to take the land
-
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ప్రభుత్వ, అటవీ భూముల కబ్జా స్థానిక అధికారుల అండదండలు కన్నెర్ర జేసిన జాయింట్ కలెక్టర్ అన్నపూర్ణ, వాసవి కంపెనీల సీజ్ అక్రమాల పుట్టగా మల్లంపల్లి మైనింగ్ జిల్లాలో మైనింగ్ దందా జోరుగా సాగుతోంది. మల్లంపల్లిలో వందల ఎకరాల్లో లాటరైట్ లీజు పేరిట ప్రభుత్వ, అటవీశాఖకు చెందిన స్థలాలు మైనింగ్ తవ్వకాల్లో కలిసిపోతున్నారుు. స్థానిక అధికారుల అండదండలతో తవ్వకాలు సాగుతున్నారుు. ఈ దందా శృతి మించిపోవడంతో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ కన్నెర్ర చేశారు. వారం రోజుల వ్యవధిలో అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ, వాసవి మినరల్స్ సంస్థలను సీజ్ చేశారు. - సాక్షి, హన్మకొండ హన్మకొండ : ఒక కంపెనీ లేదా వ్యక్తులు సహ జ వనరులైన ఖనిజాలు వెలికి తీసే మైనింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవా లి. అనుమతి పొందిన సర్వే నంబరులో నిర్దిష్ట స్థల, కాల పరిమితిలో మైనింగ్ చేపట్టాలి. అనుమతి పొం దిన ప్రాంతం దాటి మైనింగ్ చేపట్టకుండా ఉండేం దుకు హద్దు రాళ్లను పాతించే బాధ్యత రెవెన్యూ విభాగానిది. ఇదంతా ఎక్కడా అమలుకావడంలేదు. జిల్లాలో ములుగు మండలం మల్లంపల్గి, రామచంద్రాపురం రెవెన్యూ పరిధిలో 33 మైనింగ్ కంపెనీలకు లాటరైట్ ఖనిజం తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఏ సర్వే నంబరులో, ఎన్ని ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతి పొందాయనే సమాచారాన్ని బహిరంగపరచడం లేదు. ఇక్కడఏ ఒక్క మైనింగ్ కంపెనీ లీజుకు కాలపరిమితి, అనుమతి పొందిన స్థలాలకు సంబంధించిన హద్దులు లేవు. లాటరైట్ మైనింగ్‌కు అనుమతి ఉందని పేర్కొంటూ ఇష్టారీతిగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనితో ఎకరం స్థలంలో లీజుకు తీసుకుని వందల ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు లీజు గడువు ముగిసినా మైనింగ్‌ను నిలిపేయడం లేదు. దీనితో ప్రభుత్వ స్థలాలు, కొండలు, అటవీ భూములు మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకున్నాయి. పది రోజుల్లో రెండు సీజ్‌లు అక్రమ మైనింగ్‌పై జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల దృష్టి సారించారు. ఇక్కడ ఎర్రమట్టిని తోడుతున్న కంపెనీలు, వాటి లీజు పరిమితులను పరిశీలించారు. మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు సమీపంలో ఉన్న అన్నపూర్ణ మైనింగ్ కంపెనీ తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ప్రభుత్వ స్థలంలోకి చొరబడి మైనింగ్ జరుపుతున్నట్లుగా వెల్లడైంది. దీనితో ఆగస్టు తొలివారంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారులు ఈ కంపెనీని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల చర్యలతో అటవీశాఖ అధికారులు మల్లంపల్లి ప్రాంతంలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లగా వాసవి మినరల్స్ సంస్థ హద్దులను దాటి అటవీశాఖకు చెందిన స్థలంలో మైనింగ్ చేపడుతున్నట్లుగా తేలింది. దానితో ఆగస్టు 12న అటవీశాఖ అధికారులు వాసవి మినరల్స్ పనులను అడ్డుకుని కేసు నమోదు చేశారు. పది రోజుల రోజుల వ్యవధిలోనే రెండు కంపెనీల కార్యకలాపాలు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో మల్లంపల్లి మైనింగ్ మాఫియాలో కలకలం రేగుతోంది. గడిచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పర్యటన, స్వాతంత్ర దినోత్సవేడుల కారణంగా మైనింగ్ మాఫియాపై దాడుల వేడి తగ్గింది. ఈలోగా వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు మైనింగ్ అక్రమార్కులు తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అప్పనంగా భూమి కొట్టేద్దామని...
రూ.6కోట్ల విలువైన భూమి కబ్జాకు టీడీపీ నేత యత్నం అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం ఆ భూమిజోలికి రావద్దని ప్రభుత్వ పెద్ద ఆదేశం తమవాడేనని మరో {పముఖుడి వత్తాసు ‘ఎన్.జి.జి.ఓస్ కాలనీలో దేవస్థానం భూమి అని చెప్పి ప్రహరీ కడుతున్నారట కదా! అలాంటి పనులు చేయొద్దు. ఆ భూమిని చదును చేస్తోంది మా వాడే. ఎన్నికల్లో నా కోసం పని చేశాడు. ఆ భూమి సంగతి అతను చూసుకుంటాడు. మీరు ప్రహారీ నిర్మాణం ఆపేయండి. - ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పెద్ద ఫోన్ ద్వారా సింహాచలం దేవస్థానం అధికారులకు జారీ చేసిన ఆదేశం. ‘ఆ భూమి దేవస్థానానికి కాదు. మా వాడిదే. నాకు కావా ల్సిన మనిషి. వెంటనే ఆ భూమిలో పనులు నిలిపివేయండి. అంతగా అవసరమైతే సీఎం ఆఫీసు నుంచే చెప్పిస్తా’ - ఇదీ మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన విశాఖ ప్రముఖుడు దేవస్థానం అధికారులకు చెప్పిన మాట. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అయ్యగార్లు ఆదేశిస్తే ఇంకేముందీ!... దేవస్థానం అధికారులు తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేసి మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇంత హడావుడిగా కీలక నేతలు జోక్యం చేసుకుని మరీ కబ్జాకు కాపు కాసిన ఆ భూబాగోతం వివరాలివి..38వ వార్డు పరిధిలో ఎన్.జి.జి.ఓస్కాలనీ పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో సర్వే నంబర్లు 13, 14లతో సింహాచలం దేవస్థానానికి చెందిన దాదాపు 3 ఎకరాలు ఉన్నాయి. అభయ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎదురుగా కొండను ఆనుకుని ఉన్న ఆ భూమి సింహాచలం దేవస్థానానిది. మార్కెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ రూ.6కోట్లపై మాటే. ఆ భూమిపై అదే కాలనీలో నివసించే అధికార పార్టీ ఛోటా నేత కన్ను పడింది. ఆ భూమిని కబ్జా చేసేందుకు ఆయన ఓ ఎత్తుగడ వేశారు. అభయ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి కోనేరు, గోశాల నిర్మాణం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆ కోనేరు కోసమని చెప్పి ఆ భూమిని చదును చేయడం ప్రారంభించారు. కొంత కొంత చొప్పున మొత్తం భూమిని చదును చేసి కలిపేసుకోవాలన్నది ఆయన వ్యూహం. అప్పటికే దాదాపు వెయ్యి గజాల వరకు చదును చేసేశారు. సంబంధం లేదన్న ఆలయ కమిటీ ఆలయం పేరుతో సాగుతున్న ఈ భూ కబ్జా యత్నాన్ని ఆభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ త్వరలోనే గుర్తించింది. ఆ ఆలయ గోశాల కోసం ఇప్పటికే స్థలం ఉంది. కోనేరు నిర్మాణం కోసం ఇటీవల దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావుకు కమిటీ సభ్యులు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆలయం పేరిట ఓ ప్రైవేటు వ్యక్తి సింహాచల దేవస్థానం భూమిని కబ్జా చేస్తుండటంతో కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రక్షణ గోడ నిర్మాణం చేపట్టిన అధికారులు ఈ భూ కబ్జా వ్యవహారం తెలియడంతో సింహాచల దేవస్థానం అధికారులు తక్షణం స్పందించారు. దేవస్థానానికి చెందిన 3 ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఆ గోడల మీద ఆ భూమి దేవస్థానానికి చెందినదని రాయించారు కూడా. కానీ అంతలోనే... మా వాడే... పనులు నిలిపిపేయండి: కీలక నేత ఆదేశం తాను కలిపేసుకోవాలనుకున్న భూమి చూట్టు దేవస్థానం అధికారులు రక్షణ గోడ నిర్మించడం అధికార పార్టీ నేత ఏమాత్రం సంహించలేకపోయారు. దాంతో ఆయన హుటాహుటిన ప్రభుత్వంలో కీలక పెద్దగా ఉన్న తన నియోజకవర్గ ప్రతినిధిగా వద్దకు వెళ్లారు. దాంతో ఆ కీలక నేత సింహాచల దేవస్థానం అధికారులకు ఫోన్ చేశారు. ఆ భూమి చదును చేస్తోంది తన మనిషేనని చెప్పారు. ఎన్నికల్లో తన కోసం ఎంతగానో పనిచేసిన ఆయనకు తాను సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణాన్ని నిలిపివేయలని ఆదేశించారు. అవసరమైతే తాను హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అంతలోనే దేవస్థానం అధికారులకు నగరానికి చెందిన ఓ ప్రముఖుడి నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన ఆ ప్రముఖుడు అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. ‘ఆయన మా సామాజికవర్గానికి చెందినవాడు. గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా కోసం పని చేశాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని చదునుచేసుకుంటుంటే మీరు అడ్డుకోవడం ఏమిటి? ఆ స్థలం ఆయనది అంటున్నాడు. మీరు ప్రహారి నిర్మాణం నిలిపివేయండి. మీరు మాట వినకుంటే నేను సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేయించాల్సి ఉంటుంది’అని హకుం జారీ చేశారు. చేసేదేమీ లేక దేవస్థానం అధికారులు భూమి రక్షణ గోడ నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఆలయ భూమిని కాపాడటానికి తాము యత్నిస్తే ఏకంగా ప్రభుత్వ పెద్దలు, నగర ప్రముఖులు అడ్డుపడటంపై దేవస్థానం అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు ఆదేశించాం: ఈవో ఈ భూ వ్యవహారంపై సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ను ‘సాక్షి ’ సంప్రదించగా ఆ భూమి దేవస్థానానిదేనని చెప్పారు. కొందరి అభ్యంతరాల వల్ల అందులో ప్రహారి నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ భూమి మీద ఏడీ సర్వేకు ఆదేశించామని తెలిపారు. -
మళ్లీ బీపీఎస్?
సీఎం ఆదేశాల నేపథ్యంలో చర్చలు నివాస గృహాలకు వర్తింపజేస్తారనే ఊహాగానాలు సిటీబ్యూరో:నగరంలో మళ్లీ బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అమలులోకిరానుందా?... ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఈవిషయమై చర్చలకు తావిచ్చాయి. ప్రభుత్వ భూముల్లో రక్షణ, భూ కబ్జాలపై చర్యల వంటి అంశాలపై గురువారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, లే ఔట్ రెగ్యులరైజేషన్‌లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. దీంతో బీపీఎస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే బీపీఎస్ మళ్లీ సాధ్యం కాదని, భవిష్యత్‌లో అక్రమ నిర్మాణాలను తిరిగి క్రమబద్ధీకరించబోమంటూ అధికారులు హైకోర్టుకు లిఖితపూర్వకంగా గతంలో తెలియజేసిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో వెలసిన భవనాల క్రమబద్ధీకరణకు మాత్రం మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో కాకుండా కొద్దిపాటి మార్పుచేర్పులతో క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమలులోకి వస్తే గురుకుల్ ట్రస్ట్‌లోని భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. వాణిజ్య భవనాలు, 18 మీటర్లకన్నా ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలకు కాకుండా సాధారణ నివాస గృహాలకు, తక్కువ విస్తీర్ణంలోని వాటికి వర్తించేలా కొత్త మార్గదర్శకాలతో తిరిగి బీపీఎస్ అమలు చేసే అవకాశాలు ఉండవచ్చునని టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఆదాయం కోసమే... నగరంలో అనుమతి పొందిన దానికంటే అదనంగా... అసలు అనుమతి లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. 2007 డిసెంబర్ 31నసంబంధిత జీవో జారీ కాగా...అనేకసార్లు పొడిగిస్తూ 2010 వరకు అవకాశం కల్పించారు. ఆ పథకాన్ని వినియోగించుకునేందుకు మొత్తం 2.05 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన సుమారు 40,440 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,36,700 దరఖాస్తులు బీపీఎస్‌కు అనుగుణంగా ఉన్నందున ఆ భవనాలను క్రమబద్ధీకరించారు. తద్వారా జీహెచ్ఎంసీకి దాదాపు రూ. 800 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు, గ్లోబల్‌సిటీగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు అవసరం. ఈ క్రమంలో నివాస గృహాలు... ప్రభుత్వ భూముల్లోని భవనాలకు బీపీఎస్ అమలు చేయడం ద్వారా కొంతలో కొంతైనా ఆదాయం సమకూర్చుకోవాలనేది సర్కారు మదిలోని ఆలోచనగా తెలుస్తోంది. -
అంజన్నజాగ.. వేశారు పాగా..
పరాధీనంలో ‘ఊళ్లో ఆంజనేయుడు’ రూ.5 కోట్ల ఆలయ భూములు కబ్జా 1.20 ఎకరాల స్థలం అన్యాక్రాంతం తప్పుడు సర్వే నంబర్లతో నిర్మాణాలు పురాణాల్లో బలానికి ప్రతిరూపం ఆంజనేయుడు. ఆయనంతటి శక్తివంతుడు ఇంకెవరూ లేరనేది భక్తుల నమ్మకం. ఇలా.. బలానికి, శక్తికి మారుపేరుగా ఉన్న ఆంజనేయుడి ఆలయ భూములకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ‘ఊళ్లో ఆంజనేయస్వామి’ ఆలయానికి చెందిన రూ.5 కోట్ల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. వరంగల్ :రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హన్మకొండ మచిలీబజార్‌లోని ఊళ్లో ఆం జనేయస్వామి ఆలయ భూములపై కబ్జా దారుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 817లో 1.2 ఎకరాల భూమి ఉంది. వరంగల్ నగరం నడిబొడ్డున భద్రకాళి చెరువు కట్ట కింది భాగంలో ఈ స్థలం ఉంది. ప్రస్తుతం నగరంలోని ఇతర ప్రాం తాలతోపాటు ఇక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆలయానికి చెందిన ఈ భూముల విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. విలువైన ఈ భూములపై కొందరు కన్నేశారు. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి రియల్ వెంచర్‌గా మర్చేశారు. ఆలయూనికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమి ని కబ్జా చేసి అమ్మకానికి పెట్టినా... అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 817 లోని 1.2 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని... పక్కన ఉన్న వేరే సర్వే నంబర్లో ఉన్నట్లుగా పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టినట్లు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులకు చాలా ఫిర్యాదులు అందారుు. అరుునా.. అధికారుల నుంచి కనీస స్పందన కనిపించలే దు. ఆలయానికి చెందిన స్థలంలో నిర్మాణాలు జరుగుతుండడంతో భక్తులకు అనుమానం వచ్చింది. తప్పుడు పత్రాలతో ఆలయ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని, వాటి ని నిలిపివేసి భూములను పరిరక్షించాలని పలువురు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు యం త్రాంగం జోక్యం చేసుకుంది. ఫిర్యాదు అంశా ల్లో స్పష్టత వచ్చేవరకు స్థలంలో నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల తీరు... అనుమానాలు ! ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాత ఆలయ భూముల్లో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపేసినా.... రాత్రివేళల్లో ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెడీమేడ్ పిల్లర్లతో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలపై తాజాగా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులను కలిసినా... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం భూములపై స్పష్టత వచ్చేవరకు ఆగకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. భూములు ఆలయానికి సంబంధించినవా... లేదా... తేల్చే పని చేయాల్సిన అధికారులు ఈ విషయాన్ని పక్కనబెడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు ఆరోపిస్తున్నట్లుగా తప్పుడు పత్రాలతో ఆలయ భూములు కబ్జా చేసి, అమ్మకానికి పెట్టిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. -
భూ కబ్జాను అడ్డుకోండి
జిల్లా కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి గుంటూరు ఈస్ట్: 530 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి చదును చేస్తుంటే అధికారుల చర్యలు తీసుకోకపోవడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణపై ఫిర్యాదులు అందినా స్థానిక తహశీల్దార్, ఆర్డీవో వచ్చామా వెళ్లామా అన్నట్టుగా స్థలాన్ని చూసి మిన్నకుండిపోయారని ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలసి తమ తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొలుత ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు వివరించారు. మాచర్ల మండలం కొత్తపల్లి-ద్వారకాపురి సరిహద్దుల్లో ఎద్దులబోడుగా పిలుచుకునే 530 ఎకరాల బీడు భూమిని 60 ఏళ్లుగా పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కరువు వచ్చినప్పుడు కూడా పశువులను ఈ ఎద్దులబోడే ఆదుకుంటోంది. మూగజీవాల పొట్టకొడుతూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎద్దులబోడును ఆక్రమించి పట్టపగలే పొక్లయిన్ల సాయంతో చదును చేస్తున్నారు. ఈ పరిణామాలకు ఆందోళనకు గురైన రైతులు స్థానిక తహశీల్దారు, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఆక్రమణకు గురవుతున్న ఎద్దులబోడును పరిశీలించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. తక్షణం స్పందించి ఎద్దులబోడుని రక్షించి ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిన్నెల్లి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మాచర్ల మున్సిపాలిటిలోని కాం ట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో మరుగు దొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాకుండా టీడీపీ నేతలు ఎంపీడీవో పై ఒత్తిడి తెస్తున్నా రని ఆరోపించారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులకు నిధులు మంజూరయ్యేలా చూడా లన్నారు. ఇరువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తులకు స్పందించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల వెంట వైఎస్సార్ సీపీ కారంపూడి కన్వీనర్ మేకల శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు దర్శనపు శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. వాటిని కాజేసేందుకు పథకాలు రచిస్తున్నారు. రెవెన్యూశాఖలోని కొందరి బలహీనతలను ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వెనుక వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి స్వార్థానికి ప్రభుత్వభూములే కాకుండా చెరువులు, కుంటలు.. ఆఖరుకు శ్మశానాలు సైతం కరిగిపోతున్నాయి. - అనంతపురం అర్బన్ జాతీయ రహదారి పక్కనున్న భూములే కీలకం రాష్ర్ట విభజన అనంతరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వ భూములపై కొందరు ప్రబుద్ధులు కన్నేశారు. ప్రధానంగా 44వ జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూములను దక్కించుకునేందుకు తెగబడుతున్నారు. ఈ వ్యవహారం వీఆర్ఓలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో వారు సైతం కబ్జాదారులకు అండగా నిలిచి, అవరసమైన రికార్డులు పూర్తి చేసి ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 3.76 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. 2004కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా సుమారు 75 వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టింది. అదే ప్రభుత్వ హయాంలో 2010-14 మధ్య మరో ఆరు వేల ఎకరాలను ఇతరుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. 20 వేల ఎకరాలకు పైగా కబ్జా రాప్తాడు నుంచి పెనుకొండ వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇటీవల 20 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. కనగానపల్లి మండలం దాదలూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బీ భూమిని చింత వనం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే అదే సర్వే నంబర్లో దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ముక్తాపురానికి చెందిన ఓ వ్యక్తికి ధారాదత్తం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఏడాదిగా దాదాలూరు పంచాయతీకి వీఆర్ఓ లేకపోవడంతో ముక్తాపురం వీఆర్ఓను ఇన్చార్జిగా నియమించారు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినందుకు ఇన్చార్జి వీఆర్ఓపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమిత చింతవనంలో గోరు చిక్కుడు పంటను సాగు చేస్తుండడం గమనార్హం. ఇలా కాజేస్తున్నారు.. వీఆర్ఓలు కొంతమంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు ఒక ఎకరాకు రూ. 10 వేలు నుంచి రూ. 20 వేల వరకు తీసుకుని ఒక్కొక్కరి పేరుతో మూడు నుంచి ఐదు ఎకరాలకు పాత తేదీలలో ఫోర్జరీ సంతాకాలతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. రహదారులు, జాతీయ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒక ఎకరానికి రూ. 50వేలు నుంచి రూ. 60 వేల వరకు తీసుకుని పలుకుబడి ఉన్న నాయకులకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల, ఓడీసీ, అమడగూరు, కూడేరు, నార్పల, మండలాల్లో ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలు కబ్జాకు గురైయింది. ఈ కబ్జాకు గురైన భూమిపై వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒకసారి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ జారీ చేస్తే ఆ భూమి రెట్టింపు ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వ భూముల కబ్జాలతో కొంతమంది వీఆర్ఓలు కోట్లకు పడగలెత్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు. -
నీతికి నీళ్లు
అటకెక్కిన ‘పారదర్శక పాలన’ ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై భూ అవినీతి ఆరోపణలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొటున్న డీకేశీ, మహదేవ ప్రసాద్, ఖమరుల్ ఇస్లాం తాజాగా ఆ జాబితాలో చేరిన దినేష్ గుండూరావు పారదర్శక పాలన అందిస్తాం .. క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే మంత్రి వర్గంలో చోటిస్తాం... అని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ వాగ్దానాలను పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా మంత్రులు కూడా భూముల డీనోటిఫికేషన్, భూముల కబ్జా, ఇసుక అక్రమ రవాణా.. ఇలా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు కూడా ఆ జాబితాలో చేరారు. బెంగళూరు : కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సారధిగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఆర్కావతి లే అవుట్‌లోని బీడీఏ స్థలాల డీనోటిఫికేషన్‌కు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో భూ అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని బెన్నిగానహళ్లిలో నాలుగు ఎకరాల భూముల డీనోటిఫికేషన్ పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే లోకాయుక్త విచారణ కొనసాగుతోంది. అంతేకాక బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్టక్చర్ కారిడార్‌లో అక్రమాలు, అక్రమ మైనింగ్ వంటి అనేక ఆరోపణలు డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ తనకు సొంత భూములు లేవని కర్ణాటక హౌసింగ్ బోర్డ్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను అందజేసి చామరాజనగరలో భూములను సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై లోకాయుక్త పోలీసులు విచారణ చేపట్టారు. మహదేవ ప్రసాద్‌కు మైసూరులో సొంత భూములున్నాయని లోకాయుక్త పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 30న మైసూరు జిల్లా కోర్టుకు నివేదికను అందజేశారు. ఇక రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం సైతం వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా గుండూరావు భూ అవినీతికి పాల్పడిన మంత్రుల జాబితాలో తాజాగా రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు సైతం చేశారు. యలహంక ప్రాంతంలోని నవరత్న అగ్రహార వద్ద 10.9 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి దినేష్ గుండూరావు ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించుకున్నారని యలహంక తహసీల్దార్ బాళప్ప లోకాయుక్తకు నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. దీంతో పారదర్శక పాలన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూ బకాసురులు, అవినీతి పరులతోనే మంత్రి వర్గాన్ని నింపుకుందని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై పోరాటానికి సన్నద్ధమవుతున్నట్లు హెచ్చరికలు సైతం జారీచేసింది. కాగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భూ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్వాసన పలకుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాలు
వాకాడు: రెవెన్యూ అధికారుల అండతోనే మండలంలో భూ కబ్జాలు పెరిగాయని ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ‘నిరుపేదలు మూడు పూటల కడుపునిం డా అన్నం తింటారని సదుద్దేశంతో ప్రభుత్వం విడతల వారీగా భూపంపిణీ చేపట్టింది. అయితే కొందరు భూ బకాసురులకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. వారు రెవెన్యూ అధికారుల అండతో వందల ఎకరాలను ఆక్రమించి రొయ్యల గుంతలు చేసుకుని అనుభవిస్తున్నారంటూ’ గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ధ్వజమెత్తారు. ఆక్రమణలకు గురైన భూముల వివరాలను యర్రగాటిపల్లి సర్పంచ్ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు అందజేశారు. ఇంత దారుణమా? భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే పాశం స్పం దించారు. ఇంత దారుణం తాను ఎక్క డా చూడలేదన్నారు. భారీ ఎత్తున భూకబ్జాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకివాకంలో పేదలకిచ్చిన వెయ్యి ఎకరా లు ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దాదాపు 5,600 ఎకరాలు భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్నాయన్నారు. పేదోళ్ల భూ ములంటే అంత చులకనా? ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరై ఉపేక్షించేది లేదన్నారు. వారి భూ బాగోతం త్వరలో నే బయట పెట్టి పేదోళ్లకు తిరిగి భూ ములు అప్పగిస్తామన్నారు. సర్వే చేపట్టి నెల రోజుల్లో ఆక్రమణదారులను గు ర్తించాలని తహశీల్దార్‌కు సూచించారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడండి కోట: చల్ల కాలువ పొర్లుకట్టల మరమ్మతు పనులు నాణ్యతగా జరిగేలా చూ డాలని అధికారులకు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ సూచించారు. గురువా రం ఆయన పొర్లుకట్టలను పరిశీలించారు. రూ.42 కోట్ల నిధులతో గూడలి నుంచి కొత్తపట్నం వరకు 16 కిమీ చల్ల కాలువకు రెండు వైపులా కట్టలను ఆధునికీకరిస్తున్నారు. వరదలు వస్తే కట్టలు కోతకు గురికాకుండా పటిష్టంగా నిర్మిం చాలన్నారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. పనుల వివరాలను తెలియజేయకపోవడంపై ఇరిగేషన్ అధికారులను మందలించారు. కల్వర్టులు నిర్మించేటప్పుడు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటనారాయ ణ, ఉపాధ్యక్షుడు మధుయాదవ్, తిన్నెలపూడి సర్పంచ్ శ్రీనివాసులు, కొత్తపట్నం ఎంపీటీసీ సభ్యుడు తిరుపాల య్య, ఏఈలు నిరంజన్, మురళీ ఉన్నారు.