సాక్షి, విశాఖపట్నం: గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘40 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ వాదన సమంజసంగా లేదు. 40 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకొని నిర్మాణాలు చేపడితే బాగుండేది. గీతం ఎవరికి ఉచితంగా విద్య అందించలేదు. టీడీపీ హయాంలో ఎందుకు గీతం 40 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేసుకోలేదని’’ ఆయన ప్రశ్నించారు. ఆక్రమణలో ఉన్న మిగతా భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలపై గత టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి వాస్తవాలు నేటికి బయటకు రాలేదని జేవీ సత్యనారాయణ మూర్తి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment