టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట.. | AP Government Serious On TDP Leaders Land Grabs | Sakshi
Sakshi News home page

కబ్జాల ఆటకట్టు 

Published Fri, Sep 11 2020 9:57 AM | Last Updated on Fri, Sep 11 2020 9:57 AM

AP Government Serious On TDP Leaders Land Grabs - Sakshi

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్రమార్కులపై కఠిన చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగానే బాలాజీ టింబర్‌ డిపో వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.  ఎస్పీ రమేష్‌రెడ్డి రంగంలోకి దిగారు. డిపోలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన 12 మందిని అరెస్టు చేసి కేసు నమోదుచేశారు. డిపో వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిపిరి సీఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. భూ కబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ రమేష్‌ రెడ్డి, ఆర్డీఓ కనకనరసారెడ్డి హెచ్చరించారు. టింబర్‌ డిపో విషయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎస్పీ, ఆర్డీఓ దూకుడుగా వ్యవహరించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. (చదవండి:  ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిల‌ర్)

టీడీపీ హయాంలోనే భూకబ్జాలు
తిరుపతి, చంద్రగిరి, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి పరిధిలోని టీడీపీ నాయకులు, వారి బంధువులు, అనుచరులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూఆక్రమణకు పాల్పడ్డారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్వర్ణ ముఖి నదీ, పోరంబోకు, మఠం, కాలువ, ఇనాం, ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. పద్మావతీపురం వద్ద మాజీ ఎమ్మెల్యే అల్లుడు కుంటపోరంబోకు భూ మిని ఆక్రమించి పెద్ద అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నట్లు ఆ రో పణలు ఉన్నాయి. శిల్పారామం ఎదురుగా ఉన్న భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆ క్రమించి సొమ్ముచేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లెలో కోట్ల రూపాయల విలువచేసే భూములను కాజేశారు. మాజీ సైనికుల పేర్లతో కొన్ని, వారికి కేటాయించిన భూములు మరికొన్ని ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.

ఆక్రమించుకున్న భూముల్లోనే టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి అనుభవిస్తున్నారు. పీలేరులో ఓ నాయకుడి సహకారంతో అనుచరులు సుమారు 2 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి కోట్ల రూపాయలు కాజేశారు. శ్రీకాళహస్తిలోని అయ్యలనాడు చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. టీడీపీ హయాంలోనే మాజీ మంత్రి సహకారంతో చెరువు దురాక్రమణ అ య్యింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కూడా   కమీషన్లు పుచ్చుకుని భారీగా జేబులు నింపుకున్నారనే విమర్శలున్నాయి. పాడిపేట, వికృతమాల, తనపల్లె సమీపంలో నిర్మించిన గృహ స ముదాయాల్లో ఎక్కువ నివాసాలను తమ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు  బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

రీ సర్వేతో భూ ఆక్రమణలకు చెక్‌
తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుపతి రెవెన్యూ డివిజినల్‌ పరిధిలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేందిలేదని, క్రిమినల్‌ కేసులు న మోదు చేస్తామని ఆర్డీఓ వి.కనకనరసారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న భూ వివాదాలకు రీ సర్వేతో చెక్‌ పడ నుందని తెలిపారు. కొన్ని రోజులుగా తిరుపతి రెవెన్యూ డివిజినల్‌ పరిధిలో భూ ఆక్రమణపై వస్తున్న ఫిర్యాదులపై గురువారం ఆయన మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో నిజమైన భూ యజమానులను కొంతమంది దుండగులు బెదిరించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డివిజన్‌ పరిధిలో ప్రభుత్వ, నదులు, కాలువ, చెరువులకు సంబంధించిన భూములను, నిజమైన పట్టాదారుల భూము ల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఎవరైనా అక్రమార్కులకు సహకరిస్తే శాఖా పరమైన చర్యలతో పాటు, కేసులు నమోదు చేస్తా మని స్పష్టం చేశారు. భూ అక్రమణలు, కబ్జాలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టనుందన్నారు. భూముల రీ సర్వేతో రాష్ట్ర రెవెన్యూ విభాగంలో చారిత్రాత్మఘట్టం ప్రారంభం కానుందని, దీంతో గ్రామీణ, పట్టణ ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేకూరనుందని ఆర్డీఓ కనకనరసారెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement