code
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లోని అన్ని మాడ్యూళ్లను రద్దు చేసి ఒకటే మాడ్యూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని రెవెన్యూ చట్టాల స్థానంలో ఒకటే చట్టాన్ని (రెవెన్యూ కోడ్) అమల్లోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్ పునరి్మర్మాణ కమిటీతోపాటు గతంలో నల్సార్ విశ్వవిద్యాలయం చేసిన సిఫార్సు మేరకు రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈ కోడ్ ముసాయిదా తయారీలో నిమగ్నమైన రెవెన్యూ వర్గాలు త్వరలోనే ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో 124 రెవెన్యూ చట్టాలు, నియమాలు అమల్లో ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)తోపాటు సర్వే, భూ రికార్డుల నిర్వహణ, సీలింగ్, కౌలు, రెవెన్యూ రికవరీ, భూ ఆక్రమణ నిరోధం, రెవెన్యూ పరిపాలన, భూదాన్, ఇనాం, వదిలివేయబడిన భూములు, భూవివాదాల పరిష్కారం... ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ప్రస్తుతం కూడా అమల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ తెలంగాణకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని.. వాటిలో 20కిపైగా కాలంచెల్లిన చట్టాలున్నా యని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భూచట్టాల నిపుణులు పేర్కొన్నారు.కానీ ప్రభు త్వం దీన్ని పెడచెవిన పెట్టింది. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటయ్యాక రెవెన్యూ వ్యవస్థ అమల్లో గందరగోళాన్ని నివారించేందుకు ఒకటే రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలంచెల్లిన ఆ చట్టాలను రద్దు చేయడంతోపాటు అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 5 వేల భూ చట్టాలను అధ్యయనం చేసి అందులో అవసరమైన చట్టాలను తెలంగాణకు వర్తింపజేస్తూ రెవెన్యూ కోడ్‌లో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులకూ సులభతరం... నిజాం హయాంలో తెలంగాణ ప్రాంత భూపరిపాలన, రెవెన్యూ వ్యవస్థ అమలు కోసం భూమి రెవెన్యూ చట్టం–1907 పేరుతో సమగ్ర చట్టం అమల్లో ఉండేది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఈ చట్టం స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ 124 చట్టాలుగా మార్చారని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యల పరిష్కారం సంబంధిత అధికారులకు సులభతరం కావడంతోపాటు భూమి హక్కులను కాపాడుకునే విషయంలో రైతులకు కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.ఏ చట్టం ద్వారా ఏ సమస్య పరిష్కారమవుతుంది, ఏ అధికారి వద్దకు వెళ్లాలనే విషయంలో కూడా అన్నదాతలకు గందరగోళం పోతుందని చెబుతున్నారు. యూపీలో 2016లోనే ఈ కోడ్ అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం ఒడిశాలోనూ కోడ్ అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యలు, రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. సౌకర్యవంతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా భూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన చట్టాలను అమలు చేసుకుంటున్నాయి. యూపీలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వచ్చాక అక్కడ మారిన పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూచట్టాల్లో ఉన్న గందరగోళం పోతుంది. – ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు -
టీఎస్‌కు బదులు ‘టీజీ’!
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను తెలిపే ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్తరూపంలో ‘టీజీ’గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్‌ను ‘టీజీ’గా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనితోపాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించనున్నట్టు తెలిసింది. గ్రూప్–1 పోస్టులు పెంపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్–1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వివిధ శాఖలు/విభాగాల్లో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1,049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ‘బడ్జెట్’ తేదీల ఖరారు శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించే తేదీని కేబినెట్ ఖరారు చేయనుంది. సమావేశాల తొలిరోజున గవర్నర్ తమిళిసై చేయనున్న ప్రసంగాన్ని ఆమోదించనుంది. 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వంయోచి స్తోంది. 9న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ చట్ట సవరణ, పీఆర్ చట్ట సవరణ, సిటీ సివిల్ కోడ్ చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ధరణిపై అధ్యయన కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికపై కూడా సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రాష్ట్ర గవర్నర్ గతంలో నిలిపివేసిన బిల్లులను తిరిగి పరిశీలన కోసం పంపాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కులగణనపై చర్చ.. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖల మంత్రులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమల్లోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఏ మేర ఆర్థిక భారం పడుతుందన్నది పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఏ రాష్ట్రమో తెలిపే ‘కోడ్’ అది.. వాహనాల నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లలో వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో తెలియజేసేలా కోడ్ ఉంటుంది. తెలంగాణ ఏ ర్పాటై, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. వాహనాల నంబర్లో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’ అనే అక్షరాలను పొందుపర్చాలని నిర్ణయించింది. అప్పటి టీఆర్ఎస్ పార్టీ పేరును పోలినట్టుగా ‘టీఎస్’ అనే అక్షరాలను కోడ్‌గా ఖరారు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ అనే స్టేట్ కోడ్‌ను వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. -
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్‌కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్‌ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
ఏపీలో యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన
-
ఫేస్బుక్ పోస్ట్..‘సీ విజిల్’ అలర్ట్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్‌బుక్‌పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్ అభినందన్‌తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్‌తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తదితరులు ఉన్నారు. అభినందన్‌ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్’ యాప్‌కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్బుక్ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్ దాడి, అభినందన్ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్ పత్రిక పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభినందన్ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది. -
కోడ్ వీరికి వర్తించదా..?
సాక్షి,ఇచ్ఛాపురం రూరల్: ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది. అయితే టీడీపీ నాయకులు ఉన్న గ్రామాల్లో మాత్రం కోడ్ వర్తించని విధంగా ఉంది. ఇచ్ఛాపురం మండలం కొఠారీ, తులసిగాం గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ సుజలధార ట్యాంక్‌పై బొమ్మలను అధికారులు తొలగించలేదు. అదే విధంగా ఇన్నేశుపేట జంక్షన్లో ఉన్న విశ్రాంతి భవనంపై ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లతో ఉన్న బోర్డు, పాఠశాలల గోడలపై ఉన్న టీడీపీ ప్రచార బోర్డులను తొలగించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. -
మీకు కోడ్ అడ్డు కాదు!
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వ పనికి ‘కోడ్’ అడ్డం పడుతోంది. దీనివల్లే జీహెచ్ఎంసీలో ప్రతి గురువారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశాలు సైతం నిర్వహించడం లేదు. మూడు మాసాలకోసారి నిర్వహించాల్సిన సాధారణ సర్వసభ్య సమావేశాలను సైతం మరచిపోయారు. అలాగే నడుస్తున్న ఆర్థిక సంవత్సర(2018–19) బడ్జెట్ సవరణపైన, కొత్త బడ్జెట్(2019–20) రూపకల్పనపైన అధికారులు సంశయంలో పడ్డారు. ఎన్నికల కోడ్ లేనట్లయితే అక్టోబర్–నవంబర్‌లో నడుస్తున్న బడ్జెట్‌కు సవరణలు చేయడంతో పాటు రాబోయే ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్‌ను రూపొందించేవారు. నిర్ణీత క్యాలెండర్ మేరకు అక్టోబర్ నుంచి కొత్త బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి నవంబర్ 10వ తేదీ నాటికి స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపేవారు. డిసెంబర్ 10వ తేదీలోగా జనరల్ బాడీ సమావేశం ముందుంచేవారు. ఎన్నికల కోడ్ వీటికి వర్తిస్తుందో, లేదో సంశయాలుండటంతో ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ స్పష్టత నివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. అందుకు బదులిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ చట్టబద్ధమైన కార్యక్రమాలను, నిర్ణీత వ్యవధుల్లో నిర్వహించాల్సిన సమావేశాలను ఆపాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, సదరు సమావేశాల్లో ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోరాదని, ఎలాంటి ప్రకటనలు కూడా చేయరాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. దినవారీ కార్యక్రమాల నిర్వహణ, అత్యవసర అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చునని స్పష్టం చేసినట్టు సమాచారం. క్యాలెండర్ మేరకు బడ్జెట్ ప్రక్రియ ఇలా.. ♦ నవంబర్ 10వ తేదీలోగా స్టాండింగ్ కమిటీ ముందుకు ముసాయిదా బడ్జెట్ ♦ డిసెంబర్ 10వ తేదీలోగా జనరల్‌బాడీ సమావేశం ముందుకు ♦ ఫిబ్రవరి 20 లోగా పాలకమండలి ఆమోదం ♦ అనంతరం సమాచార నిమిత్తం ప్రభుత్వానికి నివేదన -
ఐపీసీ (సెక్షన్)171
ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని సైతం ఉల్లంఘిస్తుంటారు. మద్యం, డబ్బు పంపిణీ, నిషేధిత ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం తదితరాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో నియమావళిని ఉల్లంఘిస్తే పట్టుకోవడం మరింత సులువవుతుంది. వీటన్నింటిని పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక కథనం. సాక్షి,ఆలేరు : ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) ఐసీసీ సెక్షన్ 171 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అవి నిరూపితమైతే ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు అతిక్రమించిన నిబంధనలకు అనుగుణంగా సబ్‌క్లాజ్‌ల వారీగా కేసులు నమోదు చేయాలంటే ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిరూపణ జరిగితే అనర్హుడిగా ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఒక్కోసారి ప్రజాప్రతినిధి పదవికి గండం వచ్చే ప్రమాదముంది. కోడ్ ఉల్లంఘిస్తే సెక్షన్ 171లోని సబ్‌క్లాజ్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. వీటి ప్రకారం జరిమానా లేదా జైలు శిక్షతోపాటు జరిమానా కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఇవి నిరూపితమైతే ప్రజాప్రాతినిధ్య చట్టం (1961) ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. నేర నిరూపణ జరిగితే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎన్నికల సెక్షన్–171 (ఎ) అభ్యర్థి ఎన్నికల హక్కులను తెలియజేస్తుంది. ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో అభ్యర్థులు చేయదగిన, చేయకూడని పనులను తెలియజేస్తుంది. సెక్షన్– 171(బీ) డబ్బుల పంపిణీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లు , అధికారులకు లంచం రూపంలో డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూస్తే కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్–171(సీ) స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉన్న చోట ఒత్తిడి తీసుకొచ్చినా, ఓటర్లను బెదిరించినా, ఇతరులకు ఓటు వేస్తే దేవుడు శాపం పెడతాడంటూ చెప్పినా చట్టప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది. సెక్షన్–171(డీ) ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తులు ఓటర్లను ప్రాంతీయ కులం, మతంవారీగా వేరు చేసి ప్రలోభపెట్టేలా హామీలు ఇవ్వడం, అభివృద్ధి పనులు చేయడం, వ్యక్తిత్వం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. సెక్షన్–171 (ఈ) ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సామూహిక అన్నదానాలు నిర్వహించడం, మద్యంలాంటి పానియాలు అందించడం, వినోద కార్యక్రమాలు ఏర్పాట చేయడం ఈ నిబంధన కిందికి వస్తాయి. సెక్షన్–171 (ఎఫ్) అభ్యర్థులు తమకు కేటాయించిన దాని కన్నా ఎక్కువగా సమయం తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మైకులు వాడడం, ప్రచార సామగ్రి వినియోగం, వార్తలు, ప్రకటనలు ఈ నిబంధనల కిందికి వస్తాయి. సెక్షన్–171 (జీ) అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రకటనలు చేయడం నిబంధనలకు విరుద్ధమవుతుంది. సెక్షన్–171 (హెచ్) అక్రమ చెల్లింపులు, నగదు పంపిణీ ఈ సెక్షన్ ప్రకారం నేరమవుతుంది. సెక్షన్–171 (ఐ) ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఖాతాలను ఏర్పాటు చేసి ఎన్నికలు ముగిసిన నెలలోగా ఖర్చుకు సంబంధించిన వివరాలు ఈసీకి సమర్పించడంలో విఫలం చెందితే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. -
బ్యాంకు ఖాతాకే కల్యాణలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం, ఎమ్మెల్యేలంతా మాజీలు అయిన నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం ఇకపై నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంక్షేమశాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కల్యాణలక్ష్మిపై సమీక్షించారు. అసెంబ్లీ రద్దు కారణంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకపోవడంతో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా చెక్కుల పంపిణీ చేసే అంశాన్ని సీఎస్ ప్రస్తావించారు. దీనికి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తోడు ఎన్నికల పనుల్లో కలెక్టర్లు బిజీ కావడంతో చెక్కుల పంపిణీ మరింత ఆలస్యం కావచ్చనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. దీంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదును పంపిణీ చేయాలని సీఎస్ నిర్ణయించారు. ఇకపై కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సం బంధించి వచ్చిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరించి అర్హతను నిర్ధారించాలన్నారు. అర్హత నిర్ధారణ జరిగిన మరో వారం రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నగదును బదిలీ చేసేలా ఖజానా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. -
ఆర్టీసీలో కానరాని కోడ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రకటనలు, ఫ్లెక్సీలపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదు. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. ఆర్టీసీలో మాత్రం ఇంకా ఇది అమలు కావడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఫ్లెక్సీలు, నేతల చిత్రాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. ఇంకా మొదలుపెట్టని ఆర్టీసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి మూడురోజులవుతున్నా ఆర్టీసీ దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. టీఎస్ఆర్టీసీ ప్రజారవాణా సంస్థ. ఆర్టీసీ బస్సులపై వివిధ రకాల వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ, రవాణాశాఖ, శిశుసంక్షేమ శాఖ తదితర శాఖలు తాము అమలు చేస్తోన్న పలు పథకాలు, వాటి పురోగతిపై ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా వీటిని తొలగించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. కానీ, ఇంతవరకూ ఇది అమలుకు నోచుకోవడం లేదు. ప్రతిపక్షాల విమర్శలు.. ప్రతిరోజూ కోటి మందికిపైగా ప్రయాణించే ఆర్టీసీలో ప్రభుత్వ ప్రకటనలు ఇంకా అలాగే ఉండటంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఆర్టీసీ చైర్మన్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినందునే ప్రకటనల తొలగింపుపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలంతా దీన్ని కోడ్ ఉల్లంఘనగానే ఆరోపిస్తున్నారు. ప్రయాణికులను ప్రభావితం చేసే ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటినీ తొలగిస్తాం కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య ప్రకటనలను తొలగిస్తాం. ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. తొలగింపు ప్రక్రియ మొదలైంది. దాదాపు 3000 బస్సులపై ఈ ప్రకటనలున్నాయని సమాచారం. రెండుమూడురోజుల్లో అన్ని బస్సుల్లోనూ తొలగిస్తాం. – రవీందర్, సీటీఎం, (యాడ్స్) -
కొండగట్టు సాయానికి ‘కోడ్’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లింపునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడగా, మరో 43 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
కోడ్ కూసింది!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముం దస్తు ఎన్నికల కోడ్ కూసింది. శాసనసభ రద్దయి న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం (మొత్తం 8 భాగాలకుగాను) అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి నరేంద్ర ఎన్. బెటోలియా గురువారం లేఖ రాశారు. గడువుకు ముందే శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వాలను నియమించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆపద్ధర్మ ప్రభుత్వం రోజువారీ పాలనకే కట్టుబడి ఉండాలని, విధానపర నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రణ పాటించాలని 1994లో సుప్రీంకోర్టు ఎస్ఆర్. బొమ్మాయ్ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన ఎలక్షన్ మీడియా సెల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాశ్, జాయింట్ సీఈఓ కాటా అమ్రపాలితో కలసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం మాత్ర మే రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కు మంత్రులు అధికారిక వాహనాలు, ఇతర ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ♦ రాష్ట్ర శాసనసభ రద్దయిన తర్వాత పాలనా పగ్గాలు స్వీకరించే ఆపద్ధర్మ ప్రభుత్వంపై తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం అమల్లోకి వస్తుంది. ఎన్నికలు ముగిసి కొత్త శాసనసభ కొలువు తీరే వరకు ఇది కొనసాగుతుంది. ♦ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సైతం ఈ నియమావళిలోని 7వ భాగం వర్తిస్తుంది. ♦ రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంతోపాటు రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఇతరాత్రలను ప్రకటించరాదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగంలో నిషేధించిన ఏ కార్యక్రమాలనూ చేపట్టరాదు. ♦ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వ మంత్రులు, అధికారంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ వనరులను అనధికారిక కార్యక్రమాలకు వినియోగించరాదు. అధికారిక పర్యటనలతోపాటు నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వాడరాదు. ఏకగ్రీవ తీర్మానాలపై కఠిన చర్యలు.. ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ. 5 లక్షల ముడుపులిస్తామని కొంత మంది నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలపై రజత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కేసుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు, ఎక్సైజ్, ఆదాయపన్ను శాఖలతో కలసి రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీపై నిరంతర నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాలశాఖ హైదరాబాద్‌వ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో వాటికి కోడ్ వర్తించదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రైతు బీమా, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు వస్తాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని విలేకరులు ఆడిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. హైదరాబాద్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి స్మారక భవనం ఏర్పాటుకు ఎకరా స్థలం కేటాయిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసన మండలిలో చేసిన ప్రకటన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో పరిశీలిస్తామన్నారు. -
గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకు ‘కోడ్ ఉన్నతి’
సాక్షి, న్యూఢిల్లీ: యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్ఏపీ ఇండియా, ఎల్అండ్టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ‘కోడ్ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్అండ్టీ, ఐటీసీ చారిటబుల్ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించినట్టు ఎస్ఏపీ తెలిపింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్ఏపీ ఇండియా అధ్యక్షుడు, ఎండీ దీప్‌సేన్ గుప్తా తెలిపారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-అభ్యర్థులంతా నిబంధనలు పాటించాలి -ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు వల్లభన్ పిఠాపురం : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ శక్రటరీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు కరికాల వల్లభన్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. అభ్యర్థులందరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధగా ఫ్లెక్సీలు పెట్టినా, ప్రచారాలు జరిపినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పింఛన్ల అక్రమాలు దృష్టికి రాలేదు : మెప్మా ఎండీ పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన పింఛన్ల అక్రమాలు తమ దృష్టికి రాలేదని మెప్మా ఎండీ చినతాతయ్య చెప్పారు. పాదగయ దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులు పింఛన్ల అక్రమాలపై ప్రశ్నించారు. అక్రమాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగిందని తహసీల్దారు సుగుణ చెప్పగా ఈ విషయంపై కలెక్టరుతో మాట్లాడి తెలుసుకుని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో 35 వేల మందిని వివిధ కారణాలతో పింఛన్లకు అనర్హులుగా గుర్తించి, వారి పింఛన్లను రద్దు చేశామన్నారు. ప్రతి లబ్ధిదారుడి వేలిముద్రలు తీసుకుని మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఆయా మున్సిపల్ కమిషనర్ల విజ్ఞప్తి మేరకు సిబ్బందిని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 385 మంది నేషనల్ అర్బన్ లైవ్‌హుడ్ మిషన్ కో ఆర్డినేటర్స్‌ను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. వీరిని త్వరలోనే ఎంపిక చేసి తీసుకుంటామన్నారు. మెప్మాలో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. -
దాగుడుమూత దండాకోడ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారు. కొన్నిచోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. జాతీయ నేతలతోపాటు, సేవామూర్తుల విగ్రహాలకూ ముసుగులు వేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రధాన నేతల ఫ్లెక్సీలు తొలగించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్నారు. ఈ ద్వంద్వనీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేనెల 17న జరగనున్నాయి. వారం రోజుల క్రితమే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతిచోటా ఫ్లెక్సీలు తీయించేసిన అధికారులు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుల ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఆ ఫ్లెక్సీల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఏలూరులో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉండటంతో ఇక్కడ సిబ్బంది కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న ఫ్లెక్సీలనూ తొలగించారు. నవ్విపోదురుగాక.. రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు ముసుగు వేయాలన్న నిబంధన ప్రకా రం ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు అధికారులు ముసుగు వేయడం సహజం. అయితే ఈసారి అధికారులు మరో అడుగు ముందుకేశారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందాన జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, సామాజికవేత్త జ్యోతీరావుపూలేతోపాటు సేవామూర్తి మదర్ థెరిస్సా, నీటిపారుదల వ్యవస్థ పితామహుడు, విదేశీయుడు అయిన సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహాలకూ ముసుగులు కప్పేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఇద్దరి జోలికెళ్లలేదు ! మరోవైపు అధికారులు ఇద్దరు ప్రధాన నేతల జోలికెళ్లే సాహసం చేయలేదు. దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించలేదు. చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం దుగ్గిరాలతోపాటు ఆ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలోనూ చింతమనేని పేరుతో పెట్టిన ఫ్లెక్సీలను తొలగించే యత్నం కూడా చేయలేదు. అలాగే జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సొంత మండలం నల్లజర్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటినీ తొలగించే సాహసం అధికారులు చేయడం లేదు. ఈ ఇద్దరికే మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎన్నికల కోడ్‌కు అతీతులా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రాతలు చెరిగిపోవులే! జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ గోడలపై రాయించిన రాతలు ఇప్పటికీ చెరిగిపోలేదు. వీటిపై తెల్ల రంగు వేయడానికి అధికారులు సాహసించడం లేదు. గ్రామాల్లో అధికారపార్టీ ప్లెక్సీలు, గోడ రాతలు చెరిపేయడానికి పంచాయతీ అధికారులు ముందుకు రావడం లేదు. విద్యుత్ స్తంభాలపై ప్రభుత్వ ప్రకటన లూ అలాగే ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై ఉన్న నినాదాలపై అధికార పార్టీ రంగు పసుపును పూశారు. మసి సి మారేడుకాయ చేసిన చందంగా కోడ్‌ను అపహాస్యం పాల్జేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కోడ్ అమలు చేయాల్సి ఉంది. -
రత్నగిరిపై ‘శిఖ’పట్లు
పురోహితులు శిఖ ధరించాలని ఈఓ ఆదేశాలు వ్యతిరేకిస్తున్న కొంతమంది పురోహితులు స్వామీజీ సలహాలు కోరేందుకు పురోహితుల ప్రయత్నం అన్నవరం : రత్నగిరిపై వ్రతాలు చేయించే పురోహితులు వైదిక నియమావళి, శిఖ ధారణ తదితర అంశాలతో కూడిన కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పక పాటించాలని ఈఓ కె.నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాలు ఆ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని అనుసరించేవారు కొందరైతే, మరి కొంతమంది వీటిలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఈవో ఇచ్చిన ఈ ఆదేశాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీనిపై పురోహితుల మధ్య చర్చ నడుస్తుండగా కోడ్ పాటించని పురోహితులపై వేటు వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వైదిక వృత్తిలో ఉండే పురోహితులు నడవడిక, వేషధారణ (కోడ్ ఆఫ్ కాండక్ట్ )కలిగి ఉండాలా? తప్పని సరిగా గుండు గీయించుకుని వెనుక వైపు పిలక కలిగి ఉండాల్సిందేనా? దీనిపై శాస్త్రం ఏమి చెప్పింది..? గతంలోలా ఇప్పుడు కూడా ఉండాల్సిందేనా..? రోజులు మారాయి కాబట్టి మేము కూడా మారతామని, అటువంటి సంప్రదాయాలును పూర్తిగా పాటించలేమని యువ పురోహితులు చెబుతున్న దాంట్లో వాస్తవముందా..? ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలోని వ్రతాల విభాగంలో వ్రతపురోహితుల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నెల మొదటి వారంలో దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు వ్రతపురోహితులు తప్పక కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాలని ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా శిఖ, వస్త్రధారణ తదితర విషయాలలో శాస్త్రం నిర్ధేశించిన దాని ప్రకారం ఉండాలని, లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి నుంచి దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దేవస్థానంలోని 214 మంది వ్రత పురోహితుల్లో పాత తరానికి చెందిన సుమారు 125 మంది వరకూ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారిలో సగం మంది పూర్తిగా గుండు గీయించుకోకుండా తల తగ్గించుకుని వెనుక వైపు పిలక ధరించారు. మిగిలిన వారు శిఖ ధారణ తప్ప మిగిలినవన్నీ పాటిస్తున్నారు. వర్గాలుగా విడిపోయిన పురోహితులు దేవస్థానం ఈవో ఇచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆదేశాలకు అనుగుణంగా కొంతమంది, వ్యతిరేకంగా మరి కొంతమంది రెండు వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ఆ ఆదేశాలను అమలు చేయాలంటే మరికొంతమంది ఆ ఆదేశాలలో కొన్నింటి అమలుపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలను వ్యతిరేకించేవారు కొత్తగా ఎన్నికైన పురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వర్గాల నేపథ్యంలోనే ఇటీవల ఓ పురోహితుడి సస్పెన్షన్ వివాదాస్పదమైంది. ఆదేశాల్లో స్పష్టత లేదంటున్న పురోహితులు పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలని ఇచ్చిన ఆదేశాలలో శిఖ ధారణ విషయమై స్పష్టత లేదని కొంతమంది పురోహితులు అభిప్రాయపడుతున్నారు. అసలు పురోహితుల శిఖధారణ (పిలక ధారణ)ఐదు రకాలుగా ఉంటుంది. అందులో ఏది పాటించాలో వివరంగా తెలియచేయాలని కొంతమంది అంటున్నారు. అవేమీ చెప్పకుండా శిఖ ధారణ ఉండాలని ఆదేశాలివ్వడం, పాటించకపోతే చర్యలుంటాయని చెప్పడం సబబు కాదంటున్నారు. కొందరు యువతరం పురోహితులైతే బలవంతంగా తమ చేత శిఖధారణ చేయించాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పిలక ధరించి ఉంటే తమకు వివాహాలు కావడం లేదని వారు వాపోతున్నారు. స్వామీజీ సూచనల కోసం పురోహితులు దేవస్థానం పురోహితుల శిఖ ధారణపై తగిన సూచనలివ్వాలని కొంతమంది పురోహితులు తునిలోని ఓ ప్రముఖ స్వామీజీని కలిసి కోరనున్నట్టు తెలిసింది. ఆ స్వామీజీ సూచనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించినట్టు పురోహితులు చెబుతున్నారు. ఇందు కోసం ఈఓని పది రోజులు గడువు అడిగినట్టు సమాచారం. పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందే ఈఓ దేవస్థానంలో పనిచేసే పురోహితులంతా కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందేనని ఈఓ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దీనిపై పది రోజులు గడువు కావాలని పురోహితుల సంఘం కార్యదర్శి బండి నర్శింహమూర్తి అడిగారని దానికి అంగీకరించామన్నారు. పది రోజుల తరువాత కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. -
‘గ్యాస్’ కాలపరిమితి.. గుర్తించేదెలా?
మనం వాడే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది. అది తినే వస్తువు కావొచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడే మందులు కావొచ్చు.. ఇంట్లో ఉపయోగించే వస్తువు కావొచ్చు. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అన్ని వస్తువులపై పలానా సంవత్సరం.. పలానా నెలలో డేట్ అయిపోతుందని ముద్రించి ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఒక ‘కోడ్’ రూపంలో దాని కాలపరిమితి ముద్రించి ఉంటుంది. మరి ఆ కోడ్‌ను ఎలా గుర్తించాలి..? ఏ నెలలో దాని కాలపరిమితి ముగుస్తుంది..? తదితర విషయాలు మీకోసం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * ప్రతి సిలిండర్‌పై ప్రత్యేక ‘కోడ్’ * దానిని బట్టే కాలపరిమితి గుర్తింపు * వినియోగంలో జాగ్రత్త సుమా! ప్రయోజనం.. ⇒ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ‘ఆల్ఫా న్యూమరికల్’ పద్ధతిలో ముద్రితమై ఉంటుంది. ⇒ సిలిండర్ హ్యాండిల్ రాడ్ వద్ద ఏదో ఒకదానిపై ఒక ఇంగ్లిష్ అక్షరం, రెండు సంఖ్యలు ముద్రించి ఉంటాయి. ⇒ ఇంగ్లిష్ అక్షరం సిలిండర్ కాల పరిమితిలో నెలను.. పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదా: సిలిండర్‌పై ‘డి 16’ అని ఉందనుకుంటే.. ‘డిసెంబరు- 2016’ సంవత్సరానికి దాని కాలపరిమితి ముగుస్తుందని అర్థం. ⇒ ఇక్కడ నెలను ముద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు. ⇒ సంవత్సరంలోని 12 నెలలను ‘ఎ,బి,సి,డి’గా విభజించారు. వీటిలో ఒక్కోదానికి మూడు నెలలుగా కేటాయించారు. ⇒ అంటే ‘ఎ’ సిరీస్‌కు మెదటి భాగం మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి), ‘బి’ సిరీస్‌కు రెండో భాగం మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్), ‘సి’ సిరీస్‌కు (జూలై, ఆగస్టు, సెప్టెంబరు), ‘డి’ సిరీస్‌కు నాలుగో భాగం మూడు నెలలు (అక్టోబరు, నవంబరు, డిసెంబరు)గా ఉన్నాయి. ⇒ సిలిండర్‌పై ‘ఎ’ ఉంటే మార్చి వరుకు, ‘బి’ ఉంటే జూన్ వరకు, ‘సి’ ఉంటే సెప్టెంబరు వరకు, ‘డి’ ఉంటే డిసెంబరు వరకు అని అర్థం. ఉదా: ‘ఎ 20’ అని ఉంటే.. ‘మార్చి 2020’ నాటికి సిలిండర్ గడువు ముగుస్తుంది. సూచన: కాలపరిమితి అయిన సిలిండర్‌ను గుర్తించి అప్పుడే మార్చుకోవాలి. లేకపోతే దాన్ని వాడే సమయంలో ఒత్తిడికి గురైనా, దాన్ని అలాగే వాడినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. -
పోరు షురూ
కర్నూలు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు మే నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ఏడు టీములను(వీడియో సర్వే లైన్ టీమ్, వీడియో వీవింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వే లైన్స్ టీమ్, మెడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, సెక్టోరల్ ఆఫీసర్ టీమ్) నియమించారు. ఈ బృందాలకు బుధ, గురువారాల్లో శిక్షణనివ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ.. 21న పరిశీలన.. 23న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు. మే నెల 7న పోలింగ్ నిర్వహించనుండగా.. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లా మొత్తం మీద 29,64,148 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,959 మంది అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో 1400, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల వ్యయం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొద టి స్థానంలో ఉన్నట్లు వెల్లడయిం ది. ఈ దృష్ట్యా వ్యయ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీలోని అభ్యర్థులు నచ్చకపోతే ఆ విషయాన్ని ఓటర్లు స్పష్టం చేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేపట్టింది. ఈవీఎం లోని బ్యాలెట్ యూనిట్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. పేర్ల కింద నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ) అనే బటన్ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న వారెవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కి ఓటరు అభిప్రాయం వెల్లడించే అవకాశం కల్పించారు. -
ఓటర్లకు గాలం!
రాష్ర్టంలో ఎన్నికల వాతావరణ క్రమంగా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాస్వామ్య కూటమి యత్నిస్తోంది. నజరానాలు భారీగా ప్రకటిస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చేలోగా వీలైనన్ని ‘సంక్షేమ’ పథకాలను ప్రకటించి, ప్రజల అనుగ్రహాన్ని సంపాదించేందుకు పావులు కదుపు తోంది. సర్కారు ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. సాక్షి, ముంబై:మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మించిన ఇళ్లలో నివాసముంటున్న పేద ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. మాడా నిర్మించిన భవనాలను మాడా పరిపాలన విభాగం ద్వారా తిరిగి అభివృద్ధి చేయించుకుంటే ఒక్కొక్కరికి కనీసం 405 చదరపు అడుగుల ఇల్లు లభించనుంది. అంతేగాక నివాసులకు కార్పస్ ఫండ్ కూడా లభించనుంది. దీన్ని వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ, శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2014 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా మాడా నిర్మించి సిద్ధంగా ఉంచిన నాలుగు వేల ఇళ్లకు మేలో లాటరీ వేయాలని సంకల్పించింది. అందుకు అవసరమైన ప్రకటనల ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమాలి (కోడ్) అమలులోకి రాకముందే పూర్తిచేయాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. దీన్ని బట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. మాడా కాలనీల పునరాభివృద్థి పనులు ప్రైవేటు బిల్డర్ల ద్వారా కాకుండా మాడా ద్వారా చేయించుకుంటే 10 శాతం చ.ట. అదనంగా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని ఎన్నికలు సమీపించడంతో ఓటర్లను సంతోషపెట్టేందుకు 10 శాతానికి బదులుగా 15 శాతం చ.ట. అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అందుకు నియమాలలో అవసరమైన మార్పులు చేసినట్లు మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి చెప్పారు. సాధారణంగా ప్రైవేటు బిల్డర్లు ఎక్కువ చ.ట. ఇల్లు, పెద్ద ఎత్తున కార్పస్ ఫండ్ ఇస్తామని ఆశ చూపించి నివాసులను మోసం చేస్తున్నారు. కాని ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంవల్ల ప్రైవేటు బిల్డర్ల మోసాలకు ఇక కళ్లెం పడనుంది. నివాసులు ప్రైవేటు బిల్డర్లను కాదని మాడా వద్దకు రావాలని, వారు ఇచ్చే అదనపు చ.ట. భారీగా కార్పస్ ఫండ్ తదితర సదుపాయాలను మాడా కూడా ఇస్తుందని గవయి వెల్లడించారు. కొన్ని సందర్భాలలో ప్రైవేటు బిల్డర్లు చెల్లిస్తున్నంత కార్పస్ ఫండ్ ఇవ్వకున్నప్పటికీ కొద్దిగా అటు, ఇటుగా మాడా చెల్లించనుందని ఆయన ధీమా వ్యక్తం చే శారు. 2014 మేలో మాడా, కొంకణ్ మండలి నిర్మించిన ఇళ్లకు సంయుక్తంగా లాటరీ వేయనున్నారు. కొంకణ్ మండలికి చెందిన విరార్‌లో 2,500 ఇళ్లు, మాడాకు చెందిన ముంబైలోని వివిధ ప్రాంతాల్లో 1,500 ఇలా మొత్తం నాలుగు వేల ఇళ్లకు లాటరీవేసి అర్హులైన పేదలకు చౌక ధరకే ఇల్లు అందజేయనుంది.