
కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ
గణతంత్ర దినోత్సవం రోజున ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ
మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ
మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవాన ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మురిపించారని, తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న జిల్లాలోని 31 గ్రామాల్లో 1066 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అప్పటికే కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 81,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన 80వేల మందికి పైగా దరఖాస్తుదారులు తమకు కార్డు ఎప్పుడొస్తుందనే ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తకార్డుల పంపిణీకి బ్రేక్‌పడిందని కొన్నాళ్లపాటు చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం కార్డులు అందజేసేందుకు ఏం అడ్డంకి ఉందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికై నా ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో నూతన కార్డులు జారీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
మార్పులు, చేర్పులపై కనిపించని స్పందన
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం గత ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు పౌర సరఫరాలశాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లను స్థానికంగా కార్డుల్లో చేర్చాల్సి ఉంది. అలాగే పిల్లల పేర్లనూ చే ర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చే సుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదుకాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త కార్డుల జారీ లో జాప్యం, మార్పులు చేర్పుల అంశంపై ‘సాక్షి’ పౌర సరఫరాల శాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.
హామీని నిలబెట్టుకోవాలి
కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రజలకు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు ఒక లా ఆ తరువాత మరోలా కార్డుల జారీపై మాట మా ర్చడం సరికాదు. నూతన కార్డులు జారీ చేయడంతో పాటు మార్పులు, చేర్పులు చే యాలి.
– తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్
నిర్లక్ష్యం తగదు
కొత్త కార్డుల జారీని ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎంతో మంది కార్డులు వస్తాయని ఆశతో ఉన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్ర భుత్వం కార్డులు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూడా అదే విధా నం కొనసాగించడం సరికాదు.
– పెద్దరాజారెడ్డి, మాజీ సర్పంచ్, గుమ్మిర్యాల్
Comments
Please login to add a commentAdd a comment