సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లింపునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడగా, మరో 43 మంది గాయపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment