
సంగీత కుటుంబం
బాల మురళీకృష్ణ 1948 మార్చి 14న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ చదువుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. పాడగలరు కూడా. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు వారిని రావద్దని బాలమురళి సూచించారట. పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెద్దబ్బాయి అభిరామ్ హైదరాబాద్‌లోనే ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు.
రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి. హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నారు. వంశీ మోహన్ పేరున్న డయబెటాలజిస్ట్. తండ్రితో కలిసి చెన్నైలోనే ఉంటున్నారు. ఇక, ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ బాల మురళి కుటుంబం.