Gitam University
-
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’
-
బంధు ప్రీతితోనే ఎంపీ సీటు కేటాయించిన చంద్రబాబు
-
చివరి కాల్ ఎవరితో ?..ఆత్మహత్యకు కారణం ?
-
గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి గల కారణాలు తెలియల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణల విచారిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/mqA7ChvkBn— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024 Video Credits: Telugu Scribe చదవండి: TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి -
ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే పెన్సింగ్:ఆర్డీవో
-
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
టీడీపీ హయంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం వర్సిటీ
-
టీడీపీ హయాంలోనే కబ్జా కోరలు
సాక్షి, విశాఖపట్నం: చెప్పులు తినే కుక్క నోటికి చెరకు రుచిస్తుందా? ప్రభుత్వ భూములు కనిపిస్తే కాజేయడమే ఆనవాయితీగా మార్చుకున్న టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో దాదాపు 430 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపించింది. వీటిలో అగ్రభాగం టీడీపీ నేతలే కబ్జా చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ విశాఖలో భూకబ్జాలతో వందల ఎకరాలను ఆక్రమించిన టీడీపీ నేతల దందాకు తెరపడటంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గీత దాటి కబ్జాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గీతం వర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విశాఖలో ఇలా మూడేళ్లలో మార్కెట్ ధర ప్రకారం రూ.5,000 కోట్ల విలువైన 430.81 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. బినామీ పేర్లతో.. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో విశాఖ భూములపై రాబందుల్లా వాలిపోయారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని చెరపట్టారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ పెంచి పోషించిన భూబకాసురులపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో.. విశాఖతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని నియమించి క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. పల్లా సోదరుడి భూ ఫలహారం.. అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్ రికార్డు
పటాన్చెరు: గీతం యూనివర్సిటీ పూర్వ విద్యా ర్థిని శివాలి జోహ్రి గిన్నిస్ రికార్డు సాధించారు. కాగితంతో పూలు, ఇతర ఆకృతులను క్విల్లింగ్ ప్రక్రియలో చేసి ఆమె ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ రికార్డులు సాధించిన శివాలి తాజాగా 2020 ఏడాదికి గాను 14వ గిన్నిస్ రికార్డ్ సాధించారు. 2016–17 విద్యా సంవ త్సరంలో గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి పది యూనిక్ వరల్డ్ రికార్డులు కూడా పొందారు. ఆమె రికార్డులను గీతం యూనివర్సిటీ వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపిస్తూ వచ్చారు. తొలిసారిగా ఆమె నిర్ణీత సమ యంలో తన తల్లి కవిత జోహ్రి కలిసి 1,251 విభిన్న ఆకృతుల్లో కాగితపు బొమ్మలను తయా రు చేసి రికార్డు సృష్టించారు. తాజాగా 2,342 బొమ్మలను తయారు చేసి గీతంలో ప్రదర్శిం చారు. శివాలి మరోసారి గిన్నిస్ రికార్డు సాధించడంపై గీతం యాజమాన్యం హర్షం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా యాజ మాన్య ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు -
‘గీతం’ సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)కు విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇచ్చిన సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించాలని(రీ వెరిఫికేషన్ చేయాలని) నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సభ్య కార్యదర్శి అనిల్ కె నస్సాకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం లేఖ రాశారు. ఎన్బీఏకు 2018, 2019, 2020 సంవత్సరాల్లో గీతం సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఆయా సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చితే అస్పష్టత కనిపిస్తుందని సూచించారు. నాలుగేళ్ల యూజీ ప్రోగ్రాంలకు అనుమతుల కోసం 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారంలో, ఎన్ఐఆర్ఎఫ్ 2020, 2019 సమాచారాల్లో వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపారు. ఆయా సంవత్సరాల పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం సమాచారం కూడా అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీతో ఆ సంస్థ రికార్డులు, అకౌంట్లను మళ్లీ పరిశీలించాని కోరారు. -
‘గీతం’ ఉల్లంఘనలపై విచారణ జరిపించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించిందని, తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజాల నిగ్గు తేల్చేందుకు తక్షణమే విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దేకు శుక్రవారం లేఖ రాశారు. -
గీతం గుట్టు
-
గీతంపై కేంద్రమంత్రికి ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటి నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్‌కు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయి రెడ్డి గురువారం లేఖ రాశారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదని, గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు పొందుపరచ లేదని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా గీతం విద్యా విధానంలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్‌కు కూడా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ర్యాంకింగ్ విషయంలో గీతం నిబంధనలు తుంగలో తొక్కిందని చెప్పారు. తప్పుడు సమాచారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదు అని పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా గీతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖ ద్వారా రమేష్ పొఖ్రియాల్‌కు తెలిపారు. -
‘ఆ భూములు స్వాధీనం స్వాగతిస్తున్నాం’
సాక్షి, విశాఖపట్నం: గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘40 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ వాదన సమంజసంగా లేదు. 40 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకొని నిర్మాణాలు చేపడితే బాగుండేది. గీతం ఎవరికి ఉచితంగా విద్య అందించలేదు. టీడీపీ హయాంలో ఎందుకు గీతం 40 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేసుకోలేదని’’ ఆయన ప్రశ్నించారు. ఆక్రమణలో ఉన్న మిగతా భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలపై గత టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి వాస్తవాలు నేటికి బయటకు రాలేదని జేవీ సత్యనారాయణ మూర్తి దుయ్యబట్టారు. -
'గీతంకు విద్యా దాహం కంటే భూ దాహం ఎక్కువైంది'
సాక్షి, విశాఖపట్నం: గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడుతున్నారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. (గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు) గీతం యాజమాన్యం కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోంది. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని కోర్టు సూచించింది. కానీ టీడీపీ పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోంది. ఆగస్టు 3న సీఎం వైఎస్ జగన్‌కి గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాలు క్రమబద్ధీకరించాలని కోరింది. ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరింది. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుంది. గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుంది. వేల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడం సరికాదు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి క్యాబినెట్లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి క్యాబినెట్ వాయిదా వేసింది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలి. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ గుడివాడ అమరనాథ్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. (చంద్రబాబు బంధువులు అయితే..) -
గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 'గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నాం' అని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. (ఆక్రమణలకు చరమ‘గీతం’) -
చంద్రబాబు బంధువులు అయితే..
సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే బాగుండేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని, గీతం వర్సిటీ ఆక్రమించినవి ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘గీతం యూనివర్సిటీ అక్రమించుకున్న భూములు వెనక్కి తీసుకోకూడదా? చంద్రబాబు బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా? ఈ భూముల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆరు నెలల క్రితం నుంచి గీతం భూములపై వివాదం నడుస్తోంది. ఆ భూముల విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం సరికాదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గీతంకు భూములు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ భూములు దోచుకునేవారికి ఆయన వత్తాసు పలుకుతారా?’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ అంచనాలు కాంట్రాక్ట్ కోసం ఇష్టానుసారంగా తగ్గించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సాయం కోరతామని ఆయన చెప్పారు. -
గీతం ఆక్రమణల్లో ఉన్నాయని అధికారుల నివేదిక
-
గీతం ఆక్రమణలకు చెక్
గత సర్కారు అండతో రుషికొండ, ఎండాడలో 40.51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివిధ స్థలాల్ని గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎండాడలోని సర్వే నం. 15,16,17,18,19,20, రుషికొండలోని సర్వే నం. 55,61లో ఆక్రమించిన 22.21 ఎకరాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణం, సర్వే నం. 34,35,37,38లో 18.30 ఎకరాల విస్తీర్ణంలో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్ నిర్మాణంతో పాటు గ్రావెల్ బండ్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్డీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ కూడా తమకు వచ్చిన ఫిర్యాదు నంబర్.2670 ప్రకారం విచారణ చేపట్టింది. సాక్షి, విశాఖపట్నం: 1981లో గీతం విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్లు 17/1, 5, 17/7 నుంచి 28 వరకూ 71.15 ఎకరాల భూమిని ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఇదంతా అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన భూమి కావడం, దాన్ని అప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం ఆ స్థల హక్కుల్ని గీతంకి బదిలీ చేయలేదు. కానీ ఆధీన పత్రాలు దక్కించుకునే వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ స్థలాన్ని విద్యాసంస్థకు అప్పగించింది. ఈ నిబంధనల్ని పాటించకపోతే ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. లేదంటే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి.. 14 ఎకరాల్లో నిర్మాణం చేపట్టి.. మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జేసీ ఈ స్థలాన్ని పరిశీలించి.. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు కేవలం 14 ఎకరాలు మాత్రమే నిర్మాణాలు చేపట్టి.. మిగిలిందంతా నిరుపయోగంగా ఉంచేశారంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన అప్పటి భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గీతంని పరిశీలించి.. కేవలం 49 ఎకరాలు మాత్రమే సరిపోతాయనీ.. మిగిలిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 1998 మే 27న ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. (విశాఖ భూ కుంభకోణం: సిట్ విచారణ ప్రారంభం) ప్రభుత్వానికి నివేదిక పంపించాం.. ఎండాడ, రుషికొండ పరిసరాల్లో మొత్తం 40.51 ఎకరాల భూముల్ని గీతం సంస్థ ఆక్రమించినట్లు గుర్తించాం. ఏయే ప్రాంతాల్లో ఎంత భూములు ఆక్రమించుకున్నారు... హైకోర్టు విచారణలో ఉన్న కేసులు సంబంధించి ఎంత మేర భూములున్నాయి.. మొదలైన అంశాలతో కూడిన 7 పేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖపట్నం ఇలా తీసుకొని.. అలా ఇచ్చేసిన టీడీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రెండు వారాల తరువాత అదే ఏడాది జూన్ 12న ఎకరా రూ.18వేలుగా ధర నిర్ణయించి గీతంకి అప్పగించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. స్థలాన్ని అప్పగించిన 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 10 శాతం వడ్డీ కట్టాలని కూడా ఆదేశించింది. మొత్తంగా రూ.34,94,200 చెల్లించి స్థలాన్ని గీతంకి అప్పటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. క్రమంగా.. ఆక్రమణలు ఇక అప్పటి నుంచి గీతం ఆ భూములకు పక్కన ఉన్న స్థలాల ఆక్రమణల పర్వానికి తెరతీసింది. సర్వే నం.20(పీ)లో 6.09 ఎకరాలు, నం.19లో 0.62 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమించింది. దీనిపై విశాఖ రూరల్ ఎమ్మార్వో గీతం విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేయగా.. యాజమాన్యం ఆ స్థలాల్లో ఉన్న కట్టడాలు కూల్చొద్దంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గీతం వివరణ తీసుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ 2004 డిసెంబర్ 28న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిట్ పిటిషన్ దాఖలైన తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగించినట్లు 2005 ఫిబ్రవరిలో గుర్తించారు. సర్వే నం.19లో 0.98 ఎకరాలు, 20లో 6.16 ఎకరాలు, 16లో 0.16 ఎకరాలు చొప్పున మొత్తం 7.30 ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆ నిర్మాణాల తొలగించాలని నిర్ణయించారు. మొత్తం 7.30 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల్ని తొలిగించి 2005 ఫిబ్రవరి 19న ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. ఒత్తిళ్లతో.. కట్టబెట్టారు ఆ తర్వాత మరోసారి కోర్టుకి వెళ్లి గీతం యాజమాన్యం రిట్ పిటిషన్ దాఖలు చేయగా 4 వారాల్లో స్థలాన్ని గీతంకి స్వాధీనం చేయాలంటూ 2005 ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లతో 2010లో స్థలాన్ని ప్రభుత్వం గీతం దూర విద్య కోర్సుల భవనానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత అక్రమంగా తమ ఆ«దీనంలో ఉంచుకున్న సర్వే నం. 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని వీఎంఆర్డీఏ వీసీ, ఇగ్నో రీజనల్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డీడీ, ఐటీడీఏ పీఓ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ మొదలైన వివిధ ప్రభుత్వ సంస్థల అధికారుల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనా మరోసారి గీతం కోర్టుకి వెళ్లగా.. 2014 మార్చి 10న హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే కొనసాగుతూ ఉంది. దీన్ని మార్కెట్ ధర ప్రకారం ఎకరం రూ.8.26 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా గీతం యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఇలా.. మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు దీనిపై చర్యలకు ఉపక్రమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
సీఎం సహాయ నిధికి గీతం రూ. 25 లక్షల విరాళం
పటాన్చెరు: కరోనా బాధితులకు చేయూతనిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధికి, గీతం యూనివర్సిటీ (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చింది. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ శనివారం ఈ చెక్కును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ మేరకు రుద్రారంలోని హైదరాబాద్ గీతం యూనివర్సిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఆర్‌ను కలసిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గీతం హైదరాబాద్ అడిషనల్ వీసీ ప్రొ.ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉన్నారు. గీతం విద్యాసంస్థల వితరణను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
ఆ ర్యాంకు వారికి ‘గీతం’లో ఉచిత విద్య
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శివరామకృష్ణ పూర్తి షెడ్యూల్‌ను వివరించారు. వచ్చే ఏడాది ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో గ్యాట్-2020(గీతం అడ్మిషన్ టెస్ట్) ద్వారా అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50 కేంద్రాలను కేటాయించారు. ఏప్రిల్ 25న ఫలితాలు ప్రకటించనున్నారు. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచెస్లో దరఖాస్తులు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు www.gitam.edu వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సు, మెషీన్ లెర్నింగ్‌ను, ఎంటెక్‌లో స్ట్రక్చరల్ ఎనాలసిస్ అండ్ డిజైన్, విత్ డాటా సైన్స్ కోర్సు, మానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ అనాలసిస్ కోర్సులు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. రూ. 30 కోట్లతో ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. గ్యాట్- 2020లో మెదటి 50 ర్యాంకుల్లోపు వారికి ఉచిత విద్య, 51-250 ర్యాంకు వారికి ఫీజులో 75శాతం రాయితీ, 251-1000 వరకు ర్యాంకర్లకు 50 శాతం రాయితీ, 1001-3000 ర్యాంకు వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా శివరామకృష్ణ పేర్కొన్నారు. -
నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి
సాక్షి, పటాన్చెరు: గణిత శాస్త్రం అర్థం చేసుకోవడం కష్టం అయితే అది అర్థమైయ్యిందంటే అందులోనే నూటికి నూరుశాతం మార్కులు పొందవచ్చని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. తనకు చిన్నప్పుడు గణితశాస్త్రం అర్థమయ్యేది కాదన్నారు. తనతో పాటు చదువుకున్న 60 విద్యార్థుల్లో ఏడో తరగతి వచ్చేసరికి 27మంది మాత్రమే చదువులు కొనసాగించారని గుర్తు చేశారు. మిగతా వారంతా చదువు మానేశారన్నారు. మానవ జీవితంలో గణిత శాస్త్రం చాలా ప్రాముఖ్యమైందని ఆయన విశ్లేషించారు. శుక్రవారం పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమటికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్‌ను మంత్రి ప్రారంభించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ కూడ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మనిషి జీవితానికి, గణితానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తగినట్టుగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా గణిత శాస్త్రంతో ముడిపడినదేనని జగదీశ్‌రెడ్డి వివరించారు. ప్రాథమిక విద్యస్థాయిలో గణితంపై పట్టు సాధించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గణితం మాస్టార్ కోసం ఆరా తీస్తున్న మంత్రి ‘తన కూతురు ఇటీవల లెక్కల్లో వెనుకబడిందని తెలిసింది. ఆమెలో లెక్కలంటే భయం లేకుండా చేయాలనేది నా ప్రయత్నం. అయితే రెండు నెలలుగా ఓ లెక్కల మాస్టార్ కోసం వెతుకుతున్నా’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. చిన్నారుల్లోని నిగూడమైన సృజనాత్మక శక్తిని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన విశదీకరించారు. చిన్నారుల్లో అంత ఒత్తిడి అవసరమా..? ‘చిన్నప్పుడు లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. వందకు వంద మార్కులు వచ్చేవి. ఆ తరువాత నన్ను ఫిడ్జి స్కూల్లో వేశారు. మార్కులు తగ్గాయి. తల్లిదండ్రులు నన్ను ఐఐటీ చదవాలనే ఉద్ధేశ్యంతో ఆ స్కూళ్లో వేశారు. ఐఐటీ చేయలేనని చెప్పేశాను. ఆ తరువాత అమెరికాలో ఓ యూనివర్సిటలో గణిత ప్రాధాన్యతతో కూడిన గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ప్రథమ మూడు పరీక్షల్లో ఏ మాత్రం చదవకపోయినా మంచి మార్కులు వచ్చాయి. దానికి కారణం దేశంలో ప్రాథమికస్థాయిలో చదివిన ఫౌండేషన్ కోర్సులే కారణం. అయితే నాకనిపిస్తుంది పిల్లలకు ఆ స్థాయిలో డిగ్రీలో నేర్పే కోర్సులు అవసరమా అంత వత్తిడి ఎందుకు’అని గీతం అధ్యక్షుడు శ్రీభరత్ అన్నారు. గణితం అనే తర్కమని(లాజిక్), అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని శ్రీభరత్ అన్నారు. కాన్ఫరెన్స్‌కు వచ్చిన స్పందనను నిర్వాహకుడు ప్రొఫెసర్ మారుతీరావు వివరిస్తూ వంద పరిశోధన పత్రాలు సమర్పిస్తారని భావిస్తే.. తమ అంచాలకు మించి 300 పరిశోధనా పత్రాల సమర్పణకు గణితశాస్త్ర పరిశోధకుడు ఈ కాన్ఫరెన్స్‌కు హాజరవుతున్నారని తెలిపారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇండియన్ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొ.ఎస్.ఆర్ముగం, ఆంధ్రా–తెలంగాణ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, అమెరికా నుంచి వచ్చిన తెలుగు శాస్త్రవేత్త జెర్మయ్య కె.బిల్లా పాల్గొన్నారు. -
గీతం మూర్తికి డల్లాస్‌లో ఘననివాళి
డల్లాస్ (టెక్సాస్) : ‘గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం’ (గానం) ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, గీతం పాలక మండలి సభ్యులు వెలువోలు బసవపున్నయ్య, గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో అధికారిగా పని చేస్తున్న వి. పి. ఆర్ చౌదరి (చిన్నా), గీతం విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు వీరమాచినేని శివ ప్రసాద్‌లకు ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. గీతం విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్లో పని చేస్తున్న ప్రొఫెసర్ ఆనంద్ పుప్పాల తన విద్యార్థి జీవితాన్ని నెమరవేసుకుంటూ గీతం తన భవిష్యత్తుకి చక్కని మార్గాన్ని చూపిందని, తాను ఇప్పుడు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే అవకాశం కల్పించిందని, ప్రత్యేకంగా తనకు ఎం.వి.వి.ఎస్ మూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధులు ప్రసాద్ రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ గీతం వల్లే ఈ రోజు తమలాంటి వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, చదువు చెప్పిన గీతం విశ్వవిద్యాలయానికి, దాన్ని స్థాపించిన డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి జీవితాంతం ఋణపడి ఉంటామని పేర్కొన్నారు. 25 సంవత్సరాలకు పైగా తాను చేస్తున్న నిస్వార్ధ సేవకు గుర్తింపుగా గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎం.వి.వి.ఎస్ మూర్తి పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహిoచినప్పటికీ విద్యావేత్త గానే ఆయన ఎక్కువగా గుర్తింపు పొందడం, విద్య పై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో గీతం విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావ్యవస్థగా మూర్తి తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయమన్నారు. ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల మంది విద్యార్థులు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో విద్యాభ్యాసం చేయడం గొప్ప విషయం అన్నారు. అంతే గాక ప్రతి సంవత్సరం అనేక వందల మంది విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం నుండి దేశ, విదేశాలల్లో కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఒక గొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటు అని తోటకూర ప్రసాద్ తెలిపారు. అలస్కా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఇంకా ఈ సంతాప సభలో డాక్టర్. ఉరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్ కాకర్ల మొదలైన వారు తమ ప్రసంగాల్లో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మూర్తి
సాక్షి, హైదరాబాద్ : అమెరికా రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన 1938 జూలై 3న తూర్పుగోదావరి జిల్లా మూలపొలం గ్రామంలో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన ఎంవీవీఎస్ మూర్తి గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విద్యాసంస్థలను ప్రారంభించారు. ఆయన మరణంతో మూలపొలం గ్రామంలో విషాదం నెలకొంది. న్యాయవాదిగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన రెండుసార్లు ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మూర్తి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి తొలిసారి 1989లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు చెందిన ఉమాగజపతిరాజుపై గెలుపొందారు. 1999లో కూడా మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును బీజేపీకి కేటాయించడంతో.. ‘మూర్తి'ని ఎమ్మెల్సీగా సీఎం చంద్రబాబు నామినేటెడ్ చేశారు. (చదవండి: గీతం యూనివర్సిటీ అధినేత హఠాన్మరణం) సంతాపం తెలిపిన వైఎస్ జగన్ గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
గీతం యూనివర్సిటీ అధినేత హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ విద్యావేత్త, గీతం వర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. అమెరికాలోని అలస్కాలోని ఆంకరేజ్ సిటీ వద్ద మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య , వీరమాచినేని శివ ప్రసాద్, వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆంకరేజ్ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, సహాయక సిబ్బంది అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. అమరావతి: డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానని తెలిపారు. మూర్తి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస్‌రావులు ఎంవీవీఎస్ మూర్తి హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమెరికా పర్యటనలో స్నేహితులతో ఎంవీవీఎస్ మూర్తి సంతాపం ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
గీతం వర్సిటీకి స్వయంప్రతిపత్తి హోదా
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): ఉన్నత విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న గీతం యూని వర్సిటీకి అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది. అలాగే కేటగిరీ– 1 విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చిందని గీతం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. ప్రసాదరావు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 60 విద్యా సంస్థలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించగా డీమ్డ్ వర్సిటీల్లో గీతం కేటగిరీ–1 కింద స్వయంప్రతిపత్తి హోదా పొందిందన్నారు. 2007లో డీమ్డ్ వర్సిటీ హోదాను పొందిన గీతం విశాఖతోపాటు హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రాంగణాలను నెలకొల్పిందని, మొత్తం 190 యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడిసిన్, నర్సింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో 21వేల మందికిపైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారని వివరించారు. దూర విద్య విభాగం ద్వారా 80వేల మంది వివిధ కోర్సులు చదువుతున్నారని పేర్కొన్నారు. బార్క్, డీఆర్డీవో, డీబీటీ, డీఎస్టీ వంటి వాటి సహకారంతో 150కి పైగా పరిశోధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు. అటానమస్ హోదాతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించొచ్చని, యూజీసీ అనుమతుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. అటానమస్ హోదాతో ఇతర రాష్ట్రాల్లో గీతం ప్రాంగణాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని, పరిశోధన కేంద్రాలు, ఇంక్యుబేషన్ సెంటర్లను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో రష్యాలోని సెయింట్బర్గ్ మెరైన్ టెక్నికల్ విశ్వవిద్యాలయంతో కలసి నౌకా నిర్మాణం, సముద్ర వాహక నౌకల తయారీపై కోర్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. -
తండ్రి మందలించాడని..
పటాన్చెరు టౌన్: మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో రుద్రారం గీతం కాలేజీ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఫణిభూషన్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని నిజాంపేట్ పరిధిలోని జయభరత్‌నగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి రమేశ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర్య ఫణిభూషన్(20) పటాన్చెరు మండల పరిధిలోని గీతం కళాశాలలో బీటెక్(సీఈసీ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదల అయిన సెమిస్టర్ ఫలితాల్లో ఫణీందర్‌కు తక్కువ మార్కులు రావడంతో శుక్రవారం సాయంత్రం తండ్రి మందలించాడు. మంచిగా చదువుకోవాలని సూచించాడు. కళాశాల ఏఎంసీ క్రాంతి కుమార్‌తో తనను ఫోన్లో మాట్లాడించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 7: 30 గంటలకు ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన ఫణిభూషన్ 8: 50 గంటలకు కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలపాలైన ఫణిభూషన్‌ను గమనించిన తోటి విద్యార్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మృతుడు తనంతట తానే కిందపడ్డాడా లేదా ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెం దా డా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గీతమ్లో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : గీతమ్ యూనివర్సిటీ విద్యార్ధులు గురువారం సంప్రదాయ వస్త్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులందరూ విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా వస్త్రధారణతో కనువిందు చేశారు. విద్యార్ధులు లుంగీలు, పంచెలతో అలరించగా, విద్యార్ధినులు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో మెహిందీ, వంటలు, రంగవల్లి పోటీలు నిర్వహించారు. అందరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన క్యాట్‌వాక్, నృత్యాలు, ఫోటో సెషన్లు, సెల్ఫీలతో ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...బుల్లెట్ కంటే బ్యాలెట్ ప్రభావవంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించి, విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. -
రోడ్డుప్రమాదంలో 'గీతమ్' విద్యార్ధుల మృతి
సంగారెడ్డి (మెదక్ జిల్లా) : సంగారెడ్డి మండలం కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీతం యూనివర్సిటీ విద్యార్థులు మృతిచెందారు. సంఘటనాస్థలంలోనే అఖిలేశ్(19) మృతిచెందగా..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిత్య(19) అనే మరో విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. గీతం యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) సెకండియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వ్యక్తిగత పని నిమిత్తం సంగారెడ్డి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి నుంచి గీతం యూనివర్సిటీ(హైదరాబాద్)కి వస్తుండగా కంది దగ్గర బైక్‌పై కూర్చున్న ముగ్గురు యువకుల్లో ఒకరి బ్యాగు ట్రాక్టరుకు తగులుకుంది. దీంతో ముగ్గురూ కింద పడ్డారు. వెనకాలే వస్తున్న జిప్సీ వాహనం వీరిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుతాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: విద్యాలయం సాక్షిగా మరో చదువుల తల్లి ప్రాణాలు విడిచింది. విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్(ఐటీ) మూడోసంవత్సరం విద్యార్థిని శ్రావ్య శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ కు చెందిన శ్రావ్య హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోవడాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు యాజమాన్యానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. గీతం వర్సిటీ టీడీపీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిది కావడంతో విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు వర్సిటీకి వెళ్లిన విలేకరులను లోనికి అనుమతించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మెడిసిన్ విద్యార్థి ఒకరు వర్సిటీ హాస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
విశాఖ నుంచి 'గీతమ్' మూర్తి?
విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గీతమ్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పేరు దాదాపు ఖరారైంది. దాంతో ఆయన సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్‌లో కలవనున్నారు. ఎంవీవీఎస్ మూర్తి పేరును చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సిఫార్సు చేసినట్లు తెలిసింది. మూర్తి గతంలో రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేశారు. గతంలో గోల్డ్‌స్పాట్ మూర్తిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. తర్వాత గీతమ్స్ విద్యాసంస్థలను నెలకొల్పి ఆ పేరుతో ప్రముఖుడయ్యారు. రెండో స్థానానికి పప్పల చలపతిరావు పేరు దాదాపు ఖరారైంది. విజయనగరం టీడీపీ ఎమ్మెల్సీగా మహిళల కోటా రేసులో శోభా హైమావతి పేరు వినిపిస్తోంది. కాగా, 10 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఇప్పటివరకు మహిళా కోటా మాత్రం ఖరారు కాలేదు. -
జూన్ 9 నుంచి గీతం ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్
సాగర్‌నగర్ (విశాఖపట్నం) : గీతం వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి జూన్9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డెరైక్టర్ కె. నరేంద్ర తెలిపారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం విశాఖ, హైదరాబాద్ సిటీ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ రూద్రారం గీతం ప్రాంగణం, బెంగళూరు సిటీ , కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్ ప్రాంగణంలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్9వ తేదీన 1నుంచి 5000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే 10వ తేదీన 5001 నుంచి 9500 ర్యాంకు వరకు, 11వ తేదీన 9501 నుంచి 14000 వరకు, 12వ తేదీన 14001 నుంచి 18500 వరకు, 13వ తేదీన 18501 నుంచి 23000 ర్యాంకు వరకు, 14వ తేదీన 23001 నుంచి 28000 ర్యాంకు వరకు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. 14వ తేదీన మధ్యాహ్నం ఎం.ఫార్మసీ, ఎంటెక్ కోర్సులకు అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.gitam.edu నుంచి కౌన్సెలింగ్ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. -
నేటి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కోసం భారీ భద్రత
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక (ఎంపీ, ఎమ్మెల్యే) ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి సమీపంలోని ఫసల్వాది ఎంఎన్ఆర్ కళాశాల, కాశీపూర్‌లోని డీవీఆర్ కళాశాల, పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వ విద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరూ కూడా గుమిగూడి ఉండరాదని ఎస్పీ శెముషీ హెచ్చరించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో 30 పోలీసు చట్టం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరు కూడా అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, ఇంకు పెన్నులు, బ్లేడ్లు, చాకులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు, సుత్తెలు వంటివి తీసుకుని వెళ్లరాదని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
‘ఏసీసీఏ’తో గీతం అవగాహనా ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో 8,500 కార్పొరేట్ సంస్థల అధికారిక చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థగా బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ)తో రాష్ట్రంలో తొలిసారిగా గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని విశ్వవిద్యాలయవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం ఒప్పందంపై సంతకాల కార్యక్రమం సందర్భంగా భారత్‌లో ఏసీసీఏ రిలేషన్షిప్ మేనేజర్ ఇల్హామ్ పంజానీ మాట్లాడుతూ... ఏసీసీఏ సిలబస్‌ను అధ్యయనం చేసే భారతీయ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతాయని, దేశంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి సంస్థలకూ ఏసీసీఏ సర్టిఫికెట్ కలిగిన నిపుణుల అవసరం ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం 7 వేల మంది విద్యార్థులు ఏసీసీఏ కోర్సులు అభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. ఏసీసీఏ సిలబస్‌ను బీకామ్ కోర్సుతో కలిపి విద్యార్థులకు బోధించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. -
‘బెక్’ శిక్షణకు కేంబ్రిడ్జితో గీతం వర్సిటీ ఒప్పందం
విశాఖపట్నం: బెంగళూరు కేంపస్‌లో ఇంజనీరింగ్, ఎంబీఏ చేస్తున్న విద్యార్థులకు బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ (బెక్)పై శిక్షణ ఇచ్చేందుకు కేంబ్రిడ్జి వర్సిటీ ప్రెస్ ఇండి యా లిమిటెడ్ (సీయూపీఐఎల్)తో గీతం విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై బెంగళూరు కేంపస్ డెరైక్టర్ విజయభాస్కరరాజు, కేంబ్రిడ్జి వర్సిటీ భారత అధికారి ప్రసన్న వెంకటరామన్ సంతకాలు చేశారు. దీని కోసం ప్రత్యేక లాంగ్వేజ్ ల్యాబ్‌ను గీతం.. బెంగళూరు కేంపస్‌లో ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ విద్యార్థులకు ప్లేస్మెంట్లలో దోహదపడుతుందని భాస్కరరాజు చెప్పారు. -
నేడు ‘గీతం’ క్యాంపస్ ప్రారంభం
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ :భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖచే ‘ఎ’ కేటగిరి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీ బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురం వద్ద ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను ప్రారంభించనుందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతితో సోమవారం ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చేతుల మీదుగా వర్సిటీ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసప్రసాద్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని అన్నారు. గీతం బెంగళూరు క్యాంపస్‌లో బీటెక్, ఎంబీఏ కోర్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలో 25 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా కర్ణాటక విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి గాను 2014 ఏప్రిల్ 17 నుంచి మే 8 వరకూ దేశ వ్యాప్తంగా 36 కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో బళ్లారి, దావణగెరె, మంగళూరు, మైసూరు, రాయచూరు, తుమకూరు, బెంగళూరు సిటీతో పాటు దొడ్డబళ్లాపురంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రవేశపరీక్షల్లో తొలి పది ర్యాంకర్లకు ఉచిత విద్యనందిస్తామని అన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కరూర్ బ్యాంక్‌లలో లభిస్తాయన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను 2014 మే 15న ప్రకటిస్తామని అన్నారు. బీటెక్‌లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కోర్సులు బెంగళూరు క్యాంపస్‌లో ఉంటాయని అన్నారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వసతి సదుపాయం కల్పించినట్లు వివరించారు. గీతం విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాలలో 5 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విశాఖ స్టీల్ఫ్లాంట్, రెడ్డీస్ ల్యాబ్, ఎరిక్సన్ ఇండియా, ఐబీఎమ్ తదితర సంస్థలతో గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందాలను కలిగి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో బెంగళూరు స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ విజయభాస్కర్, రాజు, యూజీసీ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ రామకృష్ణ హాజరయ్యారు.