యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కైంకర్యాల ధరలు పెంచిన తొలి రోజైన శుక్రవారం వివిధ పూజలతో నిత్య రాబడి రూ.18,93,248 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టిక్కెట్ ధరలు పెరిగిన తొలి రోజు భక్తులు కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు.
శాశ్వత పూజలతో రూ.9,12,120 లడ్డూ, పులిహోర, వడ వంటి ప్రసాదం విక్రయాలతో రూ.4,21,460 సువర్ణ పుష్పార్చనతో రూ.1,02,720తో పాటు ప్రధాన బుకింగ్‌తో రూ.1,37,198 దర్శనం రూ.100 టిక్కెట్‌తో రూ.40,000 కైంకర్యాలతో రూ.2,600 ప్రచార శాఖతో రూ.8,300 క్యారీ బ్యాగులతో రూ.7,700 శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.85,500 కల్యాణ కట్టతో రూ.18,800 వాహన పూజలతో రూ.10,800 టోల్ గేట్‌తో రూ.1,340 అన్నదాన విరాళంతో రూ.13,358 వేద ఆశీర్వచనంతో రూ.5,232 యాదరుషి నిలయంతో రూ.58,180 పాతగుట్ట ఆలయంతో రూ.30,920 గో పూజతో రూ.500 ఇతర పూజలతో రూ.35,720 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు)
Comments
Please login to add a commentAdd a comment