న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) అందజేశారు.
2 లక్షల తన విరాళానికి సంబంధించిన రశీదును ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని రాహుల్ పిలుపునిచ్చారు
Our brothers and sisters in Wayanad have endured a devastating tragedy, and they need our support to recover from the unimaginable losses they have faced.
I have donated my entire month's salary to aid in the relief and rehabilitation efforts for those affected. I sincerely urge… pic.twitter.com/GDBEevjg5y— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2024
కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్ విత్ వయనాడ్–ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.
ఇదిలా ఉండగా, జూలై 30న భారీ వర్షాలు, వరదలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వయనాడ్‌లో భారీగా మట్టిపెళ్లలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
Comments
Please login to add a commentAdd a comment