
'కేసీఆర్ వైఖరికి నిరసనగా నిరాహారదీక్ష'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైఖరికి నిరసనగా నిరాహారదీక్ష చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బీసీ వెల్పేర్ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద గురువారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభిస్తానని తెలిపారు.
ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. బకాయిలు చెల్లించమని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని కృష్ణయ్య విమర్శించారు.