తుపాకీ లైసెన్స్‌ల చట్టాన్ని కఠినతరం చేయాలి | dont give guns to crimanals | Sakshi
Sakshi News home page

తుపాకీ లైసెన్స్‌ల చట్టాన్ని కఠినతరం చేయాలి

Published Tue, Oct 18 2016 11:03 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

dont give guns to crimanals

– రెవెన్యూ అధికారుల సూచన
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నేరచరిత్ర ఉన్న వారికి తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వవద్దని, ఈ విషయంలో చట్టాన్ని మరింత కఠినతరం చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువరు తహసీల్దార్లు కోరారు. మంగళవారం ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రెవెన్యూ శాఖలో చేపట్టాల్సిన నూతన సంస్కరణలపై ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు పలు సలహాలు, సూచనలు అందించారు. ద్వారకాతిరుమల తహసీల్దార్‌ ఎంహెచ్‌ మణి మాట్లాడుతూ కలెక్టరేట్‌లో తాను సీ–సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాలంలో ఆయుథాల లైసెన్స్‌లకు వచ్చిన దరఖాస్తులు చూస్తే జిల్లాలో తుపాకి లైసెన్సు ఒక ఫ్యాషన్‌గా మారిందనే భావన కలిగిందని, తుపాకీ లైసెన్స్‌ ఇవ్వాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు ఉండి తీరాల్సిందేనని చెప్పారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్‌ మాట్లాడతూ రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు, పలువురు అధికారులు కొన్ని సూచనలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement