సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో కుంభకోణం చోటుచేసుకుంది. శ్రీవారి సేవా టిక్కెట్ల అమ్మకాలతో భారీగా ఆదాయం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. అయితే కొందరు దుండగలు వాటిని కూడా మార్ఫింగ్ చేసి భక్తులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.
కొందరు కేటుగాళ్లు ఐడీలు మార్ఫింగ్ చేసి సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నకిలీ సేవా టిక్కెట్లతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 2600 సేవా టిక్కెట్లను రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక మాజీ ఐఏఎస్ కొడుకు హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా నకిలీ టిక్కెట్లు తయారు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలిపారు. నకిలీ సేవా టిక్కెట్ల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటకకు వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment