12 గంటల్లో శ్రీవారి దర్శనం
12 గంటల్లో శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల : వారపు సెలవుల నేపథ్యంలో శనివారం తిరుమలలో భక్తులరద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 57,810 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 26 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 10 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ గదుల కోసం నిరీక్షణ తప్పలేదు. కల్యాణ కట్టల వద్ద రద్దీ కనిపించింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.54 కోట్లు లభించాయి.