
'కేసీఆర్ నిన్ను వదలా'
పేదవారికి డబుల్ బెడ్ రూం కట్టించి ఇచ్చే వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే, బీసీ వెల్పేర్ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మితే ఊరుకోబోమని కృష్ణయ్య అన్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ వెల్పేర్ అసోసియేషన్ జాతీయ సదస్సు సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో వారు కులాంతర వివాహాలను ప్రోత్సహించినప్పుడే దేశం అగ్ర రాజ్యంగా ఉంటుందన్నారు.