రెవెన్యూ అధికారుల చేతివాటం .. | Corruption in guntur tahasildar office | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారుల చేతివాటం ..

Published Fri, Jan 26 2018 11:33 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Corruption in guntur tahasildar office - Sakshi

బాధితుడు చిలుకూరి వెంకటేశ్వర్లు

శావల్యాపురం: రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి తమ పొలాన్ని మరొ కరి పేరుపై అన్‌లైన్‌లో నమోదు చేశారని మండలంలోని కారుమంచి, గంటావారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు బొల్లెపల్లి శివరామకృష్ణ.చిలుకూరి వెంకటేశ్వర్లులు ఆరోపించారు. ఈమేరకు గురువా రం విలేకర్లకు తమ సంతకాలతో కూడిన ప్రకటనలు విడుదల చేశారు. కారుమంచి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 563–1 సర్వే నెంబరు 82 సెంట్లు పొలం ఉంది. 2005లో ప్రభుత్వ పరంగా రిజ ష్టరు అయింది .అయితే గ్రామానికి చెం దిన కిలారు ముణేమ్మ, కిలారు వెంకటేశ్వర్లులకు మాభూమిని రెవెన్యూ అధి కారులు అన్‌లైన్‌ నమోదు చేయటంతో పట్టా దారుపాసుపుస్తకాలు 1.బిఫారం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఈవిషయంపై నెలలు తరబడి నుంచి తహసీల్దార్‌  కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని బాధితుడు బొల్లెపల్లి శివరామకృష్ణ అవేదన వ్యక్తం చేశాడు. మండలంలోని గంటా వారిపాలానికి చెందిన చిలుకూరి వెంకటేశ్వర్లుకు చెందిన రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి మరొకరు పేరున నమోదు చేసినట్లు బాధితుడు ఒక ప్రకటనలో తెలిపాడు .556–1 సర్వే నెంబరులో 2ఎకరాల భూమి ఉంది. ఈభూమి తమ బంధువైన  చిలుకూరి నాగేశ్వరరావుకు కౌలు ఇచ్చానన్నాడు. ఈనేపథ్యంలో తనకు తెలియకుండా రెవెన్యూ అధికారులను ఆశ్రయిం చి గతంలో నకలీ పాసుపుస్తకాలు పొందా డన్నారు. ఈవిషయాన్ని గత ఏడాదిలో ఆర్డీవోకు పిర్యాదు చేయగా విచారణ నిర్ధారణ కావటంతో నాగేశ్వరరావుకు ఇచ్చిన పాసుపుస్తకాలు రద్దు చేసినట్లు చెప్పారు.ప్రస్తుతం అన్‌లైన్‌లో తనపేరును రెవెన్యూ అధికారులు తొలగించినట్లు బాధితుడు చిలుకూరి వెంకటేశ్వర్లు విలేకర్లు వివరించాడు. పొలం వివాదం కోర్టులో నడుస్తుందని ఈక్రమంలో పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వృద్ధుడు అవేదన వ్యక్తం చేశాడు. ఈవిషయంపై స్థానిక తహసీల్దారు వి.కోటేశ్వరరావునాయక్‌ను వివరణ కొరగా అంతా రికార్డు ప్రకారం చేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement