అట్టుడికిన కొమురంభీంనగర్
పోలీసులపై రాళ్లు రువ్విన గుడిసెవాసులు
3 డీసీఎంలు, 108 వాహనం అద్దాలు ధ్వంసం
ఎస్‌ఐ, డీసీఎం డ్రైవర్‌కుగాయాలు
ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొమురంభీంనగర్‌లో మంగళవారం ఉద యం గుడిసెల తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోహెడ రోడ్డుపై ఇరువైపులా ఒకవైపు గుడిసెవాసులు, వ ురోవైపు పోలీసులు మోహరించడంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. సర్వే నం.162లో ఉన్న 35 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన గుడిసెలను తొలగించడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు రాగా ఒక్కసారిగా గుడిసెవాసులు ఎదురుతిరిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆదిబట్ల ఎస్‌ఐ మదన్‌లాల్, డీసీఎం డ్రైవర్ నాగేష్‌కు గాయాలయ్యాయి.
అక్కడికి వచ్చిన మూడు డీసీఎం, 108 వాహనం అద్దాలను పగలగొట్టారు. ఫైరింజన్‌సాయంతో పోలీసులు చెదరగొట్టడానికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ రజిత్ కుమార్ సైనీ, డీసీపీ తాప్సిర్‌ఇక్బాల్, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, ల్యాండ్ ప్రొటెక్షన్ డిప్యూటీ కలెక్టర్ విట్టల్, తహసీల్దార్ విజయేందర్‌రెడ్డి తదితరులు గుడిసెవాసులతో మాట్లాడినా ఆందోళన విరమించలేదు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెల పగా కొందరు మహిళలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుం టామని బెదిరించారు.
దీంతో మాజీ ఎమ్మెల్యేలు కొండిగారి రాములు, మ స్కు నర్సింహ, ఆదివాసుల మహసభ కార్యదర్శి శంకర్‌నాయక్ తదితరులు డీసీపీ తాప్సిర్ ఇక్బాల్, ఏసీపీ నారయణగౌడ్‌తో చర్చించినా ఆందోళనకారు లు పట్టువీడలేదు. చివరకు వారిని పోలీసులు అరెస్టు చేసి గుడిసెలను జేసీబీలతో నేలమట్టం చేశారు. చేసేదేమీలేక గుడిసెవాసులు సైతం తమ వస్తువులను అక్కడి నుంచి తరలించి కొందరు తమ గుడిసెలకు వారే ని ప్పంటించారు. ఆ ప్రాంతానికి నల్లగొండ జిల్లా దేవరకొ ండ ఎమ్మెల్యే రవీం ద్రనాయక్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి చేరుకుని గుడిసెవాసులకు మద్దతుగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుపేదలకు 120 గ జాల స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.