గ్రామీణ డిజిటల్‌ అక్షరాస్యతకు ‘కోడ్‌ ఉన్నతి’ | SAP India Launches 'Code Unnati' to Impart Software Skills, Digital | Sakshi

గ్రామీణ డిజిటల్‌ అక్షరాస్యతకు ‘కోడ్‌ ఉన్నతి’

Jun 16 2017 1:27 AM | Updated on Sep 5 2017 1:42 PM

గ్రామీణ డిజిటల్‌ అక్షరాస్యతకు ‘కోడ్‌ ఉన్నతి’

గ్రామీణ డిజిటల్‌ అక్షరాస్యతకు ‘కోడ్‌ ఉన్నతి’

యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

సాక్షి, న్యూఢిల్లీ: యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ‘కోడ్‌ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్‌ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే..

ఎల్‌అండ్‌టీ, ఐటీసీ చారిటబుల్‌ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్‌ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించినట్టు ఎస్‌ఏపీ తెలిపింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్‌ఏపీ ఇండియా అధ్యక్షుడు, ఎండీ దీప్‌సేన్‌ గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement