ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ప్రభుత్వాలు కఠినతర చట్టాలు తెస్తున్న అవి ఆచరణలో ఫలితాలు సాధించలేక పోతున్నాయి.
శ్రీకాకుళం: ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ప్రభుత్వాలు కఠినతర చట్టాలు తెస్తున్న అవి ఆచరణలో ఫలితాలు సాధించలేక పోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎడ్లబళ్లను మంగళవారం ఉదయం అధికారులు పట్టుకున్నారు. వీరఘట్టం మండలం తెట్టింగి గ్రామంలో నాగావళి నది నుంచి ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడులు చేశారు. 19 నాటు బళ్లను సీజ్ చేసి..వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.