ప్రభుత్వ, అటవీ భూముల కబ్జా
స్థానిక అధికారుల అండదండలు
కన్నెర్ర జేసిన జాయింట్ కలెక్టర్
అన్నపూర్ణ, వాసవి కంపెనీల సీజ్
అక్రమాల పుట్టగా మల్లంపల్లి మైనింగ్
జిల్లాలో మైనింగ్ దందా జోరుగా సాగుతోంది. మల్లంపల్లిలో వందల ఎకరాల్లో లాటరైట్ లీజు పేరిట ప్రభుత్వ, అటవీశాఖకు చెందిన స్థలాలు మైనింగ్ తవ్వకాల్లో కలిసిపోతున్నారుు. స్థానిక అధికారుల అండదండలతో తవ్వకాలు సాగుతున్నారుు. ఈ దందా శృతి మించిపోవడంతో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ కన్నెర్ర చేశారు. వారం రోజుల వ్యవధిలో అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ, వాసవి మినరల్స్ సంస్థలను సీజ్ చేశారు.
- సాక్షి, హన్మకొండ
హన్మకొండ : ఒక కంపెనీ లేదా వ్యక్తులు సహ జ వనరులైన ఖనిజాలు వెలికి తీసే మైనింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవా లి. అనుమతి పొందిన సర్వే నంబరులో నిర్దిష్ట స్థల, కాల పరిమితిలో మైనింగ్ చేపట్టాలి. అనుమతి పొం దిన ప్రాంతం దాటి మైనింగ్ చేపట్టకుండా ఉండేం దుకు హద్దు రాళ్లను పాతించే బాధ్యత రెవెన్యూ విభాగానిది. ఇదంతా ఎక్కడా అమలుకావడంలేదు. జిల్లాలో ములుగు మండలం మల్లంపల్గి, రామచంద్రాపురం రెవెన్యూ పరిధిలో 33 మైనింగ్ కంపెనీలకు లాటరైట్ ఖనిజం తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఏ సర్వే నంబరులో, ఎన్ని ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతి పొందాయనే సమాచారాన్ని బహిరంగపరచడం లేదు. ఇక్కడఏ ఒక్క మైనింగ్ కంపెనీ లీజుకు కాలపరిమితి, అనుమతి పొందిన స్థలాలకు సంబంధించిన హద్దులు లేవు. లాటరైట్ మైనింగ్‌కు అనుమతి ఉందని పేర్కొంటూ ఇష్టారీతిగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనితో ఎకరం స్థలంలో లీజుకు తీసుకుని వందల ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు లీజు గడువు ముగిసినా మైనింగ్‌ను నిలిపేయడం లేదు. దీనితో ప్రభుత్వ స్థలాలు, కొండలు, అటవీ భూములు మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకున్నాయి.
పది రోజుల్లో రెండు సీజ్‌లు
అక్రమ మైనింగ్‌పై జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల దృష్టి సారించారు. ఇక్కడ ఎర్రమట్టిని తోడుతున్న కంపెనీలు, వాటి లీజు పరిమితులను పరిశీలించారు. మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు సమీపంలో ఉన్న అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ప్రభుత్వ స్థలంలోకి చొరబడి మైనింగ్ జరుపుతున్నట్లుగా వెల్లడైంది. దీనితో ఆగస్టు తొలివారంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారులు ఈ కంపెనీని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల చర్యలతో అటవీశాఖ అధికారులు మల్లంపల్లి ప్రాంతంలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లగా వాసవి మినరల్స్ సంస్థ హద్దులను దాటి అటవీశాఖకు చెందిన స్థలంలో మైనింగ్ చేపడుతున్నట్లుగా తేలింది. దానితో ఆగస్టు 12న అటవీశాఖ అధికారులు వాసవి మినరల్స్ పనులను అడ్డుకుని కేసు నమోదు చేశారు. పది రోజుల రోజుల వ్యవధిలోనే రెండు కంపెనీల కార్యకలాపాలు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో మల్లంపల్లి మైనింగ్ మాఫియాలో కలకలం రేగుతోంది. గడిచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పర్యటన, స్వాతంత్ర దినోత్సవేడుల కారణంగా మైనింగ్ మాఫియాపై దాడుల వేడి తగ్గింది. ఈలోగా వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు మైనింగ్ అక్రమార్కులు తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
Published Sat, Aug 15 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement