సాక్షి, తిరుమల: అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ. 30 లక్షల విలువచేసే డాలర్ల అమ్మకాలు జరిగాయి. రూ. 26,020 విలువచేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ. 13,225ల విలవచేసే 5 గ్రాముల బంగారు డాలర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ. 5,485ల ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేవు.
రూ. 850ల విలువచేసే 10 గ్రాముల వెండి డాలర్లు, రూ. 475ల విలువైన 5 గ్రాముల వెండి డాలర్లూ అమ్ముడుపోయాయి. రూ. 275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్లు స్టాకు లేవు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వస్తే తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో తీసుకురావడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం చేశారని భక్తులు ధ్వజమెత్తారు. అలాగే, డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు సమాచారం.
జోరుగా శ్రీవారి డాలర్ల విక్రయాలు
Published Wed, Apr 22 2015 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement
Advertisement