government land
-
అధికారులపైనా కేసులు
సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తూ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ ఫోకస్ చేసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రగతినగర్‌లోని ఎర్రకుంట, చందానగర్ ఈర్ల చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఐదుగురు ప్రభుత్వ అధికారుల పాత్రను గుర్తించింది. సదరు ఆక్రమణలపై నమోదైన కేసుల్లో ఈ అధికారులను కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం లేఖ రాశారు. ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట బఫర్ జోన్లో 0.29 ఎకరాలను బిల్డర్లు ఆక్రమించి మూడు భవనాలను నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 14న కూల్చేశారు. ఆ నిర్మాణాలకు కారణాలపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ విభాగానికి చెందిన ‘సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్’ కె.శ్రీనివాస్ ఈ స్థలానికి సంబంధించి రెండు రికార్డులు రూపొందించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఒకదానిలో అది ప్రభుత్వ స్థలమని, మరో దానిలో అది ప్రైవేట్ స్థలమని పొందుపరిచారు. అవసరాన్ని ఒక్కో రిపోర్టును తీసి ఇవ్వడం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు చెరువు సర్వే నంబర్‌ను కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మరో భూమికి సంబంధించిన సర్వే నంబర్ కేటాయించారు. ఈ వ్యవహారంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అంతేకాదు హెచ్ఎండీఏలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఆ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే అనుమతి మంజూరు చేశారు. ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు హైడ్రా నిర్ధారించింది. దీనితో ఈ కేసులో నలుగురు అధికారులనూ నిందితులుగా మార్చాలని పోలీసులను కోరింది. ఏమీ రాయకుండా ‘చుక్క’ పెట్టి లైన్ క్లియర్! చందానగర్ పరిధిలోని ఈర్ల చెరువు ఆక్రమణ వ్యవహారంపైనా హైడ్రా లోతుగా ఆరా తీయగా మరో బాగోతం బయటపడింది. ఇక్కడ 0.16 ఎకరాలను ఆక్రమించిన కొందరు.. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులతో ఒక నిర్మాణం, గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో మరో రెండు నిర్మాణాలను చేపట్టారు. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 10న ఆ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆక్రమణలకు సంబంధించి చందానగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు మంజూరైనట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ గత డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుధాంశ్‌తోపాటు మాజీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఎం.రాజ్‌కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈర్ల చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. దరఖాస్తుతోపాటు ఇరిగేషన్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకుని జత చేయాలి. బిల్డర్లు అలా చేయలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) ఆ వివరాలను పొందుపరుస్తూ రాజ్‌కుమార్‌కు ఫార్వర్డ్ చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్‌పై రాజ్‌కుమార్ తన అభిప్రాయాలను జోడిస్తేనే అది డిప్యూటీ కమిషనర్‌కు వెళుతుంది. కానీ రాజ్‌కుమార్ దానిపై ఎలాంటి కామెంట్లు రాయకుండా.. కేవలం ఓ చుక్క (డాట్) పెట్టి డిప్యూటీ కమిషనర్‌కు ఫార్వర్డ్ చేసేశారు. దీని ఆధారంగా డిప్యూటీ కమిషనర్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేశారు. ఇది గుర్తించిన హైడ్రా చందానగర్‌లో నమోదైన కేసులో సుధాంశ్, రాజ్‌కుమార్‌లను నిందితులుగా చేర్చాలని సిఫార్సు చేసింది. ఏసీబీ అధికారుల దృష్టికి కూడా.. సాధారణంగా అన్నీ సరిగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి కావాలన్నా.. సంబంధిత అధికారుల చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది చెరువులు, కుంటలు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు అంటే.. అధికారుల చేతికి ముడుపులు దండిగా అందినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారి ఉంటాయని హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక ఉదంతాలపై విజిలెన్స్ విచారణలు కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగించాలని హైడ్రా భావిస్తున్నట్టు తెలిసింది. -
ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం
సాక్షి, నాగర్‌కర్నూల్: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. వైన్‌షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్‌ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
ఐఏఎంసీకి ఆ భూమి ఉచితంగా ఎందుకిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ.300 కోట్ల విలువ చేసే 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఎందు కు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్య దర్శి, ఐఏఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదు పరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదే శిస్తూ..విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ‘రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ దుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 27 లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ 2021, నవంబర్ 26న జీవో నంబర్ 126ను విడు దల చేసింది. నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ మరో జీవోను విడుదల చేసింది. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది. సహజన్యాయ సూత్రాలకు ప్రభుత్వ నిర్ణ యం విరుద్ధం. ఈ జీవోలను కొట్టివేసి, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునేలా, రూ.3 కోట్లలో ఇక ముందు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఆపడంతో పాటు ఇప్పటివరకు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ఐఏఎంసీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసు కోవాలి’అని పేర్కొంటూ న్యాయవాది కె.రఘునాథ్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే... ఈ పిల్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాస నం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఓ ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూ మిని ఉచితంగా ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఈ సంస్థతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకు న్నా.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉ ల్లంఘించి భూమిని కేటాయించారన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూమిని ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. -
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారని కోళ్లబైలు గ్రామస్తులు గత సోమవారం స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్డీవో ఎం.ఎస్.మురళి తక్షణమే స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన కోళ్లబైలు సర్వే నంబర్లు 889/5లోని 1.11 ఎకరాలు, 891/1లోని 0.62 సెంట్ల భూమికి జారీ చేసిన పట్టాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ భూమిలోకి ప్రవేశిస్తే చట్టప్రకారం శిక్షార్హులుగా పేర్కొన్నారు. అయితే అప్పటికే సదరు స్థలంలో ఆక్రమణదారులు అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అంతటితోనే నిలిపేయాలని హెచ్చరించారు. -
‘గీతం’ ఆక్రమణలోని ప్రభుత్వ భూమి స్వాధీనం
కొమ్మాది (విశాఖ జిల్లా) : గీతం వైద్య కళాశాల ఆవరణలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకుని కంచె వేశారు. అందులో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ సర్వే నంబర్–17లో మొత్తం 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో గుర్తించారు. అయితే, ఇందులో కళాశాలకు, ప్రభుత్వ స్థలానికి మధ్యనున్న 5.72 ఎకరాల స్థలంలో ఈ కంచెను ఏర్పాటుచేసినట్లు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి సర్వే నంబర్ 15, 20, 37, 38లో 40 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనప్పటికీ అది ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపారు. గతంలోనే మార్క్ చేశాం ఇక కళాశాలకు ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. అయితే, ఈ స్థలంలో గ్రీనరీ పెంచుతూ, ప్లే గ్రౌండ్‌గా తయారుచేశారని భాస్కర్‌రెడ్డి వివరించారు. అంతేకాక.. ప్రస్తుతం 14 ఎకరాలను గీతం యాజమాన్యం యథేచ్ఛగా ఉపయోగించుకుంటోందని, కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు ఇందులో 5.72 ఎకరాల స్థలానికి కంచె వేసినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములు సరిహద్దుగా ఉండటంతో ఎలాంటి కంచెలు ఏర్పాటుచేయలేదని ఆయన చెప్పారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాల్లేవని.. కానీ, త్వరితగతిన కంచె ఏర్పాటు పనులు పూర్తికావాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున పనులు చేపట్టామని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మొత్తం పదిచోట్ల ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. కోర్టులో ఉన్నందున నిర్మాణాల జోలికి వెళ్లలేదని ఆర్డీవో స్పష్టంచేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. -
సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట
బంజారాహిల్స్ (హైదరాబాద్): సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారుకు భారీ ఊరట లభించింది. రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదేనంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో షేక్‌పేట రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నెం. 14 ప్రధాన రహదారిలోని సర్వే నెంబర్ 403లో ప్రభుత్వానికి రెండెకరాల పది గుంటల స్థలం ఉంది. చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్ ఈ స్థలం తనదేనంటూ డి. రంగస్వామి అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ప్రభుత్వం కూడా సిటీ సివిల్ కోర్టులో విజయం సాధించగా సదరు కబ్జాదారు జాగా తనదేనంటూ హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న తర్వాత 2021 ఏప్రిల్ 1న హైకోర్టు ఈ స్థలం బి. రంగస్వామికి చెందినదని తీర్పునిచ్చింది. ఆ తెల్లవారే సదరు వ్యక్తి హైకోర్టు తీర్పుతో స్థలం చూట్టూ బ్లూషీట్లు ఏర్పాటు చేసుకొని జీపీఏ అగ్రిమెంట్ చేసిన శాంతా శ్రీరాం రియల్టర్‌కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో ఖరీదైన స్థలాన్ని కావాలనే అప్పగించేశారంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ వాదనలు సరిగా లేవంటూ పలువురు విమర్శించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 2021 జూన్‌లో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ కొద్ది రోజులకే సుప్రీం కోర్టు ఈ స్థలంపై స్టేటస్కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఈ స్థలం తమదేనంటూ పక్కాగా ఆధారాలు సమర్పించారు. ఏడాది కాలంలో స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను కోర్టులో సమర్పించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ స్థలం ప్రభుత్వానిదేనంటూ సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని స్వాదీనం చేసుకొని తమ అదీనంలోకి తీసుకున్నారు. -
‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు
అద్దంకి: ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగ వంతమైంది. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 1000 ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో తహసీల్దార్ జే ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి, మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ మ్యాప్‌ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు. ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అద్దంకి, బొడ్డువానిపాలెం మధ్యలో 1,600 ఎకరాల భూమి పరిశీలన.. అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ధేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు. ఇక్కడ 1600 ఎకరాల భూమి విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు.అందులో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు 1000 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వ భూమిపోను 900 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తిమ్మాయపాలెం కుంకుపాడు రోడ్డుకు పడమరగా.. మండలంలోని తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డునుంచి, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక మధ్యలోని 1,400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో 311 ఎకరాల డాటెడ్ ల్యాండ్‌తోపాటు, వాగులు, వంకలు, డొంకలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అంటే అవసరమైన 1000 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను, 689 ఎకరాల ప్రైవేటు భూములు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. -
పోలీస్ భవనాలు ఎప్పటికి పూర్తయ్యేనో....
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ప్రకారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పడినా పక్కా భవనాలకు మాత్రం మోక్షం లభించడంలేదు. కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఎస్పీ కార్యాలయాలు కొనసాగుతుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలకు 2017–18లోనే పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలిచి పునాది రాళ్లు కూడా వేసింది. అయితే ఏళ్లు గడిచినా కొన్ని జిల్లాల్లో ఇంకా పనులే ప్రారంభం కాకపోవడంతో ఆయా జిల్లాల పోలీస్ యూనిట్లు, అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు) ఐదేళ్లు గడిచినా... ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీస్టేషన్‌ను ఎస్పీ కార్యాలయం నుంచి అప్‌గ్రేడ్ చేసి కమిషనరేట్‌గా ప్రభుత్వం మార్చింది. అయితే పాత అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి ప్రస్తుత కమిషనరేట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదే కార్యాలయం పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్త కమిషనరేట్ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ నిర్మాణ పనులు చేపట్టలేదు. అయితే కమిషనరేట్ పనులకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణంపై వెనక్కి తగ్గడంతో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆ కంపెనీని టెండర్ నుంచి తొలగించేసింది. దీంతో అప్పటినుంచి రీ టెండర్‌కు ప్రయత్నం చేస్తున్నా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండిపోయినట్టు హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా తెలిసింది. (చదవండి: ‘కన్ఫ్యూషన్ ఏం లేదు.. ఏ పార్టీలో చేరాలో స్పష్టత ఉంది’) భూమి కేటాయింపులే ప్రధాన సమస్య.... జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఈ మూడు జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణానికి భూమి కేటాయింపు సమస్యగా మారినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెంలో విజయవాడ హైవే వైపు ల్యాండ్ పరిశీలించినా, పోలీస్ శాఖకు అనువుగా ఉండదని అధికారులు భావించినట్టు తెలిసింది. ఇకపోతే ఇదే సమస్య నిర్మల్లోనూ తలెత్తినట్టు హౌజింగ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అదే విధంగా జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం టెండర్లు జరిగినా టెక్నికల్ సమస్య వల్ల రద్దు చేశారు. మళ్లీ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. ఇకపోతే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల 70 శాతం, 80 శాతం పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల 50 శాతం పనులు పూర్తయి మిగిలిన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని పూర్తి చేస్తాం.. జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్ల భవన నిర్మాణాలకు చిన్నచిన్న అవాంతరాలున్నాయి. కొన్ని చోట్ల భూమి కేటాయింపు సమస్య ఉండగా, మరికొన్ని చోట్ల రీ టెండర్లు పిలుస్తున్నాం. అవికాకుండా మిగిలిన జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల పనులు 80 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే అన్ని నిర్మాణాలు పూర్తిచేస్తాం. – కోలేటి దామోదర్ గుప్తా, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ -
సాక్షి ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్
అనంతపురం టౌన్: ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ డీఐజీ మాధవి శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. సురేష్ ఆచారి అనంతపురం రూరల్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ‘సాక్షి’ ఈ నెల 1వ తేదీన ‘ప్రభుత్వ భూమిపై పచ్చమూక’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంత్ కుమార్ విచారణ కోసం ఓ కమిటీని నియమించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు...? దాన్ని ఎలా రిజిస్టర్ చేశారు..? తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశించారు. దీంతో రాప్తాడు తహసీల్దార్ ఈరమ్మ రాప్తాడు పొలం సర్వే నంబర్ 123–2లోని భూమి వంక పోరంబోకు అని, పైగా నిషేధిత జాబితాలో ఉందని నివేదికను అందజేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ తరఫున విచారణ చేపట్టిన డీఐజీ మాధవి నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సర్వే నంబర్ భూములను యాడికి రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్ చేయగా... ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. చదవండి: ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి! -
15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వెంకటాచలం: ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్భాస్కర్ను కోరాడు. దీంతో అతను గీతను సంప్రదించాడు. గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్ సిగ్నేచర్ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది. విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగా, గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
బంజారాహిల్స్‌లో ఒకే స్థలం ముగ్గురు, నలుగురికి విక్రయం
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సర్కారు స్థలాలను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో ఓ రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయినా.. మరొకరు జైలు ఊచలు లెక్కపెట్టినా.. విలువైన స్థలాలను కబ్జా చేసేందుకు అదే తతంగాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన షేక్‌పేట మండలంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ స్థలంపై రోజుకో కబ్జాదారుడు ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తూ.. దర్జాగా కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నారు. గత మార్చిలో డాక్టర్ తిరుమల రాంచందర్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి 9.17 ఎకరాలను ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు రూ.10 కోట్లు అడ్వాన్ప్‌గా తీసుకొని అంటగట్టారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రికార్డులను పరిశీలించిన సదరు ప్రొఫెసర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని అమ్మిన రాంచందర్‌రావు సహా మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే నిందితుడు మళ్లీ ఏకంగా షేక్‌పేట మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఈ స్థలాన్ని అంటగట్టేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పత్రాల పరిశీలన కోసం తహసీల్దార్ వద్దకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కథ ఇదీ! 1950లో భూమిలేని ముగ్గురికి జీవనోపాధి నిమిత్తం బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 25 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే, సదరు అసైన్డ్‌దారులు వ్యవసాయం చేయకపోవడం..భూమి కూడా సాగుకు అనువుగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ అసైన్మెంట్ను రద్దు చేశారు. విచిత్రమేమిటంటే.. అసైన్మెంట్ రద్దుకు మునుపే.. ఈ భూమి చేతులు మారింది. 25 ఎకరాల భూమిని మూడు సొసైటీలు కొనుగోలు చేశాయి. అసైన్మెంట్ను రద్దు చేయడంతో ఈ సొసైటీలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ వివాద పరిష్కారానికి అప్పట్లో ప్రభుత్వం శాసనసభ కమిటీని వేయగా వీరికి 166 జీవో కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించినా.. సొసైటీ సభ్యులకు ఈ స్థలాన్ని పంపిణీ చేయడం కష్టతరంగా ఉందని చెప్పడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే అదునుగా ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా.. రోజుకో ఫోర్జరీ పత్రాలతో స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ► దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే ఈ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ రూ.10 కోట్లకు విక్రయించి పోలీసులకు దొరికిపోయారు. ► కేవలం ఒకరికేగాకుండా..ఈ కేసు నమోదుకు ముందు కూడా మరొకరికి ఇదే భూమిని అమ్మజూపుతూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవడం గమనార్హం. ► విచిత్రమేమిటంటే.. విలువైన ఈ భూమిని కాజేసేందుకు తెరవెనుక పావులు కదుపుతున్న రియల్ మాఫియా.. అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలను సృష్టిస్తునే ఉంది. ఈ పత్రాలతోనే బురిడీ కొట్టిస్తూ.. అడ్వాన్స్ రూపేణా రూ.కోట్లు కొట్టేయడం పరిపాటిగా మారింది. ► ఏకంగా 40 మంది కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారమవుతుందంటే.. ఈ భూమిని మింగేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 9 ఎకరాలు తమవే అంటూ ఆ ప్రాంతానికే చెందిన డా.రాంచందర్‌రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని విక్రయిస్తామంటూ చెప్పడంతో పాటు కొన్ని పత్రాలను రాంచందర్‌రావు తమకు ఇచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి షేక్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ పత్రాలు నిజమైనవైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలంటూ కోరాడు. అతడు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నిందితుడు రాంచందర్‌రావు తదితరులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఫోర్జరీ పత్రాలతో చాలా మంది కబ్జాదారులు విక్రయాలకు తెగబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. సీసీఎస్‌లో కూడా రాంచందర్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకొని రాగా అవి ఫోర్జరీవి అని తేలింది. గతంలోనే సీసీఎస్ పోలీసులు ఈ స్థలానికి సంబంధించి వివరాలు అడగగా వారికి ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మకానికి ఉందని పత్రాలు ఇస్తే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం -
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెతకంశెట్టి గణవెంకటరెడ్డి నాయుడు ... అంటే అర్థం కాలేదు కదా... అదేనండి గణబాబు... విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నాయకుడు. ఏమిటీ ఇంకా గుర్తుకు రాలేదా.. అవును మరీ.. 2019 ఎన్నికల తర్వాత ఒకటిరెండు సార్లు తప్పించి.. పెద్దగా ఇంటి గడప దాటి బయటకు రాని ఎమ్మెల్యే ఈయన. ఇప్పుడీయన సంగతేమిటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైకి సుతిమెత్తగా మాట్లాడే ఈయన అక్రమార్జన మాత్రం గణగణ మోగాల్సిందే. సర్కారీ స్థలంలో ఏకంగా సినిమా థియేటర్లు కట్టేసుకుని ఆనక కోర్టుకు వెళ్ళి.. ఎంచగ్గా ఆక్రమణ ‘చిత్రం’ నడిపించేస్తున్నారు ఈయనగారు.. పూర్తి ‘సినిమా’ చూడాలంటే ఈ కథనంలోకి రావాల్సిందే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కాపాడుకోవడం, చేతనైతే పెంచుకోవాలనుకోవడం ఇవన్నీ సహజం.. ఎవరైనా అదే చేస్తుంటారు. కానీ ఎమ్మెల్యే గణబాబు రూటే సెపరేట్.. వారసత్వంగా వచ్చిన ఆక్రమిత స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి గత టీడీపీ హయాంలో అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. 22ఏ(ప్రభుత్వ స్థలం) నుంచి బయటకు తీసుకువచ్చేలా జీవో(నెం 361) తెప్పించుకున్నారు. ఇటీవల రెవిన్యూ యంత్రాంగం పూర్తి స్థాయి పరిశీలిస్తే గణబాబు వారి ఆ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు విశాఖ రూరల్ మండలం.. ఇప్పుడు గోపాలపట్నం మండలం.. గోపాలపట్నం రెవెన్యూ గ్రామం సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 27బై1లో 35.5సెంట్ల(సుమారు1726.67 చదరపు గజాల) ప్రభుత్వ స్థలంలో గణబాబు తాత అప్పలనాయుడు ఐదు దశాబ్దాల క్రితం ఓ సినిమా థియేటర్ నిర్మించారు. అప్పట్లో ఆ స్థలం గ్రామ కంఠంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వ డ్రై స్థలం (పోరంబోకు)గా రికార్డుల్లో చూపించారు. 1962లో సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమికి సంబంధించి రైతు వారీ పట్టా ఇవ్వాల్సిందిగా అనకాపల్లి అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే.. ఈ భూమి మాదేనంటూ 2009లో జిల్లా పరిషత్ సీఈవో అప్పటి రూరల్ తహశీల్దార్‌కు లేఖ రాశారు. ఈ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి తప్పించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇలా ఆ భూమిపై వివాదాలు నడుస్తుండగానే గణబాబు కుటుంబం సదరు సినిమా థియేటర్ రూపు మార్చేసింది. నరసింహా, శ్రీ నరసింహా పేర్లతో రెండు థియేటర్లు నిర్మించేసింది. మరోవైపు 2014లో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గణబాబు ఎన్నికయ్యారు. అప్పటికే రియల్ బూమ్ ఆకాశాన్నంటిన విశాఖలో 35.5సెంట్ల స్థలం విలువ కోట్లకు ఎగబాకింది. గోపాలపట్నంలోని నరసింహా, శ్రీ నరసింహా సినిమా థియేటర్లు.. దీంతో సదరు భూమిని ఎలాగైనా పూర్తిగా హస్తగతం చేసుకోవాలని గణబాబు పక్కా స్కెచ్ వేశారు. టీడీపీ ప్రభుత్వమే కావడంతో 2015లో ఎమ్మెల్యే గిరీ ఉపయోగించి గ్రామ కంఠం నుంచి ఆ స్థలానికి మినహాయింపు పొందారు. ఈ మేరకు 2015 సెప్టెంబర్ 29న రెవిన్యూ శాఖ నుంచి జీవో కూడా విడుదలైంది. ఇక ఆ తర్వాత స్థలాన్ని 22ఏ నుంచి తొలగించాలని ఓ వైపు కోర్టులో దాఖలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే 2016 జనవరి 22న అప్పటి జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఆర్సి నంబర్ 3153బై2015ఈ.1 ప్రకారం ఆ స్థలం 22ఏలో నుంచి బయట పడింది. స్థలాన్ని మింగేందుకు సబ్ డివిజన్లు సదరు విలువైన పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గణబాబు ఎన్నో మాయోపాయాలు ప్రయోగించారు. ఆ క్రమంలో ఆ భూమిని లెక్కకు మించిన సబ్ డివిజన్లుగా విభజించారు. మొదట్లో ఒకే ఒక (27బై1) సర్వే నెంబర్ పేరిట ఉన్న స్థలాన్ని ఆ తర్వాత 27బై4, 27బై5, 27బై5పి, 27బై16పి, 27బై18 సర్వే నెంబర్లుగా రూపాంతం చేశారు. దీంతో భూమి స్థితి మారి.. 22ఏ నుంచి బయటపడేందుకు మార్గం సులువైంది. ఈ మేరకు అప్పట్లో అధికారులు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించారని స్పష్టమవుతోంది. అధికారుల గ్రౌండ్ రిపోర్ట్‌తో బయటపడిన వాస్తవాలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దరిమిలా ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ హయాంలో అక్రమార్కుల పరమైన సర్కారీ స్థలాలను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లు విలువైన గణబాబు సినిమా థియేటర్ల స్థలంపై కూడా దృష్టిసారించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీసి జిల్లా అధికార యంత్రాంగానికి నివేదికనిచ్చారు. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! -
క్వారీ లీజుల జారీకి సింగిల్ డెస్క్ పోర్టల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్వారీ లీజుల జారీకి వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ (ఏకగవాక్ష తరహా) విధానానికి భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఎవరైనా క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఆంధ్రప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేస్తే దానిని సంబంధిత సహాయ సంచాలకులు/ ఉప సంచాలకులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆన్లైన్లోనే ఆ ప్రాంత తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దారు దానిని పరిశీలించి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని, వ్యక్తిగతంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్లోనే గనుల శాఖకు ఎన్ఓసీ పంపుతారు. అటవీ భూమి అయితే.. ఒకవేళ అటవీ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఆ దరఖాస్తును ఆ ప్రాంత డివిజనల్ అటవీ అధికారికి పంపుతారు. ఆయన నిబంధనలను పరిశీలించి, దరఖాస్తుదారు ప్రత్యామ్నాయ భూమికి, ప్రత్యామ్నాయ వనీకరణ కింద నిధులు జమ చేసేందుకు అంగీకరిస్తే అటవీ శాఖకు నివేదిక పంపుతారు. అటవీశాఖ దానిని పరిశీలించి అనుమతిస్తుంది. ఎక్కువ విస్తీర్ణమైతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో లీజుల జారీకి నిబంధనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్’విధానం అమల్లోకి తెచ్చామని గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. దీనివల్ల దరఖాస్తుదారుల డబ్బు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు. -
విశాఖ: భీమిలీ రోడ్డులో ప్రభుత్వ భూమి కబ్జా
-
తప్పుడు పత్రాలతో ఆక్రమించారు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, విజయరామపురం ఆగ్రహారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావుకు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. విజయరామపురం ఆగ్రహారం సర్వే నెంబర్ 13(పార్ట్)లో ఉన్న తన 4.84 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా, తదుపరి చర్యలు తీసుకోకుండా రెవిన్యూ అధికారులను నియంత్రించాలంటూ ప్రత్యూష కంపెనీ అధీకృత అధికారి పరుచూరి వెంకయ్య ప్రభాకర్ ఆదివారం రాత్రి హైకోర్టులో హౌస్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ నెల 15న అకస్మాత్తుగా ప్రహరీ కూల్చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చెబుతున్న ఇనాం గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నెంబర్లు లేవని, అలాంటప్పుడు వారిది సర్వే నెంబర్ 13(పార్ట్) అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇవన్నీ పిటిషనర్ సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ భూమి విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఫ్యూజన్ రెస్టారెంట్ కేసులోనూ స్టేటస్ కో... భూమి లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్‌పై మహా విశాఖ ప్రాంతాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకోవడంపై ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్‌మోషన్ రూపంలో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫ్యూజన్ ఫుడ్స్ లీజుకు తీసుకున్న భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
తమ్ముళ్ల రియల్ దందా
గోరంట్ల–హిందూపురం రహదారికి ఆనుకుని టీడీపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వరరావు వేసిన వెంచర్ ఇది. ఈ పక్కన ఉన్న బ్లూకలర్ బిల్డింగ్ క్యాంటీన్. ఈ వెంచర్‌కు వెళ్లే ప్రధాన రహదారి, క్యాంటీన్ ఏర్పాటు చేసిన స్థలం రస్తా పొరంబోకు. కానీ టీడీపీ హయాంలో సదరు రియల్ వ్యాపారి అప్పటి టీడీపీ నేతల అండతో దాదాపు 97 సెంట్లు ఆక్రమించాడు. దర్జాగా తన వెంచర్‌కు దారి ఏర్పాటు చేసుకోవడంతో పాటు పక్కనే క్యాంటీన్ ఏర్పాటు చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీడీపీ నేత ఆక్రమించిన రస్తా పొరంబోకు స్థలం విలువ మార్కెట్లో రూ.కోటిపైనే. అయినా ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోని పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జిల్లాలోనే పేరుగాంచిన ప్రాంతం గోరంట్ల. ఇక పాలసముద్రం పేరు చేబితేనే రియల్ భూం కళ్లముందు గిర్రున తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నాసన్, బెల్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తుండగా.. భూములకు రెక్కలొచ్చాయి. సెంటు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు రియల్ వ్యాపారాన్ని జోరుగా సాగించారు. ఏకంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. గోరంట్ల: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ‘కియా’ అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడంతో పాలసముద్రం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటికే అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. ఆ పార్టీ అధికారంలో ఉండగా కబ్జారాయుళ్ల అవతారమెత్తారు. కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇలా వెంకటేశ్వరావు అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గత టీడీపీ హయాంలో పాలసముద్రం సమీపంలోన హిందూపురం–కదిరి ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్ 230, 232లో 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని ఆక్రమించి తాను ఏర్పాటు చేసిన వెంచర్లో కలిపేసుకున్నాడు. వెంచర్‌కు వెళ్లేందుకు రస్తాపొరంబోకులోనే ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడంతో పాటు పక్కనే క్యాంటీన్ నిర్మించాడు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇబ్బంది లేకుండా ప్రభుత్వ భూమిలోనే వినాయకుడి గుడి నిర్మించాడు. కళ్లముందే ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోని పరిస్థితి. పైగా సదరు వ్యాపారి వద్ద ముడుపులు తీసుకుని ఆక్రమణకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గోరంట్లలో మరో తమ్ముడి నిర్వాకం గోరంట్లకు చెందిన మరో టీడీపీ నేత ఆక్రమణల్లో తాను తక్కువ తినలేదని నిరూపించాడు. కదిరి– హిందూపురం ప్రధాన రహదారి పక్కన మార్కెట్ యార్డు సమీపంలో 275–4 సర్వే నంబర్లోని 24 సెంట్ల రస్తాపొరంబోకు భూమిని ఆక్రమించి తన పొలంలో కలిపేసుకున్నాడు. అక్కడ చిన్న చిన్న హోటళ్లు, వ్యాపార సముదాయలు ఏర్పాటు చేసి నెలనెలా బాడుగలు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ సెంటు భూమి రూ.8 లక్షల పైమాటే. భవిష్యత్ అవసరాల కోసం వదలిన రస్తాపొరంబోకు స్థలాలను టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గోరంట్లలోని రస్తా పొరంబోకులో టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన దుకాణాలు నోటీసులిచ్చాం పాలసముద్రం రెవెన్యూ పొలం సర్వే నంబర్ 230, 232లోని 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించినట్లు గుర్తించాం. గత ఆగస్టులోనే సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి నోటీసులు జారీ చేశాం. అలాగే గోరంట్లలోని సర్వే నంబర్ 275–4లోని 24 సెంట్ల రస్తా పొరంబోకును మరో వ్యక్తి అక్రమించినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తాం. – బాలకిషన్, తహసీల్దార్, గోరంట్ల -
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా(కడప) : బద్వేలులో టిడిపి మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువులు భూదందాకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా చెన్నంపల్లె రెవెన్యూ పొలంలోని విద్యానగర్‌లో సర్వే నెంబర్ 1774/1,1774/2 లో సుమారు అయిదు ఎకరాల భూమిని కబ్జా చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువుల హస్తం కూడా ఉంది. ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలంలో ప్లాట్ల పేరిట అడ్డగోలుగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ భూ కబ్జాపై స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మొత్తం వ్యవహారం బయటపడింది. -
దళిత దంపతులపై జులుం
-
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్‌చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్‌స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: భూ ఆక్రమణదారులు ఎంతటివారైనా సరే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. విశాఖలో విలువైన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకునే విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. పంచగ్రామాల భూసమస్య, గాజువాక హౌస్ కమిటీ భూములపై తదుపరి సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. జిల్లాలో పేదలందరికీ ఇంటిస్థలం, విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, పంచగ్రామాల భూ సమస్య తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఇంతవరకూ దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జూలై 8వ తేదీన ఇంటిపట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సూచనలూ పరిగణనలోకి తీసుకుంటున్నామంటే పారదర్శకతకు ఒక నిదర్శనమని అన్నారు. అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని చెప్పారు. అనర్హుల జాబితాలో ఉన్నవారికి అధికారులు వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించాల్సి వచ్చిందో వెల్లడించాలని అధికారులను ఆదేశించామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంకా మిగిలిన అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. కొంతమంది కోర్టుకెళ్లారు.. జిల్లాలో ఇంటిస్థలాల పంపిణీ కోసం ఆరు వేల ఎకరాలను సమీకరించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. కొంతమంది వ్యక్తులకు కోర్టుకు వెళ్లి ఆపడం వల్ల కొన్నిచోట్ల జాప్యమవుతోందని అన్నారు. ఆ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టరును ఆదేశించినట్లు తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు రాష్ట్రంలోనే అత్యధిక విలువైన భూములు విశాఖలోనే ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. భవిష్యత్తులో నగరానికి మరింత విలువ పెరగబోతోందని చెప్పారు. దీంతో కొంతమంది రకరకాల న్యాయవివాదాలు సృష్టించి ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల నష్టపోతున్న వ్యక్తులు ప్రభుత్వంపై, విజయసాయిరెడ్డిపై ఎదురుదాడికి తెగిస్తున్నారని చెప్పారు. విశాఖ డివిజన్‌లోనే 4,900 ఎకరాలు వివాదాల్లో, ఆక్రమణల్లో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరు నేతృత్వంలో లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. చూస్తూ ఊరుకోవాలా? గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూఅక్రమాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. సిట్ నివేదిక వచ్చేవరకూ ప్రభుత్వ భూములు పరాధీనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఓ విలేకరి ప్రశ్నకు స్పందించారు. ప్రజా ఆస్తులకు సంరక్షకుడిగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ పక్కాగా అమలుచేస్తామని ఉద్ఘాటించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి పటిష్ట చర్యలు తీసుకొనేలా అధికారులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. స్వీయ నియంత్రణతో ‘కోవిడ్’ కట్టడి కోవిడ్ 19 కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాలకు వచ్చినపుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో బోర్డులు విశాఖ పరిసరాల్లో ఎంతో విలువైన భూములు గత ప్రభుత్వ హయాంలో పరాధీనమయ్యాయని మంత్రి కన్నబాబు చెప్పారు. అలాంటి పరిస్థితులు కొనసాగకుండా తక్షణమే ప్రభుత్వ భూములను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. గాజువాకలో అన్యాక్రాంతమవుతున్న చెరువులను రక్షించి సుందరీకరణ చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు. ల్యాండ్ ఆడిట్ జరగాలి.. గతంలో పారిశ్రామిక, వ్యాపార, విద్యా తదితర అవసరాల కోసం భూములు పొందిన వారంతా ఆయా అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా అనే విషయమై ల్యాండ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్ కూడా తక్షణమే నిర్వహించాలని ఆదేశించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విధానాల వల్ల చివరకు కంప్యూటర్ ఆపరేటర్లు సైతం భూరికార్డుల్లో వివరాలు తారుమారు చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. -
బొజ్జల అనుచరుడి పన్నాగాలు
ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ముందస్తుగా తైలం చెట్లు నాటాడు. అనంతరం బినామీ పేర్లతో పట్టాలు సృష్టించాడు. అధికారుల సహకారంతో అనుచరులనే అనుభవదారులుగా రికార్డుల్లో నమోదు చేయించాడు. ఇప్పుడు గుట్టుగా సర్కారుకే విక్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. రూ.కోట్ల పరిహారం దిగమింగేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, తిరుపతి: టీడీపీ నాయకులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలను ఆక్రమించుకుని అమ్మి సొమ్ముచేసుకున్న సంఘటనలు కోకొల్లలు. నాడు టీడీపీ చేసిన పాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాళహస్తి రూరల్‌పరిధిలో టీడీపీ నాయకుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్నాడు. కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వానికే అప్పగించి పరిహారం రూపంలో కోట్ల రూపాయలు నొక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ తహసీల్దార్, గతంలో పనిచేసిన మరో తహసీల్దార్, వీఆర్వో (టీడీపీ నాయకుడి బంధువు) సహకారంతో అక్రమాలకు తెరతీశాడు. శ్రీకాళహస్తి మండల పరిధిలోని ఎంపేడు, వాగివేడు పంచాయతీ వెంగళ్లంపల్లిలో సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నాడు. 2016లో ఆక్రమించుకున్న ఈ భూముల్లో తైలం చెట్లు నాటాడు. రెండేళ్ల తర్వాత 2018లో బినామీ పేర్లతో పట్టాలు సృష్టించాడు. మరికొందరి పేర్లతో అనుభవంలో ఉన్నట్లు రికార్డులు తయారు చేశాడు. పరిహారం కోసం ప్రయత్నం ఏర్పేడు – వెంకటగిరి మార్గంలో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతో పాటు డీకేటీ, అనుభవంలో ఉన్న భూములను తీసుకుని వారికి పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షలు చెల్లించే అవకాశం ఉందని గ్రహించిన టీడీపీ నేత గుట్టుచప్పుడు కాకుండా సర్కార్ భూములను ప్రభుత్వానికే విక్రయించేందుకు పథకం వేశాడు. పరిహారం రూపంలో మొత్తం రూ.10 కోట్లు జేబులో వేసుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వారితో మాట్లాడితే తమ పేరున ప్రభుత్వం భూములు ఇచ్చినట్లు, పట్టాలు మంజూరు చేసినట్లు తెలియదని చెబుతున్నారు. భూస్వామి అయిన టీడీపీ నాయకుడు తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, తనకు భయపడే వారి పేర్లతో పట్టాలు, అనుభవదారులుగా పత్రాలు సృష్టించారు. విచారణ చేసి న్యాయం చేస్తాం ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి రాలేదు. ఆక్రమణ జరిగి ఉంటే విచారణ జరిపించి న్యాయం చేస్తాం. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. –జరీనా బేగం, తహసీల్దార్, శ్రీకాళహస్తి రూరల్ -
మనదేనయ్యా ఆ భూమి..
తూర్పుగోదావరి, రామచంద్రపురం: వెతుకుతున్న వస్తువు కాలికి తగిలినట్టు.. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూమి కోసం అన్వేషిస్తుంటే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి అధికారుల కంట పడింది.. అసలు ఆ భూమి ఎవరిదని ఆరా తీస్తే... ప్రభుత్వానిదే అని నిర్ధారణ అయింది. చివరికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చొరవతో ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన సుమారు 2.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 99, 100లో ఈ భూమి వెల్ల సావరం దగ్గర్లో ఉంటుంది. ద్రాక్షారామ రెవెన్యూ పరిధిలోని ఆ మెరక భూమిలో 40 ఏళ్ల నుంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ ఫలాలను కొందరు అనుభవిస్తున్నారు. ఆ స్థలం సర్కారుదని ఎవరికీ తెలియదు. అంతేకాకుండా కొంత ఆక్రమణకు గురైంది. ఇదిలా ఉంటే పేదలందరికీ గూడు కల్పించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్థలాలున్నాయో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పట్టారు. అధికారులకు ద్రాక్షారామ పరిధిలోని ఆ భూమి కనిపించింది. అసలు ఎవరిదని అధికారులు రికార్డులు తిరగేశారు. చివరికి ప్రభుత్వానిదే అని తేలింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన ఆయా సర్వే నంబర్లలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 2.70 ఎకరాల భూమిని స్వా«ధీనం చేసుకున్నారు. పొక్లెయిన్‌తో చెట్లను తొలగించి చదును చేశారు. ద్రాక్షారామ పరిధిలోని ఇళ్లు లేని పేదలకు స్థలాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ఎంతో శ్రమపడ్డారు. అనుకోకుండా విలువైన భూమిని గుర్తించి దానిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో సుమారు 135 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. ఈ స్థలాన్ని గుర్తించడంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పేదలకు మేలు జరగనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కంట పడింది.. గతంలో ఆ భూమిని ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం సర్వే చేస్తుండగా మా కంట పడింది. ఎవరిదని ఆరా తీస్తే ప్రభుత్వానిదని తేలింది. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నారు. ఆ స్థలాన్ని పూర్తిగా సిద్ధం చేశాం. పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తాం.– పి.తేజేశ్వరరావు, తహసీల్దార్,రామచంద్రపురం -
పేదల ఇళ్లకు సైంధవుడతడు
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ రెవెన్యూ భూమిని.. ‘మడ’ అడవులు అంటూ రాజకీయం చేస్తోంది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయిన చంద్రబాబు.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందని ట్విట్టర్ వేదికగా చిచ్చు రగిల్చారు. దీని ఆధారంగా తన వాళ్లతో కోర్టులో కేసు వేయించి కథ నడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరం దుమ్ములపేట సమీపాన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎర్రగ్రావెల్తో చదును చేసిన 116 ఎకరాల ప్రభుత్వ భూమిపై చంద్రబాబు, టీడీపీ నేతలు లేని వివాదాన్ని లేవనెత్తడం పట్ల పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 4,650 మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, బీసీ వర్గాల వారే ఉన్నారు. మహిళల పేరున పట్టాలు ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కుట్రకు తెరతీశారు. మడ అడవులను నరికి ఇళ్ల స్థలాల కోసం చదును చేసి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారని, దీంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని, తుపాను ముప్పు ఉంంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రచ్చకు బీజం వేశారు. ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అనుచరుడైన టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త తుమ్మల రమేష్‌తో హైకోర్టులో కేసు వేయించి ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డారు. పైగా ఆ కేసును టీడీపీకి చెందిన మాజీ మంత్రి సమీప బంధువే వాదిస్తుండడం గమనార్హం. ఆ అడవులతో సంబంధం లేదు.. ► చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాల భూమికి, మడ అడవులకు అసలు సంబంధమే లేదు. కోరంగి మడ అడవులు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ► ఈ 116 ఎకరాల భూమికి, కోరంగి మడ అడవులకు మధ్య సుమారు 10 కిలోమీటర్లు పైగా దూరం ఉంటుంది. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటం వల్ల ఈ భూముల్లో పెరిగిన చిన్నచిన్న మొక్కలను చూపి చంద్రబాబు అండ్ కో మడ అడవులంటూ యాగీ చేస్తోంది. ► పెద్ద, పెద్ద తుపాన్లు వచ్చినప్పుడు సైతం కాకినాడకు 6 నాటికల్ మైళ్ల దూరాన సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు రక్షణ కవచమనే వాస్తవాన్ని వ్యూహాత్మకంగా విస్మరించారు. ► ఎలాంటి జల వనరులు లేని ఖాళీ భూమి వల్ల ఏకంగా 54 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని చంద్రబాబు ట్వీట్ చేయడం తగదని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆ భూములు ముమ్మాటికీ ప్రభుత్వానివే కాకినాడలోని ప్రభుత్వ భూమిని పోర్టు విస్తరణ కోసం 1978లో ఇచ్చారు. అందులో చాలా ఏళ్లుగా 116 ఎకరాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించాం. కాకినాడ స్మార్ట్ సిటీలో ఇళ్ల స్థలాల కోసం నిరుపేదల నుంచి సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి దశలో సుమారు ఐదు వేల మంది అర్హులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. పక్కాగా రెవెన్యూ భూములనే విషయం నిర్ధారించుకుని.. పోర్టు, అటవీ, మత్స్యశాఖలను సంప్రదించాకే చదును చేయించాం. ఈ భూములను మడ అడవులుగా గతంలో ఎప్పుడూ నోటిఫై చేయలేదు. – డి మురళీధర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ టీడీపీ కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకువెళతాం పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి టీడీపీ అడ్డుపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రంలో దశల వారీగా 30 వేల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇలా అడ్డుపడడం దారుణం. వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తాం. ఎన్ని అవరోధాలు సృష్టించినా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ స్థలాలు పంపిణీ చేస్తాం. – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ. పేదల స్థలాలకు అడ్డుపడుతున్నారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో అనేక కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టి పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. – వాసుపల్లి కృష్ణ, మత్స్యకార నాయకుడు, కాకినాడ నాడు 70 ఎకరాలు ఎలా కేటాయించారు? ► 2018లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములకు సమీపాన 70 ఎకరాలు కాంకర్ (కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కంపెనీకి ఎలా కేటాయించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వివాదం సృష్టిస్తోన్న 116 ఎకరాల భూమికి సమీపాన 53 ఎకరాల్లో సుమారు 1,100 ఇళ్లను టిడ్కో ద్వారా గత సర్కార్ నిర్మించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? ఇదీ వాస్తవం.. ► కోరంగి పరిసర ప్రాంతాల్లో 86 వేల ఎకరాల్లో అభయారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాలు (సర్వే నంబర్లు 376/పి1, 374/పి1, 387, 1985/పి, 1990, 2004/పి) ఏ ప్రభుత్వ రికార్డుల్లో అభయారణ్యంగా నమోదు కాలేదు. ఇదే విషయాన్ని ఓడరేవులు, అటవీ, గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), మత్స్యశాఖలు స్పష్టం చేస్తున్నాయి. -
111.03 ఎకరాల అటవీభూమికి టీడీపీ పెద్దల ఎసరు
విజయవాడ: ఓ కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి అది. దానిని ఓ జమీందారు పలువురికి విక్రయించారు. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించింది. ఆ మేరకు గెజిట్ కూడా ప్రచురించింది. అంతవరకు సవ్యంగానే ఉంది. ఆ తర్వాతే కథ ప్రారంభమైంది. ఎందుకంటే... అది విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూమి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నవీపోతవరం గ్రామ ఆర్.ఎస్.నంబర్ 86లో ఉన్న ఈ 111.03 ఎకరాల భూమికి విజయవాడ 24 కి.మీ. దూరం మాత్రమే. ఇక్కడి ఎకరం బహిరంగ మార్కెట్లో రూ. 3 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన భూమి విలువ రూ. 300 కోట్లు, అందులో నిక్షిప్తమైన కంకర విలువ సుమారు రూ. 200 కోట్లు. మొత్తం రూ. 500 కోట్లు ఉంటుందని ఓ అంచనా. దీనికి పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో చదరపు గజం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ధర పలకడం గమనార్హం. దీంతో అటవీశాఖకు చెందిన ఆ భూమిని చేజిక్కించుకునే పన్నాగాలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముమ్మరం చేశారు. మొదట 2000 సంవత్సరంలో మొదలు పెట్టి, 2014లో వేగవంతం చేశారు. దీనికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూత్రధారి కాగా, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ ఐఏఎస్ చక్రం తిప్పారు. ఆ 111.03 ఎకరాల భూమిని కొనుగోలు చేసినందున తనకు రిజిస్ట్రేషన్ చేయాలని విజయవాడ నగర వాసి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) మాజీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌కు మామ అయిన ముక్కామల రామచంద్రరావు రిజిస్ట్రేషన్ శాఖను 2009లో సంప్రదించారు. వీలుకాదని చెప్పడంతో కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అటవీశాఖ భూమి అని రికార్డులు చెబుతున్నా... ►నవీపోతవరంలోని ఈ భూమిని సౌత్ వల్లూరు ఎస్టేట్ జమీందారు–1 తమదిగా పేర్కొంటూ వి.వీరేశలింగం, తదితరులకు విక్రయించారు. అయితే, ‘ది ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ యాక్ట్ 1948’లో భాగంగా ఈ భూమిని 1949 సంవత్సరంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1951లో అటవీశాఖకు బదలాయించింది. ►ప్రభుత్వ బదలాయింపును పునఃపరిశీలించాలని జమీందారు 1962లో ప్రభుత్వాన్ని కోరినా, ఆయనదేనని నిర్ధారించే రికార్డులు చూపలేకపోయారు. ►111.03 ఎకరాలను జమీందారు నుంచి కొనుగోలు చేశామని, ఆ భూమిని తమకు చూపాలని వి.వీరేశలింగం, మరో అయిదుగురు సర్వే విభాగం ద్వారా 2000లో పట్టా పొందారు. ముక్కామల రంగప్రవేశం.. ►వి.వీరేశలింగం, తదితరుల నుంచి 2006లో భూమి కొనుగోలు చేశానని, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ముక్కామల రామచంద్రరావు సంప్రదించారు. ఇందుకు సర్వే విభాగం ఇచ్చిన పట్టాలను ఆధారంగా చూపారు. దీనిపై రిజిస్ట్రేషన్ విభాగం రెవెన్యూ శాఖను స్పష్టత కోరగా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని తేల్చేసింది. దీంతో సర్వే చేసి తనకు స్వాధీనం చేయాలని కోరుతూ రామచంద్రరావు ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లను రెస్పాండెంట్లుగా చేర్చుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయితే, ఆ భూమి అటవీశాఖకు చెందినదేనని ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కౌంటర్ పిటిషన్లో స్పష్టం చేశారు. అది ప్రభుత్వానికి చెందిన భూమే.. ►నవీపోతవరం సర్వే నెంబరు 86లోని భూమి అటవీశాఖకు చెందినదని తమ పరిశీలనలో స్పష్టమైందని కృష్ణా జిల్లా కలెక్టరు ఎ.ఎం.డి.ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ఎం.మాధవీలత ‘సాక్షి’కి చెప్పారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలింపజేశామని, న్యాయస్థానం దృష్టికి వాస్తవాలను తీసుకెళతామన్నారు. 20320/2009 రిట్ పిటిషన్లో జిల్లా ఉన్నతాధికారులను రెస్పాడెంట్లుగా వ్యూహాత్మకంగా చేర్చలేదని స్పష్టమవుతోందన్నారు. చిన్న ఉద్యోగుల వరకే పరిమితం చేశారన్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు న్యాయస్థానంలో వాదన వినిపించడానికి తమను కూడా అనుమతించాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కలెక్టరు, జేసీలు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వేగంగా పావులు... ►2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేగంగా పావులు కదిలాయి. డీఎఫ్ఓగా బెనర్జీని నియమించి సర్వే ద్వారా 111.03 ఎకరాల సంగతి తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, అటవీ, సర్వే శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి సరిహద్దులు తేల్చాలని 2016 డిసెంబరు 13న డీఎఫ్ఓ ఉత్తర్వులిచ్చారు. కేవలం వారంలో అంటే అదే నెల 21లోగా పూర్తి చేయించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్‌కు పంపారు. అక్కడి కొండలు, గుట్టల్లోని 858 ఎకరాల భూమిని కేవలం వారం వ్యవధిలో సర్వే ముగించడం పరిశీలనాంశం. ఆ సర్వేకి మూడు నెలలకు పైగా పడుతుందని సర్వే విభాగానికి చెందిన రిటైర్డు అధికారి ఒకరు సాక్షికి చెప్పారు. త్వరితగతిన సర్వేకి అప్పటి జిల్లా కలెక్టరు ఎ.బాబు తమపై ఒత్తిడి తెచ్చారని అటవీశాఖ అధికారి ఒకరు వివరించారు. ►తనకు అందిన రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల ఉమ్మడి సర్వే నివేదికను ‘డిజిటల్ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం’ ద్వారా నిర్ధారించాలని ఎ.బాబు తర్వాత వచ్చిన కలెక్టరు బి.లక్ష్మీకాంతంకు సీసీఎఫ్ పంపారు. రెవెన్యూ రికార్డుల పరంగా ‘ఓకే’ అంటూ స్వల్ప వ్యవధిలోనే... అంటే 2017 ఫిబ్రవరి పదో తేదీకల్లా సీసీఎఫ్‌కు కలెక్టరు తిప్పి పంపారు. ►ఈ సర్వేలోనూ స్పష్టత లేదంటూ సర్వే నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’ను అటవీశాఖ 2018 అక్టోబరులో కోరగా రెండున్నర నెలల్లోనే సీసీఎఫ్‌కు నివేదిక అందింది. సాధారణంగా ఏపీఎస్ఎసీ నుంచి అంత త్వరగా నివేదిక అందదని, దాని కోసం అప్పటి సీఎంవోలోని సీని యర్ ఐఏఎస్ తన పరపతి ఉపయోగించారని సమాచారం. ►ఇక్కడ కూడా సర్వే స్పష్టత లేనందున టియోడిలైట్ సర్వే లేదా కాంపాస్ సర్వే (ఉత్తర దిశ, తూర్పు దిశల ఆధారంగా కో–ఆర్డినేటర్స్ టెక్నాలజీతో నిర్వహించే సర్వే)కి నిర్ణయం జరిగింది. 2019 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 కల్లా ఈ సర్వే కూడా ముగిసింది. ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని కట్టబెట్టేందుకు అనుకూల నివేదికలివ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, ఇతర ప్రభుత్వ పెద్దలు అధికారులకు హుకుం జారీ చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ►సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్, కృష్ణా జిల్లా కలెక్టర్లు– అటవీ, సర్వే, రెవెన్యూ శాఖల అధికారులను పరుగులు పెట్టించారు. సీఎంఓలోనే ఈ అంశంపై పలు సమావేశాలు నిర్వహించారని ఓ అధికారి తెలిపారు. కాగా, ఈ ఎపిసోడ్‌ను పర్యవేక్షించిన అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారికి పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ బద్ధమైన పదవిని గత సర్కారు కట్టబెట్టడం పరిశీలనాంశం. -
ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే.. విగ్రహ ప్రతిష్ఠ..!
సాక్షి, ధారూరు: రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుడిసెను ఏర్పాటు చేసి అందులో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసిన సంఘటన ధారూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపి వివరాల ప్రకారం.. ధారూరు మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల పక్కన గల ప్రభుత్వ భూమిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె వేసి పైన ఓ జెండాను ఏర్పాటు చేసి దేవాలయంగా మార్చారు. అందు లో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే గుడిసె దేవాలయాన్ని చూ సి ఆశ్చర్యానికి గురైన స్థానికులు, ఉర్ధూ మీడియం పాఠశాల సిబ్బంది విషయాన్ని పోలీ సులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే ధారూరు సర్కిల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ స్నేహవర్షతో పాటు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్పంచ్ చంద్రమౌళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీఆర్ఓ గోపాల్ పంచనామా నిర్వహించి పోలీసులకు వివరాలు అందజేయగా ఆకతాయి వ్యక్తులు చేసిన పనిగా నిర్ధారించుకొని అందరి సమక్షంలో గుడిసెను, అందులోని రాయిని తొలగించారు. -
మున్సిపల్ స్థలంపై కన్ను!
సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. మున్సిపాలిటీగా అపగ్రేడ్ తర్వాత మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ అయినా ఇంతవరకు ఒక వెంచర్లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వివిధ సర్వే నంబర్లలో.. సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్ అసోషియేషన్‌కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్ మిల్లర్స్ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోషియేషన్‌కు కేటాయించారు. అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్‌రావ్ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్‌లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. స్థలాలు కేటాయించేది ఎవరు? పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి. ప్రజా అవసరాలు అక్కరల్లేదా? పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. -
‘మెడ్‌టెక్’లో భూముల పందేరం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ పేరిట ఏర్పాటు చేసిన ‘మెడ్‌టెక్ జోన్’ అక్రమాలకు ఆలవాలమైంది. దీనికోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆనుకుని కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని పందేరం చేసే కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ టెక్నాలజీ పార్క్(ఏఎంటీజెడ్–మెడ్‌టెక్ జోన్) పేరుతో జరుగుతున్న ఈ భూపందేరానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎవరికి పడితే వారికి పప్పులు, బెల్లానికి ఈ భూమిని కట్టబెడుతున్నారు. దాదాపు రూ.1,350 కోట్ల విలువ చేసే ఈ భూమిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు.. ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరిట తమకు కావాల్సిన వారికి అతి తక్కువ ధరకు లీజుకు అప్పగిస్తున్నారు. ఊరూపేరు లేని కంపెనీలకు, కనీసం టర్నోవర్ కూడా చూపించని వాటికి కట్టబెడుతున్నారు. తద్వారా భారీగా ముడుపులు దండుకుంటున్నారు. అతి తక్కువ ధరకు లీజుకు... విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అంటే ఆసియాలోనే పెద్ద పేరున్న పరిశ్రమ. దానికి పక్కనే 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం కనిష్టంగా రూ.5 కోట్లు విలువ ఉంది. తద్వారా మొత్తం భూమి రూ.1,350 కోట్ల విలువ చేస్తుంది. అలాంటి ఈ భూమిని ప్రభుత్వ పెద్దలు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరుతో తమకు కావాల్సిన వారికి ఎకరం రూ.పాతిక లక్షలకంటే తక్కువకే 33 ఏళ్ల లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ పరిశ్రమలు పెడతామని వచ్చిన కంపెనీలకు ఊరూపేరూ లేదు. ఎక్కడా టర్నోవర్ చూపించట్లేదు. అలాంటివాటితో సంప్రదింపులు జరిపి ఎంఓయూలు చేసుకోవడం, భూములు ఇచ్చేయడం ద్వారా భారీ ఎత్తున కమీషన్లు కొట్టేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఏఎస్ అధికారుల్ని సీఈవోలుగా నియమిస్తే అన్యాయాల్ని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఓ ముఖ్యనేత ఒక కన్సల్టెంట్‌ను సీఈఓగా నియమించి భారీస్థాయిలో దందా నడిపిస్తున్నారు. ఇది ఐఏఎస్ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.5 వేల కోట్లు పెట్టుబడులు.. 20 వేల ఉద్యోగాలు ఎక్కడ? రాష్ట్రంలో వైద్య ఉపకరణాల రేట్లు భారీగా ఉన్నాయని, అవి ఇక్కడే తయారైతే భారీగా రేట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు వల్ల రూ.5 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఆరు షెడ్లు మాత్రమే నిర్మించారు. ఏ ఒక్క కంపెనీ ఇప్పటివరకూ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. రూ.1,350 కోట్ల విలువైన భూమిని తీసుకుని కనీసం 13 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఏ కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టాయి, వాటికి ఎక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించారు అన్నదీ గోప్యంగా ఉంచారు. మెడ్‌టెక్ జోన్ నిర్మాణాలు చేసే బాధ్యత కూడా ఎలాంటి టెండర్లు పిలవకుండా పవర్‌మెక్ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక్కడ మెడికల్ డివైజెస్ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ఫలానా కంపెనీ పెట్టుబడి పెడుతోంది.. అది చెప్పినచోట కొనాలని షరతు పెట్టారు. ఉదాహరణకు ఒక హిమోగ్లోబిన్ మీటర్ రూ.1,500 వాస్తవ ధర అయితే, దాన్ని రూ.16,500కు ప్రభుత్వంతో కొనిపించారు. ఇలా అధిక ధరలు చెల్లించడంవల్ల రాష్ట్రంలో మూడున్నరేళ్లలో కనీసం రూ.150 కోట్లు అధికంగా చెల్లించినట్టు అంచనా. ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించి కావాల్సిన వైద్యపరికరాలన్నింటినీ 50 రెట్లు అధిక ధరలకు కొనిపిస్తున్నారు. టెండర్లన్నీ మెడ్‌టెక్ జోన్ సీఈవో తయారు చేయడం, ఏ కంపెనీకి రావాలో అందులోనే నిర్ణయించడం, పనులు ఇవ్వడం, చెప్పినచోట ఎక్కువ రేటుకైనా కొనిపించడం.. వెరసి ఖజానాకు భారీగా దెబ్బపడింది. తక్కువ ధరకు వచ్చే వైద్య పరికరాల్ని దగ్గరుండి ఎక్కువ ధరకు కొనిపించి కమీషన్లు కొట్టేసిన వైనం కళ్లముందే జరుగుతున్నా ముఖ్యనేత ప్రమేయం ఉండటంతో కిమ్మనకుండా అన్నీ జరిగిపోయాయి. లగడపాటిపై ఎందుకంత ప్రేమ? మెడ్‌టెక్ జోన్ నిర్మాణం పనులు 2016లో లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థకు అప్పజెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్‌ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది. అలాంటి సంస్థనే తెరమీదకు తెచ్చి పనులు కట్టబెట్టారు. వాస్తవానికి ఈ అభివృద్ధి పనులు డీపీఆర్ ప్రకారం రూ.708 కోట్లు ఉండగా.. అంచనాలు భారీగా పెంచి రూ.2,435 కోట్లు చేశారు. ల్యాంకోకు పనులు అప్పజెప్పడమేగాక రూ.43 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చారు. తర్వాత ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో ల్యాంకోకు పనులు రద్దుచేశారు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చిన నిధులను మాత్రం ల్యాంకో తిరిగివ్వలేదు. ఈ నిధులు రాబట్టడానికి ప్రభుత్వమూ కసరత్తు చేయలేదు. మెడ్‌టెక్ జోన్ పార్కులో మొదట్నుంచే అవినీతి పర్వం కొనసాగుతున్నదనేందుకు ఇది నిదర్శనం. -
సర్కారీ స్థలమనుకొని.. ప్రైవేట్ కట్టడం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని అధికారులు తొందరపడి ఓ స్థలంలోని కట్టడాన్ని కూల్చేశారు. తీరా విచారిస్తే అది ప్రైవేటు స్థలం. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈలోగా ఆ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాలక పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించామని తహసీల్దార్ కోర్టులో చెప్పారు. ప్రభుత్వ భూమిలోనే అక్రమ కట్టడాలు చేస్తున్నారనుకుని ఆ కట్టడాన్ని కూల్చేశానని రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) తప్పు ఒప్పుకోక తప్పలేదు. సొంత ఖర్చుతో కట్టడాన్ని నిర్మిస్తానన్నారు. కోర్టు చర్యలు తీసుకుంటుందని భయపడి కూల్చిన నిర్మాణాన్ని నిర్మిస్తామని కోర్టుకు ఆర్ఐ హామీ ఇచ్చారని నిర్మాణ సంస్థ అపనమ్మకం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ స్పందిస్తూ.. కోర్టు చర్యలు ఉంటాయని భయపడి నిర్మాణం చేస్తామని హామీ ఇస్తే సరిపోదని, కచ్చితంగా తిరిగి నిర్మించాలన్నారు. అక్రమ నిర్మాణం అనుకుని.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నం. 168/ పిలో ఎకరా 35 సెంట్ల భూమిలోని క్రీడా సముదాయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ డీసీఎస్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘సర్వే నం 1170 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం అనుకుని అధికారులు క్రీడా సముదాయాన్ని కూల్చేశారు. చట్ట ప్రకారం నిర్మాణాన్ని కూల్చేయడానికి అనుసరించాల్సిన నిబంధనల్ని అధికారులు తుంగలోకి తొక్కారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిం చారు. దీనిపై తహసీల్దార్ దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘సర్వే 1170లో నిర్మాణాలుంటే అడ్డుకోవాల ని ఆర్ఐ, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారీ భూములు అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే ఆదేశించాను. కూల్చివేత చర్యలు తీసుకోవాలని ఆదేశించలేదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలనే.. అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమి ని కాపాడాలని ప్రహరీతో పాటు క్రీడా సముదాయ నిర్మాణ గోడ కూల్చేశామని విడిగా దాఖలు చేసిన అఫిడవిట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) పేర్కొన్నారు. ‘అది ప్రభుత్వ స్థలం కాదని తర్వాత తెలిసింది. చట్ట వ్యతిరేకంగా చేసినట్లు నిర్ధారణ చేసుకున్నాను. కూల్చిన నిర్మాణాలను సొంత సొమ్ముతో పునః నిర్మాణం చేస్తాను’అని హామీ ఇచ్చారు. ఆర్ఐ హామీపై పిటిషనర్ న్యాయవాది అనుమానం లేవనెత్తగా న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు చర్యలు తప్పవనే ఆర్ఐ హామీ ఇచ్చినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తిరిగి నిర్మాణం చేయాలే గానీ భవనం విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. చట్ట ప్రకారం హద్దులు నిర్ణయించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. -
అత్త సొమ్ము..అల్లుడి దానం!
చీరాల : రొంపేరు భూములు ఏళ్ల తరబడి కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పైగా అవి తమ సొంత భూములన్నట్లు కొందరు ఇతరులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ మురుగు కాలువల్లో ప్రధానమైన రొంపేరు కుడి కాలువకు సంబంధించిన సుమారు 300 ఎకరాలు 125 మంది అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టా భూములతో పాటు రొయ్యల చెరువులు సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురైనా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూమి ఆక్రమించిన చాలామంది ఎకరాన్ని రూ.5 నుంచి 7 లక్షలకు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కాస్తా అక్రమార్కుల పరమవుతన్నాయి. కోట్లాది రూపాయలు విలువైన వందలాది ఎకరాల భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురైనా కాపాడాల్సిన అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు ఉంచిన భూములన్నీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. లంచాలకు కక్కుర్తి పడిన రెవెన్యూ యంత్రాంగం ఇతర శాఖలకు చెందిన భూమిని కూడా కొందరికి బి.ఫారాలు ఇచ్చి అక్రమార్కుల సరసన నిలబడింది. వివరాలు.. వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువ నిర్మించారు. వరదలు, ఇతర వ్యవసాయ మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తోంది. కబ్జా కోరల్లో 300 ఎకరాలు భవిష్యత్‌లో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 300 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు ఈ రొంపేరు కాలువ 35 కిలో మీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలు ఆక్రమించుకొని వరిసాగు చేస్తుండగా పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 100 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. కన్నెతి చూడని డ్రైనేజీ అధికారులు కళ్లెదుటే ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబం«ధించిన డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకొనేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. డ్రైనేజీ శాఖ భూములను ఆక్రమించుకొని ఉన్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పదేళ్ల క్రితం బి–ఫారాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇవి నకిలీవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బి–ఫారాలు ఇవ్వడం అక్రమం. అరకొరగా ఆధునికీకరణ రొంపేరు డ్రైన్లు ఆధునికీకరణకు గతంలో ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రైనేజీ శాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పని సరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు పలుకుతోంది. ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పైపెచ్చు తాము సాగు చేస్తున్నామని, భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకుపైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. చాలామంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన దర్జాగా అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం. -
చెంచుల భూముల్నీ చెరబట్టారు!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు, మైనింగ్ మాఫియా చివరకు.. రెక్కాడితే కానీ డొక్కాడని చెంచుల సాగు భూముల్నీ వదల్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో దౌర్జన్యంగా ఆ భూములను లాగేసుకుని అందులో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డు వస్తే చంపుతామని అమాయక గిరిజనాన్ని బెదిరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4.50 ఎకరాల్లో 12 అడుగుల లోతు తవ్వకాలు జరిపి కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయిని దోచుకున్నారు. అప్పటికీ ధన దాహం తీరకపోవడంతో మిగతా భూముల్లోకి సైతం చొరబడుతూ తవ్వకాలు జరుపుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ చెంచులు ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా వారి గోడు విన్ననాథుడే లేకుండా పోయారు. ఇటీవల అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అధికారులు ఆ భూముల్లో హడావుడిగా సర్వేలు నిర్వహిస్తున్న వైనాన్ని చూసి ఇప్పటికైనా తమ భూములను తమకు ఇప్పించాలని చెంచులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకునే భూములకు సంబంధించి వారికే పట్టాలు ఇవ్వాలంటూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జీవో జారీ అయ్యింది. ఆ జీవో ఆధారంగా కొండమోడు చెంచుకాలనీ వాసులు 18 మంది 36 ఎకరాల సాగు భూములకు పట్టాలు పొందారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను బాగుచేసుకుని పంటలు వేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు వారి చేతికందే సమయానికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు బుల్లి అబ్బాయి, అంజిబాబు, కోటి అనే వ్యక్తులు చెంచులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై చెంచులు స్థానిక తహసీల్దారు నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంతమందిని కలిసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులకు ఫిర్యాదులు చేయడం, ఆందోళనలకు దిగడం వంటివి చేస్తే మా ఎమ్మెల్యే ప్రస్తుతం సాగుచేసుకుంటున్న భూములు కూడా మీకు మిగలకుండా చేస్తారంటూ మైనింగ్ మాఫియా బెదిరింపులకు దిగడంతో ఆ అభాగ్యులు జీవనోపాధి కోల్పోయి కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి అక్రమ మైనింగ్‌ను నిలిపివేయించారు. ఇప్పటికైనా తమ భూములు తమకు దక్కేలా చూడాలని చెంచులు వారిని కోరుతున్నారు. అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తామన్నారు మాకు ప్రభుత్వం 2013లో పట్టాలు ఇచ్చింది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు అంజిబాబు, బుల్లి అబ్బాయిలు మా భూములు లాక్కొని అందులో క్వారీ కోసం తవ్వకాలు జరిపారు. ఇదేమని ప్రశ్నిస్తే.. అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపడానికి కూడా వెనుకాడమంటూ బెదిరింపులకు దిగారు. మా వద్ద నుంచి పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లాక్కున్నారు. – కందుకూరి చెంచుబాబు డబ్బులు తీసుకుని భూములిచ్చి ఉంటే ఏం చేయలేం కొండమోడు చెంచుకాలనీ వాసులు సాగు చేసుకునేందుకు గతంలో పట్టాలు ఇచ్చాం. వారిలో కొంతమంది పక్కనే మైనింగ్‌కు పాల్పడుతున్నవారి వద్ద డబ్బు తీసుకుని భూములు ఇచ్చేశారు. మిగతా వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. డబ్బు ఆశతో మైనింగ్‌కు భూములు ఇచ్చి ఉంటే మేము ఏమీ చేయలేం. – రవిబాబు, తహసీల్దారు, పిడుగురాళ్ళ ఎమ్మెల్యే తవ్వుకోమన్నారట.. మాకు పట్టాలు ఇచ్చిన భూముల్లో దౌర్జన్యంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే యరపతినేని తవ్వుకోమ న్నారని చెబుతున్నారు. మీరు ఏ అధికారికి చెప్పినా ఎవరూ పట్టించుకోరని కోటి అనే వ్యక్తి బెదిరించాడు. అతను చెప్పినట్టే ఎవరూ మమ్మ ల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను పొలం వదిలేసి కూలికి వెళుతున్నా. – చేవూరి అలివేలు వైఎస్ పెట్టిన భిక్షను లాగేశారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన జీవో ఆధారంగా మేము అప్పటి కలెక్టర్‌ను కలిశాం. ఆయన స్పందించి 18 మందికి 36 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. – వెంకటేశ్వర్లు, చెంచుకాలనీ పెద్ద -
ఆక్రమణల చెరవు
ఆయన రాజరిక కుటుంబం నుంచి వచ్చారు. అటు తరువాత ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ అర్హతలతోనే గాబోలు... ఏకంగా పాతిక ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి ఎంచక్కా చేపల చెరువు నిర్వహించేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో అది సర్కారు భూమేనని స్పష్టం చేస్తున్నా... అధికారులు సైతం దానిని పట్టించుకోలేదు. నిర్భయంగా చేపల చెరువుగా మార్చుకునేందుకు అనుమతులిచ్చేశారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. సాలూరు, టాస్క్‌ఫోర్స్ : జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో ఒక్కో నాయకుడి తీరు ఒక్కోలా ఉంది. ఎవరికి వారే తమ శక్తి కొలదీ అక్రమాలకు పాల్పడుతూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నా చలించట్లేదు సరికదా... తాము చేసింది తప్పుకాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ వ్యవహా రం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గిరిజ నుడిగా పేర్కొంటూ జీఓ జారీచేయడంతో గిరిజన సంఘాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంతో ఇష్టంగా పాచి పెంట మండలంలో సాగుచేస్తున్న చేపల చెరువులో 25 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమే ఉండటం ఇప్పుడు మరో వివాదానికి దారితీస్తోంది. అన్నదమ్ముల పేరున అనుమతి 2013 జూన్‌లో ఆర్.పి.భంజ్‌దేవ్‌తో పాటు ఆయన సోదరులు పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం, పణుకువలస రెవెన్యూ గ్రామాల పరిధి లోని భూముల్లో చేపల చెరువు నిర్మాణానికి మత్స్యశాఖ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ విశ్వనాథపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబరు 14–2లో 15ఎకరాల భూమి లో చేపల చెరువు నిర్మాణానికి, ఆయన సోదరుడైన జితేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ అదే సర్వే నంబ రు గల భూమిలో మరో 10ఎకరాల 46సెంట్లలో చేపల చెరువు తవ్వించుకునేందుకు దరఖాస్తు చేశారు. జూన్ 2015 నుంచి జూన్ 2021 వరకు చేపల సాగుకు అనుమతి లభించడంతో దాదాపు 40 ఎకరాల్లో చేపల చెరువు ప్రస్తుతం సాగుచేస్తున్నారు. అయితే వారు దరఖాస్తు చేపలసాగు చేస్తున్న చెరువులో 25 ఎకరాల 46సెంట్ల భూమి ప్రభుత్వానిది(ఇనాం భూమి)గా రెవెన్యూ వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో వుండడం విశేషం. అన్నింటా ఉల్లంఘనే... భంజ్‌దేవ్ చేపల చెరువు వ్యవహారానికి సంబం ధించి అన్నింటా నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమౌతోంది. సాధారణ భూమిని చేపల చెరువుగా మార్చాలంటే స్థానిక రెవెన్యూ డివిజినల్ అధికారి కన్వర్షన్‌కు అనుమతులివ్వాలి. సర్వే నం బరు 14–2లో మొత్తం 25ఎకరాల 46సెంట్ల ప్రభు త్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా చూపుతుంటే ఎలా అనుమతులిచ్చారన్నది ప్రశ్న. అంతేగాకుండా 2015లో అదే సర్వే నంబరుగల ప్రభుత్వ భూమిలో చేపల చెరువు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తయితే 2015లో ప్రభుత్వం జరిపిన రైతు రుణమాఫీ ద్వారా ఆ సర్వే నంబరుగల భూమితోపాటు ఇంకొంత భూమిపై రూ. లక్షా 50వేలు రుణమాఫీ జరిగింది. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు చెల్లించే సమయంలో రెవెన్యూ అధికారులు ఎందుకు అడ్డుకోలేదన్నది మరో ప్రశ్న. రెవెన్యూ రికార్డులు ఆన్లైన్ చేసినా..?: భంజ్‌దేవ్ 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేపల చెరువు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకున్నారన్నది రాజకీయ ప్రత్యర్థుల వాదన. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించిన నేపథ్యంలో 14–2 సర్వే నంబరుగల భూమి, ప్రభుత్వానిదేనని తేటతెల్లం చేస్తోంది. అదే నిజమైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చేపలచెరువును నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాచిపెంట రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమిలో భంజ్‌దేవ్ చేపలసాగు చేపడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడి ఉండొచ్చు మా కుటుంబ సభ్యులం ల్యాండ్ సీలింగ్ సమయంలో చాలా భూములు కోల్పోవలసి వచ్చింది. అలాంటి మాకు ప్రభుత్వభూమిని ఆక్రమించుకుని చేపలసాగు చేయాల్సిన అవసరం లేదు. ఆ భూమిని మా తాత, తండ్రుల కాలం నుండి సాగుచేస్తున్నాం. రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడివుంటే సరిచేయమని రెవెన్యూ అధికారులను కోరతాం. – ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్యే, సాలూరు కులాన్నే కాదు, పొలాన్నీ వదలం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల చెరువును నిర్మించుకున్నారు. వాటికి సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వే నంబరు 14–2 ప్రభుత్వభూమి. ఆ భూమి మరలా ప్రభుత్వానికి చెందేవరకు పోరాడుతాం. ఆయన కులం విషయంలో గిరిజనుడు కాకపోయినా ప్రభుత్వం అడ్డగోలుగా జీఓ జారీచేసింది. ఇప్పుడేమో పొలం విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తాం. – రేగు మహేశ్వరరావు, జనసేన నాయకుడు, న్యాయవాది. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగానే ఉంది సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్‌లో అలోక్నారాయణ్ పురుషోత్తమ్ భంజ్‌దేవ్ పేరుతో ఆ భూమి నమోదై ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. వెబ్‌ల్యాండ్‌లో తప్పు పడి ఉండవచ్చు. – కుప్పిలి నాగేశ్వరరావు, పాచిపెంట మండల ఇన్చార్జి తహసీల్దార్ -
టీడీపీ నేతలే భూకబ్జాదారులు
పీలేరు: పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, టీడీపీ నేతలే భూకబ్జాదారులని రాంజపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పీలేరు పట్టణం ఎర్రమరెడ్డిగుట్టలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలకు సైతం సెంటు స్థలం లేకుండా పీలేరు పట్టణానికి అన్ని వైపులా ఆక్రమణల పరంపర కొనసాగుతోందన్నారు. టీడీపీ నాయకులు అరకొర మిగిలిన వాగులు, వంకలు, చెరువులను కూడా ఆక్రమించి లేఔట్లు వేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణకు గురైన భూములన్నింటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచేస్తామన్నారు. భూఆక్రమణలపై కోర్టులో పోరాటం సాగిస్తామని తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆక్రమణదారులు ఎంతటి వారైనా, ఎవరినైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంపీపీ డి.హరిత, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, మండల పార్టీ కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు పులిచెర్ల(కల్లూరు): తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. కల్లూరులో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకోసం నాలుగేళ్లు మీనమేషాలు లెక్కిస్తూ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనడం ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. ఏప్రిల్ 5లోపు హోదాపై హామీ రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి పోరాటం సాగిస్తామన్నారు. అనంతరం కల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరులకు రూ.20 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన కమ్యూనిటీ హాలుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, ఎంపీ పి.మురళీధర్, మండల కన్వీనరు మురళీమోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాడు విక్రయానికి..నేడు లీజుకు!
చిలకలూరిపేట: గతంలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం విక్రయించేందుకు, ఇప్పుడు లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. చిలకలూరిపేటలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకున్నా వాటి నిర్మాణానికి ఆసక్తి చూపని అధికార యంత్రాంగం అమాత్యుల వారి మెప్పు కోసం విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీకి అప్పగించేందుకు హైరాన పడుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో నాగార్జున సాగర్ కెనాల్స్ సంస్థకు చెందిన భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకున్నా ఇప్పటికే ఒకసారి రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన నిర్వహించారు. గతేడాది ఆగస్టు 31న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించి, టేబుల్ అజెండాగా 20 సెంట్ల భూమిలో టీడీపీ కార్యాలయ భవనం నిర్మించుకొనేందుకు తగు చర్యలకై ఆమోదించారు. ఈ విషయమై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అప్పట్లోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అప్పట్లో స్థలాన్ని విక్రయించేందుకు తీర్మానం చేశారు. తిరిగి పం«థా మార్చి అదే స్థలాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించుకొనేందుకు లీజు చెల్లించే నిబంధనపై స్థలం అప్పగించేందుకు బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో చేర్చి ఆమోదించారు. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు డిసెంట్ నోటును అందజేశారు. న్యాయస్థానం నిర్మించేందుకు ఇవ్వాలని న్యాయవాదులు కోరిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా శంకుస్థాపన.. చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఎన్ఆర్టీ రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ డివిజనల్ కార్యాలయంతో పాటు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. ఈ భూమిలో సర్వేనంబర్ 123సీ–2ఈలో 20 సెంట్ల స్థలం టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ఇవ్వాలని తీర్మానించటం వివాదంగా మారింది. ఒక ప్రభుత్వ శాఖకు చెందిన స్థలాన్ని మరో శాఖకు మార్చాలన్నా ఇతర సంస్థలకు విక్రయించాలన్నా, లీజుకు కేటాయించాలన్నా ప్రభుత్వం తప్పనిసరిగా జీవో జారీ చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రతిపాదనల స్థాయిలోనే 2016 ఏప్రిల్ నెలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిబంధనలు కాదని ఏకంగా శంకుస్థాపన చేయటం అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది. టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించే ప్రతిపాదనలు తెలుసుకొన్న ఎన్ఎస్పీ కెనాల్స్ సిబ్బంది ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ 2016లోనే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం కూడా పంపారు. కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు ఇదే స్థలంలో బాలికల వసతి గృహం నిర్మించేందుకు నాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు 2003 నవంబర్ 14న శిలాఫలకం వేశారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. తదుపరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ టీటీడీ బోర్డు మెంబర్‌గా 2009లో ఆ స్థలం పక్కనే టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే ఆ తదుపరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రత్తిపాటి ఆ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. అనంతరం న్యాయస్థానం నిర్మాణానికి బార్ అసోసియేషన్ సభ్యులు ఈ స్థలం కేటాయించాలని కోరుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ సెంటు రూ. 25లక్షలకు పైబడి ఉంది. ఆ స్థలాన్ని టీడీపీ కార్యాలయ భవనం కోసం నామమాత్రపు ధరకు 20 సెంట్లు భూమిని లీజుకు కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆక్రమణల పర్వం
సాక్షి, ఒంగోలు: జిల్లాలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు రోజుకొకటి చొప్పున బయటపడుతున్నాయి. ముఖ్యంగా సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను నేతలు కబ్జా చేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. అర్హులైన పేదలకు మాత్రం సెంటు భూమి కూడా దక్కే పరిస్థితి లేకుండాపోయింది. సంతనూతలపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 16/ఏలో 12.12 ఎకరాలు, సర్వే నెం.12/బీలో 18.97 ఎకరాలు డొంక పోరంబోకు భూమి ఉంది. దానిలో 16/1ఏలో 2.72 ఎకరాలు, 12/బీ2లో 1.80 ఎకరాలు కలిపి మొత్తం 4.52 ఎకరాల డొంక పోరంబోకును 2017 నవంబర్ 16న ఆన్లైన్లో చీమకుర్తి తహశీల్దార్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్ చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఎక్కించారు. ఆన్‌లైన్‌లోకి ఎక్కించిన రోజునే సంతనూతలపాడు మండల తహశీల్దార్‌గా పి.నీలకంఠేశ్వరరావు నూతనంగా విధులలో చేరారు. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న చీమకుర్తి తహశీల్దార్ అశోక్‌వర్ధన్ సంతనూతలపాడులో ఛార్జి ఇచ్చి డిజిటల్ కీ ఇవ్వకుండా చీమకుర్తిలో భూమిని ఎక్కించినట్లు తెలుస్తోంది. డిజిటల్ కీని మాత్రం నవంబర్ 23న సంతనూతలపాడు తహశీల్దార్‌కు అప్పగించారు. ఇదే విషయాన్ని ఈ నెల 6న పి.గుడిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చట్టాన్ని ధిక్కరించి దందా.. దీంతో పాటు 16/1ఏలో 2.40 ఎకరాలు, 16/ఏ3లో 2.18 ఎకరాల డొంక పోరంబోకు భూమిని 2015 అక్టోబర్ 30న అప్పటి తహశీల్దార్ ఆర్.ప్రభాకర్‌రావు ఆన్లైన్లో ఎక్కించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ చట్టాలు ప్రకారం.. డొంక పోరంబోకు, వాగులు, కుంటలకు చెందిన భూములను కన్వర్షన్ చేయకుండా ఆన్లైన్లో ఎక్కించకూడదు. ఒక వేళ ఎక్కించాలంటే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్ రిపోర్ట్లు తీసుకొని దానిని ఆర్డీఓ ద్వారా కలెక్టర్ అనుమతి తీసుకుని మాత్రమే అనాధీనం (ఏడబ్లు్య) భూమిగా మార్చి ఎక్కించాలి. అసలు పోరంబోకు భూములను కలెక్టర్ సైతం కన్వర్షన్ చేయకూడదని మెమో నంబరు 865/ఎం1 తేదీ 1983లో ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. ఇన్ని చట్టాలు పోరంబోకు భూములకు రక్షణగా ఉంటే వాటిని కాపాడాల్సిన అధికారులే దగ్గరుండి బినామీల పేర్లుతో అడ్డగోలుగా భూములను అధికార ర్టీ నేతలకు ధారాదత్తం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డొంకపోరంబోకు భూమి సంతనూతలపాడు–చీమకుర్తి మధ్య కర్నూల్ రోడ్డు ఫేసింగ్‌లో ఉంది. రోడ్డు ఫేసింగ్‌లో అక్కడ ఎకరం భూమి రూ.2 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన ఈ కుంభకోణం విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుందని అంచనా. డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారి సైతం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. జరిగిన దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశాల మేరకు తహశీల్దారు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్రమించి.. ఆన్లైన్ చేశారు.. ఇటీవల పొదిలిలోనూ భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. పొదిలి పట్టణంలోనూ 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువును సైతం అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. ఏకంగా పట్టాలు పొంది ఆన్లైన్లో సైతం ఎక్కించారు. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉండవచ్చునని అంచనా. దీంతో పాటు పట్టణంలో పలు విలువైన స్థలాలను నేతలు ఆక్రమించి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన స్థలాలను అధికార పార్టీ నేత అమ్మినట్లు అధికార పక్షం నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూ ఆక్రమణలపై ఉన్నతాధికారుల విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ప్రజల్లో మార్పు రావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కోటికిపైగా జనాభా ఉన్న నగరంలో ప్రజలందరి భాగస్వామ్యం లేనిదే ఏ పనీ విజయవంతం కాదని, ప్రతి ఒక్కరూ మన నగరం అనుకునే భావనతో పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మహా నగరంలో నీటి సంరక్షణ కోసం త్వరలో ‘జలం– జీవం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. నీటికి ఇక్కట్లు లేకుండా ఉండాలంటే నీటి సంరక్షణ తప్పనిసరి అన్నారు. దీని కోసం ఆర్నెల్లపాటు ఈ అంశంపై అందరికీ అవగాహన కల్పించి, ఆ తర్వాత నీటి సంరక్షణ చర్యలు చేపట్టని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ మియాపూర్‌లో నిర్వహించిన ‘మన నగరం’కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... నగరంలో 300 చ.మీ.లు దాటిన భవనాలకు ఇంకుడు గుంతలు లేకుంటే ఓసీ ఇవ్వరాదని ఉన్నా అది అమలు కావడం లేదన్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా ఇంకుడు గుంతలు నిర్మించని భవన యజమానితోపాటు, సంబంధిత అధికారికీ జరిమానా విధిస్తామన్నారు. వంద అపార్ట్మెంట్లు దాటిన గేటెడ్ కమ్యూనిటీకి ఎస్టీపీ తప్పనిసరి అన్నారు. నీటిని సంరక్షించుకోకుంటే భవిష్యత్‌లో ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు. ఇంకుడు గుంతలపై ప్రజలను చైతన్యపరిచేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ.. గ్రేటర్లో కలసిన శివారు మునిసిపాలిటీల్లో రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీని సంవత్సర కాలంలో చేపడతామన్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజల్లో మార్పురానిదే పరిస్థితి మారదంటూ నాలాల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లను వేస్తుండటాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సర్కిల్లో ఆయా రంగాల్లో ఉత్తమంగా నిలిచిన ఉత్తమ కాలనీల ప్రతినిధులు, స్వచ్ఛ సేవలు అందించిన వారికి మంత్రి కేటీఆర్ పురస్కారాలు అందజేశారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మా ఇంటి నేస్తం’లో భాగంగా వీధి కుక్క పిల్లల దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడండి... సర్కిల్లోని పార్కు స్థలాలు కబ్జా అవుతున్నాయని, వాటిని కాపాడాలని మంత్రిని సర్కిల్ వాసులు కోరారు. శంకర్‌నగర్ కాలనీలో ఎంతో ప్రభుత్వ భూమి ఉందని, సర్వే చేయించి, ప్రజోపయోగార్థం వినియోగించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. తమ ఇబ్బందుల పరిష్కారానికి అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
రేపల్లెలో ’భూ’పాలుడు
-
ప్రభుత్వస్థలాన్నే కబ్జా చేశారు
-
ప్రభుత్వం ఆదేశిస్తే సేల్ డీడ్ రద్దు చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేరు మీద సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్ అయి ఉండి ఆ డీడ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం కోరినప్పుడు రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారులకు ఉందని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్రైవేటు వ్యక్తులకు ముందస్తు నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇలా సేల్ డీడ్ రద్దు చేయడంపై అభ్యంతరాలు ఉంటే సదరు ప్రైవేటు వ్యక్తులకు సివిల్ కోర్టులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉందని తెలిపింది. రాష్ట్రానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఇలాంటి వివాదాల్లో అనేక సాక్ష్యాలు అవసరం ఉంటాయని, వాటిని న్యాయ సమీక్ష ద్వారా ఉన్నత న్యాయ స్థానాలు తేల్చజాలవని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నందున, వాటిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పు నిచ్చారు. 2007లో రిజిస్టర్ అయిన సేల్ డీడ్‌ను 2017లో సంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1 రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వి.లక్ష్మీప్రసన్న, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్‌కు లేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదించారు. అది కూడా పదేళ్ల తర్వాత రద్దు చేయడానికి చట్టం ఒప్పుకోదని, అంతేకాక తమకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయని విన్నవించారు. ప్రభుత్వ న్యాయవాది ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. చట్ట నిబంధనల ప్రకారం ఇలాంటి వివాదాల్లో అభ్యంతరం ఉన్న వ్యక్తి సివిల్ కోర్టుకు వెళ్లవచ్చన్నారు. ప్రభుత్వం ఫలానా సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరినప్పుడు థర్డ్ పార్టీకి ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం అధీకృత అధికారి సేల్ డీడ్ రద్దు కోసం దరఖాస్తు సమర్పించినప్పుడు గతంలో ఆ భూమి రిజిస్ట్రేషన్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులందరికీ తెలియచేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. చట్ట నిబంధనల మేరకు డీడ్‌ను సమర్పించినప్పుడు దాన్ని తిరస్కరించే అధికారం రిజిస్ట్రేషన్ అధికారులకు లేదని తెలిపారు. -
భూమంత్రకాళీ
♦ చూడు జాగ..వేసెయ్ పాగా ♦ చిరమనలో 55 ఎకరాలకు పైగా భూమి హాంఫట్ ♦ మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైనే ♦ రెవెన్యూ అధికారులు, నాయకుల నిర్వాకం రెవెన్యూ అధికారులు.. నాయకులు ఏకమయ్యారు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో కట్టబెట్టేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం జారీ చేశారు. ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఆత్మకూరు రూరల్ : సెంటు భూమి కోసం పేదోళ్లు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందని.. అప్పటివరకు ఆగాలని కుంటిసాకులు చెబుతారు. నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. ఏఎస్ పేట మండలంలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చేసింది. ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడొకరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో 40ఎకరాలకు పైగా భూమిని.. అతడి శిష్యుడు చిరమన మజరా కన్నెదారి వారిపల్లెలో 14.73 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. బినామీ పేర్లతో భూములు పొందిన నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. చిరమన గ్రామంలోని సర్వే నంబర్ 878/3, 881లలో లేబూరు పరమేశ్వర్లు పేరుతో 4.69 ఎకరాలు, సర్వే నంబర్ 882లో వాయిలేటి వీరయ్య పేరుతో 4.36 ఎకరాలు, 883/1లో జులుమూడి రాధయ్య పేరుతో 5 ఎకరాలు, 882/2, 884లో నలగండ్ల సుందరయ్య పేరుతో 4.85 ఎకరాలు, 885/1లో వాయిలేటి రమణయ్య పేరుతో 4.16 ఎకరాలు, 885/2లో లేబూరి ప్రభాకర్ పేరుతో 4.76 ఎకరాలు, 879లో నాటకరాని వెంకటయ్య పేరుతో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 886/2లో 4 ఎకరాలు కలిపి 36.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని టీడీపీ నేత పొందారు. ఇదే గ్రా మంలో మరికొంత భూమిని కూడా కబ్జా చేశాడు. సర్వే నంబర్ 882లోని భూమిని తన కోడలు, సర్వే నంబర్ 885/1లో భూమిని తన కుమార్తె పేరిట ఇటీవల మార్పించుకున్నాడు. సదరు నాయకుడికి గ్రామంలో 50 ఎకరాలకు పైగా భూమి ఉండగా.. ప్రభుత్వ భూమిని సైతం హస్తగతం చేసుకున్నాడు. వాళ్లెవరో.. భూములు పొందిన బినామీదారులకు చిరమన గ్రామంతో అసలు సంబంధమే లేదు. వారికి గ్రామంలో ఓట్లు, రేషన్‌కార్డులు గాని లేవు. వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా ఎవరికీ తెలియదు. అయితే సదరు నేత తనకున్న రాజకీయ, ఆర్థిక బలంతో రెవెన్యూ అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కాజేశాడు. వాటికి హక్కులు పొంది అనుభవిస్తున్నాడు. ఐదేళ్లుగా ఆ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అదే బాటలో శిష్యుడు ఆ నాయకుడికి శిష్యుడైన మరో టీడీపీ నేత ఆయన అండదండలతో చిరమన పంచాయతీ పరిధిలోని కన్నెదారివారిపల్లెలో 14.73 ఎకరాలను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 1028/1లో దాసరి శ్రీరాములు పేరుతో 3.28 ఎకరాలు, 1028/2లో 11.45 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో పేరుతో కాజేశాడు. అయితే దాసరి శ్రీరాములు అనే వ్యక్తి ఆ గ్రామంలోనే లేడు. ఈ భూమిలో బోరు వేసుకున్న ఆయనకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. వివిధ పేర్లతో అనుభవదారులుగా సృష్టించుకుని సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆ భూములను టీడీపీ నాయకులిద్దరూ హస్తగతం చేసుకున్న వైనంపై జిల్లా కలెక్టర్‌కు, భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. -
కబ్జాలకు అడ్డేది..!
అనంతపురం న్యూసిటీ: మున్సిపల్ చట్టం 2005 ప్రకారం నగరపాలక సంస్థ ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు. వాటిని ఎవరూ కొనుగోలు చేయకూడదు. కానీ నగరంలో అధికార పార్టీ అండదండలతో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. రూ. కోట్లు విలువచేసే స్థలాలు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది నగరంలోని 32వ డివిజన్లోని హౌసింగ్‌బోర్డు ఎల్పీ నంబర్ 3/98కు సంబంధించి 20 సెంట్ల స్థలం. స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాడు. ఏనాడు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవు. ఈ స్థలం విలువ రూ.కోటి వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఈ చిత్రం ఆదర్శనగర్లోనిది. శాంతిసేన సహకార బంధువు అనే స్వచ్ఛంద సంస్థ...నగరపాలక సంస్థకు చెందిన 5 సెంట్లలో షెడ్డును ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ఈ స్థలం విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులే చెబుతున్నారు. నగరపాలక సంస్థలోని పాలకవర్గంలోని కొందరి నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేదనడానికి పై చిత్రమే ఓ ఉదాహరణ. 27వ డివిజన్ కార్పొరేటర్ సరిపూటి రమణ తన ఇంటి ముందున్న రోడ్డును ఆక్రమించాడు. అక్కడ ఏకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కార్యాలయంలో ప్రస్తుతం తన వాహనాలను పార్క్ చేస్తున్నాడు. -
‘గీత’ దాటి ఆక్రమణలు
పేదల ఇళ్లకు కేటాయించిన భూముల్లో.. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ ‘ముఖ్య’పెద్దల అండతో కబ్జాలు దర్జాగా సాగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో రుషికొండ వద్ద రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం సంస్థల అధినేత, సీఎం చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తి.. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములనూ వదల్లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని, దాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేయాలంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరడం, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం కావటం చకచకా జరిగిపోతోంది. విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీలో సర్కారు భూమి ఆక్రమణలే అధికమనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ గ్రామాల్లో రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం కాలేజీ చైర్మన్, ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తికి నామమాత్రపు ధరతో కట్టపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయాన్ని ‘సాక్షి’ ఇటీవలే పాఠకులకు తెలియజేసింది. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలకు గతంలో కేటాయించిన 15 ఎకరాలను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా సాక్షి వెలుగులోకి తెచ్చింది. అయితే ఈసారి రాజీవ్ స్వగృహ భూములపై ‘గీతం’ కన్ను పడింది. ప్రభుత్వ భూమిని పేదలు ఆక్రమిస్తే ఇచ్చేస్తారా? ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయటం, సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన భూమిని గీతం యూనివర్సిటీ పరం చేయటాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న గీతం వర్సిటీ సామాజిక సేవలేమీ అందించడం లేదని, అలాంటి సంస్థకు నామమాత్రపు ధరకు భూములు ఎందుకు అప్పగించాలని ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నామమాత్రపు ధరకు ఇవ్వాలని కోరితే ఇదే ప్రభుత్వ పెద్దలు ఇస్తారా? అని వ్యాఖ్యానిస్తున్నారు. భూములు కాపాడుకోవాలంటూ రాజీవ్ స్వగృహకు కలెక్టర్ లేఖ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం 2009లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములను కూడా గీతం యూనివర్సిటీ ఆక్రమించింది. అప్పట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు ప్రభుత్వం 7.61 ఎకరాలను కేటాయించింది. సుమారు వంద కోట్ల రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించడమే కాకుండా ఆ భూమిని తమకు కేటాయించాలంటూ గీతం వర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఎండాడలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన 7.61 ఎకరాలను గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిందని, ఇది ప్రభుత్వ భూమి అయినందున గీతం యూనివర్సిటీకి కేటాయించడం సాధ్యం కాదని గతంలో విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న యువరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాజీవ్ స్వగృహకు చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసి గీతం యూనివర్సిటీకి ఇవ్వడం సాధ్యం కాదంటూ కలెక్టర్ యువరాజ్ గత ఏడాదే భూమి పరిపాలన ప్రధాన కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని పరిరక్షించుకోవాల్సిందిగా కూడా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు యువరాజ్ సూచించారు. సర్వే నెంబర్ 16లో 1.95 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 5.66 ఎకరాలను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయిస్తూ 2009 ఫిబ్రవరి 20వ తేదీన జీవో 219 జారీ చేసినట్లు కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు. అయితే గీతం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఎలాగైనా ఆ భూమిని కాజేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసి ఆ భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని, త్వరలోనే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములను గీతం యూనివర్సిటీ పరం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇబ్రహీంపట్నంలోనూ ‘భూ’ ప్రకంపనలు
మంగళ్‌పల్లి, సాహెబ్‌గూడ భూములపైనా గోల్డ్‌స్టోన్ కన్ను - 700 ఎకరాల భూమిని కాజేసేందుకు పలువురి యత్నం - 22/ఎ సెక్షన్లో భూములున్నా.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు - సుమారు 40 ఎకరాల భూమి పీఓటీ కింద స్వాధీనం - 3 వేల ఎకరాల భూములపై చోటుచేసుకున్న వివాదం ఇబ్రహీంపట్నం: భూ ప్రకంపనలతో ఇబ్రహీంపట్నం దద్దరిల్లుతోంది. అక్రమంగా భూములను కాజేసే బాగోతంలో బడాబాబుల హస్తం ఉండటంతో అధికారులు సైతం గోల్డ్‌స్టోన్ కంపెనీ భూమాయపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా.. రంగారెడ్డి జిల్లా దండుమైలారం హఫీజ్‌పూర్‌లోని 2,200 ఎకరాల భూముల వ్యవహారంలోనే కాకుండా మంగళ్‌పల్లి గ్రామ పరిధిలో 600 ఎకరాలు, సాహెబ్‌గూడ గ్రామ పరిధిలో మరో 100 ఎకరాల భూములను స్వాహా చేసేందుకు పన్నాగం పన్నారు. గోల్డ్‌స్టోన్, దాని అనుబంధ సంస్థలే కాకుండా కొంతమంది వ్యక్తులు తాము నవాబుల వారసులమని.. జాగీర్దార్లమంటూ ఈ భూములు కాజేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. నిజాం వారసుల ద్వారా తమకు ఈ భూమి సంక్రమించిందని ప్రభుత్వ భూములను కాజేసే యత్నం జోరుగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 124 సర్వే నంబర్లో 172 ఎకరాల ప్రభుత్వ భూమి వుంది. ఇందులో దిల్ సంస్థకు 47 ఎకరాలు, ఏపీ హౌసింగ్ బోర్డుకు 12 ఎకరాలు, లాజిస్టిక్ పార్కుకు 20 ఎకరాలను గతంలోనే కేటాయించారు. సుమారు 70 ఎకరాల భూమి ని 50 మంది రైతులకు ప్రభుత్వం అసైన్ చేసింది. రెవెన్యూ నిబంధనల ప్రకారం 22/ఎ సెక్షన్ కింద ఉన్న ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయినప్పటికీ బడా నేతల ఒత్తిడి, అధికారుల కనుసన్నల్లో ఈ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ఇలా అసైన్ చేసిన భూమిని విక్రయించినందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ చట్టం 1971 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీఓటీ) కింద సుమారు 40 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఔటర్ రింగ్‌రోడ్ పక్కనే ఉన్న 8 ఎకరాల భూమిని నవాబుల వారసుల వద్ద నుంచి తాను కొనుగోలు చేశానని ఒక రియల్టర్ ఏకంగా ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన కబ్జాలో ఉంచుకున్నాడు. గోల్డ్ స్టోన్ కంపె నీతో సంబంధం ఉన్న కుటుంబీకులు 124 సర్వేనెంబర్‌లోని భూమి తమదేనని రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేగాక మంగళ్‌పల్లిలోని మరో 400 ఎకరాలు, సాహెబ్గూడలోని 100 ఎకరాలు అత్యున్నత న్యాయస్థానం తమకు డిక్రీ చేసిందని.. ఆ భూములను తమకు అప్పగించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఆయా భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు యత్నించారు. నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల భూ బాగోతాలు బట్టబయలు చేస్తున్న క్రమంలో ఎంతో విలువైన ఈ భూముల గుట్టు బయటపడుతోంది. ఈ భూములు అన్యాక్రాంతం కాకుం డా పాలకులు, ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాపై ఒత్తిళ్లు వచ్చాయి మంగళ్‌పల్లి, సాహెబ్‌గూడ, హఫీజ్‌పూర్ భూములపై తామే హక్కుదారులమం టూ మాపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చా రు. కానీ, అవి రికార్డుల్లో ప్రభుత్వ భూ ములుగా నమోదై ఉన్నాయి. నవా బుల ద్వారా తమకు ఈ భూములు సంక్రమిం చాయని పలువురు కార్యాలయానికి వచ్చి వాదనలకు దిగారు. సుమారు 3 వేల ఎకరాల భూములపై ఈ వివాదం చోటు చేసుకుంది. వెంకట్‌రెడ్డి, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం -
‘ఎనీవేర్’ మూల్యం వెయ్యి కోట్లపైనే
సర్కారు ఆదాయానికి భారీగా గండి - రాజధాని శివారుల్లో పెద్దఎత్తున అక్రమాలు - చక్రం తిప్పిన సబ్రిజిస్ట్రార్లు - వ్యవసాయేతర భూములు వ్యవసాయ భూములుగా నమోదు - ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బాగోతాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎనీవేర్ దందా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టడమే కాకుండా సర్కారు ఖజానాకు కూడా భారీగా గండి కొట్టింది. నాలుగేళ్లలో వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాగా.. సబ్ రిజిస్ట్రార్లు నిర్దేశిత విలువను తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీశారు. సాక్షాత్తు రాష్ట రాజధాని పరిధిలోనే సుమారు రూ.1000 కోట్లకుపైగా ఆదాయానికి నష్టం వాటిల్లగా, అందులో సుమారు 20 శాతం వరకు అక్రమార్కుల జేబుల్లో పడినట్లు తెలుస్తోంది. సబ్రిజిస్ట్రార్లు భూములు, స్థలాలు, మార్కెట్ విలువ తగ్గించడం, డాక్యుమెంట్ల వర్గీకరణలో మార్పులు, పాస్‌బుక్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం, నిర్మాణాలు ఉన్నా లేనట్లుగా పేర్కొనడంతో భారీగా స్టాంప్ డ్యూటీ నష్టపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారులోని కూకట్పల్లి, బాలానగర్, ఎల్బీనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, గండిపేట, శేరిలింగంపల్లి తదితర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వందల ఎకరాల వ్యవసాయేతర భూములను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం నగర శివారులోని కొన్ని నగర పంచాయతీలు, పంచాయతీ పరిధిల్లోని వ్యవసాయ భూములను ప్రభుత్వం వ్యవసాయేతర భూములుగా గుర్తించింది. ఫలితంగా ఐటీ కారిడార్ పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లలోని వందల ఎకరాల భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. కానీ సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర భూములను కూడా వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మచ్చుకు కొన్ని.. ► హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్‌లో గండిపేటశంకర్పల్లి రోడ్డు చెంత భూమి ఔటర్ రింగ్‌రోడ్‌కు సమీపంలో ఉండటంతో వ్యవసాయేతర భూమిగా నిర్ధారించారు. దీన్ని సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయ భూమిగా పేర్కొని అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబర్ 65/4లో 8 ఎకరాలు, 65/5లో 10 ఎకరాలు, 65/6లో 10 ఎకరాలు వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసి స్టాంప్ డ్యూటీ కింద 3.42 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తెలుసోంది. వాస్తవంగా నివాసయోగ్యమైన ఆ భూమి గజం ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా ఉంటుంది. రూ.3 వేల చొప్పున లెక్కిస్తే సగటున ఎకరం ధర రూ.1.44 కోట్ల వరకు ఉంటుంది. దానికి ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు లెక్కిస్తే రూ.8.44 లక్షల దాకా అవుతుంది. ఈ లెక్కన మొత్తం 28 ఎకరాలకు సగటున రూ.2.36 కోట్ల వరకు స్టాంప్ డ్యూటీ రాబట్టాల్సి ఉండగా.. కేవలం రూ.3.42 లక్షలతో సరిపుచ్చారు. ► శంషాబాద్‌లో సర్వే నంబర్ 745లో 11.36 ఎకరాల భూమిని ప్లాటింగ్ చేశారు. 103 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. అదే భూమి కొన్నేళ్ల తర్వాత వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున స్టాంప్ డ్యూటీకి గండి పడింది. ఎనీవేర్‌లో 80 % అక్రమాలే.. ఎనీవేర్ కింద నమోదైన దస్తావేజుల్లో సుమారు 80 శాతం వరకు ఏదో రకంగా అక్రమాలు జరిగి ఉండవచ్చని సంబంధిత అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల వరకు దస్తావేజులు నమోదు కాగా.. అందులో ఎనీవేర్ కింద నాలుగున్నర లక్షల వరకు నమోదైనట్లు తెలుస్తోంది. అందులో నగర పరిధిలోనే మొత్తం 13.26 లక్షల దస్తావేజులకుగాను ఎనీవేర్ కింద 2.41 లక్షలు నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. -
కబ్జాదారుకే కట్టబెడుతున్నారు
► సీఎం బామ్మర్ది బంధువు ఎంవీవీఎస్ మూర్తికి 55.24 ఎకరాల భూమి కారు చౌకగా కట్టబెట్టేందుకు కేబినెట్ రెడీ ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడంతో చట్టమూ చుట్టమైపోయింది.. అడిగిందే తడవుగా అంతా అనుకూలంగా చేసి పెట్టండని కనుసైగ చేశారు.. తప్పు తప్పన్న అధికారులే ఒప్పు అంటున్నారు.. నిబంధనలు నీరుగారిపోయాయి.. కబ్జా చేయడం ఇంత సులువా అన్నట్లు వ్యవహారం సాగిపోయింది.. తుదకు కంచే చేనును మేసింది.. జనమేమనుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా విలువల వలువలూడదీశారు.. దండుకోవడమే పరమావధిగా నీతి, నియమాలకు పాతరేశారు.. రాచరిక పాలనే లక్ష రెట్లు నయం అనిపిస్తున్నారు. సాక్షి, అమరావతి: అది నూటికి నూరు శాతం ప్రభుత్వ భూమి. ‘గీత’O దాటి దర్జాగా ఆక్రమించాడు. అధికారులు సర్వే నిర్వహించి కబ్జాకు గురైందని సర్కారుకు నివేదించారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు మిన్నకుండిపోయారు. దీంతో తన అవసరాలకు ఆ భూములు కేటాయించాలని కబ్జాదారుడు దరఖాస్తు చేశారు. మరోమాటకు తావు లేకుండా ఆ భూములు అతనికే ఇచ్చేయాలంటూ ఫైలు సిద్ధమై పోవడం విస్తుగొలుపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, గీతం కాలేజీ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు. విశాఖపట్నం జిల్లా యండాడ, రుషికొండ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 15పి, 16పి, 19పి, 20పి, 55పి, 61పి, 34, 35, 37, 38ల్లోని 55.24 ఎకరాలను 2013లో ఆక్రమించుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.1,000 కోట్లకు పైగానే పలుకుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆక్రమించుకున్న ఈ భూములను గీతం కాలేజీకి కేటాయించాలంటూ 2014లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా అధికారులు లొంగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నంలోని ఎంతో విలువైన ఈ భూమి ప్రభుత్వ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మూర్తికి కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయినా ఒత్తిడి పెరగడంతో ఏదో విధంగా ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో 2014లో ఎస్సీ హాస్టల్ కాలేజీ నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, బలహీన వర్గాల గృహ నిర్మాణం, శిక్షణ కేంద్రాలకు ఆరు ఎకరాలు, ఆదాయపు పన్ను శాఖ విభాగం కార్యాలయం, ఇళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కేంద్రం భవన నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్ విద్యార్థినుల రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఏడు ఎకరాలను కేటాయించారు. ఈ 35 ఎకరాల భూమిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ) కేటాయింపులకు అనుగుణంగా ఆయా సంస్థలకు అప్పగించలేదు. దీనిపై విశాఖపట్నానికి చెందిన ఒక పౌరుడు.. ఎంవీవీఎస్ మూర్తి 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అనుమతి లేకుండా నిర్మాణాలను చేపట్టారని జిల్లా కలెక్టర్, డీజీపీ, పోలీసు కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపి నిర్మాణాలను తొలగించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. భూ ఆక్రమణ నిజమే.. గీతం కాలేజీ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి.. ప్రభుత్వ భూమి 55.24 ఎకరాలను ఆక్రమించిన విషయం వాస్తవమేనని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ ధ్రువీకరించారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో సర్వే చేయించి కబ్జాను నిగ్గు తేల్చారు. యండాడ, బుషికొండలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను గూగుల్ మ్యాప్‌తో సహా ధృవీకరిస్తూ 2015 అక్టోబర్ 8వ తేదీన తహసీల్దార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్ గీతం కాలేజీ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కబ్జాను పట్టించుకోవడం లేదని మరో పౌరుడు గత ఏడాది డిసెంబర్లో జిల్లా కలెక్టర్‌కు, డీజీపీ, విశాఖపట్టణం సీఐడీ రీజినల్ కార్యాలయం అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అదనపు ఎస్పీ స్పందిస్తూ.. నేరుగా తమంతట తాము చర్యలు తీసుకోలేమని చెప్పారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేయాలని, అప్పుడు దర్యాప్తునకు ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరుణంలో ఈ భూ ఆక్రమణలపై జాయింట్ కలెక్టర్, తహసీల్దారు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలకు సంబంధించి సర్వే ల్యాండ్ రికార్డుల అదనపు డైరెక్టర్ రూపొందించిన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ పౌరుడు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. గీతం కాలేజీ ఆక్రమణలను నిర్ధారిస్తూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల అదనపు డైరెక్టర్ సమర్పించిన మ్యాప్‌ను గత ఏడాది డిసెంబర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం అతనికి అందజేసింది. ఆ భూములిచ్చేయాలంటూ కలెక్టర్ సిఫార్సు కబ్జా జరిగిందని ధ్రువీకరించినా ఆ భూములను వదులు కోవడానికి గీతం వర్సిటీ ససేమిరా అంటూ మళ్లీ చక్రం తిప్పింది. ప్రభుత్వ ముఖ్య నేత సూచన మేరకు గీతం కాలేజీ చైర్మన్.. ఆ భూములు తనకే కేటాయించాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సేవలో భాగంగా కాలేజీని నిర్వహిస్తున్నానని, నామమాత్రపు ధరకు 55.24 ఎకరాలను తనకు ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ దరఖాస్తుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గీతం కాలేజీ ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానిదేనని జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించినా, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా.. పట్టించుకోక పోవడం అటుంచి, నామమాత్రం ధరకు వారికే ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ సిఫార్సు చేయడం పట్ల అధికార యంత్రాంగం నివ్వెరపోతోంది. జిల్లా కలెక్టర్ సిఫార్సు ఆధారంగా ఆగమేఘాలపై రూ.1,000 కోట్ల విలువైన భూమిని ఎంవీఎస్ మూర్తికి చౌక ధరకు కట్టబెట్టేందుకు ఫైలు సిద్ధమైపోయింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలపాలని నిర్ణయించారు. -
కర్నూలు సబ్ రిజిస్రా్టర్పై చర్యలు తీసుకోండి
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి జేసీ రిపోర్టు కర్నూలు (అగ్రికల్చర్): ప్రభుత్వ భూమిగా గుర్తించి సెక్షన్ 22(ఎ)లో పెట్టి లావాదేవీని నిషేధించిన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన కర్నూలు సబ్ రిజిష్ట్రార్ మహబూబ్బాషాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు తెలిసింది. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 234/1,2,3,4లోని ప్లాట్లను ప్రభుత్వ భూములుగా గుర్తించి క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ భూముల జాబితా అనెగ్జర్ –2లో పెట్టింది. అయితే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ బాషా 21, 22 ప్లాట్లను 2015లో ఒకరి పేరుమీద, 2016లో మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించారు. ఈయన విచారణ జరిపి అక్రమాన్ని నిర్ధారించినట్లు సమాచారం. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
దొంగే.. దొంగా.. దొంగా అన్నట్టు..!
♦ ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్ల రుణం ♦ ఆపై సర్కార్ భూములు కాపాడాలని హడావుడి ♦ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి అధికారులకు విజ్ఞప్తి కూకట్పల్లి: ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్లు రుణంగా పొందిన ఓ ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా తానే ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపి బ్యాంక్ నుంచి కోట్లు రుణం పొందడమే కాకుండా.. ఆ ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యేతో కలిసి అధికారులను కోరడం గమనార్హం. బాలానగర్ మండల పరిధిలోని శంశీగూడ గ్రామ సర్వేనెం. 57లో 294 ఎకరాలు ఖాస్రా పహాణి ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉంది. అయితే సర్వే నెం.57/3/1 పేరుతో 9 వేల గజాల స్థలాన్ని శంశీగూడకు చెందిన జోగిపేట భాస్కర్ అనే వ్యక్తి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్రాంచిలో 30 డిసెంబర్ 2011లో తనఖా పెట్టి రూ. 10 కోట్లు రుణం పొందాడు. అయితే క్షేత్ర స్థాయిలో ఎలాంటి ప్రత్యేక బై నెంబర్లతో పట్టాభూమి లేకపోగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం 57/3/1 సర్వే నెంబర్ కూడా లేదని రెవెన్యూ అధికారులంటున్నారు. ద్విచక్ర వాహనానికి రుణం మంజూరుకు కూడా సరైన కాగితాలు లేవనే సాకుతో దరఖాస్తుదారుడిని వెనక్కి పంపే బ్యాంకు అధికారులు ఏకంగా ప్రభుత్వ భూమిని తనఖా పెట్టుకొని రూ. 10 కోట్ల రుణం మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కార్పొరేటర్ ఫిర్యాదుతో వెలుగులోకి... తాను చేసిన మోసాలు బయటకు పొక్కనీయకుండా వ్యవహారం చక్కబెట్టడంలో నేర్పరి అయిన భాస్కర్ ఏకంగా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25న స్థానిక కార్పొరేటర్ డి.వెంకటేశ్‌గౌడ్ శంశీగూడ గ్రామంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, బాలానగర్ మండల తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. సదరు వినతి పత్రంలో సర్వేనెం. 57లో బై నెంబర్ల పేరుతో కబ్జాచేయడమే కాకుండా బ్యాంకు నుంచి రుణం పొందిన భాస్కర్ మోసాన్ని బయటపెట్టారు. కాగా, మరుసటి రోజే ఎమ్మెల్యేతో కలిసి భాస్కర్ జాయింట్ కలెక్టర్‌ను కలువడం అనుమానాలకు తావిస్తోంది. ఉలిక్కి పడ్డ బ్యాంక్ అధికారులు ప్రభుత్వ భూమికి పదికోట్ల రుణం మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఐదేళ్లకు ఆలస్యంగా మేల్కొన్నారు. బుధ, గురువారాలలో బాలానగర్ మండల కార్యాలయంలో, శంశీగూడ గ్రామంలో సదరు రుణం మంజూరు చేసిన భూముల వివరాలను కనుక్కొనేందుకు యత్నించారు. రెవెన్యూ రికార్డుల్లో లేకపోగా క్షేత్ర స్థాయిలో చూపించిన ఫొటోలకు, భూములకు పొంతన లేకపోవడంతో ఆందోళనకు గురైనట్లు తెలిసింది. కాగా, ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ తన తప్పులు బయటికి రాకుండా చూసుకుంటున్న భాస్కర్‌పై గతంలోనే తహసీల్దార్ వనజాదేవి భూ కబ్జాకేసు నమోదు చేయడం గమనార్హం. -
భూకబ్జాకు భారీ స్కెచ్!
► నడింపాలెంలో ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను ► 2.40 ఎకరాలకు నకిలీ వ్యవసాయ అప్పగింత పట్టాలు ► రాజముద్ర (సీల్), స్టాంపులు అన్నీ నకిలీవేనని నిర్ధారణ ► తహశీల్దార్ సంతకం సైతం ఫోర్జరీ.. డీకే రిజిస్టరు మాయం ► సర్పంచ్ చొరవతో వెలుగులోకి వచ్చిన వైనం... ► పూర్తి విచారణకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు నడింపాలెంలో నకిలీ పట్టాల కుంభకోణం వెలుగుచూసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు నకిలీ పట్టాలను సృష్టించారు. ఏకంగా తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలతో ప్రభుత్వ భూమిని కాజేసే పన్నాగం పన్నారు. ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం నడింపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై 184 సర్వే నంబరులో 29.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ఆ భూమిని కాజేసేందుకు భారీ స్కెచ్ వేశారు. రికార్డుల్లో లేని సర్వే నంబర్లు సృష్టించి 2.40 ఎకరాల భూ దోపిడీకి పాల్పడ్డారు. 184-3-ఏ1ఏ సర్వే నంబరుతో నకిలీ సబ్‌డివిజను సృష్టించి 2015 ఫిబ్రవరి 16న ఒక్కొక్కరికీ 30 సెంట్లు చొప్పున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎనిమిది మంది పేర్లతో 2.40 ఎకరాలకు నకిలీ పట్టాలను (వ్యవసాయ అప్పగింత పట్టాలు) పుట్టించారు. సంతకాలు, స్టాంపులు, సీల్స్.. అన్నీ నకిలీవే.. నడింపాలెంలో వెలుగులోకి వచ్చిన నకిలీ పట్టాలను చూసిన రెవెన్యూ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. పట్టాలపై ఉన్న రాజముద్ర (సీల్), తహశీల్దార్ పేరుతో ఉన్న స్టాంపులు అన్నీ నకిలీవేనని తేల్చారు. వీటితో పాటు ఏకంగా తహశీల్దార్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీకే రిజిస్టర్ మాయం.. ఇదిలా ఉంటే గ్రామంలో ఎవరికైనా నివేశన స్థలాలు లేదా వ్యవసాయ భూముల పట్టాలు అప్పగించిన సమయంలో లబ్ధిదారుల పూర్తి వివరాలను డీకే రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నడింపాలెం గ్రామానికి సంబంధించిన డీకే రిజిస్టర్ మాయమైంది. నాలుగు రోజులుగా పట్టాల పంపిణీకి సంబంధించిన రిజిస్టర్ల కోసం వీఆర్వోలు వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది. దీంతో కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ దొంగ పట్టాలు ఎంత మందికి ఇచ్చారు? ఇచ్చిన వారు ఎవరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు కార్యాలయంలోనే అస్మదీయులు ఉన్నారా? అన్న అనుమానాలూ లేకపోలేదు. సర్పంచ్ చొరవతో వెలుగులోకి.. ఈ నకిలీ కుంభకోణం గ్రామ సర్పంచ్ నేలపాటి శౌరీలు చొరవతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు ప్రభుత్వభూమిలో కొందరు పొక్లెయినర్లు, ట్రాక్టర్లుతో భూమిని చదును చేయించడంతో గ్రామంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సర్పంచ్ శౌరీలు రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు తహశీల్దార్ పద్మావతిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి తహశీల్దార్ ఏసుబాబు (ప్రస్తుత దుర్గి తహశీల్దార్)ను కలిసి తనకు లభించిన నకిలీ పట్టాలను చూపించారు. దీంతో నిజం నిగ్గుతేలిపోయింది. పట్టాలను, పట్టాలపై ఉన్న సంతకాలు పరిశీలించిన దుర్గి తహశీల్దార్ ఏసుబాబు అవి తన సంతకాలు కావని, అసలు తన హయాంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు గానీ, డీకే పట్టాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ప్రత్తిపాడు తహశీల్దార్‌కు ఓ లేఖ రాశారు. తన సంతకాలను ఎవరో ఫోర్జరీ చేశారని, నిజాలను నిగ్గు తేల్చి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆ పట్టాలు నకిలీవే.. నడింపాలెంలో వెలుగు చూసిన వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు నకిలీవే. పట్టాలు పరిశీలించాను. అనుమానం వచ్చి అప్పటి తహశీల్దార్ ఏసుబాబుని అడిగాను. తన హయాంలో ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. దానికితోడు అందుకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు కూడా కార్యాలయంలో ఏమీలేవు. అందుచేత కచ్చితంగా అవి నకిలీ పట్టాలే. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాను. - పద్మావతి, తహశీల్దార్, ప్రత్తిపాడు మండలం. డీకే రిజిస్టర్ లేదు మా రికార్డుల్లో 184-3-ఏ1ఏ సర్వే నంబరు లేనేలేదు. ఇది నకిలీ సర్వే నంబరు. అయినా అసలు 2015లో పట్టాలు ఇచ్చినట్లుగా కార్యాలయంలో రికార్డులేమీ లేవు. నాలుగు రోజులుగా డీకే రిజిస్టర్ కోసం వెతుకుతున్నాం. కనిపించలేదు. అందుచేత ఇవి నకిలీవిగానే భావిస్తున్నాం. 184 సర్వే నంబరులో ఉన్న భూమి మాత్రం ప్రభుత్వ భూమే. - కె జీవనజ్యోతి, ఇన్చార్జి వీఆర్వో, నడింపాలెం గ్రామం. -
అది ఆక్రమణ భూమే..
* టీడీపీ నాయకుడు రవికుమార్ * సాక్షి కథనానికి వివరణ విజయనగరం కంటోన్మెంట్: శుభ రియల్ ఎస్టేట్‌లో ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయం తహశీల్దార్ స్పష్టం చేశారని గాజులరేగకు చెందిన టీడీపీ నాయకుడు నడిపిలి రవికుమార్ అన్నారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు’ కథనానికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుభ రియల్ఎస్టేట్ యజమాని పెంటపాటి సురేష్ ప్రభుత్వ భూమిలో నిర్మించిన ముఖద్వారాన్ని అధికారులు కూల్చేశారన్నారు. ఈ విషయమై గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. మాపై వీడియోలు, చిత్రాలు తీసి బెదిరించారని, దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. అసలు అతను ఏ పార్టీకి చెందిన వారు.. డిప్యూటీ సీఎం, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చేంతగా ఇతనిని ఎవరు రికమెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ద్వారపూడి, తదితర గ్రామాల్లో ఇళ్లు లేక పేదలు ఇబ్బంది పడుతుంటే ఈయన ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు గేదెల బంగార్రాజు, నారాయణరావు, కళ్లేపల్లి సూరిబాబు, తదితరులున్నారు. -
ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం, ముగ్గురి అరెస్టు
బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో రిటైర్డు సర్వేయర్ కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 13ఏలో టీఎస్ నంబర్ 3/1, బ్లాక్ -ఎస్, వార్డు 11, సర్వే నంబర్ 403లో ప్రభుత్వ స్థలం ఉంది. బుధవారం ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసి రిటైర్డ్ అయిన సర్వేయర్ ఎం.రామారావు, బహదూర్‌పురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఏ.రిఫీక్, ఎండి.సాదిక్ తదితరులు ఈ ప్రభుత్వ స్థలంలోకి వెళ్లి కొలతలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ చంద్రకళ సిబ్బందితో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్లి మీరెవరంటూ ప్రశ్నించారు. ఇక్కడ 925 గజాల ప్లాట్ ఉందని, దీన్ని తాము ఖరీదు చేశామని వారు తెలిపారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు. అయితే, ఈ స్థలం పక్కాగా ప్రభుత్వానిదని రికార్డులున్నాయని, ఈ ప్లాట్‌కు సంబంధించిన సర్వే నంబర్ వారిచ్చిన రికార్డుల ప్రకారం ఇక్కడ లేదంటూ తహ సీల్దార్ స్పష్టం చేశారు. అయితే, ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ వారు వాగ్వాదానికి దిగగా వెంటనే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో రామారావు, రఫీక్, ఎండీ సాదిక్‌లను అరెస్టు చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ప్రవేశించటం, తవ్వకాలు చేపట్టటం, స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించటం, బోగస్ డాక్యుమెంట్లను సృష్టించటంపై తహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని తహసీల్దార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల హైరానా
► కలకలం సృష్టిస్తున్న ‘భూంఫట్’ కథనం ► రక్షించాలంటూ ముఖ్యనేత కుమారుడిని ► వేడుకుంటున్న ఆక్రమణదారులు ► అజ్ఞాతంలోకి వీఆర్వోలు.. తప్పుదోవ ► పట్టించేందుకు యత్నాలు సాక్షి, కర్నూలు: ప్రభుత్వ భూమిలో పాగా వేసిన తెలుగు తమ్ముళ్లు.. తీరా ఆ విషయం వెలుగులోకి రావడంతో.. రక్షించాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ పెద్దాయన కుమారుడిని ఆశ్రయించినట్లు సమాచారం. బుధవారం ‘భూంఫట్.. పత్తికొండలో రియల్ దందా’ పేరిట ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా(పత్తికొండలో) టీడీపీ వర్గీయుల్లో ప్రకంపనలు సృష్టించడంతో చేసేదేమీ లేక ముఖ్యనేత కుమారుడిని శరణువేడుకొన్నట్లు తెలుస్తోంది. ఉదయమే ఆయన పీఏతో టీడీపీ కార్యాలయంలో సమావేశమై భూ ఆక్రమణ విషయమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. భూ ఆక్రమణలకు పాల్పడింది టీడీపీ నేతలే కావడంతో వారిని రక్షించేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే ఏకంగా రికార్డులను తారుమారు చేసేందుకైనా సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఒకవైపు ఈ తప్పు తమమీద పడకుండా చూస్తూనే.. మరోవైపు సదరు టీడీపీ నేతను సైతం రక్షించేలా పావులు కదుపుతున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం 16 సెంట్ల ప్రభుత్వ భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని ఓ రెవెన్యూ అధికారి బాహాటంగా చేస్తున్న ప్రచారంపై వాదనకు బలాన్ని చేకూరుస్తోందనే చెప్పాలి. అజ్ఞాతంలోకి వీఆర్వోలు సాక్షి’లో వచ్చిన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు కూడా దృష్టి సారి ంచారు. ఆఘమేఘాలపై స్థానిక తహసీల్దార్‌ను పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించడంతో బుధవారం ఉదయమే ఆ కార్యాలయంలో హడావుడి కనిపించింది. ఆర్డీఓ కూడా రానున్నట్లు సమాచారం ఉండటంతో.. ఈ వ్యవహారంలో సహకరించిన తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది భయాందోళనతోనే విధులు నిర్వర్తించారు. పత్తికొండ ప్రాంతంలో 15 ఏళ్లుగా పాతుకుపోయిన ఇద్దరు వీఆర్వోలు బుధవారం ఉద యం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ‘సాక్షి’ కథనంపై స మగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు రావడంతో వీరిద్దరూ అందుబాటులో లే కుండా పోయారు. విచారణలో తమ స్వామి భక్తి ఎక్కడ బయటపడుతోందన్న ఆందోళనతోనే వారు విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. -
‘అటవీ శాఖ’ సమస్యలు పరిష్కారం
► త్వరలో రిక్రూట్మెంట్ చేపడుతాం ► హరితహారానికి గ్రామ స్థాయి ఇబ్బందులపై ఆరా ► ప్రతి జీపీకి 40 వేల మొక్కలు నాటడమే లక్ష్యం ► అటవీ అధికారులు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం ► అటవీశాఖ మంత్రి జోగు రామన్న సమీక్ష ఆదిలాబాద్‌అర్బన్ : అటవీ శాఖలో అంతర సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను తొలగించి పథకాల అమలును పటిష్టం చేస్తామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారాన్ని మరో విడత చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారంతో పాటు శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ చేపడుతామని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట అటవీ శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పథకాల అమలు పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్‌వో గోపాల్‌రావు అటవీ శాఖ పరిస్థితులు, చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 145 మంది అధికారులు సిబ్బంది పని చేయాల్సి ఉండగా, 119 మంది విధులు నిర్వర్తిస్తున్నారని, మిగతా 26 పోస్టులుగా ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం మానస పుత్రిక అయినా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటడం టార్గెట్ ఉందని, ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా విధించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలన్నారు. అటవీ శాఖలో త్వరలో రిక్రూట్మెంట్ ఉంటుందన్నారు. సమావేశంలో భాగంగా తునికి ఆకు సేకరణ పథకం పోస్టర్లను అవిష్కరించారు. ఇందులో ప్రభుత్వ భూమిలో నుంచి సేకరించిన యాభై ఆకుల కట్టకు రూ.1.25, పట్టా భూముల నుంచి సేకరించిన ఒక కట్టకు రూ.1.33 ధర ఉంది. కార్యక్రమంలో నిజామాబాద్ సోషల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆనంద్ మోహన్, ఆదిలాబాద్ డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీట్, అసిస్టెంట్ బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
స్వార్థానికి నేలకొరిగి..
ప్రభుత్వభూముల్లో భారీ వృక్షాల్ని కూలగొడుతున్న అక్రమార్కులు మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం పిఠాపురం : ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలబడే సైన్యమది. భారీ వరదలను సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఆ వృక్షాలు.. అక్రమార్కుల ధనదాహానికి మాత్రం నేలకొరుగుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ తదితర శాఖలకు చెందిన భూముల్లోని వృక్షాలను స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు నీటి పారుదల శాఖ పరిధిలో భారీ వృక్షాలను కొద్ది రోజులుగా కొల్లగొడుతున్నారు. ఎలా జరుగుతోందంటే.. పంట కాలువల గట్లు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా, పోరంబోకు భూముల్లో ఉన్న చెట్లను అక్రమార్కులు గుర్తిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా వాటిని నరికేస్తున్నారు. ఎవరైనా అడిగితే.. రోడ్డు విస్తరణ, కాలువల అభివృద్ధి కోసం తొలగిస్తున్నట్టు నమ్మిస్తున్నారు. నెల రోజులుగా ఏలేరు కాలువకు ఇరువైపులా ఉన్న 38 భారీ వృక్షాలను కూలగొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటిని కొన్ని సామిల్లులకు తరలించి, విక్రయిస్తున్నట్టు తెలిసింది. కొందరు వ్యాపారులు కాలువ పక్కనున్న పొలాల్లో చెట్లను కొనుగోలు చేసి, పనిలోపనిగా కాలువ గట్లపై ఉన్న చెట్లను నరికేస్తున్నారు. చెట్టు నరికాక ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువగా రాత్రివేళ చెట్లు నరుకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం పూటే చెట్ల మొదళ్ల వద్ద శుభ్రం చేసుకుంటున్నారు. గట్లకు తూట్లు చెట్లను కొట్టవేయడం ద్వారా అక్రమార్కులు.. పంటకాలువల గట్లుకు తూట్లు పొడుస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనపడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మొదలు నరికేందుకు గట్లను తవ్వేస్తుండడంతో.. నీటి ఉధృతికి గట్లు తెగిపోవడం ఖాయమని అంటున్నారు. పట్టించుకోని అధికారులు ఇటీవల పిఠాపురం-ఉప్పాడ, పిఠాపురం-సామర్లకోట ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా ఉన్న అనేక వృక్షాలను కొందరు అక్రమంగా తరలించుకుపోయారు. పిఠాపురం-ఉప్పాడ రోడ్డులో ఇరిగేషన్ శాఖకు చెందిన పంటకాలువలకు ఇరువైపులా ఉన్న చెట్లను పట్టపగలే నరికి, తరలించుకుపోయినా అధికారులు పట్టించుకోలేదు. కిర్లంపూడి నుంచి పిఠాపురం వరకు ఉన్న ఏలేరు కాలువకు ఇరువైపులా మామిడి, చింత, సుబాబుల్, జీడిమామిడి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిలో అత్యంత భారీ వృక్షాలను నెల రోజులుగా కూల్చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెట్ల నరికివేతపై అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. విచారణ జరిపిస్తాం ఏలేరు, పీబీసీ కాలువ గట్లపై చెట్లను నరికేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. సొంత భూముల్లో ఉన్న చెట్లను రైతులే నరుకుతున్నట్టు భావిస్తున్నాం. కాలువగట్లపై చెట్లను కూల్చడం నేరం. దీనిపై విచారణ జరిపిస్తాం. చెట్ల నరికివేతకు ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేవు. చెట్ల తొలగింపులో అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణ నిజం కాదు. - కృష్ణారావు, ఇరిగేషన్ డీఈ, ఏలేరు సెక్షన్ -
సీఆర్డీఏకు 12,598 ఎకరాలు
-
సీఆర్డీఏకు 12,598 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)కు 12,598.42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని రాష్ట్ర సర్కారు తాజాగా నిర్ణయించింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం.. సీఆర్డీఏకు ముందస్తుగా అప్పగించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూసమీకరణ పథకం కింద ఈ భూమిని అప్పగిస్తున్నతట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రాజధానికోసం సీఆర్డీఏ భూసమీకరణ కింద 33,500 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించిన విషయం తెలిసిందే. తాజాగా 12,598.42 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింతతో ఇప్పటివరకూ రాజధాని భూసమీకరణ కింద సేకరించిన భూమి 46,098.42 ఎకరాలకు చేరినట్లయింది. మరో 2,200 ఎకరాల్ని భూసేకరణ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ఆలోచిస్తోంది. ఇదిలా ఉండగా రాజధానికోసం మరో 45 వేల ఎకరాల అటవీభూమిని డీనోటిఫై చేయించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో రాజధానికోసం సమీకరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూమి తమొత్తం 91 వేల ఎకరాలు దాటిపోనుంది. దీనికి అదనంగా మరికొన్ని వేల ఎకరాల దేవాదాయ, గ్రామకంఠం భూములను కూడా సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. దీనితో రాజధానికోసం సమీకరించే భూమి లక్ష ఎకరాలు దాటుతుందని అంచనా. -
దేవాదయ శాఖ అధికారులపై దాడి
-
దేవాదయ శాఖ అధికారులపై దాడి
పెదకాకాని: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ముగ్గురు ప్రభుత్వ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెద్ద కాకాని వద్ద గురువారం చోటు చేసుకుంది. పెద్ద కాకానిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 9 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో (సుమారూ ఎకరం) రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదయ శాఖ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో ఈరోజు ఆలయ ప్రాంగణానికి దేవాదయ అధికారులు వచ్చారనే సమాచారంతో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగి వారి పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
జవహర్‌నగర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో వెలసిన అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లను, నిర్మాణాలను సోమవారం సాయంత్రం శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా దేవుజా మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో చాలా మంది తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, గ్రామంలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రత్నిస్తున్నారన్నారు. 30 ఏళ్ల క్రితం పట్టాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ లేఅవుట్ తయారు చేస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో చాలా మంది నకిలీ డాక్యుమెంట్లతో పేదప్రజలను మోసం చేస్తున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్ఐ రాజు తదితరులు ఉన్నారు. -
మేత భూమినీ మేసేశారు
పశువుల మేత పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టినా...గుట్టుచప్పుడు కాకుండా దున్నేసి ఏకంగా పంటలు సాగుచేస్తున్నారు. వెలిగండ్ల మండలంలోనే దాదాపు 200 ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. - యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ - 200 ఎకరాలు కబ్జా - హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆగని దందా వెలిగండ్ల : ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పొక్లెయిన్లు పెట్టి భూములను బాగుచేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు. పైర్లు సాగు చేస్తున్నారు. మండలంలోని బొంతగుంట్ల, ఇమ్మడిచెరువు, పద్మాపురం, రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణ దారులు దర్జాగా భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. ఒక ఊరి పొలాలను వేరొక ఊరు వాళ్లు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇరు గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్లు 65, 66,69, 77,70,59/16, 59/18, 59/2, 58, 20,19/2, 42 నంబర్లలో 704.42 ఎకరాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం పశువుల మేత గ్రేజింగ్ పోరంబోకు భూమిగా ఉంది. ఆ భూముల్లో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమించుకున్న భూముల్లోని 9 సర్వేనెంబర్లలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో 18 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు ఎంపీపీ ముక్కు జయరామిరెడ్డి గతంలో పనిచేసిన తహ శీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో దండోరా వేయించి పనులు ఆపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి పనులు చేస్తుండటంతో ఎంపీపీ తహ శీల్దార్ పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. పనులు ఆపి, బోర్డులు ఏర్పాటు చేయాలని తహ శీల్దార్ వీఆర్వోను ఆదేశించారు. కానీ ఆ భూమిలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. పద్మాపురంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 13,14,15లో 40 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములు కబ్జా అయ్యాయి. ఇకనైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టాం బొంతగుంట్లలో ఆక్రమణలకు గురైన పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వీఆర్వోను ఆదేశించాను. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాను. -వి.పుల్లారావు, తహశీల్దార్ -
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న వరహాలగడ్డను ఆక్రమించుకున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయడు, టీడీపీ నాయకుడు అయిన బొంగు జోగినాయుడుతోపాటు మర్రాపు నారాయణస్వామిలను అరెస్ట్ చేసినట్టు మంగళవారం సాయంత్రం ఎస్ఐ బి.అశోక్‌కుమార్ తెలిపారు. వరహాలగడ్డ ఆక్రమణలను 'సాక్షి' దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అధికారులు స్పందించినట్టే స్పందించి చర్యల విషయంలో వెనక్కి తగ్గడంతో... కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిట్ ఏర్పాటుకు త్వరలో జీవో
దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు సంబంధించి నాలుగు రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గురువారం విలేకరులకు తెలిపారు. నిట్ ఏర్పాటుకు 172 ఎకరాల స్థలం అవసరం కాగలదని, తాజాగా ఇక్కడ పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు కోరారన్నారు. ఆ మేరకు 172 ఎకరాల భూమి వివరాలను కేంద్రానికి పంపించామన్నారు. రైతుల వద్ద నుంచి భూమి తీసుకోకుండానే ప్రభుత్వ భూమిలో నిట్ ఏర్పాటవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నిట్ కావడంతో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ జీవో విడుదల చేయాల్సి ఉందన్నారు. వచ్చే బుధవారం జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నిట్‌కు సంబంధించి డాక్యుమెంటేషన్, ఫీజులు తదితర వ్యవహారాలన్నీ వరంగల్ నిట్ ద్వారా ప్రస్తుతం జరుగుతాయన్నారు. నిట్ తాత్కాలిక తరగతులు వాసవిలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని, వసతిని వాసవి ఇంజినీరింగ్ కళాశాల పూర్తిగా ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. అది అవగాహన లేని అభిప్రాయం గోదావరి పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రభుత్వం తనకు ప్రాధాన్యతనివ్వలేదన్న విషయం వాస్తవం కాదని, కొందరు అవగాహన లేకుండా అలా అభిప్రాయపడ్డారని మంత్రి అన్నారు. పుష్కరాలు సంతృప్తికరంగా సాగాయన్నారు. పుష్కరాల సమయంలో జరిగిన మూడు ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై దర్యాప్తు చురుగ్గా సాగుతుందన్నారు. పుష్కరాల సమయంలో ఒక పొగబాంబు పేలిందని, దీని తర్వాత రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, రాజమండ్రిలోనే అగ్నిప్రమాదం జరిగి సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడం వంటి సంఘటనలు వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నామని, సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు రైల్వే అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్నారు. గూడెం రైల్వేస్టేషన్లో 1వ నెంబరు ప్లాట్‌ఫారంపై ఉన్న ఎఫ్‌సీఐ గోదాములను తొలగించి ప్లాట్ఫారం విస్తరించడం, ప్రస్తుతం ఉన్న గూడ్స్‌షెడ్‌ను నవాబ్‌పాలెం తరలించి, ఆ ప్రాంతంలో నాల్గవ నెంబరు ప్లాట్ఫారం, టిక్కెట్ కౌంటర్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని మంత్రి చెప్పారు. నియామకాలపై బ్యాన్ తొలగగానే వివిధ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏపీఐఐసీ భూములపై ‘పచ్చ’ డేగలు
సీఎం సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. భూ కబ్జాల పరంపరను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, చెరువులనే కాదు.. శ్రీకాళహస్తి మండలంలో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి అప్పగించిన భూములనూ వదలలేదు. జేసీబీ పెట్టి చదును చేస్తున్నారు. గట్లు వేసి దున్నకాలకు సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. - సువూరు 40 ఎకరాల ఆక్రవుణ - ఆక్రమిత భూమి విలువ రూ.6 కోట్లకు పైమాటే - సూత్రధారి ఓ వీఆర్వో! శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు గ్రామం ఉంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని 178, 185 బ్లాక్‌లో 225 ఎరకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా ఇనగలూరు రెవెన్యూ పరిధిలో 181వ బ్లాక్‌లో 165 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై వెలంపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయుకుడు కన్నుపడింది. బ్లాక్ నంబర్ 178లో దామరాకుల గుంట నుంచి మామిడిగుంటకు వెళ్లే దారిలో 20 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 20 ఎకరాలు ఆక్రమించేశాడు. జేసీబీతో చదును చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆక్రమిత భూమి విలవ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలసినా ఖాతరు చేయులేదు. వారం రోజుల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు. రెవెన్యూ అధికారి అండతోనే! టీడీపీ నాయకుడు ఆక్రమించిన భూమికి సమీపంలోనే మన్నవరం పరిశ్రమ ఉంది. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడి భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆ టీడీపీ నాయకుడు పావులు కదిపాడు. ఓ వీఆర్వోని బుట్టలో వేసుకుని తమ పని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఆక్రమిత భూమిని సాగు భూమిలాగ మార్చివేస్తే అనుభవం కింద వస్తుందని ఆ రెవెన్యూ అధికారి ఆ ‘పచ్చ’డేగకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ లోపు రియుల్ వ్యాపారులు వస్తే వారికి విక్రరుంచడమో లేపోతే ఏపీఐఐసీ వాళ్లు వస్తే అనుభవంలో ఉంది కాబట్టి ఎకరాకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించమని డివూండ్ చేయువచ్చని ఆ అధికారి టీడీపీ నాయకుడికి చెప్పినట్లు సమాచారం. -
రైతులతో ప్రభుత్వం దోబూచులాట
తాడికొండ : రాజధాని నిర్మాణానికి నయానో భయానో 33,347 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న ప్రభుత్వం వారితో దోబూచులాడుతోంది. కౌలు చెల్లింపుపై తాత్సారం చేస్తోంది. జనవరి 1 నుంచి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణ చేట్టిన ప్రభుత్వం నేటికీ ఏ భూములు ఏ విభాగానికి చెందినవన్న స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచలేదు. భూములు సమీకరణకు ఇచ్చిన రైతులు పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. అసలేం జరిగిందంటే... 1916-20 మధ్య రాజధాని ప్రాంతంలోని నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, కృష్ణాయిపాలెం, వెంకటపాలెం, మండదం గ్రామాల్లోని మాజీ సైనికులకు, పేదలకు 1400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరిలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఇతరులకు విక్రయించుకోగా, మిగిలిన వారు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగళ్లు పొంది సాగు చేసుకుంటున్నారు. భూసమీకరణను ప్రకటించటంతో వీరంతా 9.3 అంగీకార పత్రాలు ఇచ్చారు. వీరిలో కొందరికి ప్రభుత్వం కౌలు డీడీలు కూడా పంపిణీ చేసింది. అసైన్డ్, అటవీ భూముల్ని తీసుకుంటే కౌలు పరిహారం తగ్గుతుందని రైతులకు చెప్పకుండా గోప్యంగా ఉంచింది. అంతకు ముందు ఇచ్చిన డీడీలు ఇచ్చి వేయాలంటూ ఈనెల 2,3 తేదీల్లో పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు పెట్టింది. అయితే, అసలు 6 తేదీ భూమి పూజకు ఎక్కడ వ్యతిరేకత వస్తోందని కొందరు టీడీపీ నేతలు బోర్డులో ఉన్న పత్రాల్ని తొలగించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కౌలు పరిహారం అందకుంటే సేద్యానికి వెళతాం.. తమకు కౌలు పరిహారం అందించకుంటే తప్పకుండా సేద్యానికి వెళతామని మంగళవారం మందడంలో నిర్వహించిన రైతు సమావేశంలో రైతులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు విన్నవించారు. తమకు సాగు లేక కౌలు పరిహారం లేకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించారు. ఈ సమస్యను 2011 జనవరిలో మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన చంద్రబాబుతో చెప్పగా.. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రస్తుతం ఇలా చేయటం సరికాదని నీరుకొండ గ్రామానికి చెందిన రైతు నరేంద్ర సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే కౌలు పరిహారం చెల్లించాలని, లేదంటే తమ భూములు సేద్యం చేసుకుంటామని హెచ్చిరించారు. -
ప్రభుత్వ స్థలం కబ్జా
-
సర్కారు స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించం
- జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి పరిగి: ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తేల్చిచెప్పారు. గురువారం ఆమె పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆహారభద్రత కార్డులు, రుణమాఫీ పత్రాలు, ఆధార్‌సీడింగ్ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించారు. పరిగిలో వ్యవసాయశాఖకు సంబంధించి ఒకటి, సివిల్సప్లైకి సంబంధించి మరొక గోదాంను ప్రభుత్వం నిర్మించాలనుకుంటోందని, వీటికోసం ప్రభుత్వ భూమిని పరిశీలించాలని తహసీల్దార్‌కు సూచించారు. వాటర్ గ్రిడ్ కోసం.. జాపర్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 8లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ కోసం 25 ఎకరాల భూమి అవసరమున్నందున ఆ భూమి కేటాయింపు సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ అధికారులతో ఆమె చర్చించారు. అనంతరం జేసీ పరిగి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి వెనకాల పెండింగులో ఉన్న ప్రహరీ నిర్మాణం, మార్చురీ గది అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొండాపూర్ శివారులోని సోలార్ పవర్‌ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని కలుపుకొన్నారనే ఆరోపణపై ఆమె నివేదిక కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పై రెండు అంశాలకు సంబంధించి సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ మహేష్, వీఆర్ఓలు జహంగీర్, నారాయణ, పాపయ్య తదితరులున్నారు. -
మళ్లీ సర్వే
ఏ,బీ,సీ కేటగిరీల్లో పరిశ్రమలకు అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు వీలున్నంత త్వరగా టీఎస్‌ఐడీసీకి అప్పగించే కసరత్తు అసైన్డ్ చేసిన భూములపై కూడా రీ సర్వే ఉపయోగంలో లేకుంటే ప్రభుత్వ స్వాధీనంలోకి ఇప్పటికే దిల్ సంస్థకిచ్చిన 529 ఎకరాలు యాదాద్రి అథారిటీకి మరో మిగిలిన 1000 ఎకరాలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనికి? సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను మళ్లీ సర్వే చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. గతంలో నిర్వహించిన భూముల సర్వేకు అదనంగా ఈసారి పారిశ్రామిక వర్గాలకు అనువైన భూములను కేటగిరీలుగా విభజించాలని, గతంలో వివిధ సంస్థలకు, వ్యక్తులకు అసైన్ చేసిన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను రీసర్వే చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వే చేపడుతున్నట్టు తెలిసింది. ఈ సర్వేలో భాగంగా అసైన్ చేసిన భూములు ఉపయోగంలో లేకుండా మళ్లీ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)కిచ్చిన భూముల్లో ఉపయోగంలో లేని వాటిని యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వగా, మరికొన్ని భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు సర్వే పూర్తయిన తర్వాత జిల్లాలోని నిరుపయోగ అసైన్డ్భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్టు సమాచారం. ఇటీవలే సర్వే జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వే ఇటీవలే పూర్తయింది. దామరచర్లలో ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్‌ప్లాంటుకు సంబంధించిన భూములకు సంబంధించి అటవీభూములకు పరిహారంగా ప్రభుత్వ భూములు ఇవ్వాలన్న ఆలోచనతో జిల్లాలోని ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఏ రెవెన్యూ డివిజన్లో ఎన్ని ప్రభుత్వ భూములన్నాయనే అంశాలతో నివేదిక కూడా పంపారు. అయితే, ఈ సర్వేలో జిల్లాలో మొత్తం 1.29లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని తేలగా, అందులో 3,720 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనుకూలమని తేల్చారు. ఈ భూములను వర్గీకరించేందుకు గాను మళ్లీ సర్వే చేయనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నేరుగా ఉపయోగపడే భూములను ‘ఏ’ కేటగిరీలో, కొంత అనువుగా ఉన్న భూములను ‘బీ’ కేటగిరీలో, మరికొంత ప్రతికూలంగా ఉన్న భూములను ‘సీ’ కేటగిరీలో, పూర్తిగా రాళ్లు, రప్పలతో ఉన్న భూములను ‘డీ’ కేటగిరీలుగా విభజించనున్నారు. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు సులభతరంగా భూములివ్వవచ్చని, అనువుగా లేని చోట్ల రాయితీలతో ఆకర్షించవచ్చనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ మేరకు సర్వే చేస్తున్నామని, సర్వే పూర్తికాగానే నివేదికను ప్రభుత్వానికి పంపుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. ఉపయోగంలో లేకుండా స్వాధీనంలోనికి జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు 1958 నుంచి ప్రభుత్వ భూములను అసైన్ చేస్తూ వస్తున్నారు. ఈ భూములను సాగు చేసుకుని నిరుపేదలు ఉపాధి పొందాలన్నది అసైన్మెంట్ లక్ష్యం. అయితే, ఈ భూముల్లో వేల ఎకరాలు సాగు కావడం లేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు వ్యవసాయేతర భూములను కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలకు కేటాయించారు. ఈ భూములను కేటాయించిన సమయంలో ఆయా కంపెనీలు, సంస్థలు చెప్పిన కారణాల మేరకు ఆ భూములను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా భూములన్నింటినీ రీసర్వే చేయనున్నారు. ఇప్పటికే దిల్కిచ్చిన 529 ఎకరాలను గుట్ట డెవలప్మెంట్ అథారిటీకివ్వగా, మరో 1000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా వివిధ సంస్థలు, ఏజెన్సీలకిచ్చిన మరో మూడువేల ఎకరాల భూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. -
టీడీపీ నేత.. భూ మేత
సర్కారు భూమి కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. గ్రామ కఠం, దేవుని మాన్యం. పోరంబోకు, పశువుల మేత స్థలం, శ్మశానమైనా సరే కాదేదీ ఆక్రమణలకు అనర్హమంటూ పాగా వేసేస్తున్నారు. అధికార దాహంతో ఊగిపోతున్న కబ్జాదారులతో మనకెందుకనుకుంటూ అడ్డుకోవల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహించడంతో పరిసరాలన్నీ తమవేననే అహంకారంతో రంకెలేస్తున్నారు. వందల ఎకరాలను పొక్లైన్లతో చదును చేసి ఏకంగా పంట భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నా అడ్డుకునే నాధుడే కానరావడం లేదు. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ విజయకుమార్ ఇచ్చిన ఆదేశమూ నత్తనడకన నడుస్తోంది. పీసీపల్లి: అధికారం మనదే ... ప్రభుత్వం భూములూ మనవే అన్న చందంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. కబ్జా చేసి కౌలుకు ఇచ్చేసి సాగు చేసేస్తున్నా సంబంధితాధికారులు చేష్టలుడిగి చూస్తుండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత పది రోజులుగా మండలంలోని చినవరిమడుగులో దాదాపుగా 145 ఎకరాలను టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జేసీబీలు పెట్టి వాగు పోరంబోకు, పశువుల పోరంబోకును ఆక్రమించేస్తున్నాడు. దేవుడి మాన్యమైనా మాదే... ఒక్క పంచాయతీలోనే దాదాపు 200 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఆక్రమణపాలైందంటే మండ లం మొత్తం ఎన్ని వందల ఎకరాలు కబ్జాకు గురైందో సమగ్ర దర్యాప్తు చేస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. మండలంలోని మురుగమ్మి, గుంటుపల్లి, శంకరాపురం, పీసీపల్లి, పెదయిర్లపాడు, విఠలాపురం, లక్ష్మక్కపల్లి, అలవలపాడు తదితర గ్రామాల్లో ప్రభుత్వ బంజర, దేవుడు మాన్యం, అటవీ పోరంబోకు భూములపై కూడా కన్నేశారు. ప్రధాన నేతే మేత మేస్తున్నప్పుడు ఇక మేమెందుకు వెనుకడుగు వేయాలనుకున్నారేమో చోటా,మోటా నాయకులు కూడా కబ్జాకు సమాయత్తమవుతున్నారు. ఇంత జరగుతున్నా తమది కాదన్నట్లు రెవెన్యూ శాఖ వ్యవహరించడపట్ల గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్ ఆదేశంతో పరిశీలించిన సబ్‌కలెక్టర్ పర్యటన రద్దు కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోనని పలువురు భావిస్తున్నారు. పిచ్చుకులపై బ్రహ్మాస్త్రాలు... బతుకు తెరువు కోసం ప్రభుత్వ భూములు ఆక్రమించిన పేదలపై కొరడా ఝళిపిస్తున్న రెవెన్యూ యంత్రాంగం బడా బాబులు జోలికి ఎందుకు పోవడం లేదంటూ పరిసర ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రంగా స్పందించి ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి సెంటు భూమి లేని నిరుపేదలకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 145 ఎకరాలు పైమాటే... చినవరిమడుగు, జంగాలపల్లి, మురుగమ్మిలోని సర్వే నెం 14, 15,16,17 ,70,75,77, 90,148,161,151,153,154,171, 172, 173,174,175లో ఉన్న 145 ఎకరాలను తన సొంత భూమిలా ఐదు జేసీబీలు పెట్టి పది రోజుల నుంచి చదును చేసే కార్యక్రమానికి దిగాడు. 70 ఎకరాల్లోనూ... పెదవరిమడుగు, పశువులపోరంబోకు, డొంక పోరంబోకును కూడా వదలడం లేదు. సర్వే నెం-199,200,201,202, 203,189, 190, 185,182,158,153,93ల్లో ఉన్న దాదాపు 70 ఎకరాలు కూడా మూడు నెలలుగా ఆక్రమించి సాగు చేసి కంది పొగాకులను వేశారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది గత నెల 17వ తేదీన ఒంగోలులో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ విజయకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్, సబ్‌కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. -
'కేసీఆర్ నిన్ను వదలా'
పేదవారికి డబుల్ బెడ్ రూం కట్టించి ఇచ్చే వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే, బీసీ వెల్పేర్ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మితే ఊరుకోబోమని కృష్ణయ్య అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ వెల్పేర్ అసోసియేషన్ జాతీయ సదస్సు సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో వారు కులాంతర వివాహాలను ప్రోత్సహించినప్పుడే దేశం అగ్ర రాజ్యంగా ఉంటుందన్నారు. -
అధికారం మనదే.. వేసేయ్ పాగా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విలువైన ప్రభుత్వ స్థలాలపై టీడీపీ నేతల కన్నుపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములను ఆక్రమించుకుని సొమ్ముచేసుకుంటున్నారు. పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వటానికి రకరకాల నిబంధనల పేరుతో వెనక్కు పంపే రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతలకు మాత్రం రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట పట్టణంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విషయం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఒక్కొక్కటిగా పెద్దల పాలిట కల్పతరువుగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిపోవటంతో జాతీయ రహదారి పక్కన ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అలాగే సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 23 లేఅవుట్లు వెలిశాయి. ఒకటి రెండు లేఅవుట్లు మినహా మిగిలిన లేవుట్లలో 25 శాతం పట్టా భూమి ఉంటే.. మిగిలిన 70 శాతం ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొందరు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలిసింది. సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానం ఎదురుగా కొందరు రియల్టర్లు సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి కొత్తగా లేవుట్ వేశారు. రియల్ వ్యాపారం కోసం భారీ ఎత్తున గ్రావెల్ తోలి చదును చేశారు. రియల్టర్లు వేసిన వెంచర్లో అర ఎకరాకుపైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నంబర్ 59-16లో 4 సెంట్లు, 59-17లో 13 సెంట్లు, 59-18లో 44 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ 61 సెంట్లు ప్రభుత్వభూమి జీఎన్టీ రోడ్డును అనుకుని ఉంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ రూ.9.15 కోట్లు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రియల్టర్లు అంకణం రూ.2.50 లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు వేసిన లేవుట్ వద్ద రోడ్డుకు అటువైపు కాళంగి నది.. ఇటువైపు పొర్లకట్టు ఉంది. జీఓ నంబర్ 168 ప్రకారం ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉండటం గమనార్హం. దోబీఘాట్ స్థలమూ ఆక్రమణ ఇందిరానగర్ సమీపంలో సర్వే నంబర్ 57-1 రజకులకు 1.04 ఎకరాల్లో దోబీఘాట్ నిర్మించి ఇచ్చారు. అది కూడా ఆక్రమార్కుల చెరలో ఉందని సమాచారం. దీని విలువ కూడా కోట్ల రూపాయలు చేస్తుంది. సూళ్లూరుపేట పరిధిలో విలువైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన ఈ భూమిని స్వాధీనం చేసుకుని షాపింగ్ కాఫ్లెంక్స్ నిర్మాణం చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ ఇరకం మునిలక్ష్మీని వివరణ కోరగా మూడు సర్వేనంబర్లులో 61 సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్న విషయం వాస్తమేనన్నారు. సర్వేయర్ అందుబాటులో లేరని, త్వరలో సర్వేచేసి జెండాలు నాటిస్తానని చెప్పారు. అదేవిధంగా మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి సుజాతను వివరణ కోరగా ఆ లేఅవుట్లో పొర్లకట్టకు వంద అడుగుల దూరం తర్వాత భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామన్నారు. పొర్లకట్ట అంచున భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. -
ఖద్దరు నేతల సిండికేట్
రాజకీయ పార్టీల అండదండలు.. అధికారుల సహకారం కబ్జాదారులు ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ పత్రాలు సృష్టించడం.. ఆపై దర్జాగా పాగా వేయడం.. అనంతరం వెంచర్ల పేరిట వీటిని విక్రయించడం జరిగిపోతోంది. ఎవరైనా అడ్డు చెబితే బెదిరింపులకు పాల్పడటం పరిపాటి గా మారుతోంది. - మెదక్ టౌన్ పట్టణ శివారులో మెదక్ - రామాయంపేట ప్రధాన రహదారి పక్కన 1983లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలను నిర్మించారు. ఎంతో ఘన చరిత్ర గల బాలికల గురుకుల పాఠశాల భూమికే ఎసరు పెట్టారు భూ బకాసురులు. రెవెన్యూ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ తదితర కార్యాలయాల అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొంతమంది సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. గురుకుల పాఠశాలకు సంబంధించి పట్టణ శివారులోని సర్వే నంబర్ 248/1లో 23.10 ఎకరాలు, 246/2లో 1.22 ఎకరాలు, 248/312లో 1.37 ఎకరాలు, 248/492లో 3.11 ఎకరాలు మొత్తం కలిసి 28.8 ఎకరాల భూమి ఉన్నట్లు పాఠశాల రికార్డులున్నాయి. అయితే ఇందులో నుంచి వెలుగు పాఠశాలకు సర్వేనంబర్ 248/1లో 10 ఎకరాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలకు 248/1లో ఒక ఎకర స్థలాన్ని కేటాయించారు. బాలికల గురుకుల పాఠశాల క్యాంపస్ కోసం సర్వే నంబర్ 248/1లో 12.05 ఎకరాలు, మరో సర్వే నంబర్లోని ఐదు ఎకరాల స్థలాన్ని గురుకుల బాలికల పాఠశాల నిర్మాణాలకు ఇచ్చా రు. కాగా మిగిలిన ఖాళీ స్థలంలో మొద ట ఐదెకరాలపై కబ్జాదారుల కన్ను పడింది. విద్యార్థుల తాగునీటి కోసం పాఠశాలకు చెందిన స్థలంలో వేసిన బోరు మోటార్‌ను సైతం పగులగొట్టి ఆక్రమణదారులు కడీలు పాతి వెంచర్‌కు సిద్ధం చేశారు. సిండికేట్ దోపిడీ మెదక్ పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల ఖద్దరు నేతలు ఒక సిండికేట్‌గా ఏర్పడి భూ బాగోతాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి అధికారుల అండదండలు తోడవ్వడంతో వీరి ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. మెదక్ పట్టణంలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, వెంచర్లు, కబ్జాలన్నీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గురుకుల బాలికల పాఠశాలకు కేటాయించిన భూమిలో సుమారు ఐదు ఎకరాల వరకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ సంగారెడ్డిలో కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో పై విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రభుత్వ భూమిలో బోగస్ లబ్ధిదారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అక్రమాలకు కేంద్రబిందువైన జిల్లా రెవెన్యూ శాఖలో మరో భూబాగోతం వెలుగుచూసింది. ఏకంగా నాలుగున్నర కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో బోగస్ లబ్ధిదారులు తిష్టవేశారు. భూపంపిణీలో భాగంగా తమకు ప్రభుత్వం భూమిని కట్టబెట్టిందంటూ.. ఏకంగా భూమి రికార్డుల్లో కీలకమైన పహాణీ ఖాతాలో చేరిపోయారు. వారివద్ద ఎలాంటి పాసుపుస్తకాలు లేనప్పటికీ అసలైన అర్హులుగా చలామణి అవుతున్నారు. స్థానిక రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అండదండలతో ఏకంగా రుణమాఫీకి సైతం అర్హత సాధించారు. చివరి నిమిషంలో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రుణమాఫీ జాబితానుంచి తొలగించినప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 189 లో 179.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని 1968 నుంచి 1993 సంవత్సరాల మధ్య కాలంలో నాగన్‌పల్లి గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చట్టం కింద పంపిణీ చేశారు. అప్పట్లో వంద మంది వరకు లబ్ధిదారులుండగా.. ప్రస్తుతం సీను మారింది. తాజాగా లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 150 మందికిపైగా లబ్ధిదారులున్నట్లు రెవెన్యూ అధికారుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈమేరకు భూమి పహాణీ రికార్డుల్లో ఈ సంఖ్య స్పష్టమవుతోంది. 2010 సంవత్సరానికి పూర్వం రికార్డుల్లో లేని పేర్లు.. తాజా పహాణీల్లో ప్రత్యక్షమవడం గమనార్హం. సర్వే నంబర్లు పెంచేస్తూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లావణీపట్టా రూపంలో పంపిణీ చేసిన భూమిలో లబ్ధిదారులు కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. యంత్రాంగం అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు చేసే అధికారం ఉండదు. కనీసం ఈ భూమికి సంబంధించి సర్వే నంబర్లు సైతం మార్చడం అంతసులువు కాదు. కానీ నాగన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిలో భారీగా మార్పులు జరిగాయి. 2009 వరకు లేని సర్వే నంబర్లు.. ప్రస్తుత రికార్డులో చొరబడ్డాయి. పహాణీ రికార్డు ప్రకారం నాగన్‌పల్లిలోని 189 సర్వే నంబర్లో చివరి లబ్ధిదారుడి పేరిట 189/127గా ఉంది. 2010 సంవత్సరం అనంతరం పహాణీ రికార్డులు పరిశీలిస్తే సర్వే నంబర్లు భారీగా పెరిగాయి. పెరిగిన సర్వే నంబర్లలో ఉన్న లబ్ధిదారుల పేర్లన్నీ కొత్తవి కావడం గమనార్హం. సూత్రధారులు.. పాత్రధారులు.. రెవెన్యూ రికార్డుల్లో కొత్త సర్వే నంబర్లు, లబ్ధిదారుల పేర్లు రావడంలో స్థానిక రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నాగన్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) సంస్థ ఏర్పాటుకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో భూమి కోల్పోయిన ఒక్కో లబ్ధిదారుడికి ఎకరాకు కనిష్టంగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. అదేవిధంగా బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) సంస్థకు సైతం భూములు నోటిఫై చేశారు. ఈ క్రమంలో 189 సర్వే నంబర్లోనూ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు అందుకోవడంతో ఓ రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం వస్తుందని నమ్మబలికి భారీగా వసూళ్లుచేసి కొత్తగా లబ్ధిదారుల పేర్లు సృష్టించారు. వారికి పట్టా సర్టిఫికెట్లు సైతం ఇచ్చినట్లు సమాచారం. రికార్డులో ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా పరిశీలిస్తే దాదాపు 45 ఎకరాల భూమిని కొత్తవారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి కనిష్టంగా రూ.10లక్షలు పలుకుతోంది. ఈ క్రమంలో అక్రమాలు జరిగిన భూమికి సంబంధించి దాదాపు రూ.4.5 కోట్లు ఉన్నట్లు అంచనా. రుణమాఫీ ప్రక్రియలోనూ గందరగోళం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ప్రక్రియతో పలువురు బోగస్ లబ్ధిదారుల పేర్లు బయటకొచ్చాయి. అక్రమాలకు ఆజ్యంపోసిన అధికారి.. ఏకంగా బోగస్ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సైతం ఇప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించిన సమయంలో పలువురు గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తొమ్మిది మంది పేర్లు బోగస్‌గా గ్రామస్తులు తేల్చడంతో వారిని రుణమాఫీ జాబితా నుంచి తొలగించారు. -
స్టోన్ క్రషర్ సీజ్
సాక్షి ప్రతినిధి, కడప: తన ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ తీయాలనేదే ఆయన ఏకైక లక్ష్యం. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అధికారం అండతో తెరవెనుక మంత్రాంగం నడిపి పై చేయి సాధించారు. ఆయనే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఆ క్రషర్ సీజ్ చేయాల్సిందే. సీజ్ చేయకపోతే సహించేది లేదు. మీరేమి చేస్తారో తెలియదు. శ్రీనివాస స్టోన్ క్రషర్‌ను మూసేయండి. ఈ విధంగా ఎన్నికల అనంతరం నిత్యం మైనింగ్ అధికారులకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నుంచి ఒత్తిడి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే పైగా ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్న ఆయన ఒత్తిడి భరించలేక, ఒకదాని తర్వాత మరొకటి చకచకా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శ్రీనివాస స్టోన్ క్రషర్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిలో క్రషర్ యూనిట్ ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1993 నాటి నుంచి అదే స్థానంలో రన్నింగ్‌లో ఉన్న క్రషర్‌పై ఒక్కమారుగా మైనింగ్ యంత్రాంగానికి ప్రభుత్వ భూమి గుర్తుకు రావడానికి కారణాలు లేకపోలేదు. దాదాపు 21 సంవత్సరాలు అనుమతించిన అధికారులు అందుకు బాధ్యులు కారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లీజు సైతం రద్దు... శ్రీనివాస స్టోన్ క్రషర్ లీజు సైతం మైనింగ్ డిప్యూటి డెరైక్టర్ పుల్లయ్య రద్దు చేసినట్లు సమాచారం. ఆ క్రషర్‌పై రూ.68 లక్షలు జరిమానా వేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సంబంధిత మంత్రిత్వశాఖను సంప్రదించాలని తదుపరి కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ఆమేరకు మైనింగ్ మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ప్రస్తుతం స్టోన్ క్రషర్ ప్రభుత్వ స్థలంలో ఉందని సీజ్ చేశారు. దాంతో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించలేదు. అంతలోనే అపరాధ రుసుం చెల్లించలేదనే కారణంగా మైనింగ్ డీడీ పుల్లయ్య శ్రీనివాస స్టోన్ క్రషర్ లీజు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రషర్‌పై అంత ప్రేమెందుకో... శ్రీనివాస స్టోన్ క్రషర్ విషయంలో నిబంధనలు తరచి చూస్తున్న అధికారులు శ్రీసాయి స్టోన్ క్రషర్ వద్దకు వచ్చేసరికి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం మూడు హెక్టార్లకు మాత్రమే లీజు ఉన్న శ్రీసాయి స్టోన్ క్రషర్ విచ్చలవిడిగా మైనింగ్ చేస్తోంది. ఇప్పటికే 15 ఎకరాలకు పైగా కొండను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇవేవీ మైనింగ్ యంత్రాంగానికి కన్పించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షి వార్తకు స్పందన... 12 క్రషర్లకు రిలీజ్ ఆర్డర్లు... టార్గెట్...సీజ్ అన్న శీర్షికతో మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మైనింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. సీజ్ చేసిన క్రషర్ యాజమానుల నుంచి అపరాధం మొత్తంలో ఒక భాగం చెల్లించి, అఫిడవిట్ ఇచ్చిన 12మంది యజమానులకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు కడప మైనింగ్ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. నిబంధనల మేరకే కంకర మిషన్లు సీజ్ చేశామని తెలిపారు. -
పట్టాల పందేరం
తాడిపత్రి : మీకు ఇంటి పట్టా కావాలా? అర్హత లేకున్నా పట్టాను ఆశిస్తున్నారా? ఎక్కడో కొండ గుట్టలు కాదు.. పట్టణానికి సమీపంలోనే స్థలం కేటాయించాలని కోరుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తాడిపత్రికి వచ్చేయండి. మీరు పేదలు కాకపోయినా, ఇంటి పట్టా తీసుకోవడానికి ఏమాత్రమూ అర్హతలు లేకపోయినా రెవెన్యూ అధికారులు మీకు సహాయపడతారు. వారు నియమించుకున్న దళారులకు అంతో ఇంతో ముట్టజెబితే చాలు..విలువైన స్థలాన్ని రాసిచ్చేస్తారు. ఇప్పటికే పట్టణానికి అతి సమీపంలో పరిశ్రమలకు ఆనుకొని తాడిపత్రి-పెద్దపప్పూరు రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పంచి పెట్టేశారు. 20 ఏళ్ల క్రితం నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాలపైనా మళ్లీ పట్టాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి సమీపంలో చిన్నపొలమడ గ్రామ సర్వే నంబర్ 369, 371-బీలలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడే 1988లో తాడిపత్రి ప్రాంతంలో పనిచేసే నాల్గోతరగతి ఉద్యోగులు 132 మందికి స్థలాలు కేటాయించారు. వారిక్కడ ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంపై కన్నుపడిన కొంత మంది దళారులు.. నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలన్న పేరుతో మధ్యవర్తిత్వం వహించి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్నారు. దీంతో అధికారులు ఏకంగా 280 వరకు బోగస్ పట్టాలు సృష్టించి నేరుగా దళారులకు అందజేశారు. పోలింగ్ బూత్ అధికారులు (బీఎల్ఓలు)గా పనిచేసిన సుమారు 185 మంది పేర్లతోనూ పట్టాలు జారీ చేశారు. ఈ వ్యవహారమంతా సాధారణ ఎన్నికల ముందు గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. ఈ పట్టాలను దళారులు రూ.వెయ్యి మొదలుకుని అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్మడం ప్రారంభించారు. ఈ విషయం చిన్నపొలమడ గ్రామస్తులకు తెలియడంతో తమ గ్రామంలోని నిరుపేదలకు కాకుండా ఇతరులకు ఎలా పట్టాలు ఇస్తారంటూ స్థలాన్ని ఆక్రమించేశారు. అలాగే విషయాన్ని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే.. తహశీల్దార్ రామకృష్ణారెడ్డిని, రెవెన్యూ అధికారులను పిలిపించి తనకు కానీ, అప్పట్లో ఉన్న ఎమ్మెల్మేకు కానీ తెలియకుండా ఇన్ని పట్టాలు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పట్టాలన్నీ రద్దు చేయాలని ఆదేశించారు. పట్టాలు మా వద్దే ఉన్నాయి ఇళ్ల పట్టాలు తయారు చేసిన మాట వాస్తవమే. అయితే.. వాటిని ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. మా వద్దనే ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యే పరిశీలించిన తర్వాత, ఆయన ఆమోదం మేరకు అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తాం. - తహశీల్దార్ రామకృష్ణారెడ్డి -
ఉన్నది లేనట్టు.. అంతా కనికట్టు
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటంటూ హడావుడి - భూసేకరణ కూడా సాధ్యం కాని పనే... - కొత్త కలెక్టరేట్‌కే ఇప్పటి వరకు గతిలేదు శ్రీకాకుళం పాతబ స్తాండ్ : ప్రభుత్వం ఊహల్లో విహరిస్తూ నిర్ణయూలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జరగడానికి కనీసం అవకాశం లేనటువంటి అంశాలను కూడా జరుగుతాయని చెబుతూ అధికార పార్టీ నాయకులతో పాటు ఉన్నతాధికారులను కూడా తప్పుతోవ పట్టిస్తోంది. జిల్లాలో విమానాశ్రమం ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టరుకి సూచన ప్రాయంగా రాష్ట్ర ్రపభుత్వం సమాచారం అందించింది. అయితే ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజల్లో మెప్పుకోసం అనవసర ప్రకటనలు చేస్తోన్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒకే చోట 500 వందల ఎకరాల భూమి ఉండాలి. జిల్లాలో ఒకే చోట అంత భూమి ఎక్కడా అందుబాటులో లేదు. ఉండబోదు కూడా.. ఇటువంటి పరిస్థితుల్లో కొండలు గుట్టలు మినహ జిల్లాలో భూములు లేవు. జిల్లాకు చెందిన నాయకులు ఇంతవరకు అభివృద్ధి పథకాల కోసం ప్రస్తావించిన సందర్బం లేదు. ఇంతలోనే విమానాశ్రయం ఏర్పాటు విడ్డూరంగా ఉందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. జిల్లాలో హెలీపాడ్‌కు గతిలేదు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసింది తప్ప కొత్తగా లేదు, రాష్ట్ర విభజన తరువాత మరింతగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అమలుకి, రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేందుకు సరిపడిన డబ్బులేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ లోటును భర్తి చేసుకొనేందుకుగాను వివిధ ఉద్యోగుల నుంచి సందాలు, ఎర్రచందనం అమ్మకం వంటివి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళంలో విమానాశ్రయం సాధ్యంకాని పని. ఇప్పటికే విజయనగరం జిల్లా బాడంగిలో బ్రిటీష్ కాలంలో విమానాశ్రయం. ఏర్పాటు చేశారు. రన్ వే కూడా ప్రస్తుతం ఉంది. అదే ఇప్పటివరకు అభివృద్దికి నోచుకోలేదు, ఇక కొత్తగా విమానశ్రయం ఏర్పాటు చేయడమంటే హాస్యాస్పదమే.గతంతో పలు ప్రభుత్వ ఆవసరాలకు చేపట్టిన భూసేకరణ పురిటి దశలోనే ఉంది. కొత్తగా భూసేకణ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. గతంతో ఉమ్మడి రాష్ర్టంలో నిధులు పుష్కలంగా ఉన్నప్పుడు ఏ అభివృద్ది పనులు చేయలేకపోయారు. పట్టణంలోని పేదలకు ఇళ్ల నిర్మాణానికి మూడో విడత భూసేకరణకు సుమారుగా 40 ఎకరాలు కావాల్సింది, అయితే అయిదేళ్లు గడిచినా ఇంతవరకు కనీసం 20 ఏకరాలు కూడా ఇంతవరకు సేకరణ ప్రభుత్వం అధికారులు చేయలేదు. దానికి భూ యజమానుల నుంచి వ్యతిరేకత, న్యాయపరమైన సమస్యలు, తదితర కారణాలు ఉన్నారు. ప్రభుత్వ భూమి లేదు.. సమగ్ర కలెక్టరేట్‌ను నిర్మాణానికి మూడేళ్ల క్రితం ప్రణాళిక రూపొందించారు. అప్పుడు రూ. 50కోట్లతో నిర్మాణం చేయనున్నట్టు రాష్ర్ట ముఖ్య మంత్రి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఉండిపోయింది. తీరా ఆ కలెక్టరేట్‌ను జాతీయ రహదారి సమీపంలో విజయాదిత్యా పార్కువద్ద నిర్మించాలని కొత్త ప్రతిపాదన కొత్త ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది సాధ్యంకాని పనిగానే ఉంది. ఇక విమానాశ్రయం రణస్టలం, ఎచ్చెర్ల, గార మండలాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెపుతున్నారు. అయితే ఈ మండలాల్లో సెంటు భూమి కూడా విమానాశ్రయంకి అనువుగా లేదని అక్కడ రెవిన్యూ, సర్వే అధికారులు చెపుతున్నారు. రణస్థలంతో ఇప్పటికే కొవ్వాడలో అణువిద్యుత్ కర్మాగారం కోసం సుమారుగా రెండు వేల ఎకరాలు భూసేకరణ దశలో ఉంది. అక్కడ ఉద్యమాలు తిరుగుబాట్లు జరుగుతున్నారు. ఆ భూమి మినహా అక్కడ ప్రభుత్వ భూమి లేదు. ఇక ప్రవేటు భూమిని కొనుగోలు చేయాలంటే అర్బన్ హౌసింగ్ పరిస్థితి ఏర్పాడుతుంది. గార మండలం అంపోలు తదితర ప్రాంతాల్లో కూడా భూమి లేదు. అక్కడ అంతా లోతట్టు భూములు, జిరాయితీ భూములు. భూసేకరణ కూడా కష్టమే. మిగిలినది తీర ప్రాంతం అంత అనువుగా ఉండదు. ఎచ్చెర్ల మండలంలో కూడా అయిదు ఎకరాల భూమి లేదు, ఇక ఎచ్చెర్లమండలం కేంద్రంలో కొద్దిపాటి భూమలు ఉన్నప్పటికి అవి అంతా కొండలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా సాధ్యమయ్యే పనికాదు. -
భూముల ధరల పెంపునకు కసరత్తు
నూటికి నూరుశాతం పెంపుదల విజయవాడ సమావేశంలో ప్రతిపాదనలు ఆగస్టు 1 కల్లా నిర్ణయం? విజయవాడ : త్వరలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచనుంది. సామాన్యుడు భరించలేనంతగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. బుధవారం విజయవాడ డీఐజీ కార్యాలయంలో జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు డీ.ఆర్.లు సమావేశమయ్యారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ ఏరియాలు, గ్రామాల్లో ప్రస్తుతం వున్న రేట్లపై చర్చించారు. జిల్లాలో ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బయట మార్కెట్ విలువలకు పోల్చుకుంటూ అధికారులు రేట్లు పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. సాక్షి సేకరించిన సమాచారం మేరకు విజయవాడ పరిసర ప్రాంతాలో అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం భూముల విలువలు ఇలా ఉన్నాయి. విజయవాడ శివార్లలోని నున్న గ్రామంలో ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరం రూ. 25 నుంచి రూ.30లక్షలు ఉండగా, రూ. కోటి రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. అదే విధంగా పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కానూరు గ్రామంలో ప్రస్తుతం గజం రూ. 6400 ప్రభుత్వ విలువ ఉండగా దాన్ని రూ. 12వేలకు పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జిల్లాలో కంకిపాడు, గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు, మల్లవల్లి, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, కేతనకొండ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు ప్రస్తుతం ఉన్న విలువలకంటే నూటికి నూరు శాతం పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మిగిలిన ప్రాంతాలలో 30శాతం పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం రెవెన్యూ అదికారులు తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలు తయారు చేశాక ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక పంపి, ఆగస్టు 1 నుంచి పెంచేవిధంగా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ విజయవాడ డి.ఐ.జి. లక్ష్మీనారాయణ రెడ్డి, డి.ఆర్.లు బాలకృష్ణ, శ్రీనివాస్ జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. -
వంకకు ఎసరు!
అనంతపురం రూరల్: అది అత్యంత విలువైన ప్రభుత్వ భూమి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. దానిపై ముగ్గురు నాయకుల కన్ను పడింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దాన్ని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఓ రెవెన్యూ ఉద్యోగి కూడా వారికి సహకారం అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం కురుగుంట మరువ కాలువ సమీపంలో సర్వే నంబర్ 83లో చాలా వరకు ప్రభుత్వ భూమి (08) ఉంది. ఇది ఎంత తక్కువ ధర అనుకున్నా ఎకరా రూ.పది లక్షలకు పైగా పలుకుతుంది. అత్యంత విలువైన భూమి కావడంతో 3.40 ఎకరాలను కబ్జా చేసేందుకు ముగ్గురు నాయకులు ప్లాన్ వేశారు. వారిలో ఒకరు దళిత సంఘం నేత కాగా, మరొకరు యువజన కాంగ్రెస్, ఇంకొకరు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు. వీరు ముగ్గురూ కలిసి ఆరు నెలల క్రితం ఆ భూమిని దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ముందుగా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కొందరితో అక్కడ గుడిసెలు వేయించారు. మిగిలిన స్థలంలో ఎవరూ అడుగు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. విలువైన ఈ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. పైగా వారికి ఓ రెవెన్యూ ఉద్యోగి సహకరించారు. అందుకు గాను రూ.లక్ష వరకు తీసుకున్నట్లు మండల రెవెన్యూ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులు పెడతాం కురుగుంట కాలువ వంక పొరంబోకు స్థలం ప్రభుత్వానిది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలు ఇచ్చే ప్రసక్తే లేదు. భూమిని కబ్జా చేస్తున్నట్లు ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులందాయి. విచారణ మొదలుపెట్టి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడబోం. వీలైనంత త్వరలో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం. - తహశీల్దార్ లక్ష్మినారాయణ ప్రభుత్వ అనుమతి లేదు దళితులకు స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ భూమిని మా ఆధీనంలో పెట్టుకున్నాం. జనార్దన్‌రెడ్డి(యువజన కాంగ్రెస్)తో పాటు ధనుంజయ(జీవీఎస్)కు కూడా ఇందులో భాగమున్న మాట వాస్తవమే. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ అనుమతి మా దగ్గర లేదు. - మలయ్య, దళిత సంఘం నేత -
దుకుడు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్సీ, సీలింగ్, అసైన్మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టేదిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూముల పరిరక్షణ. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ/బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేసి అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించా. ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్‌లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోను త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ‘ఎన్’ కన్వెన్షన్‌లో తమ్మడి కుంట.. ‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్‌ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. దళితుల సమగ్రాభివృద్ధి దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. పనిదొంగల భరతం పడతా.. సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. 64 మందికి శ్రీముఖాలు విధుల్లో అలసత్వం వహించినందుకే వైఖరి మారకుంటే వేటు: కలెక్టర్ శ్రీధర్ విధినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. -
కబ్జాలకు చెక్!
బాన్సువాడ, న్యూస్‌లైన్ : సర్కారు భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అటవీ శాఖకు చెందిన భూమి ఎంత, అసైన్మెంట్ భూమి ఎంత, శిఖం భూమి ఎంత, దేవాదా య, వక్ఫ్‌బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను సర్వే నెంబర్లతో సహా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం వివరాలను పొందుపర్చినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ త్వరలో వెబ్సైట్లో దర్శనమివ్వనున్నాయి. జిల్లాలో 7.95 లక్షల హెక్టార్ల భూ విస్తీర్ణం ఉండగా, అందులో అటవీ భూమి 1.69 లక్షల హెక్టార్లలో ఉంది. అసైన్మెంట్ భూములు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూములు, శిఖం భూములు భారీగానే ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోనూ లేవు. దీంతో ఇప్పటికే వేలాది హెక్టార్ల భూమి కబ్జాకు గురైంది. ఈ నేపథ్యంలో సర్కారు భూములను రక్షించేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయి రికార్డులను తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు మండలాల వారీగా ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను తెప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి సర్కార్ భూమి.కామ్‌లో వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములకు రక్షణ భూముల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే కబ్జాలను నిరోధించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. దీని వల్ల ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్‌బోర్డు, ఇరిగేషన్, అటవీ భూములకు రక్షణ ఉంటుందని భావిస్తోంది. సర్వే నెంబర్లతో సహా వెబ్సైట్లో పొందుపర్చుతున్నందున ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. శాఖల అనుసంధానంతో.. రిజిస్ట్రేషన్లలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను అనుసంధానం చేస్తూ వెబ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేసింది. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అక్రమాలు, అవకతవకలు లేకుండా భూముల క్రయవిక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే వెబ్ ల్యాండ్ పద్ధతి బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించి తాజా వివరాలు లేవు. కొన్నేళ్లుగా క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను అప్డేట్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో దస్తావేజు వివరాలు వెబ్ ల్యాండ్‌లో ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. లేదంటే రిజిస్ట్రేషన్ చేయలేమంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులెత్తేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో దస్తావేజుకు సంబంధించిన భూమి తాజా వివరాలను రెవెన్యూ శాఖలో నమోదు చేసుకొని వారి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నట్టయితేనే రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్పష్టం చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ డాక్యుమెంట్ల వివరాలను వెబ్ ల్యాండ్‌లో పొందుపర్చాలని విన్నవించుకుంటున్న కక్షిదారులకు చుక్కెదురవుతోంది. వివరాలను రెవెన్యూ శాఖ సిబ్బంది తక్షణమే వెబ్‌ల్యాండ్‌లో పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, చివరి రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించినట్లయితే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలతో వెబ్సైట్ ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వెబ్సైట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ఇలా చేస్తే భూ అక్రమాలను అడ్డుకోవచ్చు. కబ్జాలను అరికట్టవచ్చు. -శ్రీకాంత్, బోధన్ తహశీల్దార్ -
గుట్టలు..గుటకలు
అవి చూసేందుకు గుట్టలే. తాజాగా దాని విలువ పెరిగింది. ప్రభుత్వ భూమైనా స్థానికులు కొందరు సాగుచేస్తుండడంతో వారికి పట్టాలిచ్చారు. మరి కొంతమందికి ఇప్పుడు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పలుకుబడి దార్లు తమ బినామీలను రంగంలోకి దించి దాన్ని కాజేయాలని చూస్తున్నారు. ఇదీ అలంపూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన వందెకరాల భూమి కథ. అలంపూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ స్థలాలపై బినామీల కన్నుపడింది. నియోజకవర్గ నేత అనుచరులు అధికారులను మచ్చిక చేసుకొని బినామీ పేర్లతో భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక అధికారి సైతం సొంత లాభం ఆర్జిస్తూ.. బినామీలకు పూర్తి స్థాయి అండదండలు అందిస్తూ...అర్హులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పొలాలకు పట్టా వస్తుందని అశించిన నిరుపేదలు ఈ విషయం తెలిసి అందోళన చెందుతున్నారు. బినామీల చేతికి అందుతున్న తమ పొలాలను దక్కించుకోవడానికి జిల్లా ఉన్నత అధికారుల చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు గ్రామం జిల్లాకు సరిహద్దులో ఉంది. అంతేకాక తుంగభద్ర నదికి అవతలి వైపున ఉన్న మూడు గ్రామాల్లో ఇదొకటి. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన మూడు సర్వే నెంబర్లలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోని కొంత భాగాన్ని దశాబ్దాలుగా కొన్ని నిరుపేద కుటుంబాలు బంజరు భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకొని సాగు చేస్తున్నారు. వీరిలో కొంత మందికి పట్టాలు రాగా మరి కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారి జాబితా సిద్దమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న బినామీలు ఒక అధికారిని దారిలోకి తెచ్చుకొని అర్హులైన నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రణాళిక వేసినట్లు భోగట్టా. ఈ మేరకు ఎకరాకు కొంత మొత్తం ముట్టజెప్పుకొని పట్టాల పంపిణీ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్ రావడంతోనే : తుంగభద్ర నది అవతలి పొలాలకు గతంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అయితే అలంపూర్-ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు మరో ఏడాదిలో పూర్తయి రాకపోకలు సాగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని పొలాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు సైతం రోడ్డుకు అతిసమీపంలో ఉండటంతో భవిష్యత్తులో వాటికి మంచి ధర వస్తుందని బినామీలు అందిన కాడికి వాటిని కాజేసే యత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ర్యాలంపాడు గ్రామస్తులు గతంలోనే ఓసారి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు స్పందించి అర్హులకు న్యాయం జరిగే విధంగా చూడాలిన కోరుతున్నారు. తహశీల్దార్ ఏమన్నారంటే... ప్రభుత్వ భూ పంపిణీకి స్థలాన్ని పరిశీలించమని చెప్పడంతో ర్యాలంపాడు, ఉట్కూరు గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ యోగ్యమైన పొలాలను గుర్తించాం. అర్హుల పేర్లు గుర్తిస్తున్నాం. ఇంకా జాబితా పూర్తి స్థాయిలో ఎంపిక చేయలేదు. సిద్దం చేసిన అనంతరం అసైన్డు కమిటీలో చర్చించి అర్హుల జాబితాను ప్రకటిస్తాం. అనఅర్హులకు అస్కారం లేకుండా జాగ్రత్తలు తీసకుంటాం.