![Gold Prices Still Continued Stanley in International Market - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/19/gold.jpg.webp?itok=Dh9h8VaQ)
బంగారం అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పటిష్ట ధోరణినే కనబరుస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత, దీనికితోడు భౌగోళిక ఉద్రిక్తతలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ పసిడి నిల్వలను పెంచుకోవడం వంటి అంశాలు యెల్లో మెటల్‌కు ఊతం ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని తక్షణ సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నారు.
దేశీయంగానూ పరుగే...
దేశీయంగా చూస్తే, పసిడి పూర్తి బుల్లిష్ ధోరణిలో కనిపిస్తోంది. ఒకపక్క అంతర్జాతీయ పటిష్ట ధోరణితో పాటు, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల పతనం, విదేశీ నిధులు వెనక్కు మరలడం, డాలర్ మారకంలో రూపాయి బలహీనపడటం వంటి అంశాలు దేశీయంగా పసిడి ధరలకు ఊతం ఇస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో రూపాయి 74కుపైగా బలహీనపడింది. క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో రూపాయి 68 స్థాయికి తిరిగి బలోపేతమైనా ఆ స్థాయికన్నా ఎక్కువకు బలోపేతం కాలేకపోయింది. ప్రస్తుతం 70–72 శ్రేణిలో తిరుగుతోంది. మున్ముందూ రూపాయి బలహీనధోరణే ఉన్నందున దేశీయంగా పసిడిది పటిష్ట స్థాయేనని నిపుణుల అభిప్రాయం.
ప్రస్తుత ధరల శ్రేణి..
అంతర్జాతీయంగా నైమెక్స్‌లో పసిడి ఔ¯Œ ్స (31.1గ్రా) ధర శుక్రవారంతో ముగిసిన వారంలో వారంవారీగా దాదాపు 20 డాలర్ల లాభంతో 1,523 డాలర్ల స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి. 1,360, 1,450, 1,500 డాలర్ల స్థాయిలో పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో 10 గ్రాములకు రూ.37,938 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment