dollors
-
భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్‌లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
రూపాయి శుభారంభం
ముంబై: కొత్త ఏడాదిలో రూపాయి శుభారంభం చేసింది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు లాభపడి 71.22 వద్ద ముగిసింది. స్థూల ఆర్ధిక గణాంకాలు మెరుగ్గా ఉండటం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల అం చనాలు వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు దోహదపడ్డాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్
న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే వర్ధమాన దేశాల కరెన్సీలు బలపడటంతో బుధవారం రూపాయి కూడా కొంత కోలుకుంది. దేశీ కరెన్సీ మారకం విలువ 16 పైసలు పెరిగి 71.55 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం బులిష్‌గానే ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్.. ఒక దశలో 71.36 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివర్లో 16 పైసలు లాభంతో ముగిసింది. దేశీ కరెన్సీ మంగళవారం ఆరు నెలల కనిష్ట స్థాయి 71.71కి పతనమైన సంగతి తెలిసిందే. ఆర్థిక అనిశ్చితి, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తదితర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రూపాయి కోలుకోవడం గమనార్హమని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. ‘వరుసగా నాలుగు సెషన్లుగా బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ, డాలర్ ఇండెక్స్ అధిక స్థాయుల్లో కొనసాగుతున్నప్పటికీ రూపాయి మాత్రం గడిచిన రెండు సెషన్లలో వాటిల్లిన నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోగలిగింది‘ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ చెప్పారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల ప్రభావాలపై ఇన్వెస్టర్లు ఒక అంచనాకు వస్తుండటంతో వర్ధమాన మార్కెట్ కరెన్సీలు కాస్త బలపడ్డాయని ఆయన వివరించారు. -
రూపాయి 54 పైసలు డౌన్
ముంబై: చమురు ధరల పెరుగుదల, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోందన్న ఆందోళనలు, తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూపాయిపైనా గణనీయమైన ప్రభావం చూపించాయి. డాలర్లకు డిమాండ్ ఏర్పడడంతో శుక్రవారం డాలర్‌తో రూపాయి 54 పైసలు నష్టపోయి రూ.69.60కు చేరింది. రూపాయితోపాటు వర్ధమాన కరెన్సీలపైనా ఈ ప్రభావం పడింది. చైనాకు చెందిన 300 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను సెప్టెంబర్ 1 నుంచి విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మరోసారి ప్రకటించడం గమనార్హం. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 69.26 వద్ద మొదలైన రూపాయి ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.69.67 కనిష్ట స్థాయిని నమోదు చేసి చివరకు 69.60 వద్ద క్లోజయింది. రూపాయికి వరుసగా ఇది రెండో రోజు నష్టం. గురు, శుక్రవారాల్లో మొత్తం మీద డాలర్‌తో 81 పైసలు నష్టపోయింది. వారం మొత్తంమీద నికర నష్టం 71 పైసలు. -
1350 డాలర్లు దాటేయొచ్చు!!
గడిచిన ఏడాది కాలంగా చూస్తే గత వారంలో పసిడి మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనపర్చింది. ఇదే ఊపు కొనసాగిస్తే.. కీలకమైన దీర్ఘకాలిక నిరోధ స్థాయి 1,350 డాలర్ల మార్కును సమీప కాలంలోనే దాటేసేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ కల్పన గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో బంగారం ధరలు మళ్లీ 1,350 డాలర్ల చేరువకు దగ్గరయ్యాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో ఆగస్టు కాంట్రాక్టుకు సంబంధించి పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 2.7 శాతం పెరిగి ఒక దశలో 1,347.10 డాలర్లుగా ట్రేడయ్యింది. గత నెలలో కనీసం 1,77,000 ఉద్యోగాల కల్పన జరగవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినప్పటికీ .. వాస్తవానికి కేవలం 75,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరగడం పసిడి ర్యాలీకి కారణమైనట్లు ఆర్థికవేత్తలు తెలిపారు. పసిడి మరింత అధిక స్థాయికి పరుగులు తీసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆర్జేవో ఫ్యూచర్స్ సంస్థ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఫిలిప్ స్ట్రీబుల్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఔన్సుకు 1,400 డాలర్లకు కూడా చేరగలిగేంత సత్తా కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని గట్టి నిరోధ స్థాయులు కూడా ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. 2015లో కనిష్ట స్థాయిని తాకినప్పట్నుంచి 1,350 నిరోధ స్థాయిని పసిడి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు పరీక్షిస్తూ వస్తోంది. ఏదైతేనేం.. పసిడి రేటు 1,350కి పైన పటిష్టంగా ముగిసిన పక్షంలో మధ్య కాలికంగా ఆ తర్వాత 1,360, 1,375 స్థాయులకు చేరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
మూడు రోజుల్లో పట్టేశారు..!
సాక్షి, సిటీబ్యూరో: కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి శస్త్ర చికిత్స చేయించేందుకు నగరానికి వచ్చిన ఓ ఆఫ్ఘానీ జేబులో డబ్బు కొట్టేశాడో పిక్ పాకెటర్. మరో వారంలో ఆపరేషన్ ఉండగా ఉన్న డబ్బంతా పోవడంతో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ డబ్బు దొరక్కపోతే తన కుమారుడికి జీవితంలో ఆపరేషన్ చేయించలేనని ప్రాధేయపడ్డాడు. ఇతడి పరిస్థితిని గమనించిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసుకు కీలక ప్రాధాన్యం ఇస్తూ దర్యాప్తు చేశారు. ఫలితంగా మూడు రోజుల్లో దొంగను పట్టుకోవడంతో పాటు మొత్తం నగదు రికవరీ సాధ్యమైందని అదనపు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం తెలిపారు. కుమారుడి కోసం అప్పులు చేసి... ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫరాష్థ్ హర్సా జిల్లా, సమన్గమ్ గ్రామానికి చెందిన సయ్యద్ మీర్వాస్ రహేమి ఓ చిన్న రైతు. అతడి ఆరేళ్ల కుమారుడికి కంటికి సంబంధించిన వ్యాధి వచ్చింది. అక్కడ వైద్యం చేయించడం సాధ్యం కాకపోవడంతో గత నెల 29న నగరానికి వచ్చాడు. వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి డబ్బు తెచ్చుకున్నాడు. బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో సోమ వారం శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా గత శుక్రవారం ప్రార్థనల నిమిత్తం అతను పాతబస్తీలోని మక్కా మసీదుకు వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చే సమయంలో తన కుర్తా జేబు ఖాళీగా ఉండటాన్ని గుర్తించాడు. కుమారుడి వైద్యం కోసం తీసు కువచ్చిన డబ్బు ఎవరో కొట్టేయడంతో లబోదిబోమంటూ హుస్సేనిఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఫీడ్ అధ్యయనంతో... మక్కా మసీదులో రహేమికి చెందిన 1400 అమెరికా డాలర్లు, 5 వేల ఆఫ్ఘానీ కరెన్సీ చోరుల పాలు కావడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, మహ్మద్ తఖీవుద్దీన్, వి.నరేందర్ ప్రాథమికంగా మసీదుకు చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గేటు ఎదురుగా ఉన్న కెమెరాలో పాత నేరగాడైన మీర్జా రెహ్మత్ బేగ్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. గతంలో చంద్రాయణగుట్ట, బేగంబజార్ ఠాణాల్లో జేబు దొంగతనాలకు పాల్పడిన మీర్జాను సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. విదేశీ కరెన్సీలు మార్చుకోవడం అతడికి సాధ్యం కాకపోవడంతో ఆ మొత్తాన్ని యథాతథంగా రికవరీ చేశారు. నిందితుడిని హుస్సేనిఆలం అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న రహేమి హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బైకులంటే సరదా... వట్టేపల్లికి చెందిన మీర్జా (20) నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఏటా పరీక్ష రాస్తూనే ఉన్నాడు. ఇతగాడికి కొత్త, హైఎండ్ బైకులంటే మహా మక్కువ. దీంతో పాటు అనునిత్యం హుక్కా పార్లర్స్‌లో ఎంజాయ్ చేయడం, తన గర్ల్‌ఫ్రెండ్‌తో (ఇటీవలే వివాహం చేసుకున్నాడు) కలిసి షికార్లు చేయడానికి ఇష్టపడేవాడు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించకపోవడంతో జేబు దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. గతంలో కొన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఇతడిలో మార్పు రాలేదు. హుస్సేనిఆలం డిటెక్టివ్ సబ్–ఇన్స్పెక్టర్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘కుమారుడి వైద్యం కోసం నగరానికి వచ్చిన ఓ విదేశీయుడు బాధితుడిగా ఉండటంతో కేసుకు ప్రాధాన్యం ఇచ్చాం. రహేమి కుమారుడికి సోమవారం జరగాల్సిన ఆపరేషన్ వాయిదా పడింది. అతడి డబ్బు మొత్తం దొరికినప్పటికీ న్యాయస్థానం ద్వారానే అప్పగించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరలో అది పూర్తి చేసి ఆయన కుమారుడికి శస్త్రచికిత్స జరిగేలా చూస్తాం’ అన్నారు. -
కన్యత్వం ఖరీదు... రూ. 20 కోట్లు
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన 19 ఏళ్ల టీనేజర్ కన్యత్వాన్ని 20 కోట్ల రూపాయలకు వేలంపాటలో సౌదీ అరేబియాకు చెందిన వ్యాపారవేత్త దక్కించుకున్నారు. చదువు, ఇతర ఆర్థిక అవసరాల కోసం గిసెల్లీ తన కన్యత్వాన్ని సిండ్రెల్లా ఎస్కార్ట్స్ వెబ్సైట్లో వేలానికి పెట్టారు. గిసెల్లీ కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రష్యాకు చెందిన ఒక రాజకీయవేత్త, హాలీవుడ్‌కు చెందిన బిజినెస్మెన్, మరో ఇద్దరు నటులు, మరికొందరు పోటీపడ్డారు. అయితే అబుదాబీ చెందిన ఒక వ్యాపారవేత్త అందరికన్నా అత్యధికంగా 20 కోట్లు కన్యత్వాన్ని కొనుగోలు చేశారు. కన్యత్వాన్నివేలం వేయడంతో వచ్చిన డబ్బుతో స్కూలు ఫీజు కట్టుకోవడంతో పాటు, సరదాగా ప్రపంచాన్ని చుట్టేస్తానని గిసెల్లీ ప్రకటించారు. తన కన్యత్వాన్ని వేలం వేయడం ద్వారా ఏదో కొంత మొత్తం వస్తుందని ఊహించానని అయితే ఈ స్థాయిలో డబ్బు వస్తుందని అనుకోలేదని గిసెల్లీ పేర్కొన్నారు. -
జోరుగా శ్రీవారి డాలర్ల విక్రయాలు
సాక్షి, తిరుమల: అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ. 30 లక్షల విలువచేసే డాలర్ల అమ్మకాలు జరిగాయి. రూ. 26,020 విలువచేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ. 13,225ల విలవచేసే 5 గ్రాముల బంగారు డాలర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ. 5,485ల ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేవు. రూ. 850ల విలువచేసే 10 గ్రాముల వెండి డాలర్లు, రూ. 475ల విలువైన 5 గ్రాముల వెండి డాలర్లూ అమ్ముడుపోయాయి. రూ. 275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్లు స్టాకు లేవు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వస్తే తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో తీసుకురావడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం చేశారని భక్తులు ధ్వజమెత్తారు. అలాగే, డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు సమాచారం.