సాక్షి, తిరుమల: ఈనెల 24న రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజున ఆర్జిత సేవలు, వృద్దులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేశామని, 25,26,27 తేదీలలో సిఫారసు లేఖలు రద్దు చేశామని, ప్రొటోకాల్ వారికి మాత్రమే విఐపి దర్శనాలు ఉంటాయని వివరించారు. రథసప్తమినాడు శ్రీవారు ఏడు వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతారని, ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చివరగా చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని ఆయన తెలిపారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రతి గ్యాలరీకి ఓ టిటిడి ఉద్యోగి, నాలుగు మాడ వీధుల్లో ఎనిమిదిమంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుండి టీటీడీ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని జేఈఓ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment