Seva tickets
-
అందుబాటులో దుర్గమ్మ దసరా ఆర్జిత సేవా టికెట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను నిర్వహిస్తారు. ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్ కౌంటర్, మహామండపం దిగువన టోల్‌ఫ్రీ నంబర్ కౌంటర్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 5 వేలు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్ ధర రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమం టికెట్ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్ సభ అక్టోబర్ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. -
సామాన్య భక్తుడికే తొలి ప్రాధాన్యం
తిరుమల : శ్రీవారి దర్శనంలో టీటీడీ సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తోంది. మే, జూన్, జూలై మాసాల్లో కోనేటిరాయుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.టిక్కెట్లు పొందిన భక్తులు వారి కి కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు వస్తే రెండు, మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్ల కోటాను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే సుప్రభాతం, అర్చన, తోమాల, వారపుసేవలైన అష్టధళపాదపద్మారాధన సేవా టిక్కెట్లకు సంబంధించి ఎల్రక్టానిక్ డిప్ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో భక్తులకు టిక్కెట్లను కేటాయించనుంది. ఇక గురువారం మధ్యాహ్నం 3గంటలకు జూలై మాసం శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. ఈ నెలæ 21వ తేదీన ఉదయం 10 గంటలకు జూలై మాసం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెలæ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 24న మే మాసం వర్చువల్ ఆర్జిత సేవాటిక్కెట్ల కోటాని అందుబాటులో ఉంచనుంది. మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను ఈనెలæ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. నిత్యం 10వేల నుంచి 12వేల టిక్కెట్ల లెక్కన దాదాపు 7లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లని భక్తులకు అందుబాటులో ఉంచనుంది. మే నెల గదుల కోటాను ఈనెలæ 26న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈక్రమంలోనే ఆన్లైన్లో టికెట్లు దొరకని వారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో 1,240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. -
తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి శ్రీవారి సేవలకు భక్తులకు అనుమతి ఇచ్చారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్లో సేవా టికెట్లు కొనుగోలు చేయ్యాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. -
Yadagirigutta: భారీగా పెరిగిన యాదాద్రి రాబడి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కైంకర్యాల ధరలు పెంచిన తొలి రోజైన శుక్రవారం వివిధ పూజలతో నిత్య రాబడి రూ.18,93,248 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టిక్కెట్ ధరలు పెరిగిన తొలి రోజు భక్తులు కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు. శాశ్వత పూజలతో రూ.9,12,120 లడ్డూ, పులిహోర, వడ వంటి ప్రసాదం విక్రయాలతో రూ.4,21,460 సువర్ణ పుష్పార్చనతో రూ.1,02,720తో పాటు ప్రధాన బుకింగ్‌తో రూ.1,37,198 దర్శనం రూ.100 టిక్కెట్‌తో రూ.40,000 కైంకర్యాలతో రూ.2,600 ప్రచార శాఖతో రూ.8,300 క్యారీ బ్యాగులతో రూ.7,700 శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.85,500 కల్యాణ కట్టతో రూ.18,800 వాహన పూజలతో రూ.10,800 టోల్ గేట్‌తో రూ.1,340 అన్నదాన విరాళంతో రూ.13,358 వేద ఆశీర్వచనంతో రూ.5,232 యాదరుషి నిలయంతో రూ.58,180 పాతగుట్ట ఆలయంతో రూ.30,920 గో పూజతో రూ.500 ఇతర పూజలతో రూ.35,720 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు) -
ఆర్జిత సేవ కుంభకోణం లో పలువురు ఉద్యోగుల పై వేటు
-
తిరుమల శ్రీవారి సేవా టికెట్లలో మరో కుంభకోణం
-
టీటీడీలో సేవా టిక్కెట్ల కుంభకోణం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో కుంభకోణం చోటుచేసుకుంది. శ్రీవారి సేవా టిక్కెట్ల అమ్మకాలతో భారీగా ఆదాయం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. అయితే కొందరు దుండగలు వాటిని కూడా మార్ఫింగ్ చేసి భక్తులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. కొందరు కేటుగాళ్లు ఐడీలు మార్ఫింగ్ చేసి సేవా టిక్కెట్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నకిలీ సేవా టిక్కెట్లతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 2600 సేవా టిక్కెట్లను రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక మాజీ ఐఏఎస్ కొడుకు హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా నకిలీ టిక్కెట్లు తయారు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలిపారు. నకిలీ సేవా టిక్కెట్ల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటకకు వెళ్లింది. -
శ్రీవారి సేవా టిక్కెట్లు ఏప్రిల్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్లో విడుదల చేశారు. ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టం ద్వారా 10,658 సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,878, తోమాల సేవ, అర్చన ఒక్కొక్కటి 120 చొప్పున, అష్టదళం 240, నిజపాద దర్శనం 2,300, ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం 45,935. విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లును అందుబాటులో ఉంచింది. -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు, జనవరిలో నిర్వహించనున్న వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో www.ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా టికెట్లను భక్తులు ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. డయల్ యువర్ టీటీడీ ఈవో తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877- 2263261 నెంబరుకు డయల్ చేసి ద్వారా నేరుగా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు. -
అందుబాటులో ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి రోజు ఉదయం వేళలో నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లు సోమవారం లక్కీడిప్‌లో అందుబాటులో ఉంటాయి. మంగళవారం వేకువజామున స్వామివారికి నిర్వహించే తోమాల - 04, అర్చన-10 టికెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్జిత సేవల్లో ఖాళీగా ఉన్న కొన్ని టికెట్లను భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అదనంగా లక్కీడిప్ ద్వారా సుప్రభాతం-25, అష్టదళం-15, తోమాల-10, అర్చన-10 టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లను కేంద్రీయ విచారణ కార్యాలయంలోని విజయబ్యాంక్లో లక్కీడిప్ పద్ధతిలో భక్తులకు కేటాయిస్తారు. సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు భక్తులు తమ పేర్లు కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి. 5 గంటల తరువాత ఎంపికైన భక్తులకు ఎస్ఎమ్ఎస్ల ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఎంపికైన భక్తులు రాత్రి 8లోపు టికెట్లు కోనుగోలు చేయాలి. టికెట్లు పొందిన భక్తులు మంగళవారం ఈ సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీవారి దర్శనానికి 22 గంటలు: తిరుమల శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. ఆదివారం సెలవురోజు కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగాపెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,324 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.