రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం | Officials Acquisition Government Land From Encroachers Annamayya District | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

Published Tue, Jan 10 2023 10:22 AM | Last Updated on Tue, Jan 10 2023 10:32 AM

Officials Acquisition Government Land From Encroachers Annamayya District - Sakshi

మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారని కోళ్లబైలు గ్రామస్తులు గత సోమ­వారం స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్డీవో ఎం.­ఎస్‌.మురళి తక్షణమే స్పందించారు.

వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్‌ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన కోళ్లబైలు సర్వే నంబర్లు 889/5లోని 1.11 ఎకరాలు, 891/1లోని 0.62 సెంట్ల భూమికి జారీ చేసిన పట్టాను రద్దు చేస్తున్న­ట్లు ప్రకటించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ భూమిలోకి ప్రవేశిస్తే చట్టప్రకారం శిక్షార్హులుగా పేర్కొ­న్నారు. అయితే అప్పటికే సదరు స్థలంలో ఆక్ర­మణదారులు అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశలో ఉన్నా­యో అంతటితోనే నిలిపేయాలని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement