
పటాన్‌చెరు: కరోనా బాధితులకు చేయూతనిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధికి, గీతం యూనివర్సిటీ (గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చింది. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ శనివారం ఈ చెక్కును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ మేరకు రుద్రారంలోని హైదరాబాద్ గీతం యూనివర్సిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఆర్‌ను కలసిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గీతం హైదరాబాద్ అడిషనల్ వీసీ ప్రొ.ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ ఉన్నారు. గీతం విద్యాసంస్థల వితరణను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment