Land grabs
-
నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలు
-
భూ ఆక్రమణల్లో బకాసురుడు సీఎం రమేష్
అతడు.. భూఆక్రమణల్లో బకాసురుడు. అరాచకాల్లో రజాకార్లు కూడా ఆయన ముందు దిగదుడుపే. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తన గురువు చంద్రబాబుకు తగ్గ శిష్యుడు. చివరకు సొంత గ్రామస్తులు, బంధువులు కూడా ఆయన అంతులేని ధనదాహార్తికి చితికిపోయారు. తన ఆక్రమణలకు అడ్డూ అదుపు లేదు.నదీ, వాగు అనే అభ్యంతరాలు లేవు. దొరికినదాన్నల్లా కబ్జా చేయడమే. సారా వ్యాపారం నుంచి మొదలై చంద్రబాబు అనుంగు శిష్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి వాటినీ కలుíÙతం చేసిన ఆ చీడపురుగు.. సీఎం రమేశ్. సొంత గ్రామస్తులు ఛీ కొడుతున్న ఆయన అక్రమాలు, అరాచకాలు తెలిస్తే కళ్లు తేలేయకమానరు.పోట్లదుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీఎం రమేశ్, ఆయన సోదరుడు సురేశ్ నాయుడు రజాకార్ల కన్నా దుర్మార్గులని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామస్తులు ధ్వజమెత్తారు. అదే గ్రామానికి చెందిన సీఎం రమేశ్, ఆయన సోదరుడు అరాచకాలకు బలికాని వర్గమంటూ లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వారి ఆవేదన, ఆక్రందన వింటే ఈ కాలంలోనూ ఇన్ని దురాగతాలు ఎలా చేయగలుగుతున్నారనే ఆశ్చర్యం కలుగుతుంది.అన్ని వ్యవస్థలను అంతలా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని అవాక్కవ్వక తప్పదు. సొంత గ్రామస్తులకు వారు బతికుండగానే నరకం చూపిన సీఎం రమేశ్ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడేం చేయబోతున్నారో ఊహించడానికే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ స్వగ్రామంలో ఆయన ‘వ్యవహారాలు’ తెలుసుకోవడానికి ‘సాక్షి’ పోట్లదుర్తిలో పర్యటించింది. సారా వ్యాపారంతో మొదలెట్టి.. సీఎం రమేశ్ కుటుంబం సారా వ్యాపారంతో మొదలైంది. టీడీపీలో చేరి చంద్రబాబుతో చెలిమి చేశాక ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. బాబు సహకారంతో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అన్నిరకాల అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల్లో ఆరితేరి రూ.వేల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. బయట కాంట్రాక్టులు, కంపెనీల వ్యవహారాలను అలా ఉంచినా.. సొంత గ్రామంలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే వామ్మో రమేశ్ అనకుండా ఉండలేం. వాగులు, నదుల్ని చెరబట్టి.. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున పోట్లదుర్తి ఉంది. పెన్నాకు– గ్రామానికి మధ్యలో కలమల్ల వాగు పోతోంది. సీఎం రమేశ్ అటు నదిని, ఇటు వాగును ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఆ భూమిని ఆక్రమించుకున్నారు. తన భూములకు చుట్టూ తీగతో ఫెన్సింగ్ వేయడం ద్వారా ఇతర రైతుల పొలాలకు రాకపోకలు లేకుండా చేశారు. పెన్నా నది, కలమల్ల వాగులకు రక్షణ గోడలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు దక్కించుకున్న సీఎం రమేశ్ కుటుంబం వాటిపై ఎవరూ నడవకుండా అడ్డంకులు సృష్టించింది. చివరకు పశువులు, మూగజీవాలు నీరు తాగడానికి కూడా వీల్లేకుండా చేసింది. స్థానికులు నిరసనలు వ్యక్తం చేసినా సీఎం రమేశ్ రాక్షసంగానే వ్యవహరించారు. రైతుల్నే అమ్ముకునేలా చేసి.. తమ భూములున్న చోట పరిసరాల్లో కొందరి భూములు కొనుగోలు చేసి ఫెన్సింగ్ తీయించడం, ఆ తరువాత ఇతరులకు అడ్డంకులు కలి్పంచడం, వాటిని సొంతం చేసుకోవడం సీఎం రమేశ్, ఆయన సోదరుడి స్టైల్. పోనీ ఆ భూములను అక్కడున్న వాస్తవ ధర ప్రకారం తీసుకుంటారా అంటే అదీలేదు. ఎకరం రూ.పది లక్షల నుంచి రూ. ఇరవై లక్షలకు పైగా విలువచేసే భూమిని రూ.నాలుగు నుంచి ఆరేడు లక్షలకు రైతులే స్వయంగా వచ్చి అమ్ముకుపోయేలా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. భూములను తక్కువకు ఇచ్చేలా బెదిరింపులకు పాల్పడటం షరామామూలని పలువురు సొంత బంధువులే వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం పాలన ముగిసే సమయానికి పోట్లదుర్తి పరిసరాల్లో మూడు వందల ఎకరాలకు పైగా భూములను సీఎం రమేశ్ తన వశం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక పట్టా భూములను బినామీ పేర్లతో ఉంచారని తెలుస్తోంది. గొడ్డును బాదినట్లు బాదాడయ్యా మా అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో తేడాలు వచ్చాయి. న్యాయం చెప్పమని సురేశ్ నాయుడు వద్దకు వెళ్లాం. ఎంతకూ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరో పెద్దమనిషి వద్దకు వెళ్లానని తెలుసుకుని ఇంటికి పిలిపించి గొడ్డును బాదినట్లు బాదాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మళ్లీ బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. – కలమల్ల బాదుల్లా, పోట్లదుర్తి బంధువులమైనా వదిలిపెట్టడం లేదు.. సీఎం రమేశ్, మేము అంతా దగ్గర బంధువులమే. మా భూములను తక్కువ ధరకు తీసేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. దీనిపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. అయినా మా పోరాటం ఆపేది లేదు. – సీఎం రమేశ్ బంధువులు సీఎం రమేశ్ అక్రమాలు, అరాచకాలు» పెన్నా నది ఒడ్డున లిక్కర్ ఫ్యాక్టరీ నెలకొల్పుతానని, గ్రామంలోని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలి్పస్తానని నమ్మబలికి సుమారు 40 ఎకరాలను పేదవర్గాల నుంచి సేకరించారు. అందులో అధునాతన అతిథిగృహాన్ని కట్టారు. » గ్రామంలో మోడల్ స్కూలు కట్టిస్తానని నమ్మబలికి ఎకరం రూ. కోటి విలువచేసే భూమిని కేవలం 11 లక్షలకే తీసుకుని గ్రామస్తులను మోసం చేశారు. ఆ భూముల్లో ఆకుకూరలు, కూరగాయలు పండేవని, భూయజమానులకు నిత్యం ఆదాయం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిని పోలీసుల పేరిట బెదిరించి మరీ తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. » చంద్రబాబు పాలన 1999–2004 మధ్య ఎన్టీఆర్ కాలనీల పేరిట 294 (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య)గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్దిదారులకు ఆ ఇళ్ల హక్కుపట్టాలు రానీయకుండా సీఎం రమేశ్ తన కుటుంబీకుల వద్దే ఉంచుకుని రుణాల రూపంలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాటిని అమ్మడానికి, ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి వీల్లేకుండా పోయిందని లబ్దిదారులు వాపోతున్నారు. » గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలకు యూనిఫాం పేరిట కొనసాగిన పథకాన్ని సీఎం రమేశ్ తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. మహిళా టైలర్లకు తెలియకుండా వారి పేరిట బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులు తీసుకుని టైలరింగ్ ఛార్జీలను ఆయా అకౌంట్లలో వేయించేవారు. అధికారులతో కుమ్మక్కయి బ్యాంకు లావాదేవీలు తనకు అనుకూలంగా కొనసాగించుకోవడంతో టైలర్లు తమకు తెలియకుండానే ఆదాయపన్ను పరి«ధిలోకి చేరారు. దీంతో వారు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. » గ్రామస్తులు ఎవరైనా అత్యవసరాల కోసం డబ్బు తీసుకున్నా.. పెద్ద మొత్తం అయ్యేవరకు వేచిఉండి ఆ ప్రాంశరీ నోట్లను తిరిగి రాయించేవారు. ఆ తర్వాత ఆర్థికంగా వారిని పూర్తిగా కుంగదీసేవారు. ఇళ్ల స్థలాలు, ఇల్లు, భూములు ఇలా ఏవో ఒకటి లాగేసుకోవడం అన్నదమ్ములకు రివాజని స్థానికులు వివరించారు. సీఎం రమేశ్ సోదరుడు సురేశ్‌తో నిత్యం కలిసి ఉండే సోమశేఖరరెడ్డి తన అవసరాల కోసం రూ.40 వేలు తీసుకోగా కొన్నేళ్ల తర్వాత రూ. ఎనిమిది లక్షలకు పైగా తిరిగి చెల్లించాలని, లేదంటే తనకు భూమి రాసిచ్చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో సోమశేఖరరెడ్డి కుటుంబం దెబ్బతింది. అదేవిధంగా జబ్బుపడిన తన బిడ్డ వైద్యం కోసం ఒక పేద దళిత వ్యక్తి రూ.2 వేలు తీసుకోగా లక్షకు పైగా చెల్లించాలని అతడిని ఒత్తిడి చేశారు. సీఎం రమేశ్ సోదరుల దౌర్జన్యాలకు చివరకు వారి సొంత చిన్నాన్న కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయింది. » ప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాల స్కీమ్ పేరిట సీఎం రమేశ్ మోసం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, చుట్టుపక్కల గ్రామాల వారిని నిండా ముంచారు. » గ్రామానికి అంతటికి సోలార్ ఎనర్జీ వచ్చేలా చేస్తానని చెప్పి మోసగించారు. » పశువులు గ్రాసం కోసం ఇబ్బందిపడకుండా వసతి ఏర్పాటుచేస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ము దిగమింగారు. » నీరు – చెట్టు ప«థకంలోనూ రూ.కోట్ల రూపాయలు దిగమింగారు. » ఆర్టీపీపీకి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని సీఎం రమేశ్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. తన ఇంటి కోసం రోడ్డును ఓ వైపునకు పొడిగించి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా లేకుండా చేశారు. తమ ఇంటి ముందు ఉన్న పది అడుగుల రోడ్డును ఆక్రమించడంతో పరిసరాల్లోని తమకు దగ్గరి నడక మార్గం లేక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు. -
అవినీతి వెలగపండు
భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్ పడింది. ► ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేపై కేసులు ► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు. -
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారని కోళ్లబైలు గ్రామస్తులు గత సోమవారం స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్డీవో ఎం.ఎస్.మురళి తక్షణమే స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన కోళ్లబైలు సర్వే నంబర్లు 889/5లోని 1.11 ఎకరాలు, 891/1లోని 0.62 సెంట్ల భూమికి జారీ చేసిన పట్టాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ భూమిలోకి ప్రవేశిస్తే చట్టప్రకారం శిక్షార్హులుగా పేర్కొన్నారు. అయితే అప్పటికే సదరు స్థలంలో ఆక్రమణదారులు అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అంతటితోనే నిలిపేయాలని హెచ్చరించారు. -
'ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్'
సాక్షి, ప్రకాశం: భూ ఆక్రమణలపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఓ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో రూ.5కోట్లు తీసుకోలేదని దామచర్ల ప్రమాణం చేయగలారా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి రూ.100కోట్లు కొట్టేసిన చరిత్ర ఆయనది అంటూ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో దామచర్ల జనార్ధన్ అవినీతి బాగోతాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
Banjara Hills: భూకబ్జా ముఠా హల్చల్.. ఎంపీ టీజీ వెంకటేశ్‌పై కేసు
బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్రభుత్వ స్థలంలోకి ఆదివారం కొందరు రౌడీలు మారణాయుధాలతో ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, అతని అన్న కుమారుడు విశ్వ ప్రసాద్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్‌కు ప్రభుత్వం 2005లో కేటాయించిన రెండున్నర ఎకరాల్లో అర ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి బోగస్ పత్రాలతో ఆక్రమించుకున్నాడు. తన ఆధీనంలోకి తీసుకున్న ఈ స్థలాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ అన్న కుమారుడు విశ్వప్రసాద్‌కు విక్రయించాడు. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. విశ్వప్రసాద్ ఆదివారం 80 మంది రౌడీలను మారణాయుధాలతో ఈ ప్రభుత్వ స్థలంలోకి పంపించాడు. వారు ఈ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యురిటీ గార్డుల్ని కొట్టి బయటకు తరిమారు. రౌడీమూకల దౌర్జన్యంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని 62 మంది రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన రౌడీలు పరారయ్యారు. ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు ఎంపీ టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల జాగా.. ‘పచ్చ’ నేతల పాగా!
కేవీబీపురం(చిత్తూరు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేవీబీపురం నడిబొడ్డున నిరుపేదలకు ఇంటి స్థలాలు అందజేశారు. సర్వే నంబర్ 53లోని 7.56 ఎకరాలను 396 ప్లాట్లుగా విభజించి కేవీబీపురం, కళత్తూరు, రాయపేడు గ్రామాలకు చెందిన పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పట్టాలను అందించారు. మిగిలిన ప్లాట్లను భవిష్యత్‌లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్లాట్లను గ్రామ కంఠంగా రెవెన్యూ అధికారులు ప్రకటించారు. చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా? నకిలీ పట్టాలతో విక్రయాలు నైనేరి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన 364 నంబరు ప్లాట్‌ను బీజేపీకి చెందిన వెంకటముని నకిలీ పట్టాతో ఆక్రమించుకున్నాడు. సదరు స్థలాన్ని ఇటీవలే కువైట్‌లో సెటిలైన నగరివాసి నాదముని అనే వ్యక్తికి రూ.7.40లక్షలకు అమ్మేశాడు. అదీ రూ.100 బాండు పేపర్‌పై హక్కులు రాయించేసి అప్పగించేశాడు. ఇదే తరహాలో కువైట్ వాసికి ఇప్పటికే నాలుగు ప్లాట్లు విక్రయించినట్లు ఆధారాలున్నాయి. అలాగే స్థానికంగా వ్యాపారం చేసుకునే బొంబాయి రవి అనే వ్యక్తికి టీడీపీ నాయకులు తాము కబ్జా చేసిన 8 ప్లాట్లను అమ్మి కాసులు పోగేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఊతుకోటకు చెందిన ట్రాన్స్‌కో అధికారికి మరో స్థలాన్ని విక్రయించగా, ఆయన ఆ ప్లాటులో ఇల్లు సైతం నిర్మించేసుకున్నారు. టీడీపీ, బీజేపీ నేతల దందా అక్కడితో ఆగలేదు.. షణ్ముగం అనే వ్యక్తికి 3 ప్లాట్లు, మరో ప్రభుత్వోద్యోగికి 4, శ్రీకాళహస్తికి చెందిన వైద్యుడికి 8 స్థలాలు అమ్మేసుకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఈ పెద్దమనుషుల ఆక్రమణలో ఇప్పటికీ మరో 20 ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. బీజేపీ నేత వెంకట ముని నగరి వ్యక్తికి ప్లాట్ విక్రయించిన పత్రం విషం కక్కుతున్న ‘కాల్’నాగులు! పేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలను కాజేయడంలో కొందరు ‘కాల్’నాగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మునస్వామి అనే వ్యక్తి అప్పులు ఇచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీలు కట్టి చెల్లించలేని వారి స్థలాలను ఆక్రమించుకుంటున్నాడు. ఈ విధంగా ఇప్పటికే దాదాపు పది ప్లాట్లను బలవంతంగా రాయించేసుకున్నట్లు తెలిసింది. ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వంతపాడుతున్న అధికారులు ఆక్రమణదారులకు స్థానిక అధికారులు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం మంజూరు చేసిన డీకేటీ భూమిలోని స్థలాలను విక్రయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ వీఆర్ఓ, స్థానిక సచివాలయ సర్వేయర్ మామూళ్లు తీసుకుని భూ దందాకు వంతపాడుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతల దందా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తమ్ముళ్ల కన్ను ఈ స్థలాలపై పడింది. పెద్దమనుషుల ముసుగులో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ మునికృష్ణయ్య, మాజీ సర్పంచ్ చెంగారెడ్డి, స్థానిక నేత పరంధామ్తోపాటు బీజేపీకి చెందిన మండలస్థాయి నాయకుడు వెంకటముని రంగంలోకి దిగి కబ్జా పర్వానికి తెరతీశారు. ముందుగా ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం కార్యాలయాలు నిర్మించాలనే ప్రతిపాదన తీసుకువచ్చి 20 ప్లాట్లలో పాగా వేశారు. గుట్టు చప్పుడు కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆయా స్థలాలను రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా పలువురు లబ్ధిదారులకు చెందిన ప్లాట్లను సైతం తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టా చెల్లదంటున్నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. అప్పట్లో వసతి లేక ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుందామని వెళితే బీజేపీకి చెందిన వెంకటముని అడ్డుకున్నాడు. నాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా చెల్లదని దబాయిస్తున్నాడు. తీరా విషయం కనుక్కుంటే నా ప్లాటును కువైట్‌లో ఉన్న వ్యక్తికి వెంకటముని అమ్మేసినట్లు తెలిసింది. – ప్రసాద్, కేవీబీపురం బెదిరిస్తున్నారు అప్పట్లో మాకు ఇంటి స్థలాలకు ఇచ్చేప్పుడు గ్రామానికి చెందిన వెంకటముని, మునికృష్ణయ్య పెద్దమనుషులుగా ఉండి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ ప్లాట్లను మాకు సంబంధం లేకుండా నకిలీ పట్టాలు సృష్టించి విక్రయించేస్తున్నారు. అడిగితే మీ స్థలం ఎక్కడ ఉందో వెతుక్కోండని బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయించి మా పట్టాలకు స్థలాలు చూపించాలి. – వెంకటేష్, పట్టాదారు విచారణ చేస్తాం ప్రభుత్వం పంపిణీ చేసిన డీకేటీ భూములను ఎవరూ అమ్మకూడదు. కొనకూడదు. చట్టవిరుద్ధంగా కొనుగోలు, విక్రయాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవు. ఇక్కడ పంపిణీ చేసిన ఇంటి స్థలాలకు సంబంధించి లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. తప్పు చేసిన వారిని ఉపేంక్షించే ప్రసక్తే లేదు. – ప్రమీల, తహసీల్దార్, కేవీబీపురం -
వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీపీ నేతల కబ్జా బాగోతం ఇది. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.కోట్ల విలువ చేసే భూమిని తెలుగు తమ్ముళ్లు కాజేశారు. అధికారులను భయపెట్టి ఆ స్థలంలో నిర్మాణాలూ చేపట్టారు. పన్నులూ వేయించారు. పన్ను రశీదుల ఆధారంగా వేరొకరికి అమ్మేందుకు తెగబడ్డారు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: మంత్రి పేర్ని నానితో వర్మ భేటీకి డేట్ ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని 351–3 సర్వే నంబరులో 32.50 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల కిందట కొంతమంది పేదలకు 5 ఎకరాల మేర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. మరో 10 ఎకరాలలో చెరువు ఉంది. ఇంకా 17.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇందులో 60 సెంట్ల భూమిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాదల శ్రీను, తూణగంటి వెంకటరమణ, సింహాద్రి సాంబశివరావు కన్ను పడింది. 30 సెంట్లు కబ్జా చేసిన మాదల శ్రీను గత ప్రభుత్వ హయాంలో మాదల శ్రీను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, మందడం గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడిగా పనిచేశారు. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని 351–3 సర్వే నంబర్లో ఉన్న సుమారు రూ.1.80 కోట్ల విలువైన 30 సెంట్ల భూమిని ఆక్రమించాడు. అప్పటి ప్రభుత్వంలో అధికారులను బెదిరించి ఇంటి పన్ను, నీటి పన్ను వేయించుకున్నాడు. రెండు నెలల కిందట ఈ స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మి మందడం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు యత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయకూడదని అభ్యంతరం తెలుపుతూ మందడం సబ్ రిజిస్టార్కు లేఖ రాశారు. దీంతో శ్రీను ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అడ్డంపెట్టుకొని మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంత భూమిని మరో వ్యక్తికి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసి మరో కొంత భూమిని నోటరీ చేశాడు. మాదల శ్రీనుకు అప్పటి తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. 2018లో ఈ భూమిలోని నిర్మాణానికి ఇంటి పన్ను వేయడం లేదంటూ మందడం పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి కార్యదర్శిపై మాదాల శ్రీను దాడి చేశాడు కూడా. దీనిపై తుళ్లూరు పోలిస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. మాదాల శ్రీను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతాడనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మరో ఇద్దరి స్వాదీనంలో 30 సెంట్లు ఇదే సర్వేనంబర్‌లోని మరో 30 సెంట్ల భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు తూణగంటి వెంకట రమణ, సింహాద్రి సాంబశివరావు ఆక్రమించారు. చెరొక 15 సెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. దీనిలో రేకుల షెడ్డు వేశారు. వీరికి అప్పటి టీడీపీ పెద్దల అండ ఉండడంతో స్థలాన్ని వీరి పేరుపై రిజి్రస్టేషన్ కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం స్థలం విషయంలో వివాదం వచ్చింది. దీంతో వారం కిందట తుళ్ళూరు పోలీసులను ఆశ్రయించారు. అది ప్రభుత్వ భూమే దీనిపై మందడం పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావును వివరణ అడగ్గా అది ప్రభుత్వ భూమి అని తెలిపారు. ఆక్రమిత స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరిక బోర్డు పెట్టినట్టు వెల్లడించారు. స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఉన్నతాధికారుల సూచనతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 60సెంట్ల భూమి విలువ సుమారు రూ.3.60 కోట్లు ఉంటుందని అంచనా. -
ఆ టీడీపీ నాయకుడి దారి.. అడ్డదారి
పైచిత్రంలో కనిపిస్తున్న మట్టి రోడ్డు చూశారా.. ఇదేదో మైదాన ప్రాంతంలో వేసినది కాదు. పొలాలకు సాగునీరు అందించేందుకు ఆధారమైన వెంకటబందలో అడ్డంగా నిర్మించిన రోడ్డు. దీనివల్ల ఆయకట్టుకు నీరు అందడం లేదు. పంటలు ఎండిపోతున్నా సదరు టీడీపీ నాయకుడి పొలానికి దారి మాత్రం పక్కాగా సమకూర్చుకున్నాడు. ఆయనో చోటా నాయకుడు. అయితేనేం.. అధికారాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం చక్కగా వినియోగించుకున్నాడు. సాగునీటికి ఆధారమైన బందను కప్పేసి తన పొలానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకున్నాడు. అప్పట్లో రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో టీడీపీ నాయకుడి ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు చెప్పినదే వేదం. వారి దారి అడ్డదారి. అడిగేవారు లేకపోవడంతో ప్రభుత్వ భూములను చెరబట్టారు. తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. దీనికి జిల్లా కేంద్రమైన విజయనగరానికి సమీపంలోనున్న గంట్యాడ మండలం సిరిపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆక్రమణలే నిలువెత్తు సాక్ష్యం. మండల స్థాయి టీడీపీ నాయకుడొకరు దురాక్రమణలకు తెగబడ్డారు. ఈ ఆక్రమణలను తొలగించాలంటూ స్థానిక రైతులు 28.1.2019వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అప్పటి తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకూ దానికి అతీగతీ లేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా తమ పార్టీ నాయకుల ఆక్రమణలను ఉపేక్షించడంతో అధికారులు కూడా మిన్నకుండిపోయారు. స్వార్థ ప్రయోజనాల కోసం బాటలు... సిరిపురం గ్రామ రైతుల సాగునీటి అవసరాలకు వెంకట బంద ఆధారం. దీని నుంచి సమీప గ్రామమైన చంద్రంపేట రైతుల పొలాలకు కొంతమేర సాగు నీరు అందుతుంది. సర్వే నంబర్ 89/1లో 12.70 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంద ఉంది. బంద దాటాక టీడీపీ నాయకుడికి ఆరు ఎకరాల పొలం ఉంది. అక్కడికి సులభంగా చేరుకునేందుకు మూడేళ్ల కిందట బంద మధ్యలోనుంచే రోడ్డు వేయించేశాడు. అతని అధికార దర్పానికి బయపడి స్థానిక రైతులు అడ్డుకోలేకపోయారు. అలాగే, సిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోనే సర్వే నంబర్ 108/1లోనున్న 22 సెంట్ల ప్రభుత్వ భూమినీ సదరు టీడీపీ నాయకుడు ఆక్రమించేశాడు. ఈ భూమి గుండానే సమీపంలోని తన ఆరెకరాల మామిడితోటకు వెళ్లడానికి అడ్డదారి వేయించాడు. రోడ్డు మరింత వెడల్పుగా ఉండటానికి పక్కనున్న సాగునీటి కాలువనూ జేసీబీలతో కప్పించేశాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న మట్టి రోడ్డు కూడా సదరు టీడీపీ నాయకుడి పొలానికి వేసుకున్నదే. అదేదో సొంత స్థలం అనుకుంటే పొరపాటే. అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. అంతేకాదు సాగునీటి కాలువను కప్పేసి మరీ రోడ్డు నిర్మించేశారు. నాటి టీడీపీ ప్రభుత్వానికి పట్టని రైతుల గోడు.. జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సదరు మండల స్థాయి టీడీపీ నాయకుడి ఆక్రమణల గురించి రైతులు మొరపెట్టుకున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు రైతుల పొలాలకు సాగునీరు అందట్లేదు. అప్పటి కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. కానీ ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. – గుండ్రపు సత్యారావు, మాజీ సర్పంచ్, సిరిపురం, గంట్యాడ మండలం మరోసారి సర్వే చేయిస్తాం... సర్వే నంబర్ 108/1లో 22 సెంట్లు, సర్వే నంబర్ 89/1లో 12.70 ఎకరాల విస్తీర్ణంలోనున్న వెంకట బందలో కొంతమేర ఆక్రమణలు జరిగినట్టు సర్వే రిపోర్టు ఉంది. మరోసారి పరిశీలనకు సర్వేయర్‌ను క్షేత్రస్థాయికి పంపిస్తాం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ మండలం -
గల్లా కుటుంబంలోని 12 మంది పై కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
సాక్షి ప్రతినిధి,తిరుపతి: ‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్/డబ్ల్యూ 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చైర్పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. -
వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్
తిరుపతి నగర శివారు కరకంబాడిలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీల భూ ఆక్రమణ, దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడం అందరికీ తెలిసిందే. ఆ ఫ్యాక్టరీలే కాదు ఆయా యాజమాన్యాలకే చెందిన గల్లా ఫుడ్స్ నిర్వాకం వాటికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఊరి కోసం గ్రామస్తులు సాధించుకున్న రోడ్డును సైతం మింగేసి.. రైతుల పొలాలను నిరుపయోగం చేసిన వైనంపై ఇప్పుడు జిల్లాలో వివాదం రగులుతోంది. (చదవండి: దలాల్ స్ట్రీట్: అతిగా ఆశపడ్డారో అంతే!!) సాక్షి ప్రతినిధి, తిరుపతి: అమరరాజా ఫ్యాక్టరీల యాజమాన్యానికి చెందిన గల్లాఫుడ్స్ భూ ఆక్రమణలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. పూతలపట్టు మండలం తేనేపల్లి రెవెన్యూ గ్రామంలో 2011 సంవత్సరంలో ఏపీఐఐసీ అధికారులు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ కోసం భూ సేకరణ చేపట్టగా గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. 12 ఎకరాల 30 సెంట్ల పంటపొలాల సేకరణతో పాటు లక్ష్మీపురం గ్రామానికి వెళ్లే రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నంబర్ డబ్ల్యూపీ 15308/2011తో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆ రోడ్డును 2000 సంవత్సరంలో నాటి ఎంపీ, దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మాణం చేపట్టారు. దాదాపు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం చిత్తూరు ఆర్డీఓకి ఆదేశాలు జారీచేసింది. గ్రామస్తుల అభ్యంతరాలతో 2012లో అప్పటి ఆర్డీఓ భూసేకరణను నిలిపివేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉందనుకున్నా మళ్లీ 2014లో గల్లా ఫుడ్స్ ప్రమేయంతో సమస్య మొదటికొచ్చింది. 2014లో గల్లా మాస్టర్‌ప్లాన్ 2014లో గల్లా ఫుడ్స్ యాజమాన్యం పూతలపట్టు మండలం పేటఅగ్రహారం గ్రామంలోని కొన్ని భూములను ఏపీఐఐసీ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) పేరిట సేకరించింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న తేనేపల్లిలోని ఆ 12 ఎకరాల 30 సెంట్ల రైతుల భూములను కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ పొలాలకు వెళ్లే బీటీ రోడ్డును గల్లా ఫుడ్స్ కంపెనీ భూముల్లోకి కలిపేసుకుని భారీ ఎత్తున ప్రహరీ గోడ కట్టేసింది. దీంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గ్రామస్తులు తిరిగి హైకోర్టుకు వెళ్లి ఆర్డీఓపై 2017లో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇందుకు ఆర్డీఓ కోర్టులో సమాధానమిస్తూ భూసేకరణ ఎప్పుడో నిలిపివేశామని, ఈ విషయం కోర్టు ధిక్కరణ కిందకు రాదని విన్నవించారు. దీంతో చట్ట ప్రకారం గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం రైతులకు సూచించింది. ఇక అప్పటి నుంచి రైతులు, గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండానే పోయింది. జేసీకి విచారణ బాధ్యత ఊరి రోడ్డును గల్లా ఫుడ్స్ ఆక్రమించిందంటూ తేనెపల్లి రెవెన్యూ విలేజ్ లక్ష్మీపురం గ్రామస్తులు నాకు ఫిర్యాదు చేశారు. నేను వాస్తవ నివేదిక తెప్పించాలని జాయింట్ కలెక్టర్‌ను కోరాను. మొత్తంగా ఆ వ్యవహారంపై విచారణ బాధత్యలను జేసీకి అప్పగించాను. – హరినారాయణన్, జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా న్యాయం చేయాలి ప్రభుత్వ ఆస్తి అయిన రోడ్డును ఆక్రమించి, రైతుల పొలాలకు ప్రవేశాన్ని అడ్డగించి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్న గల్లా ఫుడ్స్ యాజమాన్యంపై అధికారులు ఇప్పటికైనా సీరియస్‌గా దృష్టి సారించాలి. గల్లా ఫుడ్స్ దౌర్జన్యం ఫలితంగా 335, 337/1 సర్వే నంబర్లలో నాకున్న ఏడు ఎకరాల పొలం దాదాపు ఆరేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయింది. మేము ఎన్ని సార్లు మా పొలంలోకి వెళ్లేందుకు యత్నించినా గల్లా ఫుడ్స్ సంబంధీకులు అడ్డుకుంటున్నారు. అధికారబలంతో బెదిరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గల్లా ఫుడ్స్ ఆక్రమణలను తొలగించి రైతులకు న్యాయం చేయాలి. – గాలి పురుషోత్తం నాయుడు, రైతు, తేనేపల్లి మా ఊరికే రోడ్డు లేకుండా చేశారు గల్లా ఫుడ్స్ రాకతో మా ఊరికి రోడ్డు లేకుండా పోయింది. ఉన్న బీటీ రోడ్డును ఎంచక్కా ఆక్రమించి, కంపెనీ ప్రహరీగోడ చుట్టూ ఓ గతుకుల రోడ్డు వేసింది. ఇది వాడుకోండి అంటున్న ఫ్యాక్టరీ నిర్వాకంపై అధికారులు దృష్టి సారించాలి. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, న్యాయం చేయాల్సి ఉంది. –గురుస్వామి, వజ్రాలశెట్టి రాజేశ్, హరి, తులసీనాథ్ మాకు అన్యాయం చేశారు మా పొలాలను ఆక్రమించేసుకుని చుట్టూ గోడ కట్టేసుకున్నారు. ఇదేమిటని అడిగితే పరిహారం ఇస్తామని అన్నారు. మొత్తంగా మా పొలాలకు రూ.80 లక్షల పరిహారం వస్తుందని లెక్కగట్టగా రూ.8లక్షలు ఇచ్చి బెదిరించి పంపించివేశారు. – మహేశ్వరమ్మ, మహిళా రైతు, లక్ష్మీపురం చదవండి: లిప్‌స్టిక్ తయారిలో వాడే గింజలు ఏంటో తెలుసా..! -
నకిలీ సొసైటీ పేరుతో రూ.14కోట్ల స్థలానికి ఎసరు!
చంచల్‌గూడ: అక్రమార్కులు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ కోట్ల విలువ చేసే స్థలానికి ఎసరు పెడుతున్నారు. ఒక సొసైటీలోని కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధంగా మరో సొసైటీ ఏర్పాటు చేసి రూ.14 కోట్లు విలువ చేసే స్థలాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పథకం పన్నారు. ♦ కుర్మగూడ డివిజన్ మాదన్నపేటలో దయానంద వెజిటెబుల్ మార్కెట్ పేరుతో 4 ఎకరాల్లో కూరగాయల మార్కెట్ 1980లో స్థాపించారు. ♦ ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు అసలైన సంస్థకు ‘శ్రీ’జోడించి శ్రీ దయానంద పేరుతో మరో నకిలీ సొసైటీ ఏర్పాటు చేశారు. స్థలం కాజేసేందుకు పథకం రచించారు. ♦ కమిటీకి సంబంధం లేని బయటి వ్యక్తికి దాదాపు 2500 గజాలు నకిలీ సొసైటీ పేరుతో అప్పజెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను మోసం చేసి చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు పాల్పడ్డారని అసలు కమిటీ ఆరోపణలు చేస్తోంది. ♦ స్థలం తీసుకున్న వ్యక్తి, నకిలీ సొసైటీ పేరుతో స్థలం అప్పజెప్పిన వారు పరస్పర కేసుల పేరుతో కుమ్మకై మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నకిలీ కమిటీ ఏర్పాటు చెల్లదంటూ సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు నకిలీ సొసైటీని రద్దు చేసింది. ♦ స్థలాన్ని మోసపూరితంగా కాజేసేందుకు యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అసలు కమిటీ సిద్ధమైనట్లు సమాచారం. -
భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు: అంబటి
సాక్షి అమరావతి: విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. లీజులు ముగిసినా కూడా భూములు ఖాళీ చేయలేదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు అయ్యన్న మర్చిపోయారా? భూ కబ్జాలపై అప్పటి మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేసింది గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో భూ కబ్జాలపై ఎల్లో పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని.. ముస్లిం వక్ఫ్ భూములను కూడా టీడీపీ నేతలు వదల్లేదన్నారు. ‘‘టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుంది. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు భూకబ్జాలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదంటూ’’ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే అంబటి అన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిక్మా ప్రతినిధులు -
పల్లా ఆక్రమణలకు చెక్
-
సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణలను గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఒకటి కాదు, రెండు కాదు రూ.669 కోట్ల విలువ చేసే ఏకంగా 38.45 ఎకరాల ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాక్షి, విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం(గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అండ్ కో సాగించిన భూదందాకు రెవెన్యూ యంత్రాంగం ఫుల్స్టాప్ పెట్టింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వెంటనే.. ప్రభుత్వ భూములపై ఎగబడి బంధుగణంతో కలిసి అందినకాడికి ఆక్రమించుకున్న పల్లా శ్రీనివాసరావు ఆక్రమణల బాగోతాన్ని సర్వే నంబర్లతో సహా ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆయా సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల పరిస్థితులను పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించగా.. ఆక్రమణలు తొలగించి.. స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఆదివారం ఉక్కుపాదం మోపారు. గత 15 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పలు కంపెనీలకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే బంధుగణం దర్జాగా అనుభవిస్తున్న ప్రభుత్వ ఆక్రమిత భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యల్ని వేకువ జామున 3 గంటల నుంచి ప్రారంభించారు. మూడు ప్రాంతాల్లో 38.45 ఎకరాలు స్వాదీనం గాజువాక నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జాగా, పోరంబోకు స్థలం, ప్రభుత్వ భూమి, చెరువు.. ఏం కనిపించినా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. జగ్గరాజుపేట, తుంగ్లాం, కూర్మన్నపాలెం రెవెన్యూపరిధిలో ఆక్రమించేసుకున్న 38.45 ఎకరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 28–1, 28–2లో 1.26 ఎకరాలు వాగు స్థలం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తుంగ్లాంలోని సర్వే నం.9–6, 10–2లోని 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.12–1 నుంచి 12–14 వరకూ 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 14–1లోని 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, సర్వే నం.28లోని 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 29/1బీలోని 0.70 ఎకరాల ఇనాం భూములు, 29/2లోని 0.80 ఎకరాల పోరంబోకు బంద, 30–12, 30–13, 30–15లోని 2.04 ఎకరాల గయాలు భూములు, 33/2, 33/4లోని 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.34–2లోని 0.24 ఎకరాల పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కూర్మన్నపాలెంలోని సర్వే నం. 8/6లోని 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్అండ్టీ, హెచ్‌పీసీఎల్ సంస్థలకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొలగింపు చేపట్టే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆయా సర్వే నంబర్లలోని ఆక్రమణలను ఆర్డీవో పెంచల్కిశోర్, గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయా భూములు ఆక్రమణలకు గురయ్యాయని నిర్థారించిన అనంతరం తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ తొలగింపులో గాజువాక, కూర్మన్నపాలెం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పాటు గాజువాక పోలీసులు పాల్గొన్నారు. మార్కెట్ విలువ అక్షరాలా రూ.669.26 కోట్లు పల్లా ఆక్రమించి అనుభవించిన భూముల విలువ మార్కెట్లో భారీగానే ఉంది. తనతో పాటు బంధుగణంతో కలిసి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న 1.26 ఎకరాల భూమి మార్కెట్‌విలువ రూ.12.81 కోట్లుంది. అదేవిధంగా తుంగ్లాం రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న భూముల విలువ రూ. 613,32,48,000. కూర్మన్నపాలెంలో ఆక్రమించిన భూమి విలువ రూ.43.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రూ.669.26 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దేవస్థాన భూముల ఆక్రమణలపై మరోసారి విచారణ.. ఏళ్ల క్రితం జగ్గరాజుపేట, తుంగ్లాం రెవెన్యూ పరిధిల్లో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ మధ్య కాలంలో వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలనతో పాటు ఆక్రమిత స్థలాల్లో సర్వే జరిపిన అనంతరం ప్రభుత్వ భూములుగా గుర్తించాం. అనంతరం ఆక్రమిత స్థలాలను స్వా«దీనం చేసుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆర్డీవో ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిచే ప్రక్రియ చేపట్టాం. ఆక్రమణల్లో కొన్ని భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని దేవస్థానం ఈవో గుర్తించారు. అవి వారి పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆక్రమణలు గురైనట్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై మరోసారి విచారణ చేపట్టి రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగిన తర్వాత చర్యలకు సిద్ధమవుతాం. కబ్జాకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – ఎంవీఎస్ లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్ -
విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు బట్టబయలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ మహానగరం టీడీపీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకుంది. టీడీపీ నేతల చెర నుంచి విశాఖను ప్రభుత్వం విడిపిస్తోంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని భూకబ్జాదారుల్లో టీడీపీ నేతలే అత్యధికంగా ఉన్నారు. కబ్జా భూములు చేజారిపోవడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అక్రమాలు బయటపడటంతో గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెడుతూ బుకాయింపులకు దిగుతున్నారు. టీడీపీ నేత పల్లా శ్రీను ఆక్రమణలో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆక్రమణల తొలగింపుపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల భూకబ్జాపై ఉక్కుపాదం మోపాలని విశాఖ వాసులు కోరుతున్నారు. చదవండి: చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి Palla Srinivasa Rao: కబ్జాచేసి.. లీజుకిచ్చి -
టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం
-
చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో విశాఖలో భారీగా భూకబ్జాలు జరిగాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలపై కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం తమకు లేదని.. తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను చంద్రబాబు సమర్థిస్తారా? అని అవంతి ప్రశ్నించారు. ఎంతటివారైనా చర్యలు తప్పవు.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. టీడీపీ నేతల భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు. సిట్ నివేదిక బయటపెడతాం.. ‘‘విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక బయటపెడతాం. పల్లా సింహాచలం అండ్‌కో రూ.700 కోట్ల విలువైన భూకబ్జా చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాతోపాటు కొంత భూమిని అమ్మేశారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం. త్వరలో ఎన్ఏడీ ఫ్లైఓవర్, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. బీజేపీ నేతలకు విశాఖపై ప్రేమ ఉంటే రైల్వే జోన్ తీసుకురావాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని.. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి అవంతి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం ప్రైవేట్ భూములు అవసరం లేదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే అదీప్‌రాజు విశాఖలో కబ్జాకు గురైన ప్రతి సెంటు భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. టీడీపీ నేత బండారు ఆక్రమణలు విశాఖ ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలు బయటకు రాకుండా జూమ్‌లో విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విశాఖలో వందల ఎకరాలు కబ్జా చేశారని.. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చదవండి: రూ.30 కోట్ల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత నేడు, రేపు భారీ వర్షాలు -
విశాఖలో టీడీపీ నేతల భుకబ్జాలు
-
Palla Srinivasa Rao: కబ్జాచేసి.. లీజుకిచ్చి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ భూములను చెరబట్టిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ దందాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏకంగా 56 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పల్లా అండ్ కో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో నిగ్గు తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక భూములు, రోడ్లు, చెరువులు.. ఇలా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కనిపించి న భూములన్నింటినీ పల్లా మింగేశారు. సాక్షి వరుస కథనాలతో.. పల్లా కుటుంబం భూ దందాలు, అక్రమాలను ‘సాక్షి’ వరుస కథనాలతో ఏప్రిల్‌లోనే వెలుగులోకి తేవడంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాం గం విచారణ చేపట్టింది. జాయింట్ కలెక్టర్ (ఆర్బీ అండ్ ఆర్) ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు సమగ్ర విచారణ జరిపా రు. రెవెన్యూ అధికారులు దాదాపు నెలన్నర పాటు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం భూ కబ్జాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు, చెరువులను సైతం ఆక్రమించినట్లు విచారణలో స్పష్టమైంది. గాజువాక మండలం తుంగ్లాంలో వివిధ సర్వే నంబర్లలో 56.07 ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించారు. కబ్జా భూములను లీజుకిచ్చి.. పల్లా కుటుంబ సభ్యులు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీజులకు ఇచ్చి నట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. హెచ్‌పీసీఎల్, ఎల్ అండ్ టీ లాంటి బడా సంస్థలతో పాటు చిన్న ప్రైవేట్ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు విచారణ నివేదిక పల్లా కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై గాజువాక తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది స్పష్టమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించా రు. సర్వే నెంబర్ల ప్రకారం ఆ స్థలం ఏ విభాగం కిందకు వస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి, ఎవరి ఆధీనంలో ఉంది? అనే విషయాలతో సమగ్ర నివేదిక రూపొందించారు. పల్లా భూ కబ్జాల బాగోతం.. ► తుంగ్లాం సర్వే నంబర్ 9/6లో ఉన్న 56 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకరరావు ఆక్రమణలోనే ఉందని అధికారులు నిర్ధారించారు. ► సర్వే నంబర్ 10/2లో 36 సెంట్ల పోరంబోకు భూమిని పల్లా శంకరరావు కబ్జా చేశారు. ఈ స్థలంలో ఏసీసీ షెడ్లు వేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ► సర్వే నంబర్ 14/1లో 14.5 ఎకరాల భూమిని పల్లా శంకరరావు ఆక్రమించినట్లు నిర్ధారించారు. ఇందులో 1.75 ఎకరాలను హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇవ్వడంతో గోడౌన్ నిర్మించినట్లు గుర్తించారు. మరో 10 సెంట్ల స్థలంలో జూబ్లీ ఇంజనీరింగ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షెడ్డు ఉంది. ► సర్వే నంబర్ 14/2లో 28 సెంట్ల రైత్వారీ భూమి పల్లా కబ్జాలో ఉన్నట్లు తేల్చారు. ► సర్వే నంబర్ 28లో ఉన్న 40 ఎకరాల చెరువు పల్లా శంకరరావు ఆధీనంలో ఉన్నట్లు తేల్చారు. ఇందులో 92 సెంట్లలో కాంపౌండ్ వాల్‌తో షెడ్డు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి సేకరించగా రైల్వే శాఖకు అప్పగించినట్లు ఉంది. ► సర్వే నంబర్ 33/4లో 13 సెంట్ల పోరంబోకు స్థలాన్ని పల్లా కబ్జా చేశారు. ఆ స్థలంలో హెచ్‌పీసీఎల్ గోడౌన్ ఉంది. ► సర్వే నంబర్ 34/2లో ఉన్న 24 సెంట్ల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చారు. సదరు సంస్థ ఈ స్థలంలో షెడ్డు నిర్మించింది. -
‘ఆ భూములు స్వాధీనం స్వాగతిస్తున్నాం’
సాక్షి, విశాఖపట్నం: గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘40 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ వాదన సమంజసంగా లేదు. 40 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకొని నిర్మాణాలు చేపడితే బాగుండేది. గీతం ఎవరికి ఉచితంగా విద్య అందించలేదు. టీడీపీ హయాంలో ఎందుకు గీతం 40 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేసుకోలేదని’’ ఆయన ప్రశ్నించారు. ఆక్రమణలో ఉన్న మిగతా భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలపై గత టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి వాస్తవాలు నేటికి బయటకు రాలేదని జేవీ సత్యనారాయణ మూర్తి దుయ్యబట్టారు. -
అమ్మకానికి ఇందిరమ్మ స్థలాలు..
మండపేట పట్టణానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలో ప్లాటు, గొల్లపుంత కాలనీలో ఇందిరమ్మ స్థలం మంజూరయ్యాయి. ఏదో ఒక పథకానికి మాత్రమే అర్హులన్న నిబంధనతో ఆమె స్థలాన్ని వదులుకుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని దళారులు అన్యాక్రాంతం చేసేశారు. తాజాగా కొనుగోలు చేసుకున్న వారు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతుండగా స్థానికుల ఫిర్యాదుతో హౌసింగ్ అధికారులు అడ్డుకుని నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. గొల్లపుంత కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెలుగు చూసిన ఉదంతమిది. బయటకు రాకుండా అన్యాక్రాంతమైన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇళ్లు 400 పైనే ఉంటాయని అంచనా. మండపేట: పట్టణంలోని ఇందిరమ్మ స్థలాల్లో రియల్ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఖాళీ స్థలం నుంచి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మేస్తున్నారు. వ్యాపారులు, దళారులతో పాటు ఉద్యోగులు సైతం బినామీ పేర్లపై ఇక్కడ స్థలాలు కొనుగోళ్లు చేసి నిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. పేదల స్థలాల్లో సాగుతున్న రియల్ వ్యాపారం ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో.. దివంగత వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకం మండపేటలో వేలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసింది. వైఎస్ ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి పట్టణంలోని గొల్లపుంతలో రెండు విడతలుగా 122.72 ఎకరాలను సేకరించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్థలసేకరణ. తొలి విడతలోని 55.77 ఎకరాల లేఅవుట్‌ను సెంటున్నర చొప్పున రెవెన్యూ అధికారులు 2,125 ప్లాట్లుగా విడదీశారు. 1,890 మంది లబి్ధదారులకు పంపిణీ చేయగా మిగిలిన 235 ప్లాట్లను ఖాళీగా ఉంచారు. 2010 నవంబరు నుంచి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అమ్మకానికి స్థలాలు, ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడడంతో అక్రమాలకు తెరలేచింది. పలువురు సొంతిళ్లు ఉన్న వారికి, రాజీవ్ గృహకల్పలో ప్లాట్లు మంజూరైన వారికి స్థలాలు మంజూరు చేశారు. ఇళ్లు ఉన్న వారు స్థలాల అమ్మకాలు మొదలుపెట్టడంతో పేదల స్థలాల్లో రియల్ వ్యాపారం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా దళారులు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు చేయిస్తున్నారు. లబి్ధదారుల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేసేస్తున్నారు. పేదలకు పంపిణీ చేయగా ఖాళీగా ఉంచిన 235 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. స్థలం రూ.మూడు లక్షల నుంచి ఉండగా, నిర్మాణంలో ఉన్నవి, పూర్తి చేసిన ఇంటిని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు ఇళ్లను నిర్మించి అద్దెకు ఇస్తుండడం గమనార్హం. పట్టణంతో పోలిస్తే కాలనీలో అద్దె తక్కువగా ఉండడంతో ఇక్కడకు అద్దెకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాలనీలో అద్దెకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు 300 కు పైగా ఉంటాయని అంచనా. బయట అద్దెలు చెల్లించలేక, అర్హత ఉన్నా స్థలం రాని పలువురు పేదవర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటువంటి వారికి అన్యాయం జరుగకుండా చూడడంతోపాటు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్జాగా కబ్జాలు కాలనీలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలీ్టకి ఆదాయం సమకూర్చే దిశగా పట్టణంలో మాదిరి కాలనీలోను మెయిన్ రోడ్డు వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గొడ్డు కాలువ వంతెన వద్ద నుంచి అందరికీ ఇళ్లు, ప్లాట్ల వరకూ రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల మేర స్థలం వదిలి మిగిలిన దానిలో ప్లాట్లను విభజించారు. కాగా విలువైన ఈ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కాలనీలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ స్థలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చానని, అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులేమీ రాలేని అన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను
వరికుంటపాడు: ఐదు సంవత్సరాలపాటు అధికారం చేతిలో ఉందని టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఇష్టారీతిగా ప్రవర్తించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఆక్రమించి సాగుకు అనువుగా తీర్చిదిద్దారు. కొందరు నాయకులు ఇంకా అదే పంథాను కొనసాగిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో కబ్జాపర్వం కొనసాగుతోంది ♦మండలంలోని బొంగరాలపాడులోని సర్వే నంబర్ 45లో 1,250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ♦ఇందులో కొంత భూమిపై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ♦మరికొంత భూమి ఖాళీగా ఉంది. వాటిని తమకు పంపిణీ చేయాలని 20 ఏళ్లపాటు మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామానికి చెందిన ఎస్టీ, ఎస్సీలతోపాటు ఇతర కులాలకు చెందిన పేదలు అధికారులకు అర్జీలిచ్చినా పట్టించుకోలేదు. ♦2009లో సదరు భూములను పేదలకు పంపిణీ చేయాలని అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ♦అర్హుల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఆ తర్వాత పలు పరిణామాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ♦2010 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీలో ఈ భూమి పేదలకు పంపిణీ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డి పట్టుబట్టినా, ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలు కాలేదు. ♦2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు భూ పంపిణీ ఆగిపోయింది. ♦గత ప్రభుత్వ హయాంలోనే కొంతమేర భూమి ఆక్రమణకు గురైంది. ఇటీవలి కాలంలో మరింత ఆక్రమించారు. ♦ఆక్రమిత భూముల విలువ రూ.80 కోట్ల ఉంటుందని అంచనా. తాజాగా.. ♦కొండాపురం మండలం కోవివారిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పిచ్చిమొక్కలు, పొదలు తొలగించారు. ♦దీంతో తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు నెలరోజుల క్రితం వరికుంటపాడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ♦వారు ప్రభుత్వ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ♦అయినా లెక్క చేయకుండా ట్రాక్టర్ల ద్వారా భూమిని దుక్కి చేశారు. ♦ఆక్రమణదారులు మినుము సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారని తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం బొంగరాలపాడులోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతున్నట్లు తెలిసింది. ఈ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. హెచ్చరికలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – చొప్పా రవీంద్రబాబు, తహసీల్దార్, వరికుంటపాడు -
వెలుగు చూస్తున్న కైలాస్ నాయక్ లీలలు..
కర్నూలు రూరల్: జిల్లాకు చెందిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాష్‌నాయక్ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. కుల సంఘం మాటున నేతగా ఎదిగిన ఇతను సొంత కులం వారినే వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గతంలో పేదల స్థలాలు కబ్జాలు చేయడమే కాకుండా బాధితులను ఊరు విడిపించిన ఉదంతాలూ ఉన్నాయి. కైలాష్‌నాయక్ కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. ఆయన అండతో మొన్నటి వరకు చిన్న చిన్న దందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఇతను ఇప్పుడు భారీ వసూళ్లకు తెరతీశాడు. కర్నూలు మండలం సుగాలి తండాలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి 1975లో కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద కుటుంబానికి ఐదెకరాల చొప్పున అప్పటి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. సర్వే నంబర్ 507ఏలోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు గాను ఎకరానికి రూ.18 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇదే సర్వే నంబర్లో కైలాష్ నాయక్‌కు కూడా ఐదెకరాల పొలం ఉంది. అయితే.. అందరికీ నష్టపరిహారం డబ్బు తానే తెప్పించానంటూ అక్రమ వసూళ్లకు తెర తీశాడు. ప్రతి ఒక్కరూ ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. ఇలా ఇప్పటికే రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా డబ్బు అందని వారి నుంచి ప్రాంసరీ నోటు కూడా రాయించుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన బాధితులను చంపేస్తానంటూ రివ్వాలర్‌తో బెదిరించాడు. దీంతో మూడు రోజుల క్రితం కైలాష్‌నాయక్‌పై బాధితులు కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత అండతో.. టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అండతో కైలాస్ నాయక్ దందాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి తండా, నందనపల్లి పంచాయతీలో వందకు పైగా భూదందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అతనికి భయపడి సుమారు 20 కుటుంబాలు ఊరు విడిచాయి. అమాయక ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి వాటిని ఆక్రమించుకున్నాడు. అతని అన్న కుమారుడు యోగేశ్‌నాయక్ కూడా స్థానికంగా దందాకు తెరతీశాడు. స్థానిక కల్లు దుకాణం నుంచి రైస్ మిల్లు వరకు మామూళ్లు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. మా డబ్బు ఇప్పించండి మాకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.18 లక్షలు ఇచ్చింది. ఇందులో సగం డబ్బు కైలాస్ నాయక్‌కే ఇచ్చాం. మా లాంటి వాళ్ల దగ్గర ఇంత డబ్బు వసూలు చేయడం దారుణం. అధికారులు మాకు డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలి. – పార్వతీ బాయి, సుగాలి తండా నేను తప్పు చేయలేదు తండాలో అందరూ మా రక్తసంబంధీకులే. మా కుటుంబ సభ్యులను నేను మోసం చేయను. నా జీవితంలో ఎన్నో కేసులు చూశా. వీటిని కూడా ఎదుర్కొంటా. నేను తప్పు చేశానని రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమే. – ఆర్.కైలాష్‌నాయక్ -
తమ్ముళ్ల రియల్ దందా
గోరంట్ల–హిందూపురం రహదారికి ఆనుకుని టీడీపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వరరావు వేసిన వెంచర్ ఇది. ఈ పక్కన ఉన్న బ్లూకలర్ బిల్డింగ్ క్యాంటీన్. ఈ వెంచర్‌కు వెళ్లే ప్రధాన రహదారి, క్యాంటీన్ ఏర్పాటు చేసిన స్థలం రస్తా పొరంబోకు. కానీ టీడీపీ హయాంలో సదరు రియల్ వ్యాపారి అప్పటి టీడీపీ నేతల అండతో దాదాపు 97 సెంట్లు ఆక్రమించాడు. దర్జాగా తన వెంచర్‌కు దారి ఏర్పాటు చేసుకోవడంతో పాటు పక్కనే క్యాంటీన్ ఏర్పాటు చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీడీపీ నేత ఆక్రమించిన రస్తా పొరంబోకు స్థలం విలువ మార్కెట్లో రూ.కోటిపైనే. అయినా ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోని పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జిల్లాలోనే పేరుగాంచిన ప్రాంతం గోరంట్ల. ఇక పాలసముద్రం పేరు చేబితేనే రియల్ భూం కళ్లముందు గిర్రున తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నాసన్, బెల్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తుండగా.. భూములకు రెక్కలొచ్చాయి. సెంటు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు రియల్ వ్యాపారాన్ని జోరుగా సాగించారు. ఏకంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. గోరంట్ల: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ‘కియా’ అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడంతో పాలసముద్రం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటికే అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. ఆ పార్టీ అధికారంలో ఉండగా కబ్జారాయుళ్ల అవతారమెత్తారు. కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇలా వెంకటేశ్వరావు అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గత టీడీపీ హయాంలో పాలసముద్రం సమీపంలోన హిందూపురం–కదిరి ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్ 230, 232లో 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని ఆక్రమించి తాను ఏర్పాటు చేసిన వెంచర్లో కలిపేసుకున్నాడు. వెంచర్‌కు వెళ్లేందుకు రస్తాపొరంబోకులోనే ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడంతో పాటు పక్కనే క్యాంటీన్ నిర్మించాడు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇబ్బంది లేకుండా ప్రభుత్వ భూమిలోనే వినాయకుడి గుడి నిర్మించాడు. కళ్లముందే ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోని పరిస్థితి. పైగా సదరు వ్యాపారి వద్ద ముడుపులు తీసుకుని ఆక్రమణకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గోరంట్లలో మరో తమ్ముడి నిర్వాకం గోరంట్లకు చెందిన మరో టీడీపీ నేత ఆక్రమణల్లో తాను తక్కువ తినలేదని నిరూపించాడు. కదిరి– హిందూపురం ప్రధాన రహదారి పక్కన మార్కెట్ యార్డు సమీపంలో 275–4 సర్వే నంబర్లోని 24 సెంట్ల రస్తాపొరంబోకు భూమిని ఆక్రమించి తన పొలంలో కలిపేసుకున్నాడు. అక్కడ చిన్న చిన్న హోటళ్లు, వ్యాపార సముదాయలు ఏర్పాటు చేసి నెలనెలా బాడుగలు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ సెంటు భూమి రూ.8 లక్షల పైమాటే. భవిష్యత్ అవసరాల కోసం వదలిన రస్తాపొరంబోకు స్థలాలను టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గోరంట్లలోని రస్తా పొరంబోకులో టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన దుకాణాలు నోటీసులిచ్చాం పాలసముద్రం రెవెన్యూ పొలం సర్వే నంబర్ 230, 232లోని 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించినట్లు గుర్తించాం. గత ఆగస్టులోనే సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి నోటీసులు జారీ చేశాం. అలాగే గోరంట్లలోని సర్వే నంబర్ 275–4లోని 24 సెంట్ల రస్తా పొరంబోకును మరో వ్యక్తి అక్రమించినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తాం. – బాలకిషన్, తహసీల్దార్, గోరంట్ల -
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..
సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్రమార్కులపై కఠిన చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగానే బాలాజీ టింబర్ డిపో వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎస్పీ రమేష్‌రెడ్డి రంగంలోకి దిగారు. డిపోలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన 12 మందిని అరెస్టు చేసి కేసు నమోదుచేశారు. డిపో వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిపిరి సీఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. భూ కబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ రమేష్ రెడ్డి, ఆర్డీఓ కనకనరసారెడ్డి హెచ్చరించారు. టింబర్ డిపో విషయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎస్పీ, ఆర్డీఓ దూకుడుగా వ్యవహరించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. (చదవండి: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్) టీడీపీ హయాంలోనే భూకబ్జాలు తిరుపతి, చంద్రగిరి, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి పరిధిలోని టీడీపీ నాయకులు, వారి బంధువులు, అనుచరులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూఆక్రమణకు పాల్పడ్డారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్వర్ణ ముఖి నదీ, పోరంబోకు, మఠం, కాలువ, ఇనాం, ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. పద్మావతీపురం వద్ద మాజీ ఎమ్మెల్యే అల్లుడు కుంటపోరంబోకు భూ మిని ఆక్రమించి పెద్ద అపార్ట్మెంట్ నిర్మిస్తున్నట్లు ఆ రో పణలు ఉన్నాయి. శిల్పారామం ఎదురుగా ఉన్న భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆ క్రమించి సొమ్ముచేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లెలో కోట్ల రూపాయల విలువచేసే భూములను కాజేశారు. మాజీ సైనికుల పేర్లతో కొన్ని, వారికి కేటాయించిన భూములు మరికొన్ని ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూముల్లోనే టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి అనుభవిస్తున్నారు. పీలేరులో ఓ నాయకుడి సహకారంతో అనుచరులు సుమారు 2 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి కోట్ల రూపాయలు కాజేశారు. శ్రీకాళహస్తిలోని అయ్యలనాడు చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. టీడీపీ హయాంలోనే మాజీ మంత్రి సహకారంతో చెరువు దురాక్రమణ అ య్యింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కూడా కమీషన్లు పుచ్చుకుని భారీగా జేబులు నింపుకున్నారనే విమర్శలున్నాయి. పాడిపేట, వికృతమాల, తనపల్లె సమీపంలో నిర్మించిన గృహ స ముదాయాల్లో ఎక్కువ నివాసాలను తమ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రీ సర్వేతో భూ ఆక్రమణలకు చెక్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి రెవెన్యూ డివిజినల్ పరిధిలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేందిలేదని, క్రిమినల్ కేసులు న మోదు చేస్తామని ఆర్డీఓ వి.కనకనరసారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న భూ వివాదాలకు రీ సర్వేతో చెక్ పడ నుందని తెలిపారు. కొన్ని రోజులుగా తిరుపతి రెవెన్యూ డివిజినల్ పరిధిలో భూ ఆక్రమణపై వస్తున్న ఫిర్యాదులపై గురువారం ఆయన మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో నిజమైన భూ యజమానులను కొంతమంది దుండగులు బెదిరించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ప్రభుత్వ, నదులు, కాలువ, చెరువులకు సంబంధించిన భూములను, నిజమైన పట్టాదారుల భూము ల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఎవరైనా అక్రమార్కులకు సహకరిస్తే శాఖా పరమైన చర్యలతో పాటు, కేసులు నమోదు చేస్తా మని స్పష్టం చేశారు. భూ అక్రమణలు, కబ్జాలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టనుందన్నారు. భూముల రీ సర్వేతో రాష్ట్ర రెవెన్యూ విభాగంలో చారిత్రాత్మఘట్టం ప్రారంభం కానుందని, దీంతో గ్రామీణ, పట్టణ ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేకూరనుందని ఆర్డీఓ కనకనరసారెడ్డి తెలిపారు. -
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా(కడప) : బద్వేలులో టిడిపి మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువులు భూదందాకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా చెన్నంపల్లె రెవెన్యూ పొలంలోని విద్యానగర్‌లో సర్వే నెంబర్ 1774/1,1774/2 లో సుమారు అయిదు ఎకరాల భూమిని కబ్జా చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువుల హస్తం కూడా ఉంది. ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలంలో ప్లాట్ల పేరిట అడ్డగోలుగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ భూ కబ్జాపై స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మొత్తం వ్యవహారం బయటపడింది. -
అటవీ భూమి హాంఫట్..!
తిమ్మపాలెం (పొన్నలూరు): పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెం గ్రామంలో చెరుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 787, 787/1తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారుగా 1708 ఎకరాల ఫారెస్ట్, పశువుల మేత బీడు భూములు విస్తారంగా ఉన్నాయి. వీటిలో సుమారు 700 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతిపరులు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అప్పటి నుంచి నేటి వరకు అక్రమార్కులు తమ పట్టా భూమికి సమీపంలో ఉన్న అటవీ, పశువుల బీడు భూములను కొంచెం, కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. రోజులుగా అటవీ భూములను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా చదును చేసి జామాయిల్, కంది, బత్తాయి, వరి, మినుముతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మొదటిలో కొంత భూమిని మాత్రమే ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ఈ వ్యవహారాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఎకరాల కొద్దీ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణకు అలవాటుపడిన గ్రామంలోని టీడీపీ నాయకులు నేడు కూడా యథేచ్ఛగా అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగే ఒక దళారిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ తమపని తాము కానిస్తున్నారు. ఆక్రమిత భూమి విలువ ఎకరా రూ.3 లక్షలు: ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి విలువ నేడు బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలా ఆక్రమణకు గురైన వందల ఎకరాల అటవీ, పశువుల బీడు భూముల విలువ నేడు కోట్లలోనే ఉంది. అలాగే కొందరు అక్రమార్కులు వారు ఆక్రమించిన భూములకు ఎలాంటి పత్రాలు లేకుండానే మరొకరికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి ఎకరా భూమి రూ.6 వేలు చొప్పున కౌలు కింద ఇస్తున్నారు. ఆక్రమిత భూమికి దొంగ చాటుగా పట్టాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అక్రమాల వలన కనీసం గ్రామంలోని పశువులు ఈ భూముల్లోకి వెళ్లడానికి దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నుతుంటే గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదని గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకుంటూ పోవడం వలన పశువులు కూడా అటుగా పోయే మార్గం లేదని టీడీపీ సానుభూతిపరులను నిలదీశారు. మీ చర్యలు వలన గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు.. ఇదిలా ఉంటే తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆక్రమణదారులకు నోటీసులు పంపించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యవసాయ పనులు చేస్తే ట్రాక్టర్లను సైతం సీజ్ చేస్తామని గ్రామంలో ఇటీవల దండోరా కూడా వేయించి, ప్రభుత్వ భూమిలోకి ఎవరు వెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులు కావాలనే రెవెన్యూ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్చరిక బోర్డులను తొలగించి తమ పట్టా భూములకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్లతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాము అటవీ, పశువుల బీడు భూములను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లవద్దని చెప్పినా వారు వెళ్లిపోయిన తరువాత అక్రమార్కులు తమపని తాము కానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటవీ, పశువుల బీడు భూముల ఆక్రమణపై స్పందించి పటిష్ట చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా
సాక్షి, గుంటూరు/మంగళగిరి: ఓ మహిళ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఎలాగైనా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆమె బతికుండంగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మరో మహిళను స్థల యజమాని కూతురుగా సృష్టిస్తూ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందారు. రూ.70 లక్షలకు పైగా విలువ స్థలాన్ని కబ్జా చేయడానికి అక్రమార్కుల వేసిన పన్నాగం స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే 1980 మే 31న విజయవాడకు చెందిన కాగిత సత్యవతి మంగళగిరి మండలం నవులూరు పశువుల ఆసుపత్రి వద్ద సర్వే నెంబర్ 795/1, ప్లాట్ నెంబర్ 22లో 436 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంపై కన్నేసిన కొందరు సత్యవతి 1993 మే 4వ తేదీన మృతి చెందినట్లు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అదే విధంగా సత్యవతితో ఏ సంబంధం లేని శైలజ అనే మహిళను కుమార్తెగా చూపిస్తూ మంగళగిరి తహసీల్దార్ మంజూరు చేసినట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారు. వీటిని అడ్డంపెట్టుకుని మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 623/2020తో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె మురళీకృష్ణ పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇతను విలేకరి(సాక్షి కాదు)గా పని చేస్తున్నాడు. ఈ ధ్రువపత్రాలతో స్థలం అమ్మకానికి పెట్టగా విషయం స్థల యజమాని సత్యవతికి తెలిసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ నెల తొమ్మిదో తేదీన కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఏ1 గాదె మురళీకృష్ణ, ఏ2 శైలజలుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏ2 శైలజను అరెస్టు చేసిన అధికారులు విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి సంతకాలు పెట్టిన నవులూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించినట్లు సమాచారం. ఆ ముగ్గురే కీలకం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలం కబ్జా చేయడంలో టీడీపీకి చెందిన యర్రబాలెంకు చెందిన ఓ రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన ఓ విలేకరి(సాక్షి కాదు), మంగళగిరికి చెందిన మరో వ్యక్తి కీలకమని సమాచారం. ఈ ముగ్గురే పెట్టుబడి పెట్టి నకిలీ పతకం ప్రకారం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గాదె మురళీ సహా యర్రబాలెంకు చెందిన టీడీపీకి చెందిన రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. రూ.20 వేలు ఇచ్చి నమ్మించి తన పేరిట ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసుల ఎదుట శైలజ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసు రాజీకి యత్నం కబ్జా వ్యవహారంలో కీలకం పాత్ర పోషించిన ఈ ముగ్గురు ఫిర్యాదుదారులను భయబ్రాంతులకు గురిచేసో, డబ్బు ఇస్తామనో కేసు రాజీ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి ప్రాంతాల్లో రౌడీ షీటర్లు, కొందరు వైట్ కాలర్ నేరస్తులు ఈ తరహాలో భూకబ్జాలకు పాల్పడటం ఇది మొదటి సారి ఏమీ కాదు. గతీడాది మంగళగిరిలో జరిగిన ఓ మాజీ రౌడీషీటర్ హత్యకేసులో కీలక నిందితుడు రౌడీషీటర్ సుమారు రెండు నెలల క్రితం పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో స్థల వివాదం దౌర్జాన్యానికి దిగాడు. తన బావ పేరిట అక్రమ స్థల రిజిస్ట్రేషన్ చేయించి ఎదుటి వారి స్థలాన్ని కబ్జా చేసేందుకు సదరు రౌడీషీటర్ తన అనుచరుల పంపి స్థల యజమానులు వేసుకున్న సరిహద్దు కంచెలను తొలగించారు. ఈ వ్యవహారంలో రౌడీషీటర్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని అప్పట్లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయం కోసం బాధితులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రౌడీషీటర్‌ను తప్పించి కేసు నమోదు చేశారని విమర్శలున్నాయి. -
అమ్మవారి ఆస్తిని బ్యాంక్‌లో తాకట్టు
ప్రకాశం,మర్రిపూడి: వెనుకబడిన మర్రిపూడి మండలంలో దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. అక్రమార్కులకు మర్రిపూడి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొందరు దేవదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్‌పుస్తకాలు సృష్టించుకున్నారు. భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దేవాలయ భూములను పలు బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు. గ్రామ దేవతలకు చెందిన భూములను కూడా వదలడం లేదు. అక్రమార్కుల చెర నుంచి గ్రామ దేవతల భూమికి విముక్తి కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ ఎస్.సువర్ణరావు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు సోమవారం వినితిపత్రం సమర్పించారు. ఇదీ..అక్రమార్కుల దుర్బుద్ధి మండల కేంద్రం మర్రిపూడికి ఉత్తరం వైపున నూకల పరమేశ్వరి అమ్మవారి (గంగమ్మ) గుడి ఉంది. ఆ గుడిని పురాతన కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పిచేందుకు అప్పట్లో అమ్మవారికి 20 ఎకరాలను దాతలు కేటాయించారు. 20 ఎకరాల్లో 13 ఎకరాల భూమి పూజారి కింద ఉంది. మిగిలిన అమ్మ వారి భూమిపై భూకబ్జాదారుల కన్ను పడింది. సర్వే నంబర్ 978–1లో 5.62 ఎకరాల భూమి, సర్వే నంబర్ 978–2లో 1.47 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో దేవదాయ శాఖ అధికారులకు సైతం తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మర్రిపూడి, పొదిలికి చెందిన ఇద్దరు ఈ భూమిని గుర్తించి కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు సీఎస్‌పురం మండలం పెదగోగులపల్లికి చెందిన ఆకుమళ్ల వెంకటేశ్వర్లును సంప్రదించి మర్రిపూడి రెవెన్యూ పరిధిలో మీ పూర్వికులకు చెందిన ఆస్తి ఉందని, ఆ భూమి తమకు విక్రయించాలని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు పొదిలి సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి 2011 ఏప్రిల్ 18న ఆ ఇద్దరు అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ చేశాడు. అమ్మవారి భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి సిండికేట్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి దాదాపు రూ.6 లక్షలుపై చిలుకు రుణం తీసుకున్నారు. అది అమ్మ వారి భూమని తనకు తెలియదని, వారిద్దరు వచ్చి తనను ప్రలోభాలకు గురిచేసి తనతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమి వెంటనే అమ్మవారికి చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆకుమళ్ల వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
‘మూసీ’ స్థలాల్లో కబ్జాల జోరు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది తీరప్రాంతాల్లోని ఖాళీ స్థలాలకు పర్యవేక్షణ కరువైంది. పరివాహక ప్రాంతంలో గుర్తించిన ఆక్రమిత స్థలాలు సైతం దర్జాగా మళ్లీ మళ్లీ కబ్జాలకు గురవుతున్నా.. పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వ సైన్ బోర్డుల సాక్షిగా అక్రమార్కులు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సరిగ్గా గతేడాన్నర క్రితం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్ధలాల ఆక్రమితపై రెవెన్యూ యంత్రాంగం కొరఢా ఝలిపించింది. చార్మినార్ మండల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఆరు స్థలాల్లో ఆక్రమణలు తొలగించడంతో పాటు చాదర్‌ఘాట్ నుంచి ఇమ్లిబన్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన వెలిసిన ప్రైవేటు ల్యాండ్ అనే బోర్డును తొలగించి ప్రభుత్వ సైన్‌బోర్డును ఏర్పాటు చేశా రు. ఖాళీ స్థలంలో అక్రమంగా నిలుపుతున్న వాహనాలను ఖాళీ చేయించి అక్కడి స్థలంలో సైతం మరో సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. యథాతథంగా ఖాళీ స్థలం ప్రయివేటు బస్సులు, వాహనాలకు అడ్డాగా మారింది. కొన్నిచోట్ల మళ్లీ గుడిసెలు వెలిశాయి. ఆక్రమిత స్థలాలు 8529 పైనే. నగరంలోని మూసీ ప్రరివాహక ప్రాంతంలో ఆక్రమిత స్థలాలు 8529 పైనే ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వాస్తవంగా గతేడాదిన్నర క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా మూసీ నదీ తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించి ఆక్రమిత స్థలాలను గుర్తించింది. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నదీ పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్ధితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. మండలాల వారిగా మూసి నది మొత్తం, పొడవు,ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరిల వారిగా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాటి రక్షణ చర్యలు చేపట్టినా..అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మండలాల వారిగా... నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మండల వారిగా ఆక్రమిత స్థలాలను పరిశీలిస్తే... ఆసిఫ్‌నగర్ మండలంలో 667, అంబర్‌పేట పరిధిలో 989, బహద్దూర్‌పురా పరిధిలో 4,225, చార్మినార్ పరిధిలో 73, గోల్కొండ పరిధిలో 517, హిమాయత్‌నగర్ పరిధిలో 499, నాంపల్లిలో 658, సైదాబాద్ పరిధిలో 902 ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై రెవెన్యూ యంత్రాంగం అక్రమిత స్థలాలపై దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ, భవానీ నగర్‌కు చెందిన పొన్నబోయిన శ్యామలాదేవి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో న్యాయవాది రాపోలు భాస్కర్‌తో కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. సూరారంలో మంత్రికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్య తనకు ఎకరా 33 గుంటల భూమి ఉందని, దీనిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారని ఫిర్యాదులో శ్యామలాదేవి పేర్కొన్నారు. స్థానిక సంబంధిత అధికారులు కూడా మంత్రికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. మంత్రి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి నుంచి ఆయన అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 13కు కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను అందజేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. -
బిగుస్తున్న ఉచ్చు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ ఊట్కూరు: ఎట్టకేలకు... రెవెన్యూలో అవినీతి ఉద్యోగుల ఆట కట్టయింది. ప్రభుత్వ భూములను తమ కుటుంబీకులు, బంధువుల పేర్ల మీద పట్టా చేసుకున్న నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలానికి చెందిన ముగ్గురు వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వీఆర్వోపై మంగళవారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సర్కారు భూములను కాపాడాల్సిన ఉద్యోగులే వాటిని కబ్జా చేసిన తీరుపై ఈ నెల ఎనిమిదో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘సర్కారు భూమికి ఎసరు?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఊట్కూర్ వీఆర్వో భీమయ్య, వీఆర్ఏ రాజప్ప, భీంరావు, బాపూర్ వీఆర్ఏ జ్యోతిలను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వీఆర్ఏలను తహసీల్దార్ దానయ్య సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయగా.. వీఆర్వో భీమయ్యపై నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపారు. ఆయన్ను కలెక్టర్ మంగళవారం సస్పెండ్ చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఊట్కూర్ శివారులోని సర్వే నం. 708/2, 3–11 ఎకరాలు, సర్వే నం. 194అ లో 1–12 గుంటలు, సర్వే నం. 702అ లో ఎకరం, సర్వే నం. 703/2లో 3–38 ఎకరాలు, దంతన్‌పల్లి శివారులోని సర్వే నం.189/ఉ,, సర్వే నం. 189/ఊ, రెండెకరాల చొప్పున, బాపూర్ గ్రామ శివారులోని సర్వే నం. 30/ఎఅ లో ఐదెకరాలు మొత్తం 21.81ఎకరాలనుతమ కుటుంబీకుల పేరిట పట్టా చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్ దానయ్య అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. నివేదికను కలెక్టర్‌ను పంపడంతో ఆమె నలుగురు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశింశారు. పాత్రధారులా? సూత్రధారులా? నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపులపై ‘సాక్షి’ వరుస కథనాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నెల 8న ‘సర్కారు భూమికి ఎసరు?’ శీర్షికతో 21.81 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై కథనం ప్రచురించగా.. 10వ తేదీన ‘భూ మాయ’ శీర్షికతో అదే మండలంలో మరో 75 ఎకరా ల ప్రభుత్వ స్థలం బయటి వ్యక్తులకు అక్రమంగా ప ట్టా చేసిన ఉదంతంపై కథనం ప్రచురించింది. కథనా లపై స్పందించిన కలెక్టర్ హరిచందన దాసరి.. అక్రమాల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుత ఉద్యోగాల్లో కొనసాగుతూ ప్రభుత్వ భూ ముల్నే కాజేసిన సిబ్బందిపై వేటు వేశారు. అలాగే.. అక్రమ పట్టాలు సృష్టించి ఇతరులకు 75 ఎకరాలు ధారాదత్తం చేసిన ఉద్యోగులపైనా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ అక్రమ వ్యవహారంలో వేటు పడ్డ ఉద్యోగులు కేవలం పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు పైస్థాయి అధికారులేననే చర్చ ఉమ్మడి జిల్లాలోనే హాట్‌టాపిక్‌గా మారింది. పైస్థాయి అధికారుల ప్రమేయం లే కుండా భూ అక్రమం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టాలుగా మారినా పైస్థాయి అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించిన అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించిన ట్లు ప్రచా రం జరుగుతోంది. తాజాగా ఇటీవల నూత న బాధ్య తలు చేపట్టిన కలెక్టర్ హరిచందన ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. దీంతో అక్రమ పట్టాల విషయంలో సమగ్ర విచారణ జరిపించి సస్పెండ్ అయిన ఉద్యోగులకు అండగా నిలిచిన అధికారులపైనా వేటు వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. సమగ్ర సర్వే చేపడతాం.. మండలంలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో ఇతరుల పేరిట పట్టాలుగా మారాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు వీఆర్ఏలను సస్పెండ్ చేశాను. ఓ వీఆర్వో అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపాను. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేస్తాం. అక్రమ పట్టా, రైతుబంధుతో లబ్ధిపొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూరు -
ఓ మాజీ సైనికుడి దీనగాథ
శత్రు దేశాల కుట్రలను ముందుగానే పసిగట్టగలిగాడుగానీ, సొంత ఊరిలో కుతంత్రాలను గుర్తించలేకపోయాడు. ప్రాణాలకు తెగించి శత్రు మూకలతో పోరాడాడుగానీ, ఉన్న ఊరిలో దురాక్రమణదారుల దెబ్బకు నిలువలేకపోయాడు. యుద్ధంలో కాళ్లు పోయినా ప్రభుత్వమిచ్చిన భూమిని నమ్ముకుని కాలం వెళ్లదీద్దామనుకున్నాడు. ఇంతలో రాబందుల్లా వచ్చి వాలిన ఆక్రమణదారులు ఆ భూమిని లాగేసుకోవడంతో పోరాడి అలసి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబమూ ఉన్న ఆధారాన్ని దక్కించుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. తాడేపల్లిరూరల్: తెనాలి మండలం కొలకలూరుకు చెందిన నంది భీమప్ప 1962లో దేశ రక్షణ కోసం సైనికుడిగా చేరాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన సుశీలతో వివాహమైంది. పెళ్లి అనంతరం 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో, 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. చివరిగా తన కుడికాలు పోగొట్టుకున్నాడు. 1980లో భీమప్పను ఇంటికి పంపించారు. మాజీ సైనికుల కోటా కింద భీమప్పకు తాడేపల్లి మండలం చిర్రావూరులో సర్వే నంబర్ 26/1ఏలో 1.83 ఎకరాలు కేటాయించారు. కొంత కాలం పండించుకున్న అనంతరం భీమప్ప అనారోగ్యరీత్యా ఆ పొలాన్ని వేరే వారికి కౌలుకు ఇచ్చాడు. అప్పటి నుంచి భీమప్ప పొలాన్ని కొంత మంది దళారులు ఆక్రమించి దౌర్జన్యానికి దిగారు. పదే పదే ఆక్రమణలు 1994లో కోర్టును ఆశ్రయించిన భీమప్ప పొలాన్ని దక్కించుకున్నాడు. తిరిగి మళ్లీ ఆక్రమించుకోవడంతో 1999లోనూ మరోసారి కోర్టుకు వెళ్లాడు. అప్పుడూ న్యాయం భీమప్ప పక్షానే ఉంది. ఈ సమయంలో కొంతమంది దళారులు, ఇరిగేషన్ అధికారులు తమకు సదరు స్థలాన్ని కేటాయించారంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు. ఇవి నకిలీవని కోర్టు కొట్టేసింది. అనంతరం పొలాన్ని భీమప్పకు కేటాయించారు. 2003 సంవత్సరం ఏప్రిల్ 2న భీమప్ప మృతి చెందాడు. కౌలుకు తీసుకున్నారు.. దారిగా మార్చారు భీమప్ప భార్య సుశీల సదరు భూమిని తాడేపల్లికి చెందిన ఓ మోతుబరి రైతుకు కౌలుకు ఇచ్చింది. రెండు సంవత్సరాలు కౌలు ఇచ్చిన అనంతరం మూడో సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఎవరితో చెప్పుకోలేక అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయింది. అనంతరం కౌలుకు తీసుకున్న రైతు మాజీ సైనికుడి పొలంలో నుంచి తన పంట పొలంలోకి కరకట్ట నుంచి ర్యాంపు వేసి ఆక్రమించుకున్నాడు. మరో పక్క షెడ్డు ఏర్పాటు చేసి అందులో కాపలాదారులను పెట్టి పంట పొలంలోకి సుశీలను రానీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం సుశీల స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించింది. ఇది తెలిసిన సదరు రైతు.. లక్ష రూపాయలు పడేస్తాను, పిటిషన్ వెనక్కు తీసుకోవాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మాజీ సైనికుడు కఠెవరపు వివేకానందరెడ్డిని కలిసిన సుశీల తన గోడును వెళ్లబుచ్చుకుంది. దీంతో వివేకానందరెడ్డి సదరు భూమికి సంబంధించిన పత్రాలను సేకరించారు. వీటితో కలెక్టర్‌ను కలిసి మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించుకోనున్నారు. ఎంఆర్ఓ వివరణవిచారణ చేసి చర్యలుతీసుకుంటాం మాజీ సైనికుడు భీమప్ప పొలం ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చింది. రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. భీమప్పకు 1.83 సెంట్లు ప్రభుత్వం కేటాయించినట్లు రుజువైతే ఆయన కుటుంబీకులకు స్వాధీనం చేస్తాం. -
‘పచ్చ’నేతలను కాపాడటానికి వెనుకాడటం లేదు..
గత సర్కార్ అవినీతి వాసనల నుంచి ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు బయట పడలేకపోతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కోట్లాది రూపాయలు దోచుకున్న‘పచ్చ’నేతలను కాపాడటానికి వీరు వెనుకాడటం లేదు. పారదర్శకత, అవినీతి రహితపాలనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గాలికొదిలేసి కబ్జాదారుల కనుసన్నల్లో కొందరు పనిచేస్తున్నారు. పిఠాపురం శ్రీ సంస్థానం భూములు ఆక్రమణలకు గురైనా దందాదారుల పట్ల వల్లమాలినప్రేమ ఒలకబోస్తున్నారు. ఏకంగా 222 ఎకరాలు టీడీపీ నేతల కబంధహస్తాల్లో చిక్కుకున్నా దేవదాయ శాఖ కుంభకర్ణ నిద్రలో జోగుతోంది. సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: తొండంగి మండలంలో వివిధ దేవస్థానాలు, మఠాలు, సత్రాలకు 2000 ఎకరాలకు పైగా భూములున్నాయి. బాటసారులకు అన్నార్తులకు పట్టెడు అన్నం పెట్టే ఆశయంతో తొండంగిలో 511 ఎకరాలను పిఠాపురం మహారాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఇచ్చారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో నిత్యాన్నదాన, విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో ఈ భూములు దేవదాయ శాఖకు దఖలుపడ్డాయి. అప్పటి నుంచి ఈ భూముల వేలం దేవదాయ శాఖే నిర్వహిస్తోంది. మండల కేంద్రం తొండంగిలో 538, 545, 553, 535, 623, 565, 690 తదితరసర్వే నంబర్లలో ఉన్నాయి. 478 ఎకరాలను కౌలుకు ఇస్తున్నారు. ఈ భూముల ద్వారా దేవదాయశాఖకు ఏటా రూ.40 లక్షలు పైనే ఆదాయం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం శ్రీసంస్థానం సత్రానికి 511 ఎకరాలున్నాయి. అధికారులు 469 ఎకరాలకు మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. అంటే శ్రీ సంస్థానానికి చెందిన 42 ఎకరాల ఆచూకీ లభించడం లేదు. 511 ఎకరాల సత్రం భూములకు ఏటా పన్నులు చెల్లిస్తున్న దేవదాయశాఖ వేలం నిర్వహిస్తున్నది. 469 ఎకరాలకే కావడం గమనార్హం. తొండంగి శ్రీసంస్థానసత్రానికి చెందిన భూములు ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అదేమంటే భూములు సమగ్ర సర్వే జరగకపోవడమే కారణమంటూ తప్పించుకుంటున్నారు. పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఉన్న తొండంగి మండల పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరా రూ.20 లక్షలు పలుకుతుండేది. గతంలో ఇక్కడ భూములలో ఒక పంట పండేది. పిఠాపురం బ్రాంచి కెనాల్ అందుబాటులోకి రావడంతో చాలా ఏళ్లుగా రెండు పంటలు పండుతున్నాయి. ఇందుకు తోడుగా తొండంగి పరిసర ప్రాంతాల్లో జీఎమ్ఆర్ పోర్టు బేస్డ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ రానుండటంతో భూముల విలువ పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.40 లక్షలు పలుకుతోంది. పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల్లో కనిపించకుండా పోయిన 42 ఎకరాలను లెక్కలేస్తే రూ.16.80 కోట్లుగా ఉంది. ఇన్ని కోట్ల విలువైన భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయంటే దేవదాయశాఖ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన తునికి చెందిన యనమల రామకృష్ణుడు అనుచరులు గుప్పెట్లోనే ఉన్నాయి. అప్పట్లో మంత్రి అండదండలుండటంతో తొండంగి మండల టీడీపీ నేతల స్వాధీనంలో ఉన్న ఈ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి వెనుకంజ వేశారు. అంతెందుకు ఈ భూముల్లో మంత్రి యనమల అనుచరులు నాలుగైదేళ్లపాటు విచ్చలవిడిగా జాగీరుగా మట్టి తవ్వేసి లక్షల్లో సొమ్ము చేసుకున్నా నాడు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. కానీ ప్రభుత్వం మారి ఏడు నెలలయింది. అయినా దేవదాయశాఖ ఆ భూముల స్వాధీనానికి చొరవ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఆర్థికపరమైన లావాదేవీలు ఉండటమే కారణమంటున్నారు. నిర్లక్ష్యంతో మరిన్ని ఎకరాలు కబ్జా శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ 42 ఎకరాలకే పరిమితం కాలేదు. గత మార్చి నెలతో గడువు ముగిసినా దేవదాయశాఖ అధికారులు వేలం నిర్వహించకపోవడంతో మరో 180 ఎకరాలు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు వేలం నిర్వహించాలి. కానీ ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడ్డ కొందరు అధికారులు కావాలనే వేలం నిర్వహించకపోవడంతో ఆ భూములు కూడా లీజుదారుల స్వాధీనంలో ఉన్నాయి. ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే దేవదాయ చట్టం 78, 79 ప్రకారం నోటీసులు ఇవ్వడం న్యాయపరంగా వెళ్లడం వంటి పెద్ద ప్రహసనమే ఉంది. ఇంతటి అవకాశం ఇవ్వడం వెనుక కొందరి స్వార్థం దాగి ఉందంటున్నారు. ఇలా కబ్జాల్లో ఉన్న పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములు విలువ లెక్కతీస్తే రూ.66 కోట్లు పైమాటగానే కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులకు చీమకుట్టినట్టయినా లేకపోవడమే విస్మయానికి గురిచేస్తోంది. ఆక్రమణలకు గురైన భూములు, సత్రం పేరుతో సొమ్ములు తినేస్తున్నారంటూ ఇటీవల పిఠాపురం మహరాజా వారసుడు చిన్నరాజా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. కుంభకర్ణ నిద్రలో జోగుతున్న ఆ శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ‘ఈఓతో మాట్లాడి కార్యాచరణ చూస్తా’ పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల కబ్జా విషయం నా దృష్టికి రాలేదు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత శాఖలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారితో సంప్రదించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటా. దేవదాయశాఖకు చెందిన సెంటు భూమి కూడా వదిలిపెట్టేది లేదు విచారిస్తాను. దర్భముళ్ల భ్రమరాంబ, రీజనల్ జాయింట్ కమిషనర్, దేవదాయశాఖ. -
బోనులో భూమి!
సాక్షి, సిటీబ్యూరో: రెవెన్యూ విభాగం నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వివాదాల్లో చిక్కుకొని కోర్టుకు ఎక్కుతున్నాయి. అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక వీటికి సంబంధించిన కేసులు ఏళ్లుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కేసులకు అయితే ఏళ్ల తరబడి కౌంటర్ కూడా దాఖలు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో పలు కేసుల్లో ప్రతికూల తీర్పులు తప్పడం లేదు. మరోవైపు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరితో ప్రతివాదులు పైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇదీ హైదరాబాద్ జిల్లాలో వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూముల కేసుల పరిస్థితి. కోర్టు కేసులకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక న్యాయ విభాగమూ ఉంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్ధాయి అధికారి పర్యవేక్షణలో ఈ విభాగం కేసుల పరిశీలన, కౌంటర్ దాఖలు, సమగ్ర వాదనలకు సరిపడా సమాచారం ప్రభుత్వ న్యాయవాదులకు అందిస్తోంది. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా రెండేళ్లలో మరో 20శాతం కేసులు పెరగడం గమనార్హం. 58శాతం వివాదాల్లోనే... నగరంలో సుమారు రూ.1805 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీలో చదరపు గజం భూమి విలువ సుమారు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వానికి దాదాపు 4,36,471.2 చదరపు గజాల స్థలాలున్నాయి. చదరపు గజానికి రూ.70వేల చొప్పున లెక్కిస్తే... వీటి విలువ రూ.3,055 కోట్లకు పైనే ఉంటుంది. అందులో సుమారు 58శాతం అంటే 2,57,972 చదరపు గజాల స్థలం కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని విలువ రూ.1,805 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. యోగితా హయాంలో కదిలిక... కలెక్టర్ యోగితారాణా హయాంలో ప్రభుత్వ భూముల కోర్టు కేసులపై కదలిక వచ్చినా.. ఆమె బదిలీతో మళ్లీ కథే పునరావృతమవుతోంది. వాస్తవానికి గతేడాది జనవరిలో సర్కార్ స్థలాలను నిగ్గు తేల్చేందుకు యోగితారాణా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమగ్ర అధ్యయనం చేసి కౌంటర్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మండలానికి టాప్ టెన్ చొప్పున కేసులను ఎంపిక చేసి సంబంధిత డిప్యూటీ తహసీల్దార్లతో అంతర్గత సమీక్షలు నిర్వహించారు. ప్రతి కేసును సమగ్రంగా అధ్యయనం చేసి ఆధారాలపై నివేదికలను రూపొందించారు. తొలివిడతగా అత్యంత విలువైన భూములకు సంబంధించిన సుమారు 70 కేసులను ఎంపిక చేసి యోగితారాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌తో సమావేశమై చర్చించారు. కొంతకాలం కేసుల్లో పురోగతి కనిపించినప్పటికీ...ఆ తర్వాత కదలిక లేకుండా పోయింది. పెండింగ్ కేసులు ఇలా... జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి సుమారు 2,023 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. సివిల్ కోర్టులో 329, హైకోర్టులో 1,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తమ్మీద 2,832 కేసులకు గాను 120 కేసుల్లో ప్రభుత్వానికి ప్రతికూల తీర్పులు రాగా... 213 కేసుల్లో అనుకూల తీర్పులు వచ్చాయి. మరో 179 కేసుల్లో ప్రతివాదులు కేసులను ఉపసంహరించుకున్నారు. 199 కేసుల్లో కోర్టు పలు డైరెక్షన్స్ ఇవ్వడంతో సమస్య సమసిపోయింది. కాగా సుమారు 290 ఫిర్యాదులు కొన్ని కేసులతో ముడిపడి ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం మొత్తం 1,733 కేసులుగా నిర్ధారించింది. వీటిలో 646 కేసులపై కౌంటర్లు దాఖలు చేయగా, 992 కేసులకు దాఖలు చేయలేదు. 81 కేసుల సంబంధించి ఇతర ప్రభుత్వ విభాగాలు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరో 14 కేసులకు మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. -
పేదల స్థలాలపై తమ్ముళ్ల పంజా
కర్నూలు, కోవెలకుంట్ల: పట్టణ శివారు ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి స్థలాల కబ్జా కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో అధికారం అండగా కోవెలకుంట్లలోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇంటి స్థలాల పంపిణీలో చక్రం తిప్పారు. అప్పటి తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని బోగస్ పట్టాలతో స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. తమ్ముళ్ల మాయాజాలం.. 2009వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ రహదారి పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో రెండు సెంట్ల చొప్పున వెయ్యి మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఈ మేరకు అప్పటి తహసీల్దార్ రామచంద్రారెడ్డి పక్కాగా రికార్డుల్లో నమోదు చేశారు. అదే ఏడాది 840 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద గృహాలు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణా లు చేపట్టారు. ఆ తర్వాత కూడా కాలనీలో ఖాళీ స్థలాలుండడంతో 2010–11వ సంత్స రంలో అప్పటి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరో 400 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేసి పట్టాలు అందించారు. రెండు విడతల ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత అప్పట్లో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన తిరుపాలు, కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఇందిరమ్మ కాలనీపై కన్నేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆఫీస్ రికార్డులను తారుమారు చేశారు. బోగస్ పట్టాలు సృష్టించి 400కుపైగా ఫ్లాట్లను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఆఫీసులో భద్రపరిచిన లబ్ధిదారుల పట్టాలు తొలగించి వాటి స్థానంలో 40 నుంచి 50 పట్టాలను బినామీ పేర్లతో స్వాహా చేశారు. తర్వాత ఆ ఫ్లాట్లను రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఒకే పట్టాను ముగ్గురికి ఇచ్చారు.. కోవెలకుంట్లకు చెందిన పద్మావతమ్మకు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో 2013లో 1,264 నెంబర్ ఫ్లాట్ కేటాయించారు. ఇందుకు సంబంధించిన పట్టా కూడా ఇచ్చారు. అయితే ఇదే నంబర్‌పై విమల అనే మరో మహిళ పేరున కూడా పట్టా ఉంది. ఆమె ఆ ఫ్లాట్‌ను రాజు అనే రిటైర్డ్ ఉద్యోగికి విక్రయించగా తిరిగి అదే నంబర్‌తో కొన్న వ్యక్తికి పట్టా కేటాయించారు. మరొకరి పేరున పట్టా.. పట్టణానికి చెందిన సుబ్బరత్నమ్మకు సొంతిల్లు లేకపోవడంతో 2009లో అప్పటి తహసీల్దార్ 1,011 నంబర్‌తో పట్టా ఇచ్చారు. కొన్ని నెలలకు ఇదే నంబర్‌పై కోవెలకుంట్లకు చెందిన నాగరా జుకు పట్టా కేటాయించారు. ఈ నెంబర్‌పై తహసీల్దార్ కార్యాలయ రికార్డుల్లో సుబ్బరత్నమ్మ పేరుతోనే పట్టా ఉంది. ఇలా రికార్డులతో సం బం«ధం లేకుండా ఇదే నంబర్‌పై డూప్లికేట్ పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాదు ఇందిరమ్మ కాలనీలో టీడీపీ నాయకులు వందల సంఖ్యలో బోగస్ పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణ చేపడతాం.. పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో బోగస్ పట్టాల వ్యవహారంపై విచారణ చేపడతాం. వచ్చే మార్చి నాటికి ఇల్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పేద కుటుంబాల జాబితా సేకరణ, వివరాలు అప్లోడ్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే బోగస్ పట్టాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తాం. – విజయశ్రీ, తహసీల్దార్, కోవెలకుంట్ల -
బరి తెగించిన కబ్జాదారులు
కుత్బుల్లాపూర్: కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు.. తహసిల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్ఐ నరేందర్‌రెడ్డిలపై కిరోసిన్ చల్లి, రాళ్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన వీఆర్వో, వీఆర్ఏ,గిర్దావర్‌పై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు భయంతో పరుగుతీశారు. ఏకంగా కబ్జాదారులు రాడ్లు, కట్టెలు, రాళ్లతో కొడుతూ పరుగులు పెట్టించారు. దీంతో కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు భూకబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్, నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్‌లో కబ్జాపై ఫిర్యాదు.. కుత్బుల్లాపూర్ తహసిల్దార్ గౌతమ్‌కుమార్‌కు గురువారం రాత్రి ఓ వ్యక్తి సెల్ ఫోన్ నుంచి వాట్సప్‌లో కబ్జా విషయంపై ఫిర్యాదు చేస్తూ మెసెజ్ పంపాడు. గాజులరామారం సర్వే నెంబరు 221 పరిధిలోని సుభాష్‌చంద్రబోస్ నగర్ లో స్థలం కబ్జా విషయం పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వీఆర్వో శ్యామ్‌కుమార్, వీఆర్ఏ, గిర్దావర్ ఉమామహేశ్వర గౌడ్ లు ఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే వెళ్లిన సిబ్బంది నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా భూక్జాదారులు షేక్ మౌలానా, సయ్యద్ జలీల్, మేస్త్రీ పాషా, షాదూల్, చాంద్‌పాషా, నఫీజ్‌బేగం ఒక్కసారిగా కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిపై రాళ్లు, కట్టెలతో దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సిబ్బందిపై బండరాళ్లు ఎత్తి హత్యాయత్నం కూడా చేశారు. సంఘటనా స్థలానికి తహసిల్దార్.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మండల తహసిల్దార్ గౌతమ్ కుమార్ హుటాహుటిన అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని క్షణాల్లో కూల్చివేయించి సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ కింద ఆరుగురు కబ్జాదారులపై 557/2019, 332, 341, 34 ఐపీసీ, సెక్షన్(3), పీడీపీఎస్యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసులునమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
లీజ్ డీడ్‌తో పాగా..
గచ్చిబౌలి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు పథకం పన్నారు. స్థలం యజమానుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు స్థలానికి యజమాని ఎవరు, అద్దెకు ఉంటున్న వారి వివరాలు ఆరా తీశారు. తప్పుడు పత్రాలతో స్థలం ఆక్రమించడమేగాక అమాయకులకు విక్రయించి రూ. లక్షలు దండుకున్న ప్రగతి సొసైటీ కమిటీ సభ్యులతో పాటు 25 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 32లో ఐటీ కంపెనీల సమీపంలో 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. 2000 సంవత్సరంలో ఐఐసీ సిస్టమ్స్ 3 ఎకరాలు, బ్రిజేష్ కోహల్ 20 గుంటలు, బాబురావు 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. యూఎల్‌సీకి దరఖాస్తు చేసుకోగా 2005లో ప్రభుత్వం దీనిని రెగ్యులరైజ్ చేసింది. 2014 వరకు యజమానులే పొజిషన్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు, కమిటీ సభ్యులు సదరు స్థలాన్ని క్రమించారు. అంతేగాక సదరుస్థలం తమదేనని నమ్మించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. 165 మంది గదులను నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటుండగా, దీనికి ప్రగతినగర్ గా నామకరణం చేయడమేగాక జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నెంబర్లు, విద్యుత్ మీటర్లు తీసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో మోసం.... మొబైల్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు ధర్మరాజు 1991లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తనకు గచ్చిబౌలిలోని వివిధ సర్వే నెంబర్లలో 99 ఎకరాలు పట్టా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించాడు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు అప్పట్లో ధర్మరాజుపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అంతేగాక అతడిపై అప్పటికే సైఫాబాద్, మాదాపూర్ పీఎస్‌లలో కేసులు ఉన్నాయి. లీజ్ డీడ్‌తో ఆక్రమణ.. కాగా ధర్మరాజు సదరు స్థలాన్ని ప్రగతి సొషల్ ఆర్గనైజేషన్‌కు లీజుకు ఇస్తున్నట్లు శామీర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లీజు డీడ్ సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు గచ్చిబౌలి సర్వే నెంబర్ 32లో నాలుగు ఎకరాల స్థలం తమదేనని పేర్కొంటూ ఆక్రమించారు. అరెస్టయ్యింది వీరే.... ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు కంచి నాగమణి, కంచి సురెందరయ్య, ఇ. ముత్తు, జి. చెన్నయ్య, ఎం. విక్రమ్, భాస్కర్‌రావు, తలారి రాము, లక్ష్మీబాయి, వి.గోవిందమ్మ, బి.సంతోష, ఏ. జాములు, ఎల్. కోటయ్య, ఎం. శివకుమార్, ఎల్. పాండు, ఎన్. జీవన్‌కుమార్, ఎన్. దానేడప్ప, బి. శివాజీ, ఎస్. రవీందర్, వి.సుధాకర్, కె. సుందర్రావు, కోటేశ్వర్రావు, ఎం.యాదగిరి, ఎం. అశోక్, కె. భాస్కర్, జి.ఝాన్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగమ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుజాత, «కె. ధర్మరాజు, జి. రామారావు, పి. శ్రీనివాస్‌రావు, డి. సతీష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నోటీసులు కూడా ఇవ్వలేదు.... నోటీసులు ఇవ్వకుండానే రాయదుర్గం పోలీసులు తమను అరెస్ట్ చేశారని ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు నాగమణి భర్త సురెందరయ్య ఆరోపించారు. స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, సొసైటీ సభ్యులే నివాసం ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు.. సర్వే నెంబర్ 32లోని తమ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించిన యజమానులు ఐఐసీ సిస్టమ్స్, బ్రిజేష్ కోహల్, బాబురావు 2017, 2018లో సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ధర్మరాజుకు 99 ఎకరాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పట్టా ఇచ్చినట్లుగా చూపుతున్న డాక్యుమెంట్ నకిలీదిగా తేల్చింది. అంతేగాక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి కోర్టుకు నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రగతి నగర్ సోషల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు నాలుగు ఎకరాల స్థలంలో 90 చదరపు గజాల చొప్పున 165 ప్లాట్లు చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఒక్కో ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించి అమాయకులను మోసం చేశారన్నారు. నాలుగైదు ప్లాట్లు కొనుగోలు చేసి అమ్ముకున్న వారిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. 70 మంది బాధితులను విచారించి వాగ్మూలం తీసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లాన్స్ నాయక్‌కు రెవెన్యూ తిప్పలు!
ఆర్మీలో ఆయనో లాన్స్‌నాయక్ ... అయితేనేం ఆయనకు కూడా తన భూములను రక్షించుకునేందుకు ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి. దేశం కోసం ఆర్మీలో పని చేస్తున్నారన్న సానుభూతి కూడా లేకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కోర్టులు ఆదేశించినా ఆక్రమణల చెరలో ఉన్న అతని భూములను పరిరక్షించాల్సింది పోయి 22ఏను అడ్డం పెట్టుకుని అతని జీవితంతో ఆటలాడు కుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన పోలిరెడ్డి శ్రీనివాసరావు ఆర్మీలో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన ప్రస్తుతం డెప్యుటేషన్‌పై ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో ట్రాన్స్మిషన్ యూనిట్లో సేవలందిస్తున్నారు. తన తండ్రి రాజుబాబు, పెదనాన్న అప్పలనాయుడు 1979లో గ్రామంలోని సర్వే నంబర్ 133లో మూడెకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో 2.10 ఎకరాలను బీసీ కాలనీ నిమిత్తం ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు పరిహారం కూడా మంజూరు చేశారు. ఇక మిగిలిన 90 సెంట్లకు శ్రీనివాసరావు తండ్రి, పెదనాన్నల పేరిట ఇవ్వాల్సిన పట్టాదారు పాస్‌పుస్తకాలను వారు కొనుగోలు చేసిన వారి పేరిట జారీ చేశారు. ఆ పట్టాదారు పుస్తకాలను అడ్డంపెట్టుకుని వారు కోర్టుకెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమి కోసం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత చివరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేశారు. వాటిని ఆధారం చేసుకుని మరో ఐదేళ్ల పాటు సాగిన వాదోపవాదాలనంతరం సివిల్ కోర్టు కూడా శ్రీనివాసరావు కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మరొక వైపు ఈ భూముల్లోకి సదరు దొంగపట్టాలు పుట్టించిన వారు చొరబడి దాదాపు 12 సెంట్ల భూమిని కబ్జా చేశారు. మిగిలిన భూమి ప్రస్తుతం వీరి అధీనంలోనే ఉంది. కబ్జాకు గురైన భూములను కూడా పరిరక్షించుకునేందుకు ఆర్మీలో పనిచేస్తున్న లాన్స్‌నాయక్ శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. చివరకు 2017లో మిగిలి ఉన్న భూమినైనా పరిరక్షించుకుందామన్న ఉద్దేశంతో తన సోదరికి గిఫ్ట్‌డీడ్ రూపంలో రాసిచ్చేందుకు నర్సీపట్నం సబ్ రిజిస్ట్రే షన్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఆసలు విషయం తెలిసి విస్తుపోవడం లాన్స్‌నాయక్ వంతు వచ్చింది. పోరాటం ఫలించిందనుకున్న సమయంలో తమ భూములు కాస్తా 22 ఏలో (నిషేధిత భూముల జాబితా) ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా 22ఏ జాబితా నుంచి మోక్షం లభించలేదు. దీంతో చివరకు తమ ఆర్మీ కమాండెంట్‌కు ఫిర్యాదు చేశారు. కమాండెంట్ కూడా సీరియస్‌గా తీసుకుని తొలుత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయ్..అప్పటికీ న్యాయం జరగకపోతే కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అభయమిచ్చారు. ఆ మేరకు అనుమతినివ్వడమే కాదు సుబేదార్ గిరిదారిలాల్, సిపాయి బీడీ మహేష్‌కుమార్‌లతో శ్రీనివాసరావును కలెక్టరేట్‌కు పంపించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ సమగ్ర విచారణ జరపాల్సిందిగా పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్ జి.సృజనను ఆదేశించారు. -
తమ్ముళ్ల ఆగడాలకు చెక్
సాక్షి, విశాఖపట్నం: తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన చెక్ పెట్టారు. వారు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆ ప్రాంతాన్ని పొక్లెయినర్‌తో చదును చేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ ఐదేళ్ల పాలనలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చెరువు గర్భాలను కబ్జా చేసేశారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న ఆయకట్టుకు సాగునీరందకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించి కనబడిన చెరువులను ఆక్రమించేశారు. రైతుల పంటలకు నీరిచ్చే సాగునీటి చెరువులనూ వదల్లేదు. దీనిపై రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న సంఘటనలూ లేకపోలేదు. ఇటువంటి ఆక్రమణల తొలగింపునకు స్థానిక అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. జేసీ జోక్యంతో ఆగడాలకు కళ్లెం... జేసీ జి.సృజన భూకబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేశారు. టీడీపీ నాయకుల బారి నుంచి చెరువును కాపాడి ఆయుకట్టు రైతులకు అప్పగించారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 354లో 7.68 ఎకరాల వెంకన్న చెరువు ఉంది. దీనిని టీడీపీకి చెందిన గూడుపు దేముడు తదితర గ్రామస్థాయి నాయకులు కబ్జా చేశారు. ఆయుకట్టు రైతులను బెదిరించి అందులో వ్యవసాయం చేస్తున్నారు. ఈ మేరకు ఆయుకట్టు రైతులు గతేడాది అక్టోబర్ 29న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆమె పరిశీలించి తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ శశిభూషణ్ ఆదేశాల మేరకు జేఈ జి.పైడితల్లి , బుచ్చెయ్యపేట తహసీల్దార్ శుభాష్బాబు, స్థానిక వీఆర్వో నారాయణరావు ఆక్రమణల ప్రాంతంలో సర్వే చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానిదని, ఎవరైనా ఆక్రమిస్తే సెక్షన్4(1), 4(2), 4(3) ఏపీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 183,186, 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక బోర్డుల్లో పేర్కొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన రైతులు.. ఆక్రమిత చెరువుకు కబ్జాదారుల నుంచి విముక్తి కలిగించినందుకు ఆయుకట్టు రైతులంతా జేసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా గ్రామంలో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ ఆక్రమితదారుల నుంచి కాపాడి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
నిబంధనలకు పాతర.. కబ్జాల జాతర
తిరుపతి రెవెన్యూ డివిజన్లో కబ్జాల పర్వం సాగుతోంది. ప్రభుత్వ, డీకేటీ, పోరంబోకు భూములే లక్ష్యంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 11,785 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 15 మండలాలున్నాయి. ఆయా మండలాల్లో ప్రభుత్వ, కాలువ పోరంబోకు, డీకేటీ, నది పోరంబోకు భూములు 2,48,664 ఎకరాలున్నాయి. ఇందులో సుమారు 23,744 ఎకరాలను గత ప్రభుత్వాలు ఏడు విడతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంపిణీ చేశాయి. మిగిలిన2,24,920 ఎకరాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. కానీ టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇందులోని 11,785 ఎకరాలు కబ్జాకు గురైంది. టీడీపీ అధిష్టానం అభివృద్ధి పేరుతో అనుచరులు, బినామీలకు ఉదాసీనంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణలు ఇలా.. తిరుపతి డివిజన్ పరిధిలో సెంటు భూమిలేని నిరుపేదలు సుమారు 30 శాతం మంది ఉన్నారు. ఇందులో ఏడు విడతల్లో 5 శాతం మందికి కూడా ప్రభుత్వ భూమి దక్కలేదు. వేల ఎకరాల భూమి ఖాళీగా ఉన్నా పేదలకు పంచలేదు. ఆందోళనలు చేసినా కనీసం వారి గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు కొందరు భూ మాఫియాగా ఏర్పడ్డారు. ఖాళీజాగా కనిపిస్తే కబ్జాలకు తెగబడ్డారు. వీరికి లంచాలు మరిగిన కొందరు అధికారుల సహకారం ఉండడం కొంత కలిసివచ్చింది. వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుని విక్రయాలు సాగించారు. కొందరు ఆక్రమిత భూమిలో మామిడి తోటలు, పంటలు పండిస్తున్నారు. మరికొందరు రియల్ దందా పేరుతో పేదలకు అంటగడుతున్నారు. కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. తీరా అవి ప్రభుత్వ భూములని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాజకీయ అండదండలతోనే.. తిరుపతి పరిధిలో భూ మాఫియా రాజకీయ అండదండలతో రెచ్చిపోతోంది. అధికార పార్టీ నాయకులే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అధికారులు సైతం వారికి వంతపాడుతున్నారు. పబ్లిక్‌గా వేల ఎకరాల భూములు కబ్జా చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ మాఫియా అమాయక జనాన్ని మభ్యపెట్టి రోడ్డున పడేస్తోంది. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –నవీన్‌కుమార్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ పోరాట సమితి కఠిన శిక్ష విధించాలి కబ్జాదారులపై కఠిన చర్యలు ఉండాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అధికారులు ఆదిలోనే ఆక్రమణకు గురైన భూములను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. ఎంతటివారైనా ఉపేక్షించకూడదు. – భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ బోర్డ్ మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నేత వారే కబ్జాకోరులు తిరుపతి అర్బన్ జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలే కబ్జారాయుళ్లుగా మారుతున్నారు. అధికార అహంతో రెచ్చిపోతున్నారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. జిల్లావ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత.. చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కొందరు అధికారులు లంచాలకు బానిసై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. – కందారపు మురళి, సీఐటీయూ జిల్లా నాయకులు ప్రభుత్వ భూములను రక్షించాలి తిరుపతి రెవెన్యూ డివిజన్లో వేల ఎకరాలు భూములు కబ్జాకు గురయ్యాయి. అధికార పార్టీ అండతో కొందరు రెచ్చిపోయా రు. అడ్డదిడ్డంగా ఆక్రమించేసి విక్రయాలు సాగిస్తున్నారు. వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన బాధ్యత అధి కారులపై ఉంది. ప్రభుత్వ భూముల సమాచారం కోసం డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. – పెంచలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఒక ఎకరా కూడా మిగలదు. కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలు సైతం కబ్జాకు గురయ్యాయి. దీనికి ప్రధాన కారకులు అధికార పార్టీ నాయకులే. పేదలకు తలదాచుకోవడానికి సెంటు భూమిని ఇవ్వడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – వి.లక్ష్మణ్‌రెడ్డి, అధ్యక్షుడు జనచైతన్య వేదిక -
ముదిరిన భూ వివాదం
స్వర్ణముఖి నదీ పోరంబోకు భూ ఆక్రమణ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అమాయకులకు మాయమాటలు చెప్పి స్థలాలు అమ్మేసిన అధికార పార్టీ నాయకులు మరో పన్నాగం పన్నారు. మామూళ్లు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారని పుకార్లులేపారు. బాధితులను ఆందోళనకు దిగమని చెప్పారు. అధికారులను అడ్డుకోమన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయమని ఉసిగొల్పారు. మళ్లీ వారి మాటలు నమ్మిన బాధితుల్లో కొందరు ఒకడుగు ముందుకేసి అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలకు సూత్రధారులుగా భావించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద మంగళవారం కూడా స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. సాక్షి, చిత్తూరు, తిరుపతి: స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన భూరాబందులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇళ్లు కోల్పోయిన బాధితులను రెవెన్యూ అధికారులపైకి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 360లో 178 ఎకరాల స్వర్ణముఖి నదీ పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. ప్లాట్లుగా మార్చిదలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ స్పందించడం.. రెవెన్యూ అధికారులు సోమవారం జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. మళ్లీ మంగళవారం అధికారులు వస్తారని భావించిన భూకబ్జాదారులు అమాయకులైన బాధితులను రెచ్చగొట్టారు. నిర్మాణాల సమయంలో కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని, తిరిగి తొలగించే సమయంలో వారే ఉన్నారని చెప్పారు. అమాయక ప్రజలు అక్రమార్కుల కుట్రలను పసిగట్టలేకపోయారు. వారి మాటలు విని మంగళవారం రెవెన్యూ అధికారులను నిలదీశారు. కొందరు అధికారులపై దాడులకు దిగారు. ఈ దాడిలో వీఆర్ఏ రమణ తలకు తీవ్ర గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో రెవెన్యూ అధికారులు దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వినాయక నగర్ వాసులు కొందరు మంగళవారం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను నిలదీశారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న నివాసాలకు విద్యుత్, నీటి సరఫరా, ఇంటిపన్ను,ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయని తెలియజేశారు. ఇన్నాళ్లు గుర్తించని ఆక్రమణలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అంటూ ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ తక్షణం స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎవరి నుంచి కొనుగోలు చేశారు? నదీ పోరంబోకు భూమిని ఎవరి నుంచి కొనుగోలు చేశారు? వారి వివరాలు చెప్పాలని రెవెన్యూ అధికారులు వినాయక నగర్ వాసులను అడిగారు. వారి వివరాలు తెలియజేస్తే.. బాధితులకు తిరిగి సొమ్ము ఇప్పిస్తామని, నివాసాలు కోల్పోయిన అర్హులకు ప్రభుత్వ పథకాల ద్వారా నివాసాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారి వివరాలు చెప్పేందుకు బాధితులు నిరాకరించి వెనుదిరిగారు. ముగ్గురిపై కేసు నమోదు స్థలాన్ని పేదలకు అక్రమంగా సొమ్ము చేసుకున్న దుర్మార్గులు స్థానికులను బెదిరించి రెచ్చగొట్టారని, దాడికి ఉసిగొల్పారని వీఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుచానూరు స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. -
వైజాగ్‌ను చెరబట్టిన టీడీపీ భూ మాఫియా
అనగనగా ఓ అందాల నగరం...దానికితోడుగా సుందరమైన సముద్ర తీరం...ఆపై ప్రకృతి సోయగంతో అలరారే ప్రాంతం...ప్రశాంతతకు మారుపేరుగా సాగే జీవనం...వీటిపై కన్నేసింది ‘అధికారా’క్షస గణం...బెదిరింపులతో బెంబేలెత్తించిందా దళం...చేతికందిందంతా చెరబట్టిందా పచ్చ మూక...అశాంతి రేపి కోట్లకు కోట్లు కాజేసిందా దండు...పెద్దపెద్ద తుపాన్లనే తట్టుకున్న ఆ నగరం...భూ రాబందుల దెబ్బకు మాత్రం విలవిల్లాడింది...ముఖ్య నేతల మాఫియాలో చిక్కి నిలువెల్లా వణికింది...నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని కాస్తా నివ్వెరబోయింది...– గరికిపాటి ఉమాకాంత్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ప్రకృతి గీసిన ఛాయాచిత్రంలా ఉండే అందమైన విశాఖ నగరం శివారులోని పచ్చటి పొలాల్లో సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు రెండున్నరేళ్ల కిందట టీడీపీ నేతలు పంపిన దళారులు వెళ్లారు. ‘ఇక్కడ ఇళ్లు కడతారు. భారీఎత్తున పరిశ్రమలొస్తాయి. మీ పొలాలను ఎలాగైనా బలవంతంగా లాక్కుంటారు. ఈ రహస్యం ఎవరికీ చెప్పకండి. ముందుగానే వాటిని అమ్మేసుకుంటే మంచిది. లేదంటే, తర్వాత దక్కినదానితో సంతృప్తి పడాల్సి ఉంటుంది’ అంటూ ఆందోళన రేకెత్తేలా బెదిరించారు. అమాయక రైతులు ఇది నిజమేనని నమ్మారు. ఎకరా రూ.కోటి విలువ చేసే భూమిని రూ.పది, పన్నెండు లక్షలకే అమ్మేసుకున్నారు. వీటిని కొన్నదంతా టీడీపీ నేతల బినామీలే. ఇలా కొనుగోళ్లు పూర్తయ్యాయో లేదో ముందస్తు కుట్రలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు భూమి సేకరిస్తామని ప్రభుత్వం నుంచి భూ సమీకరణ (ల్యాండ్ ఫూలింగ్) ప్రకటన వచ్చింది. టీడీపీ నేతలతో కుమ్మక్కైన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)నే ఈ భూ సమీకరణ పనిని చేపట్టింది. అప్పటికే రైతుల నుంచి తక్కువ ధరకు కొట్టేసిన భూములను టీడీపీ నేతలు వుడాకు అప్పజెప్పి తమ జేబులు నింపుకొన్నారు. ఈ కుంభకోణంలో ఇదో పార్శ్వం మాత్రమే. దేన్నీ వదల్లేదు..: డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు... ఇలా టీడీపీ నేతలు దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. బాధితులు నెత్తినోరు బాదుకున్నా వినలేదు. కొందరు అధికారులు కుమ్మక్కైతే, మరికొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డుల తారుమారు ఇందులో పరాకాష్ట. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత సులువుగా భూ రికార్డులు మారిపోయాయి. కచ్చితంగా చెప్పాలంటే... ఓవైపు రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే... తహసీల్దార్ కార్యాలయాల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సీఎం కార్యాలయానికి ప్రత్యక్ష ప్రమేయం..: ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదలకు సిద్ధమవగానే వుడా ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టేసింది. టీడీపీ ప్రజాప్రతినిధులకు చెందిన వ్యక్తులు రైతుల వద్దకు వెళ్లి వారిని బెదిరించి వందల కొద్దీ ఎకరాలను సేకరించారు. ఈలోగా వుడా బోర్డు సమావేశమై ల్యాండ్ పూలింగ్ నిర్ణయాలు తీసుకుంది. సీఎం కార్యాలయం నుంచే తాము ఈ ప్రతిపాదనలు తీసుకు న్నామని, ఆ మేరకే నిర్ణయాలు చేస్తున్నామని వుడా తన బోర్డు నిర్ణయాల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ నిర్ణయాన్ని అమోదిస్తూ ఆ తర్వాత ప్రభుత్వం జీవో 290 జారీ చేసింది. సీఎం విశాఖలో ఉండగానే భూ రికార్డులు గల్లంతు..: 2017 ఫిబ్రవరిలో ల్యాండ్ పూలింగ్ కుంభకోణం బయటపడగానే మే నెలలో రికార్డులు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష ఎకరాల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ) ఉండగా లక్ష ఎకరాలకు చెందిన 16,375 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3,022 రీ సెటిల్మెంట్ రిజిష్టర్స్ (ఆర్ఎస్ఆర్)లు ఉండగా 275 అదృశ్యమయ్యాయి. 3,022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలావరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. అయితే, ఇవన్నీ హుద్‌హుద్ తుపానులో కొట్టుకుపోయాయని కలెక్టర్ చెప్పుకొచ్చారు. 2014 అక్టోబరు 12న విశాఖను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపానులో ఎక్కడా తహసీల్దార్ కార్యాలయాలు కూలినట్లుగా లేదా కొట్టుకుపోయినట్లుగా, ధ్వంసమైనట్లుగా రికార్డు కాలేదు. ఇక సీఎం చంద్రబాబు కూడా ఆ çసమయంలో విశాఖలోనే మకాం వేశారు. ఏకంగా కలెక్టరేట్లోనే బస చేశారు. ఇదే సమయంలో రికార్డులు పోయాయని చెప్పడం గమనించాల్సిన విషయం. భూ కుంభకోణాలపై రెండేళ్ల కిందట ‘సాక్షి’లో వరుసగా పరిశోధనాత్మక కథనాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు హడావుడిగా రికార్డులు పోయాయని ప్రకటించారు. విశాఖ జిల్లా టీడీపీలో ప్రస్తుతం కీలకంగా ఉన్న నేతలు భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్నవారే. మంత్రి గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌లపై భూ దందాల ఆరోపణలు వెల్లువెత్తాయి. గోవింద్ పైనేతే ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. అధికారులే సమిధలు..: భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్‌లపై చర్యలకు సిట్ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను బలి చేసేసింది. తహసీల్దార్ నుంచి స్పెషల్ డెప్యుటీ కలెక్టర్లు, ఐఏఎస్ స్థాయి అధికారులకు సంబంధించి సుమారు 48 మందిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపర చర్యలకు సిఫార్సు చేసింది. భీమిలి నుంచి పరారైన గంటా, పరుచూరి ఐదేళ్ల కాలంలో భీమిలిలో విలువైన భూములను చెరబట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న గంటా శ్రీనివాసరావు, పరుచూరి భాస్కరరావు ఎన్నికలొచ్చేసరికి మొహం చూపించలేక పరారయ్యారు. గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫునే పోటీ చేస్తుండగా, పరుచూరి జనసేన అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి బరిలో దిగారు. వీరిద్దరి పోటీ అటు టీడీపీ, జనసేన రహస్య పొత్తును బట్టబయలు చేస్తుండటంతో పాటు భీమిలి నుంచి పరారైనట్లు స్పష్టం చేస్తోందని అంటున్నారు. సిట్ నివేదిను నొక్కిపెట్టేసిన సర్కారు విశాఖ భూ కుంభకోణంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగొచ్చిన సర్కారు 2017 జూన్ 20న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన సభ్యురాలిగా ఉన్న సిట్‌కు 2,875 ఫిర్యాదులు అందాయి. వీటిలో మూడొంతులు అధికార పార్టీకి చెందిన నేతలపైనే వచ్చాయి. స్వయంగా మంత్రి గంటాపైనే మరో మంత్రి అయ్యన్న, టీడీపీ నేతలు సిట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాల పైనే సిట్‌కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన సిట్ విచారణలో వందల డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి 2018 జనవరి 29న తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా తొక్కిపెట్టిన సర్కారు చివరికి అదే ఏడాది నవంబర్ 6న కేబినెట్‌కు ముందుకు తీసుకొచ్చింది. కానీ నేటికీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. సిట్ నివేదికను బయటపెడితే మొత్తం అందరి చిట్టా విప్పుతానని జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. దీంతో లోకేష్ సహా సర్కారు పెద్దల బండారం బయటపడుతుందని తెలిసి తొక్కిపెట్టారని విశాఖ టీడీపీ వర్గాల వ్యాఖ్య. లోకేశ్నుకలిశాకే ల్యాండ్‌పూలింగ్ విశాఖ నగర శివారులో ఆర్థిక నగరాలు నిర్మిస్తామని, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఇందుకోసం అసైన్డ్, ఖాళీగా ఉన్న భూములను వుడా సేకరించి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో)కు అప్పజెబితే ఇళ్ల నిర్మాణం చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో ఇండస్ట్రియల్ పార్కుకు 300 ఎకరాలు, పాలవలసలో 150 ఎకరాల డీ పట్టా, ప్రభుత్వ భూములను సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి పెందుర్తి మండలం సౌభాగ్యపురంలో 120 ఎకరాలు, ఆనందపురం మండలం దర్బంధలో 114, విశాఖ రూరల్ మండలం కొమ్మాదిలో 116, భీమిలి మండలం నేరెళ్లవలసలో 114, ఆనందపురంలోని గండిగుండంలో 69, రామవరంలో 300 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది. వాస్తవానికి అంతకుముందే మంత్రి గంటా, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ల్యాండ్ పూలింగ్ కింద ఆ భూములు ఇస్తామంటూ రైతుల రూపంలో దరఖాస్తు చేసి లోకేష్‌ను కలిశారు. తమ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని, దీనికి జీవో కావాలని కోరారు. ఈ జీవో వచ్చేలోగానే డీ పట్టా, అసైన్డ్ భూములను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. ఎకరా రూ.కోటి విలువైన భూములను... రైతులకు కేవలం రూ.10 లక్షలిచ్చి తమ ఖాతాలో వేసుకున్నారు. దాదాపుగా భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్, డీ పట్టా భూములను ఇలా గుప్పిట పట్టారు. పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాక ప్రాంతంలో రామరాజు అనే వ్యక్తి నేరుగా కంపెనీ పేరు మీద రైతులకు చెక్కులు ఇచ్చాడు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి దీంట్లో మామూళ్లు ముట్టాయనేది రైతులు బహిరంగంగా చెప్పే వాస్తవం. ఇదంతా పక్కాగా అయిన తర్వాత సర్కారు నుంచి ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 304 జారీ చేయించారు. ఆ తర్వాతే అసలు విషయం రైతులకు అర్థమైంది. వారంతా భూములను తమకు తిరిగిచ్చేయాలని పోరాడినా పట్టించుకునేవారే లేకపోయారు. బినామీలతో రైతుల నుంచి మంత్రి వర్గీయులు కొనుగోలు చేసిన అసైన్డ్ భూమి 358.47 ఎకరాలు, ల్యాండ్ పూలింగ్‌కు ప్రతిపాదించి న ఈ భూముల్లో చదరపు గజం ధర కనిష్టంగా రూ.15 వేలుంది. ఈ లెక్కన రైతుల నుంచి మంత్రి అనుచరులు ఎకరాకు తీసుకున్న 1210 చదరపు గజాల స్థలం విలువ రూ.1.80 కోట్లు. 358 ఎకరాల లెక్క వేస్తే రూ.644 కోట్ల పైనే. కానీ రైతులకు దళారుల ద్వారా అందిన మొత్తం రూ.40 కోట్లకు మించదు. అంటే మంత్రి అనుచరులు, సంబంధీకులు దోచుకున్నది సుమారు రూ.600 కోట్లు. కలెక్టర్ స్వయంగా ప్రకటించిన మేరకు గల్లంతైన రికార్డుల వివరాలు తనఖాతో రుణాలు, ఎగవేతలుగంటా బంధువు పచ్చి దగా విశాఖ భూ కుంభకోణంలో ఇది మరో కోణం. అది సాగిన క్రమం ఇలా... రుణాలు చెల్లించనివారి ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు నోటిఫికేషన్లు జారీ చేశాయి. తీరా వేలం దగ్గరకి వచ్చేసరికి వాటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. మంత్రి గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలంలోనూ ఇలాంటి బాగోతమే వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ డైరెక్టర్, గంటా బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు పేర్కొన్న భూముల్లో ప్రభుత్వానికి చెందినవీ ఉన్నాయి. భాస్కరరావు రుణం కోసం ఇండియన్ బ్యాంకుకు కుదువపెట్టిన ఆస్తుల్లో ఆనందపురం మండలం వేములవలస గ్రామం సర్వే నం.122–11లో 726 చదరపు గజాలు, సర్వే నం.122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాలు, సర్వే నం.124–1,2,3,4లో 0.271 ఎకరాల భూమి భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సర్వే నం.122/9ను పరిశీలిస్తే ఇందులోని 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి (ఎన్‌హెచ్) విస్తరణకు ప్రభుత్వమే సేకరించింది. ప్రభుత్వం తీసుకోవడానికి ముందు కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలినది తరాలుగా ప్రభుత్వ భూమే. ఇక సర్వే నం.122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమిని ఎన్‌హెచ్ విస్తరణకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడా భాస్కరరావు పేరిట గజం కూడా లేదు.. ♦ సర్వే నం.122–11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో 60 సెంట్లు కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన ఆరు సెంట్లు ప్రభుత్వ మిగులు భూమి. అచ్చమ్మ 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడా భాస్కరరావు పేరిట భూమి లేదని తెలుస్తోంది ♦ సర్వే నం.122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలినది ప్రభుత్వానిది. భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్లు ఎన్‌హెచ్ విస్తరణకు ప్రభుత్వం సేకరించిన దాంట్లో ఉంది. కానీ, ఇక్కడ ఉన్న 1.04 ఎకరాలను కూడా తనదిగానే బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు, ప్రభుత్వం సేకరించిన భూములనూ గ్యారంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ.కోట్ల రుణం పొందారు. ♦ విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్ విస్తరణ కోసం భూ సేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూ సేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదువపెట్టిన ఆస్తుల్లో చూపారు. ఎఫ్‌ఎంబీలు16,375 సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్సర్వే (ఎస్ఎఫ్ఎస్)2,95,044 మొత్తం అన్యాక్రాంతమైనభూమి (ఎకరాల్లో)1,06,239.9 విలేజ్మ్యాప్లు233 రీ సెటిల్మెంట్ రిజిష్టర్లు275 విలువ:రూ.లక్ష కోట్లు పట్టా భూమి లాగేసుకున్నారు.. మాది సబ్బవరం. వంగలి రెవెన్యూ పరిధిలో నిర్మించ తలపెట్టిన పెట్రో యూనివర్సిటీ కోసం అంటూ సేకరించినదాంట్లో సర్వే నం.135లో నాది రెండు ఎకరాల భూమి ఉంది. 35 ఏళ్ల క్రితమే దీనికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. ఇదే భూమిలో ఉద్యాన పంటలతో ఆరుగురు సభ్యులున్న మా కుటుంబం జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా కనీసం సమాచారం కూడా లేకుండా భూమిని సేకరించింది. మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కోర్టును ఆశ్రయించా. భూమి పోయినా కనీసం పరిహారమైనా ఇవ్వాలని కోరుతున్నా.–గవర రామునాయుడు పంట భూములను తీసుకున్నారు వంగలి సర్వే నెంబర్ 135లో మాది సుమారు 2.87 ఎకరాల భూమి పోయింది. దీనిని చాలా కాలంగా సాగు చేసుకుంటుండటంతో మాకు ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. దీనిపై ఆధారపడి 8 మంది కుటుంబ సభ్యులం బతుకుతున్నాం. ఏటా వరితో పాటు ఉద్యాన పంటలైన ఉల్లి, టమాట, బీర, బెండ పండిస్తాం. ప్రభుత్వం అన్యాయంగా మా భూమి లాక్కుంది. దీంతో కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.–కందా ముత్యాలమ్మ, వంగలి ప్రజలారా?ఇప్పుడు చెప్పండి? సరిగ్గా ఐదేళ్ల క్రితం... గత ఎన్నికల ముందు టీడీపీ, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయో గుర్తుందా? ప్రశాంతమైన విశాఖపట్నానికి గూండాలు వస్తారని, వారి ఆగడాలు తట్టుకోలేమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారని దుష్ప్రచారం సాగించారు. దీనిని పొరపాటున అప్పట్లో జనం నమ్మి... టీడీపీని గెలిపిం చారు. కానీ, హద్దూ అదుపు లేని అధికార పార్టీ నేతల ఆగడాలతో వాస్తవం తర్వాత తెలిసింది. కనిపించిన భూములన్నీ స్వాహాకు దిగిన పచ్చ దండు తమను ఎన్నుకున్న ప్రజలను వెక్కిరించింది. -
కిషోర్ అనుచరుల బరితెగింపు
పేదల నివాసాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ‘పెద్దలు’ ఆక్రమించుకుంటున్నారు. పేదల పట్టాల పంపిణీ ముసుగులో ప్లాట్లు వేసి మరీ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ విక్రయాలు పూర్తిచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇప్పటి నుంచే భారీగా నగదును కూడబెడుతున్నారు. సాక్షి, తిరుపతి: ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గరపడుతుండడంతో పీలేరులో టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి దర్జాగా అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభపెట్టేందుకు ఈ సొమ్మును విచ్చలవిడిగా వినియోగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరుల అవినీతి అక్రమాలపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనంతో కొద్ది రోజలు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. అధికారుల అలసత్వంతో తాజాగా తిరిగి అక్రమాలకు తెరలేపారు. వారం రోజులుగా హడావుడిగా ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. ఎర్రగుంట పల్లిలో సర్వే నంబర్ 562, 655/బి, 782/1, 783/2, 3, 786/3లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని నివాసాలు లేని అర్హులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కేటాయించారు. 88 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున సుమారు 2.50 ఎకరాల భూమిలో పట్టాలిచ్చారు. మిగిలిన 13.50 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అధికారులతో కలిసి స్వాహా? బోడుమల్లువారి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 906లోని 21.85 ఎకరాలను ఎన్టీఆర్ హౌసింగ్ కోసం కేటాయించారు. అదే విధంగా సర్వే నంబర్ 682/11, 652/10లో మొత్తం 12 ఎకరాలను టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కొందరు కలిసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పత్రికా విలేకరులకు కేటాయించిన 2.75 ఎకరాలను కూడా విక్రయించి స్వాహా చేశారు. మొత్తం 33.70 ఎకరాల్లో 581 మందికి మాత్రం పట్టాలిచ్చి మిగిలిన వాటిని అమ్మి జేబులు నింపుకుంటున్నారు. అనుచరులకే పట్టాలు పేదల పేరుతో ప్రభుత్వ భూములను కేటాయించుకుని టీడీపీ పెద్దలు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు ఇందిరమ్మ కాలనీ సర్వే నంబర్ 1045, 1076, 1079, 1131, 1140, 1146లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాల కోసం కేటాయించారు. అదే విధంగా లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇచ్చిన 3.86 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకుని టీడీపీ నాయకులు ప్లాట్లు వేసి విక్రయించడం ప్రారంభించారు. మొత్తంగా చూస్తే పీలేరు పట్టణ పరిధిలో ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో 104 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. అందులో పట్టాలు పంపిణీ చేసింది 1530 మందికి మాత్రమే. వీరందరికి కేటాయించిన భూమి కేవలం 40 ఎకరాలు మాత్రమే. మిగిలిన 64 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి అంకనం రూ.7వేల నుంచి రూ.25వేల చొప్పున యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ అమ్మకాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పూర్తి చేయాలనే లక్ష్యంగా టీడీపీ నేతలు జోరు పెంచారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పంపిణీ చేసిన పట్టాల్లో ఎక్కువ శాతం టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొన్ని, అనుచరులకు మరి కొన్ని కేటాయించుకున్నారు. -
‘అధికార’ దౌర్జన్యం.. ఖాకీ కర్కశం
బొమ్మలసత్రం: తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాలను మించిపోయారు. పేదలపై ప్రతాపం చూపుతున్నారు. నిస్సహాయుల భూములను లాగేసుకుంటున్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. పైగా బాధితులపైనే దాడులు చేస్తున్నారు. తమ భూమిని కబ్జా చేయబోయిన అధికార పార్టీ నాయకులను అడ్డుకున్న బాధితులపై మహానంది ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ విచక్షణారహితంగా దాడి చేశారు. రైతులను నడిరోడ్డుపై పడేసి తన్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన రఘురాం అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆదివారం మహానందికి సమీపంలోని బుక్కాపురం వద్ద చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ♦ మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన గడేకారి సాలమ్మ అనే పేద మహిళకు 1973లో అప్పటి ప్రభుత్వం సాగు నిమిత్తం మహానందికి సమీపంలోని సర్వే నంబర్ 93/1లో 1.25 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టా కూడా మంజూరు చేసింది. ఆమెకు ఇద్దరు మనవళ్లు రఘురాం, జయరాం. ప్రస్తుతం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే..దీనిపై స్థానిక టీడీపీ నాయకులు పన్నంగి రమణయ్య, సుదర్శన్ కన్నేశారు. వీరికి బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు వరలక్ష్మి భర్త గుద్దేటి నాగరాజు మద్దతుగా నిలుస్తున్నాడు. ఏవిధంగానైనా భూమిని సొంతం చేసుకోవాలని సాలమ్మ కుటుంబ సభ్యులను కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆ భూమిని ఆనుకునే టీడీపీ నాయకుడు పన్నంగి రమణయ్య భూమి కూడా ఉంది. ఇదే అదనుగా 1.25 ఎకరాల్లో తనకు 25 సెంట్లు వస్తుందంటూ రమణయ్య.. సాలమ్మ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తన పార్టీ నాయకులతో కలిసి మహానంది ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ వద్దకు వెళ్లారు. దీంతో ఎస్ఐ శనివారం రాత్రి బాధితులను స్టేషన్‌కు పిలిపించారు. టీడీపీ నేతలకు తలొగ్గి బాధితులపైనే ఒత్తిడి పెంచారు. తప్పనిసరిగా భూమిని టీడీపీ నాయకుడికి ఇవ్వాల్సిందేనంటూ బెదిరించారు. ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం అరటి వేశామని, వచ్చే వేసవిలో పంటను కోసేసిన తరువాత 25 సెంట్ల భూమిని అప్పగిస్తామంటూ గడువు అడిగారు. అయితే.. ఆదివారం ఉదయమే టీడీపీ నాయకులు కొందరు గూండాలతో కలిసి పొలం వద్దకు వెళ్లి రాళ్లను పాతించడం మొదలుపెట్టారు. రఘురాం భార్య దేవి, జయరాం భార్య లక్ష్మిదేవి వారికి అడ్డు చెప్పినా వినలేదు. పైగా వారిపైనే దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహానంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐను కలిశారు. విషయం తెలుసుకున్న రఘురాం, జయరాం పొలం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ అసభ్య పదజాలంతో దూషిస్తూ అన్నదమ్ముళ్లను విచక్షణారహితంగా తన్నడం మొదలుపెట్టారు. ఈ ఘటనను స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా గమనించిన ఎస్ఐ వారిని కూడా దూషిస్తూ ఆ దృశ్యాలను తొలగింపజేశారు. నలుగురిలో పరువుగా బతికే తనను ఎస్ఐ రోడ్డుపై పడేసి తన్నడంతో మనస్తాపానికి గురైన రఘురాం వెంటనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతను మృతి చెందితే సమస్యలు వస్తాయని భావించిన ఎస్ఐ.. హుటాహుటిన పోలీసు వాహనంలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ప్రస్తుతం రఘురాం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నాయకుల వేధింపుల నుంచి కాపాడాలని, తమను ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఎస్ఐ తీరే వివాదాస్పదం ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ తరచూ వివాదాల్లో ఉంటున్నారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ.. వారి కనుసన్నల్లో పనిచేస్తుంటారన్న విమర్శలున్నాయి. -
ఇచ్చోటనే..తమ్ముళ్లు రెచ్చిపోయే..
ఎంత జీవితం అనుభవించినా అందరూ చివరికి చేరే స్థలం శ్మశానం. ఇక్కడ ఆరడుగుల జాగాలోనే జీవితం భౌతికంగా కనుమరుగవుతుంది. ప్రతి ఊరి చివరలో శ్మశానానికి కొంత స్థలం కేటాయించుకుంటారు. తిరుపతి నగర రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడు పాలెంలో ఇలాగే కొంత స్థలం శ్మశానానికి మినహాయించారు. తిరుపతి పరిసరాల్లో స్థలం విలువ విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు ఈ స్థలాన్ని కాజేశారు. వారికి అధికార పార్టీ నేతల అండ ఉండడం తో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులను వదిలేసి మరో శ్మశానానికి ఫైళ్లు కదుపుతున్నారు. చిత్తూరు, తిరుపతి మంగళం : తెలుగు తెమ్ముళ్లు తెగబడ్డంతో శ్మశాన స్థలం కనుమరుగైపోయింది.. ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. శ్మశానం కాస్తా హాంఫట్ అయిపోయింది.. రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది.. కారణం.. అధికార పార్టీ నేతలు ఈ స్థలం ఆక్రమణకు మద్దతు పలుకుతుండటమే. తిరుపతి పరిధిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెంలోకి వస్తుంది. సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, 5 సెంట్లలో కమ్యూనిటీæ హాల్ ఉంది. కమ్యూనిటీ హాలు మినహా మిగిలిన శ్మశాన స్థలం విలువ ప్రైవేట్ ధర ప్రకారం రూ.5 కోట్ల పైమాటే. దీంతో శ్మశాన స్థలంపై అధికార పార్టీ నేతల అనుయాయుల కన్ను పడింది. నాలుగేళ్ల క్రితం పేదల ముసుగులో ఈ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. 28 కుటుంబాలు ఇళ్లను నిర్మించేసుకున్నాయి. ఇళ్లు నిర్మించుకుంటున్నా రెవెన్యూ శాఖ అడ్డుకున్న పాపాన పోలేదు. గుట్టుచప్పుడు కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఇళ్లకు విద్యుత్, వాటర్ కనెక్షన్లు తీసుకున్నారు. జన్మభూమిలో స్థలం కోసం వినతి.. శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన అనంతరం నాయకులు కొత్త రాజకీయానికి తెరలేపారు. తమ ప్రాంతానికి శ్మశాన స్థలం కేటాయించాలని నేతల దర్శకత్వంలో జన్మభూమిలో వినతి పత్రాలు అందజేస్తున్నారు. తిరుపతి శాసన సభ్యురాలు సుగుణమ్మ రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని స్థానిక నాయకులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మించిన గోవింద ధామం శ్మశాన వాటిక అక్కడికి కూతవేటు దూరంలో ఉంది. అయినా రెండో శ్మశాన వాటిక స్థలం కోసం రెవెన్యూ, అటవీశాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఫైల్ సిద్ధం చేసేశారు. తమకేమీ తెలియనట్టు రెవెన్యూ శాఖ తెలివితేటలు ప్రదర్శిస్తోంది. గతేడాది నవంబరులో ఎమ్మెల్యే సుగుణమ్మ, జేసీ గిరీషా, సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ తిమ్మినాయుడుపాళెం దళితవాడ వెనుక వైపు గల అటవీశాఖ భూమిని శ్మశానం కోసం పరిశీలించారు . అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా భూమి ఇప్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పకపోవడంతో రెండో శ్మశాన వాటికకు స్థలం కేటాయింపునకు ఆమోదముద్ర పడే అవశాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ పనిపూర్తి చేయాలని ముమ్మురంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ఈ ఫైల్ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది. ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోవడమేమిటి.. గోవింద ధామం దగ్గరుండగా మరో శ్మశాన వాటికకు స్థలం కేటాయించే ప్రయత్నాలు జరగడమేమిటని ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు. -
వెన‘కేసు’కొస్తున్నారు..!
పశ్చిమగోదావరి, భీమవరం: ఇసుక మాఫియా, భూఆక్రమణల దందాలలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యాంకులనూ వదలడం లేదు. ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లతో అక్రమంగా రుణాలు పొంది బ్యాంకులకు శఠగోపం పెడుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల కుటుంబ సభ్యులు సైతం పైరవీలు, అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇటువంటి కోవకు చెందినదే వీరవాసరం మండలం నవుడూరు గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో మండల వ్యవసాయశాఖాధికారి సంతకం ఫోర్జరీ చేసి కౌలు రైతులకు తెలియకుండానే రుణాలు పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సాక్షాత్తు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాలా వెంకటేశ్వరరావు కుమారుడు వ్యవసాయశాఖలో ఎంపీఈఓగా పనిచేస్తున్న పాలా హర్షవర్ధన్ శివప్రసాద్ పమ్రేయం ఉండటం దీనిపై మండల వ్యవసాయశాఖాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును మాఫీచేయడానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వద్ద పంచాయితీ నడుస్తోంది. హర్షవర్ధన్ వ్యవసాయశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. గతేడాది కొంద రు కౌలురైతులను గ్రూపులుగా ఏర్పాటుచేసినట్లు చూపించి నవుడూరు ఆంధ్రా బ్యాంకులో మండల వ్యవసాయశాఖాధికారి రాజశేఖర్ సంతకాలు ఫోర్జరీ చేసి వ్యవసాయ పెట్టుబడి రుణాలు సుమా రు రూ.20 లక్షలకు పైగా తీసుకున్నట్టు రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ముందు రు ణాలు మంజూరైన కౌలు రైతుల గ్రూపుల సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు పడటం వాటిని వెంటనే మరో ఖాతా కు మళ్లించడంతో అనుమానం వచ్చి బ్యాంకు అధి కారులను ఆరా తీయగా పొరపాటున ఖాతాలో సొమ్ములు జమ అయినట్టు చెప్పి పంపించి వేశారు. ఈ విషయం ఆయా గ్రూపుల రైతులు రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బ్యాం కు అధికారులను సంప్రదించగా ఫోర్జరీ వ్యవహారం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వ్యవసాయశాఖ, బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే ఫోర్జరీ సంతకాలతో దాదాపు రూ.50 లక్షలకుపైగానే రుణాలు పొందారని, వీటిని రైతులకు అందకుండా హర్షవర్ధన్ వాడుకున్నాడనే ప్రచారం ఉంది. ఒత్తిళ్లు.. పైరవీలు బ్యాంకులో ఫోర్జరీ సంతకాల వ్యవహారంతో వీరవాసరం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని, ఈ కేసు నుంచి హర్షవర్ధన్ శివప్రసాద్‌ను తప్పించాలని కొందరు పార్టీ పెద్దలు ఇటీవల ఎమ్మెల్యే రామాంజనేయులు వద్ద పంచాయితీ పెట్టినట్టు తెలిసింది. మండల వ్యవసాయశాఖాధికారి రాజశేఖర్, ఎంపీఈఓ హర్షవర్ధన్ శివకుమార్ మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు కారణంగానే కేసులో ఇరికించారని, దీనిలో హర్షవర్ధన్ ప్రమేయం లేదని ఎమ్మెల్యేకు చెప్పి కేసును మాఫీ చేయించాల్సిందిగా కోరినట్టు తెలిసింది. వ్యవసాయశాఖాధికారి పోలీసులకు ఫిర్యాదుచేసి 15 రోజులు గడిచినా టీడీపీ నాయకుల పైరవీల కారణంగానే ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. టీడీపీలో విభేదాలు కారణంగా మరి కొందరు నాయకులు ఫోర్జరీ వ్యవహారంలో లొసుగులను అధికారులకు అందిస్తున్నట్టు తెలిసింది. ఫోర్జరీలతో పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతినగా పార్టీ నాయకులు కేసును మాఫీ చేయించడానికి చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు తావిస్తున్నాయి. -
ఖాళీ జాగాలో వేసెయ్ పాగా..
విజయనగరం, బొబ్బిలి: పట్టణంలోని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు అక్కడ వాలిపోతారు. ముందుగా కొయ్యిలు లేదా కంచెలు వేస్తారు.. అక్కడకు కొద్ది రోజుల తర్వాత పాకలు వేస్తారు.. మరికొద్ది రోజులకు ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించేందుకు రియల్టర్లను తీసుకువచ్చి ఆ స్థలాన్ని విక్రయించేస్తారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. బొబ్బిలిలోని పలు చెరువు గట్లు, గర్భాలు, ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ టీడీపీ నాయకులే అధికారం చెలాయిస్తుండడంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కాసింత ఇంటి జాగాకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకుంటే బుట్టదాఖలా అవుతున్న ఈ రోజుల్లో లక్షల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురికావడంపై ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో ఉన్న దాదాపు మూడు చెరువులు ఇప్పటికే కప్పేసి విక్రయించేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, వసతి గృహాలు, చెరువులు కాదేదీ ఆక్రమణకనర్హమన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీలోని కిచిడీ బందలో ఇటీవల ఆక్రమణలను గుర్తించిన అధికారులు బోర్డులు పాతడంతో వాటిని తొలగించి మరీ చదును చేశారంటే అధికార పార్టీ నాయకుల బరితెగింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఐటీఐ కాలనీ ఒకటి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వసతి గృహ సముదాయాలు, బీసీ వసతి గృహాలు, ఉద్యాన వన క్షేత్రాలున్నాయి. వీటి అంచునే కాలనీ ఉంది. ఇంటిగ్రేటెడ్ వసతి గృహం ఎదురుగా ప్రభుత్వ స్థలముంది. ఇక్కడ పలువురు పశువుల పాకలు వేసుకుని వినియోగిస్తున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు వారిలో కొందరిని వెళ్లగొట్టి అక్కడ ఇంటి స్థలాలకు మార్కింగ్‌లు చేశారు. కొయ్యలు పాతి, గోతులు తవ్వేసి ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమైపోయారు. మరో పక్క ఇప్పటికే అక్కడ చాలా మంది ఆక్రమణలతో బినామీ పేర్లతో ఇళ్లను నిర్మించుకుని ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వసతిగృహం ఎదురుగా.... బొబ్బిలి ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం ఎదురుగా ప్రభుత్వ స్థలం ఉంది. పట్టణంలోని 21వ వార్డులో ఉన్న ఈ ఖాళీ ప్రభుత్వ స్థలంలో స్థానిక టీడీపీ నాయకులు ఇళ్ల నిర్మాణం కోసం గోతులు తీశారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఈ స్థలానికి ప్రహరీ లేకపోవంతో గోతులు తీసి, నిర్మాణ సామగ్రి కూడా వేశారు. అంతే కాదు ఇక్కడ చాలా బిట్ల అమ్మకాలకు కొంత నగదు కూడా చేతులు మారినట్టు సమాచారం! అయితే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెండకరాల కబ్జా.. పట్టణ నడిబొడ్డున మేదరి బంద చెరువుంది. ఇక్కడ దాదాపు రెండకరాల స్థలం కబ్జా అయిపోయింది. విచిత్రమేమంటే ఇక్కడ మున్సిపల్ తీర్మానం చేసి మరీ కొంత స్థలం చేపల మార్కెట్‌కు కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వమే కబ్జాకు పాల్పడితే ఇక స్థానికులు ఆగుతారా? బరితెగించిపోయారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మేదరి బంద చెరువును మున్సిపల్ రికార్డుల్లో తొలగించాల్సింది. కేవలం ఈ రెండే కాదు. గొల్లపల్లిలో అధికారులు చొరవ తీసుకుని పరిశీలిస్తే రహదారులను కూడా ఆక్రమించేసిన సంఘటనలున్నాయి. అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆడుతున్న కబ్జాపర్వం తెగ సాగుతోంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆక్రమణదారుల చెర నుంచి స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
విస్తరణ లేదు...బైపాస్ అవదు
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: జాతీయ రహదారిని ఆరులైన్లుగా విస్తరించాలన్న యోచన పదేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈలోగా బైపాస్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేసి గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బైపాస్ కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమికి పరిహారం అందించినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నేటికీ చెల్లించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో ఈ దుస్థితి దాపురించింది. రహదారి విస్తరణ, బైపాస్ రెండూ జరగకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. విస్తరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం 16వ నంబర్ జాతీయ రహదారిని(గతంలో ఐదవ నెంబర్) 2009లో ఆరులైన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ రహదారి విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు 82.5 కిలోమీటర్ల దూరం ఉంది. వాహనాల సంఖ్య పెరిగిన క్రమంలో ఆరులైన్లుగా విస్తరించాలని 2009 మే 1న కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నుంచి ఒంగోలు వరకు ఉన్న 68 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరించినప్పటికీ, చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి శివారు వరకు ఉన్న 14.5 కిలోమీటర్ల పరిధిలో మాత్రం కోర్టుకేసుల నేపథ్యంలో ఆరు లైన్లుగా విస్తరణకు నోచుకోలేదు. బైపాస్ ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను అందించకపోవటంతో నేటికీ పనులు ప్రారంభించలేదు. అనేక అవాంతరాలతో అనుమతులు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, పట్టణంలోని భవనాలకు చెందిన యజమానులు జాతీయ రహదారిని ఆరులైన్ల విస్తరణకు అంగీకరించలేదు. బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే సన్నచిన్నకారు రైతులు తమ విలువైన భూమిని ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ విషయమై 2010లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్డును ఆశ్రయించారు. కోర్టు రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి బైపాస్‌ను ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది. 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రహదారుల సమీపంలో ఉన్న భూములకు ఒక ధర, భవనాలు ఉన్న భూములకు ఒక ధర, రహదారులకు దూరంగా ఉన్న భూములకు మరొక ధరను నిర్ణయిస్తూ(ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల కన్నా 2.5 శాతం) అధికంగా చెల్లించేందుకు రైతులు అంగీకరించటంతో బైపాస్కు రంగం సిద్ధమైంది. ఆరు లైన్ల బైపాస్కు అనుమతి నేషనల్ హైవేస్ యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం నుంచి మండల కేంద్రమైన నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి మీదుగా 16.38 కిలోమీటర్ల దూరంలో ఆరులైన్ల బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు 650 మంది రైతులకు చెందిన 132.12 ఎకరాల భూమిని సేకరించింది. సంబంధిత భూమిలో సర్వేలు నిర్వహించిన నేషనల్ హైవే అధికారులు సెక్షన్3(డీ) ప్రకారం 12–01–2018న, 31–05–2018న పత్రికల ద్వారా గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు 2018 ఆగస్టులో నరసరావుపేట ఆర్డీవో నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. బైపాస్కు భూములు ఇచ్చేందుకు మెజార్టీ రైతులు అంగీకరించారు. అసలు చిక్కు ఇదే ... కేంద్రప్రభుత్వం బైపాస్ రోడ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు అందించే పరిహారంలో కేవలం 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరింది. బైపాస్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు రూ.223.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 55.80 కోట్లు అందించాలని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 4న లేఖరాసింది. అనంతరం అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖకు చెందిన అధికారులు మరో విడత లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం గమనార్హం. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.525.78 కోట్లను కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం బిడ్లను(టెండర్) గత ఏడాది అక్టోబర్ 22న ప్రకటించింది. బిడ్లకు చివరి తేదీగా 17–01–2019న నిర్ణయించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రైతుల పరిహారం వాటాను చెల్లించకపోవటం ప్రశ్నార్ధకంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు జాతీయ రహదారిలో కేవలం 14.50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరులైన్లుగా విస్తరించలేదు. గత తొమ్మిదేళ్ల కాలంలో తిమ్మాపురం నుంచి బొప్పూడి శివారు వరకు 310 ప్రమాదాలు చోటు చేసుకుని 128 మంది మరణించారు. 171 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బైపాస్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వానికి లేఖ అందించాం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.525.78 కోట్లతో టెండర్లు పిలించింది. బిడ్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీన ముగుస్తుంది. రైతులకు చెందిన భూమిని సేకరించాం. గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాం. రైతులకు పరిహారం అందించకుండా రోడ్డు నిర్మాణం చేయటం భావ్యం కాదు. పరిహారం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 25 శాతం(రూ.55.80 కోట్లు) చెల్లించాలని లేఖను అందించాం. ప్రభుత్వం నిధులు కేంద్రానికి జమచేస్తే పరిహారం వెంటనే మంజూరు చేసి రైతులకు పంపిణీ చేసి బైపాస్ నిర్మాణం ప్రారంభిస్తాం–కె.శ్రీనివాసరావు,పి.డి, నేషనల్హైవే, విజయవాడ -
కాలబైరవుడి స్థలంపై పెద్దల కన్ను
గతంలో దేవుళ్లకు మాన్యాలు, ఆలయ నిర్మాణాలకు స్థలాలు దాతలు దానాలు చేశారు. నేటి తరంలో కొందరు పెద్దల ముసుగులో భగవంతుడికే శఠగోపం పెట్టి ఆలయ భూములు కాజేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల వద్ద వివిధ సామాజికవర్గాల వారు ఒక్కొక్క సత్రం నిర్మించుకోవడం పరిపాటి. అయితే ఒకే సామాజికవర్గానికి ఐదు సత్రాలు ఎక్కడా కనిపించవు. కానీ త్రిపురాంతకంలో మాత్రమే అదిసాధ్యమైంది. మళ్లీ మరో సత్రం నిర్మాణం కోసమంటూ కాలబైరవుడి భూమిపై కన్నేసి అధికారులపై ఒత్తిడిలు తెవడం, భూమిని సదును చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రకాశం, త్రిపురాంతకం:ప్రభుత్వ పెద్దల అండదండలతో ఒక సామాజిక వర్గం భూ ఆక్రమణకు ప్రయత్నం చేస్తోంది. ఇది ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ఉన్న భూమి అని చెప్పినప్పటికీ వినకుండా, దేవాదాయ దర్మాదాయ శాఖ అధికారులను బెదిరింపులకు సైతం గురిచేస్తున్నారు. దాంతో అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు తహశీల్దార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. త్రిపురాంతకంలోని శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయం సమీపంలోని కాలబైరవుడి ఆలయానికి కొండ ప్రాంతం సర్వేనెంబర్ 702లోని 79 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ప్రైవేటు భూములు ఉండవు. ఇది చరిత్ర కలిగిన ప్రదేశమని, అత్యంత విలువైన భూమిగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఆలయాల అభివృద్ధికి దేవస్థానం మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ఆ మాస్టర్ ప్లాన్‌లో ఈచదును చేసిన భూమి ఉంది. ఇక్కడ గతంలో రెండుసార్లు ఇతర పెద్దలు ఒక ఆశ్రమం నిర్మాణానికి ప్రయత్నం చేశారు. ఇదే విధంగా ఇక్కడ ఒక ప్రముఖ ఆలయం నిర్మాణం చేయాలని గ్రామానికి చెందిన కొందరు భక్తులు ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆలయాలకు ఈస్థలం అవసరమని చెప్పడంతో ఆప్రయత్నాలను వారు విరమించారు. కానీ ప్రస్తుతం ఆక్రమణకు యత్నిస్తున్న వారు మాత్రం మాకు అవేమీ పట్టవన్నట్లు అక్కడ భవన నిర్మాణం చేయాల్సిందే అన్నట్లు పావులుకదుపుతున్నారు. దేవాలయ అధికారులు చెప్తున్నా.. పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టాల్సిందే అన్నరీతిలో దూకుడుగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. మాకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నయాంటూ బెదిరిస్తుండడం, అదే విధంగా అధికారులకు సైతం ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న పెద్దలతో బెదిరింపుకాల్స్ చేయిస్తున్నట్లు పెద్ద చర్చసాగుతుంది. ఇన్చార్జి అధికారులు ఎంతకాలం ఉంటారు అంటూ.. విమర్శించడం చూస్తే ఇది ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఒక్క సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో ఒక్కో సత్రం ఉంది. అయితే విచిత్రంగా ఈ సామాజిక వర్గానికి ఐదు సత్రాలున్నాయి. ఇన్ని సత్రాలు ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం నిర్వహించడం దాదాపు దేశంలో మరెక్కడ కనిపించదని భక్తులంటున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం ఉంటే ఏదైనా చేసేయొచ్చు అన్న రీతిలో కొంతమంది ఈ ఆక్రమణకు పూనుకున్నట్లు విమర్శిస్తున్నారు. దీనిపై ఒకపక్క రెవెన్యూ మంత్రి ద్వారా అధికారులకు చెప్పించడం, సిఫార్సులు చేయించడంపై ఆశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై భక్తులు పెద్ద ఎత్తున విమర్శించడంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి, శ్రీపార్వతి త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల ట్రస్ట్‌బోర్డు వారు రెవెన్యూ అధికారులను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిని గతంలోనే మాస్టర్ ప్లాన్‌లో చేర్చినందున, దీనిని ఏ ప్రైవేటు వ్యక్తులకు అనుమతించరాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈప్రాంతంలో తమకూ భూములు కేటాయించాలని మిగిలిన సత్రాల వారి డిమాండ్ ముందుకు వస్తుంది. దీనిపై తహశీల్దార్ జయపాల్‌ను వివరణ కోరగా ఈ స్థలం ఆక్రమణ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఆభూమిని దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ఉన్నందున ఆశాఖ అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. ఆలయాల ఈఓ రమేష్‌ను ప్రశ్నించగా మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగా ఆలయాలకు అతి సమీపంలో ఉన్న స్థలం ఇది. దీని అవసరం ఆలయాలకు ఉంది. ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని తెలియజేశాం, రెవెన్యూ పరంగా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ గోళ్ల సుబ్బారావు మాట్లాడుతూ దీనిని ఆక్రమణ జరగకుండా చూడటంతో పాటు కాలబైరవుని కొండ ప్రాంతం అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టామని దీనిని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
తలదాచుకోవడానికి గూడులేని పేదలు తమకింత జాగా కావాలని కోరితే ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. అసలు వారి మొర వినేనాథులే లేరు. ‘పల్లె సార్’ చెప్పాడంటూ కొందరు రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. మొదట గుడి.. ఆ తర్వాత అక్కడే నివాసం.. సకల సౌకర్యాల కోసం మరికొంత స్థలం కబ్జా చేసేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అనంతపురం, పుట్టపర్తి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల శిల్పారామం కాలనీలో అక్క మహాదేవతల ఆలయాన్ని ప్రారంభించారు. కాలనీలోని అనేకమంది నిరుపేదలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ అయిన పల్లె రఘునాథరెడ్డి గానీ, అధికారులు గానీ తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో నల్లమాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి కాలనీలో పది సెంట్లకు పైగా ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి అక్క మహాదేవతల గుడి నిర్మించాడు. దాన్ని ప్రారంభించిన తర్వాత.. పక్కనే నివాసానికని, మరుగుదొడ్లు, స్విమ్మింగ్‌పూల్ లాంటి తొట్టె తదితర సదుపాయాల పేరిట స్థలం ఆక్రమించుకున్నాడు. కొంతమంది నాయకులు చందాలు కూడా ఇవ్వడంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. శిల్పారామం కాలనీ ఏర్పాటు సమయంలో అక్కడ వాటర్ ట్యాంకు, పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి స్థలంలోనే ఆలయం నిర్మాణానికి పూనుకున్నపుడు స్థానికులు అడ్డు చెప్పినా ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. ఇది ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సారే చెప్పారు’ అంటూ బెదిరించినట్లు వాపోతున్నారు. విలువైన భూమిని ఆయనకు కట్టబెట్టడంతో అక్కడ శివగంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ పది సెంట్ల భూమిని చదును చేసి పెట్టారు. అమ్మ ఆదేశించి, దాతలు స్పందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీడుపల్లికి చెందిన నారప్ప పేర్కొంటున్నాడు. మనోళ్లే వదిలేయ్..! విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అ«ధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ‘వాళ్లు మనవాళ్లే.. వదిలేయి’ అని అంటున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమతులు లేవు ఈ విషయంపై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా గుళ్ల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు గానీ, పట్టాలు గానీ ఇవ్వలేదన్నారు. సిబ్బందిని పంపి విచారణ చేయిస్తానన్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ♦ సత్యసాయి విమానాశ్రయం ఎదుట çసర్వే నంబర్ 666–3ఏలో దాదాపు 2.50 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో వారం క్రితం మరో గుడిని నిర్మించారు. పుట్టపర్తి నగర పంచాయతీలోని బీడుపల్లికి చెందిన ఓ టీడీపీ సానుభూతి పరుడు నాలుగేళ్లు ఎక్కడో మఠంలో ఉండి నెలక్రితం వచ్చి ఎమ్మెల్యేను, నాయకులను అడిగిందే తడవుగా విమానాశ్రయం వద్ద స్థలం కేటాయించారని స్థానికులు పేర్కొంటున్నారు. -
కబ్జాదారుల బరితెగింపు
కుత్బుల్లాపూర్: భూకబ్జాదారులు బరితెగించారు. మొన్న వీఆర్ఏపై కర్రలతో దాడి చేసిన సంఘటన మరువక ముందే ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో చోటుచేసుకుంది. స్థానిక సర్వే నెంబర్ 329/1 కట్టమైసమ్మ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆదివారం కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్ఐ నరేందర్‌రెడ్డి, వీఆర్వోలువీఆర్ఏలతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయసాగారు. ఈ క్రమంలో పలువురు కబ్జాదారులు మహిళలను రెచ్చగొట్టడంతో వారు తహసీల్దార్‌పై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా ఆర్ఐ నరేందర్రెడ్డిపై కిరోసిన్ చల్లి నిప్పంటించే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా తహసీల్దార్ గౌతమ్‌కుమార్ మాత్రం విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మూడు గదులను సీజ్ చేసి, రెండు బేస్మెంట్లను నేలమట్టం చేశారు. కబ్జాదారులపై బిగిసిన ‘పిడి’కిలి గాజులరామారం పరిధిలో ఇటీవల కాలంలో కబ్జాదారులు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు వేస్తున్నారు. వాటిని అమాయకులకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణాలను అ«ధికారులు కూల్చివేస్తున్నప్పటికీ కబ్జాదారులు మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో గదులు నిర్మించి విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. ఆదివారం కబ్జాదారుడు మజర్‌ఖాన్ సర్వే నెంబరు 23 కొత్తకుంట చెరువు పక్కనే నిర్మించిన ఇంటిని అధికారులు సీజ్ చేశారు. గాజులరామారం, రావి నారాయణరెడ్డినగర్, కైసర్‌నగర్ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలాలను కబళించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్న కబ్జాదారులపై మండల తహసీల్దార్ గౌతమ్‌కుమార్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ భూములను ఆక్రమించుకుంటున్న ఇంతియాజ్ అనే వ్యక్తిపై జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం కూల్చివేతల నేపధ్యంలో స్థానికుల సమాచారం మేరకు గడ్డం కృష్ణ, రాజన్న, మదర్ఖాన్ను కట్టడి చేస్తే స్థానికంగా కబ్జాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం వీరిపై ‘పిడి’ చట్టం ప్రయోగించాలని అధికారులు నిర్ణయించారు. అదే విధంగా ఓ టీఎమ్మార్పీస్ నేత, ఓ ఆర్ఎంపీ, ఓ మహిళా వార్డు మెంబర్, టీఆర్ఎస్ నేత, బంజారా నేత, వడ్డెర సంఘం నేతతో పాటు ఇంకా పలువురు స్థానిక ఆక్రమణదారులపై అందిచిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్నారు. వీరిపై కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కబ్జా చేస్తే సహించం.. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టినా, వాటిని కొనుగోలు చేసినా, అమ్మినా సహించే ప్రసక్తి లేదు. ఆదివారం కైసర్‌నగర్, దేవేందర్‌నగర్, రావి నారాయణరెడ్డినగర్, కట్టమైసమ్మ బస్తీ, రింగ్ బస్తీ, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో కబ్జాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలు తొలగించాం. త్వరలో కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుత్బుల్లాపూర్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ స్థలాలపై సమగ్ర నివేదిక తయారు చేస్తున్నాం. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం.– గౌతమ్‌కుమార్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ -
అధికార పార్టీ భూ దాహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇరవై కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే నాలుగు ఎకరాల నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) స్థలాన్ని అధికార పార్టీ నేతలు కాజేశారు. ఒంగోలుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు సదరు స్థలాన్ని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు ఇంటి పట్టాల పంపిణీ పేరుతో విలువైన స్థలాన్ని ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున కేటాయించారు. పూర్తి వివరాల్లోకెళ్తే... ఒంగోలు నగర పరిధిలోని కేశవరాజుకుంటలో 178తో పాటు 180 నుంచి 185 వరకు గల సర్వే నంబర్లలో నాలుగు ఎకరాలకుపైగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలం ఉంది. 40 ఏళ్ల క్రితం సాగర్ కాలువ తవ్వకానికంటూ అప్పట్లో అధికారులు సదరు పొలాన్ని రైతుల నుంచి సేకరించారు. అయితే, ఆ పొలంలో కాలువ తవ్వకం జరగలేదు. దీంతో స్థలం ఖాళీగానే ఉంది. ఒంగోలు నగరం విస్తరించడంతో ఇప్పుడు ఆ స్థలం దాదాపు నగరం నడిబొడ్డుకు చేరింది. ఎంతో విలువైన ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు, కార్యకర్తలకు స్థలాన్ని పంచిపెట్టాలంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై నేతలు ఒత్తిడి పెంచారు. దీంతో ఆ స్థలాన్నికార్యకర్తలకు పట్టాలుగా ఇవ్వాలంటూ అధికారులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి పెంచారు. ఆ స్థలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉండడంతో రెవెన్యూ అధికారుల సూచన మేరకు ల్యాండ్ కన్వర్షన్‌కు సిద్ధమయ్యారు. సదరు స్థలం పొజిషన్‌పై రెవెన్యూ ఉన్నతాధికారులు ఎన్నెస్పీ అధికారులను నివేదిక కోరారు. సదరు స్థలంలో కాలువ తవ్వలేదని, ఆయకట్టు కూడా లేదని ఎన్నెస్పీ అధికారులు నో అబ్జక్షన్ నివేదిక సమర్పించారు. దీంతో వేగంగా పావులు కదిపిన అధికార పార్టీ నేతలు.. పైస్థాయిలో తంతును పూర్తి చేశారు. సదరు స్థలాన్ని యుద్ధప్రాతిపదికన రెవెన్యూకు బదలాయించారు. అధికార పార్టీకి చెందిన దాదాపు 140 మందికి ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున సదరు స్థలాన్ని కేటాయిస్తూ మూడు నెలల క్రితం ఒంగోలు తహసీల్దార్ పట్టాలు ఇచ్చారు. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఆ పట్టాలకు పొజిషన్ చూపించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆ స్థలం విలువ గది దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది. ఈ లెక్కన సెంటు 6 లక్షల రూపాయలపైనే విలువ చేస్తుంది. ఆ ప్రకారం ఎకరా రూ.6 కోట్ల చొప్పున నాలుగు ఎకరాల విలువ దాదాపు రూ.25 కోట్లు. విలువైన సాగర్ స్థలాన్ని అర్హులైన పేదలకు కాకుండా అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహారాలు నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాలిచ్చింది నేను కాదు : ఎన్నెస్పీ స్థలం పట్టాల పంపిణీ విషయం పూర్తిగా నాకు తెలియదు. నేను రాకముందే సదరు సర్వే నంబర్లలో పట్టాలిచ్చి ఉన్నాయి. ఒకటీరెండు ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి. ఆ స్థలంలో ఎవరెవరికి పట్టాలిచ్చారన్న విషయాన్ని పరిశీలిస్తున్నా.ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలకు అప్పగించడం దుర్మార్గం : సింగరాజు వెంకట్రావు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చెందిన విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని అధికార పార్టీ నేతలకు ఇళ్ల స్థలాల పేరుతో పట్టాల కింద అప్పగించడం దుర్మార్గపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు విమర్శించారు. సదరు స్థలాన్ని ఆ పార్టీ నేతలు రామానాయుడు, శంకర్, జలీల్, రఫీ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలన్నింటినీ స్వాహా చేస్తున్న అధికార పార్టీ నేతలు విలువైన ఎన్నెస్పీ స్థలాన్ని కూడా స్వాహా చేశారని వారు విమర్శించారు. ఇళ్ల స్థలాలు లేని వేలాది మంది పేదలు స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకుని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. -
బరి తెగించిన భూ బకాసురులు
తుళ్లూరు: రాజధానిలో వాలిన భూ రాబందులు బతికి ఉండగానే బడుగు రైతుల్ని పీక్కుతింటున్నాయి. పాపం పుణ్యం ఆలోచించడం లేదు. బినామీ పేర్లతో ఇప్పటికే స్థలాల్ని మింగిన భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూముల్ని కాజేయడానికి భారీ స్కెచ్ వేశారు. రాజధానిని ప్రకటించి సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై కన్నేశారు. పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామ,దాన,భేద,దండోపాయాలెన్నో ప్రయోగించారు.. తాజాగా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఎంపీ రాజుగారు మనుషులమంటూ రాజధాని గ్రామమైన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ లంకల్లో 110 ఎకరాలను కాజేయడానికి కుట్ర పన్నారు. దీనికి ‘ఆపరేషన్ పందుల దిబ్బ : 110 ఎకరాలు’ అంటూ భారీ స్కెచ్ వేసినట్టు బాధిత రైతులు చెబుతున్నారు. వారిలో కొంతమందిని లోబర్చుకునిఈ ఆపరేషన్‌కు ఎరగా వాడుకుంటుండటం గమనార్హం. 1981 నుంచి లీజు చెల్లింపు వెంకటపాలెం లంక పరిధిలో ఉన్న భూముల్ని సాగు చేసుకోవడానికి గ్రామంలోని 96 కుటుంబాలకు చెందిన వారంతా 1981లో వెంకటపాలెం కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ అనే సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. దీని పరిధిలో 121 ఎకరాలు ఒక దిబ్బ, 110 ఎకరాలు (పందుల దిబ్బ) మరో దిబ్బ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇరిగేషన్ శాఖకు 121 ఎకరాలకు చెందిన భూములకే లీజు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో 110 ఎకరాలను మరో వ్యక్తికి ఆ శాఖ అధికారులు లీజుకు ఇచ్చారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత 2013 నుంచి లీజు తీసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు నిరాకరించారు. బాధిత రైతులు రెండు దిబ్బలు తమ సొసైటీ పరిధిలోనే ఉన్నాయి కదా.. ఎక్కడకీ పోవు అనే నమ్మకంతో వాళ్ల పని చేసుకుంటున్నారు. ఆపరేషన్ పందులదిబ్బకు ఎసరు ఇంతలో టీడీపీ నేతలు, బడా బాబులు కళ్లు ఈ భూములపై పడ్డాయి. లంక భూముల్ని దోచుకోని వాటిని రిసార్ట్‌లుగా మార్చేసి కోట్లు కొల్లగొట్టాలనేది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. బాధిత రైతుల్లో కొంతమందిని లోబర్చుకుని వారికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పి మంతనాలు చేయిస్తున్నారు. సొసైటీ పేరు మీద ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తే ఎకరాకు 500 గజాలు ఇస్తామని నమ్మించారు. ఇందులో 250 గజాలు రైతులు తీసుకుంటే, మిగతా 250 గజాలు తాము తీసుకుంటామంటూ ప్రలోభ పెట్టారు. దీనికి ఒప్పుకోని పక్షంలో అసలు భూములు దక్కకుండా చేస్తామని బెదిరించారు. దీంతో రైతులంతా కలసి ఈ కథను నడుపుతున్న వ్యక్తిని నిలదీశారు. దీంతో అతడు ఏకంగా పావులుగా వాడుకుంటున్న రైతుల్ని వాడుకుని ఆ భూముల్లో షెడ్లు వేసి పాగా వేసే ప్రయత్నం చేశాడు. బుధవారం ఉదయం రైతులంతా కలసి లంక భూముల్లోకి వెళ్లి షెడ్లను కూల్చేశారు. ఇంతలో కబ్జాదారులు లోబర్చుకున్న రైతుల్లో ఒకడు వచ్చి దబాయించాడు. అయినా మిగతా వారు పట్టించుకోకుండా షెడ్లను నేలమట్టం చేశారు. -
బామ్మర్ది భూదందా?
వజ్జ బాలరాజు... వృత్తిరీత్యా పశుసంవర్థక శాఖలో ఉన్నతోద్యోగి! ప్రవృత్తి మాత్రం వివాదాస్పద భూముల కొనుగోలు! ఇందులో భాగంగానే ఎచ్చెర్ల మండలం పొన్నాడ రెవెన్యూ గ్రామ పరిధిలో భూయజమానులకు, కౌలు రైతులకు మధ్య ఉన్న చిన్న వివాదాన్ని ఆసరాగా తీసుకొని రూ.కోటికి పైగా విలువైన భూమిని అతిచౌకగా దక్కించుకునేందుకు స్కెచ్ వేశారు. నకిలీ రైతుల పేర్లతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. వెనుకాముందు చూడకుండా రిజిస్ట్రేషన్ల శాఖలోనూ పనులు చకాచకా జరిగిపోయాయి. రెవెన్యూ శాఖ వారైతే మరో అడుగు ముందుకేసి కొనుగోలు చేసిన భూమికి సుమారుగా మరో ఎకరం అదనంగా మ్యూటేషన్ కూడా చేసేశారు. బాలరాజు ఇంత సునాయాసంగా ఈ భూమిని దక్కించుకోవడం వెనుక చక్రం తిప్పింది మాత్రం ఆయన బావ, ప్రభుత్వ విప్ రవికుమారేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జాతీ య రహదారికి ఆనుకొని ఎచ్చెర్ల మండలం పొన్నాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆలపాన గురువునాయుడుపేట (ఏజీఎన్ పేట) వద్ద సర్వే నంబరు 1, సర్వే నంబర్లు 499–524లో సుమారు 204 ఎకరాల భూమి ఉంది. పూర్వం ఈ భూమి మాడుగుల పాపారావు, కానుకుర్తి వెంకటనరసింగ సుదర్శనరావులకు చెందినది. వారి నుంచి హనుమంతు దీనబంధు, ఆయన కుటుంబసభ్యులైన నారాయణదొర, సునీత, సరస్వతి 2003 ఫిబ్రవరి, జూలై నెలల్లో రెండు దఫాలుగా 138.79 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి పట్టా నంబర్లు 1135లో హనుమంతు దీనబంధుకు, 1136తో హనుమంతు సునీతకు, 1129తో హనుమంతు సరస్వతి, 1132తో హనుమంతు నారాయణదొరకు రెవెన్యూ శాఖ 2009 సంవత్సరంలో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసింది. వివాదమే ఆసరాగా... దీనబంధు, ఆయన కుటుంబసభ్యులు మొత్తం 138.79 ఎకరాలు కొనుగోలు చేసే సమయానికే ఆ భూమిలో కొంతమంది రైతులు కౌలుకు సాగుచేస్తున్నారు. అయితే అమ్మకం జరిగినందున తమకు కౌలు హక్కుల పేరిట కొంత భూమి కావాలని డిమాండ్ చేశారు. దీంతో దీనబంధు కుటుంబం చాలావరకూ వారితో సెటిల్మెంట్ చేసుకుంది. ఈ దశలోనే ఈ భూమి వ్యవహారం బాలరాజు దృష్టికి వచ్చింది. స్థానికంగా భూమి వ్యవహారాల్లో దళారులైన బచ్చు నరసింగరావు, తారా గోవిందరెడ్డిల సహాయంతో స్కెచ్ వేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో భూమి రికార్డులు తారుమారు చేశారు. అలపాన అప్పారావు, అచ్యుతరావు, మాధవరావు, నూకయ్య తదితరుల పేర్లతో ఆ భూమి ఉన్నట్లు 1బీ, పాసుపుస్తకాలు సృష్టించారు. వారికి 11.77 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. వారికే కొంత మొత్తం చెల్లించి ఆ భూమిని వజ్జ బాలరాజు కొన్నట్లుగా 2014 సంవత్సరంలో మూడు దఫాలుగా రిజిస్ట్రేషన్లు చేయించారు. అయితే అప్పటికే హనుమంతు దీనబంధు కుటుంబానికి ఈ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు బాలరాజు పేరున మ్యూటేషన్ చేసేశారు. ఆయన కొన్నట్లుగా చూపిస్తున్న భూమి 11.77 ఎకరాలే అయినప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో ఏకంగా 12.65 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేసి ఖాతా నంబరు 2301తో పాసు పుస్తకం కూడా జారీ చేయడం గమనార్హం. అంతా సునాయాసంగా... సాధారణంగా ఏదైనా భూమికి రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ చేసేముందు సంబంధిత భూమి రికార్డులను సబ్‌రిజిస్ట్రార్ క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. ఏమాత్రం సందేహం వచ్చినా సంబంధిత తహసీల్దారు కార్యాలయం నుంచి రికార్డులు తెప్పించుకొని పరిశీలించాలి. కానీ బాలరాజు మాత్రం రెవెన్యూ శాఖ సిబ్బందితో తన భూమికి మ్యూటేషన్ చేయించుకున్నట్లే రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ కూడా సునాయాసంగా చేయించుకున్నారు. ఆ సమయంలో తన బంధువైన రవికుమార్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండటం, అప్పటి పొందూరు సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న కంచరాన రోహన్‌కుమార్ కూడా బంధువే కావడంతో బాలరాజు తప్పుడు పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధిత యజమానులైన దీనబంధు కుటుంబం ఆరోపిస్తోంది. ‘డిజిటల్ కీ’తో పక్కదారి... తమకు చెందిన భూమిని బాలరాజు అక్రమంగా మ్యూటేషన్ చేయించుకున్నారని తెలుసుకున్న దీనబంధు కుటుంబం కూడా ఎచ్చెర్ల తహసీల్దార్ల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ భూమిని తిరిగి తమ పేర్లతో మ్యూటేషన్ చేయాలని కోరింది. ఈ సమయంలో ఎచ్చెర్ల తహసీల్దారుగా ఉన్న కె.రామ్మోహన్రావు జూలై 31వ ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఆయన ‘డిజిటల్ కీ’తో ఆగస్టు 1వ తేదీన ఆ భూమిని దీనబంధు కుటుంబానికి మ్యూటేషన్ అయిపోయింది. దీంతో బాలరాజు అక్రమ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. డిజిటల్ కీతో తనకు అన్యాయం జరిగిందంటూ రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులను సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దీనబంధు కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే విషయమై జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆర్డీవో కోర్టులో విచారణ చేస్తాం... పొన్నాడ రెవెన్యూ పరిధిలోని ఏజీఎన్ పేటలోని భూ వివాదంపై మాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాం. దీనిపై పూర్తి వివరాలు జిల్లా కలెక్టరుకు నివేదించాం. ఇరువర్గాలకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నాం. ఈ వివాదంపై ఆర్డీవో కోర్టులో విచారణ చేస్తాం.– ఎంవీ రమణ, శ్రీకాకుళం ఆర్డీవో -
కాపాడేవారెవరు?
ప్రభుత్వ భూముల ఆక్రమణలకుకళ్లెం పడటం లేదు. ఖరీదైన ప్రాంతాలలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కబ్జా చేస్తున్నారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి పరిధిలోనే ఈ అక్రమాలు ఎక్కువ. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. కొందరు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారన్న సమాచారం ఇస్తే తమపై ఎదురు కేసులు పెడతామని అధికారులే బెదిరింపులకు దిగుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆక్రమణలకు గురైన భూముల వివరాలివిగో.. సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 251/1లో 118.83 ఎకరాల నది పోరంబోకు భూమి ఉంది. దీనిలో కొంత విలువైన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఇష్టానుసారం విక్రయించి సొమ్ముచేసుకున్నారు. టీడీపీ నేత అ నుచరుడు ఒకరు ప్లాట్లు వేసి విక్రయించారు. నదీ పోరంబోకు భూమి అని తెలియని కొందరు లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఎవరి అనుభవంలో ఉన్న భూమిని వారి సొంతం చేస్తామని హామీ ఇచ్చారు. ♦ హథీరాంజీ మఠం భూముల్లోని అవిలాల పరిధిలో తొమ్మిది ఎకరాల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆక్రమించుకున్న భూమిలో వేసిన ప్లాట్లకు నంబర్లు ఇచ్చి రాళ్లు పాతుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం అధికారులు నోరెత్తడం లేదు. అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. ♦ రూరల్ మండలం మల్లంగుంట పరిధిలోని సర్వే నంబర్ 176/2లో 2.50 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. ఎకరం విలువ రూ.5 కోట్లు ఉంటుంది. దీనిని తిరుపతిలోని టీడీపీ నాయకుడొకరు ఆక్రమించుకున్నాడు. తాను వేసిన లేఅవుట్లో కలుపుకున్నాడు. వెంచర్‌కు దారి సౌకర్యం లేకపోయినా స్థానికులను భయపెట్టి కొంత స్థలాన్నిఆక్రమించుకున్నారని ఆరోపణలున్నాయి. మరి కొంతభూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ♦ రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 153/1లో 125.65 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో 44.95 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ భూమిపై టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి కన్నుపడింది. తిరుపతి–కరకంబాడి రహదారి మార్గంలో ఎకరం రూ.3 కోట్లు విలువచేస్తుంది. ప్రస్తుతం 1.43 ఎకరాల్లో ఉన్న అటవీ భూమిలో హడావుడిగా తాత్కాలిక నిర్మాణాలు జరుపుతున్నారు. ఈ భూమి తమదేనని కొందరు దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని సిద్దల రవి అనే వ్యక్తి రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత అనుచరులిద్దరు ఆ 1.43 ఎకరాలు తమదేనని వా దిస్తున్నారు. సర్వేనంబర్ 153/1లో కాదని చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న భూమి సర్వే నంబర్ 708/1, 2, 3, 4లో అని చెప్పారు. నిర్మాణాలు జరుగుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. 153/1లోని విస్తీర్ణాన్ని సబ్ డివిజన్ చేసి చూపుతున్నారని రవి పేర్కొం టున్నారు. 44.95 ఎకరాలు మొత్తం 1943 నుంచి తమ ఆధీనంలో ఉందని చెబుతున్నారు. 1964లో సెటిల్మెంట్ పట్టా ఇచ్చారని రవి వివరించారు. ఇరు వర్గాలు చెబుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చూపుతోం దని, అందులో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్థానికులు చెబుతున్నారు. ♦ రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 359లో సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని టీడీపీ నాయకులు కొందరు కలిసి ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిని ప్లాట్లు వేసి అం కణం రూ.35వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్ర స్తుతం అందులో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తుండటం గమనార్హం. -
ఆక్రమణ పట్టా.. అక్రమాల పుట్ట!
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. టీడీపీ నేతల కన్ను పడితే చాలు..ఆ ప్రాంతంలో బోర్డు పుట్టుకొస్తోంది. ప్రభుత్వ భూమి అయితే.. అధికారికంగా పట్టా సిద్ధమవుతోంది. బినామీ పేర్లతో ప్లాట్లుగా మారిపోతుంది. నాలుగు రాళ్లు మిగిల్చే ఏ స్థలం కూడా ‘పచ్చ’నేతలనుదాటిపోలేని పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా..నీరు– చెట్టు.. ఇదే కోవలో భూ దందా. ‘తమ్ముళ్ల’ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. అసైన్డ్ భూములు లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలు.. ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమిస్తున్నా..అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఉరవకొండలో 500 ఎకరాలకు పైనే.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని కూడేరు, కమ్మూరు, మరుట్ల, గుటుకూరు, జల్లిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకుపైగానే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమయ్యాయి. అధికారపారీక్ట నేతల మాటలు విని వంక స్థలాలు, రాళ్ల గుట్లకు అధికారులు పట్టాలిచ్చారు. చివరికి గ్రామకంఠం భూములనూ వదలలేదు. సర్వే నంబర్లో ఉన్న భూమిని మించి భూములకు పాసుపుస్తకాలు జారీ చేశారు. వీటిని పొందిన వారు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. కొందరైతే గాలిమరలకు లక్షలాది రూపాయలకు భూములను అమ్ముకున్నారు. ఈ కుంభకోణంలో రెవెన్యూ డివిజినల్ కార్యాలయంలోని ఓ కీలక అధికారి రూ.3 కోట్ల మేర ఆదాయం అర్జించారు. ఈరెండు నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో రెండువేల ఎకరాలకుపైగా భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో నాలుగేళ్లలో అన్యాక్రాంతమైన భూమిని లెక్కిస్తే కనీసం 20వేల ఎకరాలకుపైగా ఉంది. అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు ఆ భూములను ఆక్రమించినట్లు తెలుస్తోంది. అనంతపురం సమీపంలోనూ కబ్జాలు అనంతపురం చుట్టపక్కల ఎక్కడ చూసిన సెంటు రూ.6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ లెక్కన ఎకరా కనీసం రూ.60 లక్షల నుంచి రూ. కోటి రూపాయిల వరకూ ఉంటుంది. సోములదొడ్డి సమీపంలో 2013లో పేదలకు పట్టాలిచ్చిన 4.90 ఎకరాల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేశ్... ఏకంగా జెండాలు నాటారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత బీసీ భవన్ నిర్మించేందుకు అప్పటి కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే తిరిగి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు బీసీ భవన్ ప్రతిపాదనను తోసిపుచ్చి తమ అధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం సమీపంలోని భూములు రూ.కోట్ల మేర విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ భూదందాలు సాగుతున్నా...అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. రెవెన్యూ అధికారులతో ముందుగానే సంప్రదింపులు జరిగి... వారికి కొంత ముట్టజెప్పి స్వాహాకు దిగుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు కబ్జాలకు ‘రూట్‌మ్యాప్’ కూడా ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూ పంపిణీ భూములూ స్వాహా 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక భూమిలేని నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. 2004 నుంచి 2014 వరకూ అప్పటి ప్రభుత్వాలు 7 విడతల్లో 79,027 ఎకరాల భూమిని పంపిణీ చేశాయి. పట్టాలు పొందిన వారిలో కొందరు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలిచ్చారు. ఇంకొందరికి పట్టాలిచ్చి భూములు అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పట్టాలను రద్దు చేయించిన టీడీపీ నేతలు తాజాగా తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టారు. శింగనమల, రాప్తాడుల్లో అనంతం అనంతపురం నగరం చుట్టూ బుక్కరాయసముద్రం మినహా తక్కిన ప్రాంతం మొత్తం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా లక్షలాది రూపాయలు పలుకుతున్నాయి. అందువల్లే అధికార పార్టీ నేతలు ఈ పంచాతీల పరిధిలోని వీఆర్ఓలతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ... ఖాళీస్థలాలు తెలుసుకుని వాటిని కబ్జా చేస్తున్నారు. తమ వల్ల కాదనుకుంటే బడానేతలను సంప్రదించి... వారి కనుసన్నల్లో యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన కబ్జాలన్నీ ఈ తరహాలోనే సాగినవే. టీడీపీ అనంతపురం రూరల్ మండల ఇన్చార్జ్గా పరిటాల మహేంద్రను మంత్రి సునీత నియమించారు. ఇక్కడ ఎవరికి పింఛన్ రావాలన్నా, పట్టా కావాలన్నా చివరకు అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహేంద్ర అనుమతి తప్పనిసరి. దీంతో మహేంద్ర నాలుగేళ్లలో వందల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మచ్చునకు కొన్ని.. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి దీనికి నారాలోకేశ్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది. ఆత్మకూరు మండలం. బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఆ గ్రామంలోని దళితులు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. ఈ భూమిని తహసీల్దార్‌కు స్వాధీనం చేసి ఆ స్థలంలో పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీనేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఈ భూమిలో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించి స్థలం కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం సమీపంలోని కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవించేవారు. వారందరికీ పట్టాలిప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత 2014లో మొత్తం ఇళ్లను పోలీసుల అండతో కూల్చేశారు. మంత్రి మురళీ, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో కిందట బాధితులు ఆరోపించారు. ఆలయ భూమిలోనే టీడీపీ కార్యాలయం రాప్తాడులోని ప్రాచీనమైన పండమేటి రాయుడు ఆలయానికి నిన్న, మొన్నటి వరకు వందల ఎకరాల్లో మాన్యం ఉండేది. ఈ భూముల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అప్పటి ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను నిర్మించారు. 44వ జాతీయ రహదారి పక్కనే ఈ ఆలయానికి మరి కొంత భూమి ఉంది. దీనిని దేవాదాయశాఖ అనుమతితో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ (ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రీయల్, ఇన్పాస్ట్రక్చర్ లిమిటెడ్) ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చింది. ఇందుగ్గానూ ఆటోనగర్ అసోసియేషన్ ప్రతి ఏటా ఆలయ కమిటీకి అద్దె చెల్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులోని రెండు ఎకరాల్లో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, టీడీపీ కార్యాలయం, బస్టాప్ వంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు తీసుకొచ్చారు. ఇందులో జాతీయ రహదారికి పక్కనే పది సెంట్ల స్థలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి పరిటాల భవన్ అని పేరు కూడా పెట్టారు. లీజుకు ఇచ్చిన భూమిలో పూర్తి స్థాయి కట్టడాలు నిర్మించరాదన్న నిబంధనలు ఉన్నప్పటికి మంత్రి సునీత అండతో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు. పునాదులు, పిల్లర్లు వేసి భవనాన్ని పూర్తి చేశారు. -
భూ ఆక్రమణకు నిరసనగా ఆత్మహత్యాయత్నం
చంద్రగిరి: తరతరాలుగా వస్తున్న భూమిని ఆక్రమించుకోవడంతో పాటు దళితులపై గ్రామస్తుడు ఎల్లప్ప రెడ్డి దౌర్జన్యానికి యత్నించండంతో పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అధికారులు కూడా దయ చూపకపోవడంతో ఇక చేసేదేమి లేక బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. చంద్రగిరి మండలం అగరాలకు చెందిన పొదిలి చిన్నయ్య అతని తమ్ముళ్లకు అగరాల లెక్క దాఖలా ప్రకారం సర్వే నంబరు 285లో 24 సెంట్ల భూమికి తాత ముత్తాల నుంచి ఉంది. ఇటీవల పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను వారు కోల్పోయారు. బాధితులు వారి సొంత భూమిలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. ఇదే గ్రామంలో అగ్రకులానికి చెందిన తూకాకుల ఎల్లప్ప రెడ్డి బినామీ పేర్లతో నకిలీ పత్రాలను సృష్టించి, వారి భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడు. ఇంటి నిర్మాణానికి వచ్చిన బాధితులను అడ్డుకుని దౌర్జాన్యానికి పాల్పడ్డాడు. పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు.. ఎల్లప్ప రెడ్డి దౌర్జన్యాన్ని తట్టుకోలేక పొదిలి చిన్నయ్య అతని కుటుంబ సభ్యులు 20 రోజుల క్రితం చంద్రగిరి పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎల్లప్ప రెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడితో పాటు దళిత గ్రామస్తులు నిరవధికంగా దీక్షకు దిగారు. కనికరించని అధికారులు.. రెండు రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా అధికారులు దళితులపై కరుణ చూపలేదు. శుక్రవారం రాత్రి బాధితులకు తహసీల్దార్ న్యాయం చేయకపోవడంతో చిన్నయ్య తమ్ముడు కుమారుడు మునిశేఖర్ తహసీల్దార్ కార్యాయంలో ఆయన ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు మునిశేఖర్‌ను అడ్డుకుని, ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. అనంతరం గ్రామస్తులంతా తహసీల్దార్ ఎదుట బైఠాయించారు. జేసీ హామీతో ఆందోళన విరమణ.. ఉన్నతాధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న జేసీ గిరిషా తక్షణమే స్పందించారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేస్తానని ఆయన ఫోన్లో హామీ ఇచ్చారు. జేసీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
యథేచ్ఛగా జిల్లాలో భూ ఆక్రమణలు
పంట చేలపై పడ్డ ఆబోతులా అడ్డూ అదుపూ లేకుండా పచ్చదండు రెచ్చిపోతోంది. అధికారంఅండతో చట్టాలను చట్టుబండలుగా చేసి భూకబ్జాలతో జిల్లావాసులను భయకంపితులను చేస్తోంది. నాలుగేళ్ల తమ అధినేత చంద్రబాబు పాలనా నిర్వాకంతో మళ్లీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని అర్థం కావడంతో తమ్ముళ్లు విచక్షణ కోల్పోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అక్రమార్జనలో వేగాన్ని పెంచేశారు. దొరికింది దొరికినట్టుదోచేస్తున్నారు. అడ్డొచ్చేవాళ్లపై ఎదురుదాడులుచేస్తూ, కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా చెలరేగిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అవి పర్ర భూములా..తీర ప్రాంత భూములా..చెరువులా..గుట్టలా..దేవదాయ భూములా..మఠం భూములా..అసైన్డ్ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడటం లేదు. దొరికితే చాలు చదును చేసేస్తున్నారు. ఆన్లైన్లో రికార్డులు మార్చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించేస్తున్నారు. అడ్డొచ్చినోళ్లపై దౌర్జన్యం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు కబ్జాలకు అండగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల వరకు ఈ విధంగా ఆక్రమించారు. కళ్ల ముందు ఆక్రమణలు కన్పిస్తున్నా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నమో...రాజీ చేయించడమో తప్ప అధికారులు చేసిందేమీ కన్పించడం లేదు. ఆక్రమణలపై కేసులు కూడా నమోదవుతున్నాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మచ్చుకు కొన్ని ఆక్రమణలివీ.. ∙కాకినాడలోని తూరంగి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాలు, కొవ్వూరు రోడ్డులో 1.5 ఎకరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన స్థలమే అంటూ చివరికి ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును కూడా ధ్వంసం చేశారు. ఆయన అనుచరులు అదే తీరులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గతంలో కాకినాడ మెయిన్‌రోడ్డులో గల జగన్నాథపురం వంతెన సమీపంలోని విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రిరాత్రికి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నించడంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లెయిన్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. తునిలో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. నియోజకవర్గ పరిధిలో 84 ఎకరాల వరకు కబ్జా చేసేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు అండ, ప్రోద్బలంతో ఆక్రమణలకు పాల్పడ్డారు. పోలీసు క్వార్టర్స్ భూమిని సైతం ఆక్రమించారు. దీని ఒక్కదాని విలువే రూ.10 కోట్ల వరకు ఉంటుంది. తొండంగిలోని మఠం భూములను సైతం కబ్జా చేశారు. 80 ఎకరాల మేర ఆన్లైన్లో రికార్డులు మార్చేసి పాగా వేశారు. వీటి విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సీఆర్‌జెడ్ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో వందల ఎకరాల పర్రభూమిని అమలాపురం టీడీపీ నేతలు ఆక్రమించేశారు. మడ అడవులను, సహజ సిద్ధంగా ఏర్పడిన భూములను ధ్వంసం చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఆక్వా చెరువుల కోసం కబ్జా చేసి తవ్వేశారు. అమలాపురం మున్సిపాల్టీలోనైతే ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. చెరువులు, డ్రెయిన్ల మురుగునీటి కోసం ఉన్న స్థలాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా బంగారక్క, తామరచెరువు, గరిగుంట చెరువు స్థలాలను ఆక్రమించి, దర్జాగా కట్టడాలు చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని అమీనాబాద్ శివారు ఉప్పుటేరు స్థలాన్ని టీడీపీ నేత బందన రాంబాబు ఆక్రమించారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత ఆక్రమణలు తొలగించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అండదండలతో టీడీపీ నాయకులు భూకబ్జాలు యథేచ్ఛగా చేస్తున్నారు. రమణయ్యపేట, రాయుడుపాలెం, తూరంగి, సర్పవరం, సూర్యారావుపేట, కొవ్వాడ, తిమ్మాపురం, చీడిగ, ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, కొవ్వూరు. కరప తదితర ప్రాంతాల్లో పంచాయతీలకు చెందిన స్థలాలను కబ్జా చేసేసి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. సర్పవరంలో దేవాదాయశాఖకు చెందిన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు. తూరంగిలో ప్రభుత్వ పాఠశాలను ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ∙అధికార పార్టీ నేతల అండతో మండపేట ప్రధాన రహదారిలోని ఏడిద రోడ్డు జంక్షన్ వద్ద కోటి రూపాయల విలువైన భూమి ఆక్రమణకు గురైంది. మండపేటలోని కేశవరంలోని రాతేలుగుంట చెరువును టీడీపీ నేత కబ్జా చేశాడు. 2.38 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో సగానికి పైగా భాగాన్ని చదును చేసి సాగు భూమిగా మార్చేశాడు. పాడే చెరువు గుంట కూడా ఆక్రమణకు గురైంది. స్థానిక టీడీపీ నేత 42 సెంట్లు మేర కబ్జా చేసి స్వరూపాన్ని మార్చేశాడు. ద్వారపూడిలోని సతివాని చెరువులో 1.5 ఎకరాలకు పైగా చెరువు గర్బాన్ని అధికార పార్టీ నేత బంధువు ఆక్రమించి, తన భూముల్లో కలిపేసుకున్నాడు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో టీడీపీ నేత వెలుగుబంటి వెంకటాచలం కంకరగుట్టను, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో బా«ధ్యుడిపై నాలుగు కేసులు పెట్టడమే కాకుండా రూ. 8.61 కోట్లు రికవరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. -
ధీరుడు కటకటాల్లో.. మూకలు జనావాసాల్లో!
తల్లిదండ్రులు.. భార్యాపిల్లల మంచీచెడును దగ్గరుండి చూసుకునే అవకాశం లేకపోయినా.. దేశ ప్రజలే కుటుంబంగా భావించే ధీరులకు కనీస రక్షణ కరువైంది. వీర మరణంతో సొంతూళ్లకు చేరుకునే పార్థివ దేహాలకు సెల్యూట్ చేస్తున్న చేతులు.. ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచి సొంత సమస్యలపై అధికారుల ఎదుట నిలుచుంటే చేయూతనివ్వని దయనీయం. సార్.. నా భూమి ఆక్రమణలో ఉందని పోలీసుల కాళ్లావేళ్లా పడితే.. తుపాకీ చూపించావంటూ బీఎస్ఎఫ్ జవాను నాగరాజును రెండు రోజుల క్రితం కటకటాల్లోకి నెట్టేశారు. అదే జవానుపై దాడికి దిగిన వ్యక్తులు రాజకీయ, పోలీసు అండదండలతో దర్జాగా బయట తిరుగుతున్నారు. ‘సాక్షి’ కథనం కదిలించినా.. ఆ జవాను బెయిలుపై తిరిగొచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడు కేసు కడతామన్న సాటి ఖాకీల కఠిన హృదయానికి సభ్య సమాజం జోహార్లు అర్పిస్తోంది. ఎముకలు కొరికే చలి.. జోరువాన..ఠారెత్తించే ఎండ.. ఏదైనా భరిస్తారు.కుటుంబం..పిల్లలు..బంధువులు..దేన్నైనా త్యజిస్తారు.సరిహద్దును రక్షిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటారు.దేశంకోసం ప్రాణాన్నే ఫణంగా పెడతారు.కొందరు అమరులవుతారు..మరికొందరు మాజీ సైనికులవుతారు..కానీ.. ఇంటికొచ్చిన ఆ వీరులను ఈ సమాజం దగాచేస్తోంది. పదవీ విరమణ పొందాక ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు, నేతలు అక్రమాలకే అండగా నిలుస్తున్నారు. అందుకే సరిహద్దులో శిఖరంగా కనిపించిన సైనికుడు.. సమాజంలోనిశ్చేష్టునిగా మారిపోతున్నాడు. కనిపించిన వారినంతా న్యాయం కోసం వేడుకుంటున్నాడు. ప్రతి కార్గిల్ విజయ్ దివస్ రోజూ మాజీ సైనికులకు దండంపెట్టే వ్యక్తులే.. ఆ తర్వాత వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా మాజీ సైనికులు ఎదుర్కొంటున్నభూ సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అనంతపురం సెంట్రల్: దేశ రక్షణకోసం సైనికులుగా వెళ్లిన వారంతా దాదాపు 20 సంవత్సరాలకు పైగా సరిహద్దులో..లేక మరో ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కుటుంబానికి, ఈ ప్రాంతానికి దూరంగా బతుకుతారు. తిరిగి ఈ ప్రాంతానికి వచ్చినప్పడు అంతా కొత్తగా ఉంటుంది. పట్టణ రూపురేఖలన్నీ మారిపోయి ఉంటాయి. ఇదే అదునుగా కొంతమంది... మాజీ సైనికులను సైతం బెదిరించి భూములను కబ్జా చేస్తున్నారు. అందువల్లే అనేక మంది సైనికులకు ప్రభుత్వం భూములు కేటాయించినప్పటికీ అనుభవంలోకి వెళ్లలేకపోతున్నారు. పేరుకు ప్రభుత్వం మంజూరు చేశామని చెప్పినప్పటికీ ఆచరణలో వారికి స్వాధీనం చేయించలేకపోతుండడం అధికారుల అసమర్థతకు నిదర్శనంగా మారతోంది. సైనికుల భూమిని ఆక్రమించినఓ ప్రజాప్రతినిధిరాజకీయాల్లో పెద్దమనిషిగా చెప్పుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి ఏకంగా ముగ్గురు మాజీ సైనికుల భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నీతి, న్యాయమంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ నిత్యం నిలిచే సదరు నేత.. నియోజకవర్గ అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు. అందువల్లే దేశం కోసం శత్రువలతో పోరాడిన మాజీ సైనికులు కూడా ఆయన ముందు నోరుమెదపలేకపోతున్నారు. జూలై 26 1999. పాక్ దుశ్చర్యను తిప్పికొడుతూ దేశజవానులు వీరోచిత పోరాటం చేశారు. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. ఈ పోరాటంలో ఎంతోమంది వీరమరణం పొందారు. సైనికుల సేవలను కొనియాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటాం. సైనికుల సేవలను మరోసారి స్మరించుకుంటాం. అయితే దేశం కోసమే శక్తినంతా ధారపోసి..పదవీ విరమణ పొందాక స్వగ్రామం చేరుకునే మాజీ సైనికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చిన భూములను, సొంత స్థలాలను కబ్జాలకు పాల్పడుతూ అవమానాలకు గురి చేస్తున్నారు. రెండురోజుల క్రితం నగరంలో బీఎస్ఎఫ్ జవాను నాగరాజుకు ఇదే అన్యాయం జరిగింది. భూ సమస్యలో ఇరుక్కోవడంతో పోలీసులు అతనికి ‘‘రిమాండ్ ఖైదీ’’ అనే బహుమానాన్ని అందించారు. అమలుకాని కలెక్టర్ నిర్ణయాలు 2017 ఫిబ్రవరి 19న పీటీసీలో సైనిక సమ్మేళనం నిర్వహించగా.. రాయలసీమ జిల్లాలకు చెందిన వేలాది మంది మాజీ, ప్రస్తుత సైనికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారందరీ సమక్షంలో అప్పటి కలెక్టర్ శశిధర్.. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి నెలలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చకముందే ఆయన బదిలీ కావడంతో మాజీ సైనికుల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. కొన్ని సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన సైనికులు తమ సమస్యలను పరిష్కరించుకోలేక ప్రభు త్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయండి మా ఆయన 20 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. అందుకు గుర్తింపుగా ప్రభుత్వం రేగాటపల్లిలో సర్వే నంబర్ 381.2లో 4.90 ఎకరాలను మంజూరు చేసింది. భూమి సాగులో ఉన్నప్పటికీ అదే గ్రామానికి చెందిన కొంతమంది... రెవెన్యూ అధికారుల సహకారంతో అడంగల్‌లో పేర్లు మార్పు చేయించుకున్నారు. ఈ విషయంలో తెలిసి అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి మరెక్కడా లేదు. – మాజీ సుబేదార్ ఆంజనేయులు భార్య శాంతకుమారి, రేగాటపల్లి, ధర్మవరం కనీస గౌరవమివ్వరు భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళితే కనీస గౌరవం లేకుండా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద మెకానిజం అవసరం లేదు. మమ్మల్ని సైనికులుగా గుర్తించి గౌరవ మర్యాదలతో మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. చాలా మంది అధికారులు రాజకీయ నాయకులకే వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా సమస్యలు బయటకు చెప్పుకోలేక పోతున్నాం. దేశం కోసం పనిచేశామనే సంతృప్తి తప్ప..మాకు ఏం మిగలడం లేదు. – కెప్టెన్ షేకన్న, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు -
ఆక్రమణల దందా!
నెల్లూరు(వేదాయపాళెం): నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్ వైఎస్సార్ నగర్లో అధికారపార్టీ నాయకులు, వారి అనుచరులు ఇళ్ల పేరిట భారీ వసూళ్ల దందాకు తెరలేపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే తపన కలిగిన నిరుపేదలు నాయకుల మాటలు నమ్మి దగా పడుతున్నారు. అతి తక్కువ ధరకే ఇక్కడ ఖాళీగా ఉన్న గృహాలను ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో పలు ప్రాంతాల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పోటాపోటీగా డ బ్బులు కడుతున్నారు. ఈ విషయంలో స్థానిక అధి కారపార్టీ చోటానేతలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 300 గృహాల స్థలాలకు గాను సు మారు రూ.6 కోట్ల మార్కెట్ విలువ ఉంది. కాగా అధికార పార్టీ నాయకులు కారుచౌకగా ఒక్కో ప్లా టు(9 అంకణాలు)ను రూ.20 వేల నుంచి రూ.50 వేలకు బేరం పెడుతున్నారు. యథేచ్ఛగా బేరసారాలు జరుగుతున్నప్పటికీ ఆ శాఖ అధి కారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారుల అలసత్వం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో కొత్తూరు వద్ద 2007లో వైఎస్ఆర్ నగర్‌ను ఏర్పాటు చేశారు. 6,734 గృహాలను విడతల వారీగా నిర్మించేందుకు కార్యాచరణ రూపొం దిం చారు. మహానేత మరణం తరువాత అప్పటి కాం గ్రెస్ పాలకులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లు అవినీతికి తెరలేపి ఇష్టారాజ్యంగా నిర్మాణాలను కొనసాగించారు. దీంతో నిర్మాణాలు పూర్తి నాసిరకంగా జరిగాయి. నిర్మాణాలు పూర్తయిన తర్వాత లబ్ధిదారులు గృహాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇళ్లన్నీ నిరుపయోగంగా మారాయి. కొద్దికాలం తరువాత ఇళ్లు కూలేందుకు సిద్ధమయ్యాయి. రెండు బ్లాకుల్లో రెండు సార్లు మూడిళ్లు కుప్పకూలాయి. బాధ్యులపై చర్యలు శూన్యం నాసిరకం నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిగినప్పటికీ అధికారులు కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటివరకూ దుర్వినియోగమైన నిధులను వారి వద్ద నుంచి రికవరీ చేయలేకపోయారు. కులేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను తొలగించాలని విచారణ నివేదికలో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు తొలగించిన దాఖలాలు కూడా లేవు. నెరవేరని మంత్రి హామీ వైఎస్సార్ నగర్లో లబ్ధిదారులంతా నివాసం ఉండాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆ ఇళ్లలో చేరకుంటే ఇళ్లను రద్దు చేస్తామని హౌసింగ్ అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక 2 వేల గృహాల లబ్ధిదారులు ఇళ్లలో చేరారు. వీరికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. లబ్ధిదారుల గృహాల్లో కబ్జాదారుల పాగా లబ్ధిదారులకు కేటాయించిన 400 నుంచి 500 గృహాలు కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయి. ఆక్రమణ చెరలో నుంచి తమ ఇళ్లను కాపాడాలని పలువురు బాధితులు ఆ శాఖ అధికారులకు, కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించుకున్నారు. కాగా తాజాగా జియోట్యాగ్ కాని 300 గృహాలు ఖాళీగా ఉండడంతో వీటిపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. బినామీ పేర్లతో తమ అనుచరులకు కొన్ని, బయట వ్యక్తులకు కొన్ని విక్రయాలు సాగించేలా వ్యూహం పన్నారు. ఈ గృహాలన్నీ దాదాపు లెంటల్ లెవల్లో ఉన్నాయి. అంతా మాఇష్టం టీడీపీ నాయకుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణ తమకు అండగా ఉన్నారంటూ తాము చెప్పిన వారికే స్థలాలు ఖరారవుతాయంటూ స్థాని క కార్పొరేటర్ భర్త, అతని అనుచరులు ఇష్టారాజ్యంగా ఇళ్ల కేటాయింపుల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.2 లక్షల విలువైన ప్లా టును రూ.50 వేలకు అప్పజెబుతున్నారు. వీరు అప్పజెప్పిన గృహాలను, ఖాళీ స్థలాలను కొనుగో లు చేసిన వారు తాత్కాలిక పనులు చేసుకుంటూ రేకు తలుపులను బిగించుకుంటున్నారు. అలాగే హరనాథపురం ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డి అనే చోటా నాయకుడు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు బేరంపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జియోట్యాగ్ కానివి 154, గృహాల్లో చేరనివి 200 వరకూ కబ్జాదారుల ఆక్రమణల్లో ఉన్నాయి. విద్యుత్ మీటర్లకు హౌసింగ్ ఏఈ అనుమతులు ఒకసారి లబ్ధిదారులకు కేటాయించిన గృహాలను రద్దు చేయాలంటే హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు తప్పనిసరి. ఈక్రమంలో గృహాలు రద్దు కాకుండానే అధికారపార్టీ నాయకులు సూచించిన వారికి స్థానిక హౌసింగ్ ఏఈ ప్రలోబాలకు గురై సిఫార్సులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకూ అధిక సంఖ్యలో విద్యుత్ మీటర్లు పొందనట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి. -
ఆత్మహత్య చేసుకుంటా...
మంగళగిరిటౌన్: అక్రమ కట్టడాలను తొలగించడానికి వెళ్లిన అధికారులను ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను చేపట్టిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడిన సంఘటన మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళగిరి మండలం రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తరువాత ఇక్కడ భూములకు రెక్కలు వచ్చి కోట్లలో రేట్లు పలుకుతుండడంతో భూ మాఫియాగాళ్లు రెచ్చిపోయి, ఖాళీ స్థలం కనబడితే అక్కడ పాగా వెయ్యడం, అనంతరం చేయి మార్పిడి ద్వారా డబ్బులు చేసుకోవడం షరా మామూలైపోయింది. అక్రమార్కులకు ఈ ప్రాంతం స్వర్గథామంగా మారింది. తాజాగా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని డాన్‌బాస్కో పాఠశాల ఎదురుగా మంగళగిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన ప్రభుత్వ రోడ్లు, భవనాల స్థలంలో విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన దళారులు, స్థానిక పచ్చనేతల అండదండలతో ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించి, ఫ్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా... డిలైట్ దాభా ఎదురు స్థలంలో ఇళ్లను, వ్యాపార దుకాణాలను అక్రమంగా నిర్మించారు. ఈ నిర్మాణాలు ప్రస్తుతం కూడా కొనసాగుతుండడంతో బుధవారం జిల్లా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చేందుకు పూనుకున్నారు. అధికారులకు షాక్... డిలైట్ దాభా ఎదురుగా ఆర్ అండ్ బీ స్థలంలో స్వర్ణ ఫంక్షన్ హాల్ నిర్మించిన వాసు అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ కూల్చివేస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఇక్కడికి వచ్చిన అధికారుల పేర్లన్నీ కాగితం మీద రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఫంక్షన్ హాల్ పైకి ఎక్కి అధికారులతో బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా కులం పేరుతో బెజవాడ మనుషుల చేత అడ్డొచ్చిన అధికారులను హత్య చేయిస్తాననడంతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. అడుగడుగునా అడ్డంకులు... అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి కదిలివచ్చిన జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు వారి పనిని వారు చేయనివ్వకుండా కట్టడాలను కూల్చడానికి వీలులేదని అధికారపార్టీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డారు. అధికారులు ఏం చేయాలో అర్ధం కాక గురువారం నాటికి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వెనుదిరిగారు. పోలీసులను అశ్రయించిన అధికారులు అక్రమంగా నిర్మించుకున్నదే కాక అడిగినందుకు వచ్చిన అధికారులను చంపుతామని బెదిరించడంతో చేసేది లేక జిల్లా అధికారులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుఆశ్రయించారు. ఆర్అండ్బీ ఏఈ మధు జరిగిన సంఘటనను వివరిస్తూ ఫిర్యాదు చేశారు. గురువారం విధులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని చర్యలు తీసుకోవాల్సిందిగా మంగళగిరి రూరల్ ఎస్ఐ వినోద్ ను కోరారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ వినోద్ తెలిపారు. నేడు ఆక్రమణలు తొలగిస్తారా..? ఆర్ అండ్ బీ అధికారులు గురువారం ఆక్రమణలను తొలగిస్తారో...లేక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతారో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఇదెక్కడి న్యాయం
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్‌బోర్డులో కంచె చేనుమేస్తోంది. వందల కోట్ల విలువైన దేవుడి (వక్ఫ్) భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లీజుల పేరుతో స్థలాలను కాజేస్తున్నారు. దర్గా, స్మశాన వాటిక స్థలాలను సైతం వదలడం లేదు. బాహాటంగా ఆక్రమణల పర్వం కొనసాగుతున్న వక్ఫ్‌బోర్డు పాలక మండలి కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తుదని విమర్శలు వినవస్తున్నాయి. వాస్తవం గా వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకా రం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమ్తింత తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, స్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసే వారు. ఈ లాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. దర్గాకు సంబంధించిన భూములపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిసినా... కేవలం మూడు నివాసాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం వక్ఫ్‌బోర్డు ద్వంద నీతికి అద్దంపడుతోంది. ఇదీ కథ.. సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గాకు సర్వే నెంబర్ 255/1, 255/2, 255/3, 255/4, 255/5, 255/6 లో సుమారు 28 ఎకరాల 29 గంటల భూమి ముంతఖబైæ ఉంది. అందులో 11.21 ఎకరాల భూమి సమీపంలోని హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గాకు చెందుతుంది. నిజాం ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వద్ద నవాబ్ జీవన్ యార్ జంగ్, అబ్బాస్ అలీ, ఇబ్రాహీం అలీ ఖాన్ అనే వ్యక్తులు సదరు భూమిని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నవాబ్ జీవన్ యార్ జంగ్ హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను పర్యవేక్షించేవారు. 1958లో అతను మృతి చెందగా, 1968 ఆయన ఇద్దరు భార్యల పిల్లలు ఆస్తుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో దర్గా భూములను సైతం స్వంత ఆస్తులుగా పరిగణించడంతో ఆరు ఎకరాల భూమి దక్కింది. దీంతో ఆ రెండు కుటుంబాలు కోర్టు తీర్పు ఆధారంగా నూరుల్Š అలీ రుపాణీ, మరో ఇద్దరికి భూములు విక్రయించి పాకిస్తాన్ వెళ్లిపోయారు. భూమిని కొనుగోలు చేసిన నూరుల్ అలీ రుపాణీ జీవన్ యార్జంగ్ కాలనీ పేరుతో బిల్డర్ ద్వారా సుమారు 180 నుంచి 200 వరకు ప్లాట్లు చేసి విక్రయించారు. 1978 నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో నిర్మాణాలు జరగడంతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టడాలకు 852 నుంచి 866/జీ వరకు ఇంటి నెంబర్లు కేటాయించింది. జీవన్యార్జంగ్ కాలనీలోనే ఉంటున్న అల్వీ కుటుంబం హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను చూసేది. ఇదిలా ఉండగా 2009లో వక్ఫ్‌బోర్డు దర్గాకు ముతవల్లీని నియమించగా, సదరు ముతవల్లీ దర్గాకు మిగిలిన ఉన్న భూమి, స్మశాన వాటిక వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడంతో అల్వీ కుటుంబం అడ్డుకుంది. దీనిపై వక్ఫ్‌బోర్డుకు ఫిర్యాదు చేయడంతో దర్గా భూములపై సర్వే నిర్వహించారు. 2010, 2014, 2016లో మూడుసార్లు సర్వే నిర్వహించిన అధికారులు జీవన్ యార్ జంగ్ కాలనీలో సుమారు 11.21 ఎకరాల దర్గా భూమి అన్యాక్రాంతమై కట్టడాలు వెలిసినట్లు నివేదిక అందజేశారు. మూడు ఇళ్లకు నోటీసులు జీవన్ యార్ జంగ్ కాలనీలోని 11.21 ఎకరాల భూమి లో ఇంటి నెంబర్ 16–2–853 నుంచి 16–2–866.జీ వరకు సుమారు 180 నుంచి 200 వరకు గృహాలు ఉన్నాయి. వక్ఫ్ సర్వేలో సైతం మొత్తం కట్టడాలు వక్ఫ్ భూమిలోనే ఉన్నట్లు వెల్లడైనా కేవలం మూడు గృహాలకు మాత్రమే వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. అల్వీ కుటుంబానికి సంబంధించి మహ్మద్ ముస్తాఫాకు చెందిన ఇంటి నెంబర్ 16–2–866/ఎఫ్ (186 చదరపుగజం), మరో ఇంటి నెంబర్ 16–2–866/1( 152 చదరపు గజం), ఆయన సోదరుడు మహ్మద్ ముజ్తఫాకు చెందిన ఇంటినెంబర్ 16–2–886/ఎఫ్/5(200 చదరపు గజం)లకు నోటీసులు అందజేయడమేగాక సదరు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు జిల్లా రిజిస్టార్కు మూడు ఇళ్ల దస్తావేజులను నిషేధిత జాబితాలో చేరుస్తూ వక్ఫ్‌బోర్డు సీఈవో లేఖ రాశారు. కాగా, వక్ఫ్‌భూమిగా గుర్తించిన స్థలాల్లో పెద్ద ఎత్తున కట్టడాలు ఉన్నా కేవలం ఒకే కుటుంబానికి చెందిన మూడు కట్టడాలకే నోటీసులు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై సదరు అల్వీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, కేంద్ర వక్ఫ్‌బోర్డుకు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కక్ష సాధిస్తున్నారు కక్షసాధింపు చర్యగా టార్గెట్ చేశారు. చట్టబద్దంగా నూరుల్ అలీ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. 1984లో రిజిస్ట్రేషన్ జరిగింది. లింక్ దస్తావేజులు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు ఆధారంగా యార్ జంగ్ కుటుంబం నూరుల్ అలీ, ఖాజా మొయినోద్దీక్లకు విక్రయించారు. ఖాజామొయినొద్దీన్ నుంచి నూరుల్ అలీ కొనుగోలు చేయగా, ఆయన నుంచి మేము కొనుగోలు చేశాం, పక్క ఇంటి నంబర్లను వదలి మా కుటుంబానికి చెందిన మూడు ఇళ్లకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. నిజంగా వక్ఫ్ బోర్డు స్థలం అయితే అన్ని గృహాలకు వర్తించాలి. – మహ్మద్ ముస్తాఫా అలీ, జీవన్ యార్ జంగ్ కాలనీ, సైదాబాద్ -
అంబాపురంలో మరో భూదందా
స్థలం వారిదే.. కానీ, వారి ఆధీనంలో లేదుకోర్టు తీర్పు వారికి అనుకూలంగానే వచ్చింది.. కానీ, పోలీసులు అమలు చేయరుఎందుకంటే.. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంఅక్కడ వివాదాస్పద ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంఆ వర్గం అడుగుపెట్టిన భూమి వారిదే..రాజధానిని దందాలతో హడలెత్తిస్తున్న ఆ ప్రజాప్రతినిధి మరోభూబాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ అంబాపురం సుందరయ్యనగర్‌లో దాదాపు రూ.2కోట్ల విలువైన స్థలాన్ని వారు గుప్పెటపట్టారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థ స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్నేశారు. దాదాపు 20 సెంట్లు ఉన్న ఆ స్థలం మార్కెట్ ధర దాదాపు రూ.2 కోట్లు. ఖాళీగా ఉన్న ఆ భూమిలోకి ఆ ప్రజాప్రతినిధి వర్గీయులు కొన్ని నెలల క్రితం ప్రవేశించి తాత్కాలిక ప్రహరీ నిర్మించారు. ఆ విషయం తెలిసి స్థల యజమానులు ప్రశ్నిస్తే బెదిరించి పంపేశారు. తప్పుడు పత్రాలు చూపిస్తూ ఆ భూమిని మరొకరి నుంచి తాము కొన్నామన్నారు. స్థల యజమానులు తమ వద్ద ఉన్న అసలైన పత్రాలను చూపించినా ససేమిరా అన్నారు. కోర్టు ఆదేశించినా.. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2017, నవంబరులో యజమానులకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీ పట్టుకుని భూమి వద్దకు వెళ్తే మళ్లీ ప్రజాప్రతినిధి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో స్థల యజమానులు పోలీసుల వద్దకు వెళ్లారు. తమ స్థలాన్ని తమకు అప్పగించేలా చూడాలని కోరారు. స్టేషన్ ఆఫీసర్ స్థాయి పోలీసు అధికారి కోర్టు తీర్పు పట్ల సానుకూలంగా స్పందించారు. కానీ, ఆయన కంటే ఓ మెట్టుపై ఉన్న ఓ మధ్యస్థాయి అధికారి మాత్రం ససేమిరా అన్నారు. ప్రజాప్రతినిధి వర్గీయులకు అండగా నిలుస్తూ స్థల యజమానులను బెదిరించారు. ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఆ స్థలాన్ని వదులుకోవాలని సూచించారు. అందుకు వారు సమ్మతించలేదు. సివిల్ కేసులో కోర్టు తీర్పును అమలుచేయాలి కదా.. అని పోలీసులను కోరారు. దీంతో ఆ పోలీస్ అధికారి తీవ్రంగా స్పందిస్తూ.. ‘నా మాట విని ఆ స్థలం మీద ఆశ వదులుకో. లేకపోతే ఈ సివిల్ కేసు కాస్తా క్రిమినల్ కేసుగా మారుతుంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో బాధితులు బిత్తరపోయారు. ఆ పోలీసు అధికారి.. అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. విగ్రహాల మాటున దందా స్థల యజమానులు తమ భూమిలోకి వెళ్లేందుకు పోలీస్ రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇంతలో ప్రజాప్రతినిధి వర్గం ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో స్థల యజమానులు ‘ఆ స్థలం న్యాయస్థానం పరిధిలో ఉంది’ అనే బోర్డును ఏర్పాటుచేశారు. కానీ, ప్రజాప్రతినిధి వర్గం ఆ బోర్డును తొలగించేసింది. కోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వస్తుందని ప్రజాప్రతినిధి వర్గం భావించింది. దీంతో అక్కడ వినాయక విగ్రహాలను పెట్టింది. ఆ స్థలాన్ని అసలు యజమానులకు అప్పగించేలా పోలీస్ రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశిస్తే.. అక్కడ విగ్రహాలను తొలగించాలి. అలా జరిగితే విగ్రహాలను తొలగిస్తున్నారంటూ కొత్త వివాదం సృష్టించాలన్నది పన్నాగం. రాజధానిలో ఆ టీడీపీ ప్రజాప్రతినిధి దందాల్లో ఇదో సరికొత్త కోణం. అందుకు పోలీస్ అధికారి అండగా నిలుస్తుండటంతో బాధితుల గోడు వినే నాథుడే లేకుండాపోయాడు. -
ఆక్రమించుకో..అద్దె వసూలు చేసుకో!
ప్రకాశం, మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. యథేచ్ఛగా స్థలంలో బంకులు పెట్టి దర్జాగా అద్దెలు వసూలు చేస్తున్నారు. 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి మున్సిపాలిటీకి ఆక్రమిత పన్ను రూపంలో కేవలం రూ.2 వేలు వసూలు చేస్తుండగా అద్దె రూపంలో షాపు యజమాని నుంచి ఆక్రమితదారులు రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో మున్సిపల్ స్థలాలకు సంబంధించి కంభం రోడ్డులోని ఆర్అండ్బీ రహదారిపై, గాంధీ పార్కు చుట్టూ కొన్ని బంకులు, పాత బస్టాండ్‌లో మరికొన్ని బంకులు కలిపి సుమారు 100కు పైగా ఉన్నాయి. ఈ స్థలాలను గతంలో పలువురు ఆక్రమించి అద్దెకు ఇచ్చారు. ఇందులో కిళ్లీ బంకులతో పాటు చికెన్ బండ్లు, టీ బంకులు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారులకు సంవత్సరానికి స్థల ప్రాధాన్యతను బట్టి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు అద్దె రూపంలో వస్తోంది. మున్సిపల్ అధికారులు 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి రూ.2 వేలు, 12 నుంచి 13 మీటర్లు ఉంటే రూ.5 వేలు, ఆ తరువాత స్థలంలో ఆక్రమణలు ఉంటే రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోరు ఉన్న వాడిదే ఆదాయం వచ్చే మార్గంగా మున్సిపల్ స్థలాలు ఉపయోగపడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఆక్రమిత స్థలాల జోలికి పోకుండా ఆక్రమణ పన్ను వసూలు చేయటంలోనే శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా కంభం సెంటర్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సుమారు 70కి పైగా బంకులు ఉన్నాయి. ఈ స్థలాల యజమానులు గతంలో ఆక్రమించుకుని ఆ స్థలాన్ని నెలకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు అద్దెలకు ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే స్థలాన్ని రూ.70 వేల నుంచి లక్ష వరకు విక్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని దరా>్జగా కబ్జా చేసి అద్దె వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీ స్థలం కనిపిస్తే బంకు వేసుకోవటం, అద్దెకు ఇచ్చుకోవటం మున్సిపాలిటీలో పరిపాటిగా మారింది. పరోక్షంగా పాలకులు కూడా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేలకు పైగా ఆటోలు, 5 వేల ద్విచక్ర వాహనాలు, 100 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇదే పరిస్థితి నెహ్రూ బజార్, కళాశాల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉంది. మున్సిపల్, ఆర్అండ్బీ సంయుక్తంగా ఆక్రమణలు తొలగించినట్లయితే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. మున్సిపల్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తాం మున్సిపల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను త్వరలో తొలగిస్తాం. అయితే, ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణలను ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. కంభం రోడ్డు, తర్లుపాడు రోడ్డు, కళాశాల రోడ్డుల్లో ఉన్న ఆక్రమణలు సర్వే చేసి ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. మేము వసూలు చేసే పన్ను తాత్కాలిక ఆక్రమణ పన్ను మాత్రమే. – షేక్ ఫజులుల్లా, కమిషనర్, మార్కాపురం -
‘బొండా’గిరికి ప్రభుత్వ దన్ను
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూబాగోతానికి ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ఆయన భూ బండారం బట్టబయలైనా చర్యల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి కేసును నీరుగార్చాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొండా ఉమా రూ.50 కోట్ల భూబాగోతం కేసులో ఏ–1గా ఉన్న అబ్దుల్ మస్తాన్, ఏ–2గా ఉన్న రామిరెడ్డి కోటేశ్వరరావు అందులో తమ ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ 5.16 ఎకరాలను తాము కొనలేదని, అలాంటప్పుడు దాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు ఇతరులకు విక్రయించే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. సీఐడీ, రెవెన్యూ, రిజిస్ట్రార్ అధికారుల విచారణలో ఈ విషయాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం అబ్దుల్ మస్తాన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆయన మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోజు కూలీ చేసుకునే తమకు కోట్ల విలువైన భూమి కొనే స్తోమత ఎక్కడిదని వారు సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అయినా ప్రభుత్వం దన్ను... ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూదందాకు పాల్పడినట్లు స్పష్టం అవుతున్నా ప్రభుత్వం మాత్రం మౌనం వీడడంలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వ ముఖ్యనేతతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలుస్తోంది. అందుకే ఆ భూమిని ఎమ్మెల్యే బొండా కుటుంబం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకోవడమే లేదు. నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ నిర్మించిన షెడ్డూ, ప్రహరీని కూల్చివేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకునే ఉద్దేశమే లేనట్లు వ్యవహరిస్తుండటం సందేహాలకు కలిగిస్తోంది. జీపీఏ చేసుకోవడానికి రద్దుకు మధ్యలో ఆ భూమిపై ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం పలు క్రయవిక్రయాలు నిర్వహించింది. అవన్నీ కూడా అధికారికంగా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీ, రెవెన్యూ అధికారులు నెమ్మదించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు మౌనం తరువాత కేసును నీరుగార్చాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. ముఖ్యనేతతో సంప్రదింపుల తరువాత బొండా వర్గం ఎదురుదాడికి దిగడం గమనార్హం. సూర్యనారాయణ కుటుంసభ్యులపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. వారు చూపించిన పత్రాలు నకిలీవని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను సామ, దాన, భేద, దండోపాయాలతో తమదారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అండతోనే భూ కబ్జాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ అండతోనే... రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలను బొండా ఉమామహేశ్వరరావు తన కనుసన్నల్లో పెట్టుకొని కబ్జాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆరోపించారు. బీసెంట్ రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొండా నడవడిక విజయవాడ చరిత్రకు మాయనిమచ్చగా నిలిచిందన్నారు. బొండా ఉమాపై మూడు నెలల కిందట సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. బొండా ఉమా దందాలలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శార్వాణి మూర్తి, వెన్నం రత్నారావు, బీసీ సెల్ నేత బంకా భాస్కర్, లీగల్ సెల్ నగర అధ్యక్షుడు టి.సుబ్బారావు, నగర అధికార ప్రతినిధులు కొండలరావు, మారుతి మహావిష్ణు పాల్గొన్నారు. -
ఈ భూమాయకు ఫ్లాట్ అవ్వాల్సిందే
అధికార పక్ష నాయకుడొకరు ప్రభుత్వ భూమిని కాజేశారు. నిబంధనలు పక్కన బెట్టి అధికారులూ సహకరించారు. విలువైన భూమి సదరు నాయకుడికిప్పుడు కాసులు కురిపిస్తోంది. మండల కేంద్రానికి సమీప భూమి సర్కారు విక్రయించకూడదు. ఈ నిబంధన ఉల్లంగించడమే కాదు.. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోడానికి వడివడిగా పచ్చ జెండా ఊపేయడం అక్రమ భూ బాగోతానికి దర్పణం పడుతోంది. చిత్తూరు, సాక్షి: శ్రీరంగరాజపురం మండలంలో విస్తుగొలిపే భూ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వ్యవసాయానికి అనుకూలమైన భూమిని గుర్తించడం.. ప్రభుత్వ ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు.. నకిలీ ఛలానాలు సమర్పించడం.. వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు వేసి అమ్ముకోవడం.. ఇదీ దోపిడీ వరస. దీనికి సూత్రధారి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు భాస్కర్ నాయుడు. ఎస్సార్ పురం గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో 28వ సర్వే నెంబర్ 17.36లో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మండల కేంద్రంలోని విలువైన భూమి కావాలంటూ 2010లో భాస్కర్ నాయుడు మరో నలుగురు కలిసి దరఖాస్తు చేసుకున్నారు. 2013లో రూ.17.36 లక్షలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో భాస్కర్ నాయుడు మిగతా ముగ్గురినీ కాదని భార్య, అక్క కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధం.. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి ఉంటే ప్రై వేటు వ్యక్తులకు ఇవ్వకూడదని 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. భాస్కర్ నాయుడుకు కట్టబెట్టిన భూమి మండల కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉంది. అప్పటి కలెక్టర్లు వీ. శేషాద్రి, సాల్మాన్ ఆరోఖ్యరాజ్ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. రాంగోపాల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో వీరికి భూమి కట్టబెట్టారు. 2014లో టీడీపీ అధికార పీఠం ఎక్కడంతో చాలా సులువుగా వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తప్పుడు ఛలానా నెంబరు తప్పుడు ఛలానాలతో.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి రూ.2,42,750 లక్షలు 2014 డిసెంబర్లో ప్రభుత్వ ఖజనాకు జమ చేశామని చెప్పడంతో అప్పటి ఆర్డీవో పెంచల కిశోర్ భూ మార్పిడికి అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఈ సొమ్ము చెల్లించలేదని సాక్షి పరిశీలనలో బయటపడింది. భాస్కర్ నాయుడు చెల్లించినట్లు చెబుతున్న ఛలానా నెంబరు 2014 జూలై 23వ తేదీది. ఆర్డీఓ ఉత్తర్వులో 2014 డిసెంబర్ 26న చెల్లించినట్లు చెప్పుకున్నారు. ఆ ఛలానా నెంబరుపై రూ.2 లక్షలు వేరే వ్యక్తి చెల్లించనట్టుగా ఖజానా శాఖ పరిశీలనలో తెలిసింది. వ్యవసాయేతర భూమిగా మార్పి డికి సీసీఎల్ఏ అనుమతి కావాలని నిబంధన ఉంది. దీన్ని తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు. 2015లో 28–2ఏ,3ఏ సర్వే నెంబర్లలోని 8.71 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకున్నారు. ప్లాట్లు వేశారు.. కోట్లు కొల్లగొట్టారు.. చిత్తూరుకు ఎస్సార్ పురం సమీపంలో ఉండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయేతర భూమిగా అనుమతి వచ్చిన తరువాత 8.71 ఎకరాల ను 200 ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. గజం రూ.4500 నుంచి రూ.4700 వరకు అమ్ముకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోం ది. ఇందులో అడుగడుగునా అధికారుల ప్ర మేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నా యి. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను అమ్మకూడదని నిబంధనలున్నా దీన్ని బేఖాతరు చేస్తూ భూములు కట్టబెట్టడంలో అధికారులే కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే సీసీఎల్ఏ అనుమతి ఉండాలి. అదేంలేకుండా అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అతిక్రమించలేదు.. నిబంధనలు అతిక్రమించలేదు. రూల్స్ ప్రకారమే భూమిని తీసుకున్నాను. డబ్బు కట్టలేదనడం అబద్ధం. ఛలానా తీసుకున్న తరువాతే భూమార్పిడి చేశారు. ఛలానా నెంబరు తప్పుకాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. – భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్సార్‌పురం -
భూకబ్జాల అనకొండబాబు
సాక్షి, కాకినాడ :అవి పేదల భూములా, ప్రభుత్వ భూములా..అనే తేడా లేదు- కన్నుపడితే అన‘కొండ’లా దిగమింగాల్సిందే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేయాల్సిందే. బ్లాక్‌మెయిలింగ్‌లు, సెటిల్మెంట్లతో అందినకాడికి దోచుకోవడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా సాగిన అన‘కొండ’ హయాంను గుర్తుకు తెచ్చుకుంటున్న కాకినాడ నగరవాసులు.. మళ్లీ ఓటడుగుతున్న ఆయనను చూసి విస్తుపోతున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తన హయాంలో సాగించిన భూ కబ్జాలు ఎన్నో. నిరుపేద విద్యార్థులకు విద్యాదానం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ట్రస్ట్ భూములను సైతం నిస్సంకోచంగా తమ కుటుంబం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని, దర్జాగా అనుభవిస్తున్న చరిత్ర కొండబాబుది. కాకినాడలో పైండా సూర్యనారాయణమూర్తి అనే వితరణశీలి తన తాతగారైన పైండా వెంకట రామకృష్ణ (పీవీఆర్ ట్రస్ట్) పేరిట పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే నిమిత్తం 16.29 ఎకరాల భూమిని ఉదారంగా దానమిచ్చారు. అక్కడ 1968 నుంచి సంస్కృత కళాశాల నిర్వహించగా, 1972లో పైండా ఆండాళ్లమ్మ జూనియర్ కాలేజీని, 1974లో డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. సూర్యనారాయణమూర్తి ఇచ్చిన భూముల్ని ల్యాండ్ సీలింగ్‌లో చూపించి ప్రభుత్వం స్వాధీన పర్చుకునేందుకు ప్రయత్నించగా వివాదం ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కెళ్లింది. 1983లో సూర్యనారాయణమూర్తి గిఫ్ట్ డీడ్‌ను ఆమోదిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. ఈ భూములపై తామే హక్కుదార్లమంటూ కౌలుదార్లు 1986లో కోర్టును ఆశ్రయించగా..వారికి, ట్రస్ట్‌కు మధ్య మున్సిఫ్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. కారుచౌకగా ఆరెకరాలు సొంతం.. వాస్తవం ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూముల్లో ఆరెకరాలను బినామీ హక్కుదార్ల ద్వారా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భార్య శ్రీదేవి పేరిట సర్వే నంబర్ 197/9లో 1.50 ఎకరాలను డాక్యుమెంట్ నం: 6460/ 2001తో 2001 ఆగస్టు ఆరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదే సర్వే నెంబర్లో 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6459/ 2001తో తన సోదరుడు వనమాడి సత్యనారాయణ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్టుమెంట్ నంబర్ 6458/2001తో తల్లి సుబ్బాయమ్మ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6457/2001తో తండ్రి లోవరాజు పేరిట కొండబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొండబాబు కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన యనమండ్ర మహాలక్ష్మి, నర్సమాంబ, బాలాత్రిపుర సుందరిల నుంచి ఈ ఆరెకరాల భూమిని కేవలం ఎకరం రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలకు కారు చౌకగా కొట్టేశారు. ఈ భూములను ఆనుకొని ఉన్న స్థలాల్లో నేడు గజం రూ.10 వేలకు పైగా పలుకుతోంది. అంటే కొండబాబు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల విలువ ఎంత తక్కువ లెక్కేసుకున్నా నేడు పాతిక కోట్లకు పైమాటే. ఈ భూములు పీవీఆర్ ట్రస్ట్‌కు చెందినవి కావని కొండబాబు కుటుంబసభ్యులు వాదిస్తుండగా, కౌలుదారుల చేతుల్లో ఉన్న తమ భూములనే ఇలా బినామీ హక్కుదార్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిల భవనాల్లోనే వెయ్యి మంది చదువు.. ఈ భూముల్లో తన భార్య పేరిట ఉన్న 1.50 ఎకరాలకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చిన కొండబాబు వాటి మార్కెట్ విలువ కేవలం రూ.40 లక్షలుగానే పేర్కొనడం గమనార్హం. ఒకపక్క విలువైన భూములు కబ్జాకారుల కోరల్లో చిక్కుకోవడం, మరో పక్క మిగిలిన భూములన్నీ కోర్టు వివాదాల్లో నలిగిపోతుండడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే పీవీఆర్ ట్రస్ట్ నిర్వహణలోని సంస్కృత, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులు మగ్గాల్సి వస్తోంది. కోట్లాది విలువైన భూములున్నా.. వాటి ద్వారా ఆదాయం లేకపోవడంతో దాతలిచ్చే విరాళాలతోనే విద్యార్థులు చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దాతలు ఉదాత్త ఆశయంతో ఇచ్చిన భూములను దొడ్డిదారిన కాజేసిన కొండబాబు తీరును గర్హిస్తున్న నగర ప్రజలు.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గెలిపించండని కోరుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.