వాకాడు: రెవెన్యూ అధికారుల అండతోనే మండలంలో భూ కబ్జాలు పెరిగాయని ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ‘నిరుపేదలు మూడు పూటల కడుపునిం డా అన్నం తింటారని సదుద్దేశంతో ప్రభుత్వం విడతల వారీగా భూపంపిణీ చేపట్టింది. అయితే కొందరు భూ బకాసురులకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించారు.
వారు రెవెన్యూ అధికారుల అండతో వందల ఎకరాలను ఆక్రమించి రొయ్యల గుంతలు చేసుకుని అనుభవిస్తున్నారంటూ’ గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ధ్వజమెత్తారు. ఆక్రమణలకు గురైన భూముల వివరాలను యర్రగాటిపల్లి సర్పంచ్ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు అందజేశారు.
ఇంత దారుణమా?
భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే పాశం స్పం దించారు. ఇంత దారుణం తాను ఎక్క డా చూడలేదన్నారు. భారీ ఎత్తున భూకబ్జాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకివాకంలో పేదలకిచ్చిన వెయ్యి ఎకరా లు ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దాదాపు 5,600 ఎకరాలు భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్నాయన్నారు.
పేదోళ్ల భూ ములంటే అంత చులకనా? ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరై ఉపేక్షించేది లేదన్నారు. వారి భూ బాగోతం త్వరలో నే బయట పెట్టి పేదోళ్లకు తిరిగి భూ ములు అప్పగిస్తామన్నారు. సర్వే చేపట్టి నెల రోజుల్లో ఆక్రమణదారులను గు ర్తించాలని తహశీల్దార్‌కు సూచించారు.
పనులు నాణ్యతగా జరిగేలా చూడండి
కోట: చల్ల కాలువ పొర్లుకట్టల మరమ్మతు పనులు నాణ్యతగా జరిగేలా చూ డాలని అధికారులకు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ సూచించారు. గురువా రం ఆయన పొర్లుకట్టలను పరిశీలించారు. రూ.42 కోట్ల నిధులతో గూడలి నుంచి కొత్తపట్నం వరకు 16 కిమీ చల్ల కాలువకు రెండు వైపులా కట్టలను ఆధునికీకరిస్తున్నారు. వరదలు వస్తే కట్టలు కోతకు గురికాకుండా పటిష్టంగా నిర్మిం చాలన్నారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు.
పనుల వివరాలను తెలియజేయకపోవడంపై ఇరిగేషన్ అధికారులను మందలించారు. కల్వర్టులు నిర్మించేటప్పుడు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటనారాయ ణ, ఉపాధ్యక్షుడు మధుయాదవ్, తిన్నెలపూడి సర్పంచ్ శ్రీనివాసులు, కొత్తపట్నం ఎంపీటీసీ సభ్యుడు తిరుపాల య్య, ఏఈలు నిరంజన్, మురళీ ఉన్నారు.
రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాలు
Published Fri, Nov 7 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement