donates
-
సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 కోట్లు అందజేసింది. ఈమేరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చైర్పర్సన్ నీతా అంబానీ తరపున జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు. సీఎంని కలిసినవారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావు ఉన్నారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి క్రెడాయ్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు. -
Ravi Raheja: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె.రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు. -
వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. -
Rahul Gandhi: వయనాడ్ బాధితులకు విరాళంగా నెల జీతం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) అందజేశారు.2 లక్షల తన విరాళానికి సంబంధించిన రశీదును ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని రాహుల్ పిలుపునిచ్చారుOur brothers and sisters in Wayanad have endured a devastating tragedy, and they need our support to recover from the unimaginable losses they have faced.I have donated my entire month's salary to aid in the relief and rehabilitation efforts for those affected. I sincerely urge… pic.twitter.com/GDBEevjg5y— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2024కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్ విత్ వయనాడ్–ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.ఇదిలా ఉండగా, జూలై 30న భారీ వర్షాలు, వరదలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వయనాడ్‌లో భారీగా మట్టిపెళ్లలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది -
TTD: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటి రూపాయలు విరాళం
తిరుపతి, సాక్షి: బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ శ్రీ మధుసూధన్ టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టిటిడి అదనపు ఈవో కార్యాలయంలోదాత టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సంపదనంతా దానం ఇచ్చేస్తున్న వారెన్ బఫెట్!
బెర్క్‌షైర్ హతావే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ రూ.44,200 కోట్లు దానం చేస్తున్నారు. ప్రపంచంలో 10వ అత్యంత సంపన్నుడైన బఫెట్ 5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం.సంపాదనకు, సంపదకు మారుపేరైన వారెన్ బఫెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించిన విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు (సుమారు 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు.తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్ విరాళంగా ఇచ్చారు.ఉన్నదంతా ఇచ్చేసే ఆలోచనబెర్క్ షైర్లో1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని 93 ఏళ్ల బఫెట్ యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీలునామాను ఆయనతదనంతరం ఆయన పిల్లలు అమలు చేయనున్నారు. బెర్క్‌షైర్ సుమారు 880 బిలియన్ డాలర్ల సమ్మేళనం. ఇది బీఎన్ఎస్ఎఫ్ రైల్రోడ్, గీకో కార్ ఇన్సూరెన్స్, యాపిల్ వంటి స్టాక్స్‌తో సహా డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది. -
హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..
ఛండీగఢ్: హనుమాన్ దేవాలయంలో ఓ దొంగ రూ.10 దేవునికి సమర్పించి రూ.5000 దోచేశాడు. ఈ ఘటన హర్యానా రేవారి జిల్లాలోని ధరుహేరా పట్టణంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొదట గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ.. హనుమంతుని పాదాల చెంత చేరి ప్రార్థన చేశాడు. పూజారి ముందే 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీషా చదువుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రార్థన అనంతరం చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ తాళాని పగులగొట్టాడు. రూ.5000 చోరీ చేశాడు. దోపిడీ జరిగిందని గుర్తించని పూజారి గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా.. అసలు విషయం బోధపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
మహానేరగాడిలో వికసించిన మానవత్వం.. రూ.10 కోట్లు విరాళం
ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరీ సుఖేష్.. కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. లేఖలో ఏమని రాశాడంటే.. "నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు. మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం, ప్రమాద బాధితులు, ప్రభుత్వం ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
భూదానం తరతరాలు నిలిచిపోతుంది: మంత్రి ఉష శ్రీ చరణ్
-
వెంకన్న అంటే ఎంత ప్రేమో రష్యా భక్తుడు లక్షల్లో విరాళం..!
-
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాన్ని 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాములతో తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌కు ఈ ఆభరణాన్ని అందించారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్వామివారికి కానుకను సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: భద్రతకు గట్టి భరోసా -
AP: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం
గుంటూరు మెడికల్: ఓ డాక్టరమ్మ తాను వైద్య విద్యను అభ్యసించిన కళాశాలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అమెరికాలో 40 ఏళ్ల కిందట స్థిరపడి, ఇమ్యునాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింఖానా)కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)కి డాక్టర్ ఉమ గవిని విరాళం ప్రకటించారు. అధిక మొత్తంలో విరాళం ప్రకటించిన డాక్టర్ ఉమ గవిని దాతృత్వాన్ని ప్రశంసిస్తూ అనేక పోస్టులు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెట్టారు. -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం
షిర్డీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు. ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు. -
నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్ ‘ట్విటర్’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఇటీవల పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
యాదాద్రికి శాంతా బయోటెక్నిక్స్ రూ.1.08 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు. -
ఉక్రెయిన్‌కు భారీ సాయం... పెద్ద మనసు చాటుకున్న బిలియనీర్!
Japan Billionaire in a letter addressed to Ukraines President: జపనీస్ బిలియనీర్ ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు హిరోషి మిక్కి మికిటాని ఉక్రెయిన్ ప్రభుత్వానికి రూ. 65 కోట్లు విరాళంగా అందిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి, మానవతా కార్యకలాపాల నిమిత్తం ఈ విరాళం అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన ఆలోచనలు అన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి, ప్రజలు చుట్టూనే తిరుగుతున్నాయని కూడా లేఖలో రాశారు. "శాంతియుత ప్రజాస్వామ్య ఉక్రెయిన్ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని నేను నమ్ముతాను. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోగలవని, ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు. తాను 2019లో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించి జెలెన్స్కీని కలిశానని కూడా మికిటాని చెప్పారు. రష్యా దండయాత్ర ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నుంచి విస్తృత ఆర్థిక ఆంక్షలను ప్రేరేపించేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి కూడా. జపాన్ ప్రభుత్వం మాస్కోపై ఆస్తులను స్తంభింపజేయడమే కాక రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా పలు ఆంక్షలను ప్రకటించింది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
సీఎంఆర్ఎఫ్కు యువ రైతు విరాళం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నీళ్లతో తన బీడు భూమిలో పంటలు పండించిన ఓ యువ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి పదివేల రూపాయలను విరాళంగా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు తన పంట ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచే వచ్చే ఆదాయంలో ‘పంటకు పదివేల రూపాయల’లెక్కన ఆరునెలలకోసారి సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలనే సంకల్పంతో శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.10 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. ఏదో సంస్థలో అరకొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుని తమ కాళ్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్కు కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతనికి నా అభినందనలు’అని ప్రశంసించారు. -
మానవత్వం చాటిన వైఎస్సార్ సీపీ నేత
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి): ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన సమయంలో పూరి గుడిసెలో దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని చూసి చలించిన 15వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెస్లీ ఆమెకు గూడు కల్పించేందుకు శ్రీకారం చుట్టి తన మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారికి చేర్చి, జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా పాడుబడిన పూరి పాకలో వృద్ధురాలు బొమ్మిడి లక్ష్మీ నివసిస్తోంది. భర్త చనిపోగా బంధువులు పట్టించుకోవడం మానేశారు. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి వృద్ధురాలికి వచ్చే పింఛను సొమ్ముతోనే జీవిస్తున్నారు. అవ్వతో కొబ్బరికాయ కొట్టించిన నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి ఇదిలా ఉండగా, ఇటీవల నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారానికి వచ్చిన కటికతల జాన్ వెస్లీ వృద్ధురాలిని ఓటు అడిగేందుకు వచ్చారు. ఆ సమయంలో శిథిలమైన పూరిపాకలో వర్షానికి తడిసిపోయి ఇంటి ముందు బురద, దుర్వాసనలో జీవిస్తుండటాన్ని గమనించి చలించిపోయారు. ఎన్నికల అనంతరం తాను గెలిచినా, ఓడినా వృద్ధురాలికి గూడు నిర్మిస్తానని సంకల్పించారు. అనంతరం కౌన్సిలర్‌గా గెలుపొందగా, గురువారం చైర్పర్సన్ జామి హైమావతితో కలిసి జాన్ వెస్లీ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పూరి గుడిసె స్థానంలో షెడ్డు నిర్మాణానికి వృద్ధురాలితోనే కొబ్బరికాయ కొట్టి కొత్త నిర్మాణం ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఇందుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుందన్నారు. వృద్ధురాలి కుమార్తెకు దివ్యాంగ పింఛను మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
నా కొడుకు గుండె పగిలింది, అందుకే : హీరోయిన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం) అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్లో ర్యాన్ హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
ఏపీ: అపోలో రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు. ఇవీ చదవండి: పవర్ ‘ఫుల్ ఆదా’ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
ఆపదలో భర్త: ప్రేమనే కాదు.. కాలేయాన్ని పంచింది!
సాక్షి, హైదరాబాద్: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ రాఘవేంద్రబాబు, సీఈఓ గౌరవ్ఖురానా వివరాలను వెల్లడించారు. ఆపదలో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య చేసిన సాహసం నిజంగా అభినందనీయమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరువురు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి వారి దాంపత్య జీవితంలోకి అనారోగ్యం రూపంలో పెద్ద ప్రమాదం వచ్చిపడింది. వెంకటసుబ్బారెడ్డికి గుండెపోటు రావడంతో రెండు స్టంట్లు పడ్డాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కామెర్ల రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. దీంతో గతేడాది అక్టోబర్‌లో లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి వచ్చారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. దీంతో కాలేయం దానం చేసేందుకు భార్య ముందుకు రావడంతో మార్చి రెండో వారంలో పది మంది వైద్యులతో కూడిన బృందం విజయవంతంగా చికిత్స చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిలో వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడంపై భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేశారు. -
మాకెంజీ దాతృత్వం : రూ. 20 వేల కోట్ల భారీ విరాళం
బిలియనీర్ మాకెంజీ స్కాట్ ( జెఫ్ బెజోస్ మాజీ భార్య) మరోసారి తనదాతృత్వాన్ని చాటుకున్నారు. 2.7 బిలియన్ డాలర్లు (రూ. 20వేల కోట్లకు పైమాటే) భారీ విరాళాన్ని ప్రకటించారు. గివ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలకు ఈ విరాళాలను ప్రకటించారు. చారిత్రాత్మకంగా అణగారిన, నిరాదరణకు గురైన వర్గాలు, సంఘాలకు ఈ నిధులను అందించనున్నట్టు ఒక బ్లాగ్‌లో ఆమె ప్రకటించారు. దీంతో గత ఏడాది జులై అందించిన సాయంతో పాటు మాకెంజీ విరాళాల మొత్తం విలువ 8.5 బిలియన్ డాలర్లు చేరింది. ప్రపంచంలోనే అత్యంత చురుకైనదాతగా గత ఏడాది రికార్డు సృష్టించిన మాకెంజీ గివ్ఇండియా, గూంజ్ మి, అంతారా ఫౌండేషన్ లాంటి 286 మంది ఈ డొనేషన్‌ను అందించారు. ఒక్కో సంస్థకు సుమారు 10 మిలియన్ డాలర్ల చొప్పున ఈ విరాళాలను అందించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు 2019 లో విడాకులిచ్చి, డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇంత పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో విరాళాలను స్వీకరించిన సంస్థు సంతోషాన్ని ప్రకటించాయి. కాగా మాకెంజీ దానం విలువ కొన్ని దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మరో బిలియనీర్,పరోపకారి బిల్, మెలిండా గేట్స్ గత 27 సంవత్సరాల్లో సుమారు 50 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా స్కాట్ కేవలంలో 12 సంవత్సరాలలో ఆ మొత్తాన్ని సాధించడం విశేషం. చదవండి : SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక! సంచలనం: గంగానదిలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన The largest gift in UCF’s history will fuel social mobility, student success, academic excellence & faculty research for generations to come👏 Philanthropists @mackenziescott & Dan Jewett announced a $40 million investment to strengthen proven pathways to opportunity. — UCF 😷 (@UCF) June 15, 2021 👏🏽Big NEWS! 👏🏽 We've just received the largest gift in UTSA history, $40 million from Mackenzie Scott and Dan Jewett. https://t.co/NTTk5aOPGK #UTSA #StudentSuccess pic.twitter.com/Azgv71wh3v — UTSA (@UTSA) June 15, 2021 -
సీఎం రిలీఫ్ ఫండ్‌కు డైరెక్టర్ లింగుస్వామి విరాళం
చెన్నై: కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే నటుడు రజనీకాంత్, శివకుమార్ కుటుంబం, అజిత్, విశాల్, దర్శకుడు శంకర్, వెట్రిమారన్ తదితరులు కరోనా నివారణ నిధికి విరాళాలు ఇచ్చారు. కాగా సోమవారం దర్శక, నిర్మాత లింగుస్వామి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు చెక్కు అందించారు. దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న లింగుస్వామి ఇటీవల కరోనా రోగుల కోసం చెన్నైలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): ముఖ్యమంత్రి సహాయనిధికి దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలసి రూ.50 లక్షల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సుబ్రహ్మణ్యం కోరారు. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం -
మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): కరోనా తీవ్రమవుతున్న తరుణంలో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు లోక్ సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తన సొంత నిధులు కోటి రూపాయలు విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌కు అందజేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపోను సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్చువల్ విధానం ద్వారా అమరావతి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవితో కలసి ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కరోనా సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్సిజన్‌తో పాటు మందులను కొనుగోలు చేసి, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. పుంగనూరు ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తమ కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలన్నారు. చదవండి: YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ -
కిడ్నీ రోగులకు ఐసీఐసీఐ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం ‘ఐసీఐసీఐ ఫౌండేషన్’ కిడ్నీ రోగులకు భారీ ఉరటనిస్తోంది. డయాలసిస్ కేంద్రాల్లో పేద రోగులకు నిరంతరాయంగా ఆపరేషన్లు జరిపేలా దిగుమతి చేసుకున్న అత్యాధునిక యంత్రాలను సేకరించి గుర్తించిన ఆసుపత్రులకు నాలుగేళ్ల వారంటీతో అందిస్తున్నట్లు ఐసీఐసీఐ ఫౌండేషన్ తెలిపింది. పేదలకు ఉచిత డయాలసిస్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని 'ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫౌండేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 దిగుమతి చేసుకున్న డయాలసిస్ పరికరాలను దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలోని పలు ఆస్పత్రులకు వీటిని ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. 60 జిల్లాల పరిధిలో అందుబాటు ధరలకే చికిత్సలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. నాలుగేళ్ల వారంటీతో వీటిని అందించనున్నట్టు తెలిపింది. -
నాడు-నేడుకి తానా ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు (స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల నిమిత్తం తానా ఫౌండేషన్(ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. శుక్రవారం.. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో తానా ఫౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు అందజేశారు. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ -
తెలంగాణకు మైక్రోసాఫ్ట్ భారీ సహాయం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతు పలుకుతూ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతి నిధులు వైద్య పరికరాలను అందజేశారు. తాము అందజేసిన 14 అత్యాధునిక కోవిడ్ 19 పరీక్ష యంత్రాల ద్వారా రోజుకు 3,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మైక్రోసాఫ్ట్ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రం లోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్లైన్లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన ‘విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’కు తెలంగాణ జాగృతి ద్వారా శనివారం 50 కంప్యూటర్లు, 500 కుర్చీలు విరాళమిచ్చారు. పేద విద్యార్థులు కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేక చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు అందజేసినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ద్వారా భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ కవిత సహకారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే విద్యాసాగర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: సొంత నిధులతో ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులను సమకూర్చేందుకు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సోమవారం ప్రగతిభవన్‌లో కలసి విరాళాల చెక్కులను అందజేశారు. సొంత నిధులతో ఆరు అంబులెన్సులను సమకూరుస్తానంటూ ఇటీవల కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంబులెన్సులకు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో మొత్తంగా వంద అంబులెన్సులను సమకూర్చాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి) రెండు చొప్పున, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు ఒకటి, నవీన్‌కుమార్ రెండు చొప్పున అంబులెన్సులు సమకూరుస్తున్నారు. మరో టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక అంబులెన్సుకు సంబంధించిన చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా అంబులెన్సు కొనుగోలుకు చెక్కును ఇచ్చినట్లు శంభీపూర్ రాజు వెల్లడించారు. -
సానియాకు ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిబద్ధత, గుండెధైర్యం ప్రదర్శిస్తూ గొప్ప విజయాలు అందించినందుకుగాను భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తగిన గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగాను ఆసియా ఓసియానియా జోన్లో సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా సానియా నిలిచింది. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ టోర్నీలో భాగంగా... దుబాయ్‌లో మార్చిలో జరిగిన ఆసియా ఓసియానియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచి, తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించడంలో సానియా మీర్జా కీలకపాత్ర పోషించింది. ఏడాదిన్నర వయస్సున్న తనయుడు ఇజ్హాన్ను వెంటేసుకొని ఈ టోర్నీలో పాల్గొన్న సానియా మూడు డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించింది. 2016 తర్వాత సానియా ఫెడ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. దక్షిణ కొరియా, ఇండోనేసియా, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, చైనా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 17 వేల మంది టెన్నిస్ అభిమానులు ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. సానియాతోపాటు క్వాలిఫయర్స్ విభాగంలో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా), అమెరికా జోన్లో ఫెర్నాండా గోమెజ్ (మెక్సికో), యూరప్/ఆఫ్రికా జోన్లో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డులు గెల్చుకున్నారు. క్వాలిఫయర్స్ విభాగం విజేతకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 27 వేలు)... మిగతా మూడు విభాగాల విజేతలకు 2 వేల డాలర్ల (రూ. లక్షా 51 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. అయితే ఈ ప్రైజ్‌మనీని విజేతలు తమకు నచ్చిన చారిటీ సంస్థకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. తొలి భారతీయురాలిగా ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెల్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదో పెద్ద గౌరవం. ఈ అవార్డును దేశానికి, నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. భవిష్యత్‌లోనూ భారత్‌కు నేను మరెన్నో విజయాలు అందిస్తానని ఆశిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నాను. – సానియా మీర్జా -
ఏపీ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంస్థలు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. విరాళం మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా సహాయనిధికి బదిలీ చేశారు. ఆ సంస్థ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ విరాళానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్(ఏపీ ఆయిల్ ఫెడ్) రూ.50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల ఒక రోజు వేతనం లక్షా 86 వేల 936 రూపాయలను విరాళంగా అందించింది. ఆ సంస్థ చైర్మన్ వై.మధుసూదన్‌రెడ్డి, ఎండీ శ్రీకంఠనాధరెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఏపీ మార్క్‌ఫెడ్) కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఏపీ మార్క్‌ఫెడ్ ఉద్యోగుల తరపున లక్షా 7వేల రూపాయలను అందించింది. మార్క్‌ఫెడ్ చైర్మన్ వై.మధుసూదన్‌రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ►సీఎం సహాయనిధికి ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల తరపున 7లక్షల 77వేల 979 రూపాయల విరాళాన్ని అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ వై.భానుప్రకాష్ విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ►ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్) కోటి 16 లక్షల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగుల తరపున కూడా 4 లక్షల 32 వేల 506 రూపాయలను విరాళంగా అందజేసింది. ఆ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జి.వాణీమోహన్, ఆప్కాబ్ ఎండీ డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►ముఖ్యమంత్రి సహాయనిధికి మైక్రో ఇరిగేషన్ కంపెనీలు రూ.50 లక్షల 66వేల రూపాయలు ప్రకటించాయి. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీవో హరినాథ్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. -
ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు,సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీబీసీఎల్ ఉద్యోగుల తరపున కూడా రెండు రోజుల వేతనం 86 లక్షల 5384 రూపాయలను విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పియూష్‌కుమార్ విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. (కరోనా కాలంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం) ►ముఖ్యమంత్రి సహాయనిధికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.75 లక్షలు, కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళాలు ప్రకటించాయి. మంత్రి అనిల్‌కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు పంకజ్ రెడ్డి, కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె. అనిల్ కుమార్ మొత్తం రూ.కోటి రూపాయల చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. ►కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి కాకినాడ రమ్య ఆసుపత్రి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ పితాని అన్నవరం, డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు. -
కరోనా పోరు: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం అందించారు. విరాళ చెక్కును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. ఇలా అనేకమంది ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. వారి వివరాలు.. పశ్చిమ గోదావరి : జిల్లాకు చెందిన శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ రూ.50 లక్షలు విరాళం అందించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాస్, రెడ్డి రంగబాబు(ఎండీ) విరాళ చెక్కును సీఎం జగన్‌కు అందించారు. ► వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు(ఏపి ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) ఒక రోజు వేతనాన్ని రూ. 75,50,600 విరాళంగా అందజేశారు. చెక్కుకు సంబంధించిన వివరాలను యూనియన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. సీఎం జగన్‌కు అందజేశారు. ► తణుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 58,47,833 లను విరాళంగా అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సీఎం జగన్‌కు అందించారు. ►ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు రూ.50 లక్షలు విరాళం. ఈ చెక్కును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంతరాము, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్.. ముఖ్యమంత్రికి అందించారు విశాఖ : కరోనా నియంత్రణకు ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 21.30 లక్షల చెక్కును కలెక్టర్ వినయ్ చంద్‌కు అందించారు. అలాగే మాడుగుల నియోజకవర్గం ప్రజల కూడా ముప్పై లక్షల 7 వేలు చెక్కును కలెక్టర్‌కు అందించారు. ►రేసపువాణిపాలెం ఎక్స్- సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ. 27200 విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అందజేశారు. వైఎస్సార్ కడప: పోరుమామిళ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మదర్ థెరీసా ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ వాళ్లు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేల చొప్పున విరాళం ఇచ్చారు. అనంతపురం : రాయదుర్గం పట్టణ మహిళా సంఘాల సమాఖ్య తరపున మెప్మా సంఘాలు .. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డికి లక్ష రూపాయల చెక్కను అందజేశారు. తూర్పుగోదావరి(కాకినాడ) : ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ పరుచూరి కృష్ణారావు రూ. 5 లక్షలు, పోలీసు శాఖకు రూ. 2 లక్షలు విరాళం అందజేశారు. అలాగే రాజమండ్రి హర్షవర్ధన విద్యాసంస్థల చైర్మన్ హరి ప్రసాద్.. లక్ష రూపాయలు సహాయాన్ని ఎంపీ భరత్‌రామ్‌కు అందజేశారు. కృష్ణా: కైకలూరు మండలం గోకర్ణపురం గ్రామ పెద్దలు 50వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి అందజేశారు. -
ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి మై హోమ్ ఇండస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ కె.రంజిత్‌రావు రూ. 3 కోట్లను చెక్కు రూపంలో సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. (కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్) ఏపీ సీఎం సహాయనిధికి మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఛైర్మన్ డా. అనిల్‌కృష్ణ సీఎం జగన్‌ను కలిసి రూ.కోటి రూపాయల చెక్కును అందజేశారు. రెయిన్ బో హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ కె.రమేష్ రూ.కోటి రూపాయల చెక్కును సీఎం జగన్‌కు అందించారు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ సి.శ్రీధర్ రూ.కోటి రూపాయల చెక్కు సీఎం జగన్‌కు అందజేశారు. (ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం) -
ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు తన జీతంలో సంవత్సరం పాటు ముప్పయి శాతం కోతకు ఇప్పటి కే ముందుకు రాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలను సద్వినియోగపరుస్తూ, 30 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు. రాజ్ భవన్ బడ్జెట్ కు సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్ కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ మేరకు గవర్నర్ తరపున రాజ్ భవన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. (కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్) కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ చర్యకు ఉపక్రమించారు. ముప్పయి లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి సమకూర్చిన తరుణంలో ఆ మేరకు రాజ్ భవన్ లో పొదుపు చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనాను గవర్నర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్ భవన్ లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని, స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తి నిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
సీఎంఆర్ఎఫ్కు మమత వైద్య విద్యా సంస్థ రూ.25 లక్షల విరాళం
ఖమ్మం మయూరి సెంటర్: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మమత వైద్య విద్యా సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎంఆర్ఎఫ్కు రూ.25 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ఆదివారం ప్రకటించారు. అలాగే మంత్రి పువ్వాడ పిలుపు మేరకు గత ఐదు రోజులుగా ఖమ్మంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల వరకు విరాళాలు అందజేశారు. వీటితోపాటు తాను ప్రకటించిన రూ.25 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.2 కోట్లను సీఎం కేసీఆర్‌కు మంత్రి అజయ్‌కుమార్ అందజేయనున్నారు. -
సీఎం సహాయ నిధికి గీతం రూ. 25 లక్షల విరాళం
పటాన్చెరు: కరోనా బాధితులకు చేయూతనిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధికి, గీతం యూనివర్సిటీ (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చింది. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ శనివారం ఈ చెక్కును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ మేరకు రుద్రారంలోని హైదరాబాద్ గీతం యూనివర్సిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఆర్‌ను కలసిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గీతం హైదరాబాద్ అడిషనల్ వీసీ ప్రొ.ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉన్నారు. గీతం విద్యాసంస్థల వితరణను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరుకు సహకారంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సంస్థ ప్రధానమంత్రి సహా యనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఉద్యోగులు 640మంది సైతం ముందుకు వచ్చి వారి ఒక రోజు వేతనం రూ. 9.25 లక్షలను పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొంది. -
పీఎం కేర్స్ ఫండ్ : నిర్మలా సీతారామన్ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపునకు కార్పొరేట్ దిగ్గజాలతో పాటు, పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన వంతుగా పీఎం నిధికి విరాళ మిస్తున్నట్టుగా ప్రకటించారు. తన జీతం నుండి లక్ష రూపాయలు విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందించినట్టు శుక్రవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ్ భవన్ శాఖకు తన ఖాతా నుండి లక్ష రూపాయలు డెబిట్ చేసి, పిఎం కేర్స్ ఫండ్‌కు క్రెడిట్ చేయాలంటూ ఒక లేఖ రాశారు. కరోనావైరస్ నివారణ, బాధితులకు సాయం తదితర అవసరాల నిమిత్తం ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ తో ఒక నిధిని ప్రారంభించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ ముందుకు వచ్చి ఎంత చిన్న మొత్తంగానైనా విరివిగా సాయం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పలు కంపెనీలు, సీఈఓలు, సెలబ్రిటీలు ఈ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. ముఖ్యంగా ఆర్ఐఎల్, పేటీఎంలు రూ .500 కోట్లు, కోల్ ఇండియా రూ .220 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ రూ .150 కోట్లు, ఉదయ్ కోటక్ రూ .50 కోట్లు ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, లతా మంగేష్కర్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు కూడాఈ పీఎం నిధికి అండగా నిలిచారు. అలాగే 51 కోట్ల రూపాయల విరాళాన్ని బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రోహిత్ విరాళం రూ. 80 లక్షలు
ముంబై: మహమ్మారి ‘కోవిడ్–19’పై పోరు కోసం క్రీడా లోకం తరలివస్తోంది. విరాళాల రూపంలో క్రీడాకారులు కరోనా కట్టడికి తమకు సాధ్యమైనంత సహాయ సహకారాల్ని అందజేస్తున్నారు. భారత క్రికెట్ వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం రూ. 80 లక్షల విరాళం ప్రకటించాడు. పీఎం–కేర్స్ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, ‘జొమాటో ఫీడింగ్ ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 5 లక్షలు, వీధి శునకాల సంక్షేమం కోసం రూ. 5 లక్షలు కేటా యించినట్లు రోహిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారత మాజీ కెప్టెన్, కోచ్, దిగ్గజ లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ప్రధానమంత్రి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళమిచ్చాడు. అయితే ఇచ్చిన మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా రూ.3 లక్షలు కేంద్రం, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాల కోసం కేటాయించాడు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 5 లక్షలు ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాలకు నాటా విరాళం
-
బిట్స్ పిలానీకి 7.17 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీకి పూర్వ విద్యార్థులు భారీ సాయం అందించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పారిశ్రామికవేత్త ప్రశాంత్ పాలకుర్తి, ఆయన భార్య అనురాధ బిట్స్ పిలానీకి రూ.7.17 కోట్ల(మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. రాజస్తాన్ క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం( 1978–83 బ్యాచ్) సందర్భంగా ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ప్రస్తుతం అమెరికా కేంద్రంగా రెఫ్లెక్సిస్ అనే కంపెనీని నడుపుతుండగా, అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే ఎంటర్టైన్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై బిట్స్ పిలానీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.సౌవిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘పాలకుర్తి ప్రశాంత్, అనురాధ దంపతులు అందజేసిన భారీ విరాళాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బిట్స్ పిలానీని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.100 కోట్లతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నాం. అంతర్జాతీయంగా పరిశోధన అంశాలపై దృష్టి సారించే ఫ్యాకల్టీతో పాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్, రీసెర్చ్ స్కాలర్లను ఆకర్షించేలా బిట్స్ పిలానీని తీర్చిదిద్దుతాం. ఈ గొప్ప ప్రయత్నానికి తమవంతు సహకారం అందించాలని సంస్థ పూర్వ విద్యార్థులను కోరుతున్నాం’ అని తెలిపారు. 200 మంది పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పాలకుర్తి మాట్లాడుతూ..‘ 40 సంవత్సరాల క్రితం మా ప్రయాణం ఇక్కడే (బిట్స్ పిలానీ) మొదలైంది. జీవితంలో ఎదిగేందుకు మాకు ఎంతో సాయం చేసిన ఈ సంస్థకు ఎంతోకొంత తిరిగివ్వాలని భావించాం’ అని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ‘డెజర్ట్ స్ట్రోమ్’ పేరుతో అనురాధ సంగీత విభావరి నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య... హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ప్రశాంత్ పాలకుర్తి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. అనంతరం బిట్స్ పిలానీ నుంచి గణితం, మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తన జూనియర్ అయిన అనురాధను పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత అమెరికాకు వెళ్లి 2001లో రిఫ్లెక్సిస్ సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించారు. స్టోర్ల నిర్వహణ, వినియోగదారుల్ని ఆకర్షించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి రిటైల్ మేనేజ్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. నేపథ్య గాయని అయిన అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే కంపెనీని ఏర్పాటుచేసి సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. మసాచుసెట్స్ రాష్ట్రం వెస్టన్‌లో ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కేరళ వరదలు: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ విరాళం
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేరళ వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించింది. పదికోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కేరళలో వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటు ఆగస్టు మాసానికి సంబంధించి పలు లోన్లపై చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలకు అండగా నిలబడాలని తాము భావించామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి చెప్పారు. త్వరలోనే కేరళ ప్రజలు కోలుకొని సాధారణమైన స్థితికి చేరుకోవాలని ప్రార్థించారు. గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని బ్యాంకు తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అంతేకాదు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నామని బ్యాంకు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు లాభాపేక్ష లేని స్థానిక భాగస్వాముల సహాకారం ఈ కార్యక్రమాలను సుదీర్ఘ ప్రణాళికగా చేపడతామని వివరించింది. -
కేరళ వరదలు: ఈ దండి గుండెకు దండాలు
సాక్షి, చెన్నై: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవత్వంతో స్పందించే మంచి మనుషులు, పెద్దమనుషుల గురించి మనకు తెలుసు. అయితే బాధితుల కష్టాల పట్ల చలిస్తున్న ‘పెద్ద’మనుసున్న చిన్నారుల గురించి తెలుసుకుంటే.. బాలలు కల్లకపట మెరుగని కరుణా మయులే అనింపిచకమానదు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన ఓ బాలిక చేసిన సాయం విశేషంగా నిలిచింది. గుండె ఆపరేషన్‌కోసం విరాళాల రూపంలో సేకరిస్తున్న సొమ్మును కేరళ వరద బాధితులకు డొనేట్ చేసి అపారమైన తన దాతృత్వ గుణాన్ని చాటుకుంది. కేరళ వరద బాధితుల గాధల్ని టీవీలో చూసిన అక్షయ(12) చిన్ని గుండె కదిలిపోయింది. అందుకే తనకు డబ్బులు ఎంత అవసరమో తెలిసినా, నిస్వార్ధంగా స్పందించింది. 5వేల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఎందుకంటే పుట్టుకతోనే హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న అక్షయకు ఇప్పటికే ఒకసారి (నవంబర్, 2017)లో ఒకసారి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఇపుడు మళ్లీ తీవ్ర సమస్యలు తలెత్తడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన అక్షయ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన సొమ్మును సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 20వేలు సమకూరాయి. ఈ డబ్బులోంచే ఇపుడు 5వేల రూపాయలను కేరళ వరద బాధితులకు దానం చేయడానికి ముందుకు వచ్చింది. అక్షయ తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తాంతోనిమలై సమీపంలో కుమారపలయం అనే చిన్న గ్రామంలో పుట్టింది. అక్షయ తల్లి జోతిమణి. తండ్రి ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ దంపతుల ముగ్గురి కుమార్తెల్లో పెద్ద పాప అక్షయ. రోజువారీ వేతన వ్యవసాయ కార్మికాలిగా పనిచేస్తూ తల్లి జోతిమణి కుటుంబాన్నిఒంటరిగా నెట్టుకొస్తోంది. మొదటిపారి గుండె ఆపరేషన్ కోసం ఫేస్బుక్లో విరాళాల ద్వారా 3.5 లక్షల రూపాయలు సేకరించగలిగామని జోతిమణి తెలిపారు. ఈ సారి కూడా అదే ప్రయత్నాల్లో ఉండగా అక్షయ నిర్ణయం తనను కదిలించిందని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ప్రతీ చిన్నసహాయం ఎంత ముఖ్యమైందో, విలువైందో తెలుసు. అందుకే అక్షయ ఇష్టాన్ని కాదనలేకపోయానని జోతి తెలిపారు. కాగా ఇటీవల వరదల్లో కేరళలో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల బాధల్ని గాధల్ని చూసి చలిస్తున్న చిన్నారులను చూస్తుంటే మాయమర్మమేమిలేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే అన్న ఆరుద్ర పదాలు గుర్తురాకమానవు. దండిగుండెతో కదులుతున్న ఈ చిన్నారుల సాయం కేరళలోని నిజమైన బాధితులకు చేరాలని కోరుకుందాం. -
రూ. 50 కోట్ల భారీ విరాళమిచ్చిన ఎన్ఆర్ఐ వ్యాపారి
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకొనేందుకు ఆపన్న హస్తాలు స్పందిస్తున్నాయి. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించించగా ఇటు దేశవ్యాప్తంగా చిన్నారులు సహా ప్రజలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేము సైతం సహాయాన్ని ప్రకటిస్తున్నారు. నగదు, ఆహారం, మందులు, దుస్తులు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. వీరితో పాటు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా మాతృదేశానికి వచ్చిన కష్టానికి స్పందిస్తున్నారు. తాజాగా అబుదాబీలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త స్పందించారు. అబుదాబి కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థకు చైర్మన్ డా.షంషీర్ వయలిల్ కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన సొంత రాష్ట్రమైన కేరళకు 26 మిలియన్ దుబాయ్ దిర్హమ్లను (దాదాపు రూ.50 కోట్లు) కోట్లు విరాళం ఇచ్చారు. షంషీర్ వయలిల్ కు మధ్య ఆసియా, భారత్, యూరప్ లలో మొత్తం 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్టు సమాచారం. షంషీర్ రూ.50 కోట్ల మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ రూ.50 కోట్లని బాధితుల పునరావాసం, ఆరోగ్యం, విద్యకు ఖర్చు చేయనున్నట్లు షంషీర్ తెలిపారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు గత వందేళ్లలో సంభవించని వరద ముప్పుతో విలవిల్లాడిన కేరళం ప్రస్తుతం వర్షాలు ఉపశమించాయి. అయితే కూలిన ఇళ్లు, తెగిపడిన రోడ్లు, విరిగి పడిన చెట్లతో జనం కన్నీటి సంద్రమవుతున్నారు. కొద్దికొద్దిగా సహాయ శిబిరాల్లోతలదాచుకున్న ప్రజలు చెదరిని తమ గూళ్లను చక్కదిద్దకునే పనిలో ఉన్నారు. పరిస్థితి చక్కదిద్దిడానికి కొన్ని వారాల సమయం పడుతుందని, ప్రస్తుతం డాక్టర్లు, నర్సులు, వైద్య సహాయం అవసరం చాలా అవసరమని అధికారులు ప్రకటించారు. -
కేరళ: చిన్నారి సాయం, బంపర్ ఆఫర్
గత వందేళ్లలో లేని వర్షాలు, వరదలతో భీతిల్లుతున్న కేరళ ప్రజలనుఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్దా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ ఓ చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. తనవంతు సాయంచేసి మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు తన కలను సాకారం చేసుకుంది. నాలుగేళ్లపాటు దాచుకున్న సుమారు 9వేల రూపాయలను డొనేట్ చేసింది. అంతేకాదు తన ఔదార్యంతో దేశీయ సైకిళ్ల కంపెనీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఎవరికైనా మంచి చేస్తే అదిఎప్పటికైనా నీకు మంచి చేస్తుందన్న పెద్దలమాట బేబి అనుప్రియ(8) పాలిట అక్షరాలా నిజమైంది. తమిళనాడు, విలుపురం జిల్లాకు చెందిన అనుప్రియ మూడవ తరగతి చదువుతోంది. వరద బాధితులు, ముఖ్యంగా పిల్లలు పడుతున్న అవస్థల్ని టీవీలో చూసి చలించిపోయింది. ఏకంగా ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న 8,240 రూపాయలను కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తం నాణేలను సోమవారం స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎల్కేజీలో ఉన్నప్పటినుంచీ సైకిల్ కొనుక్కోవాలనే కోరికతో రోజుకు కనీసం రెండు రూపాయల చొప్పున పిగ్గీ బ్యాంకులో దాచుకుంటున్నా..కానీ టీవీలో కేరళ ప్రజలు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులు చూసాకా బాధ అనిపించింది. అందుకే నేను సేవ్ చేసుకున్న డబ్బులు వారికివ్వాలని నిర్ణయించుకున్నానని అనుప్రియ చెప్పింది. చిన్ని వయసునుంచే ఆమెకు పొదుపు అలవాటు చేద్దామనుకున్నా కానీ అది ఇలా ఉపయోగపడుతుందని భావించలేదని ఆమె తండ్రి శివ షణ్ముగనాధన్ సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి గత సంవత్సరం సైకిల్ కొనిద్దామనుకున్నా..కానీ పాప ఇంకా పెద్దది కాలేదని భయపడ్డా... ఇపుడు తన నిర్ణయం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయన మురిసిపోయారు. హీరో సైకిల్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ అనుప్రియ ఔదార్యానికి అబ్బురపడిన దేశీయ అతిపెద్ద సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ అనూహ్యంగా స్పందించింది. ఏ ఉద్దేశంతో అయితే పిగ్గీ బ్యాంకులో డబ్బు దాచుకుందో ఆ కోరికను నెరవేర్చాలని నిర్ణయించింది. చిన్నారికి కొత్త సైకిల్‌ను కానుకగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు సంవత్సరానికి ఒక కొత్త బైక్‌ను గిఫ్ట్‌గా అందిస్తామంటూ హీరో మోటార్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ పంకజ్ ఎం ముంజాల్ ట్వీట్ చేశారు. ‘సైకిల్ కోసం ఇలా చేయలేదు. సహాయం చేయాలనుకున్నా, చేశాను అంతే. నా స్కూలు స్నేహితులను కూడా సాయం చేయమని కోరతా’ ఈ ఆఫర్ గురించి ప్రశ్నించినపుడు అనుప్రియ ఇలా వ్యాఖ్యానించడం విశేషం. Anupriya, parnam to you. You are a noble soul and wish you spread the good around. Hero is too pleased to give you one bike every year of your life. Pl share your contact on my account. Love you and best wishes. Prayers for Kerala https://t.co/vTUlxlTnQR — Pankaj M Munjal (@PankajMMunjal) August 19, 2018 -
మరోసారి ప్రత్యేకతను చాటుకున్నకేరళ కుట్టి
తిరువనంతపురం: సోషల్ మీడియాలో నిష్కారణంగా అవహేళనకు గురైన కేరళ విద్యార్థిని హనన్ హమీద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కష్టాలకు, బాధలకు వెరవకుండా ప్రతికూల పరిస్థితులను నిబ్బరంగా అనుకూలంగా మార్చుకున్న హమీద్ రాష్ట్రంలోని బాధితుల పట్ల తన బాధ్యతను ప్రదర్శించారు. స్వయంగా వరద ప్రభావానికి లోనైనా కూడా ఆమె మరిన్నికష్టాలుపడుతున్న బాధితులను ఆదుకునేందుకు పెద్దమనసు చేసుకున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రజలసొమ్మును తిరిగి వరద బాధితుల కోసం రూ.1.5 లక్షలు సాయం చేసేందుకు నిర్ణయించారు. ప్రజల నుంచి తాను విరాళంగా పొందినదాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వారు కష్టాల్లో ఉన్నారు. అందుకే తాను చేయగలిగిన కనీస సాయం చేస్తున్నానన్నారు. అయితే నేనున్న ప్రదేశంలో మూడు వైపులా నీరు చేరటం వలన బయటికి రాలేకపోతున్నాను. అదృష్టవశాత్తూ, నా కెలాంటి బాధలేదు. కానీ ప్రస్తుతం మొబైల్ కనెక్టివిటీ లేదు, బ్యాంకులు కూడా మూతపడ్డాయి. అందువల్ల త్వరలోనే సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేస్తాను లేదా రెండు రోజుల్లో నేరుగాముఖ్యమంత్రికి చెక్ అందిజేస్తానని హమీద్ స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని హమీద్ కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్ముతూ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఒడిదుడుకులను అధిగమించే క్రమంలో కలల సాకారం కోసం పడిన శ్రమను కొంతమంది అవమానించారు. చేతికి తొడుగులు, వేలికి బంగారు ఉంగరం ధరించి, ఆధునిక శైలిలో తల దువ్వుకుని, బట్టలు ధరించి చేపలు అమ్మింది. దీంతో ఆమె ఇంటర్నెట్లో వైరల్ కావడంతో కొందరు మత ఛాందసవాదులు బెదిరింపులకు దిగడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెకుఅండగా నిలవడం తెలిసిందే. కాగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కేరళను చిన్నాభిన్నం చేశాయి. 13 జిల్లాల్లో ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 190కి పైగా మరణాలు నమోదు కాగా, 2 లక్షల మంది వివిధ జిల్లాలలో సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు సైన్యం, నౌకాదళం, ఎన్.డి.ఆర్.ఎఫ్, కోస్ట్ గార్డ్ దళు సహాయ,రక్షణపనుల్లో తలమునకలైవున్నాయి. ఇంతలో మరో రెండు రోజు వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ అంచనా వేసింది. -
కేరళ వరదలు: షావోమి విరాళం ఏంటంటే..
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. వేలకోట్ల రూపాయలను నష్టపోయిన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి నడుం బిగించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో రారాజులా వెలుగొందుతున్న షావోమి రంగంలోకి దిగడం విశేషం. వరద ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సాయపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజల సహాయార్దం ముందుకు వచ్చింది. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు పూర్తిగా చార్జింగ్ చేసిన వేలాది పవర్ బ్యాంకులను ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి బాక్స్‌ను వాలంటీర్లకు అందించామని షావోమీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవర్ బ్యాంకులకు చార్జింగ్ చేసిన తమ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా గత శతాబ్ద కాలంలో లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమైన వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దాదాపు మూడున్నర లక్షలమంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. #Xiaomi is supplying thousands of fully charged Mi PowerBanks to relief camps in #Kerala, with help of @CNNnews18. Respect for our team members for charging these powerbanks & helping our countrymen! 1st box being handed over to a volunteer. #XiaomiWithKerala #KeralaFloods pic.twitter.com/BtoMbdVbPV — Manu Kumar Jain (@manukumarjain) August 18, 2018 -
గో రక్షకులూ.. వెంటనే రువాండా వెళ్లండి...!
దేశంలోని గో రక్షకులకు బహిరంగ విజ్ఞప్తి... మీరంతా దయచేసి వెంటనే రువాండా దేశానికి వెళ్లి ఈ ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి. ప్లీజ్... దక్షిణాష్రికా బ్రిక్స్ శిఖరాగ్ర భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో రువాండాలో ఆగి 200 ఆవులను కానుకగా ఇచ్చారు. దీనిపై ట్విటర్ వేదికగా సాగిన హాస్యపూర్వకచర్చలో భాగంగానే ఈ విజ్ఞప్తి సోషల్ మీడియా తెరపైకి వచ్చింది. రువాండాలో కొన్ని శతాబ్దాలుగా ‘గిరింకా పథకం’లో భాగంగా గోవులను కానుకగా ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరచడంలో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆవులు అందజేస్తారు. అయితే రువాండాలో బీఫ్‌ను ఆహారంలో భాగంగా పరిపాటి కావడంతో ఈ అంశం ట్విటర్లో చర్చకు కేంద్రమైంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్‌ను నిషేధించడంతో పాటు ఇటీవల గోవుల పరిరక్షణపేరిట మూక దాడుల సంబంధిత వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్విటర్లో సరదా కామెంట్లు... రువాండాలోని బుగెసెరలో అతి పెద్ద బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతోంది. ఆ దేశానికే ప్రధాని మోదీ ప్రేమతో 200 ఆవులు కానుకగా ఇచ్చారంటూ ఓ వ్యక్తి స్పందించాడు=మోదీ మాస్టర్ స్ట్రోక్...200 ఆవులు కానుకగా ఇచ్చేశారు అని ఆప్కా దేవేందర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు రువాండాలో మాంసం కొరత ఏర్పడింది అనే శీర్షికతో... రెండుదేశాల్లోనూ ఆవులను పూజిస్తారు. అయితే ఈ ఫోటోను చూడాలంటే భయమేస్తోంది అంటూ రువాండాలో బీఫ్ అమ్మే ఫోటోను రోహిత్ కన్నన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు ఆ దేశంలో గోవులను ఇష్టపడతారు. అయితే డైనింగ్ టేబుళ్ల మీద...అక్కడ గోరక్షకుల దళాన్ని వెంటనే ఏర్పాటుచేయాలి. దళ సభ్యులంతా కూడా రాత్రికి రాత్రి ప్యారాఛూట్లలోఅవసరమైన చోట్ల దిగే ఏర్పాటు చేయాలి అంటూనైనా డీ షేత్ పేర్కొన్నారు రువాండాకు 200 ఆవులను ఎత్తుకెళుతున్న వారు కనిపించారని మై ఫెల్లో ఇండియన్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు ఓ వ్యక్తి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు గోవులను తీసుకెళుతుంటేనే దాడి జరిగింది. మరో వ్యక్తి భారత్ నుంచి 200 ఆవులను తీసుకుని రువాండాకు వెళ్లినట్టు ఇప్పుడే విన్నాను. అతడికి ఏమి కాకూడదని ప్రార్థిస్తున్నాను అని అతుల్ ఖత్రి వ్యాఖ్యానించాడు. -
మసీదుకు స్థలమిచ్చిన ఆలయాధికారి
సాక్షి, మంగళూరు : దేశంలో మతసామరస్యం ఇంకా ఉందని కర్ణాటకలోని ఒక ఆలయాధికారి నిరూపించారు. మతాలు, ప్రార్థనలు వేరయినా.. భగవంతుడు ఒక్కడే అని ఆయన తన చేతుల ద్వారా నిరూపించారు. మసీదు స్థలం సరిపోక ముస్లిం సోదరులు కొంత కాలంగా అవస్థలు పడుతున్నారు. వారి ఇబ్బందిని గమనించిన శ్రీ విష్ణుమూర్తి ఆలయ కమిటీ అధ్యక్షుడు తన సొంత స్థలాన్ని మసీదుకు దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాకటలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కెయ్యూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఒలముండు గ్రామంలో జరిగింది. ఒలమండు గ్రామంలోని మసీదు చిన్నది కావడంతో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మసీదు విస్తరణలో భాగంగా ముస్లిం మత పెద్దలు.. మసీదుకు ఆనుకుని ఉన్న మోహన్ రాయ్ స్థలాన్ని ఇవ్వమని కోరారు. ముస్లిం మత పెద్దల కోరికను విన్న మోహన్ తన 12 సెంట్ల స్థలాన్ని మసీదుకోసం ఉచితంగా ఇచ్చారు. మసీదుకు స్థలాన్ని దానం చేసిన మోహన్ రాయ్‌పై ముస్లిం మత పెద్దలు ఉమర్ ముస్లియార్, కేఆర్ హుస్సేన్ తదితరులు ప్రశంసలు కురిపించారు. -
దేవుడికి వెండి కిరీటాలు సమర్పించిన బిచ్చగాడు
-
కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన భౌతికశాస్త్రవేత్త మణి భూమిక్.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి 11 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 74 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ప్రకృతి సూత్రాల పరిశోధన కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం భూమిక్ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని ఛాన్సలర్ గినే బ్లాక్ తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశోధన కేంద్రం ‘భూమిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థిరీటికల్ ఫిజిక్స్’ను మణి భూమిక్ నిర్వహిస్తున్నారు. కంటికి వాడే లేజర్ చికిత్స అభివృద్ధి చేయడంలో భూమిక్‌ది కీలక పాత్ర. పశ్చిమబెంగాల్లోని ఓమారుమూల గ్రామంలో ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడు పూరి గుడిసెలో పెరిగిన భూమిక్ నాలుగు మైళ్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడు. 1958లో కోల్‌కతా యూనివర్సిటీలో పీజీ, ఖరగ్‌పూర్ నుంచి ఐఐటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 1959లో 3 డాలర్లతో అమెరికాకు వెళ్లిన భూమిక్ 1961లో జిరాక్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లో లేజర్ సైంటిస్టుగా చేరాడు. 2011లో భారత ప్రభుత్వం మణి భూమిక్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. -
క్లింటన్‌కు రూ.40 కోట్ల విరాళం
మాస్కో: అమెరికా అధ్యక్ష పదవికోసం డెమొక్రటిక్ పార్టీ తరుపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు ఆ దేశ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆరు మిలియన్ డాలర్ల(రూ.40,74,00,013)ను విరాళం ఇచ్చారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గత డిసెంబర్ లో క్లింటన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ప్యాక్)కు ఈ మొత్తం అందించినట్లు పాక్ కమిటీ తెలిపింది. కాగా, ఇప్పటికే 2015 ముగిసే సమయానికి క్లింటన్ కు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన విరాళాల మొత్తం 41 మిలియన్ డాలర్లకు చేరినట్లు ది హిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ విరాళాల్లో మీడియా మొఘల్, సంగీతకారుడు హెయిమ్ సాబన్, ఆయన భార్య చెరిల్ అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చినట్లు కూడా ఆ మీడియా వెల్లడించింది. దీంతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒబామాకు కూడా ప్రస్తుతం ఆరు మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన సోరోస్ ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 8న కొత్త అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రముఖ వ్యాపార వేత్త డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. -
హీరోయిన్స్ కు షాక్ ఇచ్చిన శ్రీదివ్య
-
సినీ కార్మికుడికి రామ్‌చరణ్ ఆర్థికసాయం
బంజారాహిల్స్: జులై 23న షూటింగ్ లొకేషన్లో గాయపడి జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు రమణకు సినీ హీరో రాంచరణ్‌తేజ్, ఉపాసన దంపతులు రూ. 3.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.అలాగే మేకింగ్ మీడియా నిర్మాత సచిన్‌జోషి కూడా రూ. 6 లక్షల వరకు ఆర్థికసహాయం అందజేశారని తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను తెలిపారు. -
శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.1.కోటి విరాళం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఆర్కే ఆనంద్ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. మంగళవారం ఇక్కడి దాతల విభాగంలో 1 లక్షా 60 వేల యూఎస్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకోసం వినియోగించాలని దాత కోరారు. అలాగే మరో ఇద్దరు భక్తులు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. -
విశాఖలో మరో అవయవదానం!
-
మా తమ్ముడు సజీవం