శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు  | TTD Chairman YV Subba Reddy Family Donates 2 Kgs Gold Jewelry | Sakshi
Sakshi News home page

శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు 

Published Mon, Dec 19 2022 12:13 PM | Last Updated on Mon, Dec 19 2022 12:26 PM

TTD Chairman YV Subba Reddy Family Donates 2 Kgs Gold Jewelry - Sakshi

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాన్ని 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాములతో తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌కు ఈ ఆభరణాన్ని అందించారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్వామివారికి కానుకను సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చదవండి: భద్రతకు గట్టి భరోసా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement