
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా(కడప) : బద్వేలులో టిడిపి మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువులు భూదందాకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా చెన్నంపల్లె రెవెన్యూ పొలంలోని విద్యానగర్‌లో సర్వే నెంబర్ 1774/1,1774/2 లో సుమారు అయిదు ఎకరాల భూమిని కబ్జా చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువుల హస్తం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలంలో ప్లాట్ల పేరిట అడ్డగోలుగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ భూ కబ్జాపై స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మొత్తం వ్యవహారం బయటపడింది.