రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..? | These Are The Reasons Behind Why Indian Rupee Falling Against The US Dollar - Sakshi
Sakshi News home page

Why Rupee Is Falling: రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?

Published Mon, Oct 16 2023 11:26 AM | Last Updated on Mon, Oct 16 2023 12:17 PM

These Are The Reasons For The Fall Of The Rupee - Sakshi

రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో  దేశీయంగా ఉన్న డాలర్‌ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. 

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్‌బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్‌ ముడిచమురు ధర 91 యూఎస్‌ డాలర్లకు చేరింది.

ప్రభావం ఇలా..

రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే  ఆర్‌బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.

ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!

కారణాలివే..

1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్‌ అధికం. భారత ‘కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.

2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 

3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.

4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇజ్రాయెల్‌ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement