విశాఖ నుంచి 'గీతమ్' మూర్తి? | gitam chairman murthy to get mlc seat from vizag | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి 'గీతమ్' మూర్తి?

Published Sat, Jun 13 2015 4:57 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

విశాఖ నుంచి 'గీతమ్' మూర్తి? - Sakshi

విశాఖ నుంచి 'గీతమ్' మూర్తి?

విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గీతమ్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పేరు దాదాపు ఖరారైంది. దాంతో ఆయన సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో కలవనున్నారు. ఎంవీవీఎస్ మూర్తి పేరును చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సిఫార్సు చేసినట్లు తెలిసింది. మూర్తి గతంలో రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేశారు. గతంలో గోల్డ్స్పాట్ మూర్తిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. తర్వాత గీతమ్స్ విద్యాసంస్థలను నెలకొల్పి ఆ పేరుతో ప్రముఖుడయ్యారు.

రెండో స్థానానికి పప్పల చలపతిరావు పేరు దాదాపు ఖరారైంది. విజయనగరం టీడీపీ ఎమ్మెల్సీగా మహిళల కోటా రేసులో శోభా హైమావతి పేరు వినిపిస్తోంది. కాగా, 10 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఇప్పటివరకు మహిళా కోటా మాత్రం ఖరారు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement