
పెద్దపల్లి రూరల్: రైతుబంధు రాలేదని ఓ రైతు నాగు పామును చంపి కాల్చుకుతిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన కీర్తి శ్రీనివాస్‌కు ఇదే మండలంలోని చందపల్లి గ్రామ శివారులో మూడు సర్వే నంబర్లలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వలేదు.
గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో తన పాతపాసుపుస్తకాలు, సాదాబైనామా కాగితాలు అందించినా.. అధికారుల్లో స్పందనలేదని.. అధికారుల తీరు కారణంగానే రైతుబంధు పథకం కింద వచ్చే ఎకరానికి రూ.4 వేలు అందకుండా పోయాయని బాధితుడు కీర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల తీరును నిరసిస్తూ నాగుపామును చంపి కాల్చుకుతిన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment