సాక్షి, హైదరాబాద్: మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్‌ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. మ్యాప్స్ కంపెనీ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన అధికారులు.. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు.
ఎర్రగుంట చెరువును ఆక్రమించి చేసి బహుళ అంతస్తుల భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్‌పై కేసులు నమోదు చేశారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణఫై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment