revenue officers
-
మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తిచేసి.. గతంలో రెవె న్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు.గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టనున్నారు. అయి తే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభు త్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు. ఇబ్బందులు రాకుండా ప్రణాళిక.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్వోలు, వీఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి వెళ్లిన వారిలో డిగ్రీ, ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష (రెవెన్యూ సేవలే సిలబస్‌గా) నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నేడు వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం పూర్వ వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం ఆదివారం శామీర్‌పేట మండలంలోని తూంకుంట గ్రామంలో జరగనుంది. తెలంగాణ వీఆర్వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో... గ్రూప్–4 ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. -
మళ్లీ హైడ్రా పంజా
పటాన్చెరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలలో భవంతులను నేలమట్టం చేశారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారుల నివేదిక మేరకు హైడ్రా అధికారులు ఆయా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. కిష్టారెడ్డిపేట్‌లో మూడు పెద్ద భవనాలను, పటేల్‌గూడలో 22 విల్లాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. కూల్చివేతల కోసం భారీ క్రేన్లను వినియోగించారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్నారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటేల్‌గూడలో విల్లాలు నిర్మించిన యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయితే తాము ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తహసీల్దార్ రాధ ఆయనకు వివరించారు. విల్లాల నిర్మాణానికి సర్వే నంబర్ 6 పరిధిలో అనుమతులు తీసుకొని సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్నట్లు గుర్తించామని ఆమె స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి కోర్టు స్టే ఆర్డర్ కూల్చివేతల ప్రక్రియలకు అడ్డుకాదని చెప్పారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో మూడు భవంతుల నిర్మాణాలు జరిగాయని, వాటిని కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేశారని వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. కూల్చివేత ప్రక్రియకు ముందే హైడ్రా, రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని పరిశీలించి కూల్చివేతలకు ఉపక్రమించారు. సామాన్య ప్రజలకు, పరిసర నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేతల్లో ఒక డాక్టర్ భవనం కూడా ఉండటం గమనార్హం. మరో భవనం ఏపీలోని ఒక ఎమ్మెల్యేకు సంబంధించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పాట్లను కొనుగోలు చేసి నిర్మాణాలు చేశామే తప్ప.. కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించలేదని వాదిస్తున్నారు. మరిన్ని కూల్చివేతలు.. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కిష్టారెడ్డిపేట్ పరిసర గ్రామాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నిర్మాణాల కూల్చివేతకు అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. పొరుగు గ్రామాల ప్రభుత్వ భూముల్లో కిష్టారెడ్డిపేట్ పంచాయతీ అనుమతులతో జరిగిన నిర్మాణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి హైడ్రాకు నివేదిక ఇచ్చి నట్టు సమాచారం. -
‘హైడ్రా’ సిఫార్సులు.. మియాపూర్‌లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ కొరడా
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. మ్యాప్స్ కంపెనీ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన అధికారులు.. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు.ఎర్రగుంట చెరువును ఆక్రమించి చేసి బహుళ అంతస్తుల భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్పై కేసులు నమోదు చేశారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసులు నమోదయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణఫై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమరావతిలో భూమాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ.. ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.అక్రమంగా లబ్ధి పొందేందుకే..! అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇదీ పాత కథ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది. తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది. అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.ఆ భూములకు రైతులే లేరు సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు -
బుల్కాపూర్ నాలా మాయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న బుల్కాపూర్ నాలాను మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి తేజ, ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ లింగంలు సందర్శించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా.. కబ్జాకు గురైన బుల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటు వైపు వెళ్తోంది? ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది? ఎవరి కబ్జాలో ఉంది? వంటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. శంకర్పల్లి–ఖానాపూర్ రోడు్డలో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలావరకు కన్పించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్లు 2020 జూన్‌లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఫాంహౌస్ తూర్పు భాగంలో, నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయా విభాగాల అధికారులు బుధవారం మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. గతంలో రేవంత్‌పై కేసు, అరెస్టు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్ సందర్శనకు వెళ్లారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివసిస్తున్న ఈ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇటీవల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఇదే క్రమంలో జన్వాడ ఫాంహౌస్‌కు నోటీసులు జారీ చేయగా, హైడ్రా చర్యలను ఆపాల్సిందిగా కోరుతూ కేటీఆర్ సన్నిహితుడు బి.ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి. ⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది. ⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ సీజన్ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి. ⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి. ⇒ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి. ⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి. ⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది. ⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి. ⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి. -
‘రింగు’ భూసేకరణలో వందల ఎకరాలు మిస్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు 460 ఎకరాలను మరిచిపోయారు. అలైన్మెంట్ పరిధిలోని ఆ భూమిని భూసేకరణ జాబితాలో చేర్చకుండానే పరిహారం పంపిణీ అవార్డులు పాస్ చేసే కసరత్తు చేపట్టారు. విషయం తెలిసి ఇప్పుడు ఆ మరిచిపోయిన భూమిని సేకరించేందుకు హడావుడి మొదలుపెట్టారు. అందుకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేశారు. మిగతా భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ల తంతు పూర్తి చేసిన 8 నెలల తర్వాత ఇప్పుడు ఈ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. రీజనల్ రింగురోడ్డులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూములు ఇక రీజినల్ రింగురోడ్డు కోసం ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వ అదీనంలోకి వచ్చాయంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. భూపరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు గ్రామాలవారీగా అవార్డులు పాస్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా భూముల వివరాలు పరిశీలిస్తుండగా అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూముల్లో కొన్ని భూసేకరణ తుది జాబితాలోంచి మిస్ అయ్యాయని అధికారులు గుర్తించారు. నర్సాపూర్ ‘కాలా’ పరిధిలో 360 ఎకరాలు, గజ్వేల్ ‘కాలా’ పరిధిలో మరో 100 ఎకరాలు ఇలా గల్లంతైనట్లు తేల్చారు. అయినప్పటికీ గతేడాది భూసేకరణకు సంబంధించి రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆ గెజిట్ నోటిఫికేషన్ల గడువు కూడా తీరిపోయింది. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ల జారీ సేకరించాల్సిన భూములను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇందులో 3ఏ, 3డీలు కీలకమైనవి. గ్రామం పేరు, సర్వే నంబర్లు, భూమి పరిమాణం వివరాలు తెలుపుతూ మూడు రోజుల క్రితం 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. నర్సాపూర్, గజ్వేల్ కాలాలకు సంబంధించి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. వీటిపై అభ్యంతరం ఉన్న వారు 21 రోజుల్లో తమ అభ్యంతరాలను ఆయా ‘కాలా’లకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత భూ యజనమానుల పేర్లతో 3డీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తేగానీ ఆయా గ్రామాల్లో భూసేకరణకు వీలుండదు. ఇలా ఇంకేమైనా గ్రామాల్లోనూ భూముల వివరాలు గల్లంతయ్యాయేమోనని అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. -
భూమి రికార్డుల్లో నమోదు కాలేదని..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 76 సర్వే నంబర్లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్‌ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు. అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో.. రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. -
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్‌లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
‘పట్టా’లు తప్పారు!
హుస్నాబాద్ రూరల్: తాతలు, తండ్రులు కట్టిన ఇళ్లు 12...చనిపోయిన వారి సమాధులు 18... ఒక వ్యవసాయ బావి, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే పైప్‌లైన్. ఇవన్నీ కాకుండా 1984 నుంచి ఆ భూముల్లో కబ్జాలోనే ఉంటూ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు ఇవేమీ కనిపించలేదు. మోక (పొజిషన్) విచారణ జరపలేదు. కబ్జాలో ఎవరు ఉన్నారో తెలుసుకోలేదు. ధరణిలో కబ్జా కాలమ్ తొలగించడంతో పాత పట్దాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. దీనిని పసిగట్టిన కొందరు స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, సాదాబైనామాలు సృష్టించి 2021లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో సర్వే నంబర్ 250లో 2.00 ఎకరాలు, 263లో 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది పట్టా చేయించుకున్నారు. మోక మీద రాజయ్య కుటుంబ సభ్యులే ఉన్న విషయమూ రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బోగస్ సాదాబైనామాలు సృష్టించి నలుగురు పేరున పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మోక చూడకుండానే పట్టా మార్పిడి.. భూ రికార్డుల మార్పు సమయంలో రెవెన్యూ అధికారులు మోక(పొజిషన్) విచారణ జరిపాక పట్టా చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు. ఒకరు మోక మీద ఉంటే మరొకరి పేరున పట్టా చేశారు. దీనివల్ల 250లో సర్వే నంబర్లో రక్బా తక్కువ వస్తుంది. మోక మీద ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు లేవు, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు పొందినవారికి మోక మీద భూమి లేదు. మా తాత ఇల్లు కట్టిన భూమి మాది కాదంటున్నారు యాబై ఏళ్ల క్రితమే మా తాత ఇల్లు కట్టాడు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది కాదని ఎవరో అమ్మారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సర్వేనంబర్ 250లో రెండు ఎకరాలు, 263 సర్వేనంబరులో 1.30 ఎకరాల్లో మా తాత కాలేష్ రాజయ్యనే పహాణీలో, కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మా వారికి పట్టా మారిన సంగతి తెలియదు. మేమంతా మా అయ్యలు చూపించిన భూములనే దున్నుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములు మావి కావంటే ఎలా? మోక విచారణ జరిపించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పాస్‌పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. – కాలేష్ రాజేశ్, పోతారం(ఎస్) మా తాతల సమాధులను పట్టా చేశారు 1980లోనే 250 సర్వే నంబరులో మా తాతల సమాధులు కట్టాం. ఒకటి కాదు రెండు కాదు 18 సమాధులు ఉన్నాయి. వ్యవసాయ బావి, మా ఇళ్లకు కరెంట్ మీటర్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నుంచి తాగునీరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూములు కావాలంటే ఎలా? 50 ఏళ్ల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతికినోళ్లం...ఇప్పుడు భూమి లేదంటే ఎక్కడకు పోవాలి. మా పాత రికార్డులను పరిశీలించి మోక విచారణ జరిపి మా భూములకు పట్టాలు ఇవ్వాలి. – కాలేష్ శివకుమార్, పోతారం(ఎస్) విచారణ జరిపిస్తాం పోతారం(ఎస్) దళిత కాలనీ పేదల భూముల విషయమై మోక విచారణ జరిపిస్తాం. అదే సర్వే నంబర్లో పేదల ఇళ్లు ఉంటే పట్టాదారుల పాసు పుస్తకాలు రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు నివేదిస్తాం. – రవీందర్‌రెడ్డి, తహసీల్దార్,హుస్నాబాద్ -
నలుగురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన స్థానిక తహసీల్దార్ సీహెచ్ కృష్ణారావు, డీటీ జి.జగదీశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఎం శేషాచలం, పన్నూరు గ్రామ వీఆర్వో డి.శివారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మర్రిపూడి మండలంలోని పన్నూరులో సర్వే నంబర్ 12–2, 169–1, ఇతర సర్వే నంబర్లలో 143.29 ఎకరాల పట్టా భూమికి ఆ గ్రామ వీఆర్వోతో పాటు ఆర్ఐ కలిసి రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఫ్యామిలీ ట్రీ అనే ఒక పత్రం తయారు చేసి అసలైన వారసులకు కాకుండా సంబంధం లేని 65 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందుకు సిఫారసు చేశారు. అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డీటీ జగదీశ్వరరావు కూడా పూర్తిగా పరిశీలించకుండా పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుత తహసీల్దార్ కృష్ణారావు కూడా వాటిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన భూముల్లో 71.75 ఎకరాలను వారం రోజుల్లోనే వీఆర్వో శివారెడ్డి బంధువుల పేర్లమీద రిజి్రస్టేషన్ చేశారు. దీనిపై హక్కుదారులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు భూముల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు వెళ్తున్నందున రెవెన్యూ అధికారులంతా కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం అంశంపై కనిగిరి ఆర్డీవోతో విచారణ చేపట్టిన కలెక్టర్..ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం భూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. ఆ భూములకు సంబంధించి 91 మంది వారసులు ఉండగా, వీఆర్వో శివారెడ్డి తన బంధువుల పేర్ల మీద అక్రమంగా రిజి్రస్టేషన్ చేయించుకున్నారని, అందుకు మిగతా రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి సహకరించారని తేలడంతో నలుగురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
అన్ని కోర్టుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తారేమో!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆవరణలో సదరు భూమి ప్రభుత్వానిదని పేర్కొంటూ నోటీసు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అన్ని కోర్టుల్లోనూ ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తారేమో అని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేలా సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం సికింద్రాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో ‘ఈ భూమి ప్రభుత్వానిది’ అంటూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై అందిన ఒక లేఖను హైకోర్టు సుమోటో టేకెన్ అప్ రిట్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీపీ మతీన్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. ‘సికింద్రాబాద్ సివిల్ కోర్టు ప్రాంగణంలో నోటీసు బోర్టు ఎవరు ఏర్పాటు చేశారు? వారు రేపు హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలి. ఇవాళ సివిల్ కోర్టులో ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో హైకోర్టు ఆవరణలో కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న విచారణ సందర్భంగా.. నోటీసు బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), హైదరాబాద్ కలెక్టర్, సీపీ, మారేడుపల్లి తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా వారు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
రోల్‌మోడల్‌గా మన ‘రీ సర్వే’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే ప్రాజెక్టు విజయవంతమవడంతో వివిధ రాష్ట్రాలు దాన్ని బెస్ట్ ప్రాక్టీస్‌గా తీసుకుంటున్నాయి. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వం ఏపీ రీసర్వేపై తమ రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించింది. డైరెక్టరేట్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగాధికారులతో భూమి రికార్డులకు సంబంధించిన అంశాలపై సోమవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో ఆధునిక భూముల సర్వే అనే అంశంపై ఏపీ ప్రభుత్వం తరఫున సర్వే సెటిల్మెంట్ శాఖలో పనిచేస్తున్న సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రోన్లు, విమానాలతో ఆధునిక రీతిలో రాష్ట్రంలోని 1.25 చదరపు కిలోమీటర్ల ఏరియాలో రీ సర్వే జరుగుతున్న విధానం, ఇప్పటికే 2 వేల గ్రామాల్లో విజయవంతంగా రీ సర్వే పూర్తి చేసి ఆ గ్రామాలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తేవడం, అక్షాంశాలు, రేఖాంశాలతో రైతుల హద్దులు నిర్ధారించడం.. వారి భూముల్లో హద్దురాళ్లు పాతడం, 7 లక్షల మందికిపైగా రైతులకు హక్కు పత్రాలు పంపిణీ, 20 వేలకుపైగా భూ వివాదాలను పరిష్కరించడం వంటి పలు అంశాలను ఆయన ఈ వర్క్‌షాప్‌లో వివరించారు. దేశ చరిత్రలో బ్రిటీష్ ప్రభుత్వం తర్వాత తొలిసారి భూములను రీ సర్వే చేయడం వల్ల ఎదురైన సవాళ్లు, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లిన విధానం, ప్రతి భూ కమతానికి ఆధార్ నంబర్లా విశిష్ట సంఖ్యను కేటాయించడం వంటి విషయాలను విశ్లేషించి చెప్పారు. రీ సర్వే ద్వారా రైతులకు వారి భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడమేకాకుండా రాళ్లు పాతడం ద్వారా రక్షణ కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో జరుగుతున్న భూముల రీ సర్వే దేశానికే మోడల్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదని, ఏ రాష్ట్రమైనా భూమి రికార్డుల నిర్వహణ, రీ సర్వేలో కచ్చితంగా ఏపీ వైపు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి చెందిన బీఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ (బీఎన్వై–సీఆర్ఎస్) ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్సెస్లు వివిధ రాష్ట్రాల్లో భూ పరిపాలన, నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వడం, విధానపరమైన సిఫారసులు చేసే బాధ్యతను(బీఎన్వై–సీఆర్ఎస్)కి అప్పగించింది. ఈ సెంటర్ ఏపీలో రీసర్వేను బెస్ట్ ప్రాక్టిస్‌గా గుర్తించడమేకాకుండా ఇందుకు వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్‌గా సిఫారసు చేస్తోంది. అందులో భాగంగానే పలు రాష్ట్రాలకు భూముల వ్యవహారాలపై అవగాహన, రీ సర్వే గురించి శిక్షణ ఇచ్చేందుకు ఏపీ అధికారులను ఆహ్వానిస్తోంది. గత నెలలో ఉత్తరాఖండ్ అధికారులకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఇలాగే ఏపీ అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పించగా, తాజాగా పుదుచ్చేరి వర్క్‌షాప్‌లోనూ ఏపీ రీ సర్వేను ఒక టాపిక్‌గా పెట్టి దానిపై అవగాహన కల్పించింది. -
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
కలెక్టరేట్‌పై దంపతుల ఆత్మహత్యాయత్నం
జనగామ: తమ తాతనుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌పైకి ఎక్కి ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా వీరు ఈ సమస్యపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది మూడోసారని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, రేవతి దంపతులు బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏలుబాకకు వెళ్లారు. అక్కడ నర్సింగారావు కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, గ్రామంలో తమ తాత నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అప్పటి తహసీల్దార్ రమేశ్, వీఆర్ఓ క్రాంతి అదే గ్రామానికి చెందిన కొందరి పేరిట రిజస్ట్రేషన్ చేశారని నర్సింగారావు ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని తెలిపారు. కలెక్టర్‌ను కలిసి..: నర్సింగారావు దంపతులు ఉదయం 11 గంటల తర్వాత గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లనుంచి తమ సమస్య పరిష్కారంకోసం తిరుగుతున్నామని, త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తున్నా.. కొంత ఆలస్యం జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి’అని సమాధానం చెప్పారు. అయితే ఓపిక నశించిన ఆ దంపతులు కలెక్టరేట్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సింగారావు దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని.. తాము చచ్చిపోతున్నామని, ఇక్కడ న్యాయం జరగదని అరవడంతో అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులు, జనం గంటసేపు వారిని బతిమిలాడారు. చివరికి పై నుంచి ఆ దంపతులపై నీళ్లు పోయగా, అక్కడే ఉన్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకుని కిందకు తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ వారితో మాట్లాడారు. పట్టా రద్దు వ్యవహారం కోర్టు ద్వారా రావాల్సి ఉందని.. తమ చేతుల్లో లేదని, కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని దంపతులకు చెప్పి పంపించారు. -
వీఆర్వో, తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ.. పక్కా ప్లాన్‌తో భూమి దొంగ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీఆర్వో, తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి విలువైన స్థలాన్ని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. తీరా స్థల యజమానికి విషయం తెలిసి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన తమ్మా వినోద్‌రెడ్డికి ఆర్ఎస్ నంబర్ 64–3లో 25 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఆ స్థలం తన తల్లికి వీలునామా ద్వారా సక్రమించింది. మచిలీపట్నానికి చెందిన స్థలాల బ్రోకర్ అలీ.. తమ్మా వినోద్‌రెడ్డికి చెందిన స్థలాన్ని అమ్మి పెడతానని చెప్పాడు. అయితే రేటు వద్ద తేడా రావడంతో స్థలానికి సంబంధించిన డీల్ ఆగిపోయింది. అయితే ఆ స్థలంపై కన్నేసిన అలీ.. దాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పామర్రు, గుడివాడలోని ఇద్దరు విలేకరుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించాడు. వారికి అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లు సమాచారం. దీంతో వారు వీఆర్వో, తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి స్థలం అలీదేనని, సర్టిఫికెట్లు తయారు చేశారు. పిత్రార్జితం, ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం చేతులు తడిపాడు. పామర్రుకు చెందిన స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకుండా గుడివాడలో చేయించారు. పామర్రు రిజిస్ట్రార్ సైతం ఓకే చెప్పడంతో గుడివాడ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు ముగిసింది. తర్వాత ఆ స్థలాన్ని అలీ మళ్లీ పామర్రుకు చెందిన ఇద్దరికి కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడు. స్థలం కొనుగోలు చేసిన వారు సంబంధిత స్థలంలో పూజలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న స్థల యజమాని.. ఆరా తీయగా, రెండు నెలల కిందటే తమ పేర్న రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ డాక్యుమెంట్లు చూపారు. దీంతో ఉలిక్కిపడ్డ వినోద్‌రెడ్డి పామర్రు ఎస్ఐ అవినాష్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. స్థలం యజమాని తనకు ఫిర్యాదు చేయగానే సంతకాన్ని పరిశీలించి.. ఫోర్జరీ చేశారని నిర్థారించుకుని వెంటనే పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పామర్రు తహశీల్దార్ భరత్‌రెడ్డి చెప్పారు. -
రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారని కోళ్లబైలు గ్రామస్తులు గత సోమవారం స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్డీవో ఎం.ఎస్.మురళి తక్షణమే స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన కోళ్లబైలు సర్వే నంబర్లు 889/5లోని 1.11 ఎకరాలు, 891/1లోని 0.62 సెంట్ల భూమికి జారీ చేసిన పట్టాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ భూమిలోకి ప్రవేశిస్తే చట్టప్రకారం శిక్షార్హులుగా పేర్కొన్నారు. అయితే అప్పటికే సదరు స్థలంలో ఆక్రమణదారులు అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అంతటితోనే నిలిపేయాలని హెచ్చరించారు. -
గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు
సాక్షి, అమరావతి: భూముల సర్వే సేవలను మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మండల సర్వేయర్ల చేతిలో ఉన్న ఎఫ్ లైన్ పిటిషన్ల (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు వంటివాటిపై వచ్చే దరఖాస్తులు) బాధ్యతను గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. రీ సర్వే నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవడానికి, సాధారణంగా సర్వే వ్యవహారాల్లో జరిగే జాప్యాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో తమ భూమికి సంబంధించి హద్దుల్లో ఏమైనా తేడాలు వచ్చినా, విస్తీర్ణంలో తప్పులు చోటుచేసుకున్నా, ఇతరత్రా తమ భూమి గురించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా భూ యజమానులు సర్వేకోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనిని రెవెన్యూ పరిభాషలో ఎఫ్ లైన్ పిటిషన్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు ఈ సర్వే బాధ్యతను మండల సర్వేయర్లు నిర్వర్తించేవారు. మండలానికి ఒక్కరే సర్వేయర్ ఉండడం, పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తుండడంతో సర్వే తీవ్ర జాప్యమవుతుండేది. భూముల రీ సర్వే సందర్భంగా ఎఫ్ లైన్ పిటిషన్లలో జాప్యాన్ని గుర్తించారు. ఇకపై పిటిషన్లు నేరుగా గ్రామ సర్వేయర్ల లాగిన్‌కు... ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను మండల సర్వేయర్ల నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల వెబ్సైట్ ద్వారా వచ్చే ఎఫ్ లైన్ దరఖాస్తులు ఇకపై నేరుగా గ్రామ సర్వేయర్ లాగిన్‌కు చేరతాయి. సర్వేకు నోటీసులు జారీచేయడం, సర్వే నిర్వహించడం, ఆ వివరాలతో నివేదిక తయారు చేసి డిప్యూటీ తహసీల్దార్‌కు పంపడం వంటి పనులన్నీ ఇకపై గ్రామ సర్వేయర్లే చేస్తారు. డిప్యూటీ తహసీల్దార్ ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ డిజిటల్ లాగిన్ నుంచే సర్వే ఎండార్స్మెంట్ జనరేట్ అవుతుంది. గ్రామ సర్వేయర్లు నిర్వహించే సర్వేపై మండల సర్వేయర్లు మొదటి అప్పిలేట్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎఫ్ లైన్ పిటిషన్‌తో నిర్వహించే సర్వే సమయాన్ని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ప్రజల చెంతకే.. భూముల సర్వే సేవలు ప్రజలకు చేరువకావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండే మండల సర్వేయర్ల వద్దకు భూయజమానులు వెళ్లాల్సి ఉండేది. ఇకనుంచి తమ గ్రామంలోని సచివాలయంలో పనిచేసే సర్వేయర్లే ఈ పని చేయనున్నారు. దీనిద్వారా సర్వేలో జాప్యం తగ్గడంతోపాటు భూయజమానులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పుతుంది. భూముల రీ సర్వే సందర్భంగా వచ్చే ఎఫ్ లైన్ పిటిషన్లపైనా ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ పిటిషన్లను ఇష్టానుసారం తిరస్కరించకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరస్కరించిన దరఖాస్తుల్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారుల స్థాయిలో పూర్తిగా పరిశీలించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశాలిచ్చారు. -
2,783 గ్రామాల్లో డీజీపీఎస్ పరికరాలతో రీ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా 70 సీవోఆర్‌ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది. శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 189 మండలాల్లో 2,783 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను రీ సర్వే చేయాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 1,809 గ్రామాల్లో సిగ్నల్స్ అందడంలేదని గుర్తించారు. మొత్తం 2,783 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా డీజీపీఎస్ ద్వారా రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అత్యధిక గ్రామాలున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్యాకేజీ–1కి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విశాఖకు చెందిన జియోకాన్ సర్వేస్, విశాఖకు చెందిన సిల్వర్ టెక్నో సొల్యూషన్స్ కంపెనీలు ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరుగ్రామాల్లో కొద్దిరోజుల కిందట ప్రయోగాత్మక సర్వేని విజయవంతంగా నిర్వహించాయి. రెండురోజుల కిందట ఈ గ్రామాల్లో డీజీపీఎస్ సర్వేను ప్రారంభించాయి. మిగిలిన మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. -
రీ సర్వే కోసం ఆధునిక శిక్షణ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక శిక్షణ అందిస్తోంది. ఏపీ సర్వే అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్మెంట్ శాఖలో పనిచేస్తున్న 94 మందిని ఎంపిక చేసి డ్రోన్ పైలట్ సర్వే, డ్రోన్ డెస్టినేషన్ సర్వేల్లో ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ అందించింది. గురుగాం సంస్థ ద్వారా 35 మందికి, ట్రినిటీ సంస్థతో 53 మందికి, సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఆరుగురికి డ్రోన్ పైలట్ సర్వేలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తీసుకున్న వారిని 26 జిల్లాల్లో డ్రోన్ పైలట్, కో పైలట్లుగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే వీరి ద్వారా.. ఆయా జిల్లాల్లోని మండలాల వారీగా పలువురిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లో ఒక్కో ట్రైనర్ ఉండేలా.. గ్రామ సర్వేయర్లలో 679 మందిని ఎంపిక చేశారు. క్యూ–జీఐఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ల్యాండ్ పార్సిల్ మ్యాప్, గ్రామ మ్యాప్‌లు రూపొందించే వీరికి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ అందించారు. ఆయా మండలాల్లోని మిగిలిన సర్వేయర్లకు కూడా డ్రోన్ పైలట్, డెస్టినేషన్ సర్వేలపై వీరు శిక్షణ ఇస్తున్నారు. వీరందరి ద్వారా ప్రస్తుతం డ్రోన్ సర్వే వేగంగా, విజయవంతంగా జరుగుతోంది. అలాగే రీ సర్వేలో కీలకమైన గ్రౌండ్ ట్రూతింగ్(క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ), గ్రౌండ్ వ్యాలిడేషన్‌కు ప్రతి మండలంలో ఒక ట్రైనర్ అందుబాటులో ఉండేలా శిక్షణ పూర్తి చేశారు. ఇదే శిక్షణను అఖిల భారత స్థాయి అధికారుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల వరకూ ఇస్తున్నారు. నల్సార్ వర్సిటీతో మొబైల్ మెజిస్ట్రేట్లకు.. రీ సర్వేలో వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థలో పనిచేసే వారికి నల్సార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. న్యాయపరమైన అంశాలను సమర్థంగా పరిష్కరించేలా డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు ఈ శిక్షణ అందించారు. అన్ని విధానాలపై విజయవంతంగా శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సాంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై సర్వేయర్లకు విజయవంతంగా శిక్షణ ఇచ్చాం. దీని వల్లే రీ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. – సీహెచ్వీఎస్ఎన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ -
అంధురాలు ఆవేదన.. గూడు లేకుండా చేశారయ్యా!
రహమత్‌నగర్: తన నివాసం తొలగించడం పట్ల ఓ అంధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అందించిన పట్టా ప్రకారం కేటాయించిన స్థలంలోనే నివాసం నిర్మించుకున్నా.. కొంత మంది బస్తీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి తప్పుడు సమాచారం అందించి తన నివాసాన్ని కూల్చివేయించారని అంధురాలైన చంద్రమ్మ వాపోయింది. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమ్మ మాట్లాడుతూ... అంధురాలైన తన విజ్ఞప్తి మేరకు 1993వ సంవత్సరంలో తహసీల్దార్ తనకు ఫాం డీ పట్టాను (ఎఫ్.4477.93) అందజేశారన్నారు. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీనగర్‌లోని తనకు కేటాయించిన 89 ప్లాట్లోనే చిన్న షెడ్డు వేసుకుని తన కుమార్తెతో కలిసి జీవిస్తున్నానని తెలిపింది. అయితే కొంత మంది బస్తీ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తాను నివాసం ఉంటున్న షెడ్డును తొలగించారని ఆమె వాపోయింది. తన పేరున ఇచ్చిన పట్టా ఉండగా తన నివాసం ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అంధురాలైన తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డిలకు చంద్రమ్మ విజ్ఞప్తి చేసింది. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు సువర్ణావకాశం
కర్నూలు(సెంట్రల్): కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)/రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) స్థాయి అధికారులకు సువర్ణావకాశం లభించింది. గతంలో అన్ని అర్హతలు ఉన్నా వారు లూప్‌లైన్ పోస్టుల్లో పనిచేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కోరుకున్న పోస్టులు దక్కడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు, 51 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. అందులో 13 కలెక్టరేట్లకు 13 మంది జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), 51 డివిజన్లకు 51 మంది ఆర్డీవోలు ఉండేవారు. ఇక మిగిలినవారు అదే క్యాడర్లో ఉన్నా లూప్‌లైన్ పోస్టుల్లో పనిచేస్తుండేవారు. లూప్‌లైన్ పోస్టులు అంటే.. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, జాతీయ రహదారులు తదితర విభాగాలకు ఎస్డీసీలుగా పనిచేయడం. సాధారణంగా రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవోగా పనిచేయడానికి అధికారులు ఎక్కువ మక్కువ చూపుతారు. అదే సమయంలో డీఆర్వోలుగా పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే ఆ అవకాశం కొందరికే వస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడంతో ఎంతోమంది అధికారులు తాము కోరుకున్న పోస్టులను దక్కించుకోగలిగారు. 13 జిల్లాలకు 13 మందికి డీఆర్వోలుగా, 21 రెవెన్యూ డివిజన్లకు 21 మందికి ఆర్డీవోలుగా పోస్టింగ్‌లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకటి, రెండేళ్లలో పదవీ విరమణ చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారు తమకు డీఆర్వో, ఆర్డీవో స్థాయి క్యాడర్ రాదనుకొని నిరాశలో ఉన్న సమయంలో మంచి పోస్టులు దక్కడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
చెరువు మధ్యలో పట్టా మంజూరు చేస్తారా?
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తికి రెవెన్యూ అధికారులు చెరువు మధ్యలో పట్టా మంజూరు చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు కలెక్టర్, తిరుపతి ఆర్డీవో, రేణిగుంట తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పట్టా పొందిన చిరంజీవి అనే వ్యక్తికి కూడా నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, యర్రమరెడ్డి పాళ్యం గ్రామంలోని సాగునీటి చెరువును టి.చిరంజీవి అనే వ్యక్తి పూడ్చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన గూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చిరంజీవి గతంలో పట్టా పొందారని, ఆ భూమినే ఇప్పుడు చదును చేసుకుంటున్నారని తెలిపారు. అది అతని సొంత భూమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫొటోలను చూస్తుంటే చెరువు మధ్యలో ఉన్న భూమిని చిరంజీవి చదును చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చెరువు మధ్యలో పట్టా ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. -
‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు
అద్దంకి: ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగ వంతమైంది. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 1000 ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో తహసీల్దార్ జే ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి, మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ మ్యాప్‌ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు. ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అద్దంకి, బొడ్డువానిపాలెం మధ్యలో 1,600 ఎకరాల భూమి పరిశీలన.. అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ధేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు. ఇక్కడ 1600 ఎకరాల భూమి విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు.అందులో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు 1000 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వ భూమిపోను 900 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తిమ్మాయపాలెం కుంకుపాడు రోడ్డుకు పడమరగా.. మండలంలోని తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డునుంచి, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక మధ్యలోని 1,400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో 311 ఎకరాల డాటెడ్ ల్యాండ్‌తోపాటు, వాగులు, వంకలు, డొంకలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అంటే అవసరమైన 1000 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను, 689 ఎకరాల ప్రైవేటు భూములు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. -
కాసుల కోసం భూ రికార్డులు తారుమారు
వరదయ్యపాళెం: డబ్బులకు ఆశపడి డీకేటీ పట్టాలను అక్రమంగా వేరేవాళ్ల పేర్ల మీదకు మార్చేసిన పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 95/4, 96/1, 88/8లలో టి.వెంకటేష్ పేరిట 1.5 ఎకరాలకు, ఎం.రంగమ్మ పేరిట 1.5 ఎకరాలకు, కె.కన్నయ్య పేరిట 1.5 ఎకరాలకు 1992 ఏప్రిల్ 9న డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవే భూములను 2005లో అక్రమంగా పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మల పేరిట కూడా రికార్డు చేసి.. పట్టాలిచ్చారు. అనంతర కాలంలో అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతంలోని 216 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 251.24 ఎకరాలను కేటాయించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మలకు సి కేటగిరి కింద పరిహారం అందింది. అయితే తమకు ఏ కేటగిరి కింద రూ.6.5 లక్షల పరిహారమివ్వాలని వారు కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన హైకోర్టు పట్టాల మంజూరులో జరిగిన అవకతవకలను గుర్తించి.. గతేడాది కలెక్టర్‌ను విచారణకు పిలిపించింది. న్యాయస్థానం ఆదేశాలతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి అక్రమాలను గుర్తించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ పేరిట అక్రమంగా పట్టాలిచ్చినందుకు అప్పటి ఇన్చార్జ్ తహసీల్దార్ మహదేవయ్య, ఆర్ఐ సదాశివయ్య, స్థానిక వీఆర్వో రఘునాథరెడ్డిలపై కేసు నమోదు చేశారు. రాపూరు నాగమ్మ పేరిట అక్రమంగా పట్టా ఇచ్చినందుకు అప్పటి మండల తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, అప్పటి ఆర్ఐ మురళీమోహన్, ప్రస్తుత చిలమత్తూరు వీఆర్వో దొడ్డి వెంకటరమణపై కేసు నమోదైంది. -
విషయం తెలియడంతో తవ్వకాలు మొదలుపెట్టిన జనం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో
గొలుగొండ: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో కొత్తగా రంగు రాళ్ల క్వారీ వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న జిరాయితీ భూమిని చదును చేస్తుండగా చిన్న మెట్ట అంచున రంగురాయి బయటపడింది. కొందరు అనుభవజ్ఞులు ఇక్కడి మట్టిని పరిశీలించి రంగురాళ్లు ఉండే అవకాశముందని చెప్పడంతో.. ఆ విషయం తెలిసి వందలాదిమంది మంగళవారం అర్ధరాత్రి ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టారు. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ ధనుంజయ్‌నాయుడు సిబ్బందితో గ్రామానికి వెళ్లగా.. తవ్వకాలు చేపట్టిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగురాళ్లకు పుట్టినిల్లు గొలుగొండ మండలంలో ఏటా ఏదో ఒకచోట రంగురాళ్ల క్వారీలు బయటపడుతున్నాయి. 1996లో తొలిసారిగా పప్పుశెట్టిపాలెం క్వారీ బయటపడింది. ఆశకొద్దీ లోతుగా తవ్వడంతో ఏడాది కాలంలో క్వారీ కూలి 14 మంది చనిపోయారు. 1999లో కరక రంగురాళ్ల క్వారీని కనుగొన్నారు. ఇక్కడ 15 వరకు క్వారీలు వెలుగుచూడగా రూ.వేలకోట్ల విలువైన రంగురాళ్లు దొరికాయి. అప్పట్లో ఈ 15 క్వారీల్లో ప్రమాదాలు జరిగి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాశ్ క్వారీ ప్రాంతాలను మూయించారు. 2002లో సాలిక మల్లవరం, 2004లో పొగచట్లపాలెం, 2006లో దోనిపాలెం, 2008లో తిరిగి సాలిక మల్లవరం, 2009లో ఆరిలోవలో కొత్త క్వారీలు ఏర్పడ్డాయి. పప్పుశెట్టిపాలెంలో బుధవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీని రప్పించి క్వారీ ప్రాంతంలో తవ్వకందారులు తీసిన గోతులను మూయించివేశారు. -
మ్యుటేషన్ మాయాజాలం
సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్ డీడ్లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రిజిస్టర్డ్ డీడ్ తప్పనిసరి.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్ చేయాలంటే పార్టీషన్ డీడ్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ‘రిజిస్ట్రేషన్ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్ డీడ్‌ను రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్ చేయాలి. సర్క్యులర్ సాకుతో చట్ట విరుద్ధంగా... రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్ డీడ్ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్మెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఓ సర్క్యులర్‌ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్ చేయవచ్చని అప్పటి కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పార్టీషన్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్‌లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్‌ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. ఏటా రూ.800 కోట్ల నష్టం... డీఆర్ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న న్యాయ వివాదాలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్ వివాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు -
భూ సర్వేపై 26 నుంచి శిక్షణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే కోసం ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా 1,294 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోటలోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగా అందరికీ ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని ఎంపిక చేసి విడతల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్ల ద్వారా రెవెన్యూయేతర విభాగం నుంచి పరిశీలకులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ పునర్ వ్యవస్థీకరణ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయక సర్వేతో పాటు సిలబస్‌లో కొత్త విషయాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈటీఎస్, డీజీపీఎస్, నెట్వర్క్, ఎస్ఓపీ, గ్రౌండ్ ట్రూతింగ్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, గ్రౌండ్ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్‌లో చేర్చామని వివరించారు. -
కాకినాడ సెజ్: 'సాగర' తీరానికి భారత్‌మాల
పచ్చని చెట్లు.. తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీర ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే çప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్దం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి ..ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ జాతీయ రహదారి నిర్మాణం ► కాకినాడ–తుని తీరప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. ► కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. ► నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ► అన్నవరం నుంచి కాకినాడ వరకు 40. 319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ -
నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ వ్యాపారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లపై ఆహార భద్రత, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లోని నెయ్యి తయారీ కేంద్రాలను, బీసెంట్ రోడ్డులోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత విభాగం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే ముడి సరకు నమూనాలను సేకరించారు. సేకరించిన 14 నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నామని, ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ దాడుల్లో రూ.5.45 లక్షల విలువైన పామాయిల్, రూ.3.81 లక్షల విలువైన నెయ్యి, రూ.27,000 వేలు విలువైన వేరుశనగ నూనెను సీజ్ చేశామన్నారు. రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు మంగళవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. విజయవాడ పటమట డివిజన్లోని సాయినగర్‌లో ఉన్న పారడైజ్ ఫుడ్ కోర్టును ఆహార భద్రతాధికారి టి.శేఖర్‌రెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్, తహసీల్దార్ డీవీఎస్ ఎల్లారావు తనిఖీ చేశారు. నాణ్యత సరిగా లేవన్న అనుమానంతో కారం పొడిని, మటన్ దమ్ బిర్యానీ నమూనాలను సేకరించారు. రెండో బృందానికి ఆహార భద్రతాధికారి ఎన్.రమేష్‌బాబు నేతృత్వం వహించారు. ఈ బృందం గవర్నర్‌పేటలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. రూ.4,225 విలువ చేసే నాణ్యత లేని 65 కిలోల వేరుశనగ గుండ్లను సీజ్ చేశారు. కిచెన్ రూం పరిశుభ్రంగా లేదని, రిఫ్రిజిరేటర్ కూడా సరిగా లేదని, తక్షణమే వాటిని సరిచేసుకోవాలంటూ హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఇదే బృందం కొత్త రాజరాజేశ్వరి పేటలోని శ్రీలక్ష్మి దివ్య బాబు డెయిరీని తనిఖీ చేసింది. అక్కడ తయారు చేస్తున్న ఆవు నెయ్యి, గేదె నెయ్యిలను పరిశీలించింది. 193.4 కిలోల ఆవు నెయ్యి, 700.4 కిలోల గేదె నెయ్యిని సీజ్ చేసి వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని మూడో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని ఇందిరానాయక్ నగర్లో శ్రీకృష్ణా వెగాన్ ఘీ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. అక్కడ ఇతర బ్రాండ్లను పోలిన ప్యాకింగ్ లేబుల్స్‌ను వినియోగిస్తుండటంతో 2,500 నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 70 కిలోల నకిలీ పామాయిల్‌ను అధికారులు గుర్తించి నమూనాను సేకరించారు. అనంతరం గవర్నర్‌పేటలోని బర్కత్ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వింగ్స్‌లో అధికంగా కలర్ వాడినట్టు గుర్తించారు. వాటిన నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి పి.శ్రీకాంత్ నేతృత్వంలోని నాలుగో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని వెంకటేశ్వర జనరల్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసింది. ఇందులో నాణ్యతపై అనుమానం రావడంతో విజయ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ నమూనాను సేకరించి.. 9 ఆయిల్ టిన్నులను సీజ్ చేశారు. 58 టిన్నుల్లో నిల్వ ఉంచిన 3,600 కిలోల పామాయిల్‌ను సీజ్ చేశారు. అనంతరం వన్‌టౌన్‌లోని ఇస్లాంపేటలోని మిలాప్స్ పంజాబీ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత సరిగా లేవన్న కారణంతో బిర్యానీ, పెరుగు నమూనాలను సేకరించారు. -
ఫోర్జరీ చేసి రూ. 5కోట్ల భూ విక్రయానికి యత్నం
జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చి అమ్మేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. నకిలీ పట్టా పాసు పుస్తకాలను సృష్టించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూమి పట్టా కాదని, ప్రభుత్వ భూమి అని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీనగర్ గ్రామ పరిధిలోని 27 సర్వే నంబర్‌గల 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిని భూపంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన ర్యాకం సుశీలకు గతంలో కేటాయించారు. 2005లో ఈ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాగా గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన శివశంకర్‌యాదవ్ అనే వ్యక్తి ర్యాకం సుశీల నుంచి 1.23 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలను తయారు చేశాడు. 2018లో తహసీల్దార్‌గా ఇక్కడ విధులు నిర్వహించిన శివకుమార్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పాసుపుస్తకాలను సృష్టించాడు. ఈ భూమిని విక్రయించేందుకు శివశంకర్‌యాదవ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక్కడ ఎకరం స్థలం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని విక్రయించి డబ్బులు సంపాదించొచ్చని భావించాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తహసీల్దార్ దశరథ్ ఆదేశాల మేరకు గురువారం ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దశరథ్ మాట్లాడుతూ శివశంకర్‌యాదవ్ అనే వ్యక్తి అప్పటి తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించాడని స్పష్టం చేశారు. బొల్లారం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
వడివడిగా.. అన్నీ పరిశీలిస్తూ
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు మెట్రో: పోలవరం పనులన్నీ నిశితంగా పరిశీలిస్తూ.. అధికారులతో సమీక్షిస్తూ.. వినతులు స్వీకరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం వడివడిగా సాగింది. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. స్పిల్‌వే బ్రిడ్జి నుంచి ప్రారంభం.. ముందుగా స్పిల్‌వే బ్రిడ్జిపై నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం స్పిల్‌వే వద్దకు చేరుకుని ఫొటో గ్యాలరీని తిలకించారు. 44వ గేటు పిల్లర్ వద్ద ట్రయల్ రన్ పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నిర్మాణం, నీటి విడుదల, స్పిల్ వే ద్వారా పంపించే నీటి పరిమాణాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరువాత స్పిల్‌వే నుంచి ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకుని పనుల పురోగతిని గమనించారు. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం డ్యామ్ వద్ద ఉన్నతాధికారులు, నాయకులతో సమీక్ష చేపట్టారు. సమస్యలు, పనుల తీరుతెన్నులను అంశాలవారీగా ఆరా తీశారు. సుమారు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగనివ్వం.. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారుతున్న తమను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలకు చెందిన ప్రజలు, నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారాన్ని కలిపి రూ.10 లక్షలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగకుండా గృహ సముదాయాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరదల వల్ల ఏటా పోలవరం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై ఒక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజును సీఎం ఆదేశించారు. మున్నూరుకాపు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుక్కునూరు మండలం నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎడ్ల బళ్లపై ఇసుకని తరలించి స్థానిక అవసరాలకు వినియోగించుకుంటే పోలీసులు కేసులు బనాయిస్తున్నారన్నారు. నిర్వాసితులకు గతంలో ఇచ్చిన రూ.1.50 లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.5 లక్షలు ఇప్పించాలని కోరారు. -
మేం కోరుకున్న ఉత్తర్వులివ్వలేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖ పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టును ఆశ్రయించిన ‘గీతం’ యాజమాన్యం సింగిల్ జడ్జి తాము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వలేదంటూ సోమవారం రాత్రి హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం తదుపరి కూల్చివేతలు చేపట్టవద్దని మాత్రమే ఆదేశాలు ఇచ్చారంటూ ‘గీతం’ కార్యదర్శి బీవీ మోహనరావు ఈ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అప్పుడు సమ్మతించి ఇప్పుడు అప్పీల్ దారుణం.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గీతం’ సమ్మతి మేరకే సింగిల్ జడ్జి ఆ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అప్పుడు సమ్మతి తెలియచేసి ఇప్పుడు ఆ ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ అప్పీల్ దాఖలు చేయడం దారుణమన్నారు. ఈ అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు. ఎవరు ప్రోత్సహిస్తున్నారో అందరికీ తెలుసు.. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో హైకోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు తెచ్చుకుంటామని గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ చెబుతున్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఏఏజీ పొన్నవోలు ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం తమకు అప్పీల్ కాగితాలు అందచేయకుండా నంబర్ కేటాయించడానికి వీల్లేదని, గీతం విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టులో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ప్రతివాదుల వైపు న్యాయవాదులకు కాగితాలు ఇవ్వకుండా అప్పీల్‌కు నంబర్ అయిందంటే, అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించింది. కబ్జా భూమిని ఇవ్వాలంటోంది.. ఓ అనుబంధ పిటిషన్లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుతో పాటు ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పాయని పొన్నవోలు నివేదించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ భూమిని ఇచ్చేయాలని గీతం కోరుతోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అంతకు ముందు గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలను కూల్చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
అప్పటివరకు కట్టకండి.. కూల్చకండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ, యండాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విద్యా సంస్థల యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ వరకు గీతం నిర్మాణాలను కూల్చొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గీతం యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అందులో చేసిన పలు నిర్మాణాలను అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో గీతం యాజమాన్యం శనివారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి తన ఇంటి వద్ద వాదనలు విన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గీతంకు విద్యా దాహానికి బదులు భూదాహం పట్టుకుందన్నారు. తమ భూముల్లోకి తాము వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. గీతం తరఫు న్యాయవాది రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అధికారులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు గీతంకు అనుమతినిచ్చారు. -
భూ మాయ!
సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల కో సం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి -
టీడీపీ మాజీ ఎమ్మెల్మే అక్రమాలపై దాడులు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమాలపై మూడో రోజు రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెందుర్తి బస్టాండ్ పక్క గెడ్డ ఆక్రమ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమాల బాగోతంపై వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రభుత్వ భూములను దోచుకున్నారని మండిపడ్డారు. పెందుర్తి పరిసరాల్లో ఎకరాల కొద్దీ భూమి వారి చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లోతుగా విచారణ సాగిస్తే పీలా కుటుంబం అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. చదవండి: గోవిందా.. గోవిందా..? -
తవ్వేకొద్దీ అక్రమాలు!
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూమి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ దందాలో అప్పటి తహసీల్దార్, ప్రస్తుతం సస్పెండైన కామారెడ్డి ఆర్డీఓ నరేందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అసైన్డ్, సీలింగ్ భూములతో పాటు వివాదాస్పద భూముల్లో కూడా ఆయన జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖాజీపల్లిలో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారని సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అప్పటి జిన్నారం తహసీల్దార్, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, మరొక అధికారిని సస్పెండ్ చేసింది. అలాగే.. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 2012–13లో నరేందర్ జిన్నారం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో అన్నారంలోని 261 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములను కూడా పట్టాలుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాదారంలోని అసైన్డ్ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పట్టాగా మార్చినట్లు సమాచారం. అలాగే.. కొర్లకుంట గ్రామంలోని 35 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు రికార్డులు తారుమారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాజీపల్లిలోని 180 సర్వే నంబర్లో సీలింగ్ భూమిని ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో జరిగిన స్థలాల మార్పిడి, ఇతర రెవెన్యూపరమైన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మాజీ సైనికులకు నోటీసులు! అసైన్డ్ భూ దందాలో భాగస్వాములైన మాజీ సైనికులు తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగ నాయకులు, ఎం.మధుసూదన్, ఎన్.గంగాధర్ రావులకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఖాజీపల్లిలోని 180 సర్వేనంబరు అసైన్డ్ భూమిని మీకు ఏ సంవత్సరంలో అప్పగించారు, ఎప్పటి నుంచి రికార్డులలో మీ పేరుంది? వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇవ్వడానికి అర్హత ఉందా..? ఈ భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత ఉంది..? చనిపోయిన తహసీల్దార్ సంతకంతో మీకు పట్టాలు ఎవరిచ్చారు..? తదితర ప్రశ్నలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. నోటీసులకు సరైన, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈ భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. కొల్చారం తహసీల్దార్‌కూ లింకు! కొల్చారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రస్తుత కొల్చారం తహసీల్దార్ పాత్ర ఉందని తేలింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన.. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అప్పట్లో సహదేవ్ జిన్నారం తహసీల్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భూ దందాల్లో కూడా సహదేవ్ పాత్ర ఉందని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్‌కు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కాగా, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సర్వే నంబర్ 297లో గల 0.13 గుంటల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో సహదేవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. -
రూ.80 కోట్ల భూమికి ఎసరు
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. కీసర తహసీల్దార్ నాగరాజు,, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతి బాగోతం మరవకముందే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మరో భూబాగోతం వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు.. ఏకంగా రూ. 80 కోట్ల విలువైన అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారు. పైగా చనిపోయిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్రకు తెర తీశారు. ఎన్ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో.. అనుమానం వచ్చి కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ సహా మరొకరిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబరు 181లో అసైన్డ్ భూమి ఉంది. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఈ భూమి రూ.కోట్లలో విలువ చేస్తుండటంతో.. 2013లో జిన్నారంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓ జే.వెంకటేశ్వర్రావు తదితరుల కన్ను పడింది. అయితే.. అసైన్డ్భూమి మాజీ సైనికులకు కేటాయించే వెసులుబాటు ఉండటంతో.. తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్.గంగాధర్‌రావు, ఎం.మధుసూదన్‌లను మభ్యపెట్టి రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. వీరు జిన్నారం తహసీల్ కార్యాలయంలో భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదెకరాల చొప్పున నలుగురికి 20 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. ప్రస్తుతం దాని విలువ రూ.80 కోట్లు ఉంది. అయితే.. మాజీ సైనికులు, రెవెన్యూ అధికారుల మధ్య ఏ మేరకు ఒప్పందం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన తహసీల్దార్ పేరుతో నకిలీ పట్టాలు అసైన్డ్ భూమిని తాము నేరుగా కేటాయిస్తే ఇరుకున పడతామనే ఉద్దేశంతో అప్పటి తహసీల్దార్ తదితరులు పకడ్బందీ వ్యూహం రచించారు. ఇందుకుగాను 2010 కంటే ముందు జిన్నారంలో పనిచేసి మృతి చెందిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకంతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని పథక రచన చేశారు. ఈ మేరకు నోట్ కూడా తయారు చేశారు. తాము ఎంపిక చేసిన నలుగురు మాజీ సైనికులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మొత్తం 20 ఎకరాలు.. మృతి చెందిన తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను సృష్టించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా 2007 నుంచి పహాణీ మొదలుకొని ఇందుకు సంబంధించిన అన్ని భూ రికార్డులు మాజీ సైనికుల పేర్లతో ఉన్నట్లుగా రికార్డులలో దిద్దడం చేశారు. నిందితులపై క్రిమినల్ చర్యలు జిన్నారం మండలం భూ బాగోతంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు మాజీ సైనికులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, అప్పటి డిప్యూటీ తహసీల్దార్ నారాయణలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే.. వీఆర్వో వెంకటేశ్వర్ రావు, ఆర్ఐ విష్ణువర్ధన్, సర్వేయర్ లింగారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరప్ప, సూపరింటెండెంట్ సహదేవ్, 2019లో సంగారెడ్డి ఆర్డీఓపై కూడా శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సైనికులు వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్ గంగాధర్‌రావు, ఎం మధుసూదన్‌లకు కేటాయించిన అసైన్డ్ పట్టాలను కూడా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్టు రట్టయిందిలా.. మాజీ సైనికులకు కేటాయించినది అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అవసరమైంది. ఎవరికైనా అసైన్డ్ భూమి కేటాయించిన పదేళ్ల తర్వాత వారికి ఈ భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు (అమ్ముకోవడానికి వీలుగా) లభిస్తాయి. దీం తో 2019లో వారు ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌కు పంపిన ఫైళ్లలో రెవెన్యూ అధికారులు రాసుకు న్న ప్లాన్ పేపర్ (నోట్) కూడా ఉంది. దీంతో కలెక్టర్ హనుమంతరావుకు అనుమానం వచ్చింది. వెంటనే మైనార్టీ సంక్షేమ అధికారి తిరుపతిరావును విచారణ అధికారిగా నియమించారు. పూర్తి విచారణ అనంతరం.. అప్పట్లో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, వీఆర్వో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడింది నిజమేనంటూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారు. అక్రమాలు వాస్తవమే జిన్నారం మండలం ఖాజీపల్లి సర్వే నం.181లో అసైన్డ్ భూమి ఉన్నమాట వాస్తవమే. చనిపోయిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకం ఫోర్జరీ అయినట్లు అనుమానంతో విచారణకు ఆదేశించా. దీంతో అసలు విషయం బయటపడింది. నలుగురు మాజీ సైనికులకు కేటాయించిన 20 ఎకరాల భూమిని ప్రస్తుతం సుమారుగా రూ.80 కోట్లు విలువ చేస్తుంది. – హనుమంతరావు, కలెక్టర్, సంగారెడ్డి -
‘మ్యుటేషన్లు’ మూలకే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కన్నెర్ర జేసినా.. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినా.. ఆఖరికి భౌతికదాడులు జరిగినా.. చాలామంది రెవెన్యూ అధికారుల పనితీరు మారడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పక్షం రోజుల్లోనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో భూ యాజమాన్య హక్కుల కోసం పట్టాదారులు తహసీళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మ్యుటేషన్లు, విరాసత్‌ల అమలు ఆలస్యానికి కరోనా వ్యాప్తి కూడా ఒక కారణమే అయినా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే 24 గంటల్లోనే ఆన్లైన్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుండగా క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం షరా మామూలుగానే స్పందిస్తున్నట్లు పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మీ–సేవలో దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. మ్యుటేషన్ల జారీలో జాప్యం చేస్తోంది. దీంతో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలోనూ ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,14,725 దరఖాస్తులు భూ యాజమాన్య హక్కులు, వారసత్వ భూ బదలాయింపులు కోరుతూ ప్రభుత్వానికి రాగా.. వాటిలో ఇప్పటివరకు 11,89,951 దరఖాస్తులకు మోక్షం కలిగింది. ఇంకా 1,16,476 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 74,610 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం. తహసీళ్ల చుట్టూ చక్కర్లు : సుపరిపాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆన్లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా చాలా మంది అధికారులు ఇంకా వాటికి అలవాటుపడలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మ్యుటేషన్ వ్యవహారం కొలిక్కి రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు సహా సేల్‌డీడ్, 1బీ, పహాణీ నకలు జతపరిస్తే.. వాటిని డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం రెవెన్యూ అధికారుల విధి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన కాపీల నకళ్లను తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేస్తే తప్ప వాటికి మోక్షం కలగడంలేదు. పట్టాదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దనే ఉద్ధేశంలో దాదాపుగా అన్ని సేవలను ప్రభుత్వం ఆన్లైన్ చేసింది. మీ–సేవలో చేసుకున్న అర్జీ జత పరిచిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసే వాటికి జిరాక్స్‌ల కోసం రెవెన్యూ శాఖ నెలవారీగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నెపంతో దరఖాస్తుదారులను కార్యాలయాలకు పిలిపించి.. బేరసారాలు మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇప్పుడు మ్యుటేషన్ మహా సులువు
► విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక గ్రామానికి చెందిన శియాద్రి ఈశ్వరమ్మ నుంచి దొరపల్లి నరసమ్మ గత జూన్ 6న భూమి కొనుగోలు చేశారు. నరసమ్మ తహసీల్దారు కార్యాలయానికి వెళ్లనేలేదు. అయినా.. ఆమె కొనుగోలు చేసిన భూమిపై ఆమెకు యాజమాన్య హక్కులు బదలాయిస్తూ ఈనెల 7న రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ► వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన కొవ్వూరు వెంకట సుబ్బయ్య తన గ్రామంలో భూమిని గత నెలలో కొనుగోలు చేశారు. 16 రోజుల్లోనే రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. ► అలాగే, కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామానికి చెందిన కలిదిండి లక్ష్మి నుంచి కలిదిండి నగేష్ గత నెల ఒకటో తేదీన 3.75 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అధికారులు భూమిని మ్యుటేషన్ చేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆటో మ్యుటేషన్ విధానం విప్లవాత్మక మార్పు తెచ్చిందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో భూ యాజమాన్య హక్కులు బదలాయించాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో కొనుగోలుదారులు, వారసత్వంగా, భాగ పరిష్కారం ద్వారా భూమి సంక్రమించిన వారు రెవెన్యూ రికార్డులైన భూ అనుభవ పత్రం (అడంగల్), భూయాజమాన్య హక్కు పత్రం (1బి)లో తమ పేర్ల నమోదు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి ముడుపులు ఇవ్వనిదే మార్పులు (మ్యుటేషన్లు) జరిగేవి కావు. ఈ పరిస్థితిని మార్చడం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఆటో మ్యుటేషన్ విధానం తెచ్చింది. దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిన నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లోని హక్కుదారులు/అనుభవదారుల కాలమ్‌లో కొనుగోలుదారుల పేర్లు నమోదు చేసే ఆటో మ్యుటేషన్ ప్రక్రియను గత ఫిబ్రవరి 11న సీఎం లాంఛంగా ప్రారంభించారు. అనంతరం అధికారులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు జారీచేశారు. ఆటో మ్యుటేషన్ అంటే.. భూమిని ఎవరైనా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అమ్మకందారు నిజమైన హక్కుదారేనా? లేక వేరేవారి ఆస్తిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేశారా? సదరు ఆస్తిపై వేరెవరికైనా హక్కులు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటే ఆస్తి కొనుగోలుదారు పేరుతో బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనినే ఆటో మ్యుటేషన్ అంటారు. ప్రభుత్వం విధించిన నెలరోజుల గడువులోగా అధికారులు ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే.. తహసీల్దారు అంగీకారం లేకపోయినా అంగీకరించినట్లుగానే పరిగణించి కొనుగోలుదారు పేరుతో మ్యుటేషన్ పూర్తవుతుంది. దీనినే డీమ్డ్ మ్యుటేషన్ అంటారు. ఆటో మ్యుటేషన్ అమలు ఎలాగంటే.. ► మ్యుటేషన్ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. తహసీల్దారు కార్యాలయం గడప తొక్కాల్సిన పనీలేదు. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం వాకబు చేసి రెవెన్యూ అధికారులు రికార్డులు సవరించాలనేది ప్రభుత్వ విధానం. ► సాధారణంగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో నిత్యం వివిధ రూపాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ► ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టిఫికెట్లు (ఆధార్ కార్డు, వెబ్‌ల్యాండ్ డేటా) అన్నీ పరిశీలించి వాస్తవ హక్కుదారులే విక్రయిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఏదైనా అనుమానం వస్తే పెండింగ్‌లో పెడతారు. ► ఇలా రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి యజమాని కాలమ్‌లో అమ్మిన వారి పేరును తొలగించి కొనుగోలుదారు పేరును సబ్ రిజిస్ట్రారు నమోదుచేస్తారు. ► తహసీల్దారు ఎస్ఆర్వో (సబ్ రిజిస్ట్రారు ఆఫీసు) లాగిన్ ఓపెన్ చేయగానే మార్పులు కనిపిస్తాయి. ► వీటిని తహసీల్దారు తాత్కాలికంగా ఆమోదించగానే సదరు ఆస్తి విక్రయ రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ఫారం–8 జారీ అవుతుంది. దానిని గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. ► అభ్యంతరాల సమర్పణకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోనే సచివాలయ సర్వేయరు సదరు భూమిని పరిశీలించి రుసుం చెల్లించిన వారికి సబ్ డివిజన్ చేసి సరిహద్దులు ఖరారుచేసి మండల సర్వేయరు లాగిన్‌కు నివేదిక పంపుతారు. మండల సర్వేయరు పరిశీలించి ఆమోదిస్తారు. ► 15 రోజుల్లో అభ్యంతరాలు రాని పక్షంలో వీఆర్ఓ, ఆర్ఐ అదే విషయాన్ని తహసీల్దారు లాగిన్‌కు పంపుతారు. తహసీల్దారు ఆమోదించగానే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగిపోతాయి. మ్యుటేషన్‌ను ఆమోదిస్తూ ఫారం–14 జారీచేస్తారు. ► వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ పూర్తికాగానే కొత్త యజమాని అయిన కొనుగోలుదారులు మీభూమి వెబ్ పోర్టల్ నుంచి ఇ–పట్టాదారు పాసు పుస్తకం, ఇ–టైటిల్ డీడ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఈ మొత్తం ప్రక్రియలో అవకతవకలు, అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం ప్రతీదశలోనూ ఆస్తి యజమానులు, కొనుగోలుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించే విధానం అమలుచేస్తోంది. రాష్ట్రస్థాయిలో బృందం పర్యవేక్షణ తహసీల్దార్లు తిరస్కరించిన వాటిని ఆర్డీవో పరిశీలించాలి. అంతేకాక.. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆఫీసులో ప్రత్యేకంగా ఒక బృందాన్ని పెట్టాం. ప్రతి తిరస్కృత మ్యుటేషన్‌ను ఈ బృందం పరిశీలించి నివేదిక ఇస్తుంది. తనది కాని ఆస్తిని వేరేవారు విక్రయించి ఉంటే కచ్చితంగా మ్యుటేషన్‌ను తిరస్కరించడంతోపాటు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపై కేసులు కూడా పెడతాం. – చెరుకూరి శ్రీధర్, జాయింట్ కమిషనర్, సీసీఎల్ఏ -
అధికారులకు బాబు బెదిరింపులు
సాక్షి, కుప్పం: ఎన్నికల ముందు ఓట్ల కోసం పంపిణీ చేసిన ఇంటి పట్టాలు నకిలీవి కావడంతో పునాదులు వేసుకున్న కట్టడాలు తొలగించిన రెవెన్యూ అధికారులపై టీడీపీ బెదిరింపులకు దిగింది. కుప్పం మండల పరిధిలోని పలార్లపల్లి రెవెన్యూలో స్థలాల ఆక్రమణలు తొలగించినందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ వీడియో ద్వారా మంగళవారం రెవెన్యూ అధికారులపై బెదిరింపులకు దిగారు. పలార్లపల్లి రెవెన్యూలో ఉన్న ప్రభుత్వ స్థలంలో టీడీపీ నేతల బంధువులు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలను చూపించి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ స్థలం ప్రజావసరాల కోసం ఉంచిన ప్రభుత్వ స్థలం. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి రికార్డులు లేక ఇచ్చిన పట్టాలను ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నేతల బంధువర్గం పునాదులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఈ పునాదులను తొలగించారు. ఇదిలా ఉండగా జీ ప్లస్ టూ కింద ఇచ్చిన హౌసింగ్ మంజూరు పట్టాలను ప్రభుత్వం రద్దుచేసింది. రికార్డులు లేని పట్టాలు చేతపట్టుకుని ప్రభుత్వ స్థలాల్లో పునాదులు నిర్మించడంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా రాద్దాంతం చేస్తోంది. మంగళవారం టీడీపీ నాయకులు రెవెన్యూ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడుకు వీడియో కాల్ చేశారు. జూమ్ వీడియోలో తహసీల్దారు సురేష్‌బాబుకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో పాటు ఇళ్ల స్థలాలను కొనసాగించాలని హుకుం జారీ చేశారు. ఈ విషయంపై తహసీల్దారు సురేష్‌బాబు ఆయనకు సమాధానమిస్తూ ఎలాంటి నిబంధనలూ లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా పునాదులు వేశారని, ఈ పునాదుల్లో నిజమైన లబి్ధదారులను పరిశీలించి మరోచోట పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ హౌసింగ్ అక్రమాలపై విచారణ గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మించిన 345 కాలనీ గృహాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పటి ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. విచారణ చేపట్టాలని అప్పటి కడా ప్రత్యేకాధికారి శ్యామ్‌ప్రసాద్ సైతం కమిటీని ఏర్పాటుచేస్తే ఆయనను ఆకస్మికంగా కడా నుంచి బదిలీ చేశారు. ఎనీ్టఆర్ గృహకల్ప పట్టాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు సురే‹Ùబాబు సవాల్ విసిరారు. దీనికి టీడీపీ కాంగ్రెస్ పార్టీ మధ్య తిరుపతి గంగమ్మ దేవాలయం వేదికగా చర్చకు సిద్ధమయ్యారు. ఈ చర్చా వేదికలో టీడీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేశారు. ఇప్పటివరకు ఎనీ్టఆర్ గృహకల్ప అక్రమాలపై విచారణ పూర్తిస్థాయిలో జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణకు చర్యలు చేపడుతుంటే టీడీపీ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంలో అవనసర రాద్దాంతానికి తెరతీస్తున్నారు. తహసీల్దారును బెదిరించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం వంటి జిమ్మిక్కులకు దిగుతున్నారు. -
‘రెవెన్యూ’లో ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్య రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల దాడిలో ఇంట్లో దొరికిన నగదుకు లెక్క చూపినా.. విచారణ పేరిట కుటుంబసభ్యులను వేధించడంతోనే అజయ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెవెన్యూ ఉద్యోగసంఘాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. వివాదాస్పద భూ వ్యవహారంలో ఆర్ఐ, ఎస్ఐలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎలాంటి ప్రమేయంలేని తహసీల్దార్‌ను అరెస్టు చేయడమేగాకుండా తప్పులు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూను అవినీతి శాఖగా చిత్రీకరించడంలో భాగంగానే పద్ధతి ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సంఘటనలోనూ ఆమెదే తప్పిదం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తీరును గుర్తు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజా ఘటన నేపథ్యంలో ఆందోళనబాట పట్టాలని యోచిస్తున్నారు. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూముల వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై దాడులు జరిగాయని, మాన్యువల్ పహాణీగాకుండా.. ఏకంగా ఆన్లైన్లోనే రికార్డులు నమోదు చేయడంతో ఆనేక తప్పు లు దొర్లాయని, వీటిని సవరించడానికి అనుమతినివ్వాలని కోరినా పట్టించుకోని అధికారు లు.. తప్పంతా రెవెన్యూ ఉద్యోగులదే అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో రాత్రికి రాత్రే అమలు చేయాలనే ఉన్నతాధికారుల వ్యవహారశైలితో రెవెన్యూశాఖకు చెడ్డ పేరు వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమం లోనే వీఆర్వోల వ్యవస్థ రద్దు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేయడంతో మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి ముద్ర వేస్తుండటం మరింత కుంగదీస్తోందని అంటున్నారు. ఏసీబీ వేధింపులతోనే: ట్రెసా షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కేసులో ఆధారాలు లేకపోయిన అరెస్ట్ చేసిన తహసీల్దార్ సుజాతకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే బాగుండేదని, ఇప్పటికైనా ఆమెను విడుదల చేసి కేసును విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్వే రాళ్ల ఖర్చు కూడా సర్కారుదే
-
భూముల సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా రీసర్వే చేసి ప్రతి సర్వే నంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రీసర్వే కోసం రైతులపై నయాపైసా కూడా భారం మోపవద్దని, దీనికోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వే నంబర్లవారీగా నాటే నంబరు రాళ్ల ఖర్చును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. భూముల సమగ్ర రీసర్వేపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్షించారు. నాలుగు దశల్లో రీ సర్వే పూర్తి చేద్దామని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ప్రజాప్రయోజనాల రీత్యా ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన ప్రాజెక్టు కాబట్టి మూడు విడతలకు కుదించి త్వరగా పూర్తి చేద్దామని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్రలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయని సీఎం గుర్తు చేసుకున్నారు. మొదటి విడత కింద 3,000 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రెండు, మూడు విడతల్లో 7 వేల చొప్పున రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాలు, దీనివల్లే ఒనగూరే ప్రయోజనాలు, రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో ముఖ్యాంశాలు ఇవీ... స్వాతంత్రానికి పూర్వం సర్వే,.. ► 1900 – 1920 మధ్య బ్రిటీష్ హయాంలో దేశంలో భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) రూపొందించారు. తర్వాత భూముల క్రయ విక్రయాలు, వారసత్వ మార్పులు లక్షల సంఖ్యలో జరిగినా సరిగా నమోదు కాలేదు. కొందరు రికార్డులను ట్యాంపరింగ్ కూడా చేశారు. ► తప్పుల తడకలుగా ఉన్న రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ, భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి రీసర్వే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ► రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో గణాంకాలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) మధ్య కూడా చాలా తేడా ఉంది. భూకమతాలు, సబ్డివిజన్ల మధ్య కూడా వ్యత్యాసం ఉంది. ► ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి రికార్డులను ప్రక్షాళన చేయటం కోసం రాష్ట్రంలో భూములన్నీ సమగ్రంగా రీ సర్వే చేసి భూ యజమానులందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ హామీ అమలులో భాగంగా శాశ్వత భూ హక్కుల చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు ప్రణాళిక రూపొందించింది. భూముల సమగ్ర రీసర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలే ► భూ రికార్డులు అస్తవ్యస్తంగా మారడం, సరిహద్దులు చెరిగిపోవడంవల్ల భూ వివాదాలు భారీగా పెరిగాయి. కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ► ముఖ్యమంత్రి, రెవెన్యూ అధికారులు ప్రతివారం నిర్వహించే స్పందన ఫిర్యాదుల్లో అత్యధికం భూ, సర్వే సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ► ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేసి సర్వే సెటిల్మెంట్ – ల్యాండ్ రికార్డులు స్వచ్ఛీకరించాల్సి ఉన్నా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఏ ప్రభుత్వం కూడా ఇందుకు సాహసించలేదు. దీనివల్ల వివాదాలు జటిలమై సివిల్ వివాదాలు కాస్తా క్రిమినల్ కేసులుగా మారుతున్నాయి. ► వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య తేడాలను పక్కాగా గుర్తించి వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేయకుంటే వివాదాలు ఇంకా పెరుగుతాయి. అందువల్ల రీసర్వే తప్పనిసరని పేర్కొంటూ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ► సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌ఛార్జి కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ చెరుకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ‘కార్స్’ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ... ► ఇప్పటికే ఉన్న సుమారు 2,200 మంది సర్వేయర్లతోపాటు కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు అధునాతన ‘‘కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (కార్స్)’’ టెక్నాలజీపై ప్రభుత్వం శిక్షణ కూడా ఇప్పించింది. ► ఇప్పటివరకు మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగించారు. ► మన దేశంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. ► రాష్ట్రంలోని మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని కచ్చితంగా కొలతలు వేసి సర్వే నంబర్ల వారీగా నంబరు రాళ్లు పాతుతారు. ఈ వివరాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. దీంతో ట్యాంపరింగ్ చేయడానికి వీలుకాదు. ► కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 25 గ్రామాల పరిధిలోని 66,761 ఎకరాల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించి రాష్ట్రమంతా అమలు చేస్తారు. ► భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రకారం నిర్దిష్ట సమయంలో మ్యుటేషన్ చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ అవుతుంటాయి. ► గ్రామ సచివాలయాలవారీగా భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ అమలు చేస్తారు. ► సర్వే సందర్భంగా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లతో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. డిజిటల్ రికార్డులు.... ► రికార్డుల స్వచ్ఛీకరణ/ ప్రక్షాళన సర్వే వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరిచే ఏర్పాటు చేస్తారు. ► డేటాను తారుమారు చేయడానికి వీల్లేని విధంగా మూడు నాలుగు చోట్ల భద్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ► భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే నిర్దిష్ట సమయంలో ఆటో మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేస్తారు. -
ఎల్జీ పాలిమర్స్ సీజ్
విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది. ముందుగా కంపెనీని సీజ్ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.రామలింగరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కంపెనీని మూసివేసినట్లు ఆర్డీఓ తెలిపారు. -
బాధితులకు.. సర్కారు ఆపన్నహస్తం
విశాఖ సిటీ: విశాఖలో గురువారం విషవాయువు లీకేజీ ప్రమాదంతో భయాందోళనలకు గురైన స్థానిక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. మొత్తం 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పెందుర్తి, సింహాచలం, గోశాల ప్రాంతాల్లో పలు కల్యాణ మండపాల్లో 20 వేల మందికి సరిపడ సౌకర్యాలను కల్పించింది. ఓ పక్క కరోనా పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రజల యోగక్షేమాలు చూస్తున్నారు. ప్రమాదం తర్వాత వెంకటాపురంలో ఉన్న 1,250 ఇళ్లలో సుమారు 8వేల మందిని, నందమూరినగర్‌లో చెందిన 2,250 మందిని, కంపరపాలెంలో 250 ఇళ్ల నుంచి 1,200 మందిని, పద్మనాభ నగర్లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మెనూ ప్రకారం భోజనం పునరావాస కేంద్రాల్లో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ భోజనం లేదా టిఫిన్ పెడుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారికి అవసరమైన మందులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం, మజ్జిగ, అరటి పండ్లు అందిస్తున్నాయి. ప్రభుత్వం తమకు అన్నివిధాల అండగా ఉందని బాధితులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లోనే భోజనం అందిస్తారు. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మాది పాలిమర్స్ కంపెనీకి సమీపంలో ఉన్న కృష్ణానగర్. గురువారం వేకువజామున విడుదలైన విషవాయువు కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తను నిండు గర్భిణి కావడంతో నాకు కాళ్లు చేతులూ ఆడలేదు. కాసేపటికే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి గోశాలలో ఆశ్రయం కల్పించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. – భారతి, శ్రీను దంపతులు ప్రభుత్వం బాగా చూసుకుంటోంది గ్యాస్ బయటకు రావడంతో ఊపిరి ఆడక అందరం పరుగులు తీశాం. ఇంతలో స్థానిక యువకులు మమ్మల్ని ఆటోలో బయటకు పంపేశారు. అధికారులు బస్సులో ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సమయానికి భోజనం, పిల్లలకు కావల్సిన పదార్థాలు అందిస్తూ బాగా చూసుకుంటోంది. – రాములమ్మ, వెంకటాపురం మాకు ఎలాంటి ఇబ్బందీలేదు గ్యాస్ లీకైన కొద్దిసేపటికే రోడ్డు మీద ఉన్న మమ్మల్ని వెంటనే గోశాలకు తరలించారు. పిల్లాపాపలతో వచ్చినా మాకు ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం అందిస్తున్నాయి. – సింహాచలం, వెంకటాపురం ప్రభుత్వ చేయూత మరిచిపోలేం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు సకాలంలో స్పందించడం వల్లే బతికి బట్టకట్టామని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు చెప్పారు. కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యులు, ఇతర సిబ్బంది తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని వివరించారు. ప్రస్తుతం తామంతా తేరుకున్నామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి ధైర్యం చెప్పడం మర్చిపోలేమన్నారు. బాధితుల మనోగతం వారి మాటల్లోనే.. పాప ఆరోగ్యం కుదుటపడింది ఆస్పత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు సకాలంలో స్పందించడం వల్ల అందరూ బతికారు. – పిల్లి రామలక్ష్మి, అఖిలప్రియ తల్లి వైద్యుల సేవలు మరువలేం నా ఇద్దరు పిల్లలకు కేజీహెచ్‌లో అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి. ప్రభుత్వం, రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించడం వల్ల మరణాలు తగ్గాయి. –భారతి, ఇద్దరు చిన్నారుల తల్లి బతుకుతా అనుకోలేదు ప్రమాదం జరిగిన 8 గంటల తరువాత ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. అసలు బతుకుతాననుకోలేదు. – అంబటి సిద్ధేశ్వరరావు, బాధితుడు సీఎం కృషి వల్లే.. ఆస్పత్రిలో చేర్చిన వారందరికీ మంచి వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కృషి వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. ఆయనకు మా కృతజ్ఞతలు. – దాసరి బిందు, బాధితురాలు -
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ సోదరులు
సాక్షి, హైదరాబాద్ : భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. (చదవండి : బయటపడ్డ రేవంత్‌రెడ్డి అక్రమాలు: క్రిమినల్ కేసు ) ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అసలు ఏం జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రేపటి(శుక్రవారం) వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చట్టం ప్రకారం నడచుకోవాలని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. (చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన! ) -
భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు నీటి వనరులను ధ్వంసం చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ఆక్రమించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు తుది విచారణ నివేదికను రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ సమర్పించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 12.02 ఎకరాలకు ప్రహరీ నిర్మించినట్లు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వెల్లడైంది. ఈ విస్తీర్ణంలో సర్వే నంబర్ 34 పరిధిలో 1.21 ఎకరాల భూమి ఉందని తేల్చారు. బండ్లబాటగా ఉన్న మరో 10 గుంటలు నామ రూపాల్లేకుండా పోయిందని గుర్తించా రు. ఈక్రమంలో భూ ఆక్రమణల చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవచ్చని సిఫారసు చేశారు. 126 సర్వే నంబర్ పరిధి కిందికి వచ్చే కోమటికుంట చెరువులోకి నీరు వెళ్లకుండా అడ్డుకునేలా ప్రహరీ ఉందన్నారు. సదరు ప్రహరీని రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి నిర్మించినట్లు విచారణలో తేలింది. సర్వే నంబర్ 127 లో 5.21 ఎకరాలకు వారసులు/హక్కుదారులు లేరని విచారణలో బహిర్గతమైంది. కోమటికుంట చెరువు ఆక్రమణల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వేనంబర్లు 127, 218, 34, 35, 160లో విస్తరించిన భూములపై విచారణ నిర్వహించారు. ఈ నివేదికను కలెక్టర్.. ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ఆశ చూపుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచా రణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. కేంద్రానికి దరఖాస్తు చేసుకోండి రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన తనకు 4 ప్లస్ 4 భద్రత కల్పించేలా కేంద్రానికి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. రెండు వారాల్లోగా దరఖాస్తు చేసుకుంటే అది అందిన ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఏపీలో 4ప్లస్4 భద్రత ఉన్న తనకు తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం 2ప్లస్2కు తగ్గించిందని, కేంద్ర భద్రత కల్పించాలని 2019 ఆగస్టు 28న కేంద్ర హోం శాఖకు చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందంటూ రేవంత్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
వేగం పెంచిన సీఐడీ
మంగళగిరి: రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా అసైన్డు భూముల కొనుగోలు వివరాలను సేకరిస్తోంది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే రాజధానిలోని అసైన్డు భూములు, లంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, పరిహారం ఇవ్వదంటూ టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ మీడియేటర్లు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సైతం అసైన్డు, లంక భూములు ప్రభుత్వానివే కనుక ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందంటూ జీవో జారీచేసి ఆ జీవోతో గ్రామాల్లో అసైన్డు, లంక భూముల యజమానులైన దళితులు, బీసీలను భయభ్రాంతులకు గురిచేసింది. మీ భూములు ప్రభుత్వం తీసేసుకుంటుందని, తమకు ఇస్తే ఎంతోకొంత డబ్బులు ఇస్తామంటూ టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితులు, చిన్నకారు రైతులను భయపెట్టి వారి వద్ద నుంచి ఆ భూములను కొనుగోలు చేశారు. ఎకరం కోట్లలో ఉన్న భూమిని పది లక్షలు, ఇరవై లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అనంతరం ప్రభుత్వం ఆ భూములకు పరిహారం ప్రకటించింది. దీంతో టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములను రాజధాని భూసమీకరణకు ఇచ్చి పరిహారంగా పొందిన ప్లాట్లను కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అసైన్డ్, లంక భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకున్నా కోర్టు ఉత్తర్వుల కాపీ ఒకటి సృష్టించి రిజిస్ట్రేషన్ అధికారులకు భారీగా లంచాలిచ్చి ముందుగా పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు. అసైన్డ్, లంక భూములను కొనుగోలు చేసిన నీరుకొండకు చెందిన టీడీపీ నాయకుడితో పాటు.. మరో పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి రిజిస్ట్రార్‌తో కలిసి 495 పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా.. విచారించిన ఉన్నతాధికారులు అప్పటి రిజిస్ట్రార్‌ను సైతం సస్పెండ్ చేశారు. నాటి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తీరుపై సీఐడీ ఆరా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాజధాని భూములపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే రాజధానిలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా.. విచారణ నిర్వహించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖనూ సీఐడీ అధికారులు కోరారు. సోమవారం మంగళగిరిలోని రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఐడీ అధికారులు అసైన్డ్, లంక భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మరికొన్ని దస్తావేజులు సేకరించి తీసుకెళ్లడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. టీడీపీ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరించిన అప్పటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. అప్పుడు పనిచేసిన అధికారులెవరు, టీడీపీ నాయకులు, రియల్ వ్యాపారులకు సహకరించిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారనే అంశాలపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
భూ మాయకు అడ్డుకట్ట!
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి ఐదు ఎకరాలుండగా రాత్రికి రాత్రే అతడి పేరుతో 30 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారు. సదరు భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్న రెండు రోజులకే ఆ భూమిని వెబ్ ల్యాండ్‌లో ఆయన పేరుతో లేకుండా ప్రభుత్వ ఖాతాలోకి మార్చేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వెబ్‌ల్యాండ్ పేరుతో గతంలో జరిగిన భూ మోసాలను వెలికి తీయడంపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ భూములను పరిరక్షించే దిశగా రికార్డుల స్వచ్ఛీకరణ, ఆటోమేటిక్ మ్యుటేషన్లకు నిబంధనలు రూపొందించింది. సర్వే నంబర్లవారీగా వెబ్‌ల్యాండ్ రికార్డులు తనిఖీ చేసి ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా లావాదేవీలను తనిఖీ చేయనున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారనే విమర్శలున్నాయి. కొంతమంది బడా నాయకులు రెవెన్యూ సిబ్బందిని ముడుపులతో సంతృప్తిపరిచి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున తమ పేర్లతో, బినామీల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఉండాలంటే తప్పకుండా దరఖాస్తు పట్టా (డీకేటీ) ఇచ్చి ఉండాలి. లేదంటే భూమి కేటాయించి ఉండాలి. ఇందుకు భిన్నంగా లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. రిటైర్డ్ అధికారుల కీలక పాత్ర కొందరు రిటైర్డు తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ/బదిలీకి ముందు భారీగా వసూళ్లు చేసి వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారు. కొందరైతే విచారణ జరిపినా బయటకు రాకుండా ఏకంగా రికార్డులు మాయం చేశారు. చాలా జిల్లాల్లో డీకేటీ రిజిస్టర్లు, భూ అనుభవ రికార్డు (అడంగల్), భూ యాజమాన్య హక్కుల పుస్తకం (1బి) పాతవి మాయం కావడం ఇందుకు నిదర్శనమని ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఎక్కువగా బంజరు భూములు ఉండటమే ఇందుకు కారణం. ఆర్ఎస్సార్తో సరిపోల్చాలి.. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్తో సరిపోల్చి సర్వే నంబర్లవారీగా డీకేటీ రిజిస్టర్, అడంగల్, 1 బి రికార్డులు, వెబ్‌ల్యాండ్‌ను పరిశీలిస్తే మోసాలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘ఉదాహరణకు ఓ గ్రామంలోని 102 సర్వే నంబరులో 30 ఎకరాలు ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రభుత్వ భూమి అని ఉందనుకుందాం. తర్వాత ప్రభుత్వం అది ఎవరికైనా అసైన్మెంట్ (డీకేటీ) పట్టా కింద ఇచ్చి ఉంటే డీకేటీ రిజిస్టర్లో ఉంటుంది. ఒకవేళ డీకేటీ ఇచ్చినట్లు నమోదు కాకుండా ఈ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేరుతో ఉంటే అక్రమ మ్యుటేషన్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’ అని రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ‘డీకేటీ పట్టాలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారనే వివరాలు కలెక్టరేట్లలో ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీలు చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి. అయితే అక్కడ కూడా రికార్డులు గల్లంతైతే మోసాలను వెలికి తీయడం కష్టం’ అని భూ వ్యవహారాలపై అనుభవజ్ఞుడైన ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటే...? ఏదైనా ఓ భూమిని కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి అందుతుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చి ఆమేరకు భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు సవరిస్తారు. కొనుగోలుదారుడు తన పేరుతో భూ రికార్డులను మార్చుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
ఏసీబీ వలలో రెవెన్యూ తిమింగలం
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి లంకే రఘుబాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఎనిమిదిచోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. రెవెన్యూ శాఖలో రఘుబాబు 1982లో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. 1995లో గ్రూప్–2 పరీక్ష పాసై డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. పెదపూడి, మారేడుమిల్లి, రాజమహేంద్రవరం, కాజులూరుల్లో తహసీల్దార్‌గా, కాకినాడ ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారిగా పని చేశారు. 2014లో కాకినాడ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. 38 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారి పని చేశారు. కాకినాడ ఆర్డీవోగా పని చేసిన సమయంలో వ్యవసాయ భూములను నాన్ లే అవుట్లుగా మార్చేందుకు రైతుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సామాజికవర్గం కావడంతో ఆయన హయాంలో సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను, పలు సామాజిక స్థలాలను ఆయన వర్గీయులకు డబ్బులు తీసుకొని అప్పగించేశారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ ఆర్డీవోగా ఉన్న సమయంలోనే వనమాడికి కాకినాడ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని ఇచ్చేశారని పలువురు రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్ఆర్ నగర్ రోడ్డు నంబర్–1లో ఉన్న రఘుబాబు ఇంటితో పాటు సెట్రాజ్ కార్యాలయం, రాజమహేంద్రవరంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుబాబు ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు, రూ.20 లక్షల డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, పలు బ్యాంకు పుస్తకాలతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు, ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను అధికారులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు పెదమల్లాపురం, గాజువాక, సూర్యారావుపేటల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, కాకినాడ ఆర్ఆర్ నగర్, సూర్యారావుపేటల్లో రెండు ఇళ్లు, శ్రీరామనగర్‌లో రెండు అపార్టుమెంట్లలో ప్లాట్లు, జి.వేమవరంలో పంట పొలాలు, రొయ్యల చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ రేటు ప్రకారం రూ.3.5 కోట్లు ఉండవచ్చని, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.15 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉందని చెప్పారు. రాత్రి 8 గంటలు దాటినా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌ఎస్‌ఈపైనా దాడులు మరోపక్క ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై కాకినాడ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంధం వెంకట పల్లంరాజుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసం ఉంటున్న సాత్వి రెసిడెన్షియల్ కన్వెన్షన్ హాలు 302 రూముపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ ఇంజినీర్‌గా పని చేసిన పల్లంరాజు కాకినాడ ఎస్ఈగా బదిలీపై వచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఆయనను ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని పల్లంరాజు ఇంట్లోను, మధురవాడ వుడా కాలనీలోని అతడి తమ్ముడి ఇంట్లోను సోదాలు చేశారు. తణుకులోని అతడి తండ్రి, సోదరి ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి, సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. భారీగా బంగారం, స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఇక ఆటోమేటిక్ మ్యుటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరించటాన్ని ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటారు. తద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్లూ మీ–సేవే శరణ్యం ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్‌చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముడుపులిస్తేనే మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి రోజూ వివరాలు.. అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మార్గనిర్దేశం మేరకు రెవెన్యూ శాఖలో ఆటోమేటిక్ మ్యుటేషన్ దిశగా కసరత్తు ఆరంభమైంది. ఆటోమేటిక్ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్ మ్యుటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలను సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు. గ్రామ సచివాలయాల్లోనే 63 సర్టిఫికెట్ల జారీ ప్రజలకు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ లాంటి 63 రకాల సర్టిఫికెట్లను గ్రామ సచివాలయాల్లోనే జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చుక్కల భూముల పరిస్థితిపై కూడా ఆమె సమీక్షించారు. -
నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..!
సాక్షి, తిరుపతి: ‘కుటుంబానికి ఆయనే పె ద్ద దిక్కు. శుభ కార్యానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలలో రక్తం గడ్డకట్టిపోవటంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తిరుపతిలో కష్టం అని చెప్పారు. దీంతో ప్రాణపాయ స్థితి లో చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి కే ఆస్తులు అమ్మి శక్తికి మించి వైద్యం చేయించాం. ఇంకా రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంటా. రేషన్‌కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి.’ సారూ... అంటూ తిరుపతి రూరల్ మండ లం చెర్లోపల్లె పంచాయతీ వెంకటపతినగర్ కు చెందిన రమేష్ భార్య గౌతమి కన్నీరుమున్నీరు అయ్యింది. ఆ మేరకు సోమవారం రూ రల్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ సుశీలాదేవికి వినతిపత్రం అందించింది. సాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ రమేష్ ఎస్వీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 14వ తేదీన పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రామాపురం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడని, దీంతో తలకు గాయమైందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రమే‹Ùకు తిరుపతి లో వైద్యం కష్టం అని చెప్పడంతో చెన్నై అపో లో ఆస్పత్రి ఐసీయూలో చేర్పించి, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.7 లక్షలకు పైగా ఖర్చు అయిందన్నారు. మరో రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతా యని వైద్యులు చెప్పారన్నారు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవా లని వేడుకున్నారు. తమకు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నారు. స్పందించిన తహసీల్దార్ కి రణ్‌కుమార్ వెంటనే ఆరోగ్యశ్రీకి వీరు అర్హులే అని సరి్టఫికెట్ అందించారు. ఇంకా అవస రం అయితే సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు. -
ఏసీబీ దాడులు చేస్తున్నా..
సాక్షి, కర్నూలు: ఈ ఏడాది సెపె్టంబర్ 23న ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంటు నరాల సంజీవరెడ్డి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అక్టోబర్ 10న సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ ఈ– పట్టా కోసం రెడ్డిపల్లికి చెందిన నరసింహారెడ్డి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నవంబర్ 8న గూడూరు తహసీల్దార్ షేక్ హసీనా తరఫున ఆమె సమీప బంధువు మహబూబ్‌బాషా గూడూరుకే చెందిన డమామ్ సురేష్ నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనితో పాటు తహసీల్దార్‌పై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండిపోయారు.ఈ నెల 16న కల్లూరు మండల ఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్ఏ మద్దిలేటి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నెల 17న కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో మామూళ్ల పంపకంలో వచ్చిన తేడా కారణంగా జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయలు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటనలన్నీ రెవెన్యూ శాఖలో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన అవినీతి బాగోతాలను తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతి నెలా ఏదో ఒకచోట రెవెన్యూ అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వాటాల పంపకాల్లో తేడా కారణంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది కొట్టుకునే స్థాయికి వెళుతున్నారు. దీనివల్ల ఆ శాఖ పరువు గంగలో కలసి పోతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడంలేదు. వరుస దాడులు చేస్తున్నా.. రెవెన్యూ శాఖలో మండల స్థాయి నుంచి జిల్లా పరిపాలన కార్యాలయం వరకు అవినీతి కంపు కొడుతోంది. మూడేళ్లలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 13 మంది అధికారులను ఏసీబీ పట్టుకుంది. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఆన్లైన్ పట్టాదారు పాసుపుస్తకం, అడంగల్, 1బీ, ఇతర ఫారాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు. జిల్లాలో 6.94 లక్షల మంది రైతులు(పట్టాదారులు) ఉన్నారు. వీరిలో 6.39 లక్షల మంది వరకు వివరాలను ఆన్లైన్ చేసి 1బీ ఇచ్చారు. మిగిలిన వారిని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, వివరాల ఆన్‌లైన్‌కు తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వారి పనిని నిరీ్ణత సమయంలో పూర్తి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. అయితే వారికి మామూళ్లు ఇవ్వకపోతే పని కావడంలేదు. చిన్న పనికైనా కనీసం రూ.5 వేలు తీసుకుంటున్నారు. అదే వివాదాల్లో ఉన్న భూములైతే వాటి విలువలో 5–10 శాతం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గూడూరు తహసీల్దార్ రూ.8 లక్షలు డిమాండ్ చేసి.. చివరకు రూ.4 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో గోనెగోండ్ల మండలంలో ఓ వీఆర్వో డబ్బు తీసుకుని కూడా పని చేయకపోవడంతో కులమాలకు చెందిన రైతు చేతిలో దెబ్బలు తిన్నాడు. ఇటీవల దేవనకొండలో ఓ రైతు భూమిని ఆన్లైన్ చేయడానికి వీఆర్వో రూ.60 వేలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు సెల్ఫోన్లో చిత్రీకరించి..బహిర్గతపరిచాడు. ఇలాంటి ఘటనల కారణంగా రెవెన్యూ శాఖ పరువు పోతోంది. కాగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పరితపిస్తున్నారు. అందులో భాగంగా రైతులు, ఇతరులను లంచాల కోసం పీడించే అధికారులపై నిఘా ఉంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. దీంతో ఏసీబీ వరుస దాడులు చేస్తోంది. అవినీతిపరులు ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని, వారి భరతం పడతామని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధ్యతను మరచి పనిచేస్తే ఉపేక్షించేది లేదు రెవెన్యూ సిబ్బంది కార్యాలయం లేదా క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇది వారి బాధ్యత. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరించినా...అవినీతికి పాల్పడినా లేదా శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించినా ఉపేక్షించబోం. కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో గొడవ పడిన వీఆర్వోలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలను సస్పెండ్ చేశాం. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నాం. – జి. వీరపాండియన్, కలెక్టర్ -
వీఆర్వో గల్లా పట్టిన మహిళ
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓ మహిళ హల్చల్ చేసింది. తన భర్త పేరిట ఉన్న భూమిని అతని సోదరులపై అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ వీఆర్వో కాలర్ పట్టుకుంది. మండలంలోని నమిలికొండలో కనకమ్మ భర్త లింగాల లచ్చయ్య, అతని సోదరులిద్దరికి 8 గుంటల చొప్పున భూమి ఉంది. కనకమ్మ భర్త చనిపోవడంతో కొన్నాళ్లుగా తల్లి ఊరైన మంగపేటలో ఉంటోంది. కనకమ్మ స్థానికంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమె బావ, మరిది కుమారులు కనకమ్మకు సంబంధించిన 8 గుంటల భూమిని వారి పేరిట మార్చుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. ఇదే విషయమై వీర్వోను ప్రశ్నిస్తూ కాలర్ పట్టుకుంది. వీఆర్వో రమేశ్ మాట్లాడుతూ కనకమ్మ తనను గతంలో ఒకసారి కలిసిందన్నారు. మళ్లీ సోమవారం రాగా.. ఫోన్లో ఆమె మరిది నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేసిందని పేర్కొన్నారు. -
పేదల భూమిలో టీడీపీ కార్యాలయం
సాక్షి, అమరావతి బ్యూరో: పేదల భూమిని ఆక్రమించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పనులు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 3.65 ఎకరాల స్థలంలో మూడు బ్లాకులుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం చేపట్టారు. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం ఖరీదు రూ.70 కోట్ల పైమాటే. వాస్తవానికి 1993లో అప్పటి ప్రభుత్వం ఆత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 392 సర్వే నంబర్లో 3.50 ఎకరాల భూమిని సాగు నిమిత్తం షేక్ బాజీకి కేటాయించింది. అప్పటి నుంచి ఆ భూమిపైనే ఆధారపడి ఆయన జీవనం సాగించారు. బాధితుల్లో ఒకరు టీడీపీ మంగళగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు కావడం గమనార్హం. ఆక్రమణకు బీజం పడిందిలా.. 2014లో షేక్ బాజీ మరణాంతరం ఆ భూమిని తమ పేరిట బదలాయించాలని ఆయన కుమారుడు షేక్ సూఫీబాబా మంగళగిరి రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన, ఆ తర్వాత రాజధాని అమరావతి ప్రకటనతో ఈ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. షేక్ సూఫీబాబా పేరిట భూమిని బదలాయించకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సూఫీబాబా హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు సంబంధిత భూమిని నిజమైన హక్కుదారులైన సూఫీబాబా పేరిట బదలాయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఆత్మకూరులోని సర్వే.నం.392లో ఉన్న భూమి షేక్ బాజీది కాదని రెవెన్యూ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించారు. ఆ భూమి నిజమైన హక్కుదారుడు జొన్నాదుల సాంబశివరావు అంటూ తప్పుడు సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. దీంతో బాధితుడు షేక్ సూఫీబాబా మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి పనులు చేపట్టొదంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఇవేమీ పట్టించుకోని అధికారులు సూఫీబాబా సాగు చేసుకుంటున్న కంది పంటను రాత్రికి రాత్రే దున్నేసి చదును చేశారు. 99 సంవత్సరాల పాటు లీజుకు.. 2017 నవంబర్‌లో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూ కేటాయింపు పూర్తికాకముందే శంకుస్థాపన చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. శంకుస్థాపన చేసిన తర్వాత అదే ఏడాది డిసెంబర్లో ఆ స్థలాన్ని 99 ఏళ్ల పాటు ఎకరాకు ఏడాదికి రూ.1,000 నామమాత్రపు రుసుంతో లీజుకు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై బాధితులు గగ్గోలు పెట్టినా ఆ పార్టీ నాయకులు లెక్కచేయలేదు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 2.20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం మొత్తం 3.65 ఎకరాల్లో సుమారు 2.20 లక్షల చదరపు అడుగుల్లో మూడు బ్లాకులుగా టీడీపీ ఆఫీసు నిర్మాణం సాగుతోంది. అండర్ గ్రౌండ్లో రెండు ఫ్లోరులతో పాటు జీ+3 విధానంలో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ‘సిట్’తో విచారణ జరిపించాలి ‘‘అధికారం అండతో మా భూమిని తెలుగుదేశం పార్టీ కబ్జా చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.20 కోట్లు పలుకుతోంది. హైకోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని అధికారం అండతో, అధికారుల సహకారంతో ఆక్రమించుకున్నారు. మా స్థలాన్ని మాకు అందజేయాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలి’’ – షేక్ సూఫీబాబా, బాధితుడు రాత్రికి రాత్రే కబ్జా చేసేశారు ‘‘స్థల వివాదం హైకోర్టులో ఉంది. కోర్టు కమిషన్ వేసింది. కమిషన్ సభ్యులు వస్తారని సమాచారం రావడంతో రాత్రికి రాత్రే మొత్తం పంటను ఆధారాలు లేకుండా మా పార్టీ నాయకులే దున్నేశారు. 3.65 ఎకరాల్లో నాకు 15 సెంట్ల భూమి ఉంది. న్యాయం చేస్తామని చెప్పి మూడేళ్లవుతోంది. ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు. మైనార్టీలమనే చులకన భావంతోనే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇలా చేస్తున్నారు’’ – షేక్ సుబానీ, మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు -
అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని చక్రాయపేట మండలం ఉప్పల వాండ్ల పల్లే గ్రామం ఉప్పల కుంట చెరువులో టీడీపీకి చెందిన వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. చెరువులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనల మేరకే ఇంటిని కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు. -
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఉద్దేశించిన విధానంపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమించారు. భూపరిపాలనా శాఖ ప్రత్యేక కమిషనర్‌ను కన్వీనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఉగాది నాటికి 25 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది -
మాయా భవంతి!
సాక్షి, గుంటూరు: అదో మాయా భవంతి.. లీజుకు తీసుకున్న స్థలాన్ని రెన్యువల్ చేసుకోకపోవడం ఒక అంశమైతే పక్కనే ఉన్న జాగాను సైతం ఆక్రమించి అధికారం అండతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం మరో కోణం. కార్పొరేషన్ రికార్డుల్లో మాత్రం అసలు అక్కడ ఓ భవనం ఉన్న దాఖలాలే లేవు. చెప్పాలంటే అసలు కార్పొరేషన్ స్థలాన్నే ఆక్రమించి భవన నిర్మాణాన్ని చేపట్టారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణం వెనుక నిర్వాకాలు ఇవీ. ఇలాంటి భవనం నుంచే టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక తన కార్యకలాపాలన్నీ కొనసాగిస్తానంటూ ప్రకటించడం గమనార్హం. పన్నుతో సరిపుచ్చాలంటూ పైరవీలు... చిరు వ్యాపారులు చిన్న రేకుల షెడ్డు వేస్తేనే పొక్లెయిన్లతో వెళ్లి కూల్చివేసే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు నగరం నడిబొడ్డున అనుమతులు లేకుండా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం గురించి పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురైనా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అద్దె, పన్ను రూపంలో కార్పొరేషన్ ఖజానాకు భారీ గండిపడుతున్నా గుంటూరు నగరపాలక సంస్థకు కనీసం చీమకుట్టినట్లయినా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కట్టడాలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అనుమతులు లేని టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి పన్ను విధించి సరిపుచ్చాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్రమ కట్టడాన్ని సక్రమంగా మార్చుకునేందుకు రెవెన్యూ విభాగంలో తమకు అనుకూలంగా వ్యవహరించే ఓ అధికారి ద్వారా టీడీపీ నేతలు పైరవీలు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి టీడీపీకి చెందిన ఓ సీనియర్ మాజీ ఎమ్మెల్యేకు బంధువు కావడం గమనార్హం. లీజుకు తీసుకుని... పక్కనే ఆక్రమించి గుంటూరు అరండల్‌పేట 12/3 టీఎస్ నంబరు 826లోని వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 1999 జూలై 1వతేదీన 30 ఏళ్ల లీజుపై తీసుకున్నారు. ఏటా రూ.25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లించడంతోపాటు మూడేళ్లకోసారి లీజు రెన్యూవల్, 33 శాతం అద్దె పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఆ పక్కనే ఉన్న 1,637 చదరపు గజాల కార్పొరేషన్ స్థలాన్ని సైతం ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంతస్తుల భారీ భవనాన్ని నిర్మించి టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 2014లో టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే అందులో ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం స్థలానికి ప్రహరీని నిర్మించారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమ కట్టడానికి నగరపాలక సంస్థ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. 20 ఏళ్లుగా సదరు భవనానికి అనుమతులు లేకుండా, రూపాయి కూడా పన్ను చెల్లించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఖజానాకు భారీగా గండి టీడీపీ కార్యాలయ భవనం కోసం వెయ్యి గజాలు మాత్రమే కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకున్నారు. అది కూడా మూడేళ్లుగా రెన్యువల్ చేసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆ పక్కనే సుమారు రూ.30 కోట్ల విలువ చేసే కార్పొరేషన్‌కే చెందిన 1,637 గజాల స్థలాన్ని కూడా ఆక్రమించి టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి 20 ఏళ్లుగా రూపాయి కూడా పన్ను కట్టని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా మేలుకొనివిలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అనుమతులు లేవు గుంటూరు అరండల్‌పేట 12/3లో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి అనుమతులు లేవు. సుమారు 15 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటివరకు ఈ భవనానికి పన్ను వేయలేదు. అనుమతులు లేకపోవడం వల్లే పన్ను విధించలేదు. రికార్డులు పరిశీలించి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నోటీసులు జారీచేస్తాం. – చక్రపాణి, గుంటూరు సిటీ ప్లానర్ -
దేవుని భూములనూ వదల్లేదు
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): బుచ్చిరెడ్డిపాళెం మండలం కావేటిపాళెంలో సుమారు 530 ఎకరాల దేవదాయ ధర్మాదాయ శాఖ భూములున్నాయి. వీటిని సెక్షన్ 22ఏ కింద నిషేధిత భూములుగా ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ శాఖ గెజిట్ పబ్లికేషన్‌లో నిషేధిత భూములుగా ఇచ్చి ఉన్నారు. వీటిని మళ్లీ రివైజ్డ్ చేసి కూడా 2018 జూన్ 2వ తేదీన నిషేధిత జాబితాలో చూపించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కోదండరామస్వామి దేవస్థానానికి ఇనాంగా వచ్చినట్లు, ఆలయానికి చెందినదిగా ట్రిబ్యునల్‌లో కేసు సైతం వేశారు. నిషేధిత భూములకు అడంగల్, 1బీ నిషేధిత భూములకు గతంలో తహసీల్దార్‌గా ఉన్న రామలింగేశ్వరరావు, ఆర్ఐ, వీఆర్వో కృష్ణప్రసాద్ టీడీపీ నేతలతో కుమ్మక్కై ప్రస్తుతం భూములను సాగుచేస్తున్న వారి పేర్లను అడంగల్, 1బీలో నమోదు చేశారు. కేసులతో పాటు నిషేధిత జాబితాలో ఉందని తెలిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి మరీ భూములకు సంబంధించి అడంగల్, 1బీలో పేర్లు నమోదు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధం లేని ఈ భూములను దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి లేకుండాను తమ ఇష్టానుసారంగా మ్యుటేషన్ చేసి హక్కులు కల్పించారు. కేవలం అగ్రిమెంట్స్‌పై అడంగల్‌తో పాటు 145 ఖాతాల నంబర్లను క్రియేట్ చేసిన ఘనత ఈ అధికారులదే. ఏకంగా 300 ఎకరాల నిషేధిత భూములను పట్టాలుగా మార్చేశారు. రూ.60 లక్షలకు పైగా స్వాహా నిషేధిత భూములను సాగుచేసుకుంటున్న వారి నుంచి పంచేడుకు చెందిన టీడీపీ నేతలు 60 లక్షలకు పైగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. వీటిలో తహసీల్దార్ రామలింగేశ్వరరావుతో పాటు ఆర్ఐ, వీఆర్వోకు ముట్టజెప్పినట్లు సమాచారం. మిగతా ఆయా నేతలు స్వాహా చేశారని అంటున్నారు. గత కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్ కావేటిపాళెంలో రెవెన్యూ అధికారులు దందా విషయంపై గత కలెక్టర్ ముత్యాలరాజుకు పలువురు రైతులు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ రామలింగేశ్వరరావు చేసిన దందాపై వివరాలు తెలిపారు. దీంతో ముత్యాలరాజు సీరియస్ అయ్యారు. దీంతో పాటు పలు నిషేధిత భూములకు పట్టాలు మంజూరుచేయాలన్న తహసీల్దార్ ప్రతిపాదనలపై మండిపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్నికల ముందు ఇప్పుడు విధుల్లో ఉన్న తహసీల్దార్ల సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఆరోపణలున్నా.. మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి కావేటిపాళెంలో జరిగిన దందా జిల్లా మొత్తం హాట్‌టాపిక్‌గా మారిన రామలింగేశ్వరరావును మిగిలిన వారి పేర్ల నమోదుకు సంబంధించి పలువురు టీడీపీ నేతలు మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పలు భూములకు సంబంధించి నాయకుల పేర్లు నమోదు చేసేందుకు సమయం లేకుండా పోయింది. అందుకోసం ఇతరులను పురమాయించామని, దాదాపు ఖరారయిందని టీడీపీ నేతలు చెప్పడం విశేషం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి అవినీతి అధికారులపై ప్రస్తుత కలెక్టర్ శేషగిరి బాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి పేదలకు ఇచ్చేందుకు సెంటు భూమి లేదని చెబుతున్న రెవెన్యూ అధికారులు నిషేధిత భూములకు లంచాలు తీసుకుని పలువురి పేర్లను రికార్డులో నమోదు చేయడం దారుణం. ఓ వైపు రిజిస్ట్రేషన్ శాఖ గెజిట్ పబ్లికేషన్ విడుదల చేసి ఉన్నప్పటికీ, సంబంధం లేని రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో పలువురి పేర్లను పట్టాదారులుగా అడంగల్, 1బీలో నమోదు చేయడం దారుణం. దీనికి కారకులైన అప్పటి తహసీల్దార్ రామలింగేశ్వరరావు, ఆర్ఐ, వీఆర్వోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పచ్చా మధుసూదన్‌రావు, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావేటిపాళెం భూముల విషయం నా దృష్టికి రాలేదు కావేటిపాళెంలోని నిషేధిత భూములకు పట్టాదారులుగా పలువురి పేర్లు చేర్చిన విషయం నా దృష్టికి రాలేదు. నిషేధిత భూములకు అడంగల్, 1బీ ఇచ్చే హక్కు లేదు. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ, నెల్లూరు -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కలకలం
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ మూడో ఖజానాగా పేరుగాంచిన రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు గాను ఏసీబీ సోదాలు ప్రారంభించింది.æ ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. కాజీపేట నిట్ ఏరియాలోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షించి, రోజువారి చేపడుతున్న దస్తావేజుల వివరాలను ఆరా తీశారు. స్లాట్ బుకింగ్‌తో పాటు సామాన్య రిజిస్ట్రేషన్లను, వీఎల్టీ ఆధారంగా చేపట్టాల్సిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ల వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలతో తీవ్ర కలకలం రేగింది. కార్యాలయ సిబ్బందితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్లపై నజర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, భూకొనుగోలుదారుడు స్వయంగా దస్తావేజులను తయారు చేసుకునేందుకు పబ్లిక్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుట్టింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికారు. కాగా, డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే ‘రైట్’ అంటూ పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా ఉద్యోగ విరమణ పొందిన కొందరు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు తెరలేపుతున్నారు. ఏకంగా రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లుగా మారుతున్నారంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారి హవా తెలుసకోవచ్చు. వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలను ఏసీబీ అధికారులు పర్యవేక్షించి రోజువారీ వివరాలపై కూపీ లాగినట్లు సమాచారం. -
అమరావతిలో అధికారుల అరాచకం
తుళ్లూరురూరల్(తాడికొండ): రాజధానికి భూములు ఇవ్వని రైతులపై ఏడీసీ, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల వేధింపులు పరాకాష్టకు చేరాయి. అనుమతి లేకుండా రైతు పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణానికి పూనుకోవడమే కాకుండా.. అడ్డుకున్న రైతును ఈడ్చేసి అరెస్టు చేయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె రాం మీరాప్రసాద్‌కు వెలగపూడి రెవెన్యూలో పొలం ఉంది. అతను సీఆర్డీఏకు భూమి ఇవ్వకపోవడంతో మూడేళ్లుగా అనేక రకాలుగా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తుళ్లూరు తహసీల్దార్ ఐ.పద్మావతి, సీఐ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఇద్దరు ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లను తీసుకుని సచివాలయం వెనుక నిర్మిస్తున్న ఎన్–9 రహదారి వద్దకు చేరుకున్నారు. డ్రోజర్లు, పొక్లెయిన్లు, లారీల ద్వారా గ్రావెల్‌ను తీసుకొచ్చి రైతు పొలంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రైతు గద్దె రాం మీరాప్రసాద్ తన కుటుంబసభ్యులు, న్యాయవాదితో అక్కడకు చేరుకున్నారు. తన పొలంలో రహదారి నిర్మాణం చేపట్టడానికి వీలులేదని, హైకోర్టు నుంచి స్టే ఉందని తెలిపారు. రైతుకు సమాచారం ఇవ్వకుండా ఎలా నిర్మిస్తారని తహసీల్దారును ప్రశ్నించగా.. ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఏడీసీ అధికారులు రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణం చేయడానికి వీలులేదని కోర్టు తెలుపలేదని ఏడీసీ ల్యాండ్స్ డైరెక్టర్ బి.రామయ్య తెలిపారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువస్తే అప్పుడు పనులు నిలిపేస్తామని చెప్పారు. అనంతరం పోలీసుల సహకారంతో పొలంలో పనులు ప్రారంభించారు. అడ్డుకున్న రైతును పోలీసులు పొలం నుంచి ఈడ్చేశారు. అండగా నిలిచిన రైతులు, నేతలకు బెదిరింపులు రైతుకు అండగా వచ్చిన స్థానిక రైతులను, వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలపై తుళ్లూరు డీఎస్పీ కె.కేశప్ప బెదిరింపులకు దిగారు. ఇది అధికారులు, రైతు విషయమని, ఇంకెవరైనా మాట్లాడినా, కలుగజేసుకున్నా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తమ నిర్మాణ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఏడీసీ ఈఈ ఎలంగోవన్ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతు మీరాప్రసాద్‌ను, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి మెరుగుమళ్ల రవిని అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నా భూమిలో నిర్మాణం తొలగిస్తాను ఈ భూమి నాది. హైకోర్టు స్టేని ఉల్లంఘించి పోలీసులు బలవంతంగా నన్ను నా పొలం నుంచి బయటకు ఈడ్చుకు వచ్చి అరెస్ట్ చేశారు. నన్ను వేధింపులకు గురిచేసిన ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకునేలా కోర్టును ఆశ్రయిస్తాను. గతంలోనూ పోలీసులు నా చొక్కా చించేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు. తుళ్లూరు ఎమ్మార్వో పద్మావతి, ఏడీసీ అధికారి రామయ్య, డీఎస్పీ కేశప్ప, సీఐ వి.శ్రీనివాసరెడ్డిపై కోర్టుకు వెళ్తాను. న్యాయం జరిగే వరకు పోరాడతాను. నా పొలంలో నిర్మించిన రోడ్డును తొలగిస్తాను. – గద్దె రాంమీరాప్రసాద్, బాధిత రైతు -
ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నారు
పెద్దపల్లి: ‘స్వాతంత్య్ర పోరాటం చేసిన నా భర్త వెంకటయ్యకు ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఎనిమిదేళ్లు సాగు చేసుకున్నం.. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమంటే రామగుండం రెవెన్యూ అధికారులు అప్పు డు రూ.10 వేల లంచం అడిగిండ్రు. లంచం ఇవ్వలేక పట్టాదారు పాసుపుస్తకం తీసుకోలేదు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రాజెక్టు పేరిట తీసుకున్నరు’ అని స్వాతం త్య్ర సమరయోధుడు వెంకటయ్య భార్య, మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణు తల్లి మల్లోజుల మధురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకుంది. రజాకార్లతో పోరాడిన తన భర్తను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి రామగుండం మండలం ఎల్లంపల్లిలో ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు లంచం అడిగినందుకు ఆగ్రహంతో పాసు పుస్తకం తీసుకోలేదని తెలిపారు. సర్వే నంబర్ 126లోని ఎనిమిది ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయిందని అధికారులు చేతులెత్తేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు స్థానిక అధికారులను కలిస్తే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని దాటవేస్తున్నారని తెలిపారు. భూమికి ప్రతిఫలంగా మరోచోట భూమిని కేటాయించాలని వేడుకుంది. -
పచ్చ నేతల పనికి ఇబ్బందులు పడ్డ అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో టీడీపీ మరో రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ విజయవాడ, గుంటూరులలో హోర్డింగులను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గుంటూరులో బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ‘మోదీ గో బ్యాక్’ అంటూ ఉన్న పెద్దపెద్ద హోర్డింగులను శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం హోర్డింగులు, కరపత్రాల కింద వాటిని ముద్రించినవారి పేర్లు, ముద్రణ సంస్థల పేర్లు ఉండాలి. అయితే ఆ హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారో వారి పేర్లుగానీ, వాటిని రూపొందించిన ప్రచురణ సంస్థల పేర్లుగానీ లేవు. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, టీడీపీ కార్యక్రమాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల స్థానంలోనే ‘మోదీ గో బ్యాక్’ హోర్డింగులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార కాంట్రాక్టు పొందిన సంస్థతోనే ఈ హోర్డింగులు ఏర్పాటు చేయించారని సమాచారం. సందిగ్ధంలో అధికారులు అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులపై ఎలా స్పందించాలో అర్థమవక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. రాష్ట్రప్రభుత్వమే తెరవెనుక ఉండి ఏర్పాటు చేయడంతో.. వాటిని తొలగించేందుకు అధికారులు శనివారం సాయంత్రం వరకూ సాహసించలేకపోయారు. అయితే ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ, ఎస్పీజీ ఉన్నతాధికారులు ఈ హోర్డింగులపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలపాలని కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చెప్పాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇబ్బందిపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే ఆ హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. దాంతో తర్జనభర్జనల అనంతరం రాష్ట్ర పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం తరువాత ఆ హోర్డింగులలో కొన్నింటిని తొలగించారు. -
రాష్ట్రపతి కోసం ప్రత్యేక భవనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. వైటీడీఏ ఆధ్వర్యంలో రూ.2,000 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే పెద్దగుట్ట లే అవుట్, ప్రధానాలయం అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానానికి వచ్చే వీవీఐపీల బస కోసం ప్రెసిడెన్షియల్ సూట్ (గెస్ట్‌హౌస్)ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సామాన్య భక్తుల కోసం వసతిగృహాలను నిర్మిస్తున్న వైటీడీఏ వీవీఐపీలు, వీఐపీల కోసం కూడా ప్రెసిడెన్షియల్ సూట్ల పేరుతో ప్రత్యే కంగా గెస్ట్‌హౌస్‌లను నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా యాదాద్రి క్షేత్ర మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రూ.104 కోట్ల తో అత్యాధునిక హంగులతో ప్రత్యేక గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. యాద గిరిపల్లి శివారులోని గుట్ట ప్రాంతంలో సర్వేనంబర్ 146లో 13.26 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించి వైటీడీఏకు అప్పగించారు. ఎన్ని నిర్మిస్తారంటే.. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే వీవీఐపీల కోసం 15 ప్రెసిడెన్షియల్ సూట్లను నిర్మిస్తున్నారు. ఇందులో కొండపైన అన్నిటికన్నా ఎత్తులో కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, గవర్నర్, సీఎంల బస కోసం ఓ అతిథిగృహాన్ని నిర్మిస్తారు. 14 గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తారు. ఇందులో 8 అతిథిగృహాల నిర్మాణం జరుగు తోంది. వీటికోసం ప్రత్యే కంగా రోడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ సూట్లలో విశాలమైన గదులు, సమావేశ మందిరాలుంటాయి. అత్యాధునిక ఫర్నిచర్, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో కళాఖండాలతో రమణీయంగా తీర్చిదిద్దనున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక సదుపాయాలు, ఆవరణలో పచ్చదనం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయం పూర్తయ్యేలోపు ఈ పనులన్నిం టిని పూర్తి చేయనున్నారు. నాలుగు స్తంభాల మంటప నిర్మాణం యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో మరో అద్భుత శిల్పకళా ఖండం రూపుదిద్దుకుంటోంది. స్థపతులు మరో అద్భుత శిల్ప గోపుర మంటపానికి శ్రీకారం చుట్టారు. ఆలయానికి ఈశాన్యంలో 4 స్తంభాలను కాకతీయ శిల్పశైలితో నిర్మిస్తున్నారు. ఈ స్తంభాల నిర్మాణంలో పాశుపాదం, విగ్రహస్థానం, అష్టపట్టం, చతురస్రం, అమలకం, పద్మం, పొందిక వంటి ముద్రికలను చెక్కారు. రామాయణంలోని ప్రధానఘట్టాలనూ రాతి స్తంభాలపై చెక్కారు. సీత జననం, శ్రీరామలక్ష్మణ, భరత, శతృఘ్నుల జననం, విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యాసం, సీతా స్వయంవరం, భరతుడికి శ్రీరాముని పాదుకలు ఇవ్వడం, రావణుడు సీతాపహరణ సమయంలో జటాయువు పోరాటం, వాలీసుగ్రీవుల పోరాటం, లంకలోని అశోక వనంలో ఉన్న సీతకు హన్మంతుడు అంగుళీయకం ఇవ్వడం, రావణ వధ, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను స్తంభాలపై చెక్కారు. -
గల్ఫ్‌లో మృత్యుఘోష!
జగిత్యాల రూరల్: ఉన్న ఊరులో ఉపాధి దొరకక.. ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. కొంత మంది ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమవారి ఆచూకీ లభ్యం కాక వేలాది మంది కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్, మస్కట్, బెహరాన్, దోహఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చెందిన సుమారు 1,523 మంది మృత్యువాత పడటం చూస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 1,450 మంది గల్లంతు రాష్ట్రం ఏర్పడిన నుంచి గల్ఫ్ దేశాల్లో సుమారు 1,450 మంది వరకు గల్లంతయ్యారు. ఇంత వరకు తమతో సత్సంబంధాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడున్న వారితో పాటు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆచూకీ లభ్యం కావడం లేదు. కాగా, అనారోగ్యంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో మరణించిన సుమారు 453 మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా పోయింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినా సరైన ఆధారాలు లేవని అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో అనాథ శవాలుగా మిగిలిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువు మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందక ఆ కుటుంబాలు ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నాయి. 2009లో అప్పటి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేవారు. ప్రస్తుతం ఆ సహాయం కూడా అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థిక సహాయం అందక అల్లాడిపోతున్నాయి. దీంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారికి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులు ఐదేళ్లలో సుమారు 5,435 మంది అక్కడి చట్టాలు తెలియక చేసిన నేరాలకు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ సామాజిక సర్వే అంచనా వేసింది. వీళ్లలో కొంత మంది తెలిసీ తెలియక, మరికొంత మంది క్షణికావేశంలో తప్పులు చేసినవారున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడితే గానీ వీరు స్వరాష్ట్రం రావడం కష్టంగా మారింది. కొంత మందికి అక్కడ న్యాయశాఖ సలహాలు దొరకక చిన్నపాటి నేరాలకు కూడా ఏళ్ల పాటు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇక్కడి కుటుంబీకులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే గానీ వారి ఇంటికి చేరుకోవడం కష్టతరంగా ఉంది. నా భర్తను విడిపించండి రాయికల్ (జగిత్యాల): ‘నా భర్త సౌదీ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని విడిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’.. అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మర్‌పల్లికి చెందిన రాజేశ్వరి వేడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకటి ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సరైన జీతం ఇవ్వకపోవడంతో కల్లివెల్లి అయ్యాడు. ఏడు నెలల నుంచి వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి రావాలంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. వెంకట్ అక్కడ పోలీసులను ఆశ్రయించగా ఆయనకు మూడు నెలల శిక్షను విధించారు. నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తాను జైల్లో తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు వివరించారు. తన భర్తను సౌదీ జైలు నుంచి విడిపించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను రాజేశ్వరి వేడుకుంటోంది. 25 ఏళ్లుగా ఆచూకీ లేదు నా భర్త ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి 2,3 సార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. 25 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. దుబాయ్‌లో ఉన్న మా గ్రామస్తులు కూడా ఆచూకీ కన్పించడం లేదని చెబుతున్నారు. పాతికేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్నాం. – రాగుల ప్రమీల, పొరండ్ల, జగిత్యాల మండలం పదేళ్లుగా ఎదురుచూపులు నా భర్త 20 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో నా భర్త మృతి చెందాడని కంపెనీ వారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని గుర్తుపట్టలేదు. స్వగ్రామానికి పంపించలేదు. – నాదర్బేగం, మోర్తాడ్ ఆర్థిక సహాయం కరువు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా చాలా కంపెనీలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ మృతులకు ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే గానీ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం కష్టతరంగా మారింది. – షేక్ చాంద్ పాషా, గల్ఫ్ సామాజిక సేవకుడు, జగిత్యాల -
ఓ.. ఇతను ఆ బాహుబలినా?
సాక్షి, హైదరాబాద్: తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ప్రభాస్‌కు ఊరట దక్కలేదు. రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పెన్మక్తలోని సర్వే నం. 5/3లో ఉన్న తన 2,083 చదరపు గజాల స్థలం విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చట్టబద్ధంగా కొనుగోలు చేశాం.. ప్రభాస్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఈ స్థలాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేశారని తెలిపారు. ఈ స్థలం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, అయినా పిటిషనర్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అది అధికారుల పరిశీలనలో ఉందని కోర్టుకు నివేదించారు. రెవెన్యూ అధికారులు ఇటీవల ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా చెబుతూ, గేటుకు తాళం వేశారని చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబర్ 5/3లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెప్పారు. క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది దారిద్య్ర రేఖకు (బీపీ ఎల్) దిగువన ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ బీపీఎల్ పరిధిలోకి వస్తారా అని ప్రశ్నించింది. అయితే ప్రభాస్ బీపీఎల్ పరిధిలోకి రారని, ఆయన బాహుబలి అని శరత్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ ఇతను ఆ బాహుబలినా.. మరి పిటిషన్లో ఉన్న పేరు అతనిదేనా? అంటూ ఆరా తీసింది. పిటిషనర్ అతనేనని నిరంజన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. కాగా, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి శరత్ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ స్థలంలో ఉన్న భవనాన్ని కూల్చివేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రభాస్ తన వాదనలు చెప్పుకొనేందుకు తగిన సమయం ఇస్తామని చెప్పారు. అయితే కనీసం గేటు తాళం తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నిరంజన్ అభ్యర్థించారు. అయితే, దీనిపై ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. మాకు ప్రయోజనం లేదు.. యథాతథస్థితి (స్టేటస్) ఉత్తర్వుల జారీకి ధర్మాసనం ప్రతిపాదించింది. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే మధ్యంతర ఉత్తర్వుల జారీని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం తమిళనాడులో ఉదంతాన్ని గుర్తు చేసింది. అక్కడ సొంత భూముల్లో అనుమతుల్లేకుండా భవనాలు కట్టుకుని, ఆ తర్వాత క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఇక్కడ ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే భవనాలు కట్టుకుని, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఆస్తిని పిటిషనర్‌కు అప్పగించే విషయంపై వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. అప్పటికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రెవెన్యూలీలలు
లింగసముద్రం రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అడ్డూ అదుపు లేకుండా ఇష్టా్టరీతిన ఆన్లైన్ మోసాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మండల పరిధిలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరగడం, భూముల ఆన్లైన్ చేయడం.. వంటి మోసాలను ఇప్పటికే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు గుర్తించారు. బాధ్యులపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కందుకూరు: లింగసముద్రం మండలంలో రెవెన్యూ అధికారుల అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఒకరి పేరుపై ఉన్న భూములను మరొకరి పేరుపై ఆన్లైన్ చేయడం, ప్రభుత్వ భూములను అప్పన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వంటివి జోరుగా సాగాయి. వీటిలో ప్రధానంగా తూనుగుంట గ్రామానికి చెందిన కరణం చినమాలకొండయ్య అనే వ్యక్తిపై ఉన్న భూమిని బాసం చినచెంచయ్య అనే వ్యక్తి పేరుపై ఆన్లైన్ చేశారు. ఇది పక్కాగా ప్రైవేట్ వ్యక్తికి చెందిన పట్టాభూమి. మరొకరి పేరుపై ఆన్లైన్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆన్లైన్ అక్రమాలు జరిగినట్లు రుజువైంది. ఈ విధంగా మండలంలో భూముల ఆన్లైన్ విషయం అధికారులు ఇష్టారీతిగా మారింది. ఈ విషయంలోనే ఓ అధికారి తప్పు రుజువు కావడంతో చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక పెదపవనిలో అధికార పార్టీ నేత, మాజీ వీఆర్వో పట్టాభిరామ్మూర్తి సాగించిన భూదందా అంతా ఇంత కాదు. ఏకంగా 65 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు తన కుటుంబ సభ్యుల పేరుపై తీసుకున్నాడు. ఈ భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆర్డీఓని కలెక్టర్ నివేదిక కోరడం, భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు స్వయంగా కలెక్టర్ ఆదేశించడం ఇదివరకే జరిగింది. అధికార పార్టీ నేత కావడంతో భూములు స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో గత నెల 19వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్వయంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భూ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. ఇది అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. స్వయంగా ఓ మాజీ మంత్రి రెవెన్యూ అక్రమాలకు ఆందోళనకు దిగడం, మండలంలో జరిగిన ప్రభుత్వ భూ ఆక్రమణలు, ఆన్లైన్ మోసాలను ఆధారాలతో సహా బయట పెట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి రెవెన్యూ అధికారులది. దీనిపై లింగసముద్రం తహసీల్దార్‌ను ఉన్నతాధికారులు నివేదిక కోరారు. ఆ నివేదికలోనూ ఆమె స్పష్టమైన సమాచారం ఇవ్వనట్లు తెలిసింది. అక్రమాలకు జరిగాయని ఆధారాలున్నా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పకుండా ఉన్నతాధికారులను మాయ చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. వందల ఎకరాలు అన్యాక్రాంతం లింగసముద్రం మండలంలో సాగిన భూదోపిడీ అంతా ఇంతా కాదు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లింగసముద్రం ఎంపీపీ కల్పనకు స్వయంగా మామ, మాజీ వీఆర్వో పట్టాభిరామ్మూర్తి ఒక్కడే 65 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేసి కుటుంబ సభ్యుల పేరుతో ఆన్లైన్ ఎక్కించాడు. వీటిలో ప్రధానంగా సర్వే నంబర్–3లోని 536 ఎకరాల గ్రేజింగ్ పోరంబోకు భూములను చెట్టుపట్టాల పేరుతో అధికార పార్టీ నేతలు కొట్టేశారు. ఇక పెదపవనిలో సర్వే నంబర్ 389లో కాల్వ పోరంబోకు 17.86 సెంట్లు గూడూరి పట్టాభిరామ్మూర్తి, 206/1లో పౌరోహిత్యం 3.06 ఎకరాలు రామూర్తి కుమారుడు రంగనా«థ్ పేరుపై ఆన్లైన్ చేశారు. సర్వే నంబర్ 352/1లో3.12 ఎకరాలు, 364/3లో 3.48 ఎకరాలు ఇండ్ల లక్ష్మయ్య, ఇండ్ల రామయ్య పేరుతో ఇచ్చిన అసైన్మెంట్ను గూడూరి రంగనాథ్ తన పేరుపై ఆన్లైన్ ఎక్కించాడు. అలాగే 492/3లో పీర్లమాన్యం 0.90 సెంట్లు రంగనా«థ్, 402లో గయాళు, 4.26 ఎకరాలు గూడూరి నాగభూషణం, 492/3లోని పీర్లమాన్యం 0.45 సెంట్లు, 860/1లో గయాళు 1.96 ఎకరాలు, 860/2లో గయాళు 4.65 ఎకరాలును రామ్మూర్తి భార్య సుజాత పేరుపై మార్చారు. 206/1లో పౌరోహిత్యం 1.04 ఎకరాలు రామ్మూర్తి ఇలా ఇంకా పలు సర్వే నంబర్ల్లోని మొత్తం 65 ఎకరాలకుపైగా ఒక్క రామ్మూర్తే ఆక్రమించాడు. రాళ్లపాడులో 48/1లో గ్రేజింగ్ పోరంబోకు 2.58 ఎకరాలు బోడి శివకుమారి పేరుపై, 106/3లో గ్రేజింగ్ పోరంబోకు 66 సెంట్లు ఆక్రమణ, పెంట్రాలలో సర్వే నంబర్ 36లోని కోదండరామస్వామి మాన్యాన్ని నివేశన స్థలాలకు ఇచ్చారు. మొగిచర్లలోని 356లోని కాల్వపోరంబోకు 0.84 సెంట్లు వేముల రవీంద్రనా«థ్, 215లో అనాధీనం 1.73 ఎకరాలు, 220/2లో 3 ఎకరాలు చొప్పర నరసింహం పేరుపై, 152/1లో అనాధీనం 5.06 ఎకరాలు, 505లోని ఎకరా అనాధీనం భూమిని కామినేని పుల్లమ్మ, 152/2లో అనాధీనం 2.53 ఎకరాలు వేముల పద్మ పేర్లతో రికార్డులు మార్పిడి జరిగింది. ఇలా మండలంలో జరిగిన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. -
ప్రతీ అధికారిపై నిఘా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతం గా నిర్వహించడానికి పలు రాష్ట్రాల నుంచి సీనియర్ ఐపీఎస్‌లు అబ్జర్వర్లుగా రాష్ట్రానికి రాబోతున్నారు. 19 నుంచి అబ్జర్వర్లు రాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉండే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు వహిస్తారని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. థర్డ్ పార్టీ ద్వారా సమాచారం.. ఎన్నికల ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరుపై అబ్జర్వర్లు నిఘా పెట్టనున్నారు. అలాగే ఎన్నికల్లో ఏ పార్టీ కి కొమ్ముకాయకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ అధికారిపై థర్డ్ పార్టీ ద్వారా సమాచారం సేకరించడం, క్షేత్రస్థాయిలో వ్యవహరిస్తున్న తీరును పరిశీలించనున్నారు. ముందుగా పోలింగ్ కేంద్రాలు, ఆ కేంద్రాల వద్ద ఏర్పాటుచేసే భద్రతా వివరాలు, పోటీచేస్తున్న అభ్యర్థుల చరిత్ర, నియోజకవర్గాల్లోని గత ఎన్నికల తీరు తదితర అంశాలన్నింటిపై అబ్జర్వర్లకు ఈసీ బ్రీఫ్ నోట్ అందించనుంది. దీని ద్వారా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో ఎన్నికలు జరగబోయే తీరుపై ముందస్తు అంచనా వేసుకునేలా నోట్ రూపొందించి అందించనున్నట్టు రాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని తక్షణం తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు అబ్జర్వర్లు నివేదిక అందిస్తారు. అన్ని బృందాలతో సమన్వయం.. మద్యం, నగదు సరఫరాలను నియంత్రించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లతో అబ్జర్వర్లు రంగంలోకి దిగనున్నారు. అబ్జర్వర్లకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించడం, ఓటర్లతో మాట్లాడటం, నెట్వర్క్ ఏర్పాటుచేసుకొని జరుగుతున్న పరిణామాలపై ఎన్నికల కమిషన్‌కు నివేదికలివ్వడం చేయనున్నారు. పోలీస్ బృందాలు, రెవెన్యూ బృందాలతో మానిటరింగ్ చేస్తూ మద్యం, నగదును నియంత్రించాల్సి ఉంటుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేం ద్రాల్లో పర్యటించి అక్కడి భద్రతా వివరాలను ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో బైండోవర్లు చేసిన కేసులు, స్వాధీనపరుచుకున్న మద్యం, నగదు, ఆయుధాల వివరాలపై సమీక్షించడం, ఆయుధాల డిపాజిట్ పెండింగ్ ఉంటే వెంటనే వాటిపై అబ్జర్వర్లు చర్యలకు ఆదేశించవచ్చు. ఎన్నికల కమిషన్‌కు నివేదిక: నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్నవారిని ఎంతమందిని కోర్టులో హాజరుపరిచారు? చేయని వారి సంగతేంటన్న అంశాలపై నివేదిక అందిస్తారు. విధుల్లో పాల్గొనే సెంట్రల్ పారామిలిటరీ, రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఎన్నికల నిర్వహణ పై అవగాహన కల్పిస్తారు. చెక్‌పోస్టులు, పెట్రోలింగ్, ప్రీపో ల్ డ్యూటీలపై సంబంధిత పోలీస్ అధికారుల, ఆర్వోలతో సమీక్షిస్తారు. స్క్రూటినీ తర్వాత నుంచి ఎన్నికలు జరిగే వరకు ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృతిచెందారు అంశాలపై నివేదిక ఇస్తారు. ఎందుకు అల్లర్లు జరిగాయి? అందులో రాష్ట్ర భద్రత, నిఘా వైఫల్యం ఉందా? లేదా కేంద్ర బలగాలను మోహరించడంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అన్న అంశాలపై ఈసీకి రిపోర్టు ఇవ్వనున్నారు. అబ్జర్వర్లు చేయకూడనివి.. - నియోజకవర్గాల్లో కుటుంబంతో కలసి పర్యటించకూడదు. - ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకూడదు. - స్వతహాగా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించరాదు. - సదుపాయాలు, సౌకర్యాల విషయంలో అసాధారణ డిమాండ్లు చేయకూడదు. - అబ్జర్వర్‌గా విధుల్లో చేరగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చే లోకల్ మొబైల్ నంబర్లు వాడాల్సి ఉంటంది. అదే విధంగా బ్యాంక్ డీటైల్స్‌ను ఈసీకి అందించాల్సి ఉంటుంది. -
రైతుబంధు రాలేదని నిరసనగ నాగుపామును చంపి..
-
రైతుబంధు రాలేదని..
పెద్దపల్లి రూరల్: రైతుబంధు రాలేదని ఓ రైతు నాగు పామును చంపి కాల్చుకుతిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన కీర్తి శ్రీనివాస్‌కు ఇదే మండలంలోని చందపల్లి గ్రామ శివారులో మూడు సర్వే నంబర్లలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వలేదు. గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో తన పాతపాసుపుస్తకాలు, సాదాబైనామా కాగితాలు అందించినా.. అధికారుల్లో స్పందనలేదని.. అధికారుల తీరు కారణంగానే రైతుబంధు పథకం కింద వచ్చే ఎకరానికి రూ.4 వేలు అందకుండా పోయాయని బాధితుడు కీర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల తీరును నిరసిస్తూ నాగుపామును చంపి కాల్చుకుతిన్నట్లు తెలిపారు. -
17 లక్షల ఎకరాలు.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదాలున్నాయంటూ పార్ట్–బీలో చేర్చిన భూముల లెక్కలు ఎప్పుడు తేలుతాయో అంతుపట్టడం లేదు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 2.3 కోట్లకు పైగా ఎకరాల్లోని భూముల్లో ఉన్న 1.42 కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి గాను ఏటా పెట్టుబడి సాయం కింద ఎకరాలకు రూ.8 వేలను ప్రభుత్వం అందిస్తుండగా, వివాదాస్పద భూములను పక్కన పెట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఈ ఏడాది మేలో రైతుబంధు కింద నగదు సాయమందగా, 5 నెలలైనప్పటికీ వివిధ పని ఒత్తిడుల కారణంగా రెవెన్యూ యంత్రాంగం ఈ భూముల లెక్కలను తేల్చలేకపోయింది. దీంతో ఈ భూముల్లో సాగు చేస్తున్న ప్రస్తుత రైతులకు ఏటా రూ.500 కోట్లపైగానే పెట్టుబడి సాయం నిలిచిపోతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాకే..: వివాదాస్పద భూములను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అంతా ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే వివాదాస్పద భూముల లెక్కలు తేలుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడి సాయం కింద ఆ భూములకు నగదు అందాలంటే ఎన్నికలైపోయేంతవరకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
రెవెన్యూ పాత్రకు పాతరేనా?
నరసరావుపేట కేంద్రంగా సంచలనమైన కిడ్నీ రాకెట్ కేసు పక్కదారి పట్టినట్టేనా ? అసలు నిందితులు అధికార పార్టీ నేతల అండతో తప్పించుకున్నట్టేనా ? కిడ్నీ దానం చేసిన వారు, దళారులే నిందితులా ? నిబంధనలన్నీ ఉల్లంఘించి అనుమతులిచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు లేనట్టేనా ? టీడీపీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారా ? తొమ్మిది నెలల తర్వాత కపలవాయి విజయకుమార్‌ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందా ?.. ఇలా అనేక ప్రశ్నలకు ప్రతి ఒక్కరి నుంచీ అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసులు సైతం రెవెన్యూ అధికారుల జోలికి వెళ్లకపోవడంపై ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు తిరుగులేదని మరోసారి స్పష్టమవుతోంది. సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు దొంగలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ దానం చేసిన వ్యక్తులతోపాటు, సహకరించిన దళారులు, ల్యాబ్ టెక్నీషియన్లను గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం ఆర్యవైశ్య నాయకుడు కపలవాయి విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కిడ్నీ రాకెట్ కేసులో తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేయడం చూస్తుంటే రాజకీయ కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్రను గతంలోనే విజిలెన్స్, పోలీస్ అధికారులు నిగ్గు తేల్చారు. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించామంటూ అప్పట్లో పోలీసులు చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. పోలీసు దర్యాప్తులో తమ వారి పాత్ర తేలితే వారే శిక్షిస్తారంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండటం గమనార్హం అంతా గోప్యం 2017 నవంబరు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అప్పటి తహసీల్దారు చెబుతుండగా.. ఫిర్యాదు అందిన రెండు నెలలపాటు అటు రెవెన్యూ అధికారులుగానీ.. ఇటు పోలీసు అధికారులుగానీ బయటకు పొక్క నీయలేదు. అనంతరం కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు రావడంతో తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమించారు. అక్రమాల పుట్ట.. నరసరావుపేట నరసరావుపేట కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తుందనే విషయం బయటకు రావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డొంకను కదల్చలేకపోయారు. కిడ్నీ రాకెట్‌కు రెవెన్యూ అధికారుల సహకారం పూర్తిగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కిడ్నీ దానం చేసేందుకు అనుమతులు ఇచ్చేసి భారీ స్థాయి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మాత్రం నివేదికను రెవెన్యూ ఉన్నతాధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు. ఇదీ కథ..! దుర్గి మండలం చంద్రకుంట తండాకు చెందిన వెంకటేశ్వరనాయక్ ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి అందులో రావూరి రవి పేరు, అడ్రస్ పెట్టారు. ముందుగా రెవెన్యూ అధికారులతో బేరం మాట్లాడుకున్న తరువాత మాత్రమే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రావూరి రవి పేరుతో దరఖాస్తు చేసిన వెంకటేశ్వర నాయక్ పదేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు అప్పటి వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవోలు ధ్రువీకరించి అనుమతులు ఇచ్చేశారు. వీఆర్వోకు దగ్గరి బంధువు అయిన ఓ పోలీసు అధికారి మధ్య వర్తిత్వం వహించి అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఇబ్బంది లేకుండా చూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్న కొందరు రెవెన్యూ అధికారులు తమపై చర్యలు లేకుండా చూడాలంటూ వారిని ఆశ్రయించినట్లు తెలిసింది. నిగ్గు తేల్చేదెప్పుడు ? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కిడ్నీ రాకెట్ కేసులో అడ్డంగా అనుమతులు ఇచ్చేసిన రెవెన్యూ అధికారుల్లో ఏ ఒక్కరిపై కనీస చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల పాత్రపై మాత్రం నోరు మెదపకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు శాఖాపరంగా చర్యలు చేపట్టిన తరువాత వారి పాత్ర ఎంత మేరకు ఉందో తేల్చుకుని క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
చినబాబు స్కీం రూ. 300 కోట్ల స్కాం
విజయవాడ: రాజధానిలో మరో భూ పందేరానికి తెరలేచింది. రూ.300 కోట్ల విలువైన భూమిని తమ అస్మదీయ కంపెనీకి కట్టబెట్టేందుకు చినబాబు డైరెక్షన్లో రంగం సిద్ధమైంది. దీంతో చేసేది లేక అధికారులు గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల స్థలాన్ని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేయడానికి చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ స్థలం ఇవ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కశాశాలకు ప్రభుత్వం విడతల వారీగా 125 ఎకరాలు కేటాయించింది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తోంది. లైవ్‌స్టాక్ యూనిట్ కోసం కేసరపల్లిలో ఆర్ఎస్ నెం.20లో ఉన్న 66 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమిని ప్రభుత్వం 1994లో ఈ కళాశాలకు కేటాయించింది. ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీ వారు లైవ్‌స్టాక్ యూనిట్, రెండు ఫిష్ ట్యాంకులు, గుర్రాలశాల, పశువుల షెడ్లు నిర్మించారు. ఇప్పుడీ స్థలంపైనే చినబాబు కన్నుపడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని వెనక్కు తీసుకుని.. తిరిగి దానిని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు స్కెచ్ వేశారు. చినబాబు నిర్ణయానికి అనుగుణంగా ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ సదరు ఐటీ సంస్థ రెవెన్యూ శాఖకు విజ్ఞప్తి చేసింది. వెంటనే చిన్నబాబు నుంచి రెవెన్యూ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లడం.. ఫైళ్లు చకచకా కదలడం ప్రారంభమైపోయింది. చినబాబు ఒత్తిడితో మెత్తబడిన అధికారులు.. వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల భూమిని ఐటీ కంపెనీకి కట్టబెట్టాలని చినబాబు నుంచి జిల్లా యంత్రాంగానికి రెండు నెలలుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దాంతో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం రంగప్రవేశం చేసి దానిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయమై కిందిస్థాయి అధికారులతో చర్చించారు. వారు యూనివర్సిటీ అధికారులతో చర్చించినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఆ స్థలాన్ని ఐటీ కంపెనీకి ఇవ్వాలని.. ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి స్థలం కేటాయిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఆ స్థలాన్ని వదిలిపెట్టేందుకు వెటర్నరీ అధికారులు విముఖత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో చినబాబు యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి పెంచారు. దాంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని అప్పగించేందుకు యూనివర్సిటీ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ విషయం బయటకు పొక్కితే కళాశాల విద్యార్థులు ఆందోళన చేస్తారనే భయంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గోప్యంగా స్వాధీనం చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎకరం రూ.4కోట్లు కాగా, జాతీయ రహదారి, విమానాశ్రయం, ఐటీ పార్కు పక్కనే ఉన్న ఈ భూమి పరిసర ప్రాంతాల్లోని ఆర్ఎస్ నెం.14, 15, 16 సర్వే నెంబర్లలో ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే సుమారుగా ఆ భూమి విలువ రూ.300కోట్లు. అలాగే.. ప్రభుత్వ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ రికార్డులలో ఎకరం రూ.1,57,75,000గా ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఎకరం రూ.10కోట్లు పలికింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఎకరం కనీసం రూ.4కోట్లకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ స్థలం మాదిరిగా లాక్కునే యత్నం మరోవైపు.. వెటర్నరీ కాలేజీ స్థలం 66 ఎకరాలకు ఆనుకుని ఆర్టీసీ ఆధీనంలో ఉన్న 28 ఎకరాలను రెవెన్యూ అధికారులు కొద్దినెలల క్రితం ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. ఆర్జీసీ జోనల్ డ్రైవింగ్ శిక్షణా కళాశాల నడుస్తున్న ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించుకునేందుకు ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో దానిని తాత్కాలికంగా భవానీపురానికి తరలించారు. ఈ స్థలంలోనే సోమవారం రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఐటీ సంస్థలకు భూమి పూజచేశారు. ఇదిలా ఉంటే.. రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఎందుకూ పనికిరాని కొండగట్లు చూపిస్తుండటం కొసమెరుపు. -
రైతు సొమ్ము.. రాబందుల పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. మిగిలిన చెక్కులు 7.7 లక్షలు గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. వాటిని విత్‌హోల్డ్‌లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నుంచి ఎలా కొట్టేశారు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్బీఐ క్యాషియర్.. విత్‌హోల్డ్‌లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ను ఆదేశించాం పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్ క్యాషియర్‌పై కేసు నమోదైంది. కలెక్టర్ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది. పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
కాకతీయ కెనాల్‌కు భారీ గండి
గొల్లపల్లి (ధర్మపురి): కాకతీయ మెయిన్ కెనాల్‌కు బుధవారం భారీ గండి పడింది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 2 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొనడంతో అధికారులు ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమన్నగుడి వద్ద ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కెనాల్‌కు 88.66కి.మీల రాయి (యూటీ) వద్ద భారీ గండి పడింది. నీటి ప్రవాహం బీబీరాజ్‌పల్లి, శ్రీరాములపల్లి, శంకర్రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి గ్రామాలను ముంచెత్తింది. నీటి ఉధృతికి శ్రీరాములపల్లి పెద్ద చెరువు, చిన్నచెరువు నిండి తెగిపోయే పరిస్థితికి చేరగా.. రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి ఇసుక బస్తాలతో పూడ్చి వేయించారు. చెరువు కట్టకు గండికొట్టారు. ఆ నీరు శంకర్రావుపేట చెరువునూ నింపేసింది. ఆ చెరువు కూడా నిండిపోవడంతో అధికారులు జేసీబీతో కట్టకు గండిపెట్టారు. అక్కడి నుంచి వరదనీటిని మల్లన్నపేట గుడి చెరువు మీదుగా.. వెంగళాపూర్, నందిపల్లి మధ్య బ్రిడ్జి నుంచి శెకల్లవాగుకు మళ్లించారు. శ్రీరాములపల్లి, బీబీరాజ్‌పల్లి, శంకర్రావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతోనే.. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు చాలా ఏళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరింది. కరీంనగర్ శివారు ఎల్ఎండీని నింపేందుకు ఈ నెల 22న కాకతీయ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. ఆ నీటి ఉధృతికి గండిపడింది. -
సర్కారీ స్థలమనుకొని.. ప్రైవేట్ కట్టడం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని అధికారులు తొందరపడి ఓ స్థలంలోని కట్టడాన్ని కూల్చేశారు. తీరా విచారిస్తే అది ప్రైవేటు స్థలం. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈలోగా ఆ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాలక పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించామని తహసీల్దార్ కోర్టులో చెప్పారు. ప్రభుత్వ భూమిలోనే అక్రమ కట్టడాలు చేస్తున్నారనుకుని ఆ కట్టడాన్ని కూల్చేశానని రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) తప్పు ఒప్పుకోక తప్పలేదు. సొంత ఖర్చుతో కట్టడాన్ని నిర్మిస్తానన్నారు. కోర్టు చర్యలు తీసుకుంటుందని భయపడి కూల్చిన నిర్మాణాన్ని నిర్మిస్తామని కోర్టుకు ఆర్ఐ హామీ ఇచ్చారని నిర్మాణ సంస్థ అపనమ్మకం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ స్పందిస్తూ.. కోర్టు చర్యలు ఉంటాయని భయపడి నిర్మాణం చేస్తామని హామీ ఇస్తే సరిపోదని, కచ్చితంగా తిరిగి నిర్మించాలన్నారు. అక్రమ నిర్మాణం అనుకుని.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నం. 168/ పిలో ఎకరా 35 సెంట్ల భూమిలోని క్రీడా సముదాయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ డీసీఎస్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘సర్వే నం 1170 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం అనుకుని అధికారులు క్రీడా సముదాయాన్ని కూల్చేశారు. చట్ట ప్రకారం నిర్మాణాన్ని కూల్చేయడానికి అనుసరించాల్సిన నిబంధనల్ని అధికారులు తుంగలోకి తొక్కారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిం చారు. దీనిపై తహసీల్దార్ దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘సర్వే 1170లో నిర్మాణాలుంటే అడ్డుకోవాల ని ఆర్ఐ, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారీ భూములు అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే ఆదేశించాను. కూల్చివేత చర్యలు తీసుకోవాలని ఆదేశించలేదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలనే.. అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమి ని కాపాడాలని ప్రహరీతో పాటు క్రీడా సముదాయ నిర్మాణ గోడ కూల్చేశామని విడిగా దాఖలు చేసిన అఫిడవిట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) పేర్కొన్నారు. ‘అది ప్రభుత్వ స్థలం కాదని తర్వాత తెలిసింది. చట్ట వ్యతిరేకంగా చేసినట్లు నిర్ధారణ చేసుకున్నాను. కూల్చిన నిర్మాణాలను సొంత సొమ్ముతో పునః నిర్మాణం చేస్తాను’అని హామీ ఇచ్చారు. ఆర్ఐ హామీపై పిటిషనర్ న్యాయవాది అనుమానం లేవనెత్తగా న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు చర్యలు తప్పవనే ఆర్ఐ హామీ ఇచ్చినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తిరిగి నిర్మాణం చేయాలే గానీ భవనం విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. చట్ట ప్రకారం హద్దులు నిర్ణయించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. -
‘ఆహారభద్రత’కు మోక్షమెప్పుడో!
కరీంనగర్ సిటీ: ఆహారభద్రత కార్డుల జారీ విషయంలో జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కొత్త లబ్ధిదారులు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే వీలు లేకుండాపోతోంది. ఆగస్టు 15 నుంచి ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గడువు దగ్గర పడుతున్నా లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులు సమగ్ర విచారణ పేరుతో రెవెన్యూ అధికారుల జాప్యం.. హార్డ్‌కాపీలు అందకపోవడంతో సంబంధిత పౌరసరఫరాల శాఖ ఆన్లైన్ మంజూరు చేయకపోవడం వెరసి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో మొత్తంగా 13,000 మంది కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా 8,900 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఆహారభద్రత కార్డులపై అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హడావుడి చేసిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కేవలం కార్డుల లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన డేటా, వినియోగదారుని ఆధార్ సంఖ్య ఆధారంగానే రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారు. ఆహారభద్రత కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాన్ని చేపట్టి సులభతరంగా చేసినా కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల విచారణ వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రస్థాయిలో మంజూరు విధానాన్ని పక్కనపెట్టి జిల్లా స్థాయిలోనే దరఖాస్తులను పరిశీలించి అనుమతి జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. క్షేత్రస్థాయిలోనే ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట ప్రభుత్వం సూచించింది. 13,400 దరఖాస్తులు.. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఆహారభద్రత కార్డులకు 13,400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి కార్డు మంజూరుకు పౌరసరఫరాలశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్తరేషన్ కార్డులు జారీకి అర్హులను గుర్తించి, వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 7,200 కొత్త కార్డుల కోసం దరఖాస్తులు రాగా 6,200 మ్యుటేషన్లు (మార్పులు, చేర్పుల) కోసం వచ్చాయి. జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులు 7 వేలకు పైగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరాలశాఖకు 6 వేల దరఖాస్తులు హార్డ్‌కాపీల రూపంలో అందగా అందులో 1,500 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఆన్లైన్లో అనుమతించాల్సి ఉంది. 4,500 దరఖాస్తులను ఆన్లైన్ అప్లోడ్ పూర్తి చేశారు. జిల్లా స్థాయి లాగిన్‌లోనే అనుమతివ్వాలని ప్రభుత్వం తాజా మార్పులతో కొత్తకార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇంకా 8,500 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. గత జనవరి నుంచి దరఖాస్తులు సమర్పించిన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో త్వరితగతిన అనుమతినిచ్చే అవకాశమున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా స్థాయిలోనే మంజూరు మారిన నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మంజూరు చేస్తారు. ఆన్లైన్ ప్రక్రియ అయినప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ సేవలో పూర్తి వివరాలతో చేసుకున్న దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయ లాగిన్లోకి వస్తుంది. తహసీల్దార్ సంబంధిత ఆర్ఐకి విచారణ కోసం సిఫారసు చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన ఆర్ఐ ఆ నివేదికను తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సరి చూసుకుని అర్హులైతే తన లాగిన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. విడిగా ఒక ప్రతీని డీఎస్వోకు పంపించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీఎస్వో ఆహార భద్రత కార్డును మంజూరు చేస్తారు. మీసేవ ద్వారా కార్డు ప్రతీని పొంది సంబంధిత రేషన్ షాపులో సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్ల కిందట కొత్త రేషన్ కార్డులు ముద్రించి జిల్లాలకు పంపారు. అదే సమయంలో జిల్లాల విభజన చేయడంతో పాత జిల్లాల పేర్లతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయకుండా నిలిపేశారు. ఇప్పుడున్న 31 జిల్లాల వారీగా ఆహారభద్రత కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఎదురుచూపులు..! జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న అర్హులైన కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో మాత్రం ముందుకు సాగడం లేదు. క్షేత్ర స్థాయి విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూరికార్డుల ప్రక్షాళన, రైతు బంధు తదితర పనులతో ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా డీఎస్వో దగ్గరకు రాని 7,400 దరఖాస్తుల్లో 5,800 వరకు విచారణకే నోచుకోలేదు. ఆర్ఐల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. 1,600 వరకు దరఖాస్తుల విచారణ పూర్తయినా తహసీల్దార్ తుది నివేదిక హార్డ్‌కాపీ రాకపోవడంతో మంజూరుకు నోచుకోలేదు. మొత్తంగా 7,400 దరఖాస్తులకు మోక్షమే లేదు. కేవలం 4,500 దరఖాస్తులకే పూర్తి స్థాయి విచారణ జరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పౌరసరఫరాల శాఖ హార్డ్‌కాపీలతో సరిచూసుకుని అప్రూవల్ చేస్తున్నారు. 13,400 దరఖాస్తులో 8,900 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆర్ఐలు విచారణ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు ఆహారభద్రత కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులకు ఆమోదం తెలిపి డీఎస్వో కార్యాలయానికి నివేదించాలని మండలాల అధికారులను కోరాం. మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో విచారణ, హార్డ్‌కాపీల అందజేయడంలో జాప్యం కారణంగా కొంత ఆలస్యమవుతోంది. విచారణ వివిధ దశల్లో పూర్తి చేయడం కష్టతరమే. డీఎస్వో స్థాయిలోనే అనుమతి ఇవ్వొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా 13 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖకు అందిన 6 వేలల్లో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత కలిగిన వారందరినీ లబ్ధిదారులుగా మంజూరు చేస్తాం. – గౌరీశంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
రెవెన్యూ అధికారులకు టోకరా
చెన్నారావుపేట: రెవెన్యూ అధికారుల కళ్లు గప్పి, వారికే టోకరా ఇచ్చి.. ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని ఓ యువకుడు తన పేరు మీదికి మార్చుకుని పట్టా పాస్ పుస్తకం పొందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలతోపాటు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం రూ.8 వేలు కూడా తీసుకోవడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూరపాటి అబ్బయ్య, కూరపాటి వీరస్వామికి సర్వే నంబర్ 219లో చెరో ఎకరం ఉంది. ఈ క్రమంలో నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన కూరపాటి రాజు చెన్నారావుపేట తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలుసుకొని అబ్బయ్య, వీరస్వామి పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకున్నాడు. రైతు బంధు పథకంలో పాస్‌బుక్, వచ్చిన డబ్బులు రూ.8 వేలు తీసుకున్నాడు. అబ్బయ్య, వీరస్వామి తమ భూమికి పట్టాలు, డబ్బులు రాలేదని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టగా వారిద్దరి భూమి రాజు పేరుమీద ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇద్దరు రైతులు లబోది బోమంటూ తమకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ వ్యవహారంపై బాధిత రైతులు స్థానిక పెద్దలను కలిసి మొరపెట్టుకోవడంతో వారు రాజును పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది. -
నాణ్యత విషయంలో రాజీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఇంజనీర్లను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కనీసం 200 ఏళ్ల పాటు ప్రజా అవసరాలు తీర్చేవిగా రిజర్వాయర్లు ఉండాలన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నాణ్యత విషయంలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోమవారం జలసౌధలో డిండి ఎత్తిపోతల పథకం పనులు, ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పురోగతిపై సమీక్షించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన సింగరాజు పల్లి, గొట్టి ముక్కల రిజర్వాయర్ పనుల వేగం పెంచి ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరాజు పల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పనులు పూర్తి చేయాలని సూచించారు. గొట్టి ముక్కల రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రిజర్వాయర్ పరిధిలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.32 కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలపగా ఆ నిధులు విడుదల చేస్తామన్నారు. సింగరాజు పల్లి రిజర్వాయర్, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులకు మరో రూ.పది కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులకు రూ.పది కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. ప్యాకేజీ–6లోని శివన్న గూడెం రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించం పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టు లకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పరిధిలో సర్వీస్ బే కంట్రోల్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 31లోగా ఒక పంపును రన్ చేసేలా పనులు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300 ఎకరాల వరకు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూ సేకరణ జరపాలని మంత్రికి ఇంజనీర్లు తెలపగా,జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. మంగళవారం సమావేశం నిర్వహించి భూ సేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్ చానల్స్ తవ్వే విషయంలో గ్రామస్తులు సహకరించడం లేదని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేవడంతో, వెంటనే జిల్లా కలెక్టర్లు, రైతు సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆల్మట్టి, తుంగభద్రల నుంచి నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరిన వెంటనే కల్వకుర్తి మోటార్ ఆన్ చేయాలన్నారు. భూ సేకరణపై దృష్టి పెట్టండి డిండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హరీశ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, అటవీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన సలహాదారు సుధాకర్‌తో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్‌ను ఏర్పాటు చేయాలని ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావులకు సూచించారు. -
ఆధార్‌లో వయోమాయ
గిద్దలూరు: కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆధార్ కార్డులతో మాయలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలల్లో లబ్ధిపొందాలనుకునే వారి వయస్సు వారికి కావాల్సినట్టుగా మార్చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు నకిలీ గుర్తింపు కార్డులు ఐడీలు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందుకు లబ్ధిదారుల నుంచి వేలకు వేలు వసూలు చేసి, జేబులు నింపుకొంటున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని మీ సేవ కేంద్రాలను పట్టణాల్లో నిర్వహిస్తూ అక్కడే సీఎస్సీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు.. అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో బలం నిరూపించుకునేందుకు పింఛన్లు, పెళ్లికానుకలు ఇప్పిస్తామని చెప్పి వారి ఆధార్‌కార్డుల్లో తక్కువ వయసు ఉన్నా వయసు పెంచి, అనర్హులకు లబ్ధి కల్పించడం.. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలు చొప్పున వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు చేసుకునే వారు పెళ్లికానుక పథకానికి అనర్హులు. ఇందుకు బాలికకు చెందిన ఆధార్‌కార్డులో వయస్సు మార్పించేస్తున్నారు. మీసేవ కేంద్రాలను నిర్వహించే బాధ్యత 2012లో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీవారు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని అంబవరం గ్రామంలో నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రం నిర్వాహకుడు అంబవరంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆధార్‌కార్డులను మార్చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏజెన్సీ నిర్వాహకులు కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం రద్దు చేశారు. అప్పటికే కొన్ని వేల ఆధార్‌కార్డుల్లోని సమాచారాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా కొమరోలు, గిద్దలూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న మీసేవ కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేసుకుని దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలు రద్దయినా ఆగని అక్రమాలు.. కొన్ని ఆధార్ సీడింగ్ కేంద్రాల నిర్వాహకులు గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తుల యూఐడీఐని బహిర్గతం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆధార్ ఎర్రోలింగ్ కేంద్రాలను తీసేసింది. ఎన్‌రోలింగ్ బాధ్యతలను కేవలం మండల కేంద్రాల్లోని మీసేవ కేంద్రాలకు, బ్యాంకులకు, పోస్టాఫీసులకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఉండటం వలన అక్రమాలు జరగవని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆధార్ ఎన్‌రోలింగ్ బాధ్యలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. కొన్ని బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది వారి ఐడీలను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వారి ఐడీ ప్రకారం సదరు ఉద్యోగికి చెందిన వేలిముద్రలు తీసుకుని బయట సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్ కార్డుల్లో వయస్సు, ఇతర సమాచారాన్ని మార్చేస్తున్నారని సమాచారం. ఇలాంటి కేంద్రాలు గిద్దలూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం సమీపంలోని సీఎస్సీ కేంద్రంలో రూ.4వేలు తీసుకుని ఆధార్‌కార్డులో వయస్సు మార్చి ఇస్తున్నారు. ఆశకు పోతే అనర్ధం జరిగింది.. కొమరోలు మండలానికి చెందిన ఓ వ్యక్తికి 55 ఏళ్లు ఉండగా పింఛను ఇప్పిస్తామని ఓ నాయకుడు ఆధార్‌కార్డు తీసుకెళ్లి వయస్సు 65గా మార్పించారు. ఏడాది పాటు పింఛను రాలేదు. ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. వయస్సు ఎక్కువ వేయడం వలన చంద్రన్న బీమాకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా గిద్దలూరు మండలంలోని ముండ్లపాడుకు చెందిన 9వ తరగతి విద్యార్థినికి వివాహం చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి కానుక కోసం ఆధార్‌కార్డులో వయస్సు పెంచారు. బాల్య వివాహం చేసుకున్నారంటూ ఫిర్యాదు అందడంతో సదరు అధికారులతో గొడవలు పడి కేసులు పెట్టకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త కేంద్రాలకు గ్రహణం.. పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు సరిపడినన్ని మీ సేవ కేంద్రాలు లేకపోవడం వలన ప్రైవేటు వ్యక్తులు వివిధ ఏజెన్సీల పేర్లతో రహస్యంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గిద్దలూరు పట్టణంలో 10 మీసేవ కేంద్రాలు ఉండాల్సి ఉన్నా కేవలం ఒక్కటే నడుస్తోంది. దర్శి నియోజకవర్గ కేంద్రంలో 8 కేంద్రాలు ఉండాల్సి ఉన్నా ఒక్కటే ఉంది. దీనిపై పలువురు ప్రజా ప్రతినిధులు కోర్టుకు వెళ్లినా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా అక్రమార్కులు బినామీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆధార్ ఎన్‌రోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు, జనాభా ఆధారంగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆ స్థలం స్వాధీనం
బొబ్బిలి : పట్టణ నడిబొడ్డున ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని విక్రయించేశారని తెలుసుకున్నామనీ, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘అమ్మేస్తున్నా కిమ్మనరే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటు దేవాదాయ శాఖ, ఇటు రెవెన్యూ శాఖలు స్పందించాయి. ముందుగా దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి విక్రయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఉన్న గోడ కూలగొట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ వద్ద గ్రామకంఠం ఉండగా అందులో దేవాదాయ శాఖకు చెందిన 20 గజాలు రోడ్డు విస్తరణలో పోయిందన్నారు. మిగతా 66 గజాలు ఉంటుందని చెప్పారు. సర్వే నంబర్ 350 ప్రకారం ఇక్కడ కొబ్బరి, మామిడి, పనస చెట్లుండేవనీ కాలక్రమేణా చెట్లను కూలదోసి ఆక్రమించుకున్నారన్నారు. దీనికి సంబంధించిన వివరాలు, కాగితాలు తమ వద్ద లేవని, కోటలో ఉన్నాయని చెప్పడం విశేషం. దేవాదాయ శాఖ చట్టం 43 రిజిస్టర్ ప్రకారం తమవద్ద ఈ స్థలానికి సంబంధించిన వివరాలున్నాయన్నారు. రెవెన్యూ శాఖ సందర్శన ఆ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం రెవెన్యూ సర్వేయర్ విఘ్నేశ్వరరావు, ఆర్ఐ శివున్నాయుడు, వీఆర్వో చంద్రశేఖర్‌లు పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ ఏ విధమయిన అనుమతులు ఇచ్చినదీ పరిశీలించారు. తహసీల్దార్ విజయనగరం ఎన్నికల విధుల సమావేశానికి వెళ్లడంతో సర్వేయర్, ఆర్ఐలు పరిశీలించారు. పక్కన నిర్మాణాలు చేస్తున్న వారి వివరాలు, వాటి హద్దులను పరిశీలించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. -
కొత్త రేషన్ కార్డులేవీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (ఆహార భద్రత) కోసం లబ్ధిదారుల పడిగాపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్కరికీ కొత్త రేషన్‌కార్డు జారీ కాలేదు. విచారణ దశలోనే దరఖాస్తులు మగ్గిపోతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారులు గత తీరికలేకుండా ఉండటంతో కార్డుల మంజూరు, దరఖాస్తుల వెరిఫికేషన్ మరుగున పడింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో జాప్యం కారణంగా దాదాపు 90 శాతం దరఖాస్తులు మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా రేషన్ సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పరిశీలన దశలోనే.. - ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మొత్తం 26,080 దరఖాస్తులు గ్రామ స్థాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలనలోనే ఆగిపోయాయి. మరో 11,522 దరఖాస్తులు తహసీల్దార్ల పరిశీలనలో, 993 దరఖాస్తులు అసిస్టెంట్ కమిషనర్ పరిశీలనలో, 1,768 దరఖాస్తులు డీఎస్ఓ పరిశీలనలో ఉన్నాయి. - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 23,511 దరఖాస్తులు రాగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు కేవలం 148 దరఖాస్తులు (హార్డ్ కాపీలు) మాత్రమే చేరాయి. వాటిని ఓకే చేసి కమిషనరేట్‌కు పంపించారు. మిగతావి వివిధ దశల్లో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39,795 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా 31,908 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. - ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 42,188 దరఖాస్తులు వచ్చాయి. అందులో 32,030 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 29,539 దరఖాస్తులు రాగా వాటిలో 28,713 మండల స్థాయిలో, మిగతా దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఈ ఏడాది కొత్త కార్డులకు, మార్పుచేర్పుల నిమిత్తం 28,777 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. తహసీల్దార్ల వద్ద, డీఎస్ఓ, కమిషనరేట్ పరిధిలో 27,845 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 932 దరఖాస్తులకు మోక్షం లభించింది. - ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 83,536 దరఖాస్తులు రాగా అందులో 83,412 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మిగతా వాటిలో కొన్ని ఆమోదం పొందగా మరికొన్నింటిని తిరస్కరించారు. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో 27,294 దరఖాస్తులు వస్తే 23,175 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో 81,386 దరఖాస్తులు రాగా అందులో 68,816 దరఖాస్తులను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. వాటిలో 8,406 దరఖాస్తులకు ఆమోదం లభించగా 60,410 పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఎదురుచూపు నాకు గతంలో రేషన్ కార్డు ఉండేది. ఆన్లైన్ విధానం వచ్చాక దాన్ని తొలగించడంతో సరుకులు రావడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం 2014 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ కార్డు రాలేదు. మూడు నెలల కిందట మీ–సేవ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అదే పరిస్థితి. – బూర్ల వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల జిల్లా రెండుసార్లు దరఖాస్తు చేసిన నాకు రేషన్ కార్డు లేదు. గతంలో తల్లిదండ్రులతో 2002లో ఇచ్చిన కార్డులో నా పేరు ఉంది. నాకు మూడేళ్ల క్రితం పెళ్లి కావడంతో భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్న. ఇప్పటివరకు రెండుసార్లు రేషన్ కార్డు కోసం తహసీల్దార్ కార్యాలయంలో, మరోసారి మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. – రౌతు రాజేందర్, మోతుగూడ, ఆసిఫాబాద్ మండలం అంతా ఆన్లైన్లోనే.. రేషన్ కార్డుల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం విచారణ జరిపి రేషన్ కార్డు జారీ చేస్తున్నాం. ఒక్కోసారి ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వస్తున్నాయి. – కష్ణప్రసాద్, డీఎస్ఓ, నిజామాబాద్ -
ఖమ్మంలో 31 వాటర్ ప్లాంట్ల సీజ్
సాక్షి, ఖమ్మం అర్భన్ : ఖమ్మంలోని వాటర్ ప్లాంట్లపై కార్పోరేషన్, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. 31 ప్లాంట్లను సీజ్ చేశారు. హైకోర్ట్ ఆదేశాలతో ఈ దాడులు చేసినట్టు ప్లాంట్ల యజమానులతో చెప్పారు. ఇదీ నేపథ్యం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారంగా వాటర్ ప్లాంట్లు నడుపుతున్న తాము.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటైన ప్లాంట్ల కారణంగా నష్టపోతున్నామంటూ కొందరు (ప్లాంట్ల యజమానులు) గతంలో ఆందోళనకు దిగారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించనట్టయితే తామంతా ప్లాంట్లు బంద్ చేస్తామన్నారు. ప్లాంట్ల యజమానుల సంఘం నాయకులతో ఆర్డీఓ చర్చించారు. అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ల యజమానులు ఆందోళన విరమించారు. ఈ దాడులు ఎందుకంటే... అనుమతి, ట్రేడ్ లైసెన్స్ లేని, నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లు నగరంలో 31 ఉన్నట్టుగా గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు ఖమ్మం కార్పోరేషన్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణఫర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో నగరంలోని ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్లాంట్లపై దాడులు చేశారు. సీజ్ చేయడానికి ముందుగానే వీటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. కొన్ని ప్లాంట్లలో నిర్వహణ లోపాలను, అపరిశుభ్రతను చూసిన అధికారులు నివ్వెర పోయారు. ‘‘శుద్ధ జలం పేరుతో జనానికి అంటగడుతున్నది ఈ నీళ్లా..?’’ అనుకుంటూ అవాక్కయ్యారు. ఆ ప్లాంట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో ఏసీపీ రాంచందర్‌రావు, అర్భన్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, భాస్కర్, వీఆర్ఓలు బాలయ్య, ఆర్.వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
లంబాడా రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : లంబాడా కులానికి చెందిన రెవెన్యూ సిబ్బంది కొలాం రైతులను మోసం చేస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. సోమవారం కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొలాం రైతులకు రైతుబంధు పథకం వర్తించకుండా లంబాడా కులానికి చెందిన రెవెన్యూ ఉద్యోగులు కుటిల ప్రయత్నాలు చేస్తూ అన్యాయం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఐదెకరాలు ఉన్న కొలాం గిరిజన రైతు భూమిని గుంటలుగా చూపిస్తూ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఆదిలాబాద్, నార్నూర్ తహసీల్దార్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్వార్టర్స్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి సమస్యను విన్నవించారు. మామిడిగూడ, సల్పలగూడ, పోతగూడ, హత్తిగుట్ట, తిప్ప, చితగుడ, ముక్తాపూర్, అడ్డగుట్ట, యాపల్‌గూడ, తదితర గ్రామాల రైతులు తానాజీ కురుసింగా, రత్నజాడె ప్రజ్ఞకుమార్, టేకం సురేష్, నందులాండ్గే పాల్గొన్నారు. -
విసిగి.. వేసారి !
తెనాలి: తన 25 సెంట్ల భూమి సర్వేకు 2007 నుంచి రెవెన్యూ అధికారులు కాళ్లరిగేలా తిప్పుతున్నారని కృష్ణవేణి అనే మహిళ స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ‘మీకోసం’లో తన గోడును మరోసారి ఆర్డీవోకు విన్నవించుకుందామని ఆమె గుంటూరు నుంచి వచ్చారు. తీరా ఆర్డీవో జి.నరసింహులు బదిలీపై వెళ్లారని తెలిసి నిరాశకు లోనయ్యారు. తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరగడమే తనకు సరిపోతోందనీ, సర్వేలకని, పట్టాదారు పుస్తకాలకని, కిందిస్థాయి ఉద్యోగులకని, ఖర్చులకనీ ఇప్పటికే లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... తెనాలి రూరల్ మండలం గుడివాడలో సర్వేనంబరు 148సి–5బిలో 25 సెంట్ల మాగాణి భూమి కృష్ణవేణి తండ్రి కంచర్ల నాగేశ్వరరావు పేరిట ఉంది. 2007 నుంచి సర్వే చేయించాలని కోరుతూ వచ్చారు. సాధ్యపడలేదు. ఆయన మరణించాక వీలునామా ప్రకారం తన పేరును అడంగల్‌లో చేర్చి, పట్టాదారు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవటంతో జిల్లా కలెక్టరును కలిశారు. జిల్లా సర్వే, లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.కెజియాకుమారి కూడా ఆర్డీవోకు రిఫర్ చేశారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి 2015లో 20 సెంట్ల భూమిని వేరొకరికి విక్రయించారు. అడంగల్‌లో నమోదు కానందున అగ్రిమెంటు ప్రకారం వారు రూ.25 వేల అడ్వాన్సు మినహా డబ్బు మొత్తాన్ని చెల్లించలేదు. ఇదిలా ఉంటే, వీలునామాను పరిగణనలోకి తీసుకోవాల్సిన మండల తహసీల్దారు ఆ భూమి వివాదంలో ఉందనీ, కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ ఇటీవల నివేదించారని కృష్ణవేణి చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి ఇతరుల స్వాధీనంలో ఉందనీ, 1987లోనే వారి పెద్దలకు కృష్ణవేణి తండ్రి నాగేశ్వరరావు విక్రయ అగ్రిమెంటు రాశారనీ, మళ్లీ ఇప్పుడు వారి వారసుడితోనే కృష్ణవేణి విక్రయ అగ్రిమెంటు చేసుకున్నారని తహసీల్దారు ఆ నివేదికలో పేర్కొన్నారు. అడ్వాన్సు రూ.25 వేలు మినహా మిగిలిన రూ.4.75 లక్షలు చెల్లించనందున వివాదం నెలకొందని, కోర్టులో పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. 1987లో విక్రయ ఒప్పందం ఉంటే ఎందుకు రిజిస్టరు చేసుకోలేదు? అలాంటి ఒప్పందం ఉంటే వారి వారసులే ఈ భూమిని తన దగ్గర ఎందుకు కొంటారు? అడంగల్‌లో నమోదు కానపుడు పూర్తి డబ్బులు ఎందుకు చెల్లిస్తారు? అసలు వీలునామా ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవన్నీ ఎందుకు? అనే కృష్ణవేణి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు. గుడివాడ గ్రామ అధికార పార్టీ నేత జోక్యంతో మండల తహసీల్దారు ఈవిధంగా చేశారని కృష్ణవేణి ఆరోపించారు. విసిగివేసారి తక్కువ ధరకు భూమిని అమ్మేసుకొనేలా చేయాలనే కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘మీకోసం’లో మూడు అర్జీలు... ‘మీకోసం’లో అర్జీలను ఆర్డీవో కార్యాలయ ఏవో ఎ.చెంచులక్ష్మి స్వీకరించారు. రూరల్ మండలం బుర్రిపాలెంలో తన 18 సెంట్ల స్థలంలో రోడ్డు నిమిత్తం వదిలిన 3 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందనీ, విచారించి న్యాయం చేయాలని శాఖమూరి సామ్రాజ్యం అర్జీనిచ్చారు. అమృతలూరు మండలం మూల్పూరులో తన పొరుగు రైతు పసుపులేటి శ్రీను పంటకాలువ మూసేసి, తన పొలానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని భవనాసి ఆశీర్వాదం అర్జీలో ఆరోపిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ బాలాజీరావుపేటలో ప్రభుత్వ ఖాళీస్థలంలో రేకుల షెడ్డు వేసుకుని గత 30 ఏళ్లుగా జీవిస్తున్న తనకు పట్టాను ఇప్పించాలని కోరుతూ పాలపర్తి మహాలక్ష్మి అనే మహిళ అర్జీనిచ్చారు. విద్యుత్ సమస్యలపై రూరల్ మండలం చావావారిపాలెం నివాసి భవతుల రవి, అమృతలూరు మండలం యడవూరు గ్రామస్తులు ఇచ్చిన అర్జీలను ‘మీకోసం’లో ఉన్న విద్యుత్ డీఈఈకి చర్యల నిమిత్తం ఇచ్చారు. వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
పేకాట ఆడుతూ చిక్కిన గాజువాక సహాయ కమిషనర్
విశాఖపట్నం : జీవీఎంసీ గాజువాక జోనల్ సహాయ కమిషనర్ (రెవెన్యూ) పైడిరాజుపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక జోనల్ కార్యాలయంలోని తన చాంబర్లో గల కంప్యూటర్లో ఆయన పేకాట ఆడుతున్న వీడియోను ఒక వ్యక్తి కమిషనర్‌కు వాట్సాప్ ద్వారా పోస్టు చేశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారిని వివరణ అడిగినట్టు తెలిసింది. ఆఫీసు పని వేళల్లో పేకాట ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు వివరణ పంపించాలని ఆదేశించినట్టు జీవీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ కూడా పైడిరాజును వివరణ అడిగినట్టు తెలిసింది. అయితే తెలియని కమాండ్ నొక్కడం వల్ల ఈ గేమ్ ఓపెన్ అయిందని ఆయన జోనల్ కమిషనర్‌కు చెప్పినట్టు జోనల్ వర్గాలు పేర్కొన్నాయి. -
వాడ్యాల్లో రెవెన్యూ అధికారుల నిర్బంధం
మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని వాడ్యాల్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను నిర్బంధించారు. భూ పక్షాళణలో జరిగిన తప్పులను సరిచేయడానికి సోమవారం రెవెన్యూ అధికారుల బృందం గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలో ప్రభుత్వ భూమి సర్వే నం.0లో దాదాపు 60 మంది రైతులు సాగులో ఉండగా, వారికి రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదు. అలాగే సర్వే నం.229లో ఉన్న అసైన్డ్ భూమిలో పట్టా ఉన్న రైతులకు కూడా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అరుణ చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తహసీల్దార్ పాండునాయక్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆర్డీఓకు ఫోన్లో వివరించగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అధికారులను వదిలిపెట్టారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పా సు పుస్తకంతోపాటు చెక్కులను అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. -
తాడేపల్లిలో ఉద్రిక్తత
అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో పొలాల్ని కొలతలు వేయడానికి రెవన్యూ అధికారులు భారీ స్థాయిలో పోలీస్ ఫోర్స్‌తో వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని కొలతలు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. భూసేకరణ చట్టం ప్రకారం పొలాలను కొలతలు వేసే అధికారం అధికారులకు లేదన్నారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలతలు చేపడతారని రైతులు అధికారులను నిలదీశారు. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
23 ఏళ్లు పోరాడి గెలిచినా..
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను అధికారులు అమలు చేయడం లేదని, దీంతో కోర్టు తీర్పుల తాలుకు విజయ ఫలాలను సంబంధిత వ్యక్తులు ఆస్వాదించలేకపోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ, అధికారుల తీరుతో ఆ ఉత్తర్వుల ఫలాలను ఆస్వాదించకుండానే ఓ కక్షిదారుడు తనువు చాలించిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులిచ్చిన తీర్పులను అధికారులు అమలు చేయకపోతుండటంతో, బాధిత వ్యక్తులు విధి లేని పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి అసాంఘిక శక్తులను ఆశ్రయిస్తున్నారని తెలిపింది. అధికారుల తీరుతో న్యాయవ్యవస్థ పరిహాసానికి గురవుతోందని, వ్యవస్థకు ఇది మంచిది కాదంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి.. కోర్టుల ఆదేశాలను అసలైన స్ఫూర్తితో అమలు చేయాలని హితవు పలికింది. 1995 నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూ వచ్చిన ఆ కక్షిదారుకి అనుకూలంగా.. న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని 43/1, 44/1, 45/1 సర్వే నంబర్లలో ఉన్న తన 31.25 ఎకరాల భూమిని 234 మంది ఆక్రమించుకోవడంతో సుల్తాన్ మోహినుద్దీన్ అనే వ్యక్తి 1995లో న్యాయ పోరాటం ప్రారంభించారు. 1997లో భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం (ఎల్జీసీ) ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ఆక్రమణదారులు 1998లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పటిషన్‌ను హైకోర్టు 2009లో కొట్టేసింది. దీంతో 1997లో తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేసి, అక్రమణదారులను ఖాళీ చేయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలంటూ సుల్తాన్ మోహినుద్దీన్ ఎల్జీసీలో 2009లో పిటిషన్ దాఖలు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎల్జీసీ, ఆక్రమణదారులను ఖాళీ చేయించి భూమిని మోహినుద్దీన్కి స్వాధీనం చేయాలని ఆర్డీవోను ఆదేశించింది. అయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఎంత మేర భూమికి అర్హులో అంతమేర స్వాధీనం చేయాలని పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన మోహినుద్దీన్.. 1995లో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఎల్జీసీ తాజా ఉత్తర్వులున్నాయని నివేదించారు. విచారణ జరిపిన హైకోర్టు 2010లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. స్పందించని రెవెన్యూ అధికారులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో భూమిని స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఎల్జీసీ ఇచ్చిన ఉత్తర్వులను ఆర్డీవో అమలు చేయలేదు. మరోవైపు ఆక్రమణదారుల్లో కొందరు 1997లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఎల్జీసీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సమయంలోనే మోహినుద్దీన్ కన్నుమూశారు. దీంతో ఆయన వారసులు న్యాయ పోరాటం కొనసాగించారు. ఎల్జీసీ ఆదేశాలను రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు ఆక్రమణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాలను తిరిగి హైకోర్టుకు పంపింది. తాజాగా అందరి వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం మేరకు ఎంత వరకు మోహినుద్దీన్ అర్హుడో అంత మేర భూమినే స్వాధీనం చేయాలంటూ ఎల్జీసీ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఎల్జీసీ కోర్టు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని రెవెన్యూ అధికారుల తీరును, పదే పదే నిరర్థక వ్యాజ్యాలు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆక్రమణదారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. -
సైనికుడి భూమికి రక్షణ కరువు
సాక్షి, అమరావతి బ్యూరో: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి శత్రువులను జయించిన సైనికుడి కుటుంబం అధికార పార్టీ ఆక్రమణల దెబ్బకు తల్లడిల్లుతోంది. మాజీ సైనికుని సేవలు గుర్తించి భారత ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై టీడీపీ నేతల కన్ను పడడంతో రాత్రికి రాత్రే పొక్లెయిన్ల ద్వారా తవ్వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలవడంతో ఆ కుటుంబం న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఏటా 100 బస్తాల ధాన్యం పండించుకుని దర్జాగా బతికిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు గ్రామానికి చేరుకోవడంతో బాధిత సైనికుని కుటుంబ సభ్యులు జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్ ఆదం (మిలటరీ ఆదం) 1942 ఆగస్టు 13వ తేదీన భారత సైన్యంలో చేరాడు. 1946లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆదంకు కాలిలో బుల్లెట్ దిగడంతో ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. కాలికి గాయం అయిన ఆయన ఉద్యోగ విరమణ చేసి తిరిగి 1959లో డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సులో చేరాడు. 1970 వరకు భారత ఆర్మీలో సేవలు అందించిన ఆదం ఉద్యోగ విరమణ పొందారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 1965లో రక్ష మెడల్ ఇచ్చి గౌరవించింది. 1966లో అప్పటి కలెక్టర్ ఆయన జీవనోపాధికి సర్వే నంబరు–364లో 2.59 ఎకరాల భూమిని ఇచ్చారు. ఐదుగురు సంతానం ఉన్న ఆదాం అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మాజీ సైనికుని భూమిపై పెద్దల కన్ను మేడికొండూరు గ్రామ శివారులో 1974 నుంచి 2014 సంవత్సరం వరకూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి శిస్తు కడుతూ ఆదాం కుటుంబం పొలం సాగు చేసుకుంటోంది. 2016లో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. నీరు చెట్టు పథకం పేరుతో పొలాన్ని తవ్వేందుకు అధికారులతో పావులు కదిపారు. రాత్రికి రాత్రే పొలంలో పొక్లెయిన్లు, లారీలతో రెండు రోజుల్లోనే మట్టిని తవ్వి అమ్ముకున్నారు. తాము జీవనాధారం కోల్పోతున్నామని, రక్షణ కల్పించాలని వారు పలుమార్లు ప్రభుత్వ అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కరువైంది. గత్యంతరం లేక ఆ మాజీ సైనికుని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం తీర్పును సైతం లెక్క చేయని అధికారులు మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ అయినా టీడీపీ నాయకులు కానీ, అధికారులు కానీ లెక్క చేయకుండా మట్టి తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో ఆదాం కుటుంబసభ్యులు శనివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు మొరపెట్టుకున్నారు. -
‘జీ’ అని ఉంటే ప్రభుత్వ భూమేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి మండలం ఆగాపురలోని ఓ ప్రైవేటు ఆస్తి విషయంలో రెవెన్యూ అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రైవేటు ఆస్తి అని చెబుతున్న దానికి సంబంధించి టౌన్ సర్వే ల్యాండ్ రికార్డుల్లో (టీఎస్ఎల్ఆర్)లో ‘జీ ’అని ఉందని, జీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రభుత్వం వాదించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ‘‘రేపు మీరు నా ఇంటి విషయంలో కూడా రికార్డుల్లో జీ అని రాసేస్తే, నేను నా ఇంటిపై యాజమాన్య హక్కులను నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా?’’అని నిలదీసింది. ఆ ఆస్తి మీది(ప్రభుత్వం) అని భావిస్తే సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాలంది. 4 నెలల్లో సివిల్ కోర్టును ఆశ్రయించకుంటే, ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగాపురలో కమల్‌కిషోర్ అగ ర్వాల్ అనే వ్యక్తికి చెందిన 558.5, 870 చదరపు గజాల స్థలాన్ని అధికారులు టీఎస్‌ఎల్‌ఆర్‌లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. దీనిప్రకారం కిషోర్‌ను భూ ఆక్రమణదారుగా పేర్కొంటూ, ఆ భూమిని ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై కమల్‌కిషోర్ 2011లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగి ల్ జడ్జి ప్రభుత్వ నోటీసులను రద్దు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు గతేడాది ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం రెవెన్యూ శాఖ న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాలనడం సరికాదన్న వాదననూ తోసిపుచ్చింది. 4 నెలల్లో సివిల్ కోర్టుకెళ్లాలని, లేనిపక్షంలో సింగిల్ జడ్జి తీర్పు అమల్లోకి వస్తుందని చెప్పింది. -
నా భూమి దక్కదేమో!
శాయంపేట (భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన సోమవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని కొత్తగట్టు సింగారం 114 సర్వే నంబరులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి ఆర్డీఓ మహేందర్‌జీ వచ్చారు. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు యత్నించాడు. గమనించిన ఆర్డీఓ డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయాలని తన నంబర్ ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. -
కబ్జా చెర వీడింది
ధారూరు(వికారాబాద్) : మండలంలోని గురుదోట్లలో ఉన్న కొత్త చెరువును కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి కబ్జాచేసి వరి, జొన్న పంటలు సాగుచేసిన సంగతి తెలిసిందే. ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికతో సోమవారం వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ సంఘటనపై ఆర్ఐ యాదయ్య, సర్వేయర్ ప్రభు, వీఆర్ఓ శ్రీశైలం చెరువు ప్రాంతానికి వెళ్లి రైతులు సాగు చేసిన పంట పొలాలను సోమవారం పరిశీలించారు. చెరువును కబ్జాచేసి సాగునీటితో గురుదొట్ల ఎంపీటీసీ సభ్యులు నేనావత్ గోరీబాయితో పాటు గుండ్యానాయక్, గమ్మిబాయి, రూప్లనాయక్, కొంకలి వీరమ్మ, కొంకలి బుగ్గయ్య, దామ్లానాయక్, హన్మంతు, సూబ్య, శంకర్ చెరువును కబ్జా చేసి జొన్నను సాగు చేశారు. చెరువును కబ్జాచేయడం నేరమని పంట పొలాలను తొలగించాలని ఆర్ఐ యాద య్య ఆదేశించారు. 14.01ఎకరాల చెరువు విస్తీర్ణంలో 9 ఎకరాలను రైతులు కబ్జా చేసినట్లు సర్వేలో బయటపడింది. వెంటనే జేసీబీతో పంటలను తొలగించారు. ఇకముందు ఎవరైనా చెరువు శిఖం భూమిని కబ్జా చేసిన అక్రమంగా దున్ని పంటలను సాగు చేసినా ఆయా రైతులపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐ హెచ్చరించారు. చెరువుశిఖం భూమిని తమ ఆదీనంలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
దర్జాగా కబ్జా!
ధారూరు : ఆ చెరువులో రూ.40 లక్షలతో మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరణ పనులు చేశారు. సాగునీరు అందించేందుకు అభివృద్ధి చేసిన చెరువును కొంతమంది దర్జాగా ఆక్రమించి ఇందులో పంటలను సాగుచేశారు. తూము సమీపంలో నీరు నిల్వ ఉన్న 10 శాతం చెరువు భాగాన్ని మాత్రమే వదిలివేసి మిగిలిన చెరువు విస్తీర్ణంలో వరి, జొన్న పంటలు వేశారు. పూడిక తీసిన చెరువులో ఓ వ్యక్తి పశువుల కొట్టం ఏర్పాటు చేసి పశుగ్రాసం నిల్వ చేశాడు. ఆదివారం గ్రామానికి వెళ్లిన విలేకరుల బృందానికి ఆయకట్టు రైతులు చెరువు కబ్జాపై వివరించారు. వివరాలిలా ఉన్నాయి.. ధారూరు మండలంలోని గురుదోట్ల కొత్త చెరువుకు 14.01 ఎకరాల విస్తీర్ణం ఉంది. 1968లో దీన్ని నిర్మించారు. గత సంవత్సరం మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో చెరువులో పూడికతీత, తూము నిర్మాణం, కట్ట, కాల్వ పనులను చేశారు. ఇటీవల గురుదోట్ల పంచాయతి పరిధిలోని కొంతమంది చెరువులోని 90 శాతం భూమిని ఆక్రమించారు. ఇందులో వరి పంట సాగుచేసేందుకు పక్క పొలాల్లోని బోర్ల నుంచి పైప్‌లైన్ల్ ద్వారా నీటిని చెరువులోకి మళ్లించారు. సాగునీరు అందించే ఈ చెరువు రూపం మారిపోయి పొలాలుగా కనిపిస్తోంది. చెరువును ఆక్రమించి పంటలను సాగుచేయటం వలన ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. చెరువు కింద ఉన్న కాల్వను కూడ ఆక్రమణదారులు పాడుచేశారు. వర్షాకాలంలో చెరువులోకి నీరు రాకుండా, చెరువు నిండాకుండా చెరువులోకి వచ్చే వాగు ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో చెరువు కింద ఉన్న 100 ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. కొంతమంది రైతులు బోర్లు వేసుకుని వాటిద్వారా పంటలు పండించుకుంటున్నారు. చెరువు కబ్జాపై ప్రశ్నించిన ఆయకట్టుదారులను ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెరువు చుట్టూ కందకాలు తవ్వించాలి కొంత మంది చెరువును ఆక్రమించి పంటలు వేసుకోవడం అన్యాయం. ఆక్రమణకు గురైన చెరువును కబ్జా నుంచి విడిపించి హద్దురాళ్ల చుట్టూ కందకాలను తవ్వించాలి. చెరువును కబ్జాచేసి పంటలు వేయటం వలన చెరువులోకి వర్షపు నీరు రాకుండా పోయింది. మా పొలాలకు సాగునీరు అందడం లేదు. – కొంకలి వెంకటమ్మ సర్వే చేస్తాం ఆక్రమణకు గురైన చెరువును సర్వే చేయించి వాస్తవాలను గుర్తిస్తాం. ఆక్రమణ బయటపడితే సదరు వ్యక్తులను ఖాళీ చేయించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సాగునీటి శాఖ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి విచారణ జరుపుతాం. – యాదయ్య, ఆర్ ఆక్రమణపై విచారణ చేస్తాం గురుదోట్ల చెరువును ఆక్రమించిన విషయం మా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలిస్తాం. సర్వే నిర్వహించి ఆక్రమణను గుర్తిస్తాం. చెరువును ఆక్రమించి పంటలు సాగుచేసుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం.– సుకుమార్, ఏఈ ఇరిగేషన్, ధారూరు -
అధికారమే అండగా ‘బొండా’గిరి
సాక్షి, అమరావతిబ్యూరో: బొండా ఉమామహేశ్వరరావు భూ దాహానికి అధికార యంత్రాంగం అడుగడుగునా అండగా నిలిచింది. రెవెన్యూ, పోలీసు శాఖలు శక్తివంచన లేకుండా సహకారం అందించినట్లు అనేక రుజువులు లభిస్తున్నాయి. వారి అండతోనే రికార్డులు తారుమారు చేసి స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన రూ.50 కోట్లకు పైగా విలువైన 5.16 ఎకరాల భూమి గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. ‘బొండాగిరి’కి సంబంధించి పలు కొత్త కోణాలు ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూశాయి. రికార్డులు లేని కాలాన్ని ఆసరాగా చేసుకుని.. 1971–88 మధ్య కాలంలో భూములు, ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విజయవాడ గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు ధ్వంసమయ్యాయి. దాన్నే ఎమ్మెల్యే బొండా ఉమా తమ భూదందాలకు అవకాశంగా మలచుకున్నారు. స్వాతంత్య్రసమరయోధుడు సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావుకు 1988లో విక్రయించినట్లు 2016లో పత్రాలు సృష్టించారు. వాస్తవానికి వారిద్దరికీ కూడా ఆ విషయం తెలీదు. అబ్దుల్ మస్తాన్ చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటారు. ఇక కోటేశ్వరరావు దిగువ మధ్యతరగతికి చెందిన లారీ డ్రైవర్. అంతటి విలువైన భూములను కొనుగోలు చేసే ఆర్థికస్తోమత వారిద్దరికీ లేదు. ఆ పత్రాలను చూపిస్తూ ఆ 5.16 ఎకరాలను అబ్దుల్ మస్తాన్, కోటేశ్వరరావు పేరిట మ్యుటేషన్ చేయాల్సిందిగా తహశీల్దార్‌కు 2016, జులై 31న దరఖాస్తు చేశారు. ఇక్కడే రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఎమ్మెల్యే బొండా కుటుంబానికి సహకరించింది. తహసిల్దార్ ఆ దరఖాస్తును ఓకే చేస్తూ కలెక్టర్‌కు పంపగా ఆయన ఐజీ(రిజిస్ట్రార్స్)కు నివేదించారు. ఇలా అన్ని స్థాయిల్లో సహకరించి ఆ భూములను 22ఎ నిబంధన కింద మ్యుటేషన్ చేసేయడం గమనార్హం. దరఖాస్తుదారులైన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లకున్నా బొండా కనుసైగతోనే అధికారులు మ్యుటేషన్ తతంగం పూర్తి చేసేశారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు 2017 మార్చి 15న ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు మరో అయిదుగిరికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) కింద రాసిచ్చినట్లు కథ నడిపించారు. అడంగళ్లోనూ పేర్లు మార్చేసి రూ.50కోట్ల విలువైన భూమి పూర్తిగా ఎమ్మెల్యే బొండా ఉమా సొంతం చేసుకున్నారు. బొండా భూబాగోతానికి పోలీసు అండ తమ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలకు ప్రహరీ నిర్మించి ఆక్రమించుకున్న ఎమ్మెల్యే బొండా కుటుంబాన్నిఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగారంటూ సూర్యనారాయణ మనవడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ స్థాయి అధికారి ఒకరు సురేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఎమ్మెల్యే బొండా సిఫార్సుతోనే ఆ అధికారికి పోస్టింగు దక్కిందన్న విమర్శలు ఉన్నాయి.) భూ విషయమై ఎన్నిసార్లు పోలీసులను సంప్రదించినా ఆ అధికారి బెదిరించారు. ఫిర్యాదులో అంశాలన్నీ తప్పని, మరోసారి ఈ భూమి గురించి మాట్లాడితే తప్పుడు పత్రాలు సృష్టించినట్లు కేసు పెడతానని కూడా సురేష్‌బాబును బెదిరించారు. దాంతో తనకు పోలీసులు సహకరించరని అర్థం చేసుకున్న సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బొండా ఉమా భార్య సుజాత, ఆయన అనుచరుల మీద సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, డిసెంబర్ 4న ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఆ భూమి మీద పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకున్న పత్రాలు మా తప్పిదమేమీ లేదు: రిజిస్ట్రార్ అధికారులు ఎమ్మెల్యే బొండా కుటుంబం భూబాగోతంపై సీఐడీ కేసు నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ విచారణ చేపట్టింది. ఐజీ (రిజిస్ట్రేషన్లు) వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఆ భూమిపై తహశీల్దార్ చేసిన మ్యుటేషన్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేశామని, అందులో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల తప్పేమి లేదని నివేదించినట్లు తెలుస్తోంది. కేసు నమోదుతో జీపీఏ రద్దు నాటకం కేసు నమోదు కావడం, కోటేశ్వరరావు అప్రూవల్‌గా మారడంతో సీఐడీ అధికారుల కళ్లుగప్పి ఆ కేసు నుంచి బయటపడేందుకు బొండా ఉమా కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గత అక్టోబర్‌లో కేసు నమోదు కాగా డిసెంబర్ 4న జీపీఏ రద్దు చేసుకుంటున్నట్లు పత్రాలు సృష్టించారు. అంటే సీఐడీ కేసు నమోదు చేసిన తరువాతే ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారన్నది స్పష్టమవుతోంది. సీఐడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. మరోవైపు అప్రూవర్‌గా మారిన కోటేశ్వరరావును బెదిరించి తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వ్యూహం. తద్వారా సీఐడీ కేసును నీరుగార్చాలని పథకం వేశారు. అయితే ఈ చర్యతో ఆ భూమిని పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా పొందడం అక్రమమని వారే సమ్మతించినట్లవుతోంది. జీపీఏ నెల క్రితమే రద్దు చేసుకున్నట్లు చెబుతున్నా అధికారదర్పంతో భూమిని మాత్రం ఇప్పటికీ తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి తమ మనుషులను కాపలా పెట్టారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులను అక్కడకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సూర్యనారాయణ కోడలు జోగరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్ సోమవారం కూడా ఆ భూమి వద్దకు వెళితే కాపలాదారులు అడ్డుకున్నారు. సీఐడీ కేసు నీరుగార్చేవరకు నిరీక్షించి తర్వాత భూమిపై పట్టు సాధించాలన్నది ఎమ్మెల్యే కుటుంబ లక్ష్యంగా ఉంది. సోమవారం తమ భూమిలోకి ప్రవేశించలేక బయటే ఉండిపోయిన సూర్యనారాయణ కోడలు రాజరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్ -
రెవెన్యూ అధికారుల చేతివాటం ..
శావల్యాపురం: రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి తమ పొలాన్ని మరొ కరి పేరుపై అన్లైన్లో నమోదు చేశారని మండలంలోని కారుమంచి, గంటావారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు బొల్లెపల్లి శివరామకృష్ణ.చిలుకూరి వెంకటేశ్వర్లులు ఆరోపించారు. ఈమేరకు గురువా రం విలేకర్లకు తమ సంతకాలతో కూడిన ప్రకటనలు విడుదల చేశారు. కారుమంచి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 563–1 సర్వే నెంబరు 82 సెంట్లు పొలం ఉంది. 2005లో ప్రభుత్వ పరంగా రిజ ష్టరు అయింది .అయితే గ్రామానికి చెం దిన కిలారు ముణేమ్మ, కిలారు వెంకటేశ్వర్లులకు మాభూమిని రెవెన్యూ అధి కారులు అన్లైన్ నమోదు చేయటంతో పట్టా దారుపాసుపుస్తకాలు 1.బిఫారం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈవిషయంపై నెలలు తరబడి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని బాధితుడు బొల్లెపల్లి శివరామకృష్ణ అవేదన వ్యక్తం చేశాడు. మండలంలోని గంటా వారిపాలానికి చెందిన చిలుకూరి వెంకటేశ్వర్లుకు చెందిన రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి మరొకరు పేరున నమోదు చేసినట్లు బాధితుడు ఒక ప్రకటనలో తెలిపాడు .556–1 సర్వే నెంబరులో 2ఎకరాల భూమి ఉంది. ఈభూమి తమ బంధువైన చిలుకూరి నాగేశ్వరరావుకు కౌలు ఇచ్చానన్నాడు. ఈనేపథ్యంలో తనకు తెలియకుండా రెవెన్యూ అధికారులను ఆశ్రయిం చి గతంలో నకలీ పాసుపుస్తకాలు పొందా డన్నారు. ఈవిషయాన్ని గత ఏడాదిలో ఆర్డీవోకు పిర్యాదు చేయగా విచారణ నిర్ధారణ కావటంతో నాగేశ్వరరావుకు ఇచ్చిన పాసుపుస్తకాలు రద్దు చేసినట్లు చెప్పారు.ప్రస్తుతం అన్లైన్లో తనపేరును రెవెన్యూ అధికారులు తొలగించినట్లు బాధితుడు చిలుకూరి వెంకటేశ్వర్లు విలేకర్లు వివరించాడు. పొలం వివాదం కోర్టులో నడుస్తుందని ఈక్రమంలో పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వృద్ధుడు అవేదన వ్యక్తం చేశాడు. ఈవిషయంపై స్థానిక తహసీల్దారు వి.కోటేశ్వరరావునాయక్‌ను వివరణ కొరగా అంతా రికార్డు ప్రకారం చేసినట్లు చెప్పారు. -
ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తాం..
చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణ శివారున శ్రీకాకుళానికి వెళ్లే రహదారిలో సర్వే నంబర్ 65లో గెడ్డవాగు ఉంది. కొందరు వ్యక్తులు ఆ వాగును పూడ్చేసి ఆక్రమించుకుని, చిన్న షెడ్డులు వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు వారికి ఆరేడు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో ఖాళీ చేయించేందుకు శనివారం అక్కడికి అధికారులు చేరుకున్నారు. వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని నానా హడావుడి చేశారు. జెడ్పీటీసీ రంగ ప్రవేశంతో.. విషయం తెలుసుకున్న చీపురుపల్లి జెడ్పీటీసీ, అధికార పార్టీ నేత మీసాల వరహాలనాయుడు అక్కడికి చేరుకున్నారు. మండల వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వాటిని వదిలేసి ఇక్కడ పేదలు వేసుకున్న చిన్న వర్క్‌షాపులను తొలగించేందుకు వచ్చారా..? అవి మీకు కనిపించడం లేదా..? అని అధికారులను నిలదీశారు. ఒక దశలో మీరెలా ఖాళీ చేయిస్తారో చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పేదలకు సాయపడని అధికారులు ఎందుకు అని హుకుం జారీ చేశారు. అంతే అప్పటివరకు నానా హడావుడి చేసిన అధికారులు చప్పగా మారిపోయారు. చేతులు కట్టుకుని జెడ్పీటీసీ చెప్పినదానికి తలలు ఊపారు. అధికార పార్టీ నేత కావడంతో.. వరహాల నాయుడు అధికార పార్టీ నేత కావడంతో మళ్లీ ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళితే ఇబ్బందులు వస్తాయని తలచిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆదేశాలతో ఖాళీ చేయించేందుకు స్థానిక వీఆర్ఓ, ఆర్ఐ వసంత, ఇరిగేషన్ ఏఈ పవన్‌కుమార్, డీటీ కెఎస్ఎన్.మూర్తి తదితరులు వెళ్లారు. వారు చర్యలు ప్రారంభిస్తుండగా జెడ్పీటీసీ అక్కడి చేరుకుని సోమవారం వరకు సమయం కావాలని లేకుంటే ఖాళీ చేయమని బదులిచ్చారు. ఒకానొక సమయంలో రెవెన్యూ అధికారులు, విలేకర్లపై అసహనం వ్యక్తం చేశారు. అయితే డీటీ మూర్తి మూర్తి మాట్లాడుతూ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని అప్పటికే ఖాళీ చేయాలని, తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. తర్వాత అధికారులు జెడ్పీటీసీ వేర్వేరుగా మాట్లాడుకుని, సాయంత్రానికి ఆక్రమణదారులే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. -
రెవె‘న్యూ’పాలన
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారాలకు త్వరలోనే కత్తెర పడనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ శాఖ పరిధి, అధికారాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నిర్వహిస్తున్న విధుల్లో ఎక్కువ భాగం పనులను రెవెన్యూశాఖకు బదలాయించాలని సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు నుంచి రెవె‘న్యూ’ పాలనకు తెరలేవనుంది. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా వ్యవహరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రోజు నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి తగ్గనుంది. ఇకపై ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందో దాని పరిధి ఆ మండలానికే పరిమితం కానుంది. మిగతా చోట్ల తహసీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. భూముల క్రయ విక్రయాల బాధ్యతలను వారే చూస్తారు. సగం చోట్ల ఖాళీ! ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సగం మండలాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తహసీల్దార్లే పర్యవేక్షించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 45 మండలాలకుగాను కేవలం 22 మంది సబ్రిజిస్ట్రార్లు మాత్రమే ఉన్నారు. దీంతో వీరు మినహా మిగతా మండలాల బాధ్యతలు తహసీల్లార్ద నెత్తిన పడనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరులో మాత్రమే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. దీంతో ఇవి ప్రతి రోజూ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతాయి. ఇకపై ఇవి కేవలం ఆయా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కానున్నాయి. అయితే, అదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయంలో సగం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రధాన ఆదాయార్జన శాఖగా చెప్పుకునే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూములు, స్థలాలు, ఇతర దస్తావేజుల నమోదుతో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా రాబడి లభిస్తోంది. రాజధాని పరిసరాల్లోనే ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో స్థిరాస్తిరంగం బలంగా ఉంది. దీంతో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు, అగ్రిమెంట్లు సహా ఇతరత్రా డాక్యుమెంట్ల నమోదులోనూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిని సంబంధిత మండలానికే పరిమితం చేసినా మిగతా మండలాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ల భారం తహసీల్దార్లను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు యాచారం, మంచాల, కందుకూరు, ఆమనగల్లు, కొత్తూరు, నందిగామ, మొయినాబాద్, కడ్తాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో తహసీల్దార్ల ఇతర పనులపై ప్రభావం పడనుంది. అదే సమయంలో భూ వివాదాలు కూడా ఎక్కువే కావడంతో ఈ కొత్త విధులు తమ మెడకు ఎక్కడ చిక్కుకుంటాయోననే ఆ మండలాల తహసీల్దార్లు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అధికంగా ఉన్నందున వీటిని పునర్విభజించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ల విధులను దాదాపుగా రెవెన్యూశాఖకు బదలాయిస్తుండడంతో జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలేమిటనేది చర్చనీయాంశంగా మారింది. -
నేడో.. రేపో.. ‘రెవెన్యూ’ ప్రక్షాళన
రెవెన్యూ అధికారుల ప్రక్షాళనకు తెరలేచింది. భూ రికార్డుల ప్రక్షాళన ముగియడంతో తహసీల్దార్ల బదిలీలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ఇటీవల పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడమేగాకుండా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మరికొందరికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కసరత్తు ప్రారంభించిన జిల్లా పాలనాధికారులు.. నేడో, రేపో బదిలీల జాబితాకు తుదిరూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు భూరికార్డుల నవీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇది దాదాపుగా ముగింపు దశకు చేరుకోవడంతో తహసీల్దార్లకు స్థానభ్రంశం కలిగించే దిశగా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. గతంలో కొందరు బదిలీ చేయాలని అభ్యర్థించినప్పటికీ రికార్డుల నవీకరణ జరుగుతున్నందున సున్నితంగా తోసిపుచ్చారు. వీరి అభ్యర్థనలను తాజా ప్రతిపాదనల్లో పరిశీలిస్తున్నారు. పనితీరే గీటురాయి రికార్డుల శుద్ధీకరణలో సమర్థవంతంగా పనిచేసిన తహసీల్దార్లకు కీలక పోస్టింగ్‌లు అప్పగించి.. పనితీరు బాగాలేని వారికి అప్రాధాన్య స్థానాలను కేటాయించాలని భావిస్తోంది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించడంతో కలెక్టరేట్ పరిపాలనాధికారి సత్యనారాయణరాజు, చేవెళ్ల తహసీల్దార్ గోపిరామ్, యూఎల్సీ తహసీల్దార్ సూర్యప్రకాశ్ బదిలీపై వెళ్లారు. వీరి స్థానంలో ముగ్గురు తహసీల్దార్లను ప్రధాన భూ పరిపాలనాధికారి కార్యాలయం(సీసీఎల్ఏ) కేటాయించింది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలతోపాటు కొన్ని మండలాల అధికారుల మార్పులు, చేర్పులు చేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఈ మేరకు బుధవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ జాబితా కూర్పుపై మల్లగుల్లాలు పడ్డట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. పనితీరును ప్రామాణికంగా చేసుకొని పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజా సంకేతాలను పరిశీలిస్తే సంక్రాంతిలోపు రెవెన్యూ ప్రక్షాళన జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా, కొందరు ప్రజాప్రతినిధులు కూడా తహసీల్దార్ల బదిలీలపై పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున.. చూసీచూడనట్లు వ్యవహరించే అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పోస్టింగ్‌లపై ఎమ్మెల్యేల ముద్ర ఉండే అవకాశం లేకపోలేదనే ప్రచారమూ వినిపిస్తోంది. -
మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు
హాలియా (నాగార్జునసాగర్) : హాలియా మార్కెట్ యార్డులో మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులోని వాణిజ్య సముదాయం గోడౌన్లలో కొంతమంది ట్రేడర్లు సుమారు రెండు వేల బస్తాల కందులు అక్రమ నిల్వలు ఉంచారనే ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కేసీ ప్రమీల, విజిలెన్స్ ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యాపారులు కర్ణాటక గుల్భార్గా ప్రాంతం నుంచి కందులు కొనుగోలు చేసి మార్కెట్ యార్డులోని గోడౌన్లలో నిల్వ ఉంచారు. యార్డులో మొత్తం 13 దుకాణాలు ఉండగా 8 దుకాణాల్లో తనిఖీ చేయగా మూడు దుకాణాల్లో కందులు నిల్వలు బిల్లులు, స్టాక్ రిజిష్టర్లు తనిఖీ చేశారు. కాగా మిగిలిన దుకాణాల వ్యాపారులు స్థానికంగా లేకపోవడంతో బుధవారం తనిఖీలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు దుకాణాలకు సీల్ వేశారు. వ్యాపారులు అక్కడ రైతుల వద్ద కొనుగోలు చేశారా? లేక మధ్యవర్తి వద్దనా అన్న పూర్తి వివరాలు బుధవారం తేలే అవకాశం ఉంది. తనిఖీల్లో మార్కెట్ కార్యదర్శి శ్రీనాథరాజు రెవెన్యూ కార్యదర్శి శ్యాం పలువురు అధికారులు ఉన్నారు. మార్కెట్లో త్వరలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు నిల్వ చేసిన కందులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
పైసా వసూల్..!
జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన సర్వే పూర్తి అయింది. ఎన్నో సంవత్సరాలుగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది డబ్బుల వసూళ్లకు తెరలెపినట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లాలో 90 రోజులపాటు నిర్వహించిన భూసర్వే డిసెంబర్ 31న ముగిసింది. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామ పంచాయతీల్లో సర్వే చేశారు. 4,24,382 సర్వే నంబర్లలో 5,18,951 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 3,07,127 ఎకరాలు వివాదాలు లేని భూమిగా, 2,11, 827 ఎకరాల భూమి పలు వివాదాల్లో ఉన్నట్లుగా అ«ధికారులు నిర్ధారించారు. సర్వే పూర్తి కావడంతో 1బీ, పహణీలు జారీ చేసేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. జనవరి 26న అందించాలని ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన సర్వేను కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బ్రోకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సంవత్సరాలుగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించేందుకు బాధితులు సైతం ఎంతో కొంత ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు అదేపనిగా తహసీల్దార్ కార్యాలయాల్లో వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కొంతమంది రెవెన్యూ సిబ్బంది, బ్రోకర్ల కారణంగా అభాసుపాలవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు.. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి కొందరు రెవెన్యూ అధికారులు గొడవలు సృష్టిస్తున్నారు. మోకా మీద తప్పుడు సర్వే నంబర్లో ఉన్నారు. రికార్డుల్లో మీ పేరు రాదు అని రైతులని భయాందోళనలకు గురిచేస్తున్నారు. సర్వే నంబర్లను సరి చేసేందుకు ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే మోకాలో 20 సంవత్సరాలుగా ఉన్నా సైతం కాస్తులో రావడం లేదు. మళ్లీ సర్వే చేయించుకో అని రైతులకు ఉచితంగా సలహాలు ఇస్తున్నారు. సర్వే చేసినందుకు ఒక్కో రైతు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. రైతులు, రెవెన్యూ సిబ్బందికి మధ్యవర్తులుగా స్థానికులు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని సమాచారం. జిల్లాలో టెక్స్టైల్ పార్కు స్థలం పోయిన రైతులు అదే గ్రామంలో ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మీ దగ్గర భూమి కోల్పోయిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో ఉన్న భూమిని సరిచేసుకో అని రెవెన్యూ సిబ్బంది, దళారులు అంటున్నారు. దీంతో ఇప్పటికే కొంత భూమి టెక్స్టైల్ పార్కుకు పోయింది, ఉన్న భూమినైనా డబ్బులు ఇచ్చి మరి సరిచేయించుకుంటున్నారు. టెక్స్టైల్ పార్కు కోసం భూములు కోల్పోయిన గ్రామం బస్టాండ్‌లో వీరి సంప్రదింపులు జరుగుతున్నాయి. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నామని విశ్వనీయ సమాచారం. ఇప్పటికే ఒక తహసీల్దార్ సస్పెన్షన్.. భూ ప్రక్షాళనలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో పర్వతగిరి తహసీల్దార్ విజయలక్ష్మీని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమ్రపాలి సస్పెండ్ చేశారు. ఒక అధికారిపై వేటు పడినా అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డబ్బుల వసూళ్లను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. నా దృష్టికి రాలేదు వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దు. – ఎం.హరిత, జాయింట్ కలెక్టర్ -
చెన్నంపల్లి కోటలో ‘సర్కార్’ దొంగలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుప్త నిధుల కోసం ఓ చారిత్రక కట్టడంలో అక్రమ తవ్వకాలు జరుగుతుండడం సంచ లనంగా మారింది. పురాతన కట్టడాల వద్ద తవ్వకాలు జరిపేటపుడు పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వాలన్న సంగతినీ పక్కన పెట్టేశారు. నిధులున్నాయి.. తవ్వుకుంటాం అని ఓ ప్రైవేటు ఏజెన్సీ అడగ్గానే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అనుమతించే సిందట. లిఖితపూర్వకమైన ఆదేశాలేవీ లేవు. కేవలం మౌఖిక ఆదేశాలే. దీనిపై ఆర్డీవో ఒకమాట చెబుతుండగా కలెక్టర్ మరోమాట చెబుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనక అధికారపార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందని వినిపిస్తోంది. గ్రామస్తులు గొడవచేయడంతో తూతూమంత్రంగా గ్రామ సభ నిర్వహించి మమ అనిపించారు. అయితే తవ్వకాలు మాత్రం ఆపలేదు. గ్రామస్తుల హడావుడి ఉంటే తాత్కాలికంగా విరామమిస్తూ మరలా కొనసాగిస్తున్నారు.. రాత్రిపూట కూడా తవ్వ కాలు సాగిస్తున్నారు. అధికారుల అండదండలతో.. పోలీసుల పహారా మధ్య తవ్వకాలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ఈ కోట ఎక్కడుందా అనుకుంటు న్నారా.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లోని చెన్నంపల్లి కోట ఇది. ఈ నెల 13 నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలోనూ విఫలయత్నాలు.. చెన్నంపల్లి కోటలో భారీగా నిధి నిక్షేపాలున్నాయన్న ప్రచారం ఇప్పటిది కాదు. గతంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. పదేళ్లుగా కొందరు స్థానికుల సాయంతో తవ్వ కాలకు ప్రయత్నిస్తూనే వచ్చారు. 2006లో ఓసారి రాత్రిపూట తవ్వకాలు జరుపుతుం డగా.. గ్రామస్తులు అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీకి తెలియజేశారు. దాంతో నిధి ఉందని ప్రచారం జరుగుతున్న ప్రాంతం వద్ద తవ్వ కాలు జరిపేందుకు వీలులేకుండా స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల చేత పెద్ద బండరాయి వేయించారు. ఆ తరువాత కూడా పలుమార్లు రాత్రి సమయాల్లో తవ్వకాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. 2014,15లోనూ ఇదేవిధంగా తవ్వకాలు జరిపారు. ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు. ప్రైవేటు ఏజెన్సీకి సీఎంఓ అనుమతి ప్రస్తుతం తవ్వకాలు చేపడతామని సీఎంఓకు ఒక ప్రైవేటు ఏజెన్సీ దరఖాస్తు చేసుకోగా అనుమతిస్తూ జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చేశాయి.. అయితే మౌఖిక ఆదేశాలతోనే అధికారులు తవ్వకాలు ప్రారం భించారు. ఈ విషయాన్ని స్వయంగా కలెక్టరే ఒప్పుకోవడం గమనార్హం. మరోవైపు తవ్వ కాలు చేపట్టే ముందు అధికారులు కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదు. మొదటి రోజు (ఈ నెల 13) ఏకపక్షంగా తవ్వకాలకు పూనుకున్నారు. దీనిపై గ్రామస్తులు అభ్యంత రాలు తెలిపి తవ్వకాలను అడ్డుకోవడంతో రెండోరోజు గ్రామసభ పెట్టారు. ఇందులోనూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయ త్నం చేయలేదు. అనుమతులు చూపాలంటూ అధికారులను గ్రామస్తులు, వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులు నిలదీసినా ఖాతరు చేయ కుండా.. ‘కమిటీ పర్యవేక్షణ’ పేరిట పనులు కొనసాగించారు. ఇక కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేనప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేటప్పుడు రెవెన్యూ, మైనింగ్‌తో పాటు పురావస్తు శాఖ సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. అయితే.. ఈ కోట విషయంలో మైనింగ్, రెవెన్యూ అధికారులే ఉంటున్నారు. పురావస్తు శాఖకు సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాం గం ఇవ్వకుండా తవ్వకాలు ప్రారంభించారు. ఇక తవ్వకాలు చేపట్టరాదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కొద్దిమందిని కమిటీలో నియమించారు. మౌఖిక ఆదేశాల మేరకేనన్న కలెక్టర్ చెన్నంపల్లి కోటలో అధికారులు చేపడుతున్న తవ్వకాల వ్యవహారం మొదటినుంచి అను మానాలను రేకెత్తిస్తోంది. తవ్వకాలు చేపట్టే సమయంలో గ్రామస్తులు నిలదీసినప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెన్నంపల్లి కోటను సందర్శించి.. అధికారులను నిలదీయగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ చెప్పిన ఆర్డీఓ.. ఆ పత్రాలు చూపమంటే మాత్రం పట్టించు కోలేదు. ఇదే విషయమై కలెక్టర్ సత్యనారాయణను వైఎస్సార్ సీపీ బృందం సోమవారం కలసి ప్రశ్నించగా.. మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు చేపడుతున్నామని వెల్లడించారు. అక్కడ పురావస్తు శాఖ సిబ్బంది లేరని అంగీకరించారు. తవ్వకాల విషయాన్ని పురా వస్తు శాఖ దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ బృందానికి హామీ ఇచ్చారు. ఈ విధంగా లిఖిత పూర్వక ఆదేశాలు ఉన్నాయని ఒకసారి, లేవని మరోసారి అధికారులు పేర్కొనడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో సదరు ప్రైవేటు సంస్థ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు రాత్రి సమ యాల్లో కూడా తవ్వకాలు చేపడుతుండటం బలం చేకూరుస్తోంది. ఆగని తవ్వకాలు: చెన్నంపల్లి కోటలో అధికారులు చేపట్టిన గుప్త నిధుల తవ్వకాలు ఆగేలా లేవు. సోమవారం తవ్వకాల్ని ఆపేసిన అధికారులు.. మంగళవా రం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారం భించారు. తవ్వకాలు జరుపుతున్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజు లుగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య నియో జకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ అండ్ జియాలజీ ఏడీ నటరాజ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. మొదట్లో ఎవరికీ చెప్ప కుండా, హడావుడిగా తవ్వకాలు జరిపారు. అనుమతులపై గ్రామ స్తులు నిల దీయడంతో మరుసటి రోజు (ఈ నెల 14న) కమిటీ వేయడంతో పాటు గతంలో తవ్వ కాలు జరిపిన వ్యక్తుల సహకారం తీసుకుంటున్నారు. తవ్వకాల్లో ఎముకలు, మెత్తటి నల్లమట్టి బయటపడ్డాయి. నీటిఊట కూడా వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ కోటపైకి వచ్చిన తర్వాత తవ్వకాలు తిరిగి ప్రారంభించారు. ఇదీ చెన్నంపల్లి కోట చరిత్ర.. గోల్కొండ సుల్తాన్, పోర్చు గీసు వారు ఏకమై దాడులు చేస్తున్న నేపథ్యంలో 1584–1614 మధ్య విజయనగర రాజులు గుత్తి కోటను వదిలి.. అక్కడున్న సంప ద, ఆయుధాలను ఓ రహస్య కోటకు తరలించినట్లు చరిత్ర చెబుతోంది. గుత్తి కోటకు సమీపం లో ఉన్న స్వర్ణగిరి (ఇప్పటి జొన్నగిరి) మీదుగా చెన్నంప ల్లి కోటకు చేరుకునే విధంగా సొరంగ మార్గాన్ని తవ్వించారు. చెన్నంప ల్లిలో వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద కోటను ఏర్పాటుచేశారు. విజయనగర రాజులు ఆదోని, రాయచూరు, గుత్తి, బళ్లారి తదితర కోటల్లో వజ్ర వైఢూర్యాలు, అపార సంపదను భద్రపరిచారని, ఇలా భద్రపరచిన వాటిలో చెన్నంపల్లి కోట కూడా ఒకటని అంటున్నారు. ఈ కోటలో విజయనగర పాలనకు సంబంధించిన శిలా శాసనాలు, దేవతా విగ్రహాలు కనిపించడం అందుకు ఊతమిస్తోంది. -
ఎట్టకేలకు పూర్తయిన విభజన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమయిన జూన్ 2, 2014 నాటికి రాష్ట్రంలో పనిచేస్తున్న 536 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లలో 305 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 231 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇందులో అధికారులు ఎంచుకున్న రాష్ట్రానికే ప్రాధాన్యత ఇస్తూ తాత్కాలిక కేటాయింపు పూర్తి చేశారు. అయితే, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 42 శాతం మందిని తెలంగాణకు, 58 శాతం మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సి ఉంది. అయితే ఒక శాతం అదనంగా తెలంగాణకు ఇచ్చారని, దీంతో తెలంగాణ ఐదు పోస్టులను నష్టపోతోందని, అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లాభపడిందని తెలంగాణ రెవెన్యూ సంఘాలు విమర్శిస్తున్నాయి. సీనియారిటీ జాబితా ఖరారుతో... ఈ విభాగాల్లో ఎట్టకేలకు సీనియారిటీ జాబితా ఓ కొలిక్కి రావడంతో తాజాగా సమావేశమైన ప్రత్యేక కమిటీ ఈ కేటాయింపులను పూర్తి చేసింది. అయితే, రాష్ట్రాన్ని ఎంచుకునే అవకాశం అధికారులకు ఇవ్వడంతో మొత్తం 43 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇందు లో తెలంగాణ నుంచి ఏపీకి 10 మంది వెళ్లగా, ఏపీ నుంచి తెలంగాణకు 33 మంది వచ్చారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సుందర్ అబ్నార్ ఏపీ ఆప్షన్ ఇవ్వడంతో ఆయనను అక్కడికే కేటాయించారు. కొందరికి రివర్షన్ తప్పదా..? తాజా కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరిని రివర్షన్ చేయక తప్పదనే చర్చ జరుగుతోంది. గత ఏడాది 82 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వడంతో ఇటీవల వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. అయితే, ఇప్పుడు ఆంధ్రా నుంచి వస్తున్న 33 మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలంటే అందులో 10–15 మందికి రివర్షన్ తప్పదని రెవెన్యూ సంఘాలంటున్నాయి. అయితే, తాజా కేటాయింపులతో ఏపీలో మాత్రం డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల్లో 95 వరకు ఖాళీలు పెరగనున్నాయి. ఆప్షన్ ఎంపిక మతలబు ఏమిటంటే..! తెలంగాణలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా రెవెన్యూ అధికారులకు ఎక్కువ అవకాశం ఉండడం, తెలంగాణకు అదనపు ఐఏఎస్ పోస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ కలెక్టర్లయిన వారంతా తెలంగాణే ఆప్షన్ పెట్టుకున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో స్థిరపడడం కోసం, స్పౌస్ కేసుల్లో తెలంగాణను ఎంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తెలంగాణలో 58 ఉండగా, ఏపీలో 60 ఏళ్ల వరకు అవకాశం ఉంది. దీంతో రెండేళ్లు సర్వీసు కలసి వస్తుందనే కారణంతో రిటైర్మెంట్ దగ్గర ఉన్న కొందరు తెలంగాణ అధికారులు ఏపీని ఎంచుకోవడం గమనార్హం. -
అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటాం
మునుగోడు: తల్లిదండ్రులకు ఇక నుంచి ఎలాంటిలోటు రాకుండా చూసుకుంటామని నలుగురు కుమారులు అధికారుల ముందు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని బట్టకాల్వకు చెందిన నారగోలు ముత్యాలు, మంగమ్మ దంపతులను కుమారులు ఇంట్లో నుంచి గెంటివేసిన వైనంపై ‘సాక్షి’ మెయిన్‌లో శుక్ర వారం ‘‘కొడుకులా.. కర్కోటకులా’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ హెచ్.ప్రమీల ఉదయమే ఆ దంపతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నలుగురు కుమా రులను కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను పోషించలేకుంటే వారి ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఆదేశిం చారు. వారిని సక్రమంగా చూసుకుంటామని రాసి ఇవ్వాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కుమారులు తమ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటామని, తాము చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. వారి ని ఒక అద్దె ఇంట్లో ఉంచి సరిపడా సరుకులను అందిస్తామని, త్వరలో అందరం కలసి కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని రాసిచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ పత్రికకు కృతజ్జతలు తెలిపారు. -
న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైనది
లీగల్ (కడప అర్బన్) : సమాజంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైందని, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సహకరిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసు, ఇతర అధికారులకు కేసులకు సంబంధించి పరిష్కారం కోసం శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల్లో నమోదైన కేసులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఆ సమయం లోపు ఈ కేసులు పూర్తిగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ దేశంలోనే పటిష్టంగా ఉన్న న్యాయ వ్యవస్థ ముందు డేరా బాబా లాంటి వారు కూడా తలవంచిన సంఘటన దేశ వ్యాప్తంగా చెప్పుకోదగిందన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ శాఖలు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనవని, ఇందుకోసం సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజలను శాంతియుత జీవనం గడిపేలా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పోలీసు శాఖకు ఎంతో సహకరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఎంతో సహకరిస్తే తమవంతు కీలకమైన ఎర్రచందనం లాంటి కేసులను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి వీవీ శ్రీనివాసమూర్తి, పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు, న్యాయ సేవా«ధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, అన్వర్‌బాషా, ఎస్.ప్రసాద్, వివిధ కోర్టులకు చెందిన మెజిస్ట్రేట్లు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పాల్గొన్నారు. -
జననాల నమోదు ‘డబుల్’
జననాల నమోదు శాతం భారీగా పెరిగింది. పదేళ్ల కింద 40.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 82.9 శాతానికి పెరిగింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో జనన ధ్రువీకరణ కీలకంగా మారింది. ఆధార్ కార్డు వంటి వివిధ కార్డుల జారీలోనూ జనన ధ్రువీకరణ తప్పనిసరైంది. దీంతో ప్రజల్లో జనన నమోదుపై శ్రద్ధ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జననాల నమోదు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ పట్టణాల్లోనే మెరుగ్గా.. జననాల నమోదులో పట్టణ ప్రాంతాల్లోనే పరిస్థితిమెరుగ్గా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక వ్యవస్థ ఉండటంతో నమోదుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసిన పక్షం రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 92.9 శాతం జననాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 62.6 శాతమే నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో అయోమయం.. గ్రామీణ ప్రాంతాల్లో జనన ధ్రువీకరణ పత్రాల పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వీలుంది. అయితే ఆ పంచాయతీ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ ద్వారా పనిచేస్తే కేంద్రం రూపొందించిన జనన, మరణ నమోదు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా జారీ చేయాలి. కానీ రాష్ట్రంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్‌గానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.దీంతో పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి ‘రికార్డ్ నాట్ ఫౌండ్’అని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. కనిష్టంగా నెల రోజుల తర్వాత ఈ పత్రాన్ని జారీ చేసినప్పటికీ.. జనన ధ్రువీకరణ పత్రం ఎక్కడ పొందాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. -
పైసా వసూల్
రెవెన్యూ అధికారులు ‘పైసా వసూల్’ పనిలో బిజీగా మారారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. అవసరమైతే ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు సృష్టించి అమాయకులైన వారికి అంటగట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరిదెబ్బకు భయపడిన కొందరు ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కడుపుమండిన మరికొందరు బాధితులు ఏసీబీ అధికారులకు కూడా పట్టించారు. అయినప్పటికీ రెవెన్యూ సిబ్బంది ప్రవర్తనలో మార్పురాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో ‘పైసా వసూల్’కు అంతులేకుండా పోతోంది. ఇక్కడి అధికారులు పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల రక్తం పిండుకుంటున్నారు. ముడుపులు ఇవ్వకపోతే కొర్రీలతో చుక్కలు చూపిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే కింద స్థాయి అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముడుపులిస్తేనే పనులు రెవెన్యూ శాఖలో ప్రధానంగా తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారినట్లు ఆరోపణలున్నాయి. ముడుపులివ్వందే ఇక్కడ పనులు జరగవన్నది బహిరంగ రహస్యం. ఇక నిరక్షరాస్తులైన రైతులు ఈ కార్యాలయాలకు వెళితే అధికారులు వారి నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులివ్వని వారి పట్ల కొందరు రెవెన్యూ సిబ్బంది దురుసుగా కూడా మాట్లాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 1–బి, అండగల్‌లో మ్యుటేషన్(పేరు మార్పు), పట్టాదారు పాసుపుస్తకం, సబ్‌డివిజన్, తదితర పనులకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులే బహిరంగంగా చెబుతున్నారు. ఇక నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శులు ఉన్నాయి. గతంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల వ్యవహారంలోనూ కొందరు రెవెన్యూ సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలింది. గతంలో పనిచేసిన అ«ధికారి అండతో... గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఉన్నతాధికారి అండతో రెవెన్యూ శాఖలో అవినీతి తారస్థాయికి చేరిందనే ఆరోపణలున్నాయి. పైకి నీతిమంతుడిగా మాట్లాడే సదరు అధికారి... కిందిస్థాయి సిబ్బంది నుంచి నెల మామూళ్లు దండుకుంటుంటారనే విమర్శులు ఉన్నాయి. ఆ అధికారే రెవెన్యూ శాఖలో అవినీతిని పెంచి పోషించారని ఆ శాఖకు చెందిన కొందరు సిబ్బందే చెప్పుకుంటున్నారు. ఆ ఉన్నతాధికారి, మరో అధికారి సహకారంతో శింగనమల మండలం పరిధిలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయనీ, ఈ క్రమంలో వీరికి పెద్దమొత్తంలో ముడుపులూ ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో అవినీతి అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదకరంగా మారుతుందనీ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని స్థాయిల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ►పెనుకొండ మండలం గుట్టూరు వీఆర్ఓ రంగనాథ్ ఈ నెల 23న రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టబడ్డాడు. ► పెద్ద వడుగూరు మండలం పరిధిలోని ఒక గ్రామ వీఆర్ఓ ప్రతి పనికీ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇతని వైఖరిపై ఇటీవలే కొందరు రైతులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ► శింగనమల మండల పరిధిలో రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబర్లకు లెటర్లు సృష్టించి దాదాపు 1,500 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో రూ.2 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ►పెనుకొండ వద్ద కియా పరిశ్రమకు కేటాయించిన 179 సర్వే నంబర్ భూమిని ఏకంగా స్కెచ్‌లోంచి తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక పెద్ద ఎత్తున్న అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ...వెబ్‌ల్యాండ్‌లో తప్పలు సరిచేసుకోవాలన్నా, పట్టాదారు పాసు పుస్తకం పొందాలన్నా డబ్బులు ముట్టజెబితే కాని పనులకు కాని పరిస్థితి. పనుల కోసం వెళితే డబ్బులు అడుగుతున్నారంటూ ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులకు బాధితులు విన్నవించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. -
భూ రికార్డుల్లో తప్పుల కుప్పలు
-
భూ రికార్డుల్లో తప్పుల కుప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో పాతుకుపోయిన లోపాలెన్నో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా బయటికి వస్తున్నాయి. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం, అవినీతి, అవకతవకల కారణంగా రెవెన్యూ రికార్డులు అడ్డదిడ్డంగా మారిపోయిన పరిస్థితి వెలుగులోకి వస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ సందర్భంగా... అసలు కంటే కొసరు సమస్యలు ఎక్కువగా వస్తుండటంతో రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆపసోపాలు పడుతోంది. రికార్డుల ప్రక్షాళనలో సాధారణంగా ఎదురవుతాయని భావించిన సమస్యల కన్నా.. ఇతర సమస్యలు, ముఖ్యంగా క్లరికల్ తప్పిదాలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 22 శాతం మేర తప్పులు నమోదవుతుండడం అంచనా వేయనివే ఎక్కువ భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎలాంటి తప్పులు గుర్తించవచ్చనే అంచనాతో రెవెన్యూ శాఖ 25 కాలమ్‌లతో ఒక టేబుల్‌ను రూపొందించింది. అందులో మొత్తం గణాంకాలకు సంబంధించిన కాలమ్‌లు పోను మరో 20 కాలమ్‌లలో తప్పులు నమోదు చేస్తున్నారు. అందులో ఫలానా తప్పులుండే అవకాశముందని రెవెన్యూ శాఖ అంచనా వేసినవి 70 శాతమేకాగా.. రెవెన్యూ వర్గాలకు కూడా అంతుచిక్కని తప్పులు 30 శాతానికి పైగా గుర్తిస్తుండడం గమనార్హం. తొమ్మిది రోజులుగా సాగుతున్న భూ రికార్డుల ప్రక్షాళనలో మొత్తం 1.08 లక్షల సర్వే నంబర్లలో తప్పులున్నాయని గుర్తించగా... అందులో 33 శాతానికిపైగా ముందుగా సిద్ధం చేసిన జాబితాలో లేని తప్పులే. ఇందులో ముఖ్యంగా డబుల్ రిజిస్ట్రేషన్లు, సర్వే నంబర్లనే మార్చేయడం, వ్యవసాయ యోగ్యం కాని భూములను వ్యవసాయ భూములుగా చూపడం, సాగుదారుల పేర్లలో తప్పులు ఉండడం వంటివి బయటపడుతున్నాయి. లంచాలకు ఆశపడి రికార్డులను తారుమారు చేసినందునే ఇలాంటి తప్పులు జరిగాయని ప్రక్షాళనలో పాలుపంచుకొంటున్న జిల్లాస్థాయి సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిర్లక్ష్యం బట్టబయలు ఇంతకాలం రెవెన్యూ యంత్రాంగం చేసిన నిర్లక్ష్యమంతా రికార్డుల ప్రక్షాళనలో బయటపడుతోంది. ఇందుకు క్లరికల్ తప్పిదాలే నిదర్శనం. మొత్తం సవరించాల్సిన రికార్డుల్లో 23.4 శాతం ఇవే ఉండడం గమనార్హం. ఇందులో పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలు 20 శాతానికి పైగా ఉండగా.. సర్వే నంబర్ల నమోదులో తప్పిదాలు మరో మూడు శాతం ఉన్నాయి. ఇక భూములున్న దానికన్నా రికార్డుల్లో ఎక్కువ తక్కువలుగా విస్తీర్ణమున్న సర్వే నంబర్లు కూడా 12 శాతం వరకు ఉన్నాయి. రికార్డుల నమోదు, మార్పుల సమయంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ స్థాయిలో తప్పులు నమోదవుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. సక్రమంగా ఉన్న భూములు తక్కువే! కానీ భూ రికార్డుల ప్రక్షాళన సాగుతున్న కొద్దీ సక్రమంగా ఉన్న సర్వే నంబర్ల శాతం తగ్గిపోతూనే ఉంది. ప్రక్షాళన జరిగితే కోర్టు కేసులు పోను దాదాపు 95 శాతం సక్రమ భూములు ఉంటాయని ప్రభుత్వం భావించింది. కానీ మొదటి నాలుగు రోజుల సర్వేలో అది 84 «శాతంగా నమోదుకాగా.. తొమ్మిది రోజులు పూర్తయ్యే సరికి 78.6 శాతం రికార్డులే సక్రమంగా ఉన్నట్లు తేలింది. దీంతో మిగతా 21 శాతం సర్వే నంబర్లలోని లోపాలను సవరించే ప్రక్రియ ఎలా జరుగుతుందో, అందులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోననే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ జిల్లాల్లో మరింత దారుణం అటవీ విస్తీర్ణం ఉన్న ఆరు జిల్లాల్లో మూడింట రెండువంతుల రికార్డులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని తేలింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సగటున 25.8 శాతం సర్వే నంబర్ల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌లో 34.5, కొత్తగూడెంలో 34.7, భూపాలపల్లిలో 46.6, ఆసిఫాబాద్‌లో 21.2, మహబూబాబాద్‌లో 30.4, మంచిర్యాలలో 21.1, నాగర్‌కర్నూల్‌లో 15.7 శాతం రికార్డుల్లో తప్పులు గుర్తించారు. చుక్కలు చూపుతున్న భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రికార్డులను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లతో 20 మండలాలున్న ఈ జిల్లాలో ఏకంగా సగం వరకు రికార్డులు తప్పుల తడకేనని తేలింది. ఇక్కడ ఇప్పటివరకు 2,123 సర్వే నంబర్లలోని రికార్డులను పరిశీలిస్తే 990 రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండడం, పట్టాదారుల పేర్లు సరిపోలకపోవడం వంటివి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తొమ్మిది రోజుల ‘ప్రక్షాళన’గణాంకాలివే.. పరిశీలించిన మొత్తం సర్వే నంబర్లు: 4,88,684 సక్రమంగా ఉన్నవి: 3,84,563 తప్పులు నమోదయినవి: 1,04,121 కోర్టు కేసులున్నవి: 656 పట్టాదారుల పేర్లు సరిపోలనివి: 5,475 చనిపోయినవారి పేర్లపై ఉన్నవి: 15,513 పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలున్నవి: 20,848 ఆన్లైన్లో నమోదుకాని మ్యుటేషన్లు: 4,538 రికార్డుల కన్నా ఎక్కువ, తక్కువగా ఉన్న భూములు: 12,201 సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలున్నవి: 3,523 వ్యవసాయేతర భూములు: 6,826 ఇతర తప్పిదాలున్నవి: 33,188 -
ప్రక్షాళనకు ‘సర్వేయర్’ కష్టాలు
- వ్యవసాయేతర భూ రికార్డుల పరిశీలనకు రెవెన్యూ ఆపసోపాలు - కనీసం మండలానికో సర్వేయర్ ఉంటే పరిశీలన సులభతరం సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సర్వేయర్ల అంశం సమస్యగా మారుతోంది. వ్యవసాయ భూముల వరకు సర్వేయర్లతో అవసరం లేకుండానే రికార్డుల పరిశీలన జరుగుతుండగా.. వ్యవసాయేతర భూములు, ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలో సర్వేయర్ల అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రక్షాళనలో 10 శాతం వరకు ఇలాంటి భూముల సమస్యలే వస్తున్నాయి. రికార్డుల్లో ఎక్కువ భూమి ఉండి, అసలు భూమి తక్కువగా ఉండటం, రికార్డుల్లో తక్కువగా ఉండి, అసలు భూమి ఎక్కువగా ఉండటం లాంటి సమయాల్లో కూడా కచ్చితంగా సర్వేయర్ల అవసరం వస్తోంది. ఇప్పటివరకు 86 వేల సర్వే నంబర్ల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించగా.. అందులో 2 వేల వరకు భూముల కొలత ల్లో తేడాలొచ్చాయి. 840 సర్వే నంబర్లలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరుగుతుంటే రికార్డుల్లో ఇంకా వ్యవసా యమనే ఉంది. మరో 539 సర్వే నంబర్ల భూమిని ప్రజావసరాలకు ప్రభుత్వం సేకరించినా.. ఇంకా పట్టాదా రుల పేర్లే రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగు కేటగిరీల భూ రికార్డులను సవరించాలంటే సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళన పూర్తయ్యే సరికి ఈ సంఖ్య లక్షల సర్వే నంబర్లకు చేరుతుందని, ప్రక్షాళన జరుగుతుండగానే వీటిని పరిష్కరిస్తే రికార్డుల సవరణ సులభ తరమవుతుందని భావిస్తున్నాయి. ఎప్పుడో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు భూమిని సేకరించిన రికార్డులూ అందు బాటులోకి రావడం లేదని, అక్కడ సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. 70 శాతం సర్వేయర్ పోస్టులు ఖాళీయే.. రాష్ట్రంలో 474 సర్వేయర్ పోస్టులు మంజూరు కాగా, అందులో 354 ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే ఇందులో 110 పోస్టులను డీగ్రేడ్ చేసి డిప్యూటీ సర్వేయర్లుగా మార్చారు. ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించారు. కానీ ఇంతవరకు ఫలితాలు రాలేదు. మంజూరైన పోస్టుల్లో 70 శాతం మేర ఖాళీలుండటంతో వారిని భూరికార్డుల ప్రక్షాళనకు విని యోగించుకోలేకపోతున్నారు. సర్వేయర్లున్న మండలాల్లో మాత్రం ప్రక్షాళన బృందాల్లో వారిని చేర్చుకున్నారు. లేనిచోట్ల వదిలేస్తున్నారు. అయితే, నల్లగొండ జిల్లాలోని 31 మండలాలకుగాను 31 మంది సర్వేయర్లను ప్రక్షాళన బృందాల్లో నియమించారు. ప్రభుత్వ సర్వేయర్లు, ఐకేపీలో 25 మంది ఉండగా, వారితో పాటు మరో 10 మంది లైసెన్స్డ్ ప్రైవేటు సర్వేయర్లను ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్.గౌరవ్ ఉప్పల్ ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుని ప్రక్షాళన బృందాల్లో చేర్చారు. -
విజయ'నరకం' కాలనీ
♦ నెల రోజులుగా బిక్కుబిక్కుమంటు కాలం వెల్లదీస్తున్న కాలనీవాసులు ♦ రాజకీయ చిచ్చుతో పేదల బతుకులు రోడ్డు పాలు ♦ ఎమ్మెల్యే నిర్వాకంతోనే ఇళ్లు కూల్చేశారంటున్న స్థానికులు ⇒ కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న విజయనగర్‌కాలనీ ఇది.. నిరాశ్రయులు.. రోజు కూలీలు, చిరువ్యాపారులు..ఆటో కార్మికులు.. ఇలా ఎందరో అభాగ్యులు.. ‘గూడు’ కట్టుకున్న కష్టాలతో పగలనక..రాత్రనక అష్టకష్టాలు పడి తినీ తినక తలదాచుకునేందుకు ఇంత ఆశ్రయం కల్పించుకున్నారు. అంతలోనే పాలకులు, అధికారుల కళ్లు కుట్టాయి...రాజకీయ కక్షతో పేదల గుండె‘గూడు’ను ఛిదిమేశారు. గంటల వ్యవధిలోనే ఎందరో బతుకులు ఛిద్రమయ్యాయి.. నిలువనీడ కోల్పోయారు...పిల్లాపాపలు, చిన్నా పెద్ద, ముసలి ముతక అంతా దిక్కులేనివారయ్యారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిల్చారు..ఇది జరిగి సరిగ్గా 34 రోజులవుతున్నా.. ఆశ్రయం లేదు. ఆదుకునేవారు లేక ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. – అనంతపురం న్యూసిటీ: అమ్మకు అన్నం పెట్టరు కానీ..పిన్నమ్మకు బంగారు గాజులు! 200 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 34 రోజులుగా ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వీళ్లంతా ప్రతిపక్ష పార్టీ వర్గీయులనుకుంటే పొరపాటు. అధికార టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ నేతలు చెప్పడంతో విజయనగర్ కాలనీలో ఓ గూడు కట్టుకున్న నిరుపేదలు. అనంతపురం ఎమ్మెల్యేకు.. అదే పార్టీలోని స్థానిక కార్పొరేటర్‌కు మధ్య నెలకొన్న విభేదాలతో కష్టజీవుల గూడు చెదిరింది. కన్నీటి గాథ మిగిలింది. శిథిలాల మధ్య న్యాయం కోసం నిరీక్షిస్తున్నా.. కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఓ ముద్ద అన్నం పెట్టని పరిస్థితి. ఇదిగో అక్కడే పడున్న సీఎం చంద్రబాబు ఫొటో సాక్షిగా ఇప్పుడు అక్కడ వర్గపోరు రాజ్యమేలుతోంది. కృతజ్ఞత కూడా చూపలేదు.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సొంత పార్టీ వారినే మోసగించారు. సంవత్సరాలుగా కష్టపడి రూ. 3 లక్షలతో ఇల్లు కట్టుకున్నా. ఎన్నికల ముందు ఆయన గెలుపునకు ప్రచారం చేసిన కృతజ్ఞత కూడా చూపలేదు. నేను నా భార్య మాబి కులాంతర వివాహం చేసుకున్నాం. ఏడాదిన్నర పాప ఉంది. ప్రస్తుతం నా భార్య 9 నెలల గర్భిణి. రాత్రి ఇదే కవర్షెడ్డులో ఉంటున్నాం. మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి. పార్టీనే నమ్ముకుని జీవిస్తున్న మాలాంటోల్లకు ఇలా చేస్తే ఎలా. – జగదీష్, విజయనగర్ కాలనీ అనంతరపురం నగర పరిధిలోని 29వ డివిజన్ విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో ఏడాదిన్నరగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారులు కరెంటు లైన్ లాగి ఇళ్లకు కరెంటు ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పన్ను వేసేందుకు రంగం సిద్ధం చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉండే విజయనగర్ కాలనీలో నిర్మాణాలు జరుగుతున్నా ఏనాడూ రెవెన్యూ అధికారులు అటువైపు తొంగి చూడలేదు. అన్నీ తెలిసే అధికారులు ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలోని గ్రూపు రాజకీయాలతో నిరుపేదలు రూ. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణం చేపట్టారని రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. రోడ్డువైపు చిన్న బండి పెట్టుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. పేదలు ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయి, తీరా ఇల్లు కట్టుకున్నామనుకున్నాక తొలగించారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఎమ్మెల్యే కారణంగానే ఇళ్లు తొలగించారంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అధికార పార్టీ అండదండలతోనే రెవెన్యూ అధికారులు పేదల జీవితాలతో ఆడుకున్నారని బాధితులు చెప్పుకుంటున్నారు. రాజకీయ కక్షతోనే.. టీడీపీలోని గ్రూపు రాజకీయాలు విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు శాపంగా మారాయి. రాజకీయచిచ్చులో పేదల బతుకులు చిద్రమయ్యాయి. 34 రోజుల క్రితం విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో రెవెన్యూ అధికారులు సుమారు 200 ఇళ్లును నేటమట్టం చేసిన విషయం విదితమే. ఎండనక, వాననక కష్టపడి కూడబెట్టుకున్న నగదు కొంత, బంగారాన్ని తాకట్టు పెట్టిన సొమ్ము కొంత కలుపుకుని సొంతి ళ్లు కట్టుకున్నారు. అధికారపార్టీ నేతలు వారి సొం తింటి కళను దూరం చేశారు. అధికార పార్టీలోని గ్రూపు రాజకీయాలతో పేద ప్రజలు నెల రోజులుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అప్పటి నుంచి ఎవరో ఒకరు తమకు దారి చూపుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ అభాగ్యులు. ప్రత్యక్ష నరకం...: ఇల్లు కట్టుకున్నాం.. ఇక తలదాచుకోవచ్చనుకునే సమయంలో అన్నీ కూల్చేశారు. నిలువనీడలేకుండా చేశారు. ఇప్పుడేమో వానాకాలం.. ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు.. ఎండకు ఎండుతున్నాం.. వానకు తడుస్తున్నాం.. కరెంటు లేదు.. చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు. శివారు ప్రాంతం కావడంతో విషపురుగులు సంచారం ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కాలం గడుపుతున్నామని కాలనీవాసులు అంటున్నారు. బంగారం తాకట్టుపెట్టి కట్టుకున్నాం నా భర్త రత్నం బేల్దారి పని చేస్తాడు. మాది పేద కుటుంబం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.3లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నాం. బంగారం తాకట్టు పెట్టడంతో పాటు మా బంధువులతో అప్పుతెచ్చాం. ఇప్పుడేమో వారు అసలిస్తే చాలు వడ్డీ వద్దని డిమాండ్ చేస్తున్నారు. కట్టుకున్న ఇల్లు పోయింది. రోడ్డున పడ్డాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. రాత్రి వేళలో పురుగూపుట్ర ఎక్కడ కుడుతాయోనని భయంగా కాలం వెల్లదీస్తున్నాం. – అరుణ, విజయనగర్ కాలనీ రాజకీయ కుట్రతోనే ఇళ్లు కూల్చారు రాజకీయ కుట్రతోనే పేదల ఇళ్లు కూల్చారు. నాపై ఉన్న కక్షతోనే ఎమ్మెల్యే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మూడేళ్లుగా ఇళ్లు కట్టినప్పుడు అధికారులకు కనపడలేదా?..కరెంటు ఇచ్చి, ఇంటి పన్ను వేస్తామని ఇప్పుడిట్ల చేస్తే ఎలా? – ఉమామహేశ్వర్, 29వ డివిజన్ కార్పొరేటర్ -
భూమంత్రకాళీ
♦ చూడు జాగ..వేసెయ్ పాగా ♦ చిరమనలో 55 ఎకరాలకు పైగా భూమి హాంఫట్ ♦ మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైనే ♦ రెవెన్యూ అధికారులు, నాయకుల నిర్వాకం రెవెన్యూ అధికారులు.. నాయకులు ఏకమయ్యారు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో కట్టబెట్టేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం జారీ చేశారు. ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఆత్మకూరు రూరల్ : సెంటు భూమి కోసం పేదోళ్లు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందని.. అప్పటివరకు ఆగాలని కుంటిసాకులు చెబుతారు. నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. ఏఎస్ పేట మండలంలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చేసింది. ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడొకరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో 40ఎకరాలకు పైగా భూమిని.. అతడి శిష్యుడు చిరమన మజరా కన్నెదారి వారిపల్లెలో 14.73 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. బినామీ పేర్లతో భూములు పొందిన నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. చిరమన గ్రామంలోని సర్వే నంబర్ 878/3, 881లలో లేబూరు పరమేశ్వర్లు పేరుతో 4.69 ఎకరాలు, సర్వే నంబర్ 882లో వాయిలేటి వీరయ్య పేరుతో 4.36 ఎకరాలు, 883/1లో జులుమూడి రాధయ్య పేరుతో 5 ఎకరాలు, 882/2, 884లో నలగండ్ల సుందరయ్య పేరుతో 4.85 ఎకరాలు, 885/1లో వాయిలేటి రమణయ్య పేరుతో 4.16 ఎకరాలు, 885/2లో లేబూరి ప్రభాకర్ పేరుతో 4.76 ఎకరాలు, 879లో నాటకరాని వెంకటయ్య పేరుతో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 886/2లో 4 ఎకరాలు కలిపి 36.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని టీడీపీ నేత పొందారు. ఇదే గ్రా మంలో మరికొంత భూమిని కూడా కబ్జా చేశాడు. సర్వే నంబర్ 882లోని భూమిని తన కోడలు, సర్వే నంబర్ 885/1లో భూమిని తన కుమార్తె పేరిట ఇటీవల మార్పించుకున్నాడు. సదరు నాయకుడికి గ్రామంలో 50 ఎకరాలకు పైగా భూమి ఉండగా.. ప్రభుత్వ భూమిని సైతం హస్తగతం చేసుకున్నాడు. వాళ్లెవరో.. భూములు పొందిన బినామీదారులకు చిరమన గ్రామంతో అసలు సంబంధమే లేదు. వారికి గ్రామంలో ఓట్లు, రేషన్‌కార్డులు గాని లేవు. వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా ఎవరికీ తెలియదు. అయితే సదరు నేత తనకున్న రాజకీయ, ఆర్థిక బలంతో రెవెన్యూ అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కాజేశాడు. వాటికి హక్కులు పొంది అనుభవిస్తున్నాడు. ఐదేళ్లుగా ఆ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అదే బాటలో శిష్యుడు ఆ నాయకుడికి శిష్యుడైన మరో టీడీపీ నేత ఆయన అండదండలతో చిరమన పంచాయతీ పరిధిలోని కన్నెదారివారిపల్లెలో 14.73 ఎకరాలను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 1028/1లో దాసరి శ్రీరాములు పేరుతో 3.28 ఎకరాలు, 1028/2లో 11.45 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో పేరుతో కాజేశాడు. అయితే దాసరి శ్రీరాములు అనే వ్యక్తి ఆ గ్రామంలోనే లేడు. ఈ భూమిలో బోరు వేసుకున్న ఆయనకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. వివిధ పేర్లతో అనుభవదారులుగా సృష్టించుకుని సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆ భూములను టీడీపీ నాయకులిద్దరూ హస్తగతం చేసుకున్న వైనంపై జిల్లా కలెక్టర్‌కు, భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. -
పైసలిస్తే ఫైలు మార్చేస్తారు!
►ఇష్టారాజ్యంగా ఆస్తుల పేర్లలో మార్పులు ►మున్సిపాలిటీలో రాజ్యమేలుతున్న అవినీతి ప్రొద్దుటూరు టౌన్ : రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని ఎలాంటి రికార్డులు లేకుండానే మరొకరి పేరుతో మార్చేస్తారు. పైసలిస్తే చాలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు. కమిషనర్లు మారుతున్నారే తప్ప వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విషయంలో ఎవ్వరూ శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా రూ.లక్షల ఆస్తుల కోసం ప్రజలు ఘర్షణ పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అవినీతిని అరికట్టే వారేరీ: మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖలో జరగుతున్న అవినీతిని అరికట్టేవారు లేక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ పని చేయాలన్నా కింది స్థాయి సిబ్బంది నుంచి మున్సిపాలిటీ హెడ్ వరకూ మామూళ్లు ఇవ్వనిదే ఫైల్‌పై సంతకం పెట్టక పోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. చర్యలు తీసుకుంటాం: ఆస్తి పన్నుల్లో రెవెన్యూ అధికారులు చేస్తున్న అవినీతిపై కమిషనర్ శేషన్న దృష్టికి తీసుకెళ్లగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈయన పేరు గుర్రండోలు జగన్మోహన్. న్యాయవాది. పట్టణంలోని నేతాజీ నగర్లో డోర్ నెంబర్ 26–272–1 ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇతని అవ్వ కడప రంగమ్మ పేరుతో ఉన్న ఆస్తిని రెండు భాగాలు చేసి ఒక భాగం ఆమె కుమార్తె లక్షుమ్మకు కానుగా ఇస్తూ 1987లో రిజిస్టర్ వీలునామా రాశారు. లక్షుమ్మ కుమారుడు జి.జగన్మోహన్కు 2009 జులై 24న కానుకగా ఇస్తూ రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఆస్తి పన్నులో జగన్మోహన్ పేరు వచ్చేది. అయితే 2012లో ఇతని ఆస్తిని ఎవ్వరికీ అమ్మక పోయినా అతని మేనమామ అయిన కడప సుబ్బరాయుడు పేరుతో మార్చేశారు. ఈ ఆస్తికి సంబంధించి ఆయన పేరుతో ఎలాంటి రికార్డులు లేకపోయినా పేరు మార్చడంపై జగన్మోహన్ అధికారులను ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమైందని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటికి నలుగురు కమిషనర్లకు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. అయినా అతని పేరున ఉన్న ఆస్తికి పన్నులో పేరు మారలేదు. ఈయన కడప డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకులో ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే అధికారులు మార్పు చేస్తామంటూ ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆర్ఓ మునికృష్ణారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రెండు నెలలుగా తిప్పుకుని ఇప్పుడు కడప సుబ్బరాయుడు పేరు మీద రికార్డులు తీసుకురావాలంటూ చెప్పడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఇతని పేరు ఎస్.మహమ్మద్‌రఫీ. ఎర్రన్న కొట్టాలలో నివాసం ఉంటున్నారు. 7–1147 డోర్ నెంబర్లోని ఇల్లు ఇతని అక్క ఎస్.మాబూచాన్ పేరున ఉంది. అయితే మూడు నెలల క్రితం దువ్వూరు పాలగిరి సత్యప్రకాష్ పేరున మార్పు చేశారు. ఇది ఎలా సాధ్యమైందని ఇతను మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొన్ని నెలల క్రితం పట్టణంలోని కోనేటికాలువ వీధిలో తిరుమలయ్య పేరుతో ఉన్న ఇంటి ఆస్తి పన్నును అతని తమ్ముడు పేరున మార్పు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి పేరు మార్పు చేయడానికి అధికారులు రూ.లక్షకు పైగా మామూళ్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుమలయ్య కార్యాలయం చుట్టూ తిరిగి రెండు నెలల క్రితం తన పేరున ఆస్తి పన్ను మార్పు చేసుకున్నారు. ఇలా ఒక్కరేమిటి రోజుకు పది మంది ఇలా తమ ఆస్తులను వేరే వారి పేరుతో ఎలా మార్పు చేశారని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
వీఆర్వోల వింత కథ!
టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: బెదిరింపులు.. వేధింపులు.. వసూళ్లు.. అన్నింటికీ గ్రామ రెవెన్యూ అధికారులే (వీఆర్వోలే) టార్గెట్లు! హోదా చిన్నదే.. చేయాల్సిన కీలక పనులెన్నో.. క్షేత్రస్థాయిలో ఏ పని చేయాలన్నా.. ఏ పథకం అమలు చేయాలన్నా భారం వారిపైనే.. దీంతో అవినీతి, అక్రమాలకు వీఆర్వోలే కేంద్రంగా మారుతున్నారు. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు అధికారులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం వంటి వాటితో తాము అవినీతికి పాల్పడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని వీఆర్వోలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కారణంగానే మానసిక ఒత్తిడికి గురై వరంగల్ జిల్లాకు చెందిన ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. వసూళ్లకు టార్గెట్లు! రెవెన్యూ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే క్రమంలో వీఆర్వోల వ్యవస్థ అవినీతి, అక్రమాల ఆరోపణలకు కేంద్రంగా మారుతోంది. భూముల వ్యవహారం కావడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించాల్సిన పరిస్థితుల్లో కొందరు వీఆర్వోలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండడం వివాదాస్పదంగా మారుతోంది. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు తహసీల్దార్లు ఏకంగా టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం, అన్ని స్థాయిల్లోనూ చేతులు తడపనిదే ఫైళ్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో తామూ అవినీతిలో కూరుకుపోవాల్సి వస్తోందని వీఆర్వోలు వాపోతున్నారు. పైఖర్చులు కూడా.. తన పరిధిలోని ప్రతి వీఆర్వో వారానికి రూ.2 వేల చొప్పున ముట్టచెప్పాలని హైదరాబాద్ జిల్లాలోని ఓ తహసీల్దార్ టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. గ్రామాల్లో ప్రోటోకాల్ ఖర్చులను వీఆర్వోలే భరిస్తున్నారు. ఎమ్మెల్యేల కార్యక్రమాల నుంచి స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల ఖర్చులను పెట్టుకోవాలని వీఆర్వోలకు తహసీల్దార్లు హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అసలు పని వదిలేసి.. ఏటా భూముల వివరాల్లో మార్పులు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగయిందనే వివరాల నమోదుతోపాటు. జనన, మరణ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నివేదికలు ఇవ్వాలి. కానీ వీఆర్వోల వ్యవస్థ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే వారి జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయింది. తహసీల్దార్లు తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల అమలు వీఆర్వోల నెత్తినే పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 67 రకాల విధులు, సంక్షేమ పథకాల అమలును చూసుకోవాల్సి రావడం వీఆర్వోలకు భారంగా పరిణమించింది. ఇక రాష్ట్రంలో వీఆర్వోల కొరత కారణంగా దాదాపు వెయ్యి మందికిపైగా వీఆర్వోలు మరో రెవెన్యూ గ్రామానికి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. సౌకర్యాలు సున్నా.. వీఆర్వోల పనుల జాబితా చాంతాడంత ఉన్నా సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కనీసం ఒక కార్యాలయం అంటూ లేకపోవడం గమనార్హం. గ్రామాలకు వచ్చిపోతున్నా.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఇక నివేదికలకు అయ్యే స్టేషనరీ ఖర్చులు, గ్రామాలు, మండలాలు తిరిగేందుకు అయ్యే ప్రయాణ భత్యాల వంటివేవీ వీఆర్వోలకు అందడం లేదు. పైగా కొందరు పై అధికారులు ‘వసూళ్ల’ టార్గెట్లు కూడా పెడుతుండటంతో లంచాల బాట పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనిచేయడం కష్టంగా మారింది ‘‘మా పని చాలా కష్టంగా తయారైంది. మోయలేనంత పనిభారం, అధికారుల ఒత్తిడులు నైరాశ్యానికి గురిచేస్తున్నాయి. మాకు రెవెన్యూ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామస్థాయిలో కనీస వసతులు కల్పించాలి. అన్ని రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించాలి. ఈ సమస్యలపై అన్ని సంఘాలతో కలసి త్వరలోనే సీఎస్‌ను కలుస్తాం..’’ – గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు -
ఇష్టారాజ్యం
- తప్పులతడకగా పంట నష్టం జాబితాలు – నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు – వేరుశనగ సాగు చేస్తే కందికి ఇన్పుట్ సబ్సిడీ – అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జాబితాల తయారీ – గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు పెట్టని వైనం కర్నూలు (అగ్రికల్చర్): – మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడుల్లో 50శాతం కూడా దక్కలేదు. గ్రామ రైతుల్లో దాదాపు 70 శాతం మంది చిన్న, సన్న కారు రైతులే. అయితే.. పంట నష్టం వివరాల నమోదులో వీఆర్ఓ, ఏఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఐదెకరాలు ఉంటే పావు ఎకరా, మూడెకరాలు ఉన్న రైతుకు అరఎకరాలో పంట నష్టం వాటిల్లినట్లు నమోదు చేశారు. దీంతో వారికి రూ.500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. –వెల్దుర్తి మండలం బోగోలు గ్రామంలో వడ్డె రాముడికి 357/1 సర్వే నంబరులో 2.50 ఎకరాలు, 357/ఏ సర్వే నంబరులో 2.50 ఎకరాల భూమి ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్‌లో వేరుశనగ అని నమోదైంది. అడంగల్‌లోనూ అదే పంటను పేర్కొన్నారు. కానీ ఇన్పుట్ సబ్సిడీకి మాత్రం ‘కంది పంట’ అని రాశారు. దీంతో రాముడు హెక్టారుకు రూ.5వేల ఇన్పుట్ సబ్సిడీని కోల్పోయారు. ‘మేము వేరుశనగ వేశాము కదా..! కంది పంటకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందేమిట’ని అడిగితే.. పొరపాటు జరిగిందని, ఏమీ అనుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్-2016లో సాగు చేసిన అన్ని పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో పది మండలాల్లో పంటల దిగుబడి బాగా ఉందంటూ నష్టం వివరాలను నమోదు చేయలేదు. 26 మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.325 కోట్లు ఇటీవల విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఏడీఏలకు విడుదల చేశారు. వారి నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. కాగా.. పంట నష్టం వివరాల నమోదులో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు.. వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. కావలసిన వారికి పత్తి, వేరుశనగ వేసినట్లు రాసి హెక్టారుకు రూ.15వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా చూశారు. ఇతరులకు కొర్ర, కంది వంటి పంటలు చూపారు. దీనివల్ల వారికి తక్కువ మొత్తం వచ్చింది. పాత జాబితాలనే వినియోగించారు! ఇన్పుట్ సబ్సిడీ నమోదులో పాత జాబితాలతోనే మమ అనిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. 2014లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించగా.. కేవలం ఆదోని రెవెన్యూ డివిజన్లోని దేవనకొండ, ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఈ మండలాలకు రూ.73 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైంది. 2015, 2016లోనూ ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో ఇక్కడ 2014 కరువు జాబితాలనే 2015, 2016కు వినియోగించినట్లు విమర్శలున్నాయి. 2015లో ప్రభుత్వం జిల్లాలో 40 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అన్ని మండలాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించింది. నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదించారు. ఈ జాబితాలనే తిరిగి 2016లోనూ వినియోగించినట్లు తెలుస్తోంది. దీనివల్ల వేలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలకు తూట్లు నిబంధనల ప్రకారం పంట నష్టంపై సర్వే పూర్తయి, జాబితాలు రూపొందించిన తర్వాత వాటిని గ్రామ పంచాయతీల్లో రైతుల పరిశీలనకు ఉంచాలి. అందులో పేర్లు లేకపోయినా, ఒక పంట సాగు చేసి ఉంటే మరో పంటను నమోదు చేసినా, విస్తీర్ణంలో తేడా ఉన్నా.. రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిశీలించి.. తుదిజాబితాను రూపొందించి వ్యవసాయ సంయుక్త సంచాలకుడి(జేడీఏ)కి పంపాల్సి ఉంటుంది. కానీ ఏ గ్రామ పంచాయతీలోనూ రైతుల పరిశీలనకు జాబితాలు పెట్టిన ధాఖాలాలు లేవు. ప్రదర్శించి ఉంటే ఇప్పుడిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు ఉండేవి కావు. అధికార పార్టీ నేతల సిఫారసు మేరకే.. హాలహర్వి పూర్తిగా కరువు మండలం. ఇక్కడ అధికార పార్టీ నేతలు ఇన్పుట్ సబ్సిడీ కోసం వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు మాత్రమే నమోదు చేయించారు. నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. చింతకుంట, శ్రీధర్‌హాల్, కామినహాల్, బిలేహాల్ గ్రామాల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే జాబితాలు రూపొందాయి. నిజమైన రైతులకు అన్యాయం జరగడంపై వీఆర్ఓ, తహసీల్దార్లను అడిగితే వ్యవసాయాధికారులపైన, వారిని అడిగితే రెవెన్యూ అధికారుల మీద చెబుతున్నారు. మొత్తమ్మీద అధికారుల తప్పిదాల వల్ల వేలాదిమంది రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
రాణితోటపై రాబందుల కన్ను
– 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కాజేసేందుకు యత్నం – ప్రజావసరాలకు కేటాయించాలని గ్రామ పెద్దలు డిమాండ్ – రెండు పర్యాయాలు పేదలకు పట్టాలిచ్చి... స్థలాలు చూపని వైనం ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు రాబంధులా వాలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకాలు రచిస్తారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామ రెవెన్యూలోని పది ఎకరాల రాణితోటపై ఇప్పుడు కొందరి కన్ను పడింది. పరిశ్రమల స్థాపన పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కల్లూరు: 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే రాణితోట పేరుతో 10.81 ఎకరాల భూమి ఉంది. 89 సర్వే నెంబరులో 4.47 ఎకరాలు, 90/2లో 3.44 ఎకరాలు, 92/2లో 2.90 ఎకరాలు ఉంది. ప్రజల అవసరాలకు ఈ భూమిని కేటాయించాలని గ్రామ పెద్దలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రస్తుతం భూ విలువలు భారీగా పెరగడంతో కొందరు అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇటీవల శంకర్ అనే ప్రైవేట్ వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ముళ్లపొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గమనించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ను సంఘటన స్థలానికి పంపించి అక్రమార్కులు చేపట్టిన పనులను నిలిపివేయించారు. పరిశ్రమల స్థాపన, ఇతర యూనిట్ల స్థాపన పేరుతో కొందరు రాణితోట స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్ఓలు స్థలాలను నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. ఈనెల 22న ఆర్డీఓ, తహశీల్దార్లు, 23న కల్లూరు, కర్నూలు వీఆర్ఓలు స్థలాన్ని, మ్యాప్‌లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేయగా 2004లో 270 మంది పేదలకు ఒక్కొక్కరికి 1.50 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ నాటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు జారీ చేశారు. పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. అనంతరం కల్లూరు మండలం అర్బన్, రూరల్ మండలాలుగా విభజన కానున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. రూరల్ మండలం అయితే చిన్నటేకూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేసి రాణితోట 10 ఎకరాలలో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని భావించారు. మళ్లీ రెండవ పర్యాయం 2014లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నాటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. పట్టాలు రూపుదిద్దుకున్నా పంపిణీకి నోచుకోలేదు. ఏడాది క్రితం మళ్లీ గ్రామపెద్దలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి రాణితోట స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటుచేయాలని విన్నవించారు. మరోపక్క హైదరాబాద్ శిల్పారామం నుంచి కొందరు స్థలం కావాలని ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్ఓ స్థలాన్ని పరిశీలించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి : మల్లికార్జున, చిన్నటేకూరు చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో ఉలిందకొండ, లక్ష్మీపురం, బొల్లవరం, పర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరూ జూనియర్ కళాశాలలో చేరాలంటే కర్నూలు నగరానికి వెళ్లాలి. చిన్నటేకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాణితోటలో ఏర్పాటుచేస్తే 5 గ్రామాల్లోని విద్యార్థులకు ఉన్నత చదువు అందుతుంది. ఇతరులకు కట్టబెడితే ఊరుకోం: రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు రాణితోట స్థలంలో పేదలకు ఇళ్లు కేటాయించాలి. రూరల్ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా వ్యాపార వేత్తలకు, పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయిస్తే గ్రామస్తులమంతా కలిసి ఉద్యమిస్తాం. -
‘అరుణాచల్’ బస్సులు రోడ్డెక్కితే సీజ్
♦ ‘సాక్షి’ కథనంపై స్పందించిన సర్కారు ♦ ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులపై కొరడా ♦ కేంద్ర మోటారు వాహనాల చట్టం రూల్ ‘94’అతిక్రమించినందుకు చర్యలు ♦ నేటి నుంచి అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలు సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. బస్సుల అక్రమ వ్యవహారంపై ‘రద్దయినా రైట్ రాయ ల్’గా శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై స్పందించింది. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించి సీజ్ చేయాలని, ఇందు కోసం అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలని మంగళవారం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అక్కడే పర్మిట్లు పొంది.. ఇక్కడే ట్రిప్పులు నిర్వహించడం కేంద్ర మోటా రు వాహనాల చట్టంలోని 94వ నిబంధనను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్లు రద్దు.. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ దాదాపు వెయ్యి బస్సుల రిజి స్ట్రేషన్లు, పర్మిట్లను ఈ నెల 2న రద్దు చేసేశారు. ఆ బస్సులన్నీ పేరుకుమాత్రం అరుణా చల్ప్రదేశ్లో రిజిస్టరై, అక్కడి నుంచే జాతీయ పర్మిట్లు పొంది... తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ఉన్న టూ ప్లస్ వన్ బెర్తుల అమరిక తెలంగాణ రవాణా నిబంధనలకు విరుద్ధం. కానీ అవి అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కావ డం, జాతీయ పర్మిట్లతో తిరుగుతుండడంతో.. ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలే కపోయారు. అయితే జూన్ 2న అరుణా చల్‌ప్రదేశ్ రవాణాశాఖ కమిషనర్ అలాంటి వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేశారు. ఇది జరిగి వారం రోజులైనా.. ఆ బస్సులు యథేచ్చగా రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఏదైనా రాష్ట్రంలో రిజి స్ట్రేషనైన వాణిజ్య వాహనాలు.. ఆ రాష్ట్రం భూభాగం మీదుగా కాకుండా పూర్తిగా ఇతర ప్రాంతాల్లో తిరగడం కేంద్ర రవాణాచట్టం నిబంధన 94కు విరుద్ధం. ఈ అంశాలను ఉటంకిస్తూ.. ‘రద్దయినా రైట్ రాయల్‌గా’అన్న శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెంటనే స్పందించారు. మంగళవారం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, జేటీసీలతో సమావేశమై.. ‘అరుణాచల్’తరహా బస్సులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చారు. కేంద్ర రవాణా చట్టం నిబంధనలను అతిక్రమించిన బస్సులన్నింటినీ జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన, అనుమతులు పొందిన వాహనాలను గుర్తించి రూల్–94 ఉల్లంఘన జరిగినట్టు తేలితే అక్కడికక్కడే జప్తు చేస్తామని సమావేశం అనంతరం జేటీసీ రఘునాథ్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి.. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులను జప్తు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సంఖ్యలో అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ రమణారావుకు మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. -
‘భూమాయ’పై ఏసీబీ దూకుడు
-
‘భూమాయ’పై ఏసీబీ దూకుడు
హెచ్ఎండీఏ పరిధిలో 14 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లపై ఏకకాలంలో దాడులు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. హెచ్ఎండీఏ పరిధిలోని 14 మంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు, సిబ్బంది ఇళ్లపై గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. ప్రధానంగా మియాపూర్ భూదందా కేసులో అరెస్టయిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ ఇళ్లపై దాడులు నిర్వహించి ఏసీబీ ప్రభుత్వ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల కోసం పెండింగ్‌లో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా వల్లభ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించింది. తదుపరి విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వల్లభ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ముజీబ్ గురువారం బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను రెండు రోజుల క్రితం అధికా రులు బదిలీ చేశారు. దీంతో హైదరాబాద్ టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న ముజీబ్‌ను ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా ప్రభుత్వం నియమించింది. ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పాత తేదీలతో ఉన్న స్టాంపు పేపర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 45 మంది అధికారులపై త్వరలో కేసులు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు, సంబంధిత అధికారుల ఇళ్లలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఇక కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి కుట్రపూరితంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు కేసులు నమోదు చేయనున్నారు. ఈ రకంగా మొత్తం 45 మంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు, 16 మంది సూపరింటెండెంట్లు, ఆపై స్థాయిలో ఉన్న అధికారులపై విచారణకు సిద్ధమవుతున్నట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన దాడులు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, దాని ఆధారంగా ఏయే అధికారి ఎంత స్థాయిలో ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేశారు, ఎవరెవరికి సహకరించారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై నివేదిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే అధికారులందరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
బినామీల అడ్డాలు!
కోరుట్ల: ఇందిరమ్మ కాలనీల్లో జరిగిన అక్రమాలు రెవెన్యూ అధికారుల విచారణతో వెలుగులోకి వస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా బినామీలు..అనర్హులు కాలనీల్లో అడ్డాలు వేసిన వైనం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది. కాలనీల్లో నిజమైన లబ్దిదారులు పదిశాతం కనిపించకపోవడంతో జోరుగా అక్రమాలు సాగినట్లు స్పష్టమవుతోంది. కోరుట్ల పట్టణంలో ఏడు సంవత్సరాల క్రితం పేదలకు కెటాయించిన ఇందిరమ్మ కాలనీల్లో రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎక్కడిక్కడే బినామీలు ఉండటం గమనార్హం. నేతలే సూత్రధారులు.. కోరుట్ల పట్టణంలోని అర్బన్‌కాలనీ, ఏసుకోనిగుట్ట కాలనీ, నక్కలగుట్ట కాలనీ, అల్లమయ్యగుట్ట కాలనీ, మాదాపూర్ కాలనీల్లో ఏడు సంవత్సరాల క్రితం సుమారు 3వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ రుణాలు ఇచ్చి ఇండ్లు కట్టించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు..ప్రజాప్రతినిధులు జోరుగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది నేతలు బినామీల పేరిట ఐదు నుంచి పది పట్టాలు పొంది తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి హౌసింగ్ లోన్లు పొందారు. ఇండ్లు కట్టిన అనంతరం వాటిని రూ.5 నుంచి 15లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు. వందలాది ఇళ్లు కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో బినామీలు లబ్దిపొందారు. కొంత మంది అనర్హులకు పట్టాలు అందడంతో వారు ఇండ్లు కట్టి ఇతరులకు అద్దెకు ఇచ్చిన వైనం విచారణలో వెలుగుచూస్తోంది. జాడలేని లబ్ధిదారులు.. ఇందిరమ్మ కాలనీల ఏర్పాటు సమయంలో లబ్ధిపొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రెవెన్యూ అధికారులు సాగిస్తున్న విచారణలో అర్బన్ కాలనీలో 90 ఇళ్లలో సర్వే చేయగా కేవలం 22 మంది మాత్రమే నిజమైన పట్టాదారులు ఉన్నారు. మాదాపూర్ కాలనీలో 94 ఇళ్ల సర్వే జరగగా..16 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. ఏసుకోని గుట్ట కాలనీలో 50 ఇళ్ల సర్వే ముగియగా కేవలం 14 మంది మాత్రమే లబ్దిదారులు ఉన్నారు. ఈ మూడు కాలనీల్లో ఇప్పటి వరకు 234 ఇండ్ల సర్వే పూర్తి కాగా కేవలం 52 మంది మాత్రమే నిజమైన లబ్ధిదారులుగా తేలారు. మిగిలిన ఇళ్లలో అద్దెకు ఉన్నవారు..ఇళ్లు కొనుగోలు చేసిన వారు ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇంకా పట్టణంలోని వివిధ కాలనీల్లో సుమారు 2500 ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెందిన విచారణ సాగాల్సి ఉంది. -
రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం
హైదరాబాద్: రెవెన్యూ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు సబ్ రిజిస్ట్రార్స్ పై వేటు పడిన సంగతి తెల్సిందే. హెచ్ఎండీఏ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ సయ్యద్ ముజిబుల్లా ఇంటిపై దాడులు చేశారు. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్ చేసినట్టు గుర్తించారు. ముజిబుల్లా ప్రస్తుతం వల్లభ్ నగర్లో ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. సోదాల్లో పలు కీలకమైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ , బ్యాంక్ ఖాతా పుస్తకాలతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపల్లెలో ‘భూ’పాలుడు!
‘ముఖ్య’నేత తరఫున మడ భూములను మడతేశాడు రూ.వందల కోట్ల భూమి హాంఫట్ - గుంటూరుజిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యే చేతివాటం - సంపూర్ణంగా సహకరించిన రెవెన్యూ యంత్రాంగం - 508 ఎకరాల సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తుల పరం సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ భూములంటే ప్రజల ఆస్తి. వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన ప్రభుత్వం రికార్డులను తారుమారు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంటే ఏమనాలి? కంచే చేను మేస్తుంటే కాపాడేవారెవరు? అధికారపార్టీ నాయకుల చేతివాటానికి అడ్డూఅదుపూ ఉండడం లేదు. కనిపించిన భూమినల్లా కాజేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు వారికి అండగా నిలుస్తూ ఈ దారుణాలకు తమవంతు సాయం చేస్తున్నారు. గుంటూరుజిల్లా తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూముల వ్యవహారం చూస్తే అధికారపార్టీ నాయకులు ఎంత బరితెగిస్తున్నారో అర్ధమౌతుంది. రికార్డులను తారుమారు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేశారు. 313 ఎకరాలను హాంఫట్ చేసేశారు. అదేగాక సర్వే నెంబర్ల కొత్త ఫార్మాట్ పేరిట మరో 195 ఎకరాలను సొంతం చేసేసుకున్నారు. మొత్తం 508 ఎకరాలను స్వాహా చేశారు. వీటి విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. వీటితో పాటు తీర ప్రాంతానికి రక్షా కవచంలా ఉండే మడ అడవులనూ తెగనరికేస్తూ నేలను చదునుచేస్తూ భూమిని మింగేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ భూ కుంభకోణానికి సూత్రధారి అని వినిపిస్తోంది. పాత్రధారులంతా ఆయన అనుచరులు, అనుయాయులే. వీరికి రెవెన్యూ యంత్రాంగం యథాశక్తి సహకరించి ప్రభుత్వ భూములను ప్రయివేటు పరం చేసేసింది. ఆ వివరాలు మీకోసం... విభజించు...కొల్లగొట్టు గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో సర్వే నంబర్ 875లో 416.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒకప్పుడు ఈ భూమిని వాన్‌పిక్ ప్రాజెక్టుకు కేటాయించేందుకు ప్రభుత్వం గుర్తించింది. కానీ ఆ ప్రాజెక్టుకు ఇంకా కేటాయించలేదు. ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అందువల్ల ఆ భూముల క్రయవిక్రయాలు జరపకూడదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్రయవిక్రయాలు నిషేధించిన భూముల జాబితా వివరాలతో 2016లో విడుదల చేసిన 22ఏ రికార్డుల్లో ఈ విషయాన్ని పేర్కొంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 875ను ఎనిమిది సబ్ డివిజన్లుగా విభజించేశారు. అందులో సర్వే నంబర్ 875తో 231.54 ఎకరాలను అసెస్సడ్వేస్ట్ డ్రై(ఏడబ్లూడీ)గా పేర్కొని ప్రభుత్వ భూమిగా చూపించారు. సబ్ డివిజన్లుగా విభజించిన భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరుతో 1బీ అడంగల్‌లో నమోదు చేశారు. సర్వే నంబర్ 875(1)లో 89.60 ఎకరాలు, 875(2)లో 61 ఎకరాలు , 875(3)లో 57.50 ఎకరాలు, 875(4)లో 52.50 ఎకరాలు, 875(5)లో 30 ఎకరాలు, 875(6)లో 12.50 ఎకరాలు, 875(7)లో 8ఎకరాలు, 875(8)లో 2.50 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. అలా 313.60 ఎకరాలు పలువురు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. డీకే పట్టా, ఆక్రమణ, అనువంశిక, కొనుగోలు చేయడం తదితర విధాలుగా ఆ భూమి అంతా ప్రైవేటు వ్యక్తులదేనని 1బీ రికార్డుల్లో నమోదు చేశారు. వీరంతా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుయాయులే. దానిని బట్టి ఇదో పెద్ద భూ కుంభకోణమని మనకు తేలిగ్గా అర్థమౌతుంది. అటవీ భూమిని కలిపేసుకునే ఎత్తుగడ.. ఈ భూ మాయ వెనుక మరో పన్నాగం కూడా ఉంది. సర్వే నంబర్ 875లో 416.26 ఎకరాలు ఉన్నట్లుగా 2016 రికార్డుల్లో ఉంది. తాజాగా చూపించిన రికార్డుల్లో 875 సర్వే నంబర్ కింద 231.54 ఎకరాలను అసెస్సడ్వేస్ట్ డ్రై(ఏడబ్లూడీ)గా ప్రభుత్వ భూమిగా చూపించారు. ఇక ఎనిమిది సబ్ డివిజన్ల కింద 313.60 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నట్లుగా లెక్కతేల్చారు. ఈ రెండు కలిపితే మొత్తం 545.14 ఎకరాలు అవుతున్నాయి. అంటే 128.88 ఎకరాలు అధికంగా చూపించారు. ఆ భూముల సమీపంలో ఉన్న అటవీ భూమిని కూడా కలిపేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు. ఇప్పటికే తీరప్రాంతానికి సమీపంలో ఉన్న మడ అడవులను నరికివేస్తూ భూమిని కలిపేసుకుంటున్నారు. ఆ విధంగా సర్వే నంబర్ 875 సబ్ డివిజన్ల ముసుగులో మొత్తం 313.60 ఎకరాలు కొల్లగొట్టేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ దాదాపు రూ.20 లక్షలపైనే పలుకుతోంది. కొత్త ఫార్మాట్‌తో 195 ఎకరాలు హాంఫట్ సర్వే నంబర్ 874లో మరో 195 ఎకరాలు హాంఫట్ చేశారు. 2011లో రెవెన్యూ అధికారులు విడుదల చేసిన 22ఏ( ప్రొహిబిటెడ్ ప్రోపర్టీస్) రికార్డుల్లో సర్వే నంబర్ 874తో 422.84 ఎకరాలను ప్రభుత్వభూమి (మందబైలు పోరంబోకు) గా పేర్కొన్నారు. కానీ 2016లో విడుదల చేసిన 22ఏ (ప్రొహిబిటెడ్ ప్రోపర్టీస్) రికార్డుల్లో సర్వే నంబర్ 874 కింద 227.84 ఎకరాలే ఉన్నట్లు చూపిస్తూ ఆ భూమిని వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం గుర్తించినట్లు నమోదు చేశారు. మరి ఆ సర్వే నంబర్లోని మిగిలిన 195 ఎకరాలు ఏమయ్యాయి...!? ఇక్కడే ఉంది అసలు మాయ. ఇటీవల పాత సర్వే నంబర్ల స్థానంలో కొత్తవి అమలులోకి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం సర్వే నంబర్లు మార్చాలంటే ఓ కమిటీని నియమించి నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ కమిటీ లేకుండానే అధికారులు 874 సర్వే నంబర్‌ను కొత్త ఫార్మాట్ పేరిట 1126, 1128, 1129, 1132 తదితర నంబర్లుగా విభజించారు. ఆ పేరుతో 195 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల నుంచి గల్లంతు చేశారు. ఆ భూమిని పట్టాభూమిగా, ఆక్రమణ భూమిగా చిత్రీకరిస్తూ అధికార పార్టీ నేతల బినామీల పేరిట నమోదు చేస్తూ కంప్యూటర్ 1బీ అడంగల్‌లో పేర్కొన్నారు. ఆ భూమి విలువ రూ.39కోట్లు. బహిరంగ మార్కెట్లో దీని విలువ ఇంకా ఎక్కువే. అందరూ ఎమ్మెల్యే సన్నిహితులే.. ప్రభుత్వ భూములను తమపేరుతో 1బీ అడంగల్‌లో నమోదు చేసుకున్నవారం తా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సన్నిహితులే కావడం గమనార్హం. ఆయన కు అత్యంత సన్నిహితుడు, కూచిన పూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ పంతాని మురళీధరరావు కుటుంబసభ్యుల పేరుతో పలు సర్వే నంబర్ల భూములను నమోదు చేశారు. ఆయన కుమారులు, కోడళ్లతోపా టు సమీప బంధువుల పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్యే సత్య ప్రసాద్‌కు సన్నిహితుడైన నగరం ఎస్వీ ఆర్ఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సి పాల్, ప్రస్తుత డైరెక్టర్ కేసన సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా కొన్ని భూము లపై హక్కు కల్పించారు. ఆ జాబితాలో సురేంద్రబాబు సోదరుడు, ఏపీఐఐసీలో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్న సత్యదేవ ప్రసాద్ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉండడం గమనార్హం. వాస్తవానికి వీరంతా టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీలుగానే ఈ భూములు పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లంకలోకి రావొద్దు
► సర్వే చేయటానికి మేం ఒప్పుకోం ► అధికారులపై రాజధాని రైతుల ఆగ్రహం ► సర్వే అధికారులను అడ్డుకున్న కర్షకులు ► వచ్చిన దారినే వెనుదిరిగిన అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో : ‘లంకలోకి ఎన్ని పర్యాయాలు వస్తారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఇకపై లంకలోకి రావొద్దు. అందరితో సమానంగా ప్యాకేజీ ఇచ్చేలా ఉంటే రండి. ఈ లోపు లంకలో అడుగుపెడితే ఒప్పుకునేది లేదు’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. లింగాయపాలెం పంచాయతీ పరిధిలో లంక భూముల వద్ద కాపురం ఉంటున్న నివాసాల వివరాలు సేకరించేందుకు సోమవారం తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబు, ముగ్గురు సర్వేయర్లు ఉద్దండ్రాయునిపాలెంకు చేరుకున్నారు. విషయం తెలుసుక్ను స్థానికులు వారిని అడ్డుకున్నారు. ‘ఎందుకొచ్చారు? ఇప్పటికి ఎన్ని పర్యాయాలు వచ్చి సర్వే చేసి ఉంటారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. లంకలో సర్వే చేయటానికి వీల్లేదు. అందరితో సమాన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఇస్తేనే లోనికి వెళ్లండి. లేకపోతే వచ్చిన దారినే వెళ్లిపోండి’ అంటూ ఎదురు తిరిగారు. అంటరానివారిలా చూస్తున్నారు..: ప్రజా రాజధాని అని చెప్పి దళితులకు చోటు లేకుండా చేయటం మంచిదేనా? అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం లంక రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతుల నివాసాలకు వెళ్లి బతిమలాడారని గుర్తుచేశారు. అయితే లంక రైతులను అంటరాని వారిలా చూస్తున్నారని మండిపడ్డారు. లంకలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపట్లా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చి... చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని లెక్కలోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సమాన ప్యాకేజీ ఇవ్వొద్దని ఏ చట్టం చెప్పింది: దళిత రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వకూడదని ఏ చట్టం చెప్పిందని తహసీల్దార్ సుధీర్‌బాబును రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వారంతా కన్నీరుపెడుతున్నారని గుర్తుచేశారు. గజం స్థలం ఇస్తే పరిహారం కింద గజం ఇస్తామని హామీ ఇచ్చి... అవసరం తీరాక మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. లంక భూముల రైతులకు సమాన ప్యాకేజీ ఇచ్చేవరకు సర్వే చేయటానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పటంతో తహసీల్దార్, సర్వేయర్లు వచ్చినదారినే వెనుదిరిగి వెళ్లిపోయారు. -
ఆ భూమిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదు
♦ ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయరాదు ♦ ‘దేవతలగుట్ట’పై రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ దేవతలగుట్టపై ఉన్న 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశిం చింది. ఆ భూమిలో ఎటువంటి విగ్రహాలనూ ఏర్పాటు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ భూములు, భవనాలను మరొకరికి బదలా యించడం గానీ, అన్యాక్రాంతం చేయడానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే సమయం లో ఏ భవనాన్ని కూల్చవద్దని అధికారులను ఆదేశించింది. దేవతలగుట్టపై ప్రైడ్ ఇండియా సంస్థ ఎటువంటి అనుమతులు తీసుకోకుం డానే భారీ విల్లాలు నిర్మించిందని తేలుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలుంటే తెలపాలని అటు ఆ సంస్థ యాజమాన్యాన్ని, భవన యజమానులను హైకోర్టు ఆదేశించిం ది. తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేవతలగుట్టపై ఉన్న వీరభద్ర స్వామి, ఇతర దేవాలయాలను కూల్చివేయ డమే కాకుండా 150ఎకరాల ప్రభుత్వ భూమి లో ప్రైడ్ ఇండియా బిల్డర్స్ పెద్ద ఎత్తున నిర్మా ణాలు చేపడుతోందని, దీనిపై అ«ధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ దేవతల గుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాం రామ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం గురువారం మరో సారి విచారణ జరిపింది. ఆరోపణలు వాస్తవమేనన్న కమిటీ ఈ భూముల్లో తదుపరి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా ప్రైడ్ ఇండియా సంస్థ భారీ విల్లాలను నిర్మిస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ధర్మాసనం హైకోర్టు రిజిష్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన కమిటీ పరిశీలన జరిపి.. నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచింది. వందల సంఖ్యలో ఫొటోలను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను, ఫొటోలను గురువారం నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పరిశీలించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రైడ్ ఇండియా సంస్థ నిర్మాణాలను కొనసాగించిందని కమిటీ తేల్చింది. ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, 80 శాతం విల్లాల నిర్మాణం పూర్తయిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పి.ఎస్.పి. సురేశ్‌కుమార్ స్పందిస్తూ, ప్రైడ్ ఇండియా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. లేఔట్‌కు సైతం హుడా అనుమతి లేదన్నారు. ఈ భూమికి సర్వే నెంబర్ 85, 86లోని భూమికి ఏ మాత్రం సంబంధం లేదని, తమ భూముల్లో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేసేందుకు పిటిషనర్ ప్రయత్ని స్తున్నారని కొందరు వ్యక్తులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇలా విగ్రహాల ఏర్పాటునకు తాము ఎంత మాత్రం అనుమతినివ్వబోమని తెలిపింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ భూముల్లో ఎటువంటి తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా, విగ్రహాలను ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. -
ఎస్సీ శాఖలో రెవెన్యూ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు డిప్యూటీ కలె క్టర్లను ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులుగా నియమించడం వివాదానికి దారి తీసింది. వారి నియామకంపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శాఖాపరంగా పదోన్నతులిచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలు కూడా తీసుకోకుండా నియామకా లు చేపట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాత 10 జిల్లాల్లో ఉప సంచాలకులు(డీడీ) జిల్లా ఎస్సీ అధికారులు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి సహా యకులుగా జిల్లాకొకరు చొప్పున (హైదరా బాద్‌లో ఇద్దరు) 11 మంది జిల్లా సాంఘిక సంక్షేమాధికారులు(డీఎస్‌డబ్ల్యూవో) పనిచే స్తున్నారు. తాజాగా జిల్లాల సంఖ్య 31కి చేరడంతో పాత జిల్లాల్లోని డీడీలను అలాగే కొనసాగిస్తూ 11 మంది డీఎస్డబ్ల్యూవోలను కొత్త జిల్లాలకు ఎస్డీడీవో(ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి)గా నియమించింది. ఇలా 21 జిల్లాలకు అధికారులను సర్దుబాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మిగతా పది జిల్లాలో ఏఎస్‌డబ్ల్యూవో (సహాయ సాంఘిక సంక్షే మాధికారి)ని ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. తాజాగా రెవెన్యూ శాఖకు చెందిన ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లను నల్లగొండ, పెద్దపల్లి, వనపర్తి, సూర్యాపేట, జనగామ జిల్లాలకు ఎస్డీడీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చిం ది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖలోనూ మరో డిప్యూటీ కలెక్టర్‌ను జిల్లా సంక్షేమాధి కారిగా నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్లు, ఏఎస్డబ్ల్యూవోల పదో న్నతులకు సంబంధించిన ఫైలు వద్ద పెండిం గ్లో ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్లను నియమించడంపై తెలంగాణ ఏఎస్‌డబ్ల్యూ వో, సంక్షేమ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షే మశాఖ మంత్రి జోగు రామన్నలకు విజ్ఞాపన లిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే ఒక ట్రెండు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలంగాణ సహాయ సాంఘిక సంక్షేమాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. -
బోగస్‌పై చర్యలేవీ..?
► చర్చనీయాంశంగా బోగస్ ఓట్ల నమోదు వ్యవహారం ► కలెక్టర్ వద్దే విచారణ నివేదిక ► బాధ్యుల సంగతి పక్కన పెట్టారా..! ► చర్యలు అడ్డుకునేందుకు కలెక్టర్‌పై ఒత్తిడి ► సీఎం పేషీ స్థాయిలో మంత్రాంగం ► ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిగిలిన అధికారులు ► అసలు సూత్రధారులపై చర్యల కోసం సర్వత్రా డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో జిల్లా కలెక్టర్ మరింత ఆలస్యం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడులతోనే బాధ్యులపై చర్యల వ్యవహారం మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఓ రెవెన్యూ డివిజనల్ స్థాయిని తప్పించేందుకు నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. దీంతో బోగస్ ఓట్ల నమోదు వ్యవహారానికి సంబంధించిన నివేదికపై చర్యలు మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులకు ఓటు హక్కు కల్పించి తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ ఆషామాషీగా తీసుకోకుండా బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలే డిమాండ్ చేస్తుండటం గమనార్హం. అనర్హులకు ఓటు హక్కు కల్పించడంలో కొందరు రెవెన్యూ అధికారులు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారి అండతోనే కొందరు ఎన్నికల తహశీల్దార్లు అధికార పార్టీకి అనుకూలంగా బోగస్ ఓట్ల నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవానికి బోగస్ ఓట్ల నమోదు పెద్ద ఎత్తున జరిగింది. విచారణలోనూ ఈ విషయాలు బయటపడ్డాయి. విచారణ మొక్కుబడిగా సాగడం, వాస్తవానికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్లపై చర్యలు తీసుకోకుండా కేవలం ఎంపీడీఓలు, ఎంఈఓలపైనే చర్యలు తీసుకోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అక్రమాలకు తాము పూర్తిగా బాధ్యులం కాదని ఎంపీడీఓ, ఎంఈఓలు వాపోయారు. రెవెన్యూ అధికారులను పథకం ప్రకారం తప్పించేందుకే ఎంపీడీఓ, ఎంఈఓలకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారన్న ప్రచారమూ జరిగింది. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక సైతం కలెక్టర్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఇంత వరకు చర్యల్లేవు. బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో ఒక రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారే కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోకూడదంటూ కలెక్టర్‌పైనే ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు అధికారి నగరానికి చెందిన ముఖ్యనేత వద్దకు పరుగులు పెట్టి కలెక్టర్ చర్యలు తీసుకోకుండా కాపాడాలంటూ వేడుకున్నట్లు సమాచారం. దీంతో సదరు నేత సీఎం పేషీ స్థాయిలో కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం కోసమే సదరు అధికారులు బోగస్ ఓట్లను నమోదు చేయించారని, అతనిపై చర్యలు తీసుకోవడం సరికాదని ముఖ్యనేత ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ డివిజనల్ అధికారిపై ప్రస్తుత పరిస్థితుల్లో చర్యలుండే అవకాశం లేదని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాదూ కూడదని కలెక్టర్ చర్యలు తీసుకునే పక్షంలో తప్పు చేసే అధికారులకు ఇదో గుణపాఠంలా ఉంటుందని కొందరు జిల్లా స్థాయి అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా ప్రస్తుతం ఫైలు కలెక్టర్ వద్దే ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు..? నివేదికలో ఏముంది..? అసలు అక్రమాలకు బాధ్యులెవరు..? ప్రధాన పాత్ర పోషించిన ఉన్నతాధికారి ఎవరు...? నిజంగానే వారిపై చర్యలుంటాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కలెక్టర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే..! -
వైఎస్సార్ జిల్లాలో రెవెన్యూ అధికారుల జల్సాలు
-
పేదల బియ్యం పట్టివేత
డోన్ టౌన్ : దారిమళ్లుతున్న పేదల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు..బుధవారం స్వాధీనం చేస్తున్నారు. పట్టణ శివారులోని కొత్తపల్లె పారిశ్రామిక ప్రాంతంలో ఏపీ21పీవై 9534 నెంబరు గల అప్పీ ఆటోలో 44 క్వింటాళ్ల 40 కేజీల తరలిస్తుండగా అధికారులు దాడులు చేశారు. బియ్యంతోపాటు ఆటోను సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ సుబ్బరాయుడు, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణగిరి మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి అండదండలతో రేషన్ బియ్యం అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఒక చిన్న రేకుల షెడ్డును నిర్మించి రోజూ కొనుగోలు చేసిన బియ్యాన్ని, ఇక్కడి నుంచి లారీల్లో కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం పట్టుబడిన బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు మధుసుధాకర్, ధర్మవరం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పంచనామా జరిపి మండల స్టాక్ పాయింట్లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా..ఈ ఏడాది జిల్లా విజిలెన్స్, రెవెన్యూ అ«ధికారులు డోన్‌లో ఔదు సార్లు దాడులు జరిపి పెద్దమొత్తంలో బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అయినా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతూనే ఉంది. -
అధర్మానిదే రాజ్యం
– ధర్మవరంలో రెవెన్యూపై అధికార పార్టీ నేత పెత్తనం – ఏడాదిన్నరగా ఇన్చార్జ్ తహశీల్దార్ పాలన – మరో ఐదు మండలాల్లో 'అధికార' ఒత్తిడి అనంతపురం అర్బన్ : ధర్మవరం.. ఇక్కడ అధర్మానిదే రాజ్యం. కీలకమైన రెవెన్యూశాఖపై అధికార పార్టీ నేత కర్ర పెత్తనం సాగుతోంది. అంతా నా ఇష్టం.. నేను చెప్పినట్లే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పనిచేయాలంటే ఆయన.. ఆయన అనుచరుల కనుసన్నల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలి. లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న ధర్మవరంలో రెగ్యులర్ తహశీల్దార్ లేరు. ఏడాదిన్నరగా ఇక్కడ ఇన్చార్జి తహశీల్దార్ పాలన నడుస్తోంది. ఈ మండలానికి రెగ్యులర్ తహశీల్దార్‌ను నియమించినా ఉండలేని పరిస్థితులను అధికార పార్టీ నాయకులే కాదు... ప్రజాప్రతినిధికి తొత్తులుగా పనిచేసే కొందరు రెవెన్యూ సిబ్బంది కూడా కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోతున్నారు. ఇది ధర్మవరంతోనే ఆగిపోలేదు.. మరో ఐదు మండలాల్లోనూ రెగ్యులర్ తహశీల్దార్లపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. బెదరగొట్టి పంపిస్తున్న వైనం ఇక్కడకి తహశీల్దార్‌గా ఎవరు వచ్చిన బెదరగొట్టి పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015లో గోరంట్ల మండలం నుంచి కేశవనాయుడును తహశీల్దార్‌గా ఇక్కడ నియమించారు. మూడు నెలలపాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ ఒత్తిళ్లకు తట్టుకోలేక సీఆర్డీఏ (తూళ్లూరు) విల్లింగ్ ఇచ్చుకుని వెళ్లిపోయారు. అనంతరం గార్లదిన్నెలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న నారాయణమూర్తిని అధికార పార్టీ నేత సిఫారసుతో ఇన్చార్జి తహశీల్దార్‌గా నియమించారు. అటు తరువాత 2016లో బదిలీలు నిర్వహిస్తూ కదిరిలో పనిచేస్తున్న నాగరాజును ధర్మవరం తహశీల్దార్‌గా నియమించారు. ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో జాయిన్ అయిన వెంటనే సెలవుపై వెళ్లారు. పది రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. దీంతో రెవెన్యూ సంఘం నాయకులు ఆయన ఎక్కడున్నది తెలుసుకుని, తమ వద్దకు పిలిపించి విషయం తెలుసుకున్నారు. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో నాగరాజుకు యల్లనూరులో పోస్టింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి ధర్మవరంలో యథావిధిగా ఇన్చార్జి పాలన సాగుతోంది. మరో ఐదు మండలాల్లో... ధర్మవరంలో తమ అనుకూల అధికారుల కోసం రెగ్యులర్ తహశీల్దార్ ఉండలేని పరిస్థితి కల్పిస్తుంటే.. శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, అనంతపురం, ఉరవకొండ మండలాల్లో తహశీల్దార్లపై అధికార పార్టీ నేతల ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రెవెన్యూ డివిజన్ వారీగా సమావేశాలు నిర్వహించిన క్రమంలో అధికార పార్టీ నాయకులు నుంచి వస్తున్న ఒత్తిడి చెప్పడమే కాకుండా... ఈ చర్యలతో సక్రమంగా విధులు నిర్వర్తించలేక పోతున్నామని పలువురు తహశీల్దార్లు వాపోయినట్లు తెలిసింది. -
తుపాకీ లైసెన్స్‌ల చట్టాన్ని కఠినతరం చేయాలి
– రెవెన్యూ అధికారుల సూచన ఏలూరు (మెట్రో) : జిల్లాలో నేరచరిత్ర ఉన్న వారికి తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వవద్దని, ఈ విషయంలో చట్టాన్ని మరింత కఠినతరం చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువరు తహసీల్దార్లు కోరారు. మంగళవారం ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రెవెన్యూ శాఖలో చేపట్టాల్సిన నూతన సంస్కరణలపై ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు పలు సలహాలు, సూచనలు అందించారు. ద్వారకాతిరుమల తహసీల్దార్ ఎంహెచ్ మణి మాట్లాడుతూ కలెక్టరేట్లో తాను సీ–సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాలంలో ఆయుథాల లైసెన్స్‌లకు వచ్చిన దరఖాస్తులు చూస్తే జిల్లాలో తుపాకి లైసెన్సు ఒక ఫ్యాషన్‌గా మారిందనే భావన కలిగిందని, తుపాకీ లైసెన్స్ ఇవ్వాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు ఉండి తీరాల్సిందేనని చెప్పారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ మాట్లాడతూ రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు, పలువురు అధికారులు కొన్ని సూచనలు చేశారు. -
అధికారుల తీరుపై చెవిరెడ్డి మండిపాటు
చిత్తూరు: తిరుపతి రెవెన్యూ అధికారుల ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మావతిపురం రహదారి వద్ద తుమ్మలగుంట వెంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహోత్సవాలకు సంబంధించిన కటౌట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ కటౌట్లకు పక్కన ఉన్న సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలను మాత్రం అధికారులు తొలగించకుండా వదిలేశారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కటౌట్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గరుండి తిరిగి కట్టించారు. -
శాంతించిన గోదారమ్మ
ఊపిరి పీల్చుకున్న అధికారులు మంగపేట : ఎగువ ప్రాంతాల నుంచి వివిద జలాశయాల నుంచి విడుదల చేసిన వరదనీటిలో మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉగ్ర రూపందాల్చి పరుగులు తీసిన గోదారమ్మ బుధవారం సాయంత్రం నుంచి తగ్గు ముఖం పట్టడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం నుం చి కాళేశ్వరం వద్ద వరదనీటి ఉదృతి పెరగడంతో అర్దరాత్రి వరకు గోదావరి వరదనీరు భారీగా పెరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అం దించి అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ ఉదయం 7 గంటల వరకు వరద ఉదృతి భారీగా పెరగడంతో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్, ఆర్ఐ అశోక్‌రెడ్డి పుష్కరఘాట్ వద్ద వరద తీవ్రతను పరిశీలించారు. ఉదృతి పెరిగే అవకాశాలు ఉండంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలయిన కత్తిగూడెం, అకినేపల్లిమల్లారం, బోరునర్సాపురం వీఆ ర్వోలను అప్రమత్తం చేశారు. మద్యాహ్నం 3 గంటల నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గోదావరి వరద నీటి ఉధృతికి కోతకు గురవుతున్న ఒడ్డును చిన్ననీటి పారుదల శాఖ డిఈఈ రవికాంత్, ఈఈ రాంప్రసాద్ బుధవారం పరిశీలించారు. కాగా మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుష్కరఘాట్‌ను సందర్శించారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకబస్తాలు ఏర్పాటు చేసి ఒడ్డు కోతకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మైనర్ ఇరిగేష¯ŒS అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రాత్రికి రాత్రి కూలీలతో సుమారు 100 సిమెంటు బస్తాల్లో ఇసుక నింపి ఒడ్డు వెంట ఏర్పాటు చేశారు. అయినప్పటికి బుధవారం వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇసుక బస్తాల్లో కింద ఒండ్రు మట్టితో కూడిన ఇసుక కోతకు గురికావడంతో కొంత మేరకు ఇసుక బస్తాలు గోదావరిలోకి జారి పోయాయి. బస్తాలు జారిపోయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. -
ఆర్ అండ్‌ఆర్ పనులు పూర్తి చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): రిహ్యాబిటేషన్ అండ్ రెమ్యూనరేషన్ (ఆర్అండ్ఆర్)కు సంబంధించిన పనులు త్వరగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. పునరావాసకేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నక్కలమిట్ట వద్ద శ్మశానం, ఆర్కేట్పాళెంలో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కృష్ణపట్నం–ఆర్కేట్పాళెం వరకు గ్రావెల్, రివిట్మెంట్ పనులు పూర్తి చేయాలన్నారు. ముసునూరువారిపాళెం–కొత్తపాళెం బీసీ కాలనీ వరకు, ఏపీజెన్కో–ముసునూరుపాళెం వరకు నిర్దేశించిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం మంజూరు చేయాలన్నారు. నేలటూరుపాళెం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ధనలక్ష్మీపురం, మాదరాజుగూడూరుల వద్ద అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కండలేరు వద్ద దేవాలయం పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి వద్ద టుబాకో బ్యారెన్ ఏర్పాటుకు పర్యావరణ సమస్యలు లేకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తి చేసేలా రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, ప్లానింగ్ అధికారి వెంకయ్య, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రవీంద్రారెడ్డి, ముత్తుకూరు, కలువాయి, చేజర్ల తహసీల్దార్లు చెన్నయ్య, వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పట్టాదారులకు నోటీసులు
గోపవరం : బినామీ పేర్లతో పట్టాలు పొంది ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిన సంబంధిత వ్యక్తులకు ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి సమీపంలో 1988 సర్వే నెంబరులో స్థానిక టీడీపీ నాయకుడు 1996లో బినామీ పేర్లతో 13 ఎకరాలు పట్టాలు పొందాడు. అప్పటి నుంచి ఆ భూములను వ్యవసాయానికి ఉపయోగించలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు లీజుకు ఇస్తూ లక్షల రూపాయలు లబ్ధిపొందుతూ వస్తున్నారు. ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడంపై సీపీఐ వరుస ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. బినామీ పేర్లతో కేటాయించిన భూమిని పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికలు తయారు చేశారు. ఈ మేరకు రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్పిళ్లైకు కూడా నివేదిక కాపీలను పంపించారు. పట్టాలు పొందిన 9 మందికి నోటీసులు అందచేశారు. నోటీసులు అందుకున్న రెండు వారాల్లోపు సంబంధిత అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకున్న కెఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) సంస్థకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు నోటీసు అందుకున్న పవర్‌గ్రిడ్ సీనియర్ మేనేజర్ రాజీవ్‌గాంధీని సాక్షి వివరణ కోరగా గతంలో ఓ విద్యుత్తు సంస్థ లీజుకు తీసుకోవడంతో తిరిగి తాము ఈ భూమిని లీజుకు తీసుకోవడం జరిగిందన్నారు. ఒరిజినల్ పట్టా భూములా లేక డీకేటీ భూములా అనేది పరిశీలించలేదన్నారు. -
కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం
బుట్టాయగూడెం : గిరిజనేతరులతో కలిసి రెవెన్యూ, పోలీసు అధికారులు కుమ్మక్కై గిరిజనులను ఇబ్బంది పెట్టాలని చూస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్రంగా హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఓ బృందం బుట్టాయగూడెం మండలంలో గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక సీపీఎం కార్యాలయంలో గిరినులతో మధు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులకు న్యాయంగా చెందాల్సిన భూముల కోసం పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అమానుషమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అండ చూసుకుని అతిగా ప్రవర్తిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఏజెన్సీలో 20 ఏళ్ల నుంచి భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే మాజీ, సీనియర్ జడ్జిలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను వివరిస్తామని పేర్కొన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, పోలీసు రెవెన్యూ అధికారుల తీరుపై ఒక వినతి పత్రాన్ని డీఐజీకి అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం నాయకులు మంతెన సీతారాం, ఎంసీపీఐ నాయకులు కాటం నాగభూషణం, శ్రీరాములు, తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఖాళీ స్థలమా.. అయితే కబ్జా..!
రాముని చెరువు మత్తడి కాలువలపై అక్రమ నిర్మాణాలు కాలువకు ఆనుకునే షాపింగ్ కాంప్లెక్స్‌లు.. ఎల్తైన భవనాలు భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం దర్జాగా కబ్జాదారుల ఆక్రమణల పర్వం కనుమరుగవుతున్న కాలువ సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం.. అన్న చందంగా కన్పించిన ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. చెరువులు.. కుంటల స్థలాల మాట అటుంచితే.. చివరకు కాలువలను సైతం విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు కనుమరుగు కాగా, పట్టణంలో ఉన్న మురుగు కాలువలపైనా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జోరుగా జరుగుతున్న ఆక్రమణల పర్వంపై స్పందించాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. మంచిర్యాల నడిబొడ్డున.. ప్రధాన రోడ్డుపై రాముని చెరువు మత్తడి కాలువపై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా బల్దియా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులు.. కాలువల ఆక్రమణ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని ఇది వరకే జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అయినా.. మంచిర్యాలలో మాత్రం కబ్జాదారులపై అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనుమరుగవుతున్న కాలువ.. రాముని చెరువు పార్కు సమీపంలోని మత్తిడి నుంచి నీరు రాళ్లవాగులో కలిసేలా సుమారు 2 కి.మీ పొడవు, 15 మీటర్ల వెడల్పుతో కాలువను నిర్మించారు. కాలువ ద్వారా నీళ్లు పట్టణంలోని ప్రధాన వీధులైన జన్మభూమినగర్, ఇస్లాంపుర, రెడ్డికాలనీల మీదుగా రాళ్లవాగులో కలుస్తాయి. కాలువ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలోని నివాస గృహాలకు ఆనుకొని ఉండడంతో వ్యాపారులు, ప్రజలు కాలువను ఆక్రమించుకున్నారు. అనేక మంది కాలువపై స్లాబు వేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఆ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం.. కాలువ నుంచి రెండు మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ.. కాలువకు ఆనుకొనే భవంతుల నిర్మాణం చేపట్టారు. కాలువ ఉధృతి పెరిగితే.. నీళ్లు భవంతుల పునాదులకు చే రి భవనాలు కూలిపోయే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అనేక ప్రాంతాల్లో.. భవనాలకు ఇరువైపులా రోడ్డు ఉన్నా.. ప్రధాన రోడ్డు నుంచి రాకపోకలు సాగించేలా కాలువపై అక్రమంగా స్లాబులు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు కిలోమీటరున్నర మేర కాలువపై అక్రమ నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్తులో కాలువను శుభ్రం చేయాలన్నా.. ఏదైనా మరమ్మతు చేపట్టాలన్నా అక్రమ నిర్మాణాలు అడ్డంకిగా మారనున్నాయి. చర్యలు తప్పవు రాముని చెరువు మత్తడి కాలువపై జరుగుతున్న అక్రమ నిర్మాణ విషయం నా దృష్టికి రాలేదు. కాలువలపై ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే.. చర్యలు తీసుకుంటాం. – తేజావత్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్, మంచిర్యాల -
అక్రమ లే అవుట్లలో నిర్మాణాల కూల్చివేత
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. సీఓఆర్డీ యుగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాంపెల్లి గ్రామంలోని 15 అక్రమ లే అవుట్ల సరిహద్దు రాళ్లను తొలగించడంతో పాటు అక్రమ లే అవుట్ల ప్రహరీలను కూల్చివేశారు. అలాగే, దమ్మాయిగూడ, నాగారం, కీసర, అహ్మద్‌గూడ, చేర్యాలలోని అక్రమ లే అవుట్లపై కూడా రెండు రోజుల్లోపల చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ లే అవుట్లపై జాయింట్ కలెక్టర్ ఆమ్రపాల్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు. -
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెవిన్యూ అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాషామహల్లోని ఓ రైస్ మిల్లుపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
వెయ్యి ఇస్తేనే వ్యవసాయ పట్టా!
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : పోడు వ్యవసాయ పట్టాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే రెవెన్యూ అధికారులు మాత్రం గిరిజనుల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన శనివారం మండలంలో వెలుగు చూసింది. మండల పరిధిలోని బోడు పంచాయతీ మొక్కంపాడు తండాకు, పెట్రాంచెలక స్టేజీ, పెట్రాంచెలక గ్రామాలకు చెందిన బాధిత గిరిజన రైతులు తెలిపిన వివరాల ప్రకారం..బోడు వీఆర్ఓ గజేందర్ ఒక్కో పోడు పట్టాకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడని, డబ్బులు ఇచ్చినవారికి మాత్రమే పట్టా ఇస్తున్నాడని, లేకపోతే ఇవ్వడం లేదని వెల్లడించారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో 150కి పైగా పట్టాలకు డబ్బులు వసూలుల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
డీల్ కుదిరింది!
► ఇక కేసులు లేనట్టే! ► 467 సర్వే నంబర్ భూమి వ్యవహారం ► చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు జమ్మికుంట మండలం కొత్తపల్లి సర్వేనంబర్ 467 భూమి కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొలతలు వేసిన అధికారులు ఆరు గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇళ్లు కోల్పోయిన వారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటుందని ప్రచారమైనా... అధికార పార్టీ నాయకుల జోక్యంతో సయోధ్య కుదిరినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి అని గుర్తించిన దాంట్లో నిర్మాణాలకు పరిహారం ఇచ్చేలా ఈ డీల్ కుదరడం గమనార్హం. కొత్తపల్లి (జమ్మికుంట రూరల్) : కొత్తపల్లిలోని సర్వేనంబర్ 467లో ప్రభుత్వ భూమిలో కొందరికి భూ పంపిణీ చేయగా, మిగతా భూమి కబ్జా అవుతోందనే అధికారులకు గతంలో ఫిర్యాదులందాయి. ఎరుకల సంఘం వారు తమ సంఘ భవన నిర్మాణానికి 467లో స్థలం కేటాయించాలని కోరడంతో సర్వే అధికారులు కొద్ది రోజుల క్రితం కొలతలు వేశారు. 19 గుంటలు ప్రభుత్వ భూమి ఉంటుందని భావించగా, ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి మిగిలి ఉందని లెక్కలు తేల్చారు. ఈ ఆరు గుంటల స్థలంలో నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన దళితులు స్థానిక దళిత నాయకుల సహకారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు హుజూరాబాద్ డీఎస్పీ 467 సర్వేనంబర్ భూమి వ్యవహారంపై విచారణ జరిపారు.ఒక దశలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మిన వారిపై, దళితులకు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఆస్తినష్టం కేసులు నమోదవుతాయని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఇళ్లు కోల్పోయినవారి సన్నిహితులు, బంధువుల వివరాలు సేకరించి సయోధ్య కుదర్చాలని అధికార పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తూ, తిరిగి ఇళ్లు నిర్మించి, ఖర్చుల కోసం కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దీంతో ఇక పోలీసు కేసులు లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. 467 భూమి వ్యవహారం పలు మలుపులు తిరుగుతుందని భావించిన తరుణంలో అందరి అంచనాలు తారుమారయ్యేలా సయోధ్య కుదిరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినవారిలో ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఓ నాయకుడు, ఓ ఫోరం అధ్యక్షుడు మానేరు సమీప గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి భర్తతోపాటు మరికొంత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అయితే 6 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, బాధితులకు తిరిగి స్థలాన్ని ఎక్కడ నుంచి అప్పగిస్తారన్న సందిగ్ధం పలువురిలో నెలకొంది. -
కీసరలో ప్రభుత్వ భూములు స్వాధీనం
కీసర: రంగారెడ్డి జిల్లాలో రూ. 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసర మండలం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన బండ్ల పోచయ్య, రాములు, నారాయణలకు వ్యవసాయ నిమిత్తం అధికారులు ఎనిమిదెకరాల 17 గుంటల భూమిని కేటాయించారు. అయితే వీరు ఆ భూమిని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగారం గ్రామపరిధిలో రూ. కోటి విలువ చేసే మరో స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆగని రీసైక్లింగ్ దందా
రేషన్ బియ్యంతో పట్టుపడిన లారీ మానకొండూర్ : మండలంలోని ముంజంపల్లి శివారులోని వైష్ణవి రైస్‌మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఆగడం లేదు. నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ రేషన్ బియ్యం లారీ ఆదివారం పట్టుబడింది. గత నెల 20న వరంగల్ జిల్లా హసన్‌పర్తి నుంచి రేషన్ బియ్యంతో వచ్చిన లారీని విజిలెన్సు అండ్ ఎన్ఫ్ఫోర్సమెంటు అధికారులు పట్టుకుని 801 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆదివారం రేషన్ బియ్యంతో ఓ లారీ వస్తుందని ఉన్నతాధికారుల ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు వైష్ణవి రైస్ మిల్లుపై దాడిచేసి బియ్యంలోడు తో వచ్చిన ఓ లారీని పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఆర్ఐలు భగవంతరావు, నాగార్జున వీఆర్వో నవీన్‌రావు, వీఆర్ఏ జగదీశ్ రైస్‌మిల్లు వద్దకు చేరుకుని, లారీలోని బియ్యంతోపాటు, రైస్‌మిల్లును పరిశీలించారు. రైస్‌మిల్లులో కూడా రేషన్ బి య్యం ఉన్నట్లు గుర్తించి, సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సివిల్ సప్లై డెప్యూటీ తహశీల్దార్లు రమేశ్, హరికిరణ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ రైస్‌మిల్లు వద్దకు చేరుకుని లారీలో, రైస్‌మిల్లులో ఉన్న బి య్యం రేషన్ బియ్యమేనని గుర్తించారు. అనంతరం లారీ ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైస్‌మిల్లులోని రేషన్‌బియ్యం వద్ద రాత్రి రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచారు. లారీలోని బియ్యంతోపాటు, రైస్‌మిల్లులో సుమారు 500 క్వింటాళ్ల వరకు బియ్యం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. సోమవారం పంచానామా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి క స్టం మిల్లింగు పెట్టకపోవడంతో 2013లోనే ఈ రైస్‌మిల్లును సీజ్ చేశారు. సీజ్ చేసిన రైస్‌మిల్లులోకి రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ, రీ సైక్లింగ్ చేస్తున్నారు. -
‘గట్టు’ కీడు తలపెట్టెనోయ్!
ఇళ్లస్థలాల పూడికకు డ్రెయిన్ గట్ల తవ్వకం రూ.కోట్లు విడుదలైనా.. నిబంధనలకు తూట్లు పట్టించుకోని అధికారులు నేతల అండదండలతోనే నిర్వాకం భీమవరం : సొంతలాభం కొంతమానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్.. వట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్.. అన్నారు ప్రముఖ కవి గురజాడ. ఆయన మాటలను ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఏమోగానీ స్థానిక కాంట్రాక్టర్ సొంతలాభం కోసం ‘గట్టు’ కీడు తలపెట్టారు. ఇళ్ల స్థలాల పూడికకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిం చినా... అక్రమంగా డ్రెయిన్ల గట్లను తవ్వేస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు, అధికారపార్టీ నేతలు వత్తాసు పలు కుతున్నారు. భీమవరం పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రోత్సాహంతో స్థానికంగా 82 ఎకరాలు, భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సుమారు 16.50 ఎకరాలు సేకరించారు. ఈ భూములను మెరక చేసి లబ్ధిదారులకు అందించాల్సిన సమయంలో ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ స్థలాల మెరక చేపట్టకపోవడంతో ఇళ్లస్థలాల పట్టాల కోసం పేదలు అధికారపార్టీ నేతలపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎట్టకేలకు మెరక పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ. ఏడు కోట్లు మంజూరు చేసినా... భీమవరంలో కేటాయించిన 82 ఎకరాల మెరకకు రూ.ఏడు కోట్లు విడుదలయ్యాయి. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మట్టిని ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా యనమదుర్రు, గొంతేరు డ్రయిన్ల గట్లను కొల్లగొట్టి మెరక పనులు చేస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనమవుతున్నాయి. వర్షాకాలంలో యనమదుర్రు, గొంతేరు డ్రెయిన్లు పొంగిప్రవహిస్తుంటాయి. ఒక్కొక్కసారి గట్లకు గండ్లుపడి డ్రెయిన్ వెంబడి పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో డ్రెయిన్లలోని మట్టిని తీసి గట్లను పటిష్టం చేయాల్సి ఉండగా, గట్లను బలహీనం చేసి ఇళ్లస్థలాల మెరకకు తరలించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గట్లను కొల్లగొట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా.. డ్రెయినేజీ శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మట్టి తరలింపునకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనధికారిక అనుమతులిచ్చినట్టు తెలుస్తోంది. అవసరం దృష్ట్యా అనుమతి భీమవరంలో పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాల మెరక అవసరం దృష్ట్యా గొంతేరు డ్రెయిన్ గట్టు మట్టిని తోలుకునేందుకు అవకాశమిచ్చినట్టు డ్రెయినేజీ శాఖ ఈఈ డి.వెంకటరమణ చెప్పారు. మత్స్యపురి వద్ద గతంలో గొంతేరు డ్రెయిన్‌లో పూడిక తొలగింపు పనులు చేయించామని, ఆ మట్టి ఎక్కువగా ఉండడంతో దానిని గట్టుపై గుట్టగా వేశామని, ప్రస్తుతం గట్టువద్ద అంత మట్టి అవసరం లేనందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిని తోలుకునేందుకు అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారు. సీఏడీ భూముల మట్టీ తరలింపు నిబంధనల ప్రకారం.. సీఏడీ(సర్కార్ అగ్రికల్చర్ డవలప్మెంట్) భూముల్లోనూ తవ్వకాలు జరపకూడదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. భీమవరం మండలంలోని సుమారు 15వేల ఎకరాల సీఏడీ భూములుండగా, 800 ఎకరాలు ఇప్పటికే చెరువులుగా మారాయి. ఈ మండలంలోని గొల్లవానితిప్పలో కేటాయించిన ఇళ్లస్థలాల మెరక కోసం ఆ గ్రామ పరిసరాల్లోని సీఏడీ భూములను కొంతమంది అధికారపార్టీ నేతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకటి, రెండు రోజులు తవ్వకాలు ఆపేసి తరువాత మళ్లీ చేస్తున్నారు. దీనిపై అధికారపార్టీ నేతలను అడుగుతుంటే దాళ్వా వరి సాగు కీలక దశలో ఉన్నందున మట్టి అందుబాటులో లేకనే డ్రెయిన్ల గట్లను, సీఏడీ భూముల మట్టిని వినియోగిస్తున్నట్టు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అయితే మెరకకు మట్టిని ప్రభుత్వమే సమకూర్చితే కాం ట్రాక్టర్‌కు అంతపెద్దమొత్తం ఎందుకివ్వాలని, దీనిలో నేతలకూ వాటాలున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మలకపల్లి (తాళ్లపూడి) : మలకపల్లిలో బుధవారం బాలికకు వివాహం చేయబోతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఏఎస్సై పీఆర్‌సీహెచ్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన 13 ఏళ్ల వయసు బాలికకు మలకపల్లికి చెందిన యువకుడికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలిక తండ్రి యర్రంశెట్టి మునీశ్వరరావు తాళ్లపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి మలకపల్లి వచ్చారు. బాల్య వివాహం చేయటం శిక్షార్హమైన నేరమని వారికి చెప్పారు. ఇరు వర్గాల నుంచి బాల్యవివాహం చేయబోమని హామీ పత్రాలు తీసుకున్నారు. యుక్త వయసు వచ్చేవరకు వివాహం చేయబోమని వారు తెలిపారు. బాలిక తల్లి కువైట్‌లో ఉంటోందని, ఆమె పెద్దమ్మ ఈ వివాహం చేయించేందుకు ఏర్పాట్లు చేసిందని మునీశ్వరరావు తెలిపారు. ఆర్ఐ భారతి, వీఆర్వోలు పి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ వివరాలు సేకరించారు. ముసుళ్లగుంటలో.. ముసుళ్లగుంట (నల్లజర్ల రూరల్) : ముసుల్లగుంటల్లో బాల్య వివాహాన్ని అధికారులు నిలిపివేశారు. గ్రామానికి చెందిన అందుగుల వీరాస్వామి, గంగమ్మల 16 ఏళ్ల వయసు కుమార్తెకు పెదవేగి మండలం కూచింపూడికి చెందిన యువకుడితో గురువారం వివాహం నిర్చయించారు. బుధవారం పెళ్ళి సన్నాహాలు చేస్తుండగ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ నయోమిరాణి, ఎస్సై నాయక్, వీఆర్వో సూరిబాబు, సర్పంచ్ బలుసు గంగరాజు, ఎంపీటీసీ కోట బాబు ఆ బాలిక ఇంటికి వెళ్లారు. బాలికకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, చిన్న వయస్సులో వివాహలు చేయడం వల్ల వచ్చే అనర్థాలను బాలిక తల్లిదండ్రులకు తెలియజెప్పారు. వివాహ వయస్సు వచ్చేవరకు పెళ్లి చేయబోమని వారితో లిఖిత పూర్వక హమీ పత్రం తీసుకున్నారు. -
క్రమబద్ధీకరణకు మార్గం సుగమం!
డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు సర్కారు ఆమోదం చెల్లింపు కేటగిరీలో డిసెంబర్ 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్లు సర్కారు ఖాతాకు చేరిన మొత్తం రూ. 162.79 కోట్లు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కోసం భూపరిపాలన విభాగం అధికారులు రూపొందించిన డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు రాష్ట్ర ఆమోదం తెలిపింది. దీంతో పూర్తి సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు సదరు భూమి హక్కులను వెంటనే బదలాయించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీట ర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చెల్లింపు కేటగిరీలో 28,233 దరఖాస్తులు రాగా.. ఉచిత కేటగిరీలో వచ్చిన 23,784 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీ కింద అర్హమైనవిగా తేల్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో మొత్తం దరఖాస్తుల సంఖ్య 52,107కు చేరింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరులోగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. తాజాగా డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆన్లైన్లో పంపారని, డిసెంబర్ 1నుంచి అర్హులైన లబ్ధిదారులకు భూమి హక్కుల బదలాయింపు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారు. రూ. 162.79 కోట్లు జమ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా, ఆపైన ఉన్న స్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో సులభ వాయిదాలతో పాటు ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి రాయితీని కూడా కల్పించారు. ప్రస్తు తం చెల్లింపు కేటగిరీలో ఉన్న 52,017 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 409 మంది ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారు. మిగతా లబ్ధిదారులు డిసెంబర్‌లోగా పూర్తి సొమ్ము చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు డిమాండ్ నోటీసులు జా రీచేశారు. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు ఖాతాలో రూ.162.79 కోట్లు జమ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సంతకంపై సంశయం! లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే విషయమై తహసీల్దార్లు చేయాల్సిన సంతకంపై రెవెన్యూ యంత్రాంగంలో సంశయం ఏర్పడింది. డీడ్ ఆఫ్ కన్వేయన్స్పై డిజిటల్ సిగ్నేచర్ చేయాలా, ఇంకు సంతకం చేయాలా.. అన్న అంశంపై స్పష్టత రాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించిన సర్కారు... అవకతవక లు జరిగితే వారినే బాధ్యులుగా చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తే మేలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టత రానుందని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.