శ్రీవారి సేవా టిక్కెట్లు ఏప్రిల్‌ కోటా విడుదల | Srivari seva tickets April quota release | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవా టిక్కెట్లు ఏప్రిల్‌ కోటా విడుదల

Published Fri, Jan 5 2018 9:42 AM | Last Updated on Fri, Jan 5 2018 12:17 PM

సాక్షి, తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్‌లో విడుదల చేశారు. ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టం ద్వారా 10,658 సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సు​ప్రభాతం 7,878, తోమాల సేవ, అర్చన ఒక్కొక్కటి 120 చొప్పున, అష్టదళం 240, నిజపాద దర్శనం 2,300, ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం 45,935. విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్‌ సేవ 3వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లును అందుబాటులో ఉంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement