![Yadagirigutta young woman Died In road Accident At USA](/styles/webp/s3/article_images/2024/05/27/NRI_0.jpg.webp?itok=msg9sCpy)
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా(25) గుర్తించారు.
గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. చదువుతోపాటు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఈ క్రంమలో ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment