srivaru
-
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
సాక్షి, తిరుపతి : నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణి లో తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవం తొలిరోజు మార్చి 20న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పపై మూడు ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశీర్వదిస్తారు. రెండో రోజు మార్చి 21న రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి మూడుసార్లు తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా మార్చి 23న నాలుగో రోజు ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆర్జిత సేవలు రద్దు తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని 63,251 మంది దర్శించుకున్నారు. వారిలో 20,989 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకతో స్వామివారి హుండీ ఆదాయం 4.14 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమల బ్రహోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫోటోలు)
-
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు. ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది. ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు ఏలూరు: నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
విశిష్ట దర్శనానికి వేళాయే..
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా సర్వం సిద్ధం
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాన్ని 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాములతో తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌కు ఈ ఆభరణాన్ని అందించారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్వామివారికి కానుకను సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: భద్రతకు గట్టి భరోసా -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్ర శ్రీనివాసుడు
-
జర్మనీలో అంగ రంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నమిత
-
తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
-
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
గరుడోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
విశ్వకర్మ నిర్మించిన ఆలయం ఇప్పటికీ తిరుమలలో ఉందా ...?
-
2023 టీటీడీ క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్
-
ఏడుకొండలవాడికి 50 రకాలకు పైగా నైవేద్యాలు
-
ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
స్వర్ణ రథంపై శ్రీవారు ( ఫొటోలు)
-
AP: గిరిజన తేనెకు తిరుపతి వెంకన్నే బ్రాండ్ అంబాసిడర్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు కలియుగ దైవం శ్రీనివాసుడు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. ఏడుకొండల స్వామిని అభిషేకించేందుకు గిరిజన తేనెను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదనకు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. గిరిజన తేనె నమూనాలను తీసుకున్న టీటీడీ వాటికి ల్యాబ్‌లలో నాణ్యత పరీక్షలు చేయించింది. స్వచ్ఛత బాగుందనే ఫలితాలు రావడంతో గోవిందుడి అభిషేకానికి గిరిజన తేనె వినియోగించాలని నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను జీసీసీ శుద్ధి చేసి కిలో రూ.298.77 చొప్పున విక్రయిస్తోంది. టీటీడీకి అవసరమైన తేనెను తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..) ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల కిలోల తేనెను శుద్ధిచేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంత తేనె కావాలనేది టీటీడీ నుంచి ఆర్డర్ రావడమే తరువాయి అని జీసీసీ జనరల్ మేనేజర్ చినబాబు ‘సాక్షి’కి చెప్పారు. తేనెతోపాటు శ్రీవారి నిత్య కైంకర్యాలకు, నైవేద్యానికి వినియోగించే పసుపు, జీడిపప్పును కూడా జీసీసీ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదన చేశామని చినబాబు తెలిపారు.(చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్) విశాఖ మన్యంలోని పాడేరులో గిరిజనుల నుంచి సేకరిస్తున్న పసుపు నాణ్యతలో నంబర్–1 స్థానంలో ఉంది. గిరిజన పసుపు, జీడిపప్పు శాంపిల్స్‌ను జీసీసీ ఇప్పటికే టీటీడీకి అందించింది. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుపతితోపాటు మరికొన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో గిరిజన తేనె, జీడిపప్పు, ఇతర ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి గిరిజనులకు మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: ఘనంగా శ్రీవారి చక్రస్నానం
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: అశ్వ వాహనంపై శ్రీనివాసుడు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీనివాసుడు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ అవతారంలో శ్రీవారు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి
-
సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం
సాక్షి, తిరుమల: టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. సుధా నారాయణమూర్తిపై ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దాంతోపాటు శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..) కాగా, తమిళ నటుడు శివకుమార్ ఓ వీడియోలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారం చేశారు. తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై టీటీడీకి సమాచారం ఇచ్చారు. టీటీడీపై శివకుమార్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జూన్ 30 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంటు సోషల్ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ తెలిపింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా వీరిపై కేసు నమోదైంది. ఫేస్బుక్ పేజీపైనా కేసు: డీఎస్పీ శ్రీవారి ఆలయం, భక్తులపై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.. తెలుగు ఎతిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు) -
శ్రీవారి నగలు మాయం; బాధ్యుడు ఏఈవో..!
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆభరణాలు చోరీకి గురైనట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. ట్రెజరీలో ఉన్న 5.4 కిలోల వెండి కిరీటం, 2 ఉంగరాలు, గోల్డ్ చైన్ చోరీకి గురైనట్టు తెలిసింది. 2018లో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులును బాధ్యుడిగా తేల్చారు. అతనిపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. -
భక్తుల నెలవులోనే శ్రీవారి కొలువు
వెంగమాంబ బాటలో ఎందరో భక్తులు శ్రీవారి సేవలో తరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తిరుపతిలో శ్రీవారి పరమ భక్తురాళ్లు కోమలమ్మ, పొన్నమ్మ, రేబాల సుబ్బమ్మ చాటిన భక్తి అనన్యమైంది. శ్రీవారికి పుష్పకైంకర్యాలు నిర్వహించాలని, తమ నివాస ప్రాంతంలో కొలువు తీర్పించాలని వారు తపించారు. దట్టమైన కొండల్లో వెలసిన స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన ఆర్త జనులకు అంతగా సౌకర్యాలేవీ లేని రోజుల్లో ఇతోధికంగా సేవలు అందించారు. అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసి, భక్తుల ఆకలిని తీర్చారు. సుదూర ప్రాంతాల నుంచి కొండకు నడచి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకునే వసతి సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుత విపణిలో కోట్లాది రూపాయల విలువ చేసే విస్తారమైన స్థలాలను, అందులోని పూదోటలను శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. తరాలు గడచినా ఆ పుణ్య కార్యాలే వారిని కీర్తించేలా చేస్తున్నాయి. కోమలమ్మ కరుణార్ద్ర హృదయం రామానుజాచార్యుల సంకల్పంతో తిరుమల పాదాల చెంత కొత్తూరు పేరిట కుగ్రామంగా వెలసిన నేటి తిరుçపతిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండే రోజులవి. దట్టమైన చెట్లతో నిండిన కొండకు కాలిబాటన నడిచి వెళ్లాంటే భక్తులు భయపడాల్సి వచ్చేది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసేవారికి సమయానికి ఇంత అన్నం దొరికేది కాదు. కాస్త విశ్రాంతి కావాలన్నా ఇబ్బందిగా ఉండేది. శ్రీవారి భక్తులు పడుతున్న కష్టాలను చూసిన రాఘవశెట్టి భార్య కోమలమ్మ తపించిపోయారు. అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చిన వారి ఆకలి దప్పికలను తీర్చారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నాక భక్తులు తిరుమలకు పయనమయ్యేవారు. ఆమె చివరి రోజుల్లో శ్రీవారిని తన ఇలాకాలో ఏడాదికి ఓసారైనా కొలువు దీర్చాలని వేడుకుంది. నిత్య పుష్పకైంకర్యాల కోసం తానే పుష్పాలను ఇవ్వాలని తపించింది. తాను అనుకున్నట్టే ప్రస్తుత తిరుపతిలో నడిబొడ్డునే ఉన్న విస్తారమైన స్థలాన్ని, అందులోని పూదోటలను, అన్నదాన సత్రాన్ని దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోర్కె ప్రకారం ఏడాదిలో ఒకసారి అదే స్థలంలో దేవస్థానం శ్రీవారి కొలువును నిర్వహిస్తోంది. తిరుచానూరులో వెలసిన శ్రీవారి దేవేరి పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే పంచమీతీర్థం రోజున కోమలమ్మ సత్రంలో వేడుకను నిర్వహించే సంప్రదాయాన్ని దేవస్థానం నేటికీ కొనసాగిస్తోంది. ప్రస్తుత పాత మెటర్నిటీ ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న కోమలమ్మ సత్రం నుంచే తన దేవేరి పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారెను ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి, పంచమీతీర్థం రోజున సమర్పిస్తుంటారు. కోమలమ్మ భక్తికి మరో గౌరవం దక్కింది. తిరుమల శ్రీవారి కాలినడక దారిలో అలిపిరి పాదాల మండపం వద్ద కోమలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పరమ భక్తురాలు పొన్నమ్మ శ్రీవారికి పొన్నమ్మ పరమ భక్తురాలు. స్వామివారి ఆరాధనకు మించినది లేదని భావించేది. సువిశాల స్థలంలో పూల తోటలను పెంచి, అందులోని పుష్పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేది. కొన్నాళ్లకు తాను కాలు కదల్చలేని స్థితిలో పూలతోటలతో సహా తన స్థలాన్ని శ్రీవారి పుష్పకైంకర్యాల కోసం సమర్పించింది. ప్రతిఫలంగా ఆమె ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా తాను సమర్పించిన స్థలంలో శ్రీవారి క్రతువును నిర్వహించాలని వేడుకుంది. ప్రస్తుత టీటీడీ పరిపాలన భవనం ఎదురుగానే పొన్నమ్మ పూదోట ఉండేది. ఆ స్థలంలో గోవిందరాజస్వామి పాఠశాలతో పాటు, అదే ఆవరణలో టీటీడీ ఓ మండపాన్ని కూడా నిర్మించింది. ఈ మండపం పొన్నమ్మ మండపంగా గుర్తింపు పొందింది. ఏటా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల ముగింపునకు సూచనగా కపిలతీర్థంలో నిర్వహించే చక్రస్నాన ఘట్టానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పొన్నమ్మ మండపంలోనే నిర్వహిస్తారు. పొన్నమ్మ కోరిక ఇలా నెరవేరుతోంది. స్వామి భక్తిలో తరించిన సుబ్బమ్మ... శ్రీవారి భక్తిలో తరించిన మరో భక్తురాలు రేబాల సుబ్బమ్మ. తనకున్న విస్తారమైన స్థలంలో పూదోటలను పెంచుతూ, అందులోని పుష్పాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలకు సమర్పించేది. తన తర్వాత కూడా తను పెంచిన పూదోటల్లో శ్రీవారికి ఏడాదిలో ఓ రోజైనా కొలువు జరిపించాలని తపించేది. తను తలచిన విధంగానే ఆ పూదోటలను, స్థలాలతో పాటు దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోరికను నెరవేర్చేందుకే తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక రోజంతా సీతారామలక్ష్మణ సమేత హనుమంతునికి రేబాల సుబ్బమ్మ తోటలోనే టీటీడీ కొలువు దీరుస్తోంది. నాటి రేబాల సుబ్బమ్మ తోట ఉన్న ప్రాంతమే ప్రస్తుతం తిరుపతిలో రేబాల సుబ్బమ్మ గార్డెన్– ఆర్ఎస్గార్డెన్గా ప్రాచుర్యం పొందింది. – జె.భాస్కరరెడ్డి తిరుపతి -
ఏడు కొండలు... ఎన్నో విశేషాలు
‘ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా గోవిందా!’ అని నోరారా అంటే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. ఇక స్వామి వారి చరిత్ర పరమాద్భుతం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. ఆ కొండల మధ్య వింతగా వెలుగులీనుతున్న బంగారు మేడ ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయాన్ని చూస్తే భక్తులకు ఎక్కడలేని పరమానందం. ఆ మేడలోని అతిలోక సుందర మోహనాకారుడు శ్రీవేంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఉవ్విళ్లూరతారు. అతిలోక సుందరుడు శ్రీనివాసుడు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగంశ్రీభూమికాంతమరవింద దళాయతాక్షమ్ఆనందనిలయుడు, అందరినీ సమ్మోహనపరచే ఆతిలోక సుందరుడు... ఇంతటి సుకుమారమైన దేవుడు ‘నేను వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను గాని, నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను’ అంటూ శ్రీవైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలోని వేంకటాచలంలో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా వక్షస్థల శ్రీమహాలక్ష్మితో స్వయం వ్యక్తరూపంలో ఆవిర్భవించారు. వక్ష స్థల లక్ష్మి వల్లే ఆ స్వామి ‘శ్రీ’నివాసుడయ్యాడు. విచిత్ర భంగిమలో తిరుమలేశుడు శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖచక్రాలను ధరించి, కింద కుడిచేతిని వరదముద్రలో ఉంచి తన పాద ద్వయాన్ని శరణు వేడుమన్నట్లుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటి హస్తంతో మోకాళ్లను చూపుతున్నాడు. విచిత్రమైన ఈ భంగిమలో తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం, తన పాదాలను శరణు వేడితే చాలు. ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటి హస్తంతో, కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచి ఉన్న సుందరమూర్తి శ్రీనివాసుడు. పంచబేరాలు ఆనందనిలయ గర్భాలయంలో సాలగ్రామ శిలామూర్తి అయిన మూలవిరాట్టుతో పాటు శ్రీనివాసునికి మరో నాలుగు రకాల ఉత్సవమూర్తులు ఉన్నాయి. వీటిని మూలమూర్తితో కలిపి పంచబేరాలు అంటారు. మూలవిరాట్టు స్థిరంగా 8 అడుగుల ఎత్తు సాలగ్రామ శిలామూర్తిని ‘ధ్రువబేరం’ అంటారు. ఈ స్వామివారి దర్శనం కోసమే భక్తులు యాత్రకు వస్తుంటారు. ఈ మూలవిరాట్టుకే ప్రతిరోజు ప్రధానంగా సుప్రభాతం, రెండు పర్యాయాలు తోమాలసేవ అనే పుష్పాలంకరణ సేవ, ఉదయం సహస్ర నామార్చన, మధ్యాహ్నం సాయంత్రం అష్టోత్తర శతనామార్చనలు, మూడు పూటలా నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, గురువారం తిరుప్పావడ సేవ, నేత్ర దర్శనం, రాత్రి పూలంగి సేవ, శుక్రవారం ఉదయం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. శ్రీస్వామివారికి అర్చనలు, నివేదనలు జరిగిన వెంటనే వక్షస్థలంలోని ‘వ్యూహలక్ష్మి’కి జరుపుతారు. రెండవబేరం ‘శ్రీభోగ శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు వెండి ప్రతిమ అయిన ఈయననే ‘మనవాళ పెరుమాళ్’ అంటారు. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి మూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగా తీర్థాభిషేకం రాత్రి పవళింపు సేవ, ఏకాంతసేవ జరుగుతుంది. ఈ స్వామివారికి ప్రతి బుధవారం బంగారు వాకిలి వద్ద సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మూడవ బేరం ‘కొలువు శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు పంచలోహ ప్రతిమ. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే ఈ మూర్తి బంగారువాకిలి లోపల ‘బంగారు సింహాసనం’లో కొలువుదీరగా, ప్రతిరోజూదర్బారు జరుగుతుంది. పంచాంగ శ్రవణం తరువాత ఆదాయ వ్యయాల లెక్కలన్నీ వినే స్వామి ఈ కొలువుమూర్తి. నాల్గవ బేరం ‘ఉగ్ర శ్రీనివాసమూర్తి’. శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న ఈ ఉగ్రమూర్తికి పూర్వం ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం జరగడం లేదు. కార్తీక కైశిక ద్వాదశి రోజున మాత్రమే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఉత్సవం పూర్తి చేసుకుని ఆలయంలోకి వెళ్తారు. ఐదవ బేరం ‘ఉత్సవ శ్రీనివాసమూర్తి’. వీరే మలయప్పస్వామి. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న ఉత్సవమూర్తి. మలయప్పకోనలో దొరికాడట. అందుకే మలయప్పస్వామిగా పిలువబడుతూ, ఆలయం బయట అన్ని ఉత్సవాల్లో పాల్గొంటూ, భక్తులకు సన్నిహితంగా దర్శనమిస్తుంటాడు.వీరు కాకుండా ఆనందనిలయ గర్భాలయంలో ‘సుదర్శన చక్రత్తాళ్వార్, అనంతుడు, శ్రీసీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు, సుగ్రీవహనుమంతులు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు’తదితర ఉత్సవమూర్తులు ఆయా వేళల్లో ఊరేగింపుల్లో పాల్గొంటుంటారు. వీరిలో కొన్నింటిని ప్రస్తుతం తీర్థం ఇచ్చే అరలో చూడవచ్చు. తిరుమలేశునికి ఎన్నెన్నో వింత పేర్లు తిరుమలేశుడికి అనేక నామాలు ఉన్నాయి. అవన్నీ విచిత్రమైన పేర్లు. అవన్నీ ఆ స్వామివారి సొంత పేర్లా అంటే అదీ చెప్పలేం అంటున్నారు శ్రీజూలకంటి బాలసుబ్రహ్మణ్యం. కాని అన్ని పేర్లు భక్తులు ప్రియంగా... ఇష్టంగా పిలుచుకుంటున్నవే. వాటిలో ప్రసిద్దమైనది ‘ఏడుకొండలవాడా’. శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే ఏడుకొండల్లో ఉన్న స్వామి కనుక ఏడుకొండలవాడయ్యాడు. అదేవిధంగా వేం – పాపాలను, కట – పోగొడుతాడు కనుకే ‘వేంకటపతి’ అనీ, తిరుమలేశుడని, స్థలాన్ని బట్టి, చేసే పనినిబట్టి పిలువబడుతున్న స్వామే శ్రీనివాసుడు. అన్ని పేర్ల కంటే మరో విచిత్రమైన పేరు ఉంది. భార్య పేరుతో పిలుచుకోవడం. అదే ‘శ్రీ’నివాసుడు. ఆయన వక్షస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ భక్తుల కోరికలను తీర్చడంలో, స్వామికి చెప్పి సిఫారసు చేస్తుంటారట. ఆమె ‘వాత్సల్య గుణోజ్జ్వలాం’ కనుక భక్తుల మీద ప్రేమ ఎక్కువ. ఆ తల్లి వల్లే ‘శ్రీ’నివాసుడు’ అని పిలువబడుతున్నాడు. అసలు నీ పేరేమయ్యా? అంటే చెప్పరు కానీ ‘అడుగడుగు దండాలవాడా’ అని పిలిచినా పలుకుతాడు. ‘ఆపద్బాంధవా’ అని పిలిచినా పలుకుతాడు. ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతూ మన కోరికలు తీరుస్తూనే ఉన్న వింత వింత పెట్టుడు పేర్ల దేవుడే వేంకటేశుడు. ఉత్సవాల దేవుడు శ్రీనివాసుడు తిరుమలేశునికి ఉత్సవాల దేవుడు అనే పేరుంది. ఈ స్వామికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలతో పాటు విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం మొదలైన వారోత్సవాలు, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, శ్రవణం, పున్నమి గరుడసేవ వంటి మాసోత్సవాలు, ఉగాది ఆస్థానం, ఆణివర ఆస్థానం, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం వంటి వార్షికోత్సవాల్లో శ్రీవేంకటేశుడి వైభవం వర్ణనాతీతం. కమ్మని ఆరగింపులంటే ఇష్టం ఆనందనిలయుడు అలంకారప్రియుడు. అంతకంటే భోజనప్రియుడు. వాటన్నిటికంటే భక్తప్రియుడు. భక్తుల కోసమే ఎన్నెన్నో కమ్మగా ఉండే లడ్డూలు, వడలు, దోసెలు, అప్పాలు, క్షీరాన్నం, పాయసం, కదంబం, పులిహోర, పొంగలి, సీరా, కేసరి తదితర అన్నప్రసాదాలను సుష్టుగా ఆరగిస్తాడు. భోజన ప్రియుడైన శ్రీనివాసుడు నిత్యం ‘తోమని పళ్లాల్లో’ ఆరగిస్తారట. ఒకసారి భోజనం చేసిన పళ్లాన్ని శుభ్రం చేయకుండా పడవేస్తారు. భోజనానికి మళ్లీ కొత్త పళ్లెం ఉపయోగిస్తారు. ఇంకా విచిత్రమేమంటే.. మట్టికుండ అది కూడా సగం పగిలిన మట్టికుండ, అదే ఓటి కుండ లేదా ఓడు అంటారు. ప్రతి రోజు ‘ఓడు’లో మాత్రమే ఆరగించే ఆనందనిలయుని వైభోగం ఇదా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇలా ఏది తిన్నా తన భుక్తశేషాన్ని మళ్లీ భక్తులకే ప్రసాదిస్తాడు. వాటిని తిన్న భక్తులకు తుష్టీ, పుష్టీ, సంతుష్టితో పాటు సంపూర్ణ ఆరోగ్యం, సమస్త కోరికలు తీరుతున్నాయి. స్వామి వారికి ముత్యాల హారతి చివరిది ప్రతిరోజు రాత్రి చివరగా తిరుమలేశునికి ‘ఏకాంతసేవ’ అనే పవళింపుసేవ జరుగుతుంది. ఈ సేవలో సన్నిధిగొల్ల పట్టుపాన్పును వేసి దీపజ్యోతులు వెలిగిస్తారు. శ్రీవారు యోగనిద్రకు ఉపక్రమిస్తూ తూగుటుయ్యాలలో మెల్లగా ఊగుతుంటాడు. ఆ సమయంలో అన్నమయ్య జోలపాట పాడుతుండగా తరిగొండ వెంగమాంబ పేరుతో ముత్యాలు పేర్చిన వెండిపళ్లెంలో కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పిస్తారు. తరిగొండ నుంచి చిన్నప్పుడే వచ్చి తిరుమల సన్నిధిలో స్థిరపడిన పరమభక్తురాలు వెంగమాంబ. ఈమె సమర్పించే ముత్యాలహారతే చివరి హారతి. అందుకే శ్రీవారి ఆలయంలో ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది. ఆ తరువాత దర్శనాలు, హారతులు ఉండవు. ఆ తరువాత శ్రీవారి ఆలయం బంగారువాకిళ్లు మూసివేస్తారు. భక్తులు ఆచరించవలసిన సంప్రదాయాలు తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి. శ్రీభూవరాహస్వామి వేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే ‘శ్వేత వరాహస్వామి’ అంటారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తరువాత శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించడం శ్రేçష్ఠం. అలా చేస్తేనే శ్రీవారికి ఇష్టమని, యాత్ర సఫలం అవుతుందని చెబుతారు. తిరుమల క్షేత్రపాలకుడు శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు సాక్షాత్తు పరమశివుడు. ఆయనే ఈ క్షేత్రంలో ‘రుద్రుడు’గా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు, గోగర్భంలో ఉంటూ మహాశివరాత్రికి అభిషేకాలు జరుపుకుంటున్నాడు. బ్రహ్మపూజ.. బ్రహ్మతీర్థం భక్త వరదుడైన తిరుమలేశునికి బంగారు వాకిళ్లు తెరవక ముందే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో (2.30 – 3 గంటలు) బ్రహ్మదేవుడు తొలిపూజ చేస్తాడు. అందుకోసమే ఆలయంలో బ్రహ్మపూజ కోసం ‘పెద్ద బంగారు గిన్నె’లో జలాన్ని, పళ్లెంలో చందనాన్ని ఉంచుతారు. ఆ తరువాత దాన్నే ‘బ్రహ్మతీర్థం’గా భక్తులకు ఇస్తారు. ప్రత్యేకంగా కన్యామాసంలో బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు. తొలి హారతి శ్రీవారి సుప్రభాతానంతరం స్వామివారికి మహంతు బావాజీవారి ‘నవనీత హారతి’ తొలిగా సమర్పిస్తారు. శ్రీస్వామివారితో పాచికలాడిన పరమభక్తుడే ఈ మహంతు బావాజీ. మేల్కొలుపు సేవ ప్రతిరోజు శ్రీవారి సుప్రభాతంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు బంగారు వాకిళ్ల దగ్గర నేటికీ మేల్కొలుపు పాటలు పాడుతూ స్వామివారిని మేల్కొలుపుతారు. అలాగే రాత్రి ఏకాంత సేవలో ‘జోలపాట’ పాడుతూ స్వామివారి పవళింపు సేవలో పాల్గొంటున్నారు. నిత్యం జరిగే ‘కళ్యాణోత్సవం’లో తాళ్లపాక వారు నిత్య కన్యాదాతలుగా సత్కారం పొందుతున్నారు. పుష్ప కైంకర్యం శ్రీనివాసుడు పుష్పప్రియుడు. కొండ మీది పూలన్నీ స్వామివారి పూజకు మాత్రమే. ఇతరులు పుష్పాలు ఉపయోగించరాదు. అందుకే తిరుమలకు ‘పుష్కర మండపం’ అని పేరు. వెయ్యేళ్లకు పూర్వం నుంచి ఆనందాళ్వారు శ్రీనివాసుని పుష్ప కైంకర్యంలో పాల్గొంటున్నారు. వీరు భగవద్రామానుజాచార్యులవారి శిష్యులు. తీర్థ కైంకర్యం ప్రతిరోజు శ్రీవారి భోగశ్రీనివాసమూర్తికి, ప్రతి శుక్రవారం మూలమూర్తికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం జరుగుతుంది. తిరుమలలోని ఆకాశగంగ తీర్థ జలాలను తెచ్చే కైంకర్యంలో సుమారు వెయ్యేళ్లుగా తిరుమలనంబి అనే వైష్ణవాచార్యుల వంశీయులు పాల్గొంటున్నారు. వీరు శ్రీరామానుజుల వారికి గురువులు. స్వయానా మేనమామ కూడా. శ్రీనివాసుడు వీరిని ఒక సందర్భంలో తాతా.. తాతా అన్నాడట. అందువల్లే తిరుమలనంబికి ‘తిరుమల తాతాచార్యులు’ అనే పేరు వచ్చింది. అబ్బురపరచే ఆభరణాలు ఘనవేంకటేశునికి పాదాది శిరస్సు వరకు ఎన్నో దివ్యాభరణాలు, మణిహారాలతో అలంకృతుడై భక్తులను అబ్బురపరుస్తుంటాడు. బంగారు పద్మపీఠం, బంగారు పాద కవచం, స్వర్ణ పీతాంబరం, బంగారు నందకఖడ్గం, వజ్రాలు తాపడం చేసిన సూర్యకఠారి, వైకుంఠ హస్తం (వరదహస్తం), కటిహస్తం, బంగారు కవచాలు, సాలగ్రామ హారాలు శంఖుచక్రాల బంగారు కవచాలు, నవరత్నాలు తాపడం చేసినవి, లక్ష్మీహారం, నాలుగు పేటల సహస్రనామ మాలలు, వజ్ర కిరీటాలు, మకర తోరణంతో పాటు శ్రీవారికి ఆపాదమస్తకం ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలను ఆయా విశేష సందర్భాల్లో స్వామికి అలంకరిస్తారు. ఇవన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? అంటే కోరికలు తీరిన భక్తులు ఇచ్చి ఉంటారు. స్వామి వారు ఎంతమందికి మాట ఇచ్చారో, మాట నిలబెట్టారో, ఎందరికి కడుపును పండించారో, ఎందరికి కడుపు నింపారో, ఎందరికి చేతులు, కాళ్లు, కన్నులిచ్చారో... ఎవరికి తెలుసు. అలా కోరికలు తీరిన భక్తులే స్వామివారికి మణులిచ్చారు. అలంకారాలిచ్చారు. ఆ భక్తులు ఇచ్చిన వాటినే శ్రీనివాసుడు మురిపెంగా అలంకరించుకుంటూ భక్తులను మురిపిస్తున్నారు. -
సమతామూర్తిగా... స్ఫూర్తిప్రదాతగా
మేల్కోటేలో రామానుజులు తన కులాతీత సమానతా సిద్ధాంతాన్ని సమగ్రంగా ఆచరణ ద్వారా నిరూపించి నిర్ధారించారు. తిరునారాయణుడిని పుట్టలోంచి బయటకు తీసి పునఃప్రతిష్ఠ చేయడానికి సహకరించిన గిరిజనులకు, హరిజనులకు ఆలయ ప్రవేశం, దర్శనార్హత కలిగించి సమతను చాటారు. దళితులనే తక్కువ చూపు లేకుండా కొందరిని తన శిష్యులుగా చేర్చుకున్న రామానుజులు భగవత్సేవలో దళితులందరికీ స్థానం ఉండాలని వారికి తిరుక్కులత్తార్ అనే గౌరవప్రదమైన పేరును పెట్టి, నియమనిష్టలను ఏర్పాటు చేసి, పంచసంస్కారాలు గావించి, భగవత్సేవలో కాహళి ఊదే కైంకర్యాన్ని కల్పించి సముచిత స్థానం ఇచ్చారు. సుల్తాను కూతురు శెల్వప్పిళ్లై విగ్రహాన్ని ప్రేమించి తిరునారాయణపురం వస్తే ఆమెకు గోదాదేవితో సమానమైన స్థానాన్ని కల్పించి, రొట్టెల నైవేద్యంతో ఆమెను ఆరాధించే పద్ధతిని ప్రారంభించారు. తొండనూరులో అన్ని కులాలవారికి సాగుజలం, తాగుజలం అందేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని ఏర్పాటు చేశారు. తన శిష్యులలో పట్టినిప్పెరుమాళ్ శూద్రకులజుడు. శ్రీరంగంలోని శివార్లలో ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి రామానుజుడు పట్టినిప్పెరుమాళ్ గుడిసెకు వెళ్లేవారు. అతను పరవశంతో పాడిన పాశురాలను కాస్సేపు వినేవారు. దాశరథి విధేయత రామానుజునికి అత్యంత ప్రియమైన శిష్యుడు దాశరథి. తిరుగోష్టియూర్ వెళ్లినప్పుడు ఒంటరిగా రమ్మంటే కూరేశుడిని, దాశరథిని ఎందుకు వెంటతీసుకొచ్చావని అడిగారు. దాశరథి తనకు దండం వంటి వాడనీ ఎప్పటికీ వదలలేనని అంటారు రామానుజులు. స్నానానికి వెళ్లేముందు ఆయన భుజంపైన చేయివేసి నడిచేవాడు. రామానుజుని ఆచార్యులలో ఒకరైన పెరియనంబి కుమార్తె ఆతుల్యలక్ష్మికి వంటపని రాదని వారి అత్తగారు కోపించి పుట్టింటికి పంపించి వేశారు. మళ్లీ వస్తే వంటవాడితో రమ్మని చెప్పిందామె. పెరియనంబి ఏంచేయాలో తోచక రామానుజుడి దగ్గరికి పంపారు. అంతా విన్న రామానుజుడు, ‘‘దాశరథీ ఈ అమ్మాయి వెంట వెళ్లి వారికి వంట చేసి పెట్టు నాయనా’’ అని పంపించారు. ఆయన మారుమాటాడకుండా వెళ్లిపోయాడు. రోజూ మంచి రుచికరమైన వంటలు చేస్తూ ఉన్నాడు. అత్తగారు శాంతించారు. ఓరోజు ఆతుల్యలక్ష్మి మామగారు ఇంటికి వచ్చిన పండితుడితో శాస్త్రచర్చ చేస్తున్నారు. ఓ సూత్రానికి వారు చెప్పిన అర్థం దాశరథికి వినబడింది. వెంటనే వంట ఇంటి నుంచి బయటికి వచ్చి ‘‘అయ్యా ఆ సూత్రం అర్థం అది కాదు. సమంజసమైన అన్వయం ఇది...’’ అని వివరించి మళ్లీ గరిటె పట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వంటవాడేనా ఈయన. ఏమిటీయన జ్ఞానం. ఇంత జ్ఞాని, పండితుడు, ఘంటం పట్టుకుని పుస్తకాలు వ్రాయాల్సిన వాడు తన ఇంట గరిటె పట్టుకుని వంట చేస్తున్నాడా. ‘నాయనా నీవెవరివి?’ అని అడిగాడు మామగారు. ఆతుల్యలక్ష్మి జోక్యం చేసుకుని ‘‘ఆయన రామానుజుని ప్రప్రథమ శిష్యులు దాశరథి’’ అని చెప్పగానే వారు ఇరువురూ ఆయన పాదాలపై పడి క్షమించమని కోరారు. తమ ఇంట ఈ వంట పని మానేయమని కోరుకున్నారు. దాశరథి ‘‘నేను రామానుజులవారి ఆజ్ఞను శిరసావహించవలసిందే. ఆచార్యుడు ఘంటం పట్టమంటే పడతాను. గంటె తీసుకొమ్మంటే అదే తీసుకుంటాను’’ అన్నాడు. అంతా కలసి దాశరథితో రామానుజుని దగ్గరకు వెళ్లారు. ఆయనకు దాశరథిని అప్పగించి ‘‘మీ శిష్యుడు అపారమైన శాస్త్ర జ్ఞాని. ఆయనచేత వంట చేయించుకోవడం మాకు మహాపాపమే. ఆతుల్యలక్ష్మిని పుట్టింటికి పంపించి వేసినందుకు క్షమించండి. అయ్యా మా కోడలికి మేం వంట నేర్పుకుంటాం, ఇంకేదైనా చేస్తాం, కాని మీరు దయచేసి దాశరథిని మీ ఆశ్రమంలో మీతోనే ఉండనీయండి’’ అని వేడుకున్నారు. కర్షకుడు మాఱనేఱి నంబి యామునాచార్యులు ఓసారి ఊరువెళ్లి వస్తూ ఒక కర్షకుడు బురదనీటిని తాగడం చూసి ఏమిటిదని అడిగారు. కర్షకుడు ‘‘నా భార్య అన్నం తేవడంలో ఆలస్యమైంది. ఆకలి ఈ శరీరమనే మన్నుకే కదా అందుకే ఆ మన్నుకు ఈ మన్నునే తినిపిస్తున్నాను’’ అన్నాడు. ఆ రైతు దేహాభిమానరాహిత్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ జిజ్ఞాసికి పంచసంస్కార కర్మలు అనుగ్రహించి, మాఱనేఱి నంబి అని పేరు పెట్టి తన శిష్యులలో చేర్చుకున్నారు. మాఱనేఱి నంబి శ్రీరంగంలో ఆచార్యుల వారి శుశ్రూష చేస్తూన్న సమయంలో యామునాచార్యుల వారికి రాచవ్రణం లేచింది. ఆ బాధ వల్ల అనుష్టానంలో ఏకాగ్రత కుదరడం లేదు. ఆ బాధను తనకు ఇచ్చేయమని మాఱనేఱి నంబి ప్రార్థించాడు. యామునాచార్యులు ఆ భాధను, త్రిదండాన్ని రోజూ మాఱనేఱి నంబికి ఇచ్చి అనుష్టానం తరువాత మళ్లీ తీసుకునే వారు. మొత్తం ఆ బాధను తనకే ఇమ్మని అది మహాప్రసాదంగా తాను అనుభవిస్తానని పదే పదే ప్రార్థించాడు. ఆయన మన్నించారు. యామునులు అవతారం చాలించిన తరువాత మాఱనేఱి నంబి ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. తన వార్ధక్యంలో మాఱనేఱి నంబి రాచపుండుతో బాధపడడం చూసి రామానుజుడు తట్టుకోలేక శ్రీరంగనాథుని ప్రార్థించి ఆ బాధను తొలగింప చేశారు. సంగతి తెలుసుకున్న మాఱనేఱి నంబి ‘‘రామానుజా ఏమిటీ పని. నా గురువు నాకు ఫలం రూపంలో ఇచ్చిన బాధను అనుభవించకుండా నీవు అడ్డు రాకూడదు. నా బాధను నాకిప్పించు నాయనా’’ అన్నారు. ‘‘నమ్మాళ్వార్ శ్రీ సూక్తిలో ఒక దశకాన్ని స్తుతించి మీ బాధను నివృత్తి చేయాలని ప్రయత్నించాను స్వామీ, నన్ను క్షమించండి’’ అన్నారు రామానుజులు. ‘‘అయితే మళ్లీ ప్రార్థించు. నాబాధ నాకు ఇప్పించు’’ అని ఆదేశించారు గురువుగారు. మళ్లీ ప్రార్థన చేసి విచారంతోనే మళ్లీ ఆ వ్రణాన్ని రప్పించారు రామానుజులు. ఆ బాధతోనే ఆయన పరమపదించారు. పెఱియనంబి వారికి బ్రహ్మమే«ధా సంస్కారం జరిపించారు. ఒక శూద్రుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయిస్తారా అని జాతి బ్రాహ్మణులు ఆగ్రహించి పెఱియనంబికి ఆలయ సేవల నుంచి బహిష్కారం విధించారు. శ్రీరంగని సేవించకపోవడం కన్న శిక్ష ఏముందని పెరియనంబి కుటుంబం కృంగి పోయింది. శ్రీరంగని ఊరేగింపు ఇంటిముందు నుంచి సాగుతున్న సమయంలో ఆయన పుత్రిక అత్తుళాయమ్మ రంగనాథుడిని చూసి ‘‘స్వామీ నా తండ్రి నీకేం అపకారం చేసినాడని ఈ బహిష్కారం, ఇదేనా నీ న్యాయం. ముందు సమాధానం చెప్పిన తరువాతనే నీవు ఇక్కడ నుంచి కదలాలి’’ అని కనుల నీరు కారుతుండగా మనసులో అనుకున్నది. అంతే! రథం ఎంత లాగినా కదలడం లేదు. అందరూ శ్రీరంగని ప్రార్థించినా ప్రయోజనం లేకపోయింది. ‘‘స్వామీ ఏమైంద’’ ని అడిగారు అందరూ. అర్చకునికి సమాధానం స్ఫురింపచేశారు రంగడు. ‘‘ఏ పాపమూ ఎఱుగని పెరియనంబిని బహిష్కరించడం రంగనాథునికి కోపం తెప్పించింది, భక్తుడికి, ఆచార్యానుగ్రహం పొందిన శిష్యుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయడంలో తప్పేమిటి? యామునాచార్యుల బోధలు విన్నవారు చేయవలసిన పనేనా ఇది అని శ్రీరంగడు ఆగ్రహించాడు’’ అని అర్చకుడు వివరించారు. వారంతా లోపలికి వెళ్లి పెరియనంబిని క్షమాపణ కోరి ఆయనను తీసుకువచ్చి రథం ఎక్కించిన తరువాత గాని రథం కదలలేదు. రెండో ప్రతిజ్ఞ: వ్యాస, పరాశర తన ఐశ్వర్యాన్నంతా త్యజించి రామనుజుని శిష్యుడై నిత్యం అభిగమన, ఉపాదాన, ఇజ్య, స్వాధ్యాయ యోగాలను చేస్తూ ఊంఛ వృత్తి (బిక్షాటన)తో జీవిస్తున్న నిరాడంబరుడు నిర్వికారుడు, నిరహంకారుడు, దేహాభిమానం పూర్తిగా వదులుకున్నవాడు కూరేశుడు (ఆళ్వాన్, శ్రీవత్సాంక అనే పేర్లూ ఈయనవే). విపరీతమైన వర్షం వల్ల ఆరోజు భిక్షాటనకు వెళ్లలేదు. ఊంఛవృత్తిలో రేపటికోసం దాచుకోవడం ఉండదు. నారాయణ స్వరూపమైన సాలగ్రామానికి ఒక ఫలాన్ని నివేదించి, ఆ సాలగ్రామ అభిషేక తీర్థాన్ని సేవించి దివ్యప్రబంధం పఠించి పడుకున్నారాయన. భార్య ఆండాళమ్మను తన భర్త ఉపవాసం బాధిస్తున్నది. ఆ సమయంలో శ్రీరంగని రాత్రి ఆరగింపు గంట వినిపించింది. ‘‘నీ భక్తుడు తిండి లేక నకనకలాడుతుంటే నీవు షడ్రసోపేత భోజనం చేస్తున్నావా హు’’ అని నవ్వుకున్నది. కాస్సేపటికి మేళతాళాల ధ్వనులు వినిపించాయి. స్వామి ఊరేగింపు వస్తున్నదనుకుని కూరేశులు ఆండాళ్ బయటకు వచ్చారు. శ్రీరంగడి ఉత్సవ మూర్తి రావడం లేదు. ఆలయ అధికారి ఉత్తమనంబి నెత్తిన ఒక మూటతో వస్తున్నారు. ఇదేమిటని అడిగాడు కూరేశుడు. శ్రీరంగని ప్రసాదం అన్నాడు. ‘‘వితరణ చేయడమో విక్రయించడమో చేయవలసిన శ్రీరంగ ప్రసాదం నాకెందుకు ఇస్తున్నార’’ని కురేశుడు అడిగాడు. ‘‘ఇది శ్రీరంగనాథుని ఆజ్ఞ. నాకు కలలో కనిపించి, నా మిత్రుడు నిరాహారంగా పడుకున్నాడు. నీవు శిరస్సున ప్రసాదం ఉంచుకుని సగౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వమని ఆదేశించారు. మీ కోసం శ్రీరంగడు నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. మీవల్లే నాకీ భాగ్యం కలిగింది. మీకు నా ధన్యవాదాలు, అభివందనములు స్వామీ’ అన్నారాయన. మౌనంగా ప్రసాదం స్వీకరించినా, ఎవరో బలీయంగా అడగకపోతే శ్రీరంగడెందుకు ప్రసాదం పంపిస్తాడని ఆలోచించి భార్యతో ‘‘శ్రీరంగని నీవేమైనా అడిగావా’’ అని ప్రశ్నించాడు. ‘‘నా స్వామి పస్తులుంటే నీవు హాయిగా భుజిస్తున్నావా అని మనసులో అనుకున్నాను’’ అన్నదామె. ‘‘ఎంత పనిచేశావు ఆండాళ్. నా స్వామిని గురించి అంత మాట అంటావా. ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు’’ అని హెచ్చరించాడు.‘‘నేనేమన్నాను.. మీరు మీస్వామి గురించి ఆలోచించారు. అదే విధంగా నేనూ నా స్వామి గురించి ఆలోచించకూడదా? అది నా ధర్మం’’. సరే ఇదేదో దైవసంకల్పమే కావచ్చు అనుకుని ఇద్దరూ రెండు ముద్దలు ప్రసాదాన్ని భక్తితో ఆరగించి నిద్రించారు. శ్రీరంగని ప్రసాదంగా ఆ దంపతులకు శుభకృత్‌నామ సంవత్సరం వైశాఖ మాసం పూర్ణిమ నాడు అనూరాధా నక్షత్రాన కవలలు జన్మించారు. జాతసూతకం ముగిసిన తరువాత రామానుజులు స్వయంగా కూరేశుని ఇంటికి వెళ్లి రక్ష చెప్పి ప్రేమతో పిల్లలను ఎత్తుకున్నారు. ‘‘గోవిందా ... ఏమిటిది ఈ శిశువుల నుంచి ద్వయమంత్ర సుగంధం వస్తున్నది?’’ అనడిగారు. ‘‘లోపలి నుంచి తీసుకువస్తూ రక్ష కోసం ద్వయమంత్రానుసంధానం చేశాను స్వామీ’’ అని గోవిందుడు జవాబిచ్చాడు. ‘‘సరే అయితే నీవే ఈ కవలలకు ఆచార్యుడివై నడిపించు’’. ఆ పసివారికి పంచాయుధ ఆభరణాలు ఇచ్చి దీవించారు. ఆ బాలురకు వ్యాస భట్టర్ అనీ పరాశర భట్టర్ ఇద్దరికీ నామకరణం చేశారు. కూరేశుడు పిల్లలను పట్టించుకునే వారే కారు. శ్రీరంగనాథుడు వీరిని నేను దత్తత తీసుకుంటున్నాను. వారు నా పుత్రులే సుమా అని కూరేశుడితో అన్నారని ప్రతీతి. కాలక్రమంలో గోవిందుని బోధనలతో ఏకసంథాగ్రాహులైన ఇద్దరు బాలురు శాస్త్రాధ్యాయనాలలో అగ్రగాములుగా నిలిచారు. యుక్తవయసులో వారికి ఉపనయన పంచసంస్కారాలు జరిపించారు. కుశాగ్రబుద్ధులైన ఈ కవలలు ఓ రోజు వీధిలో ఆడుకుంటూ ఉంటే ‘‘సర్వజ్ఞ భట్టరు వస్తున్నారు బహుపరాక్’’ అంటూ అరుపులు వినిపించాయి. మేళ తాళాలతో పల్లకిలో వస్తున్న పెద్దమనిషిని చూసి అందరూ పారిపోయారు కాని వ్యాసపరాశర భట్టరులు అక్కడే ఉండి ‘‘ఎవరో సర్వజ్ఞుడని తనకు తానే చాటించుకుంటూ పల్లకీలో ఊరేగుతున్నారు’’ అని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకున్నారు. అక్కడి ఇసుకను రెండు చేతుల్లో పట్టుకుని వ్యాస భట్టరు, ‘‘నా చేతుల్లో ఎంత ఇసుక ఉందో చెప్పండి సర్వజ్ఞులవారూ’’ అని అడిగాడు. ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మళ్లీ మౌనమే సమాధానమయింది సర్వజ్ఞుడికి. ఒక పిడికిలి ఇసుక పారవేసి, ‘‘ఇప్పుడెంత ఉందో చెప్పండి’’ అన్నాడా బాలుడు. ‘‘మీరేమి సర్వజ్ఞులు స్వామీ, రెండు గుప్పిళ్లలో దోసెడు, ఒక్క పిడికిలిలో గుప్పెడు ఇసుక ఉన్నదని తెలియదా’’ అన్నారు. ‘ఈ బాలురతోనే వాదించలేని నేను వీరి తండ్రులతో ఏమి వాదిస్తాను’ అనుకుని ఆయన ఇద్దరు పిల్లలను పల్లకీ ఎక్కించుకుని కూరేశుని ఇంటివద్ద దింపి, సర్వజ్ఞ నినాదాలు మానేసి వెళ్లిపోయారు. తరుణ వయస్కులు కాగానే వివాహం చేయాలని సంకల్పించినా కొన్నేళ్లుగా కంచీపురాన్ని వదిలి, శ్రీరంగని సేవలో ఉన్న కూరేశుడికి సంబంధాల గురించి తెలియదు. ఆండాళ్ ‘‘పిల్లల పెళ్లి గురించి పట్టించుకోరేమి?’’ అని అడిగితే ’’శ్రీరంగనాథుడు, మన స్వామి రామానుజులు ఉండగా మనకేమి దిగులు’’ అని వదిలేశారాయన. ‘‘రంగనాథా! పిల్లల పెళ్లి గురించి నన్నడుగుతారేమిటి, నీవుండగా, అదేదో నీవే చూసుకో’’ అని ఆ రాత్రి ఏకాంత సేవ తరువాత చెప్పి వచ్చేశారు. సంబంధాలు వెతుకుతూ రామానుజుడు ఇద్దరు కన్యలున్న బ్రహ్మజ్ఞాని మహాపూర్ణుడి బంధువు ఒకాయన ఉన్నాడని గమనించాడు. వారిని అడుగుదామన్నారు రామానుజులు. కన్యాదాత ఎందుకో నిరాకరించారు. కూరేశుడు స్మార్త బ్రాహ్మణ కులం వడమ శాఖకు చెందిన వాడు. మహాపూర్ణుడు బృహచ్చరణ వర్గానికి చెందిన పురశ్శిఖా బ్రాహ్మణుడు. ఈ కులాంతర భేదం వల్ల నిరాకరించి ఉంటారని ఒక అభిప్రాయం. కాని ఆశ్చర్యకరంగా ఓరోజు ఆయనే ముందుకు వచ్చి ఈ యువకులకు కన్యాదానం చేస్తానన్నారు. ‘‘శ్రీరంగనాథుడు నా కలలో కనిపించి’’ నా దత్త పుత్రులకు కన్యలను ఎందుకు ఇవ్వవు అని అడిగారు. ఇంతకన్న నాకు కావలసిందేముంది. నన్ను క్షమించి అంగీకరించండి’’ అని వేడుకున్నారు. మణ్ణి, అక్కచ్చిలను వారికిచ్చి వివాహం చేశాడాయన. గురుకృప, భగవదనుగ్రహం ఉన్న వ్యాస పరాశరులు ఆ మహర్షుల గౌరవాన్ని నిలబెట్టే రచనలు చేసి రామానుజుని ప్రియశిష్యులై భాసిల్లారు. పరాశర భట్టర్ శ్రీ లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ గుణరత్న కోశం, రంగనాథ వైభవాన్ని వివరించే శ్రీరంగరాజస్తవం, పూర్వోత్తర శతకాలు, త్రిమంత్ర సారాంశమైన అష్టశ్లోకి, శ్రీరంగనాథ స్తోత్రం, విష్ణుసహస్రనామస్తోత్రానికి సవివర వ్యాఖ్యానమైన శ్రీ భగవద్గుణ దర్పణం, కైశిక పురాణానికి చేసిన మణిప్రవాళ వ్యాఖ్యానం, అత్యంత మధురంగా ముక్త శ్లోకాలను రచించారు. పరాశరభట్టర్ అసాధారణ పాండిత్య వైభవాన్ని ప్రకటించే ఈ రచనలు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజానీకానికి చేరువ చేశాయి. వీరిరువురి రచనలు విష్ణుపురాణంలోని విశ్వతత్వాన్ని, జీవతత్త్వాన్ని, పరమాత్మతత్వాన్ని సులభగ్రాహ్యరీతిలో నిర్ధారించాయి. వ్యాసుడు, పరాశరుడు రచించిన పురాణాల మూలతత్వాన్ని, తత్వత్రయమును ఆ పేర్లుగలిగిన ఇద్దరు మహాభక్తుల ద్వారా వ్యాఖ్యానింపచేయడం రామానుజుని సమర్థత. తద్వారా వ్యాస పరాశర మునుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేసి యామునులకు ఇచ్చిన రెండో వాగ్దానం రామానుజులు నెరవేర్చారు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ రాజ్యభాషా కమిటీలోని 32 మంది సభ్యులు, తమిళనాడు మంత్రి సంపత్, వెఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి దర్శించుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా, సినీ నటుడు మురళీ శర్మ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. -
రథ సప్తమికి సిఫారసు లేఖలు రద్దు
సాక్షి, తిరుమల: ఈనెల 24న రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజున ఆర్జిత సేవలు, వృద్దులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేశామని, 25,26,27 తేదీలలో సిఫారసు లేఖలు రద్దు చేశామని, ప్రొటోకాల్ వారికి మాత్రమే విఐపి దర్శనాలు ఉంటాయని వివరించారు. రథసప్తమినాడు శ్రీవారు ఏడు వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతారని, ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చివరగా చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని ఆయన తెలిపారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రతి గ్యాలరీకి ఓ టిటిడి ఉద్యోగి, నాలుగు మాడ వీధుల్లో ఎనిమిదిమంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుండి టీటీడీ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని జేఈఓ స్పష్టం చేశారు. -
శ్రీవారి సేవా టిక్కెట్లు ఏప్రిల్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్లో విడుదల చేశారు. ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టం ద్వారా 10,658 సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,878, తోమాల సేవ, అర్చన ఒక్కొక్కటి 120 చొప్పున, అష్టదళం 240, నిజపాద దర్శనం 2,300, ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం 45,935. విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లును అందుబాటులో ఉంచింది. -
తిరుమలలో టైం స్లాట్ సర్వదర్శనానికి శ్రీకారం
తిరుమల: శ్రీవారి టైంస్లాట్ సర్వదర్శనానికి సోమవారం నుంచి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో ఉదయం 6 గంటలకు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కౌంటర్లకు పూజ చేసి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన శకుంతలరామన్ ఆధార్‌కార్డు ఆధారంగా తొలి టికెట్టు పొందారు. 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న టైంస్లాట్లలో ఎంపిక చేసుకున్న సమయాన్నిబట్టి భక్తులు టికెట్లను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. టికెట్లు పొందిన భక్తులను దివ్యవదర్శనం కాంప్లెక్స్ నుండి అనుమతిస్తారు. టికెట్లను స్కానింగ్ చేసిన తర్వాత ఒక్కో భక్తుడికి రూ.10ల లడ్డూలు రెండు, రూ.25ల లడ్డూలు మరో రెండు అందజేస్తారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లిన భక్తులకు రెండు గంటల్లోపే శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశౠమని, మార్చి నుంచి తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేఈవో వెల్లడించారు. ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి లోటుపాట్లు సవరిస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో ఎ.రవికృష్ణ, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఐటీ అధికారి శేషారెడ్డి, పీఆర్వో రవి, డాలర్ శేషాద్రి పాల్గొన్నరు. కాగా, సర్వ దర్శనం స్లాట్ విధానం ద్వారా సోమవారం 18 వేలకుగాను 12 వేల టోకెన్లు జారీ చేశారు. మంగళవారం 20 వేలు మంజూరు చేయనున్నారు. -
17 నుంచి శ్రీవారికి సుప్రభాతం రద్దు
తిరుమల: తిరుమలలో ఈనెల 17నుంచి శ్రీవారికి సుప్రభాతం కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2018 జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు మొత్తం 30 పాశురాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ నెల రోజులపాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయబద్ధంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణ ప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేదీ నుంచి యథావిధిగా సుప్రభాత సేవ జరుగుతుంది. -
శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పీఠాధిపతులు
తిరుమల:కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కంచి పీఠాధిపతికి జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అలాగే కర్ణాటకాలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామికి టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వారి వెంట పారుపత్తేదార్ రామచంద్ర, ఓఎస్డి డాలర్ శేషాద్రి, బొక్కసం ఇన్చార్జి గురురాజారావు ఉన్నారు. -
శ్రీవారి పుష్కరిణికి ఏగతి..!
–మురికికూపంలా నృసింహ సాగరం –ఆవేదనలో భక్తులు ద్వారకా తిరుమల : శ్రీవారి క్షేత్రంలో పుష్కరిణి అధ్వానంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ నృసింహ సాగరం ప్రస్తుతం మురికికూపంగా తయారైంది. పూర్వం ఈ నృసింహ సాగరాన్ని శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేవారు. రోజు స్వామివారికి తీర్థపు బిందెను ఈ కోనేరు నుంచే అర్చకులు తీసుకెళ్లేవారు. కాల క్రమేణా ఆ ఆచారం మరుగునపడింది. భక్తులు మాత్రం ఇప్పటికీ స్నానాలు చేసేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఏటా వినాయకుని విగ్రహాల నిమజ్జనాలను ఈ చెరువులోనే చేస్తారు. అలాగే పత్రి, ఇతర పూజా సామగ్రిని గ్రామస్తులు ఈ పుష్కరిణిలోనే కలుపుతారు. ఈ ఏడు కూడా భక్తులు వీటిని పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. దీంతో చెత్తాచెదారం కోనేరు ఒడ్డుకు చేరడంతో ఆ ప్రాంతమంతా మురికిమయంగా మారింది. కోనేరులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేనంతగా తయారైంది. అట్ల తద్దినాడు స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పలువురు మహిళలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణిని శుభ్రం చేయించి మోక్షం కలిగించాలని భక్తులు కోరుతున్నారు. -
శ్రీవారి లడ్డూల కోసం భక్తుల నిరసన
– అదనపు లడ్డూలు ఇవ్వాలని నినాదాలు సాక్షి,తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం బుధవారం భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్లో భక్తుల రద్దీని బట్టి రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాల్గు చొప్పన లడ్డూలు విక్రయిస్తారు. ఉదయం వేళ సుమారు 2 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. తర్వాత కౌంటర్ మూసివేశారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము క్యూలో నిరీక్షిస్తున్నా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్ మూసివేయటం తగదంటూ ఆలయం వద్ద నినాదాలు చేశారు. ‘‘వీ వాంట్ లడ్డూస్..వీ వాంట్ లడ్డూస్’’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై వారిని వారించి పంపించేశారు. రోజూ 3 నుండి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నా డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండటమే లడ్డూల కొరతకు ప్రధాన కారణంగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అదనపు లడ్డూలు తయారు చేయటానికి ఆలయ పోటులో స్థలం సరిపోదని చెబుతున్నారు. నేడు గోకులాష్టమి తిరుమలలో శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమక్షంలో ఆలయ పురవీ«ధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన ∙కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. -
గోవర్ధనగిరి అలంకారంలో శ్రీవారు
విజయవాడ(గుణదల): పవిత్ర కృష్ణా పుష్కరాల్లో భాగంగా శనివారం గోవర్థనగిరి అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయ నమూనా నుంచి సమ్మోహితమైన మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పద్మావతి ఘాట్ లో పుష్కర హారతి అందుకున్నారు. శ్రీవారి ఉత్సవ ఊరేగింపు జరుగుతున్న ప్రాంతాల్లో టీటీడీకి చెందిన చెక్కభజన, కోలాట కళాకారులు సమ్మోహనేతంగా ప్రదర్శించారు. అనంతరం కృష్ణమ్మ సాక్షిగా స్వామివారికి కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూరహారతి సమర్పించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హారతిని టీటీyీ రిటైర్డ్ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హారతి సమర్పించారు. టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు దేవాలయాన్ని దర్శించుకున్నారు. -
12 గంటల్లో శ్రీవారి దర్శనం
12 గంటల్లో శ్రీవారి దర్శనం సాక్షి, తిరుమల : వారపు సెలవుల నేపథ్యంలో శనివారం తిరుమలలో భక్తులరద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 57,810 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 26 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 10 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ గదుల కోసం నిరీక్షణ తప్పలేదు. కల్యాణ కట్టల వద్ద రద్దీ కనిపించింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.54 కోట్లు లభించాయి. -
శ్రీవారి హుండీ చరిత్ర
-
కాలినడకతో శ్రీవారిని దర్శించుకున్న 200 మంది వికలాంగులు
చంద్రగిరి: హైదరాబాద్‌కు చెందిన రెండు వందల మంది వికలాంగులు శుక్రవారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వేణుకుమార్ చుక్కల ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 200 మంది వికలాంగులు, మరో వందమంది వాలంటీర్లు తిరుమలకు నడచి వెళ్లేందుకు శుక్రవారం శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్దకు చేరుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి జెండా ఊపి వారి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చుక్కల చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఇంతమంది కాలినడకన తిరుమలకు రావడం అభినందనీయమన్నారు. వికలాంగ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి వారిని వారి స్వస్థలంకు చేరుకునే విధంగా టీటీడీ సహాయసహకారాలు అందజేస్తుందన్నారు. మనోనేత్రంతో దర్శించుకునేందుకు వెళుతున్న అంధులకు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటాయన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ వేణుకుమార్ చుక్కల మాట్లాడుతూ తన జీవితంలో వికలాంగ భక్తులతో కలసి 1000 సార్లు శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానన్నారు. తాను ఇప్పటి వరకు 150సార్లు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. -
జోరుగా శ్రీవారి డాలర్ల విక్రయాలు
సాక్షి, తిరుమల: అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ. 30 లక్షల విలువచేసే డాలర్ల అమ్మకాలు జరిగాయి. రూ. 26,020 విలువచేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ. 13,225ల విలవచేసే 5 గ్రాముల బంగారు డాలర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ. 5,485ల ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేవు. రూ. 850ల విలువచేసే 10 గ్రాముల వెండి డాలర్లు, రూ. 475ల విలువైన 5 గ్రాముల వెండి డాలర్లూ అమ్ముడుపోయాయి. రూ. 275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్లు స్టాకు లేవు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వస్తే తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో తీసుకురావడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం చేశారని భక్తులు ధ్వజమెత్తారు. అలాగే, డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు సమాచారం. -
తిరుమలేశుడికి బంగారు పాదాలు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు బంగారు పాదాలు బహూకరించాడు. విజయవాడకు చెందిన సిరినాథ్ అనే భక్తుడు సుమారు రూ.30 లక్షల విలువ చేసే బంగారు పాదాలను గురువారం స్వామివారికి సమర్పించాడు. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆ భక్తుడు ...ఈ మేరకు బంగారు పాదాలను ఈవోకు అందచేశారు. -
శ్రీకృష్ణుని అవతారంలో ఆదిదేవుడు