
ముంబై: కొత్త ఏడాదిలో రూపాయి శుభారంభం చేసింది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు లాభపడి 71.22 వద్ద ముగిసింది. స్థూల ఆర్ధిక గణాంకాలు మెరుగ్గా ఉండటం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల అం చనాలు వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు దోహదపడ్డాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.