ కల్తీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 45 కేజీల బరువు గల మూడు బ్యాగ్‌ల కల్తీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పల్లవి-12, గోఖుల్‌, కృష్ణ-10 పేరు గల 25 ప్యాకెట్ల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. వీటి మొత్తం విలువ భారీగా ఉండవచ్చునని చెప్పారు. ఈ కల్తీ విత్తనాలు కర్నూలు నుంచి గుంటూరు మీదుగా నగరానికి వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్‌ డీలర్ల వద్దనే కొనాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement