తిరుమల : శ్రీవారి దర్శనంలో టీటీడీ సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తోంది. మే, జూన్, జూలై మాసాల్లో కోనేటిరాయుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.టిక్కెట్లు పొందిన భక్తులు వారి కి కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు వస్తే రెండు, మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.
అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్ల కోటాను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే సుప్రభాతం, అర్చన, తోమాల, వారపుసేవలైన అష్టధళపాదపద్మారాధన సేవా టిక్కెట్లకు సంబంధించి ఎల్రక్టానిక్ డిప్ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో భక్తులకు టిక్కెట్లను కేటాయించనుంది. ఇక గురువారం మధ్యాహ్నం 3గంటలకు జూలై మాసం శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేయనుంది. ఈ నెలæ 21వ తేదీన ఉదయం 10 గంటలకు జూలై మాసం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెలæ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 24న మే మాసం వర్చువల్ ఆర్జిత సేవాటిక్కెట్ల కోటాని అందుబాటులో ఉంచనుంది.
మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను ఈనెలæ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. నిత్యం 10వేల నుంచి 12వేల టిక్కెట్ల లెక్కన దాదాపు 7లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లని భక్తులకు అందుబాటులో ఉంచనుంది. మే నెల గదుల కోటాను ఈనెలæ 26న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈక్రమంలోనే ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని వారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో 1,240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment